Friday, 29 July 2016

సుకవికి కుకవికి కల తేడా

సుకవికి కుకవికి   కల తేడా

ఈ సంస్కృత చాటువులో కవి ఎలా వివరించాడో గమనించండి.

సమలం కరోతి కావ్యం సుకవిః  కుకవిశ్చ తదుభయం కావ్యం
అనలం తనోతి చిత్తే సహృదయ హృదయ ప్రవిష్ట మాత్రంచేత్

సుకవి :

కావ్యం సమలం కరోతి = సం+అలంకరోతి
అంటే సుకవి రసవర్ణనాలంకారాలతో కావ్యాన్ని మెరుగు పెడతాడు.

చిత్తే అనలం తనోతి = న+అలం= ఇక చాలు అనకుండా వుండే భావాన్ని మనసులో కలిగి యుంటాడు

కుకవి :

కావ్యం సమలం కరోతి = కావ్యాన్ని మలమయం చేస్తాడు

చిత్తే అనలం తనోతి =  మనసులో మంటలు (అనలం) పుట్టిస్తాడు

No comments:

Post a Comment