ప్రయాగను 'ప్రయాగ' అని పిలిచే విధముగా ప్రభుత్వము ఎందుకు శాసనము చేయకూడదు?
కాశీ, గయ, ప్రయాగ అన్నవి మన ధర్మమునకు పట్టుగొమ్మలు కదా!
ప్రయాగ పురాణ ప్రసిద్ధము. ఇది కాక పంచ ప్రయాగలున్నాయి హిమాలయాలో. అది వేరే విషయము. ప్రయాగ అంటే నదీ సంగమ ప్రదేశం అని అర్ధం ఉంది. వాస్తవంగా ఈ ప్రయాగను త్రివేణి సంగమం అని కూడా అంటారు. పనిత్ర గంగా, యమున మరియు సరస్వతీ నదుల సంగమ ప్రదేశమే ప్రయాగ. హిందూ పురాణాలలో అతిపురాతనమైనది పవిత్ర నగరమైనది అయిన ప్రయాగకు ప్రాముఖ్యం అధికం. ప్రయాగలో పలు ఆలయాలు మరియు పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి. అసలు పితృ తర్పణములకు ఇది అత్యంత ప్రశస్తమైన స్థలము. ఇది ఉత్తరప్రదేశ్ దక్షిణ ప్రాంతంలో ఉన్నది. దీని ఉత్తర దిశలో ప్రతాప్ ఘర్, తూర్పు దిశలో బధోహి, దక్షిణ దిశలో రేవా మరియు పడమర దిశలో కౌశంబి వున్నాయి. ప్రస్తుత నగర వైశాల్యం మొత్తం 63.07 చదరపు కిలోమీటర్లు. హస్తినాపుర రాజైన కౌసుంబి స్థాపించినాడు ఈ నగరాన్ని. కౌసుంబి ఈ నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలన సాగించినాడు. ప్రయాగ తరచుగా డోయబ్ ప్రాంతం సంస్కృతికి , రాజకీయ, రాజ్య రాజధానిగా వుంటూ వచ్చింది. మొదట కౌసుంబి గానూ తరువాత ప్రతిష్ఠాన పురం అని పిలువబడుతూ వచ్చింది. ఆ తరువాత ముఘల్ చక్రవర్తి అయిన అక్బర్ ఈ నగరానికి అలహాబాదు అని నామకరణం చేసి, తరువాత దీనిని తన రాజ్యంలో ప్రధాన రాజకీయ కేంద్రం చేసినాడు. ఆ మహనీయునికి మన ధర్మముపై మక్కువ ఎక్కువ అని కదా కుహనా చరిత్రకారులు వ్రాసినారు మరి ఈ మార్పు ఆయన ఎందుకు చేసినట్లు?
దీని పురాతన నామమును మనమెందుకు పునరుద్ధరించనట్లు?
మూలనామము వున్నపుడు ఈ బాదుళ్ళెందుకు?
No comments:
Post a Comment