Sunday, 31 July 2016

కలువ నీవు -- కలువనీవు

కలువ నీవు -- కలువనీవు

నాదు కలల కాసారము లో నెమో కలువ నీవు
కనుల ఎదుట కనిపించీ నన్నేమో కలువనీవు

ముద్దుముద్దు పలుకులతో మురిపించే చిలుక నీవు
మోము పైన దరహాసము నను జూచిన చిలుకనీవు

నా ఊహల వయ్యారికి చంద్రవంక నగ నీవు
నీవే ఆ వయ్యరివి అందామన  కనగనీవు

పూల తావి, పిల్లగ్రోవి రవళిని కల గాలి నీవు
నీదు ప్రేమ తీరానికి ననుగొనిపో కలగాలి నీవు

నీ కొరకై వేచినాను చేసి హృదిని నాక వనము
నీకే అంకితమైనది కలకాలము నా కవనము

హృది హ్రదమందందముగా విరిసిన చెంగలువ నీవు
 'మోహనా' అని యంటూ రావా నను కలువ నీవు

Friday, 29 July 2016

తేనెటీగ मधुकर HONEY BEE

తేనెటీగ
मधुकर
HONEY BEE

తీయనైన తేనియకై తిరిగి తిరిగి వనమంతా
ఎన్నెన్నో పూవులపై ఎగిరివాలు భ్రమరం
గురువులకై తిరిగి వెదికి కూర్చుకొనుచు గుణమంతా
కొంచెమనక పెచ్చుయనక కూడబెట్టి యావివరం
అందిన మధువును మధుపం అందరికీ పంచినట్టు
అందుకొన్న జ్ఞానామృత మందరికీ పంచిపెట్టు

कितने गुलशन कितने वन
कितने फूल और कितने चमन
फिरता मधूकर शहद जुटाने
उसी तरह तुम गली शहर
दुर्गम जंगल दूर पहाड़
खोजो ढूंढो सद्गुरुओंको
सविनय उनसे ज्ञान को पालो
जग में बांटके जश्न मनालो

See the honey bee who flies on
All flowers that are wanted
With incense or with no sense
To grab the nectar and pass on
To one and all who are in need
Likewise go grab Oh! young man
All the knowledge, give who heed


శ్రీయంత్రం మిస్టరీ!!

శ్రీయంత్రం మిస్టరీ!!

~ USA లోని Oregon ప్రాంతం లో ఎండిపోయిన ఒక చెరువు ఉండే ప్రాంతం లో కనుగొన బడిన శ్రీయంత్రం ఇది.

~ సుమారు 13 మైళ్ళ పొడవు,వెడల్పు ఉన్న శ్రీ యంత్రాన్ని August 10, 1990 న గుర్తించారు. 

~ దీనిని భూమికి 9000 అడుగుల ఎత్తు నుంచి ఫోటో తీసారు. ఒక్కో గీత 10 అంగుళాలు వెడల్పు, మూడు అంగుళాలు లోతు ఉంది.

~ ఒక శ్రీ యంత్రాన్ని కాగితం పై గీయాలంటేనే ఎన్నో పరికరాలు అవసరం. చాలా సమయం తో కూడుకున్న పని. అటువంటిది 13 


మైళ్ళ పొడవున్న శ్రీ యంత్రం మట్టిలో చక్కగా చిన్న తప్పు కూడా లేకుండా గీయడం మానవ మాత్రులకు అసాధ్యం అని తేల్చి 

చెప్పేశారు.~ మరి దీన్ని ఎవరు గీసి ఉంటారు?

~ మరి దీన్ని ఎవరు గీసి ఉంటారు?

శ్రీయంత్రం  మిస్టరీ!!

~ USA లోని Oregon ప్రాంతం లో ఎండిపోయిన ఒక చెరువు ఉండే ప్రాంతం లో కనుగొన బడిన శ్రీయంత్రం ఇది.

~ సుమారు 13 మైళ్ళ పొడవు,వెడల్పు ఉన్న శ్రీ యంత్రాన్ని August 10, 1990 న గుర్తించారు. 

~ దీనిని భూమికి 9000 అడుగుల ఎత్తు నుంచి ఫోటో తీసారు. ఒక్కో గీత 10 అంగుళాలు వెడల్పు, మూడు అంగుళాలు లోతు ఉంది.

~ ఒక శ్రీ యంత్రాన్ని కాగితం పై గీయాలంటేనే ఎన్నో పరికరాలు అవసరం. చాలా సమయం తో కూడుకున్న పని. అటువంటిది 13 మైళ్ళ పొడవున్న శ్రీ యంత్రం మట్టిలో చక్కగా చిన్న తప్పు కూడా లేకుండా గీయడం మానవ మాత్రులకు అసాధ్యం అని తేల్చి చెప్పేశారు.

~ మరి దీన్ని ఎవరు గీసి ఉంటారు?

భార్యని భర్త కష్టపెడితే


కపిత్థస్యఫలంచైవయథా కుంజర భక్షితంl

తస్య సారంచ ఘృణ్ణీయాత్ తాతా హవిరసం ప్రభోll

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః
యత్రైతాస్తు అపూజ్యంతే తత్రైతా స్తఫలాక్రియాః
ఇది మనుస్మృతి లోని శ్లోకము.దీనివల్ల మాకు ఏమి అర్థమౌతుంది . స్త్రీలను మనము ఎంతగా గౌరవిస్తామన్న విషయము అర్థముకావటములేదా ! మరి మనము ఎందుకు స్త్రీలపై చిన్న చూపు చూస్తున్నామని నలుగురిచేత అభిశంసింప బడుతున్నాము. విష్ణుభక్తి పరాయణుడే కావచ్చు కానీ దైత్యుడై కూడా ప్రహ్లాదుడు తన దృష్టికి ఆడవాళ్ళు అడ్డుపడితే వారలను మాత్రు భావముతోచూసి దృష్టి ప్రక్కకు మరల్చేవాడని తెలుగుభాగవతమున 
పోతన గారు శెలవిస్తారు. అదే స్త్రీలను నీచ దృష్టితో చూసిన రావణ దుర్యోధనుల గతి ఏమైనదో ఒకసారి మనము పరికిస్తే అర్థమౌతుంది. నేడిది గతమైనది. కొందఱు యువకులకు అసంగత  మైనది.  వారి దృష్టిలో స్త్రీ
ఆటబొమ్మ. చాటింగులతో తో చీటింగులకు,మీటింగులనుండి డేటింగులకుసెల్లు మాటలనే సొల్లు మాటలకు ఒక అడుగు ఇంకా ముందుకు పోయి 'LOVE JIHAD' లకు ఎరలను జేసి యువత విచ్చలవిడిగా సంచరిస్తూ,లేత 
వయస్సు లోనే బాలికలను విషయవాంఛలకు లోబడ జేసి మొగ్గ గా చిదిమేస్తున్నారు, మొక్కగా తుంచేస్తున్నారు. మరి లొంగకుంటే   స్త్రీలపై యాసిడ్ దాడులు, గొంతులు కోయడాలు, మానభంగాలు ఇలాఎన్నోదురాగాతాలు సమాజంలో జరగడానికి కారణం క్రమశిక్షణా లోపమే. ఎంత చదువు చదివినా,ఎంత విజ్ఞానం సంపాదించినా, అరణ్యరోదనన్యాయంలా”పనికి రాకుండా పోతోంది. అసమానతలు తొలగి, ఆభిజాత్యాలు మరచి, అందరు సుఖశాంతులతో జీవించాలన్నా, సమతా,మమతా, మానవతలు సమాజంలోవెల్లివిరియాలన్నా- ఒక్కటే మార్గం.అది మన సంప్రదాయాలని పాటిస్తూ, పెద్దలుచేప్పిన మార్గంలో పయనించడమే. ఈ మాటలు కేవలము పురుషులకే కాదు స్త్రీలకు కూడా! ఈ నాడు వేషధారణలో కానీ, భారతీయ సంస్కార ఆచరణలోగానీ ఆవగింజంత గౌరవములేకుండా విశృంఖలముగా ప్రవర్తించుచున్నారు. ఇది తమకు, తమ కుటుంబానికి, తమ బంధు వర్గానికి, తమ ధర్మానికీ, తమ దేశానికి ముప్పు వాటిల్లునని ఊహించక తప్పుచేయుచున్నారు. 
ప్రతి ఇంట్లో దేవుడు అమ్మరూపంలో ఉన్నాడు కనుకనే మాతృదేవోభవ అని వేదాలు బోధించినాయిఅలాగే  మనుస్మృతిలో స్త్రీలను గూర్చి ఈవిధముగా చెప్పబడింది. 
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాఃl
యత్రైతాస్తు అపూజ్యంతే తత్రైతాస్తఫలాక్రియాఃll
ఎక్కడ స్త్రీలు పూజింప బడుతారో,అక్కడ దేవతలు నివసిస్తారనిఎక్కడ పూజింపబడరో అక్కడ కార్యములన్నీ 
నిష్ఫలములనితెల్పి'స్త్రియః శ్రియశ్చ గేహేషు నవిశేషోస్తి కశ్చన' స్త్రీలు గృహంలో గృహలక్ష్ములేఇంతకు మించిన  విశేషషణము లేదని స్త్రీని కీర్తించుతాడుఅందుకనే వివాహ సమయంలో కన్యాదాత 'కన్యాం కనక సంపన్నాం' అని  “లక్ష్మీ నామ్నీం కన్యాం లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయదదాతి' అనిచెప్పి కన్యాదానం చేస్తారుతమ ఇంటబుట్టిన ఆడపిల్లని తండ్రి,సోదరుల బాగాచూసుకోవాలని,అమ్మాయికి కావలసినవి సమకూర్చ వలెనని మనువు ఎంతో విపులంగా వివరిస్తాడు.
              పితృభిభ్రాత్రుభిశ్చైతాః పతిభిర్దేవరైస్తథా: l
              పూజ్యా భూషయితవ్యాశ్చ  బహు కళ్యాణమీప్సుభి:ll  
అనగా తండ్రిసోదరులు, భర్త, మరదులు అందరు స్త్రీలని  గౌరవించాలనివారుకోరిన భూషణవస్త్రాదులనిచ్చి సంతృప్తి పరచాలని చక్కగా వివరిస్తాడుస్త్రీకి పురుషుడు సదా  అండగాఉండాలని మనుధర్మ శాస్త్రం బోధిస్తుందిఇదే అర్థంలో
పితారక్షతి కౌమారేభర్తారక్షతి యౌవ్వనే / 
రక్షంతిస్తావిరే పుత్రా: / నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి
చిన్నతనంలో తండ్రియౌవ్వనంలో భర్తవార్ధక్యంలో పిల్లలు రక్షణ కల్పించాలిఅనిరక్షణ లేకుండా ఉంచకూడదని మనువు స్త్రీలకి అధిక ప్రాధాన్యతనిస్తేమనువునిప్రాచీన సంప్రదాయాలని ఇష్టపడని ఆధునిక వితండవాదులు కొందరు పైశ్లోకం మొత్తం గ్రహించకుండా చివరి పాదం 'నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి' అన్నది మాత్రంగ్రహించి,  మనువు స్త్రీలకి వ్యతిరేకిస్త్రీలకి స్వేఛ్చ లేదన్నాడని వాదిస్తారుఅట్టి వారికి ఎంత నచ్చ చెప్పినా మహాబధిరశంఖారావ న్యాయంలా వినరుతమ ప్రవర్తన మార్చుకోరుఅస్తువారిని అలాగే వదిలేద్దాం.
వినేవారికే మనం కొన్ని మంచిమాటలు చెప్దాంబాల్యంనుండే మంచిఅలవాట్లుసత్ సంప్రదాయాలు నేర్పిస్తే,భావితరాలైనా బాగుపడతాయి.  స్త్రీలను గూర్చి మనువు ఇంకాఈవిధముగా చెబుతాడు.
  శోచంతి జామయోయత్రl వినశ్వత్యాశు తత్కులంl
    నశోచంతితు యత్రైతాlవర్ధతే తద్ధిసర్వదాll 
అనగా ఆడపడుచులు ఏయింట సోదరులచే ఆదరించ బడతారో ఆయింట వంశం వర్ధిల్లుతుందిలేదా నశిస్తుంది
అని తెలిపి ఇంకా ఈ విధముగా చెబుతాడు.
  తస్మానేతాన్సదా పూజ్యాఃభూషణాచ్చాదనాశనైl
    భూతికామైర్నరైర్నిత్యంసత్కారేషూత్సవేషుచll
తమ ఇంట పండుగలు శుభకార్యాలు జరుపుకోనేటప్పుడుఆడపడుచులను పిలచి మంచి భోజనం పెట్టివస్త్రాలు,భూషణాదులనిచ్చి సంతృప్తి  పరచాలని చాలా విపులంగా, చక్కగా మనుస్మృతి వివరిస్తుందికనుకనే పండగ రోజులలోకూతుళ్ళని, అల్లుళ్ళని పిలచిఉన్నంతలో వారికి కట్నకానుకలిచ్చి సంతృప్తి పరచే సంప్రదాయం మనం పాటిస్తున్నాం.ఇలా శృతి,స్మృతి,పురాణాలలో, వేదాలలో, ఉపనిషత్తులలో  స్త్రీకి ఎంతో ఉన్నత స్థానంకల్పించ బడింది. 
ఇక భార్యాభర్తల సంబంధంగూర్చి ఎంతగోప్పగా చెప్పారో చూడండి.—వివాహ సమయంలో సప్తపది అనే తంతులో చదివేమంత్రాలలో ఒకమంత్రం ఇలా తెలపుతుంది.
 సఖా సప్త పదాభవసఖావౌ సప్త పదా బభూవః,
  సఖ్యంతే గమేయంసఖాత్తేమాయోషంసఖ్యాన్మేమాయోష్టా:l 
 అనగా  ఏడడుగుల బంధంతో భార్య,భర్తలమైన మనం ఇకపై స్నేహితులగా ఉంటూపరస్పరం స్నేహ భావాన్ని విడవకుండా పయనిద్దాంఎంత ఉదాత్తమైనభావనఆపత్సు మిత్రం జానీమః కష్టాలలో ఆదుకొను వాడేమిత్రుడుఅట్టిమిత్రభావముతో భార్యాభర్తలు ఉంటేవారిమధ్య కలతలుకార్పణ్యాలు
ఆవేశకావేశములు, అసమానతలకుతావు లేకుండా నిత్య వసంతములా వారి జీవితం సాగిపోతుంది.
ఇంకా
సంతుష్టో భార్యయాభర్తాభర్తా,భార్యా తధైవచl
     యస్మిన్నేవ కులేనిత్యంకళ్యాణం తత్రవై ధృవంll
 అనగా
భార్యా,భర్తలు పరస్పరం ఒకరిని,ఒకరు గౌరవిచుకొంటూ,ప్రేమానురాగాలత సంతుష్టులుగా ఉంటారో ఆయిల్లునిత్యకల్యాణంపచ్చతోరణంగా విలసిల్లుతుంది అని చెబుతూనే 
                               యదిహ స్త్రీనరోచేతపుమాంసంన ప్రమోదాయేత్l
                                 అప్రమోదాత్ పునః పుంసఃప్రజనం నప్రవర్తతేll
 భార్యను భర్త కష్టపెడితేఆభార్య భర్తకు సహకరించదుఅపుడు  ఇంట వశం వర్థిల్లదుఅని వివరించి,
                                     అనుకూల కళత్రోయఃతస్య స్వర్గ యిహైవహిl
                                      ప్రతికూల కళత్రస్యనరకో నాత్ర సంశయఃll

                                  స్త్రియాంతు రోచమానాయాంసర్వం రోచతేకులంl
                                     స్త్రియామరోచమానాయాంసర్వమేవ నరోచతేll
భార్యలు అనుకూలంగా ఉండిసంతోషంగా ఉంటే  గృహం స్వర్గమేలేకుంటే నరకమేఇలా ఎన్నోవిధాలుగా వేలవేలసంవత్సరాలకు పూర్వమే స్త్రీలకి అధిక ప్రాధాన్యత ఇవ్వబడిందిఅని మన ప్రాచీనసాహిత్యం తెలుపుతోంది
మరి కాలంలో స్త్రీలు అన్నిరంగాలలో ముందుకు దూసుకు వెళ్తున్నారని గొప్పగా చెప్పుకొంటున్నాము 
ఆధునికులు కొందరు పిల్లలకు స్వేచ్చనిస్తే, దానిని బ్రహ్మకైనపుట్టురిమ్మతెగులు అన్నభావన కలిగించే విపరీతవస్త్రధారణపాశ్చాత్యనాగరికతకు వర్తిస్తుందేమో కాని భారతీయ సంప్రదాయానికివర్తించదుసెల్ ఫోనుసంబాషణచదువు పేరుతో ఇంటికి ఆలస్యంగా వస్తూబైకులపై షికారులు చేస్తూ  కాలాన్నిదుర్వినియోగ పరుస్తూ,పతనమే పరమావధిగా యువతను  మనము చూస్తున్నాము. ఇది ఆడపిల్లల్లో ఏర్పడిన వ్యసనముగా మనము తలువవచ్చు.  విధానంలో ఆడపిల్లలే కదా ఎక్కువగా నష్టబోతున్నారువిసుగు,కోపంఅలజడిమానసిక అశాంతిఅసంతృప్తిభార్యా,భార్తలమధ్య అవగాహనారాహిత్యంపిల్లల్ని సరిగాపట్టించుకోనందున అధిక 
స్వేఛ్చ వంటి అవగుణాలు సమాజంలో పెరుగుతూ,సంబంధబాంధవ్యాలను తెంచుతూవైదిక జీవన విధానాన్ని అతలాకుతలం చేస్తున్నాయికారణం ప్రాచీన సంప్రదాయాలనుపెద్దలమాటలను పట్టించుకోకుండా కొత్త వింత పాత రోత అనుకొనుటయేనని, గమనిన్చినచో అనిపిస్తుంది. 
ఉదయకాల ఉషోదయాలని తిలకిస్తూపచ్చని చెట్లుపక్షుల కిలకిలారావాలువికసించే పుష్పాలువాటిలోని పుప్పొడిపైనుండి వచ్చే చల్లని పిల్లగాలుల సుఖస్పర్శలువెన్నెల రాత్రులలో నదీ సైకత వేదికపై విహారాలుపచ్చని కంబళ్ళు పరచినట్లుండే పర్వత సానువుల సోయగాలు తిలకిస్తూకదిలేమబ్బుల్ని,ఎగిర కొంగలబారుల్నిచూస్తూదేవాలయాల మంగళ వాద్యాలను,ఘంటా నాదాల్ని,గుడిి గోపుర గుహలలోని పావురాయి కువకువలు వింటూ
ఒడ్డును తాకి విరిగిఒరిగే సముద్రకెరటాలనుపసిపాపల నవ్వులనుపతంగాల(గాలిపటాలవిహారాలనురంగు రంగుల సీతాకోక చిలుకలనునీలిమేఘాలలో,గాలికెరటాలలోదోబూచులాడే నిండు పున్నమి చంద్రునిఎలమావి 
చివురులు మెసవి కూసే పీక కూజితాలను, ఇంకా ఎన్నెన్నో ప్రకృతి పరమైన అందాలను ఆనందాలను అనుభవించమని పరమాత్మ మనకిస్తే,  ప్రకృతిని కలుషితంచేస్తూ,మనం ఇంకేదో కావాలనిలేనిదానికోసం,తెలియని దానికోసం పరితపిస్తూ,పరిభ్రమిస్తూ కాలాన్నిమేధస్సును,మన విజ్ఞానాన్ని వృధాపరుస్తూ నిస్సారమయిన బ్రతుకు బ్రతికుచున్నాముఅలాకాకుండా శృతి,స్మృతివేదోపనిషత్తులలో చెప్పిన విషయాలకు సంబంధించిన  
వ్రాతలను చదివి ఆకళింపుజేసుకునిమన సంప్రదాయాలని ఆచరిస్తే జగమంతా నిత్యకల్యాణం పచ్చతోరణంగా విలసిల్లుతుంది అనుటలో సందేహంలేదులేకుంటే నిత్యానందమన్నది గగనకుసుమఅరణ్యరోదన, బధిరశంఖారావఅజాగళ స్తన న్యాయములవలె కనరానిదై, వినరానిదై, జీవితము వ్యర్ధమైపోతుంది
ఇదినిజముఇదేనిజము.