Saturday, 18 June 2016

కాల గణన – ఒక పరిశీలన


కాల గణన – ఒక పరిశీలన
పాశ్చాత్య కాలమానము ప్రకారము ఇపుడు జరుగుతున్నది క్రీస్తు శకము 2021వ సంవత్సరము. ఇప్పుడు దీనిని క్రీస్తు శకమునకు బదులు సామాన్య శకము అని అంటున్నారు. ఎవరికి సామాన్య శకము. ఎవరికిది సామాన్య శకము. ఇది క్రైస్తవ దేశము కాదు , మరి సామాన్య శకము అన్న నవీన నామకరణముతో మనపై రుద్దట ఎందులకు. దానిని మనము ఆచరించవలసిన అగత్యమేమి. అంటే 2021 సంవత్సరములకు పూర్వము  పుట్టిన వారి మాటేమిటి? జూలియస్ సీజరు ‘జూలియన్ కేలెండరు’ ను క్రీస్తు కు పూర్వము 46 వ సంవత్సరములో రూపొందించినాడు. దానిని అనుసరించియే నేటి గ్రెగోరియన్ కేలెండరు వ్యాప్తి లోనికి వచ్చినది. ఒక వేళ సీజరు భూమి మీదికి వచ్చి రోము లోని పోపు తో కలిసినారు అని అనుకొందాము. తానున్న కాలములో ‘క్రీస్తు’ లేడు ‘క్రీస్తు శకము’ లేదు. మరి ఏమని చెప్పుకుంటాడు. అప్పుడు తనకన్నా పదవిలో తక్కువ వాడైన  ఒక బిషప్పును పిలిచి, పోపు, అతనినడిగితే, అతను సీజరును అడిగి విషయమును తెలుసుకొని, పోపుతో ‘ఈయన క్రీస్తుకు పూర్వము 46 సంవత్సరము నందు ఉండిన వాడు అని తెలుప వలసి వస్తుంది. అదే మన భారత దేశవాసుడైన ఏ 'హరిశ్చంద్రుడో'‘జరాసంధుడో’ పోతే అప్పుడు బిషప్పు పోపుతో ‘ ఈయన చరిత్రకు అందని కాలము నాటి వాడ’ని చెప్పవలసి వస్తుంది. వారికి కాల గణనలో భారతీయులకు ‘యుగము’ అన్న కొలమానము ఉన్నదని తెలియదు కదా! పై పెచ్చు భూమి పుట్టుక  క్రీస్తుకు పూర్వము 4004 అని, 4000,అని 4178 అని పరిపరి విధములుగా తెలిపి యున్నారు పాశ్చాత్య కాలజ్ఞానులు. అంతకు మునుపు, వారి ప్రకారము, ప్రపంచము జీవరాశి ఏమీ లేవు.
Many people have come up with dates for creation, such as James Ussher (4004 BC), Johannes Kepler (3992 BC), Gerhard Hasel (4178 BC), and Isaac Newton (~4000 BC).
మరి వాస్తవమేది. పై పాశ్చాత్య మహానీయులందరూ వేసిన అంచనాలు ఇంచుమించుగా 4000 సంవత్సరముల నుండియే భూమి పుట్టుక అని తెల్పుటచే అంతకు పూర్వము ఉన్న జనజీవనము చీకటి యుగములో చేరి పోయినది.
ఇక ఒక మాట ‘శకము’ ను గూర్చి చెప్పుకొందాము. శకులు మన దేశ సమీపమున గల పర్షియా దేశస్తులు. ఆ దేశమును పాలించిన సైరస్-ii అన్న రాజు ఉత్తర భారతమును కొంత జయించి యుండినాడు. ఆతను ప్రపంచములోని చాలా దేశములను జయించుట చేత తాను యుగ పురుషునిగా భావించి ‘సైరస్’ ‘శకుడు’ కావున ‘సైరస్ శకము’ ప్రారంభించినాడు.
Cyrus continues to take over more lands. In 533 B.C. he invades India. He later dies in battle in 529 B.C. (Google)
శకము అన్న మాటకు వంశము అన్న ఒక అర్థము కూడా వాడుకలో ఉన్నది. ఈతను మన దేశమును చాలా తక్కువ కాలము పాలించినసాడు. ‘భట్టి విక్రమార్క’ విక్రం భేతాళ’ కథల యందలి ప్రమర వంశజుడైన విక్రముడు ఆతని పై యుద్ధము ప్రకటించి ఆతనిని యుద్ధములో చంపినాడు. తరువాత శకము ను అంతరింపజేసి ‘విక్రం సంవత్’ ను ఏర్పాటు చేసినాడు. ఔత్తరాహికులు నేటికీ దీనిని పాటించుతారు. అంతటి గొప్ప వీరుని మనము చరిత్రలో చదివే అదృష్టమే పోగొట్టుకున్నాము. ఆయన క్రీస్తుకు పూర్వము ఇచుమించుగా 50 సంవత్సరముల నుండి క్రీస్తు తరువాత 50 సంవత్సరములవరకు రాజ్యమేలినాడు. నిజమునకు గుప్త వంశము మనదేశామును ఆయన తరువాత ఏలినది. చాలామంది రాజులు ‘పైన తెలిపిన విక్రమార్కుని తరువాత రాజ్యాధిపతులై ఆ మహావీరుని పేరును తమ బిరుదుగా’ పేరుకు చివర తగిలించుకొన్నారు.  
నేటి తలిదండ్రులు ఉద్యమించితే గాని నేటి బాలలు మన దేశపు నిజ చరిత్ర చదువలేరు. కానీ నేటి తల్లిదండ్రులకు సంపాదన తప్ప వేరు జిజ్ఞాస లేదు. వాస్తవ భారతీయ చరిత్రను ముఖ్యముగా తెలుగులో చదివి, అసలైన వాస్తవాలను సాధికారముగా, తెలుసుకొనవలెనంటే విశ్వనాధ, జటావల్లభుల వంటి నాటి ఎందరో శ్రేష్ఠతముల చేత నిరుపమాన మాన్యతను పొందిన బ్ర.శ్రీ. కోట వెంకటాచలము గారి పలు రచనలు చదివి, పిల్లలచే పాఠ్యాంశములుగా చదివించి తీర వలసినదే!
ఇదే విధముగా ఆంధ్రుల అపురూప చక్రవర్తి ‘శాలివాహనుడు’ ఎన్నో విజయాలను సాధించి ‘శాలివాహన శకము’ను స్థాపించినాడు. బహుశ అప్పటికి ‘ శకము’ అన్న పదము ‘నిరంతర కాలమునకు ప్రత్యామ్నాయమై యుండినదేమో!
ఇక మన కాల గణనా విధానములో, గ్రెగోరియన్ కాలెండరును అనుసరించి 3012 ఫెబ్రవరి 18 న ౦౦ గంటలకు కలియుగము మొదలైనది . కృష్ణుని జీవిత కాలము 120 వత్సరములుగా నిర్ణయింప బడినది. పాండవుల రాజసూయము ఆయన 70 ఏట చేయబడినది. అంటే దరిదాపుగా జరాసంధుడు భీమునిచే 3052 లో హతమార్చ బడినాడు. అంటే పాశ్చాత్యుల కేలెండరు ప్రకారము వారి దేవుని చేత వారు సృష్టింపబడనే లేదన్నమాట. ( వారి సృష్టి కాలము 40౦౦ అనుకొంటే క్రీ.పూ. 20౦౦ + క్రీ.శ. 20౦౦ =4000). ఇక వారేమి చెప్పగలరు?
వారికి మన యుగ, మహాయుగ, మన్వంతర, కల్పములనెడు కాల ప్రమాణములను గూర్చి వారికి తెలియదు. 1000 మహాయుగములు ఒక కల్పము. ఈ విషమును గూర్చి వివరముగా నేను కాలగణన అన్న అంశమును గూర్చి గతములో వ్రాసినపుడు వివరించినాను. కలియుగము, తన కాలమునకు 3068 సంవత్సరములకు పూర్వము ప్రారంభమైనట్లు ‘జ్యోతిర్విదాభరణము’ అన్న గ్రంథమును విక్రమాదిత్యుని ఆస్థాన కవి పండితుడును అశేష శేముషీ సంపన్నుడును, అప్రతిహత ప్రతిభాశాలి యైన కాళీదాసు, వ్రాసినట్లు తెలియబరుపబడి ఉన్నది.
కాలము అన్నది చక్రము . మరి వృత్తమునకు ఆది తుది ఉండదు గదా! వారి కాల గమనము, కాల గణన ఒక మతప్రవక్త పుట్టియుండవచ్చును అన్న ఊహను బిందువు గా తీసుకొని ఏర్పాటు చేయబడినది. ముస్లీములకు ముహర్రం కొత్త సంవత్సరపు మొదటి నెల అవుతుంది. ముహర్రం అంటే నిషేధింపబడిన(forbidden) అని చదువుకొనే రోజులలో విన్నాను. మొహర్రం 1వ తేదీ నుండి 10 వరకు ఇది జరిపేవారు. ఈ రోజులలో జరిగిన 'కర్బల' యుద్ధములో ఎందఱో అలీ అనుచరులు మరియు అతని సంతానము వీరమరణము చెందినారు. సున్నీలు, షియాలయిన వీరి నుండి వివడిన తరువాత ఈ పండుగకు ప్రాధాన్యత తగ్గినది. మనము దీనిని 'పీర్ల పండగ' అని పిలుస్తాము. 'పీర్' అంటే మహాత్ముడు అని అన్వయించుకొనవచ్చును.
మనది అట్లు కాదు. మనవి ప్రవక్తలతో ముడిపడిన నూతన సంవత్సరములు కావు. అవి కేవలము కాల చక్రము ఒక భ్రమణము పూర్తి అయినవెంటనే తిరిగీ కృత లేక సత్య యుగముతో కాలము ప్రారంభమగుచున్నది. వారి మూలపురుషులు తాము తిరిగీ పుట్టబోయేట్లు చెప్పియుండ లేదు. కావున వారి కాలగణనా ప్రమాణమును సరళ రేఖగా తీసుకొనవలసి వస్తుంది. వారి పరిమితమైన అవగాహన వారితోనే ఉండనివ్వండి. అంటే క్రీస్తు శకముగానే ఉండనివ్వండి లేక ముహర్రం గానే ఉండనివ్వండి. క్రీస్తు శకమును  సామాన్య శకమును జేసి మనము అక్కున చేర్చుకో నవసరము లేదు. వారి కొరకు వ్రాయ వలసి వస్తే మీ క్రీస్తు శకము అని బ్రాకెట్లో వ్రాయ వచ్చు.
అసలు వారి కాల విశ్లేషణ లో యుగాలను ఈ విధముగా విభజించినారు.
1.రాత్రి యుగము (చీకటి యుగము Pre-historic age) , రాతి యుగము , కోతి యుగము 4. కొలిమి యుగం (లోహపు యుగము) ఏమాత్రము అర్థవంతమయినవో మీరే అర్థము చేసుకొందురు గాక!
ఒక్క విషయము చెప్పి ముగిస్తాను. ఈ అనంత విశ్వములో ఏ విధముగానైతే సూర్యుని చుట్టూ తిరిగే గ్రహ మండలములో మనమున్నామో అదే విధముగా మన చుట్టూ వుండే ఇటువంటి అసంఖ్యాక గ్రహమండలములన్నీ ఇంకొక మూల వస్తువు చుట్టూ తిరుగుతూ వున్నాయి. అంటే మనము స్థిరుడు అని చెప్పుకొనే సూర్యుడు కూడా అంతో ఇంతో ఎంతో కొంత చలనము కలిగి యున్నాడు. విశ్వాంతరాళములో ఉండే అట్టి సూర్యులు అందరూ ఆ జ్యోతిరాదిత్యుని చుట్టూ తిరుగుచున్నారు. ఆయనే పరమాత్మ. 'ఆదిత్యో జ్యోతిరాదిత్యః' అని మనము విశ్నుసహస్రనామములో ఒక నామముగా చదువుతాము. ఆయనకు త్రికరణ శుద్ధిగా సాష్టాంగ దండప్రణామముల నాచారించి ఈ వ్యాసమును ఇక్కడ నిలిపి మన భారతీయ కాలగణన ఏవిధముగా జరిగింది అన్న అంశమునకు తెర తెరుస్తాను.
స్వస్తి.

1 comment: