శివలింగ తత్వము
https://cherukurammohan.blogspot.com/2013/09/shiva-lingam-concept-there-are-various.html
సాధారణంగా శివ లింగము అన్న మాటకు ఎన్నోవిధములైన వివరణలున్నాయి.శివుణ్ణి కూడా ఆంగ్ల భాషోచ్ఛారణ కనుగుణంగా 'షివ' అని పలికే వాళ్ళను నేను చాలామందిని చూసినాను. అంత భాషా దాస్యము అవసరమా అన్నది నా ఆలోచన. ఆప్రకారముగా పలుకుట దోషము. ఉచ్ఛారణ లోపము విలోమ ఫలితము కలిగించుతుంది. 'శివ' అని మాత్రమే పలుకవలెను. మనుస్మృతి ప్రకారము 'లింగం' అన్న శబ్దానికి 16 అర్థాలు వున్నాయని విన్నాను. ఇపుడు మనకు అవసరమైన అర్థమును మాత్రమే ఈ క్రింద పొందు పరుచుచున్నాను.
'లిమః గమయతీతి లింగం' అని నిరుక్త నిర్వచనము. లిం అంటే చేతనము. అంటే ఈ చేతనమే ప్రకృతి. ఇది లయము నుండి ఉద్భవించి ముందునకు సాగేది. లయముతో పెనవేసుకొని వుండేది.
ఇంకొక అర్థమేమిటంటే 'లిం గమయితీతి లింగం.' లయ కారకమైనది లింగం. లయము వైపుకు సాగి లీనమై పోయేది .
ఈ రెండు వివరణలవల్ల మనకు ఏమర్థమౌతుందంటే సృష్ఠి స్థితి లయ కారకమౌతూకూడా తాను దానికి అతీతముగా వుండేది అని. ఇది పునరావృతము ఔతూనే వుంటుంది. పుట్టిన ప్రతి వస్తువు గిట్టక మానదు. దాని స్థితి సమయములో, ఒక దానితో ఇంకొకటి పోలిస్తే, తేడా ఉండవచ్చును. ఇదే ప్రకృతి. ప్రకృతి పురుష తత్వమే అర్ధనారీశ్వర తత్వము, అదే సాంబశివతత్వము. (స+అంబ+శివ ).
స్వస్తి.
సాధారణంగా శివ లింగము అన్న మాటకు ఎన్నోవిధములైన వివరణలున్నాయి.శివుణ్ణి కూడా ఆంగ్ల భాషోచ్ఛారణ కనుగుణంగా 'షివ' అని పలికే వాళ్ళను నేను చాలామందిని చూసినాను. అంత భాషా దాస్యము అవసరమా అన్నది నా ఆలోచన. ఆప్రకారముగా పలుకుట దోషము. ఉచ్ఛారణ లోపము విలోమ ఫలితము కలిగించుతుంది. 'శివ' అని మాత్రమే పలుకవలెను. మనుస్మృతి ప్రకారము 'లింగం' అన్న శబ్దానికి 16 అర్థాలు వున్నాయని విన్నాను. ఇపుడు మనకు అవసరమైన అర్థమును మాత్రమే ఈ క్రింద పొందు పరుచుచున్నాను.
Very neat presentation and good information provided by you sir. Thanks
ReplyDelete