Friday, 24 September 2021

చిత్తశుద్ధి లేకుంటే చేజారును సంతానము

 

చిత్తశుద్ధి లేకుంటే చేజారును సంతానము

https://cherukurammohan.blogspot.com/2021/09/blog-post_24.html

పెంపకమందున లక్ష్యము

ఇంపుగ జూపించకున్న ఇలకే బరువై

తంపుగ కొంపకు తెచ్చును

జంపౌ బహు చెడ్డపేరు సత్యము రామా!

ఒకపరి ఇటు గమనిచండి.

తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకమునకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుంటే కలిగే, దిగువన తెలిపిన అనర్థాలపై దృష్టి సారించండి.

1.       సాంఘీక సహజీవన నిపుణత, 2. సాటి సమాజ సభ్యులనుండి అపన్మకమును 

   కూడగట్టుకొనుట, 3. విషయావగాహనలో అనిశ్చలత, 4. నిర్లక్ష్య భావన, 5. వితండ 

   వాదము, 6. హఠము, 7. క్రమశిక్షణా రాహిత్యము, 8. ఆశాస్త్రీయ ప్రవర్తన, 9. 

    నిస్సాంగత్యము అనగా ఒంటరితనము 10. నిరాశావాదము, 11. నిర్వీర్యత్వము, 12. నిగూఢత్వము అనగా తన అభిప్రాయములను బహిర్గతము జేయ ధైర్యము లేకపోవుట, 13. తాను ఏమి తలపెట్టినా ఓటమిపాలు కావలసినదేనన్న భయము.  

 విశ్లేషించి చూచేవారికి విషయము అవగతము కాగలదు. నిజానికి పిల్లలు 

ముఖ్యముగా 5 సంవత్సరములలోపు వారు, మనము నేర్పించేదానికన్నా ఎక్కువ 

తల్లిదండ్రులమగు మనల చూసి నేర్చుకొంటారు.

మనకందరకూ తెలిసిన ఈ భగవద్గీత శ్లోకాన్ని మీ కందరకూ గుర్తు చేస్తున్నాను.

యద్యదాచరతి శ్రేష్ఠః తత్త దేవేతరో జనః ।

స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ।। 3 - 21 ।।

పెద్దలు చేసిన పనులను సామాన్య జనులు అనుకరిస్తారు. వారు నెలకొల్పిన ప్రమాణాన్నే

అప్రయత్నముగా మనసున పదిలపరచుకొని  అనుసరిస్తారు.

ఇది, నీవిది ఇట్లే చేయాలి అని నిర్దేశించుట కాదు, వారిని మీనుండి తాము చూసే 

మనంచిని అనుకరింపజేయటము.మీ చర్య వారు గ్రహించి మదిలో 

పదిలపరచుకొంటారు. తగిన వయసు, తగిన సమయము రాగానే దానిని అమలు 

జేస్తారు.

తలిదండ్రులుగా మీ బాధ్యతలు:

1.       సాన్నిహిత్యము, సహవాసము, సరియగు దారిన పెట్టు సామర్థ్యము కలిగియుండాలి.

2.    ఒకప్రక్క నియంతృత్వము చూపుతూ మరియొక ప్రక్క వారి క్రొత్త ఆవిష్కరణలకు తగిన చేయూతనివ్వాలి.

3.    పిల్లల కొరకు మంచి కథలు తెలుపుట, నీతిపద్యములను, గొప్ప గొప్ప ఋషులను, నన్నయ తిక్కన పోతనాది మహా కవిపండితుల గూర్చి తెలియజేయుట, సుమతి, వేమన, శతక పద్యములు నేర్పించుట. పట్టుదలకు పరమావధి యగు చాణక్యుని గూర్చి, శివాజీని గూర్చి  ఇంకా ఎందఱో మహావీరులను గూర్చి తెలుపుట. రామాయణ భారత భాగవత కథలు చెప్పుట ద్వారా ఆ మహానీయులను పరిచయము చేయుట.

4.    సందేహనివృత్తికి తగిన సమయమును కేటాయించి, వారి ఆలోచనలను బలహీన పరుచక సరియైన సమంజసమైన సమాధానము తెలుపుట. అసలీ ప్రశ్నోత్తర కార్యక్రమము రెండురెండువైపులనుండి ఉండాలి.

5.    పిల్లలతో తప్పక సమయమును కేటాయించుకొని పలువిధములగు ఆటలు ఆడుచుండదవలె

6.    వారికి ఖర్చుపై ఆదుపు ఆపైని పొదుపు తప్పక నేర్పించవలె.

7.    చదువుట వ్రాయుట తెలుపుట ఈ మూడూ పిల్లలకు నేర్పించి తీరవలసినదే!  అనగా మనోవికాసమునకు తగిన పుస్తకముల చదువుట, అందముగా స్పుతముగా వ్రాయుతఎకాక చక్కని భావ వ్యక్తీకరణ, ముందుముందుకు కవులు విమర్శకులు కూడా కావచ్చునేమో, ఇక వాక్పటిమను గూర్చి కొంచెము విస్తారముగా:

యూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్జ్వలా

న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః ।

వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే

క్షీయంతేఽఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్‌


భూషలుగావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్,

భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్

భూషలుగావు, పూరుషుని భూషితుజేయు పవిత్ర వాణి, వా

గ్భూషణమే సుభూషణము, భూషణముల్ నశియించునన్నియున్ .


నోరుమంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. నలుగురితో మంచి చేసుకుంటేనే మనకు మనుగడ ఉంటుంది. ఎక్కడైనా, ఎవరితోనైనా వచ్చే తేడా మాటల వల్లనే ఉంటుంది. ఆహ్వానాలు, నిమంత్రణలు చేసేటప్పుడు ఏమాత్రం పదం ఒకటి బదులు ఒకటి వాడినా అర్థాల్లో మార్పు వచ్చి అవతలి వారు నొచ్చుకునే అవకాశం ఉంటుంది. నా అనుభవంలోనే పెళ్ళికి పిలవటానికి వచ్చిన ఒక పెద్దమనిషి "మీరంతా కట్ట కట్టుకుని రండి.." అని పిలిచాడు. ఆయన ఉద్దేశం ‘అందరూ కలిసి రావాలి’ అనే అయినా వినేవారికి ఏదో అమర్యాదగ, నిర్లక్ష్యంగ అనిపిస్తుంది. భోజనం వడ్డించటం అనే అర్థంలోనే కుంభం కుదించటం, తిండి కుడవటం, లేదా కూడు పెట్టటం అనే వాడకాలు ఉన్నా ధ్వనిలో ఎంతో తేడా ఉంది కదా!

8.    కథల రూపములో పౌష్టికాహారము, దేహదార్ఢ్యముల ఆవశ్యకత తెలుపుట. ముఖ్యముగా ఆంజనేయ భీమాదులను గూర్చి తెలుపుట.

9.    వివిధ మార్గములలో పిల్లల నైపుణ్యతను వెలికి తీయుట

10.  ఇటు దేహబలము అటు మేధో బలముల ఆవశ్యకత తెలియజేయుట

11.   వారు ఉత్సాహవంతమగు పనులకు పూనుకొన్నపుడు తగిన ప్రోత్సాహమునిచ్చుట

12. చిన్న చిన్న కష్టములు కానీ, చేసిన పని నిష్ఫలమగుతగానీ జరిగినచో   వెనుదీయక    ముందుకు సాగు గణమును అలవాటుజేయుట

13.  ఆటంకములకు తగిన సమస్యా పరిష్కారము ఆటతీరును, గతిని మారుస్తుందన్న వాస్తవమును వారికి సోదాహరణముగా తెలియజేయుట

14.ఆత్మస్తైర్యమును పెంపొందించుట

15.   బాల్యము నుండియే నాయకత్వ లక్షణములు అలవడజేయుట

16.  విషయము చిన్నదయినా చేసిన పనికి తగినవిధముగా ప్రశంసించుట మిక్కిలి     అవసరము.

17. మనోవికాసమునకు తగిన కథలు గాథలు చెప్పుట, తగినట్టి స్వీయానుభవములు చెప్పుచుండుట మిక్కిలి అవసరము.

18.  లక్ష్యసాధన కలిగిన విషయముల గూర్చిన చర్చ ఎంతో అవసరము.

19. పిల్లల మానసిక ఎదుగుదలకు తప్ప వారు కుంచించుకు పోవు విధముగా పెద్దలు ప్రవర్తించనే కూడదు.

20.  పిల్లలు చేసే పనిని ఏవిధముగా చేయవలెనో చెప్పవలెనుగానీ ‘అట్లు చేయ          కూడదు’ అని చెప్పి ఊరుకోవద్దు.

21.  సాంఘీక పరమగు విషయములయందు మెళకువలు నేర్పించుట తప్పనిసరి.

22.   పిల్లలు చేసిన పనులకు సంతృప్తిని తెలియజేయుట అత్యంత అవసరము.

23.    దినచర్యను క్రమబద్ధము చేసియుంచుట మిక్కిలి అవసరము.

24.    పిల్లలు బాల్యమునుండియే కష్టపడు స్వభావమును అలవరచ వలెను.

25.   అన్నింటికీ మించి, సభ్యత సంస్కారము, మంచి చెడు, నీతి నిజాయితి                నేర్పించుట అన్నింటికన్నా ముఖ్యము.

    తల్లిదండ్రులకు పిల్లల పోషణలో ఇంత బాధ్యత ఇమిడియున్నది. 

ఐదేళ్ళ వరకు ముద్దు

పదేళ్ళు శిక్షణ పొద్దు

ఆపై దండన రద్దు

ఉన్నతికా నింగి హద్దు

స్వస్తి.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Thursday, 23 September 2021

నా పేరే సిరిమల్లేరా (బూఝ్ మెరా క్యా నావ్ఁ రే)

 

నా పేరే సిరిమల్లెరా (బూఝ్ మెరా క్యా నావ్ఁ రే)

 https://cherukurammohan.blogspot.com/2021/09/blog-post_23.html

1956వ సంవత్సరములో ప్రఖ్యాత నటుడు దర్శకుడు అగు గురుదత్ నిర్మాతగా CID అన్న చిత్రము దేవానంద్ నాయకునిగా, శశికళ వహిదా రహమాన్ నాయికా ప్రతినాయికలుగా నటించిన, చిరస్తాయిగా నిలచిన నేరపరిశోధనా చిత్రము. దర్శకుడు రాజ్ ఖోస్లా, సంగీత నిర్దేశకుడు హైదరాబాద్ వాసియగు OP నయ్యార్ గా వినుతికెక్కిన ఓంకార్ ప్రసాద్ నయ్యర్. నేదాయన మనమధ్య లేకున్నా ఆయన అమర సంగీతము మనతో నిలచిపోయినది. అతని వ్యక్తిత్వాన్ని మరో సంఘటన. ఓసారి మధ్యప్రదేశ్ ప్రభుతం 'లతామంగేష్కర్ అవార్డ్'  ఇచ్చే పురస్కారానికి ఓపి నయ్యర్ ని ఎంపిక చేశారు. ఈ పురస్కారాన్ని ఓపి నయ్యర్ సున్నితంగా తిరస్కరించారు. కారణాలు   : ఒకటి - సంగీత దర్శకుడు ఎప్పుడూ గాయనీగాయకులకంటే ఓ మెట్టు పైనే ఉంటాడు. రెండు  - జీవించి ఉన్న వ్యక్తి పేరున పురస్కారం ఇవ్వడం సరైన పధ్ధతి కాదు, మూడు - తన సంగీత దర్శకత్వంలో లతా మంగేష్కర్ చేత ఎప్పుడూ పాడించలేదు.

అసలు పై సినిమాలో ‘బూఝ్ మెరా క్యా నాఁవ్ రే’ అనే పాట ‘మీనూ ముంతాజ్’ అన్న 

నర్తకిపై చిత్రీకరింప బడినది. ఈవిడ స్వయానా నాటి ప్రముఖ హాస్యనటుడు మెహమూద్ 

యొక్క చెల్లెలు. ఆ పాటకు ఒక ‘పల్లెటూరిపిల్ల’ గా అతికినట్లు సరిపోయినది. ఆమె 

నాట్యము హావభావములు అద్భుతము. O P నయ్యర్ గారు ఈ పాటకు వేసిన బాట 

అమోఘము అద్వితీయము. నయ్యర్ గారికి అతి తక్కువగా పాటలు వ్రాసిన మజ్రూహ్ 

సుల్తాన్ పురి గారి రచన. అత్యంత లయబద్ధము హృదయరంజనకమైన రచన.

నా మనసెందుకో ఆ పాటపై మరలుటచే మరులుగొనుటచే ఆ బాణీని, పల్లవిని 

తీసుకొని చరణములు స్వంతముగా కూర్చుకొన్నాను. చదివి ఆనందించగలరు.

విని ఆనందించుటకు, హిందీ బాణీ యొక్కYoutube లంకె మీ ముందు ఉంచుచున్నాను.

పాట 

సిరిమల్లె రా! 24\09\2021

పేరేమో సిరిమల్లె రా, నదీసమీపము పల్లె రా

ఇంటికి ముందు రావి చెట్టురా, చల్లని గాలి నీడ రా

అల్లరి చిరునామానురా,అతిగోముగ పెరిగితిరా

అమ్మానాన్నకు అన్నకు, నేనంటే ప్రాణము రా

కోరి రా నను చేర రా,నామనసిక నీదే రా ll పేరేమో ll

తీయని మామిడి తోట రా, కడు తీరగు ఇల్లిది రా

ప్రేమకు గోరంటాకు రా, ప్రతి క్షణమూ పండుగరా

చూచితే నీవదలవు, నా ఇల్లే స్వర్గము రా ll పేరేమో ll

కల్లా కపటములేదురా, కడు స్వచ్ఛము నామదిరా

కాంచనగంగను బోలురా. కమనీయము తలపులురా

మలుపురా నా పిలుపురా, మది నీకై వేచెనురా ll పేరేమో ll

 స్వస్తి.

Monday, 20 September 2021

బైబిలు – కొన్ని వాస్తవములు

 

బైబిలు కొన్ని వాస్తవములు

https://cherukurammohan.blogspot.com/2021/09/blog-post_20.html

మనము అనుసరించు జీవన విధానము మతము కాదు ధర్మము.

 ప్రపంచమున ‘ధర్మము’ పేరుతో అనుసరింపబడుచున్న ఏకైక జీవన విధానము మనది మాత్రమే! మతము పేరుతో పుడమి పై ఉద్భవించినవి ఆయుర్దాయము తీరగానే కనుమరుగై పోయినాయి. ఇప్పుడు తెరపై నున్నవి రెండే ప్రముఖ మతములు. 1. క్రైస్తవము, 2. ఇస్లాము ఈ వ్యాసమునందు క్రైస్తవమును గూర్చి మాత్రమే క్లుప్తముగ  తెలుపుచున్నాను.

రెవరెండ్ జేమ్స్ యుషర్ ఆర్చ్ బిషప్ ఆఫ్ ఐర్లాండ్ సృష్టి యొక్క సమయము మరియు తేదీని "సృష్ట్యాది" గా స్థాపించడానికి ప్రయత్నించిన వ్యక్తిగా అత్యంత ప్రసిద్ధుడు. అక్టోబర్ 23 వ రోజు ముందు రాత్రి ... క్రీస్తు 4004 ముందు సంవత్సరం "; అనగా, ప్రోలెప్టిక్ జూలియన్ క్యాలెండర్ ప్రకారం, క్రీస్తుపూర్వం 22 అక్టోబర్ 4004 సాయంత్రం 6 గంటలకు. సృష్టి ప్రారంభము జరిగినది అని వారు ఏర్పరచిన క్రైస్తవ ప్రముఖుల సమావేశము ద్వారా నిర్ధారించినారు. (వికీపీడియా). ఇంతగా నిర్ధారించిన పిమ్మట కూడా క్రీస్తు వారి జననము మొదలు శిలువ, పునర్జననము మొదలగు విషయములను వారుకానీ వారి తదనంతరపు చారిత్రికులు గానీ నిర్ధారించ లేక పోయినారు. మరి క్రీస్తు గారు ఉండినట్లా, లేనట్లా అన్నది నేటికీ సందిగ్ధమే!

మాటకు రుజువే ప్రాణము

తోటకు ప్రాణంబు నీరు తోడుట కనగా

పేటకు ప్రాణము ప్రతినిధి

గాటముగా ప్రాణమౌను గన సుగుణమ్మే

ఇక బైబిలు ప్రస్తాపనకు వస్తే, బైబిలు అన్న మాటకు అర్థము పుస్తకముల సంకలనము. అందు మొదటిది పాతనిబంధనలు, రెండవది క్రొత్త నిబంధనలు. ఇది క్రీస్తునకు అనంతరము వారి అనుయాయులు వ్రాసినది.  (There is no scholarly consensus on the date of composition of the latest New Testament texts. - Google Wiki).ఇవి అన్నీ క్రీస్తుకు తరువాత వ్రాసినవే కానీ వీని చరిత్రను వారు పదిల పరుపలేక పోయినారు. పైగా ఒకే విషయము పై ఒకరు వ్రాసిన వ్రాతలకు వేరొకరు వ్రాసిన వ్రాతలకు ఎన్నో భేదములున్నవి.

ఇక అసలు విషయమునకు వస్తే పాత నిబంధన 5 పుస్తకముల సంకలనము. అవి 1. ఆది కాండము (Genesis) 2. నిర్గమ కాండము(Exodus)   3. లేవీ కాండము (Leviticus), 4. సంఖ్యా కాండము (Numbers)  5. ద్వితీయోపదేశ కాండము. (Deuteronomy).

పాత నిబంధనలో

a) 39 పుస్తకములు

b) 929 అధ్యాయములు

c) 23214 వచనములు కలవు

d) అతి పెద్ద పుస్తకము కీర్తనలు

e) అతి చిన్న పుస్తకము ఓబద్యా

బైబిలు పండితులు పాత నిబందనను 4 భాగములుగా విభజించారు.

1) ధర్మశాస్త్ర గ్రంధములు – 5 (ఆదికాండము నుండి ద్వితీయోపదేశకాండము వరకు)

2) చరిత్ర గ్రంధములు – 12 (యెహోషువా నుండి ఎస్తేరు వరకు)

3) కావ్య గ్రంధములు – 5 (యోబు నుండి పరమగీతము వరకు)

4) ప్రవక్తల గ్రంధములు – 17 (యెషయా నుండి మలాకి వరకు)

ఈ విభజన గ్రంధకర్తలు రాసిన కాలమును బట్టి విభజించలేదు. ఏ గ్రంధము అయిన ముందు రాసి ఉండవచ్చు లేదా వెనుక రాసి ఉండొచ్చు.

ఉదాహరణకు: 2, రాజులు గ్రంధం బైబిలు క్రమ పట్టికలో 12వ పుస్తకము, యిర్మియా గ్రంధము 24వ పుస్తకము. కాని ఈ రెండు పుస్తకములు క్రీస్తు పూర్వము 500 నుండి 600 మధ్య కాలములో వ్రాయబడినాయి. యిర్మియా గ్రంధములో వున్న లేఖనాలు రాజుల గ్రంధములో కనబడే వ్యక్తుల గురించి, రాజుల గురించి, జనం గురించి ప్రస్తావించినవే. కనుక యిర్మియా గ్రంధము అర్థము కావాలి అంటే రాజుల గ్రంధములను కూడా పరిశీలించాలి.

కాబట్టి బైబిలు చదువుతున్నపుడు ఎవరు రాసినారో, ఏ కాలములో వ్రాయబడినదో, ఏ సందర్బమును బట్టి రాసినారో, ఏ ప్రదేశము వారు రాసినారో,  అనేది తప్పనిసరిగా గుర్తించగలిగితే ఆ రాతలలోని నిజానిజములను మనము గ్రహించవచ్చును. భారత భాగవతములను వ్రాసిన వేదవ్యాసుడు ఆ ఇతిహాసములు జరుగుచున్న కాలము వాడు. పైపెచ్చు తన అంతర్దృష్టితో విశ్వాంతరాళమున ఏమి జరుగుచున్నది అన్న విషయయమును మనకు తెలియగలిగిన తపఃసంపన్నుడు. మరి బైబిలు వ్రాసిన వారల గూర్చిన ప్రస్తాపనలో మనకా విషయము తెలిసి రాదు.

1945 డిసెంబరు న మహమ్మద్ ఆలీ సమ్మాన్ అను వ్యక్తి తన వ్యవసాయ భూమిని సాగు చేసుకోవడానికి మెత్తటి మట్టి కోసం ఈజిప్టులోని నాగ్ హమ్మడి (Nag Hammadi) పట్టణం చేరువలో ఉన్న జబల్ అల్ తరిఫ్ (Jabal Al Tarif) అనే కొండ గుహలోకి వెళ్ళి అక్కడ తవ్వగా తోలుతో చుట్టబడిన జాడీని కనుగొన్నాడు. ఈ జాడీలో పాపిరస్ (Papyrus) అనే మొక్కతో తయారుచేయబడిన 13 పుస్తకాలున్నాయి. ఈ పుస్తకాలనే నాస్టిక్ గాస్పెల్స్ (Gnostic Gospels) అని అంటారు. Coptic అనే ఈజిప్టు భాషలో వ్రాయబడిన ఇవి 350 A.D కి, 400 A.D కి మధ్య వ్రాయబడినవని పరి శోధకుల ఊహ. ఈ పుస్తకాలు ప్రధానంగా ఇప్పుడున్న బైబిల్ గ్రంథానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. ఏసు క్రీస్తుకు మహిమ శరీరమే గాని భౌతిక శరీరం లేదు కనుక శిలువ మరణం అబద్ధమని, ఏసు క్రీస్తుకు మగ్దలేని మేరితో శారీరక సంబంధం ఉన్నదని, వివాహం చేసుకోకుండా కన్యలుగా, బ్రహ్మచారులుగా ఉండాలని చెబుతాయి. క్రీస్తును విశ్వసించడం వల్ల మోక్షం లభించదు కాని నిగూఢమైన అనుభవము ద్వారా గాని లేదా ప్రత్యేకమైన తదాత్మయం (revelation) చెందడం వల్ల గాని లభిస్తుంది అని చెబుతాయి. 1896 ఈజిప్టు రాజధాని కైరో నగరంలో కూడా ఇటువంటి పుస్తకాలు బయల్పడినాయి. ఇవన్నీ అసలైన క్రైస్తవ బోధనలకు విరుద్ధంగా ఉన్నాయి. కనుక ఈ గ్రంథాలు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల దృష్టిలో బైబిల్ వ్యతిరేక పత్రికలుగా మిగిలిపోయినాయి.

రేపు ముగింపు ........

బైబిలు కొన్ని వాస్తవములు - 2

ఇన్ని వైరుధ్యముల మధ్య పురుడు పోసుకొన్న బైబిలు కు కర్త ఎవరనన్నది వారు నిరూపించలేరు. అది అలా ఉంచితే ప్రస్తుతము కీర్తి శేషులు మరియు నాకు అత్యంత ఆప్తులు, జేష్ట భ్రాతృసమానులు  dr. VVS శర్మ గారు 2016 న ప్రచురించిన ఈ చిన్న వ్యాసమును మీ ముందుంచుచున్నాను:

అన్ని మతాలూ ఒక మంచికోసమే పుడతాయి, - ఇది సరియైన ఊహకాదు. భారతీయమతాలు ఒక ధర్మాన్ని లక్ష్యంగా చేసుకుని పుట్టినవి. వాటికి ప్రవక్తలు లేరు. బుద్ధుడు మహావీరుడు తరువాత చాలాకాలానికి గురునానక్, చైతన్యుడు, త్రిమతాచార్యులు వీరెవరూకూడా మత ప్రవక్తలు కాదు. ముఖ్యంగా వ్యక్తిని మోక్షం, నిర్వాణం, సద్ధర్మాచరణ ఈ విధంగా పరిణామం చేయడం కోసమే వచ్చిన ధర్మ మార్గాలు ఇవి. యూదు, క్రైస్తవ, మహమ్మదీయ మతాలు ఒక ప్రవక్త ఏర్పరిచిన, మతప్రచార ప్రాతిపదికన తమ సమూహంలో చేర్చుకోవడానికి ఏర్పడిన రాజకీయ, సాంఘిక వర్గాలు. కౄసేడులు,జిహాదులు వాటి చరిత్ర. మా దేవుడే సత్యము, మా ప్రవక్తయే దేవుని కుమారుడు లేదా పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ అని చెప్పుకునేవి ఈ మధ్య అశియాలో పుట్టిన మతాలు. బైబిల్ డ్యూటిరానమీ పుస్తక వాక్యాలు చూడండి --- డ్12

1 మీరు స్వాధీనపరచుకొనుటకు నీ పితరుల దేవుడైన యెహోవా నీ కిచ్చిన దేశమున మీరు భూమిమీద బ్రదుకు దినములన్నిటను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలును విధులును ఇవి.

2 మీరు స్వాధీనపరచుకొన బోవు జనములు గొప్ప పర్వతముల మీద నేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్లన్నిటిక్రిందనేమి, యెక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించెనో ఆ స్థలము లన్నిటిని మీరు బొత్తిగా పాడుచేయవలెను.

3 వారి బలి పీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతాస్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేరులు అచ్చట లేకుండ నశింప జేయవలెను.

4 వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు.

నేను మీ కాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియు కలుపకూడదు దానిలోనుండి ఏమియు తీసివేయకూడదు.

5. నేను మీ కాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియు కలుపకూడదు దానిలోనుండి ఏమియు తీసివేయకూడదు.

6 నీ తల్లి కుమారుడేగాని నీ సహోదరుడేగాని నీ కుమా రుడేగాని నీ కుమార్తెయేగాని నీ కౌగిటి భార్యయేగాని నీ ప్రాణస్నేహితుడేగాని నా ఆజ్ఞను అతిక్రమించిన ప్రాణముతో నిలువకూడదు.

7 భూమియొక్క యీ కొన మొదలుకొని ఆ కొనవరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగానుండినను, నీ చుట్టునుండు జనముల దేవ తలలో నీవును నీ పితరులును ఎరుగని యితర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన యెడల

వారి మాటకు సమ్మతింపకూడదు; వారిమాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు; వారియందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు; అవశ్యముగా వారిని చంపవలెను.

8. చంపుటకు నీ జనులందరికి ముందు గాను నీ చెయ్యి మొదట వారిమీద పడవలెను.

ఇతర మతాల వారు తమ పుస్తకాలనే పాటిస్తున్నారు.

ఇది హిందూ సమాజం తెలుసుకొవలసిన విషయాలు.

వారు తెలియజేసిన పై విషయమునకు, దిగువన, నా పరిశీలనను జోడించుచున్నాను.

1.       సార్వజనీనమైన ఉచితమగు వనరులను భగవంతుడే భూమికి సమకూర్చవచ్చును. పృథివ్యాపస్తేజో వాయురాకాశములను, శైల వృక్షసంపదలను, మానవ మేధస్సును ఇచ్చి సృష్టించినాడేకానీ యోగ్యతాయోగ్యతలను మన కర్మ ఫలమునకు వదిలివేసినాడు. మరి వారి దేవుడు దండ పారుష్యముచే తన మాట చేల్లిన్చుకోన దలచినాడు. మరి ఆయన ప్రజలు ఆయన మాటకు నిబద్ధులయితే భూమియే స్వర్గము కదా! కర్మఫలము యొక్క ప్రస్తాపనే లేదు కదా!

2.    చెట్లు గుట్టలు పుట్టలలో వెలసిన దేవతా మూర్తులను నాశనము చేయ నాజ్ఞాపించిన వ్యక్తిని దేవునిగా అంగీకరింపనగునా!

3.    దేవతామూర్తులను యూప స్తంభములను, బలిపీఠములను నాశనము చయ నాజ్ఞాపించిన వ్యక్తిని దేవుడని అనగలమా! హిరణ్యకశిప, హిరణ్యాక్ష, శుంభ, నిశుంభ త్రిపురాసురాది దైత్యులను మనము దేవతలు అనము కదా!

4.    వారు తమ దేవతలకు చేసినట్లు యహోవాకు చేయకూడదు అని చెప్పుట ఒక ద్వేషపూరిత సందేశమును తమ అత్యున్నత దైవము చెప్పినాడు అనుట మానవత్వము కలిగిన మనుష్యులు జీర్ణము చేసుకొనగలరా!

5.    తన మాటను తూచా తప్పక పాతిన్చావలేనాను వ్యక్తికి దైవము అన్న పట్టము కట్టదగునా!

6.    తల్లిదండ్రులను కన్న బిడ్డలను, కట్టుకొన్న భార్యను విశ్వశాంతికి సంకేతమైన పరమాత్మగా మనము విశ్వసించే వ్యక్తి, తనమాటను త్రోసిరాజన్నవారిని నిర్దాక్షిణ్యముగా చంపమంటున్నాడు. మరి ఆపని తానే చేయవచ్చును కదా!

7.    ఇందు భూమి యొక్క ఈ కొన మొదలు ఆ కొన అని వాడబడినది. అంటే అది బల్లపరుపుగా ఉన్నదంటూ, మన ఋగ్వేదము చెప్పినట్లు భూమి అండాకారమున లేదనియే కదా! బైబిలు చెప్పుచున్నది. ఎంత హాస్యాస్పదమో చూడండి. తన నిర్దేశాకత్వమును పాటింపని ప్రతి ఒక్కరినీ చంపమంతున్నాడు. మరి అట్టివారిని పుట్టించడమెందుకు?

8.    నా ఆజ్ఞలను ధిక్కరించిన పరమతస్తులపై నీ దెబ్బయే ముందు పడవలెను.

9.    ఈ విధమగు ఉపదేశములను ఇచ్చిన వారిదేవుని ఏవిధముగా విశ్వాత్మగా పరిగణించవచ్చునో మీ విచక్షణకే విడిచి పెడుతూ, విరమించుచున్నాను.

స్వస్తి. 


Saturday, 11 September 2021

సప్తస్వర కందము

 సప్తస్వర కందము

https://cherukurammohan.blogspot.com/2021/09/blog-post.html

మాపని నీ పనిగా గని

మాపని సరి సరిగ సాగ మరి నీ మగనిన్

నీ పనిని మాని మా దరి

మాపని సరిగాగ మదని మరి పంపితివే!

ఓ చెలియా! మా పనిని నీ పనిగా తలచి, మా పని సరిగా జరుగుటకు, నీ పనిని మానుటకైనా వెనుకాడక, నీ మగనిని మా పని కొరకు పంపి పూర్తి చేయించితివి. (నీకు కృతజ్ఞతలు)

చెరుకు రామ మోహన్ రావు 

Vijayavenkatakrishna Subbarao Ponnada

Adbhutham Sir _/||\_

 · 7y

Ravi Sudhakar M

చాలా బాగున్నది ఈ/మీ సప్తస్వర పద్యం.

 · 7y

Subba Rao Msv

Mee Yee "Saptha Swara Kandham" ... "Telugu Padhyalakay Prasadhinchindhi Nuthana Andham" .... "Mukha Pustha Vikshakulaku Vinuthna Chandham"... "Telugu Bhasha Priyulaku Sugandham" .... Adhbhthalakay Adhbhutham!!!!

 · 7y · Edited

Katepalli L N Murthy

ఛందో రీతులతో చమత్కారాలను చూపే కవివర్యులకు కవనాభినందనలు.

 · 7y

Boreddy Bagareddy

Nice guruvu garu

 · 7y

Mukkavilli Dharma Prakasa Rao

Subhodayam Sir nice lyric

ప్రసాద్ కట్టుపల్లి

చాలా చాలా బాగుందండి,.,పద్యం అల్లటమే కష్టతరం..,సప్త స్వరాలతో కంద పద్యం,,,,అత్యద్భుతం

 · 7y · Edited

Kalyan Krishna Kumar Karanam

చాలా బాగుంది గురూజీ

 · 7y

Padmini Priyadarsini

అద్భుతః బాబాయ్. సంగీతం లోని సప్త స్వరాలతో మాత్రమే పద్యం అల్లడం అంత సులువు కాదని నాకు తెలుసు.

 · 7y

Gollapudi Venkata Ramana

అద్భుతం.

 · 7y

Ramana Balantrapu

అద్భుతః

 · 7y

R. Rama Devi

చాలా చాలా బాగుందండి,

 · 7y

Umadevi Balluri

చాలా చాల బాగుందండి.సప్తస్వరాలతో కందపద్యం అద్భుతంగా వుందండి.

Friday, 20 August 2021

తెలుగు తేనెఊట పై తేట ( కస్తూరి ని గూర్చి కూడా చదువండి)

 

తెలుగు తేనెఊట పై తేట (కస్తూరిని గూర్చి కూడా చదువండి)

https://cherukurammohan.blogspot.com/2021/08/blog-post.html

ఈ వ్యాసము వ్రాయుటకు ఒక ప్రత్యెక కారణమున్నది. ముందు నేను వ్రాసిన ఈ 

పద్యమును గమనించండి.

అరవకన్నడములు ఆముదము కస్తూరి

ఒకటి తెలియలేము ఒకటి ఘాటు

తెనుగు తేనె ఊట తేటరా గమనించు

రామమోహనుక్తి రమ్యసూక్తి

ఆముదము(తమిళము)=అమృతము(తెలుగు)

తమిళులు అరవమును అమృతముతో పోల్చుకొంటారు. కానీ దాని రంగు రుచి వాసన 

భూమిపైన ఎవరికీ తెలియదు.

కన్నడమును కస్తూరి అంటారు. కస్తూరి వాసన దూరము నుండి పీల్చితే ఎక్కడలేని 

సువాసన కలిగియుంటుంది. అంతమంచి వాసనను దగ్గరకు పోయి 

పీల్చుదామనుకొంటే ముక్కు బెదిరి రక్తము కారుతుంది.

కానీ తెనుగు అట్లుకాదు. అది తేనె పుట్టుటకు కారణమైన ఊట. అంతేనా అంటే 

అదీకాదు, ఆ ఊరిన తేనెపై గల తేట. ఆ తేట ఎంత త్రావినా కడుపు నిండదు సరికదా 

ఇంకా త్రావాలనే ఉంటుంది. ఇదీ మన తల్లిభాష గొప్పదనము.

ఇది నేను జూలై 3, 2018 న ఆస్య గ్రంధిలో ప్రకటించి యుండినాను. 20 మందికి 

నచ్చినది, 11 మంది తమతమ కుడ్యములపై ఇతరులకు పంచినారు. 10 మంది 

అభిప్రాయములను ప్రకటించగా 8 మంది భేషుభేషని మెచ్చుకొన్నారు తెలుగులో. 

ఇద్దరికీ మాత్రము నచ్చలేదు అందువల్లనేమో,  తమ నిరసనను ఆంగ్లమున తెలిపినారు. వారి నిరసనలు ఈ దిగువన కనబరచినాను.

కస్తూరీ తిలకం లలాట పలకే ........ I am a Telugu, studied Kannada. Kasturi is used 

a medicine also. It's smell cures cold. My mother used to give us Kasturi 

matra (tablets). Your poetry is nice to hear being Telugu man but feel sad on Kasturi Being a Kannadiga by birth and AmRtaM (amudam ) since I can read and speak Tamil. Tirukkural, Barathiar the poetry.....,

Thank you sir, my uncle a Telugu Pandit in Bangalore used to tell all this. Nice 

recollection తెలుగు తేటనే ఎవరూకాదనరు

I can understand your feelings Sri. -------

Unfortunately it has become a habit to many to degrade others and score a 

point. I am also a Telugu speaking person and I apologize for the bad 

remarks made on the other languages.

ముందు, ఇతర భాషలను కించపరుచరాదు అన్న అభిప్రాయమును పైన ఇరువురు వ్యక్తులు వెలిబుచ్చినారు. మరివారి అభిప్రాయ ప్రకటనలో సాటి వ్యక్తినయిన నాలో సంస్కారము లేదు అని చెప్పకనే చెప్పినారు కదా! దానిని వారు లెక్కచేయలేదు. సరే జ్ఞానులగు వారు చెప్పిన మాట నాకు శిరౌధార్యము.

అసలు వారికి ఇటువంటి ఆలోచన వచ్చియుండకూడదు. ఎందుకంటే ‘అరవము 

ఆముదము’ అన్న వారు ఆ భాషను మాతృభాషగా కలిగిన వారే! నేను అన్నది కాదు. తల్లి 

భాషను ప్రతి వ్యక్తి గౌరవించుతాడు. వారి మాతృభాషాభిమానమునకు శిరసు వంచి 

నమస్కరించుచున్నాను. ఒక పరి విందుకు పోయినట్లు ఊహించుకొందాము. 

భోజనము ముగియు సమయానికి కొన్ని పదార్థములు ఆకులో నిలువ వుంది పోతాయి. కారణమేమి అంటే, ఆ ఆకులో భోజనము చేసిన వ్యక్తి ఆ పదార్ధములో రుచి తక్కువ అనియో, తీపుఎక్కువ అనియో చెబుతాడు. ప్రశ్నించిన వ్యక్తి మిగత భోక్తల ఆకులు చూసినపుడు, తనకు చెప్పిన వ్యక్తి మాటలో వాస్తవమున్నది అని గ్రహించుతాడు, అట్లు చూడకపోతే వీడు మహా గొప్పగా వందేవాని మాదిరి తప్పు పడుతున్నాడు అని అనుకొంటాడు. బాగోగులు చెప్పుటకు పాక శాస్త్ర జ్నిపునుడు కానక్కరలేదు.

పైన చెప్పిన పద్యములో వారు చెప్పిన ఉపమానముల గుణము నేను తెలియజేసినాను. 

వేరెవరినీ కించ పరుచలేదు.

ఇక అభిప్రాయములు వ్రాసిన ఇరువురూ తెలుగువారయి కూడా ఆంగ్లములోనే తమ 

అభిప్రాయములు తెలిపినారు. అది బహుశ వారి మాతృభాషాభిమానమునకు 

తార్కాణమేమో!

అరవము అమృతతుల్యమగు భాష కాదు అని నేనెక్కడా అనలేదు. అమృతమును 

నాబోటి మానవమాత్రులు చూసే అవకాశము లేదు అన్నాను. అదేవిధముగా కన్నడ భాష విషయములో కస్తూరిని ముక్కుకు దగ్గరగా ఉంచుకొని ఆఘ్రాణించితే ముక్కు బెదిరి రక్తము వస్తుంది. అది ఆ వస్తుగుణము. అది తప్పు అంటే వారు ఆ విషయమును నిరూపించవలసి వస్తుంది.  వారి నిరూపణలో వాస్తవముంటే నన్ను దుర్భాషలాడినా నాకు సమ్మతమే! అసలు ఇప్పుడు కస్తూరిని ఆ మృగము నుండియే తీయుటలేదు. కావున కృత్రిమ వ్దానముల వాళ్ళ తీసే కస్తూరి వాసన చూసినా ముక్కు బెదరదు.

కావున నేను చెప్పవచ్చినదేమిటంటే పాఠకులు తమ అభిప్రాయమును వ్రాసే ముందు, 

వ్యాసమును శ్రమ అనుకోకుండా చదివి ‘కష్టపడి వ్రాసిన వ్యక్తి మనసును నొప్పించని 

విధముగా తమ అభిప్రాయములు తెలిపే విధానము పై దృష్టి సారించితే మంచిది అని 

నా అభిప్రాయము. ‘సామాన్య భాషా వాదమును’ ఆంగ్లేయుల ప్రీతికోరకు లేవనెత్తి వారిచే 

‘Sir’ బిరుదులూ, బహుమతులు పొంది, తెలుగును చరమస్థాయికి చేర్చినారు. ఇంకా ‘

దింపుడు కళ్లము’ లో ఉంచిన దాని ‘కొన ఊపిరులకు ఊపిరుల’ 

నూదండి.స్మశానమునకు ఈడ్చి నిప్పు పెట్టకండి. ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని 

చెప్పిన మహనీయులు ఆమాట చెప్పుటచే పరభాషలను కించపరచినట్లు 

అన్వయిన్చుకోకండి. ఇది ‘క్రీడాభిరామము’ లో వినుకొండ వల్లభరాయులే చెప్పినాడో 

 శ్రీనాథుడే చెప్పినాడో అన్న్క వివాదము ప్రక్కనుంచితే ఇరువురిలో ఒకరు నిర్దుష్టముగా 

చెప్పియున్నారు. ఇక రాయలవారి నోట వేలువడినదని మనము వింటూ ఉండేదే!

ఇంతదూరము వచ్చిన తరువాత కస్తూరిని గూర్చి నేను తెలుసుకొన్న మేరకు 

తెలియజేస్తాను. శృంగార రస వర్ణనలోనూ, దేవీ దేవతల స్తోత్రములలోనూ కస్తూరిని 

విరివిగా నాటి మహా పండిత కవులు వేదజల్లినారు. ఒకసారి చదవండి.

కస్తూరి, మగ కస్తూరి జింక యొక్క ఉదరము, పురుషాంగాల మధ్యన ఉండే ఒక ప్రత్యేక 

గ్రంధి నుండి వెలువడే తీవ్రమైన పరిమళము. ప్రాచీన కాలము నుండి దీనిని ప్రసిద్ధ 

సుగంధ పరిమళముగా ఉపయోగిస్తున్నారు. తన నాభినుండి బయట పడుతున్న కస్తూరి 

గంధాన్ని, తెలుసుకొనలేని కస్తూరి మృగం దాన్ని గడ్డిలో వెతుకుతుంది.—కబీర్.

అత్యంత ఖరీదైన జంతు ఉత్పత్తులలో కస్తూరి ఒకటి. కస్తూరికి ఆంగ్ల నామమైన మస్క్ 

సంస్కృత పదమైన ముష్క (వృషణాలు) నుండి ఉద్భవించింది. శ్రీకృష్ణుని స్తోత్రములో 

‘కస్తూరీతిలకం.....’ ఐయు, శివస్తోత్రములో ‘చందనాగారుకస్తూరి చారు కుంకుమ 

భూషితం’ అని దేవీభాగావతమున మణిద్వీప వర్ణనలో ఆ సుందర వనములో కస్తూరి 

మృగములు సంచరించేవని, కస్తూరిని, శని రాహుగ్రహములకు, రోహిణి భరణి మూల 

నక్షత్రములకు హోమద్రవ్యముగా వాడవలెనని చెప్పినట్లు విష్ణు ధర్మోత్తర పురాణములో 

చెప్పబడినదని పెద్దలు చెప్పగా విన్నాను.

19వ శతాబ్దము చివరివరకు కస్తూరి కేవలం సహజ వనరులనుండే లభ్యమయ్యేది. 

అయితే ప్రస్తుతం చాలామటుకు కృత్తిమంగా తయారుచేసిన పదార్ధాలనే వాడుతున్నారు. 

1195వ సం.లో మొరాకో సుల్తాన్ మారకేష్‌ కాలంలో వెయ్యి మూటల కస్తూరి కలిపిన 

సున్నంతో నిర్మించిన మసీదు ఈనాటికి కూడా కస్తూరి సువాసనలు వెదజల్లుతున్నదట. 

కస్తూరిలో ఆ స్వభావ సిద్ధమైన వాసనకు ప్రధాన కారణమైన ఆర్గానిక్ కాంపౌండు 

ముస్కోన్.

నుదుట తిలకమునకు, జలుబుకు, దగ్గుకు ఆయర్వేదంలో చాలా రకాల చిట్కాలు

మందులు ఉన్నాయి. వీటన్నింటిలో కస్తూరి వాడే వారు కానీ తగిన లేక తక్కువ 

మోతాదులో వాడుతారు కావున ఆ వస్తువులను ముక్కుదగ్గర ఉంచుకొన్నా 

ముక్కునుండి నెత్తురు రాదు.  ఆయుర్వేదములో గంగా కస్తూరి మాత్రలను పూర్వకాలం నుండీ అనేక వ్యాధులకు నిపుణులు ఔషధంగా సూచిస్తున్నారు. కస్తూరి మృగం నాభి నుండి వెలువడే ఘాటైన ద్రవ్యమును ఉపయోగించి వీటిని తయారు చేస్తారు కాబట్టే కస్తూరి మాత్రలు అని పిలుస్తారు. ఇవి నాలుగు రకాలుగా అందుబాటులో ఉన్నాయి. ఇందులో వేటిని వాడినా మన సమస్యకు గుణం కనిపిస్తుంది. ఈ మాత్రల్లోని ముఖ్య ద్రవ్యాలు కస్తూరి, మిరియాలు, గోరోచనం, రస సింధూరం, పిప్పళ్లు, అక్కలకర్ర, ఇంగలీకం ముఖ్యమైనవి. తమలపాకు రసంలో నూరి, తేనెతో కలిపి ఇస్తే చక్కని ఫలితం ఉంటుంది. అజీర్ణ సమస్యలు ఎదురైనప్పుడు, వాత వ్యాధులకి, కఫం పెరిగినప్పుడు, అతిసారానికి, అధికంగా చెమటలు కారడం వంటి సమస్యలకు సరియైన జవాబుగా ఇదిపెట్టింది పేరు. ఒకటి రెండు మాత్రల చొప్పున బాలింతలకు తొలిమూడు మాసాల వరకు ఇవ్వవచ్చు. దీని వల్ల వారికి ఒళ్లునొప్పులు, వాతం తగ్గుతాయి. జ్వర భారం తగ్గాలంటే ఒకటి రెండు మాత్రలు చొప్పున ఇవ్వవచ్చు. చంటి పిల్లలకు కలిగే దగ్గు, అజీర్ణ విరేచనాలు, జ్వరం, జలుబు, వాంతులు మొదలగు వాటికి ఒకటి రెండు మాత్రలు చొప్పున అవి తగ్గేవరకు ఇవ్వవచ్చు. ఆరునెల్ల నుంచి ఎవరైనా, ఏ వయసు వారైనా వాడుకోవచ్చు. ఉదయాన్నే తేనెతో పాటు లేదా అల్లపురసంతో ఇస్తే మేలు.

ఏది ఏమయినా మృగమదము పొందుటకు ఆ జింకను చంపి వృషణముల వద్దనున్న ఆ 

గ్రంధిని వెలికి తీసి ఎండబెట్టి నలుపు రంగునకు మారిన తరువాత పైన తెలిపిన మేరకు 

వాడుతారని చదివినాను, పెద్దల ద్వారా విన్నాను. ఇప్పుడు ఆ విధానము చట్ట 

విరుద్ధంయ్యయ్య్య్యినది. కావున మనకు లభించే కస్తూరి ‘మృగ మదము’ కాదు.

ఈ అవకాశమును కలుగజేసిన ఆ ఇరువురు పెద్దలకు నమస్కరించుతూ శెలవు 

తీసుకొనుచున్నాను.

స్వస్తి.