Friday, 18 April 2025

చిటపట చెమటలు (చిటపట చినుకులు పడుతూవుంటే పాట రాగము)

 


చిటపట చెమటలు (చిటపట చినుకులు పడుతూవుంటే పాట రాగము)

https://cherukurammohan.blogspot.com/2025/04/blog-post.html

చిటపట చెమటలు పడుతూ వుంటే 

మట మట పటతల  మాడుతు  ఉంటే 

గొంతు ఆరిపోయ్ గసపెడుతూంటే  

ఓటు కుండలో నీటిని తాగిన  

రీతిగా ఉంటుందోయి 


వేసవి సూర్యుడు ఉడికిస్తూంటే 

చెమ్మటకాయలు చిటపట మంటే 

జోళ్లు లేకనే తారురోడ్డుపై 

మండుటెండలో నడుస్తూ ఉంటే 

చెప్పలేని ఆ అనుభవమన్నది 

చెబితే తీరని దోయి   


కిట కిటలాడేటి  జనాలు బస్సున ఉంటే ll బస్సున వుంటే ll 

స్నానమునే చేయనివాడు పక్కన ఉంటే ll పక్కన ఉంటే ll 

కారే చెమటల కంపు పంచుతూ 

ముక్కు పుటాలను ఛేదిస్తుంటే 

చెప్పలేని ఆ  తిప్పట ఎపుడూ 

చెప్పనసాధ్యమ్మోయి 


కమ్మ కమ్మగా   కల వస్తూంటే 

కలలో ఊర్వశి నర్తిస్తూంటే  

ఫాను  ఆగిపోయ్ ఉక్కపోయగా 

కలచిన ఊహల  రక్కసి వస్తే 

చెదరి బెదరిన చెమటల మేను 

దడదడ లాడు కదోయి 

1 comment:

  1. భ్రమండంగా ఉంది ఎందుకంటే వాస్తవికత సినిమా ట్యూన్ ద్వారా చిత్రీకరించబడింది

    ReplyDelete