Friday, 24 September 2021

ఇతిహాసమునకు పెద్దల నిర్వచనము

 ఇతిహాసమునకు పెద్దల నిర్వచనము

https://cherukurammohan.blogspot.com/2021/09/blog-post_33.html

9వ శతాబ్దములో రాజశేఖర కవి ఇతిహాసము’ నకు తాను రచించిన ‘కావ్యమీమాంస’ ద్వారా ఎంత చక్కని నిర్వచనమిచ్చినాడో ఒకపరి గమనించండి.

‘ఇతిహాస వేద ఆయుర్వేదౌ గాంధర్వవేద ధనుర్వేదౌవ్యుపవేదః’ అని తెలిపినారు పెద్దలు. వారు ఇంకా ఏమన్నారంటే:

వరక్రియా పురాకల్ప ఇతిహాస గతిర్ద్విధా l

స్వాద్యేక నాయకః పూర్వః ద్వితీయా బహునాయకాఃll

అనగా మహానీయులగు వేదవిదులు పూర్వము మనకొసగబడిన ఇతిహాస విధానమును రెండు విధములుగా విభజించినారు. 1. ఏకనాయక ఇతిహాసము, 2. బహునాయక ఇతిహాసము. రామాయణము మొదటి కోవకు చెందితే, భారతము రెండవ కోవకు చెందినది.

ఇంకా

ధర్మార్థ కామ మోక్షాణాం ఉపదేశ సమన్వితంl

పూర్వ వృత్త కథాయుక్తం ఇతిహాసం ప్రచక్షతౌll

అనికూడా అన్నారు. అంటే  ధర్మార్ధకామమోక్షములు అనే చతుర్విధ పురుషార్ధములు, ఉపదేశములు, పూర్వవృత్తాంత కథలతో కూడినది ఇతిహాసము అని అనబడుతుంది.

ఇతిహాస పురాణానాం వేదం సముపబృహ్మయేత్l

విభేదాలప శ్రుతాద్వేదో మామయం ప్రహరిష్యతి ll

అన్నది శాస్త్ర వచనము. వేదములు శాస్త్ర పురాణములలో నిక్షిప్తము చేయబడినవి. అ జ్ఞానమును చక్కగా ఉపయోగించుకొనమని పెద్దల ఆదేశము. ఎక్కడ అరకొర విద్య నేర్చుకోన్నవారి నోటబడి తనపై వేటు పడుతుందో అని వేదము భయపడుతుందట. అందుకే సర్వ వేదార్థ సారమును ఇతిహాస పురాణములలో మహానీయులగు మన మహర్షులు జొప్పించి మన చేతికందించినారు. కానీ నేడు వాని విలువ తెలియని మనకు ‘మొరటువానికి మొగిలిరేకిచ్చినట్లు’ అయ్యింది.

ఇంకొక ఆశ్చర్యకరమగు విషయము ఏమిటంటే History అన్న పదము His Story అన్న రెండుపదముల సంయోగము. ఆ His అను మాట దేశ పాలకునికి అన్వయము. Story అంటే కథ. అంటే History అన్న మాటకు ‘వాని కథ’ అని అర్థము. మరి "ఇతి-హాసం" - అనగా "అవును ఇలా జరిగిందని చెప్పబడినది" అని అర్థము. దీనిని బట్టి వాస్తవమును అర్థము చేసుకొందాము.

స్వస్తి.

No comments:

Post a Comment