నా తెనుగు
కాంచనమగు నా తెనుగది కన 'అజంత' సుందరము
గాన కవన రసమందున కన అజంత
సుందరము
భువన విజయ కవి సారము భువి
కృష్ణా నయగారము
గాన కవన రసమందున కన అజంత సుందరము
మావి పైని నునుపుదనము
మావిలోని తీయదనము
గాన కవన రసమందున కన అజంత
సుందరము
మది మెచ్చే కుందనము మరులు
గొల్పు చందనము
గాన కవన రసమందున కన అజంత సుందరము
కలితాక్షర ధని యాంధ్రము గన 'అజంత' సుందరము
గాన కవన రసమందున కన అజంత
సుందరము
చెరుకు రామ మోహన్ రావు
No comments:
Post a Comment