హరిహర సమరస కార్తీకం
https://cherukurammohan.blogspot.com/2015/11/blog-post_12.html
మారమణ ముమారమాణం ఫణధరతల్పంఫణధరాకల్పం
ముర మధనం పుర మధనం వందే బాణారి మసమ
భాణారిం
మహేశ్వరేవా జగతామధీశ్వరే జనార్దనేవా
జగదంతరాత్మని
నవస్తూ భేదః ప్రతిపత్తి రస్తుమే
తధాపిభక్తిః తరుణేందుశేఖరే (అయ్యప్ప
దీక్షితులు)
లక్ష్మీపతి యగు విష్ణువు సర్పము పై శయనించితే ఉమాపతి సర్పములనే దేహముపై
ధరించినాడు.హరి మురారి యితే హరుడేమో పురారి.హరి బాణాసురహర్త
హరుడేమో మారుని సంహర్త (మారుడు=మన్మధుడు). మహితాత్ములగు వారిరువురికీ
నమస్కారము.
జగదధీశ్వరుడు మహేశ్వరుడు. జగదంతరాత్ముడు జనార్దనుడు. వస్తుతః
వారిరువురికీ భేదము లేనప్పటికీ నాకు తరుణేందు శేఖరునిపై తపము సిద్ధిస్తూవుంది. (హరిహర ప్రీతికరమైన కార్తీక మాస సందర్భంగా)
Ma (Lakshmi) is the consort of Hari, Uma is the consort of Hara.
Hari lays on Sarpa (Snake). Hara wears sarpas on his body. Hari
killed Mura a demon. Hara killed the three demons called
Tripuraasuraas. Hari killed Banasura. Hara killed Manmadha. They
are equivalent in every respect. Somehow my mind stays on
Hara.
(In the context of the beginning of Karthika masa.)
చెరుకు రామ మోహన్ రావు
No comments:
Post a Comment