నేనే రాజూ నేనే మంత్రీ నోరు తెరిస్తే నేనో కంత్రీ
నామాటంటే నిజమగు వేదం పెంచకు నాతో ఎపుడూ వాదం
నేనేమి చేసినా నాఇష్టం నోరు తెరచితే బహు కష్టం
కాఫీ టీ కలబోసి తాగుతా పేపర్
బట్టలు వేసి తిరుగుతా
పెరుగన్నముతో జిలేబి తింటా
వేసవిలో స్వెట్టరుతో వుంటా
షూస్ వేయకనె నే టక్ చేస్తా
మండుటెండలో మరీ నడుస్తా llనేనేll
ఇడ్లీ పెరుగు కలుపుకు తింటా పూరీ కాకర కూరతో
తింటా
మిరపకాయతో లడ్డు నములుతా గులాబుజాముకు చారు
కలుపుతా
పాలు కలిపి విస్కీని తాగుతా తాగి తాగి ఏమేమొ వాగుతా llనేనేll
నల్లటి ముసుగును నేను
ధరిస్తా ముఖానికంతా కందెన రాస్తా
మాయిటికె నే కన్నము వేస్తా
పోపు పెట్టెలో డబ్బులు తీస్తా
దొంగ దొంగయని మరీ అరుస్తా
అడ్డము వస్తే నేను కరుస్తా llనేనేll
ట్రైను టికెటుతో బస్సునెక్కుతా అది ఆగకనే దుమికి
తీరుతా
విమానమున
విండోలు తెరుస్తా పరుపూ మంచము వేయమనేస్తా
నావనెక్కి నే కన్నము వేస్తా పెను తుఫానులో
పయనిస్తా llనేనేll
సంతాపము ప్రకటించే సభలో ప్రణయ గీతములు ఆలాపిస్తా
కర్నాటక సంగీత సభలలో తప్పెట
దరువులు నే వాయిస్తా
భరతనాట్య రంగస్థలమందున
మందునుగొట్టి చిందులు వేస్తా llనేనేll
నా ‘మాట - వరహాల మూట’ వ్యాసము నేను పైన తెలిపిన
వారికి అంకితము.
No comments:
Post a Comment