పాశ్చాత్య కాలగణన
https://cherukurammohan.blogspot.com/2013/10/blog-post_5.html
భారతీయ కాల గణన కుడ్యమును అంటుకొనక మునుపే ఈ పాశ్చాత్య కాల గణన గోడకు అతికించి యుండినాను. కారణము తెలియదు కానీ అది చాలామంది కంట పడలేదు . ఈ రెండు వ్యాసములు నేను కాగితములపై వ్రాసి టైపు చేయలేక యుంటే నా మిత్రుడు జి. నాగేశ్వరరావు, నాకంటే 4 సం. చిన్న, టైపుచేసి మీకు అందజేయడానికి ఎంతో దోహద పడినాడు.నాపై ఆయనకు గల అభిమానానికి నాడూ నేడూ ఋణపడియే వున్నాను. ఈ విషయములో ఎంతో సహకారాన్నందించిన పుత్రికా సమానురాలు చి.కుం. భావరాజుపద్మిని ,తనచేతనైన చేయూతనిచ్చిన
చి. మీగడ త్రినాధ్ లకు కృతజ్ఞత తెలుపుతూ అశీర్వదించకుండా ఎట్లుండగలను. చివరిగా మనసుపెట్టి చదివిన (దాదాపు 150 మందికి పైనే) మీ జిజ్ఞాసకు, నాపై అభిమానానికి నేనెంతో కృతజ్ఞుణ్ణి. మీ ప్రోత్సాహమే పెద్దలమైన (వయసు లోనే సుమా ) మాకు ఉత్సాహము.
పాశ్చాత్య శైలి కాలగణన చదివిన తరువాత తప్పక మన పూర్వుల ఘనత మీరు తప్పక తెలుసుకోన గలుగుతారు. పేరు కాంక్షించని వారి గొప్పదనము తెలియజెప్పుటే నా లక్ష్యము.
ఇది కూడా మనసారా చదివి మీరు మన సంస్కృతికి వాసి వన్నె తెస్తారని ఆశిస్తాను
కాల గణన (పాశ్చాత్య శైలి)
అనంతమైన
కాలాన్ని గణించడం అంత సులభం కాదు. ఐనా దానిని ఎంత నిర్దుష్టంగా మన పూర్వీకులు
గణించారో తెలుసుకొనుటకు ముందు పాశ్చాత్యుల క్యాలెండరు ను పరిశీలించుదాము.
క్యాలెండరు
అన్నమాట లాటిన్ భాషలోని క్యాలండీ నుండి పుట్టినది ఇచ్చిన అప్పులు మొదటి రోజున
వసూలు చేసుకొనుటకు అది ఏర్పరుపబడినది. తరువాత పౌర అనుశాసనమునకు ప్రజా ప్రయోజన
కార్యాచరణమునకు ఇది పాశ్చాత్యుల చేత ఉపయోగింప బడినది. దీనిని వీరు కాల క్రమేణ Almanac అని గూడా అన్నారు. నిజానికిది Al – manakh అంటే
వాతావరణ సూచిక అని అన్వయించుకొనవచ్చును. ఈ పదము Spanish Arabic భాషలకు చెందినది.
నేడు
మనముపయోగించే క్యాలాండరు రోము, ఈజిప్టు గ్రెగొరీ విధానాల కలయిక. రోము
రాజ్యాన్ని పాలించిన రోములస్ కాలంలో ఏడాదికి 304
రోజులుండేవి. సంవత్సరానికి 10 నెలలుండేవి. మార్చి నుండి
కొత్త సంవత్సరం మొదలయ్యేది. తరువాత కాలంలో దీనిని 10 నుండి 12 నెలలకు మార్చి, సంవత్సరమునకు 354 రోజులుగా నిర్ధారించినారు. పంపీలయస్ చక్రవర్తి క్రీ ||పూ|| 7వ శతాబ్దంలో తిరిగి సరి సంఖ్య మంచిదికాదనుకొని
355 రోజులు చేసినారు. క్రీ ||పూ||
153 లో సంవత్సరాన్ని జనవరికి మార్చటం జరిగింది.
అంటే
ప్రపంచమంతటా నూతన సంవత్సరము మొదలయ్యేది వసంత ఋతువు(spring) లో అంటే మార్చ్
నెలలో. ‘Spring’ అప్పుడే కదా వచ్చేది. తరువులు చివురులు
తొడుగుట అప్పుడే కదా. అంటే అది పుట్టుకతో పోల్చవచ్చు కదా! పండువారి పోవడము,
మట్టిలో కలవడము శిశిరము (autumn) కాదా! కాని
పాశ్చాత్యులు వేడుకలు spring (March) లో కాదని శిశిరం (autumn)
అంటే జనవరి లో చేయ మొదలిడినారు.
తరువాత
క్రీ ||పూ|| 46 వ సంవత్సరములో అప్పటి రోమన్ చక్రవర్తి యగు
జూలియస్ సీజరు ఈజిప్ట్ వెళ్ళినపుడు అక్కడి క్యాలెండరు విధానాలను గమనించి ఖగోళ
శాస్త్రజ్ఞుడైన సోసీజెనాస్ అనునతని సహయంతో రోమను సంవత్సరానికి 365.25 రోజులుగా నిర్ణయించి, ఫిబ్రవరి (అప్పుడు
సంవత్సరానికి చివరి నెల) నుండి 30 రోజులలో ఒక రోజును తీసి
మార్చి నుండి 5 వ నెలయైన పెంటలిస్ (పెంట=5) కు చేర్చి, ఏప్రిల్, జూన్,
ఆగష్టు, సెప్టెంబరు, నవంబరు
నెలలకు 30 రోజులనుంచి, ఫిబ్రవరి కి 29 రోజులు చేసి, సంవత్సరమును జనవరికి మార్చి, పెంటలిస్ పేరును తన పేరుతో జులై గా మార్చుకొని సంవత్సరారంభం జనవరి తో చేయ
ప్రారంభించినారు. 0.25 తేడాను, 4
సంవత్సరములకు ఒక రోజు ఔతుంది కాబట్టి దానిని ఫిబ్రవరి నెలకు కలిపి (29+1)
30 రోజులు చేయటం జరిగింది. దీనిని leap year అన్నారు.
సీజరు
మేనల్లుని కొడుకైన ఆగస్టస్స్ సీజరు 27 B.C. లో రోము చక్రవర్తియైన
పిమ్మట సెక్ష్టలిస్ అను నెలకు (సెక్స్ట్టట =6) తన పేరుతో
ఆగస్ట్ అని పెట్టి దానికి ఫిబ్రవరి నుండి ఒక రోజు తీసి, అంటే
దానిని 28 రోజులుగా చేసి, ఆగష్టుకు
కలిపి దానిని కుడా 31 రోజుల నెలగా చేసినాడు. లీపియరును ౩
సంవత్సరములకు మార్పు చేసి , ఫిబ్రవరి కి కలిపేవారు.
తరువాత
కాలంలో రోజుల లెక్కలో కచ్చితత్వము పెరిగి సంవత్సరానికి 365.242199 రోజులు చేసినారు. ఇందువల్ల ఏడాదికి 11 ని||14సె|| తేడావస్తుంది. దీనిని 13
వ పోపు గ్రెగొరీ VIII క్రీ ||శ||
1582 లో గ్రెగోరియన్ క్యాలెండరు పేరుతో ప్రవేశ పెడుతూ లీపియర్ ను
తిరిగి 4 సంవత్సరములకొకసారి చేస్తూ ఫిబ్రవరి కి 1 రోజును కలిపేవారు. అట్లు చేయుటవలన ఒక వర్షమునకు .007801 రోజు ఎక్కువగా వచ్చేది. దీనిని చక్కబరచుటకు 400 తో
భాగింపబడే శతాబ్ది సంవత్సరములు మాత్రమె లీపు సంవత్సరములుగా తీసుకొని 4చేత భాగింపబడినవి తీసుకొనకుండా వదిలి పెట్టినారు. ఈ మార్పును చెయుటకుగనూ October
4, 1582 తరువాత, అక్టోబరు 15, 1582 గా ప్రకటింపబడినది. ఆ 10 రోజులు, కాలముతో ఆడిన క్యాలెండరు ఆటకు,బలియైపోయినాయి.
అందువల్ల వారి పండుగ తేదీలకు వారు పండుగ చేసుకొను సందర్భములకు పొంతన లేదని వారి
శాస్త్రజ్ఞులే వాక్కణించుచున్నారు.
ఇక
వారు నెలలకు పెట్టిన పేర్లను గూర్చి తెలుసుకొందాము.
జనవరి:
జానస్ అన్న రెండుతలల దేవుడు స్వర్గంలో ప్రధాన ద్వారం వద్ద వుంటూ ఒక తలతో జరిగిన
వర్షమును ఒక తలతో జరగబోయే వర్షమును చూస్తూఉంటాడట. ఆయన పేరుతో ఈ నెల ఏర్పడింది. 29
రోజులు కల్గిన ఈ నెల 31 రోజుల నేలగా జూలియస్ సీజరు చేసినాడు.
ఫిబ్రవరి:
రోమన్ల పండుగ ఫిబ్రువా అన్నది లూపర్కాస్ అన్న దేవుని పేరుతో పునీతుడగుటకు (to get purified) జరుపుకుంటారు. దీనికి కొంతకాలం 23, 24 రోజులుండేవి.
తరువాత 30 రోజులై ఆతరువాత జూలియస్ సీజరు, అగస్తస్ సీజరు ల వల్ల 28 రోజులై కూర్చుంది.
మార్చి:
మార్స్ రోమనుల యుధ్ధ దేవత. ఈయన ఒక చేతితో శూలం మరొక చేతితో డాలును ధరించి రెండు
గుర్రాలమీద వస్తాడు. ఈయన పేరుతో ఈ నెల ఏర్పడింది.
ఏప్రిల్:
రోమన్ల వసంత దేవత పేరు అమ్నియో ఏప్రిట్. ఈమెను రోమన్లు ఎంతో అందమైనదిగా, పునరుజ్జీవనకు
నాందిగా భావించుతారు.
మే:
భూగోళాన్ని తన భుజస్కంధాలపై మోసే అట్లాసు యొక్క ఏడుగురు కూతుళ్ళలో మేయో ఒకటి.
అట్లాసు ఈ ఏడు మందిని ఏడు నక్షత్రములుగా మార్చివేసినాడు (మన సప్తర్షి మండలం)
దీనిని అంటే ఈ నెలను వయసులో పెద్దవాళ్ళకు (maiores) అంకితమిచ్చినారు.
జూన్:
జూపిటర్ భార్య జూనో ఈ జూన్ మాస స్థానానికి ఈవిడ జూనియస్ అన్న దేవునితో
పోరాడుతుంది. వారిరువురి పేర్లతో జూన్ వచ్చింది. దీనిని యువతకు (juniores) అంకితమిచ్చినారు.
తరువాత
నెలల పేర్లు పెంటలిస్,
సేక్స్టలిస్, సెప్టంబర్,అక్టోబర్,
నవంబర్, డిసెంబర్ గ ఉండేవి. 5, 6 నెలలైన పెంటలిస్, సేక్స్టలిస్ లను జూలై, ఆగష్టులుగా తమ పేర్లతో జూలియస్, అగస్టస్ సీజర్లు
మార్చుకొన్నట్లు మనము చెప్పుకొన్నాము. 7వ నెలనుండి 10వ నెలవరకు పేర్లు అట్లే వుండిపోయినాయి.
సెప్టెంబర్
– సెప్ట్ అంటే సప్త 7వ నెల
అక్టోబర్
– అక్ట్ అంటే అష్ట 8వ నెల
నవంబర్
– నవ అంటే నవ 9వ నెల
డిసెంబర్
– డెస్సి అంటే దశ 10వ నెల
దీనిని
బట్టి ఈ మార్పులకు ముందు 11వ నెలగా జనవరి, 12వ నెలగా ఫిబ్రవరి వున్నట్లు రూఢియై
పోయింది.
ఇక
వారములైన సండే,
మండే .. .. .. .. సాటర్ డేలను మన వారముల పేర్లను వారు వారి
భాషలలోనికి మర్చుకొన్నావే.
ఇన్ని
మార్పులు చేర్పులు కూర్పులు జరిగిన తరువాత కుడా వారి కాలమానము భుభ్రమణముతో పోల్చిన
26 సెకన్ల తేడా వున్నది. ఆ సెకన్లు 3323 సంవత్సరములకు
ఒకరోజు ఔతుంది. దానిని ఆ సంవత్సరములోని ఒక నెలకు (బహుశ ఫిబ్రవరికేనేమో) కలుపుకొన
వస్తుంది.
వాస్తవ
కాల గణన కొరకు తమ తప్పులు తాము తెలుసు కొనుచూ కృషి చేసిన శాస్త్రజ్ఞులు కల్గిన ఈ
రోమన్ క్యాలెండరు తప్ప,
ప్రాచీన నాగరికత కలవని చెప్పుకొనెడు ఎన్నోపాశ్చాత్య దేశములు వారి
వారి దేశ కాలానుకూలంగా తయారు చేసి వాడుకొన్నానూ, కాలానికి
కాలొడ్డి నిలువలేకపోయినవి. మయుల క్యాలెండరు లోని చివరి దినమైన 21 డిసెంబరు 2012 న యుగాంతము కాలేదు కదా!
చివరిగా
ఒక మాట చెప్పి ముగించుతాను. మనకు రోజు అనేది ఉదయం (ఇంచుమించు) 6గం.
లకు ఔతుంది. ఈ విషయాన్ని పాశ్చాత్యులు తమ
కేలెండరునకు
అనుకూలముగా మార్చుకోలేక యదా తధంగా తీసుకొన్నారు. మరి వాళ్ళకు రోజు రాత్రి 12 కు
గదా మొదలయ్యేది అంటారేమో. వాళ్ళకు మనకు కాల వ్యత్యాసము ఇంచుమించు 6 గంటలు. మనకు 6గం. ఉదయమైతే వాళ్ళకు అర్ధరాత్రి 12గం. కదా.
డిసెంబర్
25 న క్రీస్తు పుట్టుక జరుగలేదు. జనవరి 1 క్రొత్త
సంవత్సరము కాదు. ఇప్పటికైనా మనసు పెట్టి ఆలోచించితే మన పూర్వీకుల ప్రతిభను
పునరుజ్జీవింప జేయ గలము.ఇకనైనా క్రొత్త సంవత్సరము ఉగాదితో మొదలౌతుందన్న
వాస్తవాన్ని భాతీయ కాలగణన చదివిన తరువాత ఆకళింపు చేసుకొని ఆప్రకారంగానే మొదలు
పెడతారని ఆశిస్తున్నాను.
మాటలలో
ఏదన్నా చొరవ తీసుకోనివుంటే తప్పుగా తలవరని ఆశిస్తాను.
స్వస్తి
No comments:
Post a Comment