Thursday, 13 July 2017

భీష్ముడు

భీష్ముడు  -- 1వ భాగము
భీష్మ జననము
భారత ఇతిహాసమునకు ముందు కాలములో దేవతలగు అష్టవసువులు తమ భార్యలతో ఒకసారి భూమిపైకి విహారమునకు వస్తారు. అది వశిష్ఠ మహర్షి ఆశ్రమ ప్రాంతము. ఆ ప్రకృతి రామణీయకతకు ముగ్దులౌతారు వారు. అంతలో మహర్షి అల్లారుముద్దుగా చూసుకొనే 'నందిని' , కామధేనువు సంతానముగా పురాణ వాక్యము, వారి కంట పడుతుంది.ఆ ధేనువు అందమునకు ముగ్ధయయిన, అష్టవసువుల్లో కడపటివాడయిన ప్రభాసుని భార్య ఆ ధేనువు తనకు కావలెనంటుంది. వసువులందరూ వారించినా వినదు. భార్య మాటకు కట్టుబడి ఆ దేనువును తెస్తాడు ప్రభాసుడు. నందిని కూడా దైవంశ సంభూత కావున జరగబోయే మహాభారత సమరానికి తన పాత్రను ప్రాతిపాదికగా చేసింది.
వశిష్ఠుడు పర్ణశాలకు వచ్చి తన దివ్య దృష్టిచే జరిగినది గ్రహించి అష్టవసువులకు మానవులై పుట్టమన్న శాపాన్నిస్తాడు. విషము తెలిసిన వసువులు తమ తప్పు మన్నించమని ఆయన పాదాలపై బడితే ఒక్క ప్రభాసుడు తప్ప తక్కిన వారంతా పుడుతూనే మరణించి యథాస్థానము చేరుతారంటాడు. వారుకూడా సంతసించి వెళుతూ తమతల్లిగా గంగాదేవి కావలెనన్న తలంపుతో ఆమెను అర్థించుతారు. ఆమెయు వల్లెయని ద్వాపర యుగములో అది నెరవేరగలదని చెబుతుంది.
ద్వాపరమున హస్తినాపురి మహారాజయిన శంతనుడు గంగా తీరమునకు వేటకు వెళ్ళినపుడు గంగ ఒడ్డున ఒక స్త్రీనిచూచి ఆమె దివ్య సౌందర్యమునకు మైమరచి ఆమె వద్దకు వెళ్లి తనను గూర్చి చెప్పుకొని, పెళ్ళియాడమని అర్థించుతాడు.
అందులకు గంగ "మహారాజా! మీరు మీరుకానీ వేరేవరయిన కానీ నాగురించి, నాకులమును గూర్చి ప్రస్తావించ కూడదు,నేనేమిచేసిన కారణమును గూర్చి ప్రశ్నించ కూడదు, నాపై కోపపడుట, అప్రియములగు మాటలు మాటలాడుట చేయ కూడదు. అట్లు జరిగిన వెంటనే నేను మిమ్ము వదలి వెళ్ళిపోతాను. ఇందుకు కట్టుబడేవిధముగా వుంటే పెళ్ళి చేసుకొంటా"నంటుంది ఆమె. మొహపరవశుడైవున్న రాజు ముందువెనుక ఆలోచించకుండా ఆమె మాటకు సరేనని ఆవిధముగా ప్రమాణము చేస్తాడు.
ఇరువురికీ వివాహమయి కొంత కాలము సుఖించిన పిమ్మట ఆమెకు పుత్రోదయము జరుగుతుంది. ఆమె వెంటనే ఆ శిశువును గంగలో కలిపి తిరిగి వస్తుంది అమె. రాజు తన మాటకు కట్టుబడి బాధను దిగమ్రింగి ఊరకుండిపోతాడు. అదేవిధముగా ఇంకా ఆరు పర్యాయములు జరుగుతుంది. రాజుది మౌనవ్రతమే! ఎడవ పర్యాయము కూడా మగశిశువును కని పారవేయుటకు ఉద్యుక్తురాలగుచున్న ఆమెతో "ఓ కఠోర మానసీ! పసికందును గంగపాలు చేయుటకు నీకు మనసెట్లు వచ్చుచున్నది" అని అంటాడు. ఆమె వెంటనే రాజునకు తన ప్రమాణమును గుర్తునకు తెచ్చి, తాను విడిపోతున్నట్లు తెలుపుతుంది.
ఇంతవరకు తనను గురించి ఏమాత్రము అడగని రాజుకు తన వృత్తాంతము తెలుపదలచుకొని ఈవిధముగా చెబుతుంది" నేను గంగానది ఆధిదేవతను. వశిష్ఠ శాపముతో అష్ట వసువులు మన పుత్రులైనారు. కానీ ఎదవవాడు గోచౌర్యము చేసినాడు కావున మానవునిగా జీవితము అనుభావించుతాడు. మిగతావారికి పుట్టిన వెంటనే మరణించి శాప విముక్తులగులాగున ఋషి శాపోపశమనము కలిగించినాడు కావున వారు విముక్తులైనారు. ఈ బాలకుని నావద్దనుంచుకొని సకల శాస్త్ర, శస్త్రాస్త్ర పారంగతుని చేసి ఒప్పజేబుతా"నని తెలిపి తనతో తీసుకు వెళుతుంది. ఆ బాలకుని పేరే సత్యవ్రతుడు. తదనంతర కాలములో భీష్ముడౌతాడు.

మిగిలినది మరోసారి .....

భీష్ముడి శపథం (భీష్ముడు -- 2 వ భాగము)
ఒకరోజు శంతనుడు యమునా నదీ తీరంలో విహరిస్తున్నాడు. ఎక్కడో దూరము నుండి వచ్చు సుగంధ వీచికలు నాసికాగ్రమునుతాకి ఆయనను పరవశింపజేస్తున్నాయి. మనసు అదుపుతప్పింది. మనోవికారమునకు బానిసయైన శంతన మహారాజు  వైపుగా వెళ్లగా, అక్కడ ఒక అందమైన సుందరిని  చూచుట తటస్థించుతుంది. ఆమె శరీర సౌష్ఠవమును, రూప లావణ్యమును చూసి అప్రతిభుడౌతాడు. అంతలో తేరుకొని ఆవిడతో "ఓ సుందరీ, నీవు ఎవరు? ఒంటరిగా ఇక్కడ ఎందుకు పడవ నడుపుతున్నావు?" అని అడుగుతాడు. అప్పుడు ఆమె వినయ వదనయై ఆయనతో " రాజా!  నేను దాశ రాజు కూతురిని. నాపేరు సత్యవతి. తండ్రిగారి ఆజ్ఞ మేరకు పడవ నడుపుతున్నాను" అని బదులు చెప్పింది. శంతనునికి ఆమెను వివాహం చేసుకొన వలెనని  కోరిక కలిగింది. ఆవిషయమును ఆమెతో వెల్లడించితే ఆమె, తానూ తను తన తండ్రి ఆజ్ఞానువర్తిని అని చెప్పింది.

వెంటనే శంతనుడు దాశ రాజు దగ్గరకు వెళ్లి, తన కోరిక వెల్లడించినాడు. అప్పుడు దాశరాజు "మహారాజా, ఆడపిల్ల పుట్టిన తరువాత యుక్త వయసుకు వచ్చిందంటే  ఒక అయ్య చేతిలో పెట్టడం సంప్రదాయం. నా కుమార్తెకు మహారాజువయిన నీకన్నా  మంచివరుని నావంటి ఒక పల్లెపెద్ద తెచ్చుటకు వీలేకాదు. మీకు మీరుగా వచ్చి అడిగినపుడు  ఇవ్వడానికి అభ్యంతరము నాకేముంటుంది. కానీ  నాది ఒక చిన్న విన్నపము" అని అన్నాడు దాశరాజు. "అదేమిటో చెప్ప" మని అడిగినాడు శంతనుడు. "నా కుమార్తెకు పుట్టబోయే సంతానానికి రాజ్యాధికారం దక్కాలి" అని కోరినాడు దాశరాజు. దానికి శంతనునకు  ఒప్పుకొన మనస్కరించలేదు. అత్యంత యోగ్యుడగు సత్యవ్రతునికి  తప్ప అన్యులకు రాజ్యభారమునప్పజెప్పు ఆలోచనే లేదు ఆయనకు. అందువల్లవేరేదయినా కోరుకోమన్నాడు శంతనుడు. దాశరాజు తన పట్టు సడలించలేదు.
విషణ్ణ వదనముతో  శంతనుడు హస్తినాపురానికి తిరిగి రావటం జరిగింది. మరులుగొన్న మనసుకు బుద్ధి చెప్పిన మాటలు అరణ్యరోదనములైనాయి.
 శంతనుడు రాచకార్యాలను మనసారా చూడలేక పోవుటయేగాక , నిరంత విచారతాప్త హృదయుడైయున్దసాగినాడు. గాంగేయుడు దీనిని కొంత కాలముగా గమనించుట చేత, ఒకానొక రోజు తండ్రివద్దకు వెళ్లి మనోవేదనకు కారణమునడిగినాడు. శంతనుడు చెప్పలేక చెప్పలేక తన మనోగతమును విప్పిచేప్పినాడు. తండ్రిని ఓదార్చి, విషయమును మంత్రులచే సమగ్రముగా తెలుసుకొని, దాశరాజు దగ్గరకు వెళ్ళి,"దాశరాజా, నీ కుమార్తెను నా తండ్రి శంతనునికి ఇచ్చి వివాహము చేయుము" అని అడిగినాడు.
" తండ్రి కొరకు కన్యను అడగడానికి వచ్చిన ఒక ధర్మాత్ముని చూసిన నా జన్మ ధన్యము. ఈ కన్య సామాన్యురాలు కాదు. ఉపరిచర వసువు వీర్యానికి జన్మించింది. ఆ ఉపరిచర వసువు ఈ కన్యను శంతన మహారాజుకే ఇమ్మని చెప్పినాడు. అందుకే ఇది వరకు దేవలుడు అడిగినా ఇవ్వలేదు. కాని నాది ఒక కోరిక. నా కూతురికి పుట్టే పుత్రులు సవతి కుమారులవుతారు. కాబట్టి ఆ దోషం లేకుండా చెయ్యి" అని చెప్పినాడు దాశరాజు.
గాంగేయునికి దాశరాజు ఆంతర్యం అర్థం అయింది. వెంటనే అక్కడ ఉన్న వారిననందరిని పిలిచి "ఇక్కడ చేరిన రాజులు అమాత్యులు, ప్రజలు అందరూ వినండి. నా తండ్రికి కాబోయే భార్యమరియు నాకు మాత్రుసమానురాలునుయగు ఈ సత్యవతికి పుట్టబోయే పుత్రుడే ఈ రాజ్యానికి వారసుడౌవుతాడు. అతడే కురువంశ ప్రభువు" అని చాటుతాడు. కాని దాశరాజు "గాంగేయా, నీవయితే  రాజ్యాధికారాన్ని వదులుకున్నావుగానీ  నీ మాటను నీ సంతు అంగీకరించక పోవచ్చు కదా?" అని సందేహమును వెలిబుచ్చినాడు.
అప్పుడు సత్యవ్రతుడు "దాశరాజా నాకు పుత్రులు కలిగితేనే కదా ఆ సమస్య వచ్చేది. అందుకే నేను ఈ రోజు నుండి అవివాహితునిగా బ్రహ్మచర్య దీక్షనుబూనుతాను.   నీ కూతురిని  ఇప్పుడు ఇచ్చి నా తండ్రికి వివాహం చెయ్యడానికి నీకు అభ్యంతరం లేదుగదా" అని అన్నాడు .
గాంగేయుడు చేసిన ఈ భీషణమైన ప్రతిజ్ఞ చేయుటచే చరిత్రలో భీష్మునిగా చిరస్థాయిగా నిలచిపోయినాడు. జయజయ ద్వానములనడుమ దేవతలు పూలవర్షము కురిపించినారు. 
దాశరాజు వెంటనే తన కూతురు సత్యవతిని శంతనునికి ఇచ్చి వివాహం జరిపించినాడు. తన కుమారుడైన గాంగేయుడు, తన కోర్కె తీర్చడం కోసం చేసిన ఈ త్యాగానికి విభ్రాంతిచెంది శంతనుడు విచలిత మనస్కుడు కాగా, భీష్ముడు తండ్రితో " తండ్రీ ఒకకొడుకు తలిదండ్రులకు వుండీ లేనట్లే! మీరు వివాహము చేసుకొనుట సమంజసము.  ఈ రాజ్యాధికారమును ఎవరు చేబూనినా  నేను జీవితాంతమూ రక్షణకర్తగా వుంటాను" అన్నాడు. సంతుష్టాంతరంగుడయిన శంతనుడు "కుమారా, ఏదయితే మానవులకు అసాధ్యమో అట్టి ఒక వరమును నీకు  ప్రసాదిస్తున్నాను. నీవు స్వచ్ఛంద మరణమును అనుగ్రహించుచున్నాను." అని అన్నాడు. కాలాంతరములో యోజనగంధి యనబడు సత్యవతికి శంతనుని వలన చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అన్న కుమారులు కలిగినారు. శంతనుడు కాలధర్మము చెందినాడు. రాజు కాకున్నా రాజ్య భారము భీష్మునిపై బడింది.

సత్యవతికి యోజనగంధియన్న పేరు ఎందుకు వచ్చినది అన్న వృత్తాంతమును గూర్చి మరొకసారి మాట్లాడుకొందాము. 
సత్యవతీ వృత్తాంతము  (భీష్ముడు --3)
చేది రాజ్యమునకు ప్రభువైన వసువు యొక్క వీర్య పతనముచే అద్రిక అన్న పేరుగల అప్సరస శాపవశాత్తు చేప రూపములో వుండగా, ఆ చేపకు జన్మించిన మగ ఆడ శిశువులు కలుగుతారు. వారిరువురిలో సత్యవతి ఒకటి . జాలరులు ఆమెను, ఆ పిల్లవానిని తమ ప్రభువైన దాశరాజునకు అప్పగించుతారు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దయి మస్త్య దేశపు రాజవుతాడుగానీ సత్యవతి మాత్రము దాశరాజు వద్ద పెరుగుతుంది. చేపలు పట్టుట వృత్తిగా కలిగిన ఇంట పెరుగుటయేగాక అదేవృత్తి చేపట్టుటవల్ల ఆమె శరీరమంతా చేపల కంపు కొడుతూ వుండుటచే ఆమెకు మత్స్యగంధి అన్న పేరుఏర్పడుతుంది.
ఒకపరి తీర్థయాత్రలకు బయలుదేరిన వశిష్ఠ పౌత్రుడు, శక్తి కుమారుడునగు పరాశర మహర్షి  యమున సమీపమునకు వచ్చి నది దాటుటకు మత్స్యగంధి నావలో యెక్కుట జరిగినది. నావ యమున మధ్యకు వచ్చినది. పరాశరుడు మత్స్య గంధి పై మరులుకొన్నాడు. దైవ ఘటన అంటే ఇదే కామోసు. మహనీయుల ఆంతర్యము మనకు అందుబాటునకు రాదు. ఆయన తన కోరికను సత్యవతికి ఎరుకపరచినాడు. ఆమె కూడా అవనత శిరస్కురాలై తాను  మత్స్య కులమునకు చెందినదని, తన పితరుని అనుమతిని గైకొనవలసి ఉంటుందని చెబితే   ఆయన ఆమెను  యొజన గంధిగా మార్చి.తన కన్యాత్వము చెడకుందునట్లు వరమొసగి ఆమెను ఒప్పింపజేసినాడు. ఆప్పుడు సూర్యుడు నడి నెత్తిన వుండటము వల్ల తనకు సిగ్గుగా వున్నదన్నది అని ఆవిడ అంటే ఆయన  ఆకసమును ప్రగాఢ మేఘావృతము జేసి యమున మధ్యయందేర్పడిన  ద్వీపములో ఆమెతో వాంఛా నివృత్తి చేసుకొని  సద్యో గర్భమున ఆమెకు పుత్రోదయము కలిగించెను. ఆబాలకుడు నల్లనివాడగుటచే కృష్ణ శబ్దమును, ద్వీపమునందు జన్మించుతచే ద్వైపాయనుడగుచూ కృష్ణద్వైపాయనునిగా పిలువబడినాడు. కాలాంతరమున వేదములను విభజించి ఆయన వేదవ్యాసుడయినాడు. అఖండ ప్రఖ్యాతుడయి ఆబాలుడు వెలుగొందుతాడని చెప్పి పరాశరుడు తనదారిని పోగా వ్యాసుడును తల్లికి నమస్కరించి తనను యెప్పుడు తలచిన అప్పుడు వత్తునని వరమోసగి తపమునకు వెడలినాడు.  
Top of Form

Bottom of Form
సత్యవతీ, శంతనులకు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే బిడ్డలు కలిగినారు. శంతనుని మరణానంతరం చిత్రాంగదుడు రాజయినాడు. యువకుడూ, దురహంకారి అయిన చింత్రాగదుడు ఒక రోజు అడవికి వెళ్ళటం తటస్తించింది. అదేపేరు కలిగి అసాధారణమైన సామర్ధ్యముతో నున్నఒక గంధర్వుడు అక్కడకు  వచ్చి యుండినాడు. ఇద్దరూ ఒకరికొకరు ఎదుటపడి గంధర్వుడు నీవెవరని ఆడుగగా, నా పేరు చిత్రాంగదుడు అని గర్వంగా చెప్పినాడు శంతన పుత్ర చిత్రాంగదుడు. ఇరువురికీ మాటామాట పెరిగి యుద్ధము వరకు దారితీయగా కొన్ని నెలలు జరిగిన ఆ పోరాటములో శంతనపుత్ర చిత్రాంగదుడు అసువులు బాసినాడు.
 తరువాత భీష్ముడు విచిత్రవీర్యుని రాజుగా చేసినాడు. విచిత్రవీర్యుడు భోగాలాలసుడై వివాహమునకు విముఖత చూపేవాడు.
ఆతని గుణగణములగూర్చి మరియు భీష్ముని బ్రహ్మచర్యమును గూర్చి విన్న కాశీరాజు తన కుమార్తెలు అంబ,అంబిక, అంబాలికలకు స్వయంవరము ప్రకటించినాడు కానీ హస్తినాపురికి ఆహ్వానము పంపలేదు.
కాశీరాజు ఆహ్వానమును పంపనందుకు ఆగ్రహోదగ్రుడైన భీష్ముడు స్వయంవరమునకు వెళ్లినాడు. స్వయంవరములలో సాధారణముగా రాజులకు, యోధులకు మాత్రమే ఇందులో అవకాశం వుంటుంది. రాజకన్యలు తమ తమ భర్తలను తామే ఎంచుకుంటారు, స్వయంవర సమయమునకు  ముగ్గురు రాజ కన్యలకు ఏర్పాటుచేయడం జరిగింది అంబ, అంబిక, అంబాలిక వీరికి 18,17,ఇంకా 15 సంవత్సరాల వయస్సు. అంబ అప్పటికే సాళ్వరాజును ప్రేమించి యుండినది. అందరికన్నా పెద్దది కావడంవల్ల ఆమెకు ముందుగా ఎంచుకోవడానికి అవకాశం దొరికింది. రాజకుమారి పూలమాల తీసుకుని అందరినీ చూసి తను భర్తగా ఎన్నుకున్న వారి మెడలో పూలమాల వేయడం స్వయంవరంలో ఒక సాధారణ పద్ధతి. అంబ సాళ్వరాజు వద్దకు వెళ్ళి అతని మెడలో పూలమాలను వేసింది. ఆవిషయము భీష్మునకు ఎరుకలేదు.
అతడు గొప్ప వీరుడు కాబట్టి ఇతర వీరులు భయపడినారు. కానీ వారికందరకీ అతనికి బ్రహ్మచర్య వ్రతము ఉందని, అతను పెళ్ళి చేసుకోడని తెలుసు. “ఈయనకు  ఇప్పుడు భార్య కావలసి వచ్చిందా లేక కురు వంశంలో భార్యను గెలుచుకోగల వీరుడు లేక తను స్వయంగా రావలసివచ్చిందా?” అంటూ అతనిని రెచ్చగొట్టటం ప్రారంభించినారు, తమ గుసగుసలతో! తన వంశాన్ని తక్కువగా మాట్లాడేసరికి భీష్ముడు కోపంతో రెచ్చిపోయినాడు. ముగ్గురు రాజకుమార్తెలను ఎత్తుకుపోవడానికి నిర్ణయించుకున్నాడు. అక్కడున్న వీరులతో యుద్ధం ఆరంభమయ్యింది, భీష్ముడు అందరినీ ఓడించినాడు, సాళ్వుడు అంబ కోసం పోరాడినాడు కానీ భీష్ముడు సాళ్వుని ఓడించి అతనిని అవమానించి ముగ్గురు రాకుమార్తెలను తన రథము నెక్కించుకొని అడ్డమొచ్చిన రాజులను అడ్డదిడ్డముగా నరికి తనవెంట గొనిపోయినాడు. అంబ సాళ్వుని ప్రేమించినట్లు చెప్పుటతో ఆమెను వదలివేసినాడు, కానీ సాళ్వుడు ఆమెను తృణీకరించినాడు. ఆమె తిరిగీ భీష్మునివద్దకు వెళ్లి పెళ్ళియాడమని అర్థించితే ఆయన తన శపథమును ఆమెకు తెలియజేసినాడు. అన్నివిధాలా భంగపడిన అంబ తన పగను భీష్మునిపై తీర్చుకొన ఈశ్వరునిగూర్చి తపమొనరించ, అడవులకు వెళ్ళింది.
కామలాలసుడైన విచిత్రవీర్యుడు కొద్దికాలానికే అనారోగ్యంతో, నిస్సంతుగా మరణించినాడు.
మిగిలినది 4వ భాగములో చదువుదాము.......
భీష్ముడు -- 4 






Wednesday, 28 June 2017

స్నేహం--दोस्ती


స్నేహం

ఇడుములలో నవ్వువాని నేడ్పించగ  నీ తరమా
అంబునిధిన  అలలనెల్ల అణచివేయ  నీ తరమా
మైమెరుగులగాంచిమనిషిమంచినెంచ నీ తరమా
పరిమళమాస్వాదించక   పూవు  చేర  నీ తరమా
పలుగతుకుల  బాటలోన  బండినడుప నీ తరమా
పలుకు  తేనె లోన  విషము  పసిగట్టగ నీతరమా
పెప్సీ  కోకుల  కెమికల్స్  పేరు  చెప్ప నీ  తరమా
అన్నీ  అనుమానాలే  అవి   తీరగ   నీ   తరమా
చెడుగు మంచి నెంచకనే  చెలిమి చేయ  నీతరమా
తీయనైన  స్నేహమంటె  తెలియ జేయ  నీ  తరమా


दोस्ती
गम में हसने वालों को रुलाया नहीं जाता
लहरों से पानी को हटाया नहीं जाता
होने वाले होजाते हैं खुदी दिल से अपने
किसी को कहकर अपना बनाया नहीं जाता
फूल से पहले खुशबू को तो देखो
करनेसे पहले काम को तो देखो
किसी के रूप में दीवाना न बनो
सूरत से पहले उसके दिल को तो देखो
सम्झादो अपने यादोंको
वो बिन बुलाये पास आया करती है
आप तो दूर रहकर सतातेहो मगर
वो पास आकर रुलाया करती है

चेरुकु राम मोहान् राव्

Friday, 23 June 2017

అనులోమ విలోమ శ్లోకము

అనులోమ విలోమ శ్లోకము

దైవజ్ఞ సూర్య పండితుడనే మహానుభావుడు “రామకృష్ణ విలోమ కావ్యం” అన్న కావ్యాన్ని వ్రాసినాడని ఆరుద్ర గారు తమ సమగ్రాంధ్ర సాహిత్యములో తెలియజేసినారు. ఇందులో, ప్రతి శ్లోకం రామకృష్ణు లిద్దరి గురించి చెప్పటమే అన్నది పేరును బట్టి మనకు అర్థమౌతూనే వుంది. కానీ ఇందులో మొదటి పాదము రాముని గూర్చి అయితే రెండవది కృష్ణుని గూర్చి. అంతకు మించిన ఆశ్చత్ర్య కరమగు విషయమేమిటంటే మొదటి పాదమును త్రిప్పి వ్రాస్తే రెండవ పాదమోస్తుంది. అంటే శ్లోకాన్ని క్రింది చివరి నుండి పై పాదము ప్రారంభము వరకు పై పాదము ప్రారంభము నుండి క్రింది పాదము చివరి వరకు ఎటు చదివినా నుండి క్రిందికి ఎటు చదివినా  చదివినా ఒకే విధంగా ఉంటుంది. ఈ శ్లోకమును చూడండి.
“తం భూసుతా ముక్తి ముదార హాసం వందే యతోలవ్య భవం దయాశ్రీః
శ్రీయాదవం భవ్య లతోవదేవం సంహారదాముక్తి ముతాసుభూతం”

ఇందులో మొదటి పాదాన్ని తిరగేస్తే, రెండవ పాదం వస్తుందని తేలిగ్గా గ్రహించవచ్చు. ఇటువంటి శ్లోకాలతో ఒక కావ్యం రాయటం గొప్ప విషయమనే చెప్పాలి.

ఈ రీతిలో మనము తెలుగులో కూడా పద్యాలను చూడవచ్చు. ఇందులో రస ప్రాధాన్యత తక్కువగా వున్నా కవి చమత్కృతి పాండితీ ప్రతిభ మనకు తెలియ వస్తాయి.

రాయలవారి లోకానుశీలన

వానలు కురిసే వేళ- రాయలవారి సామాజిక స్పృహ!
మ: గురుగుం జెంచెలి తుమ్మి లేఁదగిరిసాకుం దింత్రిణీ పల్లవో
త్కరంముం గూడి పొరంటి నూనియలతో ,కట్టారు కుట్టారు టో
గిరముల్మెక్కి , తమిం బసుల్ బొలముఁబోఁ గ్రేపుల్ మెయింనాక, మే
కెరువుం గుంపటి మంచమెక్కిరి ప్రభుత్వైకాప్తి రెడ్డజ్జడిన్ ;
ఆముక్త మాల్యద- చతుర్ధాశ్వాసము134 పద్యం: కృష్ణదేవరాయలు.
రాజుకు ప్రజలే ప్రాణము. రాజు రుజు మార్గములో వుంటే ప్రజలూ అదే మార్గములో వుంటారు. రాజు ప్రజల కష్ట సుఖములు స్వయముగానూ చద్మ వేశామునాను, చారులవలనూ, ముఖ్యాదికారులవలనాను, చెలికత్తెల నుండి రాణులు సంగ్రహించిన విషయములను రాణుల ద్వారానూ సంగ్రహించి ప్రజల కష్టములను తీరుస్తూ ఉంటాడు. ఇక రాయలవారి విషయమైతే చెప్పనవసరము లేదు.
ఆయనా ఏరోజో మారు వేషములో తన ముఖ్య సేవక మిత్రుని తోడు చేసుకొని జనస్రవంతిలో అడుగిడిన రోజు, బహుశ, పడిన వానను ఎంత ఏకాగ్రతతో గమనించి మనకు ఆముక్త మాల్యద ద్వారా అందించుచున్నారో చూడండి.
రాయలసీమ పల్లెలలో జీవించు రెడ్లు ఎక్కువగా భూస్వాములు లేక వ్యవసాయదారులు.హోరున వానలుగురియుచుండ పశువులను పొలమునకు మేతకుఁ దోలి నిశ్చింతగా నింటిలో కంకటిపై (మంచము) శయనించుచున్నారట. వారిభార్యలు అంతకుమున్నే గురుగు, చెంచెలి, తుమ్మి ,లేఁత తగిరిసి ఆకులను, చింత చిగురుతో కలిపి నూనెవేసి యుడికించి వేడి వేడి యాకూరను ఆవిరులు వెదజల్లుచున్న ఆరిగ బియ్యపు టన్నమున వడ్డింప సుష్ఠుగా భోజనమొనర్చి, వెచ్చదనమునకై మేక యెఱువుతో నింపిన కుంపటిని రగిలించుకొని, యాకుంపటిని మంచముక్రిందుగా నుంచి మంచ మెక్కి నిదురింప సాగినారట. పొలమునకు పాడిపశువులను దోలగా నింట నున్న లేఁగ దూడలు శరీరములను నాకుచుండగా నిశ్చింతులై మత్తుగా నిద్రతో జోగు చున్నారట. అవునుమరి! వారికి వారేప్రభువులు వారినడిగెడి వారెవ్వరు? సైరిక జీవనమంత స్వతంత్ర జీవనము మరియొకటి యుండదుగదా!
రాయల సీమలోని రెడ్డి కులజులకు మెట్ట వ్యవసాయము, గొఱ్ఱెల పెంపకము కులవృత్తులు. దానినే యీపద్యమున రాయలు నిరూపించినాడు. పూర్వము నులక మంచములను పేదలు విరివిగా వాడెడువారు.నవారుపట్టెమంచములు నాగరికులైన భాగ్యవంతులకు  మాత్రమే యుండెడివి. వర్షాకాలమున ,చలికాలమున పేదలు వెచ్చదనమునకై కుంపటులను వాడెడివారు. ఆకుంపటులలో పిడకలుగాని ,గొఱ్ఱె పెంటనుగాని, వాడెడివారు.  అందలి ఆనందము వారికే ఎరుక. నేడు మనము ఆ విషయమును పరిశీలించ లేము . వారు అలవాదినవారు కాబట్టి ఆనందించి వుంటారనే అనుకోవలసి వస్తుంది.
ఇదీ శ్రీ కృష్ణరాయ సార్వభౌముని ప్రజా జీవన పరిశీలనము!

Thursday, 23 March 2017

కవన కన్యక - కవిత్వ పటుత్వము

కవన కన్యక - కవిత్వ పటుత్వము  

https://cherukurammohan.blogspot.com/2017/03/blog-post_23.html

నన్ను అపార్థము చేసుకోనకుంటే కవిత్వమును గూర్చి నాలుగు మాటలు చెబుతాను . ఇది కూడా కవితలు వ్రాసే ఉబలాటం యువతలో ఎక్కువగా కనిపించుట వల్ల.

మహా కవులు క్షణానికి ఒక కవిత వ్రాయగల దిట్టలు. వారితో నేను పోటీ పడలేను. కానీ నా ఆలోచనా సరళి వేరు అందువల్ల నేను భగవంతుని ఈ విధంగా కోరుకొన్నాను .

తృటిన కవిత వ్రాసి తృప్తి చెంద సుకవుల్

నిన్ను తలచి తలచి నీలకంఠ

పద్యమొకటి వ్రాయ పదిగంటలయ్యును

నీదు తలపులిచ్చె నిమ్మళమ్ము

పై పద్యములోని భావమేమిటంటే పరమాత్మా నేను ఒక పద్యము వ్రాయుటకు సమయమైతే ఎక్కువే తీసుకోవచ్చు కానీ రాసేది నిన్ను గూర్చి కాబట్టి వ్రాసినంతసేపు నిన్ను తలచుకొనే అదృష్టము నాకు కలుగుతుంది కదా! అంటే నేనైతే పరపరమేశ్వరుని ఉద్దేశించి వ్రాసినాను కానీ యువకులు భావి కవులు వారు ఏ వస్తువునెన్నుకోన్నారో దాని మీద మనసుపెట్టి 1 లేక 2 రోజులైనా యోచించి వ్రాస్తే మంచి ఫలితము పొందగలుగుతారు అని నా నమ్మకం. పెద్దలు కవనములో కొమ్ములు తిరిగిన వారు. వారు ఏమి చేసినా ఎట్లు చేసినా చెల్లుతుంది. కారణం వారు కారణ జన్ములు కావున. మన పరిధిలో మనమూ అదృష్ట వంతులమే. అంతో యింతో ఎంతో కొంత మన భావాలను మనదైన రీతిలో వ్యక్తీకరించగలుగు చున్నాము. కానీ మనము వ్రాసేది మనకన్నా చదువరులకు కదా అర్థము కావలసినది.

పెద్దలు కవితను కన్యక తో పోలుస్తారు. ఏ స్త్రీ అయినా కన్యాత్వములోనే,తన పూర్తి జీవితములో, కడు సుందరంగా కనిపించే సమయము. అంటే మన కవితా కన్యక కూడా తప్పక కడు సుందరమూగా ఉండాలంటే చక్కదనాన్ని కవితా వస్తువుకు మొదట జోడించవలెను. ఆ పిమ్మట అలంకారాలూ ఆభరణాలు కాళ్ళ చెప్పులతో కూడా అన్నీ అమరించి ఒక సారి అద్దములో చూపించి ఆ పైన పెళ్ళిచూపులకు సిద్ధం చేయాలి. |

కవితకు మొదటి సోపానము భావము పిమ్మట అందుకుచితమైన భాష ఆపై అలంకారాలు (ఉపమానోపమేయాలు) పిదప పాదముల నడక. నడకలో లయ విన్యాసము అంటే ఇక్కడ అనుప్రాసలు అక్కర మీరకుండా వుండు విధంగా వాడుకొనుట .ఇక ఇందులో ప్రధానమైనవి శయ్య,ధార. అంటే కవిత సమతలముపై ప్రవహించే సెలయేటి లాగా సాగవలె. భావములు నేటి యువతలో పుష్కలములు. సమస్య భాష వద్దనే! సరస భావాలకు శబ్దాలంకారలకు సరళ భాషకు పోతన భాగవతము ముఖ్యంగా ప్రహ్లాద చరిత్ర,గజేంద్ర మోక్షము, నరకాసుర వధ చదివితే భాష, శయ్య, ధార శబ్ద అర్థ అలంకారాలన్నీ వస్తాయి. ఇష్టము పెరిగితే మనుచరిత్ర భావ సహితముగా గల పుస్తకాన్ని చదివేది. ఆధునికులలో నిఘంటువు సహాయముతో శ్రీ శ్రీ గారిని చదివితే చాలు. చక్కని కవితలు మీ భావానుకూలముగా వ్రాయగలరు . |అలాటి పదాలతో వ్రాసిన పోతన పద్యాన్ని ఈ దిగువ తెలియబరచుతూ నన్ను అపార్థము చెసుకొనరని మనసారా భావిస్తూ సెలవు తీసుకొంటాను. మహా మహా కవులెందరో వున్నారు కానీ పైన తెలిపిన వారితో మొదలుపెట్టమని నాకు తోచిన సలహా, మీరు తీసుకొంటారని యిచ్చినాను.

నల్లనివాడు పద్మ నయనమ్ముల వాడు కృపారసమ్ము పై

జల్లెడువాడు మౌళి పరి సర్పిత పింఛము వాడు నవ్వు రా

జిల్లేడు మోము వాడొకడు చెల్వల మాన ధనమ్ము దోచెనో

మల్లియలార మీ పొదల మాటున దాగేనటమ్మ చెప్పరే

 

 

 

पुराणमित्येव  साधु सर्वं

 चाऽपि काव्यं नवमित्यवद्यम्

सन्तः परीक्ष्यान्यतरत् भजन्ते

मूढ्ः परप्रत्ययनेयबुद्धिः 

-मालविकाग्निमित्रम् (महाकवि कालिदास)

పురాణ మిత్యేన సాధు సర్వం

నచాపి కావ్యంనవమిత్యవధ్యం l

సంతః పరీక్ష్యాన్యతరత్ భజంతే

మూఢః పరప్రత్యయనేయ బుద్ధిః ll

(మాళవికాగ్ని మిత్రము-మహాకవి కాళీదాసు)

మహాకవి కాళీదాసు ఈ విధముగా అంటున్నారు:

కవిత్వము అదునాతనమా పురాతనమా అన్నది సమస్య కాదు. పురాకవుల కావ్యాలన్నీ గొప్పవీ కావు, అదునాతనుల్లవి అధమమైనవీ కావు.

పండితులయినవారు ఆ విషయమును, కూలంకషముగా చదివి నిర్ణయించుతారు. మూర్ఖులు మాత్రము ఎవరేమి చెబితే దానికి తలూపుతారు.

నిన్నటి దినమున ఒక పాఠకుడు ఈ శ్లోకాన్ని ఉదాహరించుతూ, నేను నిన్న వ్రాసిన విషయమును అపార్థము చేసుకొని పై శ్లోకమును ఉదహరించి గోప్పంతా పాతలోనే లేదు కొత్తలోకూడా ఉంటుంది అని తమ అభిప్రాయమును తెలియజేసినారు. ఇందుకు గానూ నేను సమాధానము వ్రాయవలసి వచ్చి వ్రాయుచున్నాను.

కాళీదాసుకు పూర్వము ఎందఱో కావ్యములను వ్రాసినారు. కాళిదాసు తరువాత కూడా వ్రాసినారు. కానీ పేరెన్నిక గన్నవి ఆయన కావ్యములే. రాశిలో నేటికి కూడా సంస్కృత కావ్యముల తరువాతనే మిగత ఏ భాషా కావ్యములైనా! మరి ఆయన తదనంతరము వ్రాయబడిన కావ్యములకు ఆ ప్రశస్తి రాలేదు. అట్లే ఆంధ్రమహాభారత కవులను కాదని, వారితదనంతరము భారతము వ్రాయ సమకట్టలేదు. అటులే ఆంద్ర భాగవతము కూడా! తెలుగులో ఎందఱో ఉద్దండులయిన పండితులు రామాయణమును వ్రాసినా, అధునాతనుడైన  విశ్వనాథ వారి ‘రామాయణ కల్పవృక్షము’నకు ఎంతో వాసి వన్నె వచ్చినది. అట్లని గతములో వ్రాసినవారెవరూ తక్కువైనవారు కారు.

పద్య కావ్యాల మాట అటుంచితే శ్రీశ్రీ మరియు సినిమా కవులను తప్ప మిగతా ఎందఱో ప్రతిభావతులయిన కవులను ఎందరు గుర్తు పెట్టుకొనియున్నారు. ఇక తెలుగులో నేటి పాటలు ఎంతగా దిగాజారిపోయినాయో చెప్పంక్కరేలేదు. వ్రాయగలిగే చేవయుండికూడా ‘సిరివెన్నెల సీతారామ శాస్త్రి’ గారి కలమునుండి ఒక రసమయ గీతము జాలువారి ఒక దశాబ్దము అయిపోయిందేమో.

ఇక నావంటి చిల్లర కవులు వ్రాసే వ్రాతలకు పాత కావ్యముల స్థాయి రమ్మంటే వస్తుందా! ఇప్పుడు వచన కవిత్వము వ్రాసే ఎంతమంది నేడు కొంత మాత్రమైనా వ్యాకరణము చదివి వ్రాస్తూవున్నారు. ఈ సంస్కృత శ్లోకము చదవండి.

యద్యపి బహునాధీషే తథాపి పఠపుత్రా వ్యాకరణంl

స్వజనః శ్వజనః మాభూత్ శకలం శకలం సకృత్ శకృత్ll

వేదశాస్త్రాధ్యనము చేయకున్నా వ్యాకరణము నేర్చుకో!పదాలు సక్రమమైన అక్షరాలతో పలుకుట నేర్చుకో! ‘స్వజనం’ కు బదులు ‘శ్వజనం’ అని

‘సకలం’ (అంతా) కు బదులు ‘శకలం’ (ముక్క) అని ‘సకృత్’(ఒక మారు) ‘శకృత్’ (మలము) అని పలికితే ఎంత అసంబద్ధమయిన అసహ్యమయిన అర్థాలు వచ్చి

 పలికిన వానికి ఎంత అవమానమును తెచ్చి పెడతాయో చూడండి. తెలుగులో ‘పాలాభిషేకము’లో ‘పాలు’  అన్న తెలుగు పదమునకు ‘అభిషేకము’ అన్న సంస్కృత తత్సమ శబ్దముతో సంధికుదరదు.

‘క్షీరాభిషేకము’ లేక ‘దుగ్ధాభిషేకము’ అని అనవలసి వస్తుంది. తమిళమునకు ఈ వెసలుబాటు అంటే వాళ్ళు ‘పాలాబిశేగం’ అని సరిపుచ్చుకొంటారు. అట్లే ‘నాకు ౘాలు' అనవలసిన చోట

 'నాకు చాలు' అని పలుకుట ఎంత అసభ్యముగానూ అసహ్యముగానూ ఉంటుందో గమనించండి. '' అన్న అక్షరమును 'రు' గా పలుక కూడదు.

చెంపలు, దవడలు, గవదలు9(ఒకే శరీర భాగమునకు వేరువేరు పేర్లు) కదిలించకుండా '' అన్న శబ్దము పలుకవలసి ఉంటుంది. అదేవిధముగా ‘ఌ’ కూడా పలుకవలసి ఉంటుంది. మనము 'కృష్ణ' కుబదులుగా 'క్రుష్ణ' అని పలుకుతున్నాము. సిగ్గుపడవలసిన విషయమేమిటంటే ఆంగ్లేయులు కూడా వాళ్లకు వట్రసుడి లేకున్నా''  కు '' తో యతి చెల్లుతుంది కాబట్టి Krishna అని వ్రాస్తారు. దేవనాగరి అంటే సంస్కృత హిందీ లిపులలో వాళ్ళు ఈ శబ్దమును क्रु అనికాకుండా कृ అని వ్రాస్తారు. క్ఌ (నిజానికి ‘ఌ’ క క్రింద రావాలి కానీ మనము వదిలి వేసినాము కాబట్టి ఆ సువిధ Google లో లేదు. ఇప్పుడు ‘క్లుప్తము’ అని వ్రాస్తున్నాము. ఇంతకన్నా  దారుణమైన విషయము ఏమిటంటే ‘ఙ,ఞ’ లు వాడకములో లేవు. ఇవి ఏ రుద్ర నమక చమకముల వంటి వైదిక పుస్తకములలో మాత్రమే కానవస్తాయి. అసలు గంగ అని వ్రాయకూడదు, ‘గఙ్గ’ అని వ్రాయాలి. కొదణ్డము అని వ్రాయాలి. కిఞ్కిణి,కాఞ్చి అని వ్రాయాలి కింకిణి, కాంచి అని వ్రాయ కూడదు. ఈ విధముగా మనము అక్షరములను వదిలివేసుకొంటూ పోతే ‘గొరగంగా మిగిలేది జుట్టే’. అసలీ భాషా వినాశనమునకు నాంది పలికినవారు వాడుక భాషను అమలు చేయు ఉద్యమమును ఆంగ్లేయుల కోరికకు అనుగుణముగాప్రారంభించి వారిచే సత్కారములను పొందిన మహనీయులు. ఈ రోజు మనకు వ్యాకరణము రాదు. పద్యకావ్యములు చదువలేము. సంస్కృతి పై ఆసక్తి లేదు. మన భాశాభినివేశము ‘నానాటికి తీసికట్టు నాగంభొట్టు’.

కళ్ళు తెరిచి ఇకనైనా ముందు భాష నేర్చుకొందాము. మన అక్షరములను పునరుద్ధరించుకొందాము. మలయాళీలు చలన చిత్రములలో సంస్కృత గీతములను కూడా చొప్పించి ఎంతో భావగర్భితముగా, మనోరంజకముగా 90 దశకము వరకు వ్రాసి పాడేవారు. మనమో! సంస్కృతము అన్న శబ్దమును కూడా పలుకలేని వారిని కలిగియున్నాము. మాతృభాష తెనుగులో చక్కగా మాట్లాడలేక అవమానించే తెలుగు నాయకులను, చిత్ర నాయకులను చూచే దుర్గతి నేడు మనకు పట్టింది. ఈ విధముగా మన భాషా పాండిత్యమునుంచుకొని చక్కటి భావమునకు అక్షర రూపము ఇవ్వగలమా! మనము క్షరములు అంటే నశించేవి కాదు వ్రాయవలసినది, అక్షరములు అంటే శాశ్వతముగా నిలచిపోయేవి.

ఈ మాట వినండి.

నన్ను అపార్థము చేసుకోనకుంటే కవిత్వమును గూర్చి నాలుగు మాటలు చెబుతాను . ఇది కూడా కవితలు వ్రాసే ఉబలాటం యువతలో ఎక్కువగా కనిపించుట వల్ల.

మహా కవులు క్షణానికి ఒక కవిత వ్రాయగల దిట్టలు. వారితో నేను పోటీ పడలేను. కానీ నా ఆలోచనా సరళి వేరు అందువల్ల నేను భగవంతుని ఈ విధంగా కోరుకొన్నాను .

తృటిన కవిత వ్రాసి తృప్తి చెంద సుకవుల్

నిన్ను దలచి తలచి నీలకంఠ

పద్యమొకటి వ్రాయ పదిగంటలయ్యును

నీదు తలపులిచ్చె నిమ్మళమ్ము

పై పద్యములోని భావమేమిటంటే పరమాత్మా నేను ఒక పద్యము వ్రాయుటకు సమయమైతే ఎక్కువే తీసుకోవచ్చు కానీ రాసేది నిన్ను గూర్చి కాబట్టి వ్రాసినంతసేపు నిన్ను తలచుకొనే అదృష్టము నాకు కలుగుతుంది కదా! అంటే నేనైతే పరపరమేశ్వరుని ఉద్దేశించి వ్రాసినాను కానీ యువకులు భావి కవులు వారు ఏ వస్తువునెన్నుకోన్నారో దాని మీద మనసుపెట్టి 1 లేక 2 రోజులైనా యోచించి వ్రాస్తే మంచి ఫలితము పొందగలుగుతారు అని నా నమ్మకం. పెద్దలు కవనములో కొమ్ములు తిరిగిన వారు. వారు ఏమి చేసినా ఎట్లు చేసినా చెల్లుతుంది. కారణం వారు కారణ జన్ములు కావున. మన పరిధిలో మనమూ అదృష్ట వంతులమే. అంతో యింతో ఎంతో కొంత మన భావాలను మనదైన రీతిలో వ్యక్తీకరించగలుగు చున్నాము. కానీ మనము వ్రాసేది మనకన్నా చదువరులకు కదా అర్థము కావలసినది.

పెద్దలు కవితను కన్యక తో పోలుస్తారు. ఏ స్త్రీ అయినా కన్యాత్వములోనే,తన పూర్తి జీవితములో, కడు సుందరంగా కనిపించే సమయము. అంటే మన కవితా కన్యక కూడా తప్పక కడు సుందరమూగా ఉండాలంటే చక్కదనాన్ని కవితా వస్తువుకు మొదట జోడించవలెను. ఆ పిమ్మట అలంకారాలూ ఆభరణాలు కాళ్ళ చెప్పులతో కూడా అన్నీ అమరించి ఒక సారి అద్దములో చూపించి ఆ పైన పెళ్ళిచూపులకు సిద్ధం చేయాలి. |

కవితకు మొదటి సోపానము భావము పిమ్మట అందుకుచితమైన భాష ఆపై అలంకారాలు (ఉపమానోపమేయాలు) పిదప పాదముల నడక. నడకలో లయ విన్యాసము అంటే ఇక్కడ అనుప్రాసలు అక్కర మీరకుండా వుండు విధంగా వాడుకొనుట .ఇక ఇందులో ప్రధానమైనవి శయ్య,ధార. అంటే కవిత సమతలముపై ప్రవహించే సెలయేటి లాగా సాగవలె. భావములు నేటి యువతలో పుష్కలములు. సమస్య భాష వద్దనే! సరస భావాలకు శబ్దాలంకారలకు సరళ భాషకు పోతన భాగవతము ముఖ్యంగా ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షము, నరకాసుర వధ చదివితే భాష, శయ్య, ధార శబ్ద అర్థ అలంకారాలన్నీ వస్తాయి. ఇష్టము పెరిగితే మనుచరిత్ర భావ సహితముగా గల పుస్తకాన్ని చదివేది. ఆధునికులలో నిఘంటువు సహాయముతో శ్రీ శ్రీ గారిని చదివితే చాలు. చక్కని కవితలు మీ భావానుకూలముగా వ్రాయగలరు . అలతి పదాలతో వ్రాసిన పోతన పద్యాన్ని ఈ దిగువ తెలియబరచుతూ నన్ను అపార్థము చెసుకొనరని మనసారా భావిస్తూ సెలవు తీసుకొంటాను. మహా మహా కవులెందరో వున్నారు కానీ పైన తెలిపిన వారితో మొదలుపెట్టమని నాకు తోచిన సలహా, మీరు తీసుకొంటారని యిచ్చినాను.

నల్లనివాడు పద్మ నయనమ్ముల వాడు కృపారసమ్ము పై

జల్లెడువాడు మౌళి పరి సర్పిత పింఛము వాడు నవ్వు రా

జిల్లెడు మోము వాడొకడు చెల్వల మాన ధనమ్ము దోచెనో

మల్లియలార మీ పొదల మాటున దాగేనటమ్మ చెప్పరే

Gowrishankar Mamillapalli

నవ కవులకు యువ కవులకు చక్కటి సాహితీ సందేశము.మీరుతలపండిన కవితాపండితులు.మీ కవనము "బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్య."ధన్యోస్మి.

Reply5yEdited

Shyam CB T

Dhanyavaadamulu...

Reply5y

Apaji Peri

ॐ।शुभ मध्याह्नम्।।। "కవి'కవనకన్యాదాఁత'యే గదా...!!!"

Reply5y

Abburi Nagabose

'కవిత్వం గురించి చక్కని వివరణ. ధన్యవాదాలు

Reply5y

భాగవత గణనాధ్యాయి

అద్భుతంగా చెప్పారు .... మహానుభావా!. . . కవిత్వం కావాలన్నా, భాషకావాలన్నా, పరిపక్వత కావాలన్నా "కొందఱకు. . ." అని సవినయంగా సాధికారంగా చెప్పుకున్న మన పుణ్యకోటి పోతనామాత్యుల వారి వద్దకు పోవడమే పరమోత్తతము అండి. .

Reply5y

Parameswara Nitturu

గురువుగారూ,

ఈ ఆధునిక యుగంలో పద్యం తన ఉనికిని కోల్పోతోంది.

ఇలాంటి సంధి దశలో పద్యాన్ని బ్రతికిస్తూ పద్యం గురించి

చాలా చక్కగా వివరించారు.

పద్యానికి ఉండవలసిన లక్షణాలు,తీసుకొన్న ఉదాహరణలు చాలా బాగున్నాయి. పద్యాన్ని నడిపించే తీరును సూచిస్తూ

మీరిచ్చే సూచనలు ,

నవ కవులకు శిరోధార్యాలు.

Reply5y

Nsms Swaroop

Mee kaviki, kabyaniki kavalasina laksjyanni, lakshanaalanu bagavibarinchimaru

Anduku dhanyavadamulu.

Reply5y

Ramalingaswamyp Panamgipalli

Chakkaga vivarinchinaaru padyamulo Thalachi Thalachi anekanna Dalachi thalachi ante Inkachalaabaagundedelmo!

Reply5y

Cheruku Ramamohanrao

Nijame

Reply5y

Sivaram G Krishna

Chala Bagundi.

Reply5y

Sadanandeeswaraiah Vallamkondu

కవులందు సుకవులు వేరయ్య అంటారు .

Reply5y

Kadambari Sarma

నవ్వురాజిల్లెడుమోమువాడు.......

మీరూచాలాసున్నితముగా చెప్పారు.

Reply4y

Vijaya Rao Atmakur

వస్త్రాపహరణసమయంలో పరమాత్ముడు దోచుకున్నది దేహాభిమానధనమును అని పెద్దల వివరణ.

Reply4y

Rama Krishna Jupudy

Chala baga chepperu

Reply4y

Sastry Vemuri

Your explanation is wonderful and Spurtidayakamu (inspiration) to youth to write beautiful poetry and there are subjects and degrees in western countries to write good poetry and perhaps they give same suggestions like

Yours and even read as explanatory experience , Also you have with same Spurti loosely translated inspiration keeping full concentration in your inspirational object in your case lord Siva as explained by you decorating in full splendor you wrote a piece which brought out all Bhava in a beautiful piece of poem and must be thanked that you have quoted Mahanubahvudu unrivaled in simple and heart melting poem on lord Krishna and my belief is firmed up that an artist unless completely immersed and drowned in Bhakti (devoted or devotion ) devoted in his object of art piece or devotion in his love for the object such beautiful artistic excellence would not flower . Thank you.

Reply4y

Cheruku Ramamohanrao

Mee abhimaanamunaku krutajnunni

Reply4y edited

Murali Thotapalle Venkata

Mee Kavita drukpathamu Chala bagundi.

Reply4y

Talisetti Venkata Subba Rao

2y

Talisetti Venkata Subba Rao

Kavitha kanyaka v.Good explanation sir

2y