రామమోహనుక్తి రమ్య సూక్తి

చెరుకు రామ్మోహన్ రావు పద్య మంజరి ,గీతములు,వ్యాసములు (తెలుగు మరియు english),అభిప్రాయములు మొదలగునవి .

Saturday, 19 October 2013

In praise of Hindu thought and astronomy

Jean-Sylvain Baily (1736–93): 18th century French astronomer and politician. His works on astronomy and on the history of science (notably the Essai sur la théorie des satellites de Jupiter) were distinguished both for scientific interest and literary elegance and earned him membership in the French Academy, the Academy of Sciences, and the Academy of Inscriptions.
Bailly said: "The movement of stars which was calculated by Hindus 4,500 years ago, does not differ even by a minute from the tables which we are using today." And he concludes: "The Hindu systems of astronomy are much more ancient than those of the Egyptians - even the Jews derived from the Hindus their knowledge.

Marquis Pierre Simon de Laplace ( 1749-1827): French mathematician, philosopher, and astronomer, a contemporary of Napoleon. Laplace is best known for his nebular hypothesis of the origin of the solar system.
Laplace wrote:"Nevertheless the ancient reputation of the Indians does not permit us to doubt that they have always cultivated astronomy, and the remarkable exactness of the mean motions which they assign to the Sun and the Moon necessarily required very ancient observation.

Carl Sagan, in his book, Cosmos asserts that the Dance of Nataraja (Tandava) signifies the cycle of evolution and destruction of the cosmic universe (Big Bang Theory): "It is the clearest image of the activity of God which any art or religion can boast of." Modern physics has shown that the rhythm of creation and destruction is not only manifest in the turn of the seasons and in the birth and death of all living creatures, but also the very essence of inorganic matter.
For modern physicists, then, Shiva's dance is the dance of subatomic matter. Hundreds of years ago, Indian artist created visual images of dancing Shiva's in a beautiful series of bronzes. Today, physicist have used the most advanced technology to portray the pattern of the cosmic dance. Thus, the metaphor of the cosmic dance unifies, ancient religious art and modern physics. The Hindus, according to Monier-Williams, were Spinozists more than 2,000 years before the advent of Spinoza, and Darwinians many centuries before Darwin and Evolutionists many centuries before the doctrine of Evolution was accepted by scientists of the present age.
"The Hindu religion is the only one of the world's great faiths dedicated to the idea that the Cosmos itself undergoes an immense, indeed an infinite, number of deaths and rebirths. It is the only religion in which the time scales correspond, to those of modern scientific cosmology. Its cycles run from our ordinary day and night to a day and night of Brahma, 8.64 billion years long. Longer than the age of the Earth or the Sun and about half the time since the Big Bang. And there are much longer time scales still."
Posted by Unknown at 21:15 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Tuesday, 15 October 2013

ఏకాక్షర కందము

నేను వ్రాసిన ఏకాక్షర కందము :

నిన్నా నేనన్నానా 
నిన్నూనిన నేను నిన్న నిన్నన్నానా 
నేనన నన్నెన్నన్నను 
నిన్న నిన్ననను నేను నిన్నననన్నా 

అర్థము మీకు తెలియంది కాదు

నిన్నా!(సంబోధన) నేను అన్నానా. నిన్నూనిన నేను అంటే నిన్ను పూనిన నేను అంటే నీ మీద గౌరవమున్న నేను, నిన్నటి రోజున నిన్ను అన్నానా. నన్ను ఎన్ని అన్ననూ నిన్ను అనను. నిన్ననను నిన్ననను నేను నిన్ను అననే అనను అన్నా!(సోదరా )
Posted by Unknown at 05:50 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

ఘటికా స్థానము


ఘటికా స్థానము

ఘటికాస్థానాలు అన్న పేరు ఒక కాలములో విద్యానిలయాలకు ఉండేవని కొందరికి తెలిసి యుండ వచ్చు. ఈ పదమును విపులీకరించి విషయ వివరణ చేసినవారు జగద్గురువు చంద్ర శేఖర యతీంద్రులు. ఈ విషయాన్ని గురించి నేను వ్రాయడం లోని ముఖ్య వుద్దేశ్యము పాశ్చాత్యుల ఎలుబడికి పూర్వము శిక్షణ వ్యవస్థ ఎట్లుండినది అన్న విషయం తెలియబరచుటకే.
అసలు ఘటిక అంటే చిన్న కుండ అని అర్థము.
పెద్దది చిన్నది
లత లతిక
దీపము దీపిక
ఘటము ఘటిక

మరి ఈ పదమునకు విద్యా స్థానముతో లంకె ఎట్లు కుదిరినది. ఘటిక లేక ఘడియ అంటే ఒక అర్థము 24 నిమిసముల కాలము కూడా ఔతుంది. మరి దేనిని అన్యైన్చుకోవలేనన్నది సమస్య. చంద్ర శేఖర సంయమీంద్రులు
ఈ విధంగా తెలియజేసినారు.
వ్యాసులవారు బ్రహ్మ సూత్రములను వ్రాసినారు.దానికి శంకరులవారు భాష్యము వ్రాసినారు. ఆ భాష్యానికి వార్తీకము(భాష్యమునకు భాష్యము )'భామతి' యన్న పేరుతొ వాచస్పతి మిశ్ర యన్న వారు వ్రాసినారు. దానిని మారులా 'కల్పతరు' అన్న పేరు తో అమలానండులవారు వ్యాఖానించితే దానిని ఇంకా చక్కగా విమర్శించిలక్ష్మీ నరసిమ్హులనువారు 'అభోగము' అన్న వ్యాఖ్యాన గ్రంథాన్ని వ్రాసినారు. గురువులు చంద్రశేఖర సమ్యమీంద్రులు 'అభోగము' చదివి ఆపై 'కల్పతరు' చదివినారు. అందులో వారికి 'ఘటికాస్తాన' ప్రయోగము కనపడింది.
ఆ గ్రంథములోని 'ఏతు శిఖా యజ్ఞోపవీత త్యాగరూప పారమహంస్య వృత్తీం న మన్యంతే తేన పశ్యన్తి ప్రత్యక్ష ఘటికా స్తానేషు పఠ్యమాన అధర్వణీమ్ శృతీమ్ -స శిఖః వపనం కృత్వా బహిః సూత్రం త్యజెద్భువః' అని వున్న ఆ వాక్యములో ఘటిక శబ్దము వినవచ్చింది. ఆ వాక్యము అర్థమేమిటంటే పరమహంస వృత్తిని అవలంబించేవారు శిరోముండనము , యజ్ఞోపవీత త్యాగము,చేయనక్కరలేదను మాటను తెలిపే అధర్వణ శృతిని ఘటికా స్థానములలో చెప్పు చుండుట వినలేదా అని అన్నారు.మనకు ఘటిక తో సంబంధము కావున ముందునకు నడచెదము. క్రీస్తు శకము 13 శతాబ్దములో(రామానుజుల వారికి 100-150 ఏండ్ల పిదప)వున్నా యదావ మహాదేవులకు అమలానండులవారు సమకాలీకులు. అంటే 13 వ శతాబ్దము లోనే ఘటికా స్తానములుండేవని
మనకు పై విషయము వల్ల తేటతెల్లమగుచున్నది.
క్రీ.శ.4వ శతాబ్దము లోనే కర్నాటక దేశపు రాజు మయూరవర్మ పల్లవేంద్ర పురమైన కంచిలోని ఘటికా స్థానములలో వీరశర్మ యను గురువుల వద్ద విద్యనభ్యశించినారని షిమోగా జిల్లా తలగుండ యనుచోట ప్రణవెస్వరస్వామి ఆలయములో కకుత్స వర్మ యను రాజు కాలమునకు చెందినా శిలా శాసనములో వున్నది. అంటే గురువు గారు తీగ కదిలించి ఎంత దూరము వెళ్ళినారో గమనించండి. మహనీయులు తలపెట్టిన కార్యమును అర్ధాన్తరముగా విడువరు. అందుకే భర్తృహరి సుభాషితముల తెలుగు సేత లో'ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్ ... ప్రారబ్ధార్థము నుజ్జగించరు' అని చెబుతూ, ఎందుకంటే 'ప్రాజ్ఞ్యా నిధుల్ గావునన్' అని చెప్పినారు.
కావున విశేషమైన విద్య సంపాదించాలంటే 1000,1500 మైళ్ళ దూరము గూడా భారమయ్యేది కాదు. ఈ విధమైన ఘటికలను రాజులు జయించినట్లు,కట్టించినట్లు కూడా ఇంకా ఎన్నో శాసనములు కలవు. ఏతా వాతా చెప్పదలచుకోన్నదేమిటంటే ఆ కాలము లోనే విద్యకంత గుర్తింపు వుండినది.
ఇపుడు క్రీస్తు శకము నుండి క్రీస్తు పూర్వమునకు పోయిన,శంకరులవారి కన్నా చాలా పెద్దవారు, శంకరుల చే శృంగేరి మఠ ప్రధమ పీఠాధిపతిగా శంకరుల వారిచేతనే నియమింపబడ్డ మండన మిశ్రులవారి (సన్యాస నామము సురేశ్వరాచార్యులు) ప్రధమ గురువులు కుమారిలభట్టు మాన్యవరులు 'తంత్రీ వార్తీకం' అన్న పుస్తకం వ్రాస్తే దాని వ్యాఖ్యాత యైన భట్ట సోమేస్వరులవారు ఘటికా స్థానాన్ని ఈ విధంగా నిర్వచించినారు .
"వేద కౌశల గిజ్ఞాసార్థం తత్తత్ వేద విభాగ చిహ్న లేఖ్యాని ఘటికాయాం కుంభకాయాం నిక్షిప్య తత్తత్ వేద విభాగ పరీక్ష కాలే తాన్యాకృష్య ఆకృష్య లేఖా చిహ్నితం వెదపాఠమ్ ఇత్యధ్యేతారః అనుయుజ్యంతే ఇతి ఘటికా మార్గవర్తినో అనుయోగః."

అంటే ఘటికలో జరిగే విద్యా వ్యాసంగాన్ని 'ఘటికా మార్గ వృత్తి'అని తెల్పినారు. అచ్చట జరిగే పరీక్షను మీమాంసను 'అనుయోగం' అన్నారు.

ఘటికలను (చిన్న కుండలను) ఉపయోగించి పరీక్షలను ఘటికలలో (విద్యా స్థానాలలో) జరిపేవారని సొమెశ్వరులు వివరించినారు. విద్యార్థుల వేద విద్యా కౌశలాన్ని పరీక్షించుటకు ఆయా వేద విభాగములను తెలిపే చీటీలు చుట్టగానో లేక మడిచియో వుంచి, పరీక్షార్థుల చేత అందులోనుండి ఒకటి తీయించి అందలి విషయమును మౌఖికముగా తెలుపగోరేవారు. ఘటికా స్తానములకా పేరు ఈ విధముగా కల్గినది.
ఒక ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఘటికలను విద్యా స్తానములలోనే కాక వేద మంత్రములచే చైతన్యమైన గోపురములపై కళశములుగా నూ ఘటాభిషేకాల లోనూ పూర్ణకుభము తో దేవాలయ స్వాగాతములకును వాడేవారని మనకు తెలుస్తున్నది. ఘటికలకు ఇంట ప్రాధాన్యత వుంది మరి.

ఈ ఘటికలు గోదావరి ప్రాంతములోని తుని తాలూకా చిక్కుళ్ళ అగ్రహారములో వున్నట్లు అక్కడ లభించిన ఒక తామర శాసనములో వున్నదని చంద్రశేఖర సరస్వతులవారు నుడివినారు. కర్ణాటకలోని తుమకూరు తోటప్ప ఆలయములోని 12 వ శతాబ్దపు శాసనములో కూడా ఘటికా స్తానమక్కడ వున్నట్లు వ్రాయబడినది. చెన్నరాయ పట్టాన,హాలెకెరె, మొదలగు చోట్ల గూడా ఇటువంటి శాసనములు గలవు.
వీనియందు విద్యార్థులు 300 మొదలు 3000 వరకు ఉండేవారని తెలియ వచ్చుచున్నది. ఇచట అన్ని వర్ణములవారు విద్య నభ్యసించుచుండే వారు. కానీ ఘటికలో చేరుతయందు వయోవ్యత్యాసముండేది. మొదటి మూడు వర్ణములకు ఉపనయనముండేది. అది కూడా ఒక్కొక్క వర్ణమునకు ఒక్కొక్క వయసులో. నాల్గవ వర్ణము వారికి వృత్తి కళలు,పురాణములు, నీతి బోధ,ధర్మశాస్త్రములు బోధించేవారు. నీతికి నిజాయతీకి పెద్ద పీట వేసే వారు. ఒక కక్ష్య లోని చురుకైన విద్యార్థులు గురువుల చేత ఎన్నుకొనబడి మిగత విద్యార్థులకు విద్య బోధింప జేసేవారు.
టి. బి. మేకాలేగారు ఫిబ్రవరి 2, 1935 న బ్రిటీషు పార్లమెంటులో మన దేశ విద్యా విధానాన్ని గూర్చి చెప్పిన మాట ఈ క్రింద యదా తధంగా పొందు పరచుట జరిగినది.
"I have traveled across the length and breadth of India and I have not seen one person who is a beggar, who is a thief. Such wealth I have seen in this country, such high moral values, people of such calibre, that I do not think we would ever conquer this country, unless we break the very backbone of this nation, which is her spiritual and cultural heritage, and, therefore, I propose that we replace her old and ancient education system, her culture, for if the Indians think that all that is foreign and English is good and greater than their own, they will lose their self-esteem, their native self-culture and they will become what we want them, a truly dominated nation."
మనలో మన భాష(సంస్కృతం) మీద న్యూనతా భావమును ఏర్పరచి ఆంగ్లమును 'Indian Education Act' ద్వారా'రాజా రామ్మోహన్ రాయ్' వంటి దళారుల సహాయముతో, మన నెత్తిపై రుద్ది నేడు మనకీ దుర్దశ కలిగించినారు.

ఇప్పటికింతే .

తత్సత్
Posted by Unknown at 05:48 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

అబ్దుల్ కలాం పై పద్యం

అబ్దుల్ కలాం పుట్టిన రోజు సందర్భంగా నేను వ్రాసిన పద్యం 

కోహినూరు బోలు కోలారు గని బోలు 
మలల రాజు మంచు మలను బోలు 
అన్యుడతడు కాడు అబ్దుల్ కలామిది 
రామ మొహనుక్తి రమ్య సూక్తి 


 Photo: ఈ రోజు భారతరత్న 
డా.ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ పుట్టినరోజు.. 

నేటి తరానికి నిప్పులాంటి నీతి..

నేను వేలాదిగా పరిచయ సంపదను కలిగివున్నాను. 
అందులో నుంచి వ్యక్తిగతంగా నన్ను ప్రభావితం చేసిన అంశం గురించి తెలియచేస్తాను. ''..నేను చిన్నవాణ్ణిగా వున్నప్పుడు నా తండ్రి జనాబ్ అవుల్ పకీర్ జైనుల్లాబ్దీన్ ఓ పెద్ద పాఠం నేర్పారు. 1947లో స్వాతంత్య్రం వచ్చిన కొద్ది కాలానికే ఇది జరిగింది. రామేశ్వరం దీవిలో పంచాయితీ ఎన్నికలు జరిగాయి. మా నాన్నగారిని గ్రామ పంచాయితీకి అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఈయన ఒక కులానికో లేక మతానికో చెందిన కారణంగానో, ఆర్థిక స్థితిగతులనుసరించో వాళ్లు ఎన్నుకోలేదు. ఈయన మనస్సు దొడ్డదైనందున, ఈయన మంచి మనిషి అయినందువల్లనే ఎన్నుకున్నారు. నా తండ్రి పంచాయితీ అధ్యక్షునిగా ఎన్నుకోబడిన రోజునే ఒక వ్యక్తి మా ఇంటికి వచ్చాడు. నేను అప్పటికింకా పాఠశాల విద్యార్థినే. పాఠాలను గొంతెత్తి వల్లె వేస్తున్నాను. ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. అప్పట్లో రామేశ్వరంలో మేమెవ్వరం తలుపులకు తాళాలు వేసేవాళ్లం కాము. కనుక ఆ వ్యక్తి లోపలికి వచ్చి మా నాన్నగారెక్కడ అని అడిగాడు. సాయంత్రం పూట నమాజుకు వెళ్లారని చెప్పాను. ఆయన మా నాన్నగారికి కొన్ని వస్తువులు బహూకరించేందుకు తెచ్చినట్లుగా చెప్పి వాటిని అక్కడ పెట్టి వెళ్తానన్నాడు. పక్కనే వున్న మంచంమీద పెట్టి వెళ్లమన్నాను. తిరిగి నేను నా చదువులో పడిపోయాను. మా తండ్రి తిరిగి వచ్చి మంచం మీద వెండి పళ్లెంలో కొన్ని బహుమానాలు వుండడం గ్రహించారు. అవి ఎవరు ఇచ్చారని అడిగారాయన. ఎవరో వచ్చి అక్కడ పెట్టి వెళ్లారని చెప్పాను. ఆయన పాకెట్టు విప్పి చూస్తే ఖరీదైన బట్టలు, వెండి కప్పులు, కొన్ని పండ్లు, మిఠాయిలు వున్నాయి. వాటిని చూడగానే మా తండ్రికి చిర్రెత్తుకొచ్చింది. నేను సంతానంలో అందరికంటే చిన్నవాణ్ణి. నన్ను గారాబంగా చూసేవారు. నేనూ నా తండ్రిని అమితంగా ప్రేమించేవాణ్ణి. అదే తొలిసారిగా కోపం ఆయనలో అలా పెల్లుబకడాన్ని చూడడం. తొలిసారిగా బాగా దెబ్బలు తిన్నాను. నాకు భయం వేసింది. ఏడ్వసాగాను. తర్వాత నా తండ్రి అంతటి కోపానికి కారణాన్ని వివరించి చెప్పారు - అనుమతి లేకుండా ఆయనకు ఎవరు ఏ బహుమానాలు పంపినా స్వీకరించవద్దని చెప్పారు. బహుమతుల్ని స్వీకరించడం మంచి అలవాటు కాదు. ఏదయినా మనకు బహుమతి లభిస్తే దాని వెనక ఏదో ప్రయోజనం ఆశింపబడుతుంది. కనుక అది ప్రమాదకరం. అది ఎటువంటిదంటే పామును తాకి ప్రతిగా విషాన్ని పొందినట్లు. నాకు ఇప్పుడు ఎనభైయ్యేళ్ల వయస్సు వచ్చినా ఈ పాఠం నా మనస్సులో అలాగే నిలిచిపోయింది. ఇది నా మనస్సుపై చెరగని ముద్ర వేసి నాలో విలువల విధానాన్ని రూపొందించింది. ఇప్పటికీ ఎవరైనా ఏదయినా బహమతితో నా ముందు నిలిస్తే నా శరీరం, మనస్సు వణికిపోతాయి...
===========================
''..అభివృద్ధి సాధించేందుకు తలలన్నీ ఒకచోట కూడడం నన్నెప్పుడూ ఆకర్షించే అంశమే. అదంత తేలికయిన విషయం కాదు. అందువల్లనే అభిప్రాయ బేధాలు తరచుగా అభివృద్ధిని కుంటుపరుస్తూనే వుంటాయి. రాకెట్టునో, క్షిపణినో అభివృద్ధి చేసే పనిలో కూడా ఎంతో సమిష్టి కృషి అవసరమౌతుంది. ప్రజల ఆలోచనా విధానాన్ని దగ్గర నుంచి పరిశీలిస్తూ, ఆకళింపు చేసుకుంటూ వాళ్ల నుంచి నేర్చుకున్నాను. దేశాధ్యక్షునిగాను, ఆ తర్వాత కూడ భావనా సంపదను నిలుపుకున్న అదృష్టవంతున్ణి నేను. వాటితోపాటు అభిప్రాయాలు, విమర్శలు అనుభవంతో కూడినవి, అంతగా అనుభవాన్ని జోడించలేకపోయినవి కూడా వుండేవి. భావనలు, ప్రశ్నలకు సంబంధించిన వెలుగు నీడలన్నీ మానవ అభివృద్ధికి దారితీసే జ్ఞానాన్నే పెంపొందింపచేస్తాయి..''
Posted by Unknown at 05:46 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

విభూతి

విభుతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ విభుతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం 

కాపాడుతు ఉంటాడు. నరక బాధలు లోనుకాకుండా చూస్తాడు. 


కాల్చిన పేడను (ఆవు పేడ) ఈ భస్మం లో ఉపయోగిస్తూ ఉంటారు. భస్మ ధారణ చేయకుండా చేసే

 జపతపాలు ఫలితాలను ఇవ్వవని శాస్త్ర వచనము. మన శరీరములో 32 చోట్ల భస్మ ధారణ చెయ్యాలి 

అని శాస్త్రము చేప్తోంది, కాని ఈ కాలము లో అలాగ చెయ్యటము వీలుపడని పక్షములో కనీసము 

శిరస్సు, రెండు చేతులు, గుండే, నాభి అనే ఐదు ప్రదేశాలలో భస్మాన్ని ధరించవచ్చు. త్రిపుండ్రాలుగా 

(ముడు గీతలు) అడ్డముగా భస్మ ధరణ చెయాలి. ఇలాగ చేస్తే జన్మ జన్మల పాపాలు నసించి 

పోతాయని పెద్దల వాక్కు.





ఈ భస్మ ధారణ చేయడానికి కొన్ని మంత్రాలు చెప్పబడ్డాయి శాస్త్రాలలో.బ్రాహ్మణ, క్షత్రీయులు 

"మానస్తోకే మంత్రము " తో, వైశ్యులు " త్ర్యయంబక " మంత్రము తో , ఇతరులు శివపంచాక్షరి తో భస్మ 

ధారణ చెయాలి.ఈ విభుతి మహిమను వివరించే కధ దేవి భాగవతము పదకొండవ స్కందము లో ఉంది

.

మహిమాన్వితమైన విభుతిని వివిధ పద్ధతులలో తయారు చేస్తారు. ఆవుపేడను కింద పడనీయకుండా, 


చేత్తోపట్టుకుని, వేదమంత్రాల మధ్య హోమము చేసి తయారు చేసుకున్న భస్మాన్ని "శాంతికము " అని 

అంటారు.


షడాక్షరి మంత్రముతో హొమము చేసి తయారు చేసుకునే భస్మాన్ని "పౌష్ఠికం" అని అంటారు. 

బీజాక్షరాలతో హొమము చేసి తయారు చేసిన భస్మాన్ని "కామదం" అని అంటారు..




భస్మం తయారు చేసుకునే ముందే ఆవుపేడను సేకరించి, చిట్టు, లేక పొట్టును కలుపుతూ ముద్ద చేసి,

 ఆ ముద్దను పిడకలుగా చేసి అతి శుభ్రమైన ప్రదేశములో ఎండబెట్టాలి.




యాగాలు చేస్తున్నప్పుడు అరణిని మధించడం ద్వార వచిన అగ్నితో గాని, మంత్ర పూర్వకముగా 

పిడకలను హొమ గుండము లో వేసి హోమము చెయ్యాలి.అనంతరం శుబ్ర్హమైన పాత్రలో విభుతిని 

నింపాలి. 
Posted by Unknown at 05:29 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Wednesday, 9 October 2013

నేనే రాజు నేనే మంత్రి

నేనే రాజూ నేనే మంత్రీ నోరు తెరిస్తే నేనో కంత్రీ
నామాటంటే నిజమగు వేదం పెంచకు  నాతో ఎపుడూ వాదం
నేనేమి చేసినా నాఇష్టం నోరు తెరచితే బహు కష్టం
                  కాఫీ టీ కలబోసి తాగుతా పేపర్ బట్టలు  వేసి తిరుగుతా
                   పెరుగన్నముతో జిలేబి తింటా వేసవిలో స్వెట్టరుతో వుంటా
                   షూస్ వేయకనె నే టక్ చేస్తా మండుటెండలో మరీ నడుస్తా llనేనేll
ఇడ్లీ పెరుగు కలుపుకు తింటా పూరీ కాకర కూరతో తింటా
మిరపకాయతో లడ్డు నములుతా గులాబుజాముకు చారు కలుపుతా
పాలు కలిపి విస్కీని తాగుతా తాగి తాగి ఏమేమొ వాగుతా   llనేనేll
                    నల్లటి ముసుగును నేను ధరిస్తా ముఖానికంతా కందెన రాస్తా
                    మాయిటికె నే కన్నము వేస్తా పోపు పెట్టెలో డబ్బులు తీస్తా
                    దొంగ దొంగయని మరీ అరుస్తా అడ్డము వస్తే నేను కరుస్తా   llనేనేll
ట్రైను టికెటుతో బస్సునెక్కుతా అది ఆగకనే దుమికి తీరుతా
విమానమున  విండోలు తెరుస్తా పరుపూ మంచము వేయమనేస్తా
నావనెక్కి నే కన్నము వేస్తా పెను తుఫానులో పయనిస్తా   llనేనేll
                  సంతాపము ప్రకటించే సభలో ప్రణయ గీతములు ఆలాపిస్తా
                 కర్నాటక సంగీత సభలలో తప్పెట దరువులు నే వాయిస్తా
                భరతనాట్య రంగస్థలమందున మందునుగొట్టి చిందులు వేస్తా llనేనేll

నా ‘మాట - వరహాల మూట’ వ్యాసము నేను పైన తెలిపిన వారికి అంకితము.




Posted by Unknown at 07:05 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: నేనే రాజూ నేనే మంత్రీ నోరు తెరిస్తే నేనో కంత్రీ

Saturday, 5 October 2013

కాల గణన (పాశ్చాత్య శైలి)



  • పాశ్చాత్య కాలగణన

    https://cherukurammohan.blogspot.com/2013/10/blog-post_5.html
    భారతీయ కాల గణన కుడ్యమును అంటుకొనక మునుపే ఈ పాశ్చాత్య కాల గణన గోడకు అతికించి యుండినాను. కారణము తెలియదు కానీ అది చాలామంది కంట పడలేదు . ఈ రెండు వ్యాసములు నేను కాగితములపై వ్రాసి టైపు చేయలేక యుంటే నా మిత్రుడు జి. నాగేశ్వరరావు, నాకంటే 4 సం. చిన్న, టైపుచేసి మీకు అందజేయడానికి ఎంతో దోహద పడినాడు.నాపై ఆయనకు గల అభిమానానికి నాడూ నేడూ ఋణపడియే వున్నాను. ఈ విషయములో ఎంతో సహకారాన్నందించిన పుత్రికా సమానురాలు చి.కుం. భావరాజుపద్మిని ,తనచేతనైన చేయూతనిచ్చిన
    చి. మీగడ త్రినాధ్ లకు కృతజ్ఞత తెలుపుతూ అశీర్వదించకుండా ఎట్లుండగలను. చివరిగా మనసుపెట్టి చదివిన (దాదాపు 150 మందికి పైనే) మీ జిజ్ఞాసకు, నాపై అభిమానానికి నేనెంతో కృతజ్ఞుణ్ణి. మీ ప్రోత్సాహమే పెద్దలమైన (వయసు లోనే సుమా ) మాకు ఉత్సాహము.

    పాశ్చాత్య శైలి కాలగణన చదివిన తరువాత తప్పక మన పూర్వుల ఘనత మీరు తప్పక తెలుసుకోన గలుగుతారు. పేరు కాంక్షించని వారి గొప్పదనము తెలియజెప్పుటే నా లక్ష్యము.
    ఇది కూడా మనసారా చదివి మీరు మన సంస్కృతికి వాసి వన్నె తెస్తారని ఆశిస్తాను

    కాల గణన (పాశ్చాత్య శైలి)

    అనంతమైన కాలాన్ని గణించడం అంత సులభం కాదు. ఐనా దానిని ఎంత నిర్దుష్టంగా మన పూర్వీకులు గణించారో తెలుసుకొనుటకు ముందు పాశ్చాత్యుల క్యాలెండరు ను పరిశీలించుదాము.
    క్యాలెండరు అన్నమాట లాటిన్ భాషలోని క్యాలండీ నుండి పుట్టినది ఇచ్చిన అప్పులు మొదటి రోజున వసూలు చేసుకొనుటకు అది ఏర్పరుపబడినది. తరువాత పౌర అనుశాసనమునకు ప్రజా ప్రయోజన కార్యాచరణమునకు ఇది పాశ్చాత్యుల చేత ఉపయోగింప బడినది. దీనిని వీరు కాల క్రమేణ Almanac అని గూడా అన్నారు. నిజానికిది Al – manakh అంటే వాతావరణ సూచిక అని అన్వయించుకొనవచ్చును. ఈ పదము Spanish Arabic భాషలకు చెందినది.
    నేడు మనముపయోగించే క్యాలాండరు రోము, ఈజిప్టు గ్రెగొరీ విధానాల కలయిక. రోము రాజ్యాన్ని పాలించిన రోములస్ కాలంలో ఏడాదికి 304 రోజులుండేవి. సంవత్సరానికి 10 నెలలుండేవి. మార్చి నుండి కొత్త సంవత్సరం మొదలయ్యేది. తరువాత కాలంలో దీనిని 10 నుండి 12 నెలలకు మార్చి, సంవత్సరమునకు 354 రోజులుగా నిర్ధారించినారు. పంపీలయస్ చక్రవర్తి క్రీ ||పూ|| 7వ శతాబ్దంలో తిరిగి సరి సంఖ్య మంచిదికాదనుకొని 355 రోజులు చేసినారు. క్రీ ||పూ|| 153 లో సంవత్సరాన్ని జనవరికి మార్చటం జరిగింది.
    అంటే ప్రపంచమంతటా నూతన సంవత్సరము మొదలయ్యేది వసంత ఋతువు(spring) లో అంటే మార్చ్ నెలలో. ‘Spring’ అప్పుడే కదా వచ్చేది. తరువులు చివురులు తొడుగుట అప్పుడే కదా. అంటే అది పుట్టుకతో పోల్చవచ్చు కదా! పండువారి పోవడము, మట్టిలో కలవడము శిశిరము (autumn) కాదా! కాని పాశ్చాత్యులు వేడుకలు spring (March) లో కాదని శిశిరం (autumn) అంటే జనవరి లో చేయ మొదలిడినారు.
    తరువాత క్రీ ||పూ|| 46 వ సంవత్సరములో అప్పటి రోమన్ చక్రవర్తి యగు జూలియస్ సీజరు ఈజిప్ట్ వెళ్ళినపుడు అక్కడి క్యాలెండరు విధానాలను గమనించి ఖగోళ శాస్త్రజ్ఞుడైన సోసీజెనాస్ అనునతని సహయంతో రోమను సంవత్సరానికి 365.25 రోజులుగా నిర్ణయించి, ఫిబ్రవరి (అప్పుడు సంవత్సరానికి చివరి నెల) నుండి 30 రోజులలో ఒక రోజును తీసి మార్చి నుండి 5 వ నెలయైన పెంటలిస్ (పెంట=5) కు చేర్చి, ఏప్రిల్, జూన్, ఆగష్టు, సెప్టెంబరు, నవంబరు నెలలకు 30 రోజులనుంచి, ఫిబ్రవరి కి 29 రోజులు చేసి, సంవత్సరమును జనవరికి మార్చి, పెంటలిస్ పేరును తన పేరుతో జులై గా మార్చుకొని సంవత్సరారంభం జనవరి తో చేయ ప్రారంభించినారు. 0.25 తేడాను, 4 సంవత్సరములకు ఒక రోజు ఔతుంది కాబట్టి దానిని ఫిబ్రవరి నెలకు కలిపి (29+1) 30 రోజులు చేయటం జరిగింది. దీనిని leap year అన్నారు.
    సీజరు మేనల్లుని కొడుకైన ఆగస్టస్స్ సీజరు 27 B.C. లో రోము చక్రవర్తియైన పిమ్మట సెక్ష్టలిస్ అను నెలకు (సెక్స్ట్టట =6) తన పేరుతో ఆగస్ట్ అని పెట్టి దానికి ఫిబ్రవరి నుండి ఒక రోజు తీసి, అంటే దానిని 28 రోజులుగా చేసి, ఆగష్టుకు కలిపి దానిని కుడా 31 రోజుల నెలగా చేసినాడు. లీపియరును ౩ సంవత్సరములకు మార్పు చేసి , ఫిబ్రవరి కి కలిపేవారు.
    తరువాత కాలంలో రోజుల లెక్కలో కచ్చితత్వము పెరిగి సంవత్సరానికి 365.242199 రోజులు చేసినారు. ఇందువల్ల ఏడాదికి 11 ని||14సె|| తేడావస్తుంది. దీనిని 13 వ పోపు గ్రెగొరీ VIII క్రీ ||శ|| 1582 లో గ్రెగోరియన్ క్యాలెండరు పేరుతో ప్రవేశ పెడుతూ లీపియర్ ను తిరిగి 4 సంవత్సరములకొకసారి చేస్తూ ఫిబ్రవరి కి 1 రోజును కలిపేవారు. అట్లు చేయుటవలన ఒక వర్షమునకు .007801 రోజు ఎక్కువగా వచ్చేది. దీనిని చక్కబరచుటకు 400 తో భాగింపబడే శతాబ్ది సంవత్సరములు మాత్రమె లీపు సంవత్సరములుగా తీసుకొని 4చేత భాగింపబడినవి తీసుకొనకుండా వదిలి పెట్టినారు. ఈ మార్పును చెయుటకుగనూ October 4, 1582 తరువాత, అక్టోబరు 15, 1582 గా ప్రకటింపబడినది. ఆ 10 రోజులు, కాలముతో ఆడిన క్యాలెండరు ఆటకు,బలియైపోయినాయి. అందువల్ల వారి పండుగ తేదీలకు వారు పండుగ చేసుకొను సందర్భములకు పొంతన లేదని వారి శాస్త్రజ్ఞులే వాక్కణించుచున్నారు.

    ఇక వారు నెలలకు పెట్టిన పేర్లను గూర్చి తెలుసుకొందాము.

    జనవరి: జానస్ అన్న రెండుతలల దేవుడు స్వర్గంలో ప్రధాన ద్వారం వద్ద వుంటూ ఒక తలతో జరిగిన వర్షమును ఒక తలతో జరగబోయే వర్షమును చూస్తూఉంటాడట. ఆయన పేరుతో ఈ నెల ఏర్పడింది. 29 రోజులు కల్గిన ఈ నెల 31 రోజుల నేలగా జూలియస్ సీజరు చేసినాడు.
    ఫిబ్రవరి: రోమన్ల పండుగ ఫిబ్రువా అన్నది లూపర్కాస్ అన్న దేవుని పేరుతో పునీతుడగుటకు (to get purified) జరుపుకుంటారు. దీనికి కొంతకాలం 23, 24 రోజులుండేవి. తరువాత 30 రోజులై ఆతరువాత జూలియస్ సీజరు, అగస్తస్ సీజరు ల వల్ల 28 రోజులై కూర్చుంది.
    మార్చి: మార్స్ రోమనుల యుధ్ధ దేవత. ఈయన ఒక చేతితో శూలం మరొక చేతితో డాలును ధరించి రెండు గుర్రాలమీద వస్తాడు. ఈయన పేరుతో ఈ నెల ఏర్పడింది.
    ఏప్రిల్: రోమన్ల వసంత దేవత పేరు అమ్నియో ఏప్రిట్. ఈమెను రోమన్లు ఎంతో అందమైనదిగా, పునరుజ్జీవనకు నాందిగా భావించుతారు.
    మే: భూగోళాన్ని తన భుజస్కంధాలపై మోసే అట్లాసు యొక్క ఏడుగురు కూతుళ్ళలో మేయో ఒకటి. అట్లాసు ఈ ఏడు మందిని ఏడు నక్షత్రములుగా మార్చివేసినాడు (మన సప్తర్షి మండలం) దీనిని అంటే ఈ నెలను వయసులో పెద్దవాళ్ళకు (maiores) అంకితమిచ్చినారు.
    జూన్: జూపిటర్ భార్య జూనో ఈ జూన్ మాస స్థానానికి ఈవిడ జూనియస్ అన్న దేవునితో పోరాడుతుంది. వారిరువురి పేర్లతో జూన్ వచ్చింది. దీనిని యువతకు (juniores) అంకితమిచ్చినారు.
    తరువాత నెలల పేర్లు పెంటలిస్, సేక్స్టలిస్, సెప్టంబర్,అక్టోబర్, నవంబర్, డిసెంబర్ గ ఉండేవి. 5, 6 నెలలైన పెంటలిస్, సేక్స్టలిస్ లను జూలై, ఆగష్టులుగా తమ పేర్లతో జూలియస్, అగస్టస్ సీజర్లు మార్చుకొన్నట్లు మనము చెప్పుకొన్నాము. 7వ నెలనుండి 10వ నెలవరకు పేర్లు అట్లే వుండిపోయినాయి.
    సెప్టెంబర్ – సెప్ట్ అంటే సప్త 7వ నెల
    అక్టోబర్ – అక్ట్ అంటే అష్ట 8వ నెల
    నవంబర్ – నవ అంటే నవ 9వ నెల
    డిసెంబర్ – డెస్సి అంటే దశ 10వ నెల
    దీనిని బట్టి ఈ మార్పులకు ముందు 11వ నెలగా జనవరి, 12వ నెలగా ఫిబ్రవరి వున్నట్లు రూఢియై పోయింది.
    ఇక వారములైన సండే, మండే .. .. .. .. సాటర్ డేలను మన వారముల పేర్లను వారు వారి భాషలలోనికి మర్చుకొన్నావే.
    ఇన్ని మార్పులు చేర్పులు కూర్పులు జరిగిన తరువాత కుడా వారి కాలమానము భుభ్రమణముతో పోల్చిన 26 సెకన్ల తేడా వున్నది. ఆ సెకన్లు 3323 సంవత్సరములకు ఒకరోజు ఔతుంది. దానిని ఆ సంవత్సరములోని ఒక నెలకు (బహుశ ఫిబ్రవరికేనేమో) కలుపుకొన వస్తుంది.
    వాస్తవ కాల గణన కొరకు తమ తప్పులు తాము తెలుసు కొనుచూ కృషి చేసిన శాస్త్రజ్ఞులు కల్గిన ఈ రోమన్ క్యాలెండరు తప్ప, ప్రాచీన నాగరికత కలవని చెప్పుకొనెడు ఎన్నోపాశ్చాత్య దేశములు వారి వారి దేశ కాలానుకూలంగా తయారు చేసి వాడుకొన్నానూ, కాలానికి కాలొడ్డి నిలువలేకపోయినవి. మయుల క్యాలెండరు లోని చివరి దినమైన 21 డిసెంబరు 2012 న యుగాంతము కాలేదు కదా!
    చివరిగా ఒక మాట చెప్పి ముగించుతాను. మనకు రోజు అనేది ఉదయం (ఇంచుమించు) 6గం. లకు ఔతుంది. ఈ విషయాన్ని పాశ్చాత్యులు తమ
    కేలెండరునకు అనుకూలముగా మార్చుకోలేక యదా తధంగా తీసుకొన్నారు. మరి వాళ్ళకు రోజు రాత్రి 12 కు గదా మొదలయ్యేది అంటారేమో. వాళ్ళకు మనకు కాల వ్యత్యాసము ఇంచుమించు 6 గంటలు. మనకు 6గం. ఉదయమైతే వాళ్ళకు అర్ధరాత్రి 12గం. కదా.
    డిసెంబర్ 25 న క్రీస్తు పుట్టుక జరుగలేదు. జనవరి 1 క్రొత్త సంవత్సరము కాదు. ఇప్పటికైనా మనసు పెట్టి ఆలోచించితే మన పూర్వీకుల ప్రతిభను పునరుజ్జీవింప జేయ గలము.ఇకనైనా క్రొత్త సంవత్సరము ఉగాదితో మొదలౌతుందన్న వాస్తవాన్ని భాతీయ కాలగణన చదివిన తరువాత ఆకళింపు చేసుకొని ఆప్రకారంగానే మొదలు పెడతారని ఆశిస్తున్నాను.
    మాటలలో ఏదన్నా చొరవ తీసుకోనివుంటే తప్పుగా తలవరని ఆశిస్తాను.
    స్వస్తి
    Like ·  · Share
    • Cheruku Ramamohanrao


Boost Post
4 people saw this post

Posted by Unknown at 10:52 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: పాశ్చాత్య కాల గణన
Newer Posts Older Posts Home
Subscribe to: Posts (Atom)

Blog Archive

  • ▼  2025 (1)
    • ▼  April (1)
      • చిటపట చెమటలు (చిటపట చినుకులు పడుతూవుంటే పాట రాగము)
  • ►  2024 (4)
    • ►  July (3)
    • ►  June (1)
  • ►  2023 (9)
    • ►  December (1)
    • ►  September (2)
    • ►  August (3)
    • ►  June (1)
    • ►  April (2)
  • ►  2022 (5)
    • ►  September (1)
    • ►  May (1)
    • ►  April (1)
    • ►  March (1)
    • ►  January (1)
  • ►  2021 (33)
    • ►  December (3)
    • ►  September (8)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (4)
    • ►  May (3)
    • ►  April (1)
    • ►  March (2)
    • ►  February (4)
    • ►  January (6)
  • ►  2020 (21)
    • ►  December (7)
    • ►  November (1)
    • ►  October (2)
    • ►  August (2)
    • ►  July (1)
    • ►  May (1)
    • ►  April (1)
    • ►  March (2)
    • ►  February (3)
    • ►  January (1)
  • ►  2019 (22)
    • ►  December (3)
    • ►  November (2)
    • ►  October (2)
    • ►  September (1)
    • ►  August (2)
    • ►  July (1)
    • ►  June (3)
    • ►  May (1)
    • ►  April (1)
    • ►  March (1)
    • ►  February (1)
    • ►  January (4)
  • ►  2018 (32)
    • ►  December (2)
    • ►  November (1)
    • ►  October (1)
    • ►  September (6)
    • ►  July (6)
    • ►  June (5)
    • ►  May (4)
    • ►  April (6)
    • ►  January (1)
  • ►  2017 (20)
    • ►  December (3)
    • ►  November (4)
    • ►  July (7)
    • ►  June (3)
    • ►  March (3)
  • ►  2016 (46)
    • ►  December (4)
    • ►  November (2)
    • ►  October (8)
    • ►  September (1)
    • ►  August (4)
    • ►  July (17)
    • ►  June (7)
    • ►  May (1)
    • ►  April (1)
    • ►  January (1)
  • ►  2015 (28)
    • ►  December (1)
    • ►  November (10)
    • ►  October (6)
    • ►  September (3)
    • ►  July (1)
    • ►  May (2)
    • ►  March (4)
    • ►  February (1)
  • ►  2014 (31)
    • ►  November (2)
    • ►  October (1)
    • ►  September (2)
    • ►  August (5)
    • ►  July (5)
    • ►  June (8)
    • ►  May (3)
    • ►  April (1)
    • ►  March (2)
    • ►  February (2)
  • ►  2013 (46)
    • ►  December (7)
    • ►  November (3)
    • ►  October (13)
    • ►  September (10)
    • ►  August (9)
    • ►  July (4)

About Me

చెరుకు రామ మోహన్ రావు, Cheruku Rama Mohan Rao
View my complete profile
Awesome Inc. theme. Theme images by merrymoonmary. Powered by Blogger.