Saturday, 10 November 2018

ఖగోళము - ఆశ్లేష నక్షత్రము (https://cherukuramamohanrao.blogspot.com/2018/11/blog-post.html)


ఖగోళము - ఆశ్లేష నక్షత్రము
(https://cherukuramamohanrao.blogspot.com/2018/11/blog-post.html)
నేను ఆశ్లేష నక్షత్రమును గూర్చిన వివరములను ఖగోళ పరముగా తప్ప జ్యోతిష పరముగా విశ్లేషించుట లేదు.
ఆశ్లేష నక్షత్రమునకు  అధిదేవత పాము. అది ఎట్లు అన్నది ఒకసారి గమనించుదాము. ఆచార్య వరరుచి భూమినుండి ఆకాశములోని ఆశ్లేషా నక్షత్రమును జూసి 'సర్ప ఋతుఅన్నాడు. భారతీయు గణిత శాస్త్రములో భూత సంఖ్యలుకటపయాది సంఖ్యలను గూర్చి సవిస్తారముగా నేను మన పూర్వులు π” విలువను "గోపిభాగ్యం...." అన్న శ్లోకములో ఏవిధముగా బంధించినారు అన్నవిషయమును తెలుపుటకు ముందు, తెలిపినాను. భూత సంఖ్యలలో మనకు ఎరుకలోని ఒక విషయము ఏ సంఖ్య లేక అంకెను తెలుపుతుందోఆపేరును వాడినపుడు ఆ అంకెను లేక సంఖ్యకు ప్రతీక వుండే సంజ్ఞను తీసుకొంటాము. ఉదాహరణకు ఋతు అంటే 6, ఋషి అంటే సప్తర్షులు 7, ఆవిధముగా.
ఆశ్లేష విషయములో వరరుచి గారు సర్ప ఋతు అని వాడినారు. సర్ప అంటే పాముఅది వంకర టింకరగా వుంటుంది. ఋతు అంటే ఋతువులు. అవి ఆరు. అంటే మొత్తము అర్థమును క్రోడీకరించితే ఆశ్లేషా నక్షత్ర సముదాయము 6 నక్షత్రములను కలిగి పాముచుట్ట ను బోలి లేక పామువలె వంకరటింకరగా వుంటుంది అని గ్రహించవచ్చు. ఈ విషయమునే దీపికాకారుడు 'చక్రాకృతిః షణ్ణక్షత్రాత్మకంఅన్నాడు. ఇదే విషయమును వేదము 'ఆశ్రేషా నక్షత్రం- సర్పో దేవతాఅంటూవుంది. ఇంకా 'తేన సర్పాసో హవమాగమిష్టాః – ఏ రోచనే సూర్యస్యాపి సర్పాఃఅని చెబుతుంది. దీనినిట్లుంచి సూర్యుని విషయమును గూర్చి పాశ్చాత్యుల పరిశోధనలను ఒకసారి చూద్దాము.
మనము భౌతిక శాస్త్రము(Physics)లోని కాంతి శక్తి (Light Energy) లో కాంతికిరణము ఒక గాజు పట్టకము(Glass Prism) గుండా పయనించినపుడు వర్ణవికిరణము(Divergence of Light) జరిగి VIBGYOR అన్న 7 రంగులుగా మారుతుందని చదివియుంటాము.
(Intermediate కు వస్తే 10th Syllabus గుర్తుంచుకోనక్కరలేదు అన్న మహనీయుల నీతివాక్యము విన్న వాడిని కాబట్టి, ఆ కోవకు చెందిన వారికి బహుశ ఇది గుర్తుండక పోవచ్చునని సంశయించుచున్నాను.)
1670 ప్రాంతములో అంటే 17వ శతాబ్దములో కాంతికిరణమును గూర్చి విస్తారమయిన ప్రయోగములు చేసి జగతికి చాటినవాడు న్యూటన్. దీనిని Corpuscular Theory అంటారు. Corpuscle అంటే ఒక అతిచిన్న పొట్లము (Packet) గా అనుకొనవచ్చు.  అంటే ఒక కాంతి కిరణము సూర్యునినుండి కొన్ని కోట్ల కోట్ల  పాకెట్స్ గా అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన, ఒక packet కు ఇంకొక packet కు గల, మధ్య దూరముతో సరళ రేఖలో  ప్రయాణము చేయుచున్నట్లు ఆయన ప్రతిపాదించినాడు. ఆయన తన ప్రతిపాదనను, పరావర్తనము, వక్రీకరణ సిద్ధాంతములతో సమర్థించుకొన్నాడు. అదే 1678 ప్రాంతములో Hygiene అనే Dutch Scientist వెలుతురు కిరణములు తరంగముల రూపములో పయనించుచున్నట్లు తెలిపినాడు. దీనిని Interfearence మరియు Difraction అన్న సిద్ధాంతాల సహకారముతో ఆయన తన వాదనను సమర్థించుకొన్నాడు.
ఒకే కాలము వారయినాకూడా తమ తమ సిద్దాంతముల మధ్య సమన్వయ సాధనకు వారు కృషి చేయలేదు.ఎవరి సిద్ధాంతమునకు వారు కట్టుబడి మొండిగా కూర్చొని ఉండిపోయినారు. పరిష్కారమునకన్నా పట్టుదల ముఖ్యమనుకొన్న మహనీయులు వారు. ఇందులో కూడా మనకు Newton పేరు మాత్రమే తెలుసు Hygiene మనలో చాలామందికి అగంతకుడే! దీనిని బట్టి Newton వంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్తకు స్వార్థము, అర్థము(ధనము)  తప్ప లోకహితార్థము లోపించినదని అర్థమగుట లేదా!
మిగిలినది మరొకసారి......
             ఖగోళము - ఆశ్లేష నక్షత్రము
                                 (2వ భాగము) 
ఈ పరస్పర వైరుధ్యములచే సమస్య సందిగ్ధముగానే ఉండిపోయినది 19వ శతాబ్దము వరకు. 
 Einstein 19వ శతాబ్దములో పై రెంటినీ సమన్వయము చేస్తూ Quantum theory ని ప్రతిపాదించినాడు. ఒక నావంటి పామరునికి అర్థమయ్యే రీతిలో చెప్పవలసి వస్తే ఈ corpuscles అన్నీ ఒకదానినొకటి ఆనుకొని తరంగ రూపములో పోతున్నాయి అన్నది ఈ ప్రతిపాదన. అంటే ఒక 12౦ సంవత్సరాలుగా ఇది Scientists అంగీకరిస్తున్న విషయము. అంటే అంతకు ముందుకాలము వరకు అయోమయావస్థలోనే ఆలోచనలను కలిగియుండినారు. ఇపుడు గ్రహ, గ్రహణ సంబంధితమైన వివరములు, వివరణలు ఈ సిద్ధాంతముననుసరించియే లోకమునకు చాటబడుచున్నవి. మన మహర్షులు ఈ విషయమును ఎన్నో లక్షల సంవత్సరముల క్రితము, అపౌరుషేయములైన మన వేదములలో చెప్పిన ఈ మాటను, మనకు అందించినారు. ఇంతటి విషయమును పాశ్చాత్యులు 12౦ సంవత్సరముల క్రితము మాత్రమే పుష్టి చేసుకొనగలిగినారు.
ఇపుడు మన వేదశాస్త్రములలో ఏమని తెలిపినారో ఒకసారి పరిశీలించుదాము.
అంతకన్నా ముందు శాస్త్ర చోదితమైన ఈ విషయమును గమనించండి.
రథస్యేకం చక్రం భుజగయమిత సప్తతురంగః
నిరలంబో మార్గః చరణరహితహ్ సరథిరపి.
 రవిర్యార్తేవంత్యం  ప్రతిదినమపారస్య నభసః 
క్రియాసిద్ధిః సత్వే భవతి మహతాం నోపకరణే.    

రథానికి చక్రమా ఒకటే!, కళ్ళెములా పాములు,గుర్రములా ఒకటి కాదు ఏడూ, మార్గమా సరళరేఖ కాదు, సారధి చూస్తామా అసలు కాళ్ళే లేవు, అయినా సూర్యుడు లోకానికి వెలుగు పంచుటకు తాను ప్రతిరోజు ఆ కష్టాన్ని అనుభవించుతూనే వున్నాడు/ఉంటాడు. మహనీయులు కేవలము ఆశయము-ఫలితముపై ధ్యాసనుంచుతారు కానీ తమకు కలిగే కంటకాలను గూర్చి కాదుఅన్న విషయాన్ని అక్షరాలా పాటించి ఉన్నతి సాధించిన శ్రేష్ఠులను  ఆదర్శముగా తీసుకుని వీరు అడుగు ముందుకు వేయటం జరిగింది.
శ్లోకార్థము అంతా మనకు ఈ సందర్భములో అవసరము లేదు. కావలసినది మాత్రమె తీసుకొందాము. పైశ్లోకములో ఎంత నిర్ద్వంద్వముగా, నిశితముగా  నిస్సంకోచముగా, చెప్పినారో గమనించినారు కదా! చక్రము ఒకటే అంటే రథము ఒక చక్రముతో నడువలేదు. ఒక వేళ రథమునకు మధ్యలో ఉంచితే నడువవచ్చునుు
అనుకొంటే నిశ్చలత లోపిస్తుంది, అంటే సూర్యుడు రథములో ఉంటాడు కానీ  కదలడు. చక్రమా కాలచక్రము. అది తిరుగుతూనే ఉంటంది, stand వేసి pedal త్రోక్కుతూవుంటే తిరిగే cycle చక్రము లాగా! ఇక సారధికి నడుము వరకే శరీరము. అతనూ కదలడు. 7 గుర్రములు, వర్ణ వికిరణము చెందే 7 రంగులు. పగ్గాలు పాములుఅంటే వంకరటింకరగా వుంటాయి. ఇంతకంటే గొప్పగా ఏ scientist కూడా చెప్పలేదు సూర్యుని గూర్చి.
అంతటి గొప్ప విషయములు చెప్పినవారు ఎల్లపుడూకిం అర్థం దుఃఖబాజనం అనుకొన్నారు. అందుకే patent అన్న ఊహ కూడా వారికి రాలేదు.
మనము ఈ పాము నడకను బోలిన వెలుగు కిరణ ప్రయాణమును వేదములో ఏ విధముగా వర్ణింపబడినదో ఇపుడు చూద్దాము.
ఖగోళము - ఆశ్లేష నక్షత్రము (చివరి భాగము)
భుజగ నమితాః సప్త తురగాః
ఏదో రోచనే దివో, ఏవా సూర్యస్య రశ్మిషు
ఏషామప్సుషదః కృతం తేభ్యః సర్పేభ్యో నమః   (Time 15.25)
ఇక్కడ పైన చెప్పిన భుజగ నమితాః సప్త తురగాః అన్నది తీసుకొంటే ఏడు గుర్రములు పాములవలే, వంకరటింకరగా, వంగి వున్నాయి. ఇక రెండవ వచనములో సూర్యస్య రశ్మిషు అన్న మాట వస్తుంది. రశ్మి అంటే కళ్ళెము మరొక అర్థము కిరణము. కిరణము అన్న అర్థము మనకు తెలిసినదే!
ఏడు గుర్రములకు కళ్ళెములు పాములు కదా! అవి  నిటారుగా వుండవు కదా! నిటారుగా వుంటే గుర్రములు నిలచిపోతాయి.
మరొక ఆశ్చర్యకరమగు వాస్తవమును పరిశీలించుదాము. జాతకాలు వ్రాయునపుడు రాశి, అంశ చక్రములను వేస్తాము. అందు మనము రాశి చక్రమును గమనించితే ఆశ్లేష నాలుగు పాదములు కర్కాటక రాశికి చెందుతాయి. ఆ చక్రములో దానికి పూర్తి వ్యతిరేక దశలో మకర రాశి వుంటుంది. మకరములో శ్రవణా నక్షత్రము తన నాలుగు పాదములనూ కలిగియుంటుంది. శ్రవణము విష్ణుమూర్తి నక్షత్రము. విష్ణువు వుంటే గరుత్మంతుడు అక్కడ వున్నట్లే! ఇందుకు సంబంధించి మనకు విష్ణు సహస్రనామములో 21వ శ్లోకము ఈ విధముగా వుంది.
మరీచిర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః
భగవద్గీతలో శ్రీ కృష్ణుడు విభూతి యోగములో తనను గూర్చి ఈ విధముగా చెప్పుకొన్నాడు.
ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్|
మృగాణాం చ మృగేన్ద్రోహం వైనతేయశ్చ పక్షిణామ్  || 10-30 ||
నేను దైత్యులలో ప్రహ్లాదుడీనిలెక్కలు కట్టేవాళ్ళల్లొ కాలాన్నిమృగాలలో మృగేంద్రుడినిపక్షులలో గరుత్మంతుడిని.
గరుత్మంతునకు  సుపర్ణ అన్నది ఒక పేరు. ఈయన పక్షులకు రాజు. వైనతేయుడు అన్నది కూడా గరుత్మంతునియొక్క మరొక పేరు.అఖిల చరాచర జీవరాశులలో ఏదయితే శ్రేష్ఠమో అది శ్రీ మహావిష్ణువే! ఆవిధముగా ఒకే స్వరూపమును వేర్వేరు పాత్రలు అనగా శ్రీకృష్ణుడు, భీష్ముడు తెలియజెప్పినా అందు అభిప్రాయ భేదములు లేవు. అదే విధముగా నాగులలో శ్రేష్ఠుడగు అనంతుడు కూడా విష్ణ్వంశ సంభూతుడే!
మరి గరుడునికీ నాగులకూ వైరము కదా! ఇక్కడ ఈ విషయమును ఖగోళ పరముగానూ, కొంత లౌకికముగానూ చర్చించుదాము. గరుడుడు విష్ణు వాహనమే! ఆయన ప్రయాణమునకు ఉపయోగపడుతాడు.పరమాత్మ యోగములో ఉన్నపుడు ఆయన సమయమంతా అనంతునితోనే.
ఆశ్లేషా నక్షత్రము సర్పాకారము అని నిర్దారించుకొన్నాము. ఆశ్లేషా నక్షత్రము కర్కాటక రాశికి చెందినది. అదేవిధముగా విష్ణువు నక్షత్రము శ్రవణము. ఇది మకరరాశికి చెందినది. ఈ రెండు రాశులూ ఎల్లపుడూ 18౦డిగ్రీల కోణములో వుంటాయి. మరి సర్పము విష్ణు నక్షత్రమునకు సరళరేఖలో (180 డిగ్రీలు) ఉంటె విష్ణువు గరుత్మంతునితో ఉన్నట్లే కదా! కావున సుపర్ణుడగు విష్ణువు భుజగోత్తముడగు విష్ణువునకు 180 డిగ్రీల కోణములో వున్నాడు. సాపేక్షముగా ఈ రాశులు క్షితిజము నుండి ఉద్భవించి 180 డిగ్రీల కోణమును పాటీంచుతూ పయనించుచుంటాయి. అంటే మకరము పుట్టే సమయమునకు కర్కాటకము అస్తమించబోతూ వుంటుంది. అంటే గరుడుని చూస్తే పాము కనుమరుగౌతుంది అన్న లౌకిక, ప్రాకృతిక వాస్తవము ఇక్కడ ప్రతిఫలించుతూ వున్నది.
ఒక కర్కాటక రాశియేగాక సింహ,కన్య, తులా రాశులు కూడా సర్పాకృతి కలిగియుండుటతో అంతాకలుపుకొంటే అది మహా సర్పమౌతుంది. ఆవిధముగా ఆ ఆకృతిని ఆదిశేషునిగా ఊహించవచ్చు. ఆవిధముగా మనకు పై విషయములు అన్నింటికీ సమన్వయము కుదురుతుంది.
మరొక విషయమును గమనించుదాము.

ఒక దినము యొక్క సూర్యోదయాత్ ఏ నక్షత్రము ఉదయించుతుందో ఆ నక్షత్రము యొక్క అధిదేవత యొక్క వ్రతమును, పూజను, పండుగను పాటించుతారు. ఉదాహరణకు భాద్రపద శుక్ల చతుర్థి నాడు వినాయక వ్రతమును ఆచరించుతాము. మనకు తెలిసిన 27 నక్షత్రములు గాక ఆకాశములో అనంత నక్షత్ర సముదాయాలున్నాయి. వానిలో వినాయక నక్షత్ర సముదాయమొకటి.
తరువాతి రోజయిన పంచమిని మనము ఋషిపంచమిగా గుర్తించి ఆచరించుతాముఖగోళ విషయములో ఋషి అంటూనే మనకు జ్ఞాపకమునకు వచ్చేది సప్తర్షి మండలము. ఇది 27 నక్షత్రమండలములలో లేకున్నా దీనికి కూడా ఉదయాస్తమానాలు వుంటాయి. ఆశ్లేష తరువాత వచ్చే మఖ నక్షత్రముతో బాటూ ఇవి కూడా చవితి తరువాతి రోజు అనగా పంచమి రోజున ఉదయించుతాయి కాబట్టి ఆరోజు ఋషి పంచమి అయినట్లే చవితి రోజు వినాయక నక్షత్రములు కూడా అత్యంత స్వల్ప భేదముతో ఆశ్లేషకు ముందు ఉదయించుటచే వినాయకుని జన్నిదమయినది సర్పాకృతి కల్గిన ఆశ్లేష. అదే మాటను మనము శ్రీ గణనాధాష్టకము లోని ఈ శ్లోకములో చూచుటయే గాక
ఈ శ్లోకము వేదవాక్కును సమర్థించుట కూడా చూస్తాము.
శ్లోll ముంజీ కృష్ణమృగాజినధరం నాగయజ్ఞోపవీతం
     బాలేందు సకళా ద్మౌళే వందేహం గణనాయకం 2
పై శ్లోకమును నాగ యజ్ఞోపవీతనం అన్న వేదవాక్యము ఈ విధముగా పుష్టి చేయుచున్నది.
ఎంతటి విజ్ఞానమో గమనించినారు కదా! పరమతములలో వలె, వాళ్లకు ఉన్నాయి కాబట్టి మనకు వువుండవలెనను రీతిలో ఏర్పడినవి కావు. మన పండుగలు శాస్త్రార్థము సమన్వయము సహేతుకము అగు పర్వదినములు. 
అంతో ఇంతో ఎంతో కొంత తెలిసిన వారు, లేక, నాలాంటి తెలుసుకొన్నవారు చెబుతున్నపుడు మనసు పెట్టి చదవండి. ఉబుసుపోకకు ఊకదంపుడు కబుర్లు చెప్పుట లేదు. మన పూర్వుల ప్రతిభ గుర్తించండి.
చర్మ చక్షువులను జ్ఞాన చక్షువులుగా చేసి Telescopes(దుర్భిణులు) యొక్క సహాయము లేకుండా చూడగల్గిన మన సనాతన ఋషిగణమునకు మనఃపూర్వకముగా సాష్టాంగ దండప్రణామము తప్ప వేరేమి చేయగలము.
స్వస్తి

Monday, 22 October 2018

ఇది ఒక భీకర రణము పెనుగాలిది చిరు దివ్వెది

https://youtu.be/kKl3oDahI1s


ఇది ఒక భీకర రణము పెనుగాలిది చిరు దివ్వెది

https://cherukurammohan.blogspot.com/2018/10/blog-post.html
రఘురాముని శౌర్యము కాదిదీ
కురు పాండవ  యుద్ధము కానిదీ
ఇది ఒక భీకర రణము
పెనుగాలిది చిరు దివ్వెది

నింగిని మింగెను గాలి దుమారము
ఉప్పెన ఉరికెను ముంచగ తీరము
తరువుల తనువులు భువిపై వాలెను
చూడగ ఎంతో హృదయ విదారము
తీరగ నేరదు ఈ విచారము
మంచిని ముంచుటయే మరి లోకాచారము ఔనుగా
జీవులు నెలవులయందే నిలిచెను
మెదలక వదలక దేవుని తలచెను 
చీకటి గట్టి గోడల కట్టి యుంచిన సీమలో
ఇది ఒక భీకర రణము
పెనుగాలిది చిరు దివ్వెది

ఆకటి మంట మింటికి ఎగసె
కాలే కడుపుకు తానూ తోడుగ
జీవజాలమంతా మలమలలాడుచునుండగా
ఆశల వెలుతురు తా కలిగించెను
దేవుని దూతది ఎవరో గానీ
దివ్వెకు ప్రాణము పోసె ప్రాణుల ఆశలు తీరగా
చీకటి నొక తృటిలోనే చిదిమెను
ఆ చిరుదీపము కరవాలముతో
ఆదేవునిదే ఈ లీలా విధివిధానమూ
ఇది ఒక భీకర రణము
పెనుగాలిది చిరు దివ్వెది

చేయి విడిచినది ఈ లోకము
ఆరిపోయినదీ అనురాగము
తైలము ఆవిరియౌతూ ఉండిపోగా సర్వమూ
శక్తిని కూడదీసుకొంది
చావుకు భయపడనని తానంది
గాలికి రెపరెపలాడీ  రొమ్ము విరిచి యున్నది
దేవుని పైనే నమ్మకముంచి  
ప్రాణము తప్పకనిలుపున నెంచి
ఆ విశ్వాసము వెలుతురు లోపల నింపెనూ
ఇది ఒక భీకర రణము
పెనుగాలిది చిరు దివ్వెది

ఒక అవ్వ ముదుసలి గువ్వ
గాలీ వానల సరుకే చేయక
దివ్వెకు ప్రాణము పోసేను వేయుచు దానికి తైలము
దీపము క్రొత్త ఉత్సాహముతో
చిమ్మెను కాంతి దిక్కుల నిండా
చీకటి ప్రాణము, వెలుతురు చేతిన మశియై పోయెను
గాలికి చేతలుఉడిగీ పోయెను
చేతులు ముడుచుకు వెనుకకు తగ్గెను
చిరుదీపమే మరి చివరకు నెగ్గెను
ఇది ఒక భీకర రణము
పెనుగాలిది చిరు దివ్వెది

దేవుని తోడు వుంటే చాలును
చేయును అదియే అంతామేలను
వాస్తవమ్మును జగతికి చాటెను
దారుణ రణమీ విధముగ ముగిసెను
శాంతి సుఖమే చివరకు మిగిలెను
చెడుపై మంచే గెలిచెను చివరకు చూడగా
ఉంచిన నమ్మకమాదేవునిపై
ఇంచుక ఉంచక భారము మనపై
అంతా తానెయౌచూ మనలను బ్రోచునూ
ఆయన వీక్షణమే మన
రక్షణయౌచూ కాచును     llరఘురామునిll



Saturday, 29 September 2018

చాటువెంత నీతి చాటె చూడు (బక మరాళ సంవాదము)


చాటువెంత నీతి చాటె చూడు (బక మరాళ సంవాదము)
https://cherukurammohan.blogspot.com/2018/09/blog-post_29.html
నేను మీకు చెప్పబోయే చాటువును గూర్చి నా మాటగా ఈమాట చెబుతున్నాను.
చక్కనైన మాట చదివిన విన్ననూ
చక్కబడును బుద్ధి సవ్యముగను
చద్దియన్నమునకు చల్ల చేర్చిన రీతి
చాటువెంత నీతి చాటె చూడు
ఒక చెరువులో కొన్ని కొంగలు(సంస్కృతములో బకము అంటే కొంగ అని అర్థము.) ఉండినాయి. వాటి వద్దకు ఒకరోజు ఒక హంస వచ్చింది. వాటి మధ్య జరిగిన సంభాషణకు అక్షర రూపమే ఈ చాటు పద్యము. రసవిహీనుల మధ్య ఒక పండితుడు, చెడ్డవారి మధ్య మంచివాడు చేరితే ఎంత అవహేళనకు గురియౌతాడో తెలియజెప్పే చాటువిది.

ఎవ్వడవీవు కాళ్ళు మొగమెర్రన? హంసమ! ఎందునుందువో?
దవ్వుల మానసంబునను! దాన విశేషములేమి చెప్పుమా?
మవ్వపు కాంచనాబ్జములు, మౌక్తికముల్ కలవందు! నత్తలో?
అవ్వి యెరుంగమన్న 'నహహా' యని నవ్వె బకంబులన్నియున్
హంసలు హిమాలయంలో ఉన్న మానస సరోవరములో విహరిస్తాయి. ఆ సరస్సులో బంగారు వర్ణము తో మెరిసే మవ్వపు పద్మములు అంటే కోమలమైన పద్మములు, మేలిమి ముత్యములు వుంటాయి. నత్తగుల్లలు, కప్పలు వెదకినా దొరకవు. మామూలు చెరువులలో ఉంటూ నత్తలు, చేపలు తిని బ్రతికే కొంగలకు శ్రేష్ఠమైన పద్మముల, ముత్యముల గురించి తెలియదు కదా!
బుద్ధిహీనులు ఎదుటివారి గొప్పదనము గానక ఎంత హీనముగా ప్రవర్తించుతారు అన్నదే ఈ చాటువు తెలిపే బకమరాళ సంభాషణ. దిగువన గమనించండి.
కొంగలు ---“ ఎవరు నీవు? నీ కాళ్ళు ముఖము ఎర్రగా వున్నాయి ఎందుకు?
హంస: “నేను హంసను!”
కొంగలు: “ఎక్కడ నుండి వచ్చినావు?”
హంస: “చాలా దూరములో వున్న మసనస సరోవరము నుండి వచ్చినాను!”
కొంగలు: “అక్కడి విశేషాలేమిటి?”
హంస: “అచ్చట బంగారు వర్ణము గల తామర పువ్వులు, మంచి ముత్యములు లభించుతాయి.
కొంగలు: “అక్కడ నత్తలు ఉంటాయా?”
హంస: “అవేమిటో నాకు తెలియదు!”
కొంగలు: “నత్తలు తెలియవా?”
హంసలు: “నాకు తెలియదు!”
కొంగలు: “నత్తలు తెలియవా?” అని పకపక నవ్వినాయట.
ఇక్కడ మనము గమనించవలసినది ఏమిటంటే ఎన్నో విషయాలను, విశేషాలను, అనుభవాలను, తెలిసిన వారు లేక పండితులు లేక అనుభవమున్న పెద్దలు, చెప్పినా అల్పులకు వానిని గ్రహించవలసిన చింతన ఉండకపోగా అన్నీ తెలిసిన తమకా ఈ మూర్ఖులు చెబుతున్నారు అనుకొంటారు. ఈ విషయము తెలిసి కూడా విజ్ఞులు తాము ప్రయత్న లోపము చేయరు. భీష్మద్రోణాది మహనీయులు దుర్యోధనుని దుష్ట బుద్ధి తెలిసికూడా తమ ప్రయత్నమును తాము చేయుట మానలేదు కదా!
ఈ భావమునే శ్రీ నాథుడు తన ‘భీమేశ్వర పురాణము’ లో కుకవి నింద చేస్తూ 
అడవి కాకులు జేరి బిట్టరచునపుడు 
ఒదిగి రాయంచ యూరక యుంట లెస్స 
సైపలేకున్న ఎందేని చనుట యొప్పు
తెలిసి యద్దాని వాతెర తెరువరాదు
అని మందలిస్తాడు. అంటే చెడ్డవారి మధ్య ఓ మంచివాడు వున్నపుడు వారి వెక్కిరింపు మాటలకు మౌనముగా ఉండటమో లేక అక్కడినుండి వెళ్లిపోవడమో ఉత్తమమని ఉపదేశమిస్తూవున్నాడు కవి సార్వభౌముడు. కావున ‘మనకన్నా విద్య, విజ్ఞానము, వయస్సు అధికముగా ఉన్నవారిని ఎప్పుడూ ఎగతాళి చేయ కూడదు.’ ఎంతటి యోగ్యమైన మాటో కదా! ఈ దిగువన పద్యములో నా అనుభవమును పొందుపరచినాను. గమనించగలరు.
చెవిటి వానియొద్ద చేరి శంఖము నూద
ఎముక గొరుకుచుంటివేల యనును
మూర్ఖ మతుల నడుమ మూర్ధన్యుడిట్లురా
రామమోహనుక్తి రమ్యసూక్తి!
ఈ పద్యమును కూడా శ్రద్ధతో చదివి అభ్యసించండి.
పెద్ద వారితోడ పేరుగల వారితో
బుధులతోడ  భూరి ధనదు తోడ
ఆప్తజనుల మరియు ఆచార్య గురులను
గడుసుదనము మాని గౌరవించు
ఇక వేమనగారు అలతి పదాలతో ‘జ్ఞాన,విద్యా వయోధనులకు’ ఎంత చక్కటి సలహా ఇస్తున్నారో చూడండి.
అనువు కానిచోట అధికులమనరాదు
కొంచేముండుటెల్ల కొదువ కాదు
కొండ అద్దమందు కొంచెమైయుండదా
విశ్వదాబిరామ వినుర వేమ!

ఇది ఎవరికైనా ఎంతో ఆచరణ యోగ్యమైన మాట. తప్పక చదవండి. చదివి ఆచరించండి.

స్వస్తి

Saturday, 8 September 2018

ఒక చాటువు


ఒక చాటువు
ఈ చాటువునకు కర్త ఎవరో నాకు తెలియదు, చాటుపద్య మణిమంజరిలో చదివినట్లు గురుతు, కానీ ఇందులోని భావమును గ్రహించుటకు మాత్రము మెదడుకు పదును పెట్టవలసిందే! ముందు పద్యమును చదవండి.
"సరసిజనేత్ర! నీ మగని చక్కని పేరది యేదొ చెప్పుమా"
"అరయఁగ నీవు న న్నడుగ నాతని పే రిదె చిత్తగింపుమా
కరియును, వారిరాశి, హరుకార్ముకమున్, శర, మద్దమున్, శుకం
బరుదుగ వ్రాయఁగా నడిమి యక్షరముల్ గణుతింపఁ బే రగున్"

మొదటి రెండు పాదములు ఒకావిడ(భావన మాత్రమే. మగవాడు కూడా ఆ స్త్రీని అడిగియున్దవచ్చును. దానికి ప్రాధాన్యత లేదు.) మరియొక ఆవిడను భర్తపేరు చెప్పమనుట,  ఆమె కరి, వారిరాశి, హరుకార్ముకము, శర, అద్దము, శుకము అన్న పేర్లు చెప్పి వీని నామాంతరముల మధ్యాక్కరములను గ్రహించిన తన భర్త పేరు వస్తుంది అని చెబుతుంది. ఇపుడు ఆయా పేర్లు ఏమిటో చూద్దాము.

‘కరి సారంగం (ఏనుగు, లేడి తుమ్మెద అన్న అర్థములు కూడా వున్నాయి), వారిరాశి సాగరం, హరు కార్ముకము పినాకం, శరము సాయకం (బాణం), అద్దం ముకురం, శుకము చిలుక.’
ఇందులోని మరొక ప్రత్యేకత ఏమిటంటే ఆ పర్యాయ పదములు ఆరున్నూ మూడక్షరములు కలిగినవే! ఈ విధముగా వ్రాయుట అంత సులభమగు విషయము కాదు.

పై ఆరు పదాల్లోని మధ్యాక్కరములను కలిపితే ‘రంగనాయకులు’ అవుతుంది. ఆ సుందరాంగి భర్తపేరు రంగనాయకులు అని నేరుగా చెప్పకుండా చెప్పింది. పూర్వము భర్త పేరు చెప్పకూడదు అన్న ఆనవాయితీ వుండేది. ఎంత సుందరంగా చెప్పిందో కదా!.
చెఱుకు రామ మోహన్ రావు


ఏకవింశతి పత్రములు

ఏకవింశతి పత్రములు

(వినాయకుని పూజించే 21 ఆకుల పేర్లు)

 http://cherukurammohan.blogspot.com/2018/09/21-1.html

1. మాచీ పత్రం (మాచుపత్రి )

2. బృహతీ పత్రం (నేల మునగ లేక వాకుడు ఆకు)

3. బిల్వ పత్రం (మారేడు ఆకు)

4. దూర్వాయుగ్మం (గరిక)

5. దత్తూర పత్రం (ఉమ్మెత్త ఆకు)

6. బదరీ పత్రం (రేగు ఆకు)

7. అపామార్గ పత్రం (ఉత్తరేణి)

8. తులసీ పత్రం (తులసి ఆకు)

9. చూత పత్రం (మామిడి ఆకు)

10. కరవీర పత్రం (ఎర్ర గన్నేరు ఆకు)

11. విష్ణుక్రాంత పత్రం (విష్ణు క్రాంతి)

12. దాడిమి పత్రం (దానిమ్మ ఆకు)

13. దేవదారు పత్రం (దేవదారు ఆకు)

14. మరువక పత్రం (మరువం)

15. సింధూవార పత్రం (వావిలాకు)

16. జాతీ పత్రం (జాజి ఆకు)

17. గండకిపత్రం (అడవి మొల్ల)

18.  శమీ పత్రం (జమ్మి ఆకు)

19. అశ్వత్థ పత్రం (రావి ఆకు)

20. అర్జున పత్రం (తెల్లమద్ది ఆకు}

21. అర్క పత్రం (జిల్లేడు ఆకు, తెల్ల జిల్లేడు శ్రేష్ఠము)

ఈ ఆకులన్నీ ఆయుర్వేదము ప్రకారము దేహ స్వాస్థ్యమునకు ఎంతో ఎంతో ఆవశ్యకము. వినాయకుని ఈ ఆకులచే పూజించుటవలన  ఎటువంటి అనారోగ్యముల బారిని పడకుండా భక్తులను సదా ఆరోగ్యముగా వుంచుతాడు.

స్వస్తి.  

Wednesday, 5 September 2018

చెరుకు రసాలు


చెరుకు రసాలు
నా తండ్రి కీ.శే. వెంకప్ప గారు. దగ్గరివారంతా ఆయనను వెంకన్న అని పిలిచేవారు. ఆ ఎడుకొందలవానికి కూడా వెంకప్ప వెంకన్న అన్న పేరు వుంది. పేదరికముతో పెనుగులాడే రోజులలో పుట్టిన నన్ను ఉన్నతికి తెచ్చేచ్చుటకు ఆయన శ్రమకు నేను కేవలము కృతజ్ఞతతో పోల్చలేను. అంతకు మించి వేరేమీ చేయనూ లేను. నేను పేరు పెట్టుకొన్న ‘చెరుకు రసములు’ అన్న ఈ అన్త్యప్రాసంకితములగు ఈ పదములు ఆయనకు, తల్లి లేని నన్ను తల్లియై పెంచిన నా అమ్మమ్మకు అంకితం.
           2009 లో వ్రాసిన ఈ ‘చెరుకు రసాలు’ 2013 లో ఒకసారి ఎటువంటి ఉపోద్ఘాతము లేకుండా ప్రచురించి యుండినాను. ఇపుడు ఈ ఉపోద్ఘాతముతో                          రోజుకు ఒకటి వంతున తిరిగీ ప్రచురించుతూ వస్తాను.

ఏకినట్టి దూదికన్న                      
కరుగునట్టి వెన్న కన్న
మెత్తనైన మనసు వున్న
వెంకన్నే మా నాన్న

మది నిలచిన పైడి బొమ్మ
తలచితినా, కంటి చెమ్మ
ప్రేమ పెట్టి పెంచినమ్మ
ఆమే నా కమ్మకమ్మ
శ్రీ గణపతి
అక్షరమతి
నీ బహుమతి
ఈ పద గతి

తొండంయ్య          లేదు ఖ్యాతి      పలుకులమ్మ
దండమయ్య         కాదు నీతి          నలువ కొమ్మ
మంచి నియ్య        చెప్ప బోతి       రసన చెమ్మ
కొలుతునయ్య       లోక రీతి          నెలవు కమ్మ

రచయిత కలము         ఇంటికి దూలము          చేయుట కష్టము
కృషికుడు హలము       ఇంతికి చేలము                 చేయక నష్టము
ఎలుకలు బిలము         మనిషికి శీలము               అందని దిష్టము
కలిగిన బలము             గాంచని కాలము         నిజమిది స్పష్టము

ఎగురని పటము          కుదరని నెయ్యము       కల్లల పుంజము
పగిలిన ఘటము          పండని వియ్యము        స్వార్ధపు ప్ర్రాజ్యము
మానని హటము            కోరని కయ్యము          మోసపు నైజము
గన సంకటము            తెలిసిన చెయ్యము        ఏలెను రాజ్యము

ఆడని ఆట            చిక్కని మాట        పేదల సొమ్ము
పాడని పాట            చక్కని యాట          చేయుట వమ్ము
చెప్పని మాట         తియ్యని పాట         మానరు లెమ్ము
చిల్లుల  మూట         కమ్మని ఊట            నిజమిది సుమ్ము

పండని పంట        వెలదుల వాడ         చిరిగిన  జొల్ల
మ్రోగని గంట         దుష్టుల జాడ         తిరుగని నల్ల
కలియని  జంట     పట్టిన చీడ                 పాశిన దల్ల
ఎందు కనంట        వదలని పీడ           వాడుట కల్ల

వాడని నిలువ         గాలి లోన ఇల్లు                ఆరిన కొలిమి
వాడిన కలువ         మత్తులేని కల్లు                 జారిన కలిమి
మాసిన వలువ        పొద్దు బోని సొల్లు            దూర్తుల చెలిమి
ఎందుకు తలువ    చెప్పు ఎటుల చెల్లు           కలుగవు బలిమి

నీదు దీవెనలు చల్లి        
అస్తు అనుము కల్పవల్లి      
నింగి నిలువ ఓ తల్లి     
నా పదాల పాల వెల్లి



తల నిండా జడలు
బూదిపాలు ఒడలు
కాలునికే హడలు
ఆర్తికి తా సడలు

ఆగిన కొలిమి         ఆరని మొహం        ఆరిన కాడి          పగిలన జాడి    
జారిన కలిమి         తీరని దాహం         నలిగిన బీడీ             కదలని గాడి
ధూర్తుల చెలిమి     పారని వ్యూహం      అలసిన బాడి           కూలిన మాడి
కలుగవు బలిమి     ఎందుకు స్నేహం   కలుగవు వేడి           కుదరని జోడి

కరిచే చెప్పులు          పెరటికి చెట్టు              మనసున తెలుపు
నిలిచే అప్పలు          యువకుల కట్టు          మనుషుల కలుపు
తెలిసిన తప్పులు         పడతికి జుట్టు             మాయని వలపు                                                                                    
తెచ్చును ముప్పలు     తలపగ జట్టు          మమతల నిలుపు

సాంగ్స్ రీమిక్సు           రాలిన పూత               ఆరని గాయం
కుళ్ళినట్టి జోక్సు          రాల్చని దాత              అందని సాయం
సీనులేమొ సెక్సు          పేరుకు నేత               బరువగు కాయం
సినిమాలు జంక్సు       పుడమికి మోత           బాధల నిలయం

సెక్సీ లుక్సు             చూడగా టీనేజి             పగిలన కప్పు
లోయర్ సెక్సు        తలవగ హైఓల్టేజి          ఉడకని పప్పు
మాటల హుక్సు      చదవ బడితె కాలేజి       నిలువని కొప్పు
యువతకు కిక్సు     చెద బడితే గార్బేజి        ఎందుకు చెప్పు

కూడలిలో గాంధి                 పగలు క్లబ్బు         రాలిన బొచ్చు
కూడినచో బ్రాంది               రాత్రి పబ్బు           ఊడిన గచ్చు
పెల్లికేమొ నాంది                మందు గబ్బు        కాయల పుచ్చు
లేకున్న అదేంది                తెగని జబ్బు          ఎటు పనికొచ్చు

ఉమ్మిన కిళ్ళీ          మెతుకుల తట్టు      తోటకు మాలి
విరిగిన పాళి          నిండని పొట్ట          పాపకు లాలి
వివరపు స్థాళి         అతుకుల బట్ట       మనిషికి జాలి
వాడరు మళ్ళి         బ్రతుకున దెట్ట       మరి వుండాలి

ముందు క్యారేజి    వాడిన  వనము       జనహిత కాముడు
మళ్ళి మ్యారేజి       భీరుని గొనము      అరి జన  భీముడు
పిదప బ్రేకేజి         పలుకని జనము     రఘుకుల సోముడు
వెరసి స్టోనేజి         పాశిన శనము        జగదభి రాముడు

మాటలు కల్ల            వింటికి గుణము     దినమున సద్దు
చేతలు డొల్ల           రాజుకు గణము      ఖర్చుకు పద్దు
మనసొమ్మెల్ల          మనిషికి పణము      నారికి హద్దు
చేతురు గుల్ల        ఇది లక్షణము        ఉండుట కద్దు

పడవకు తెడ్డు        కట్టని చీర            హవేలీ నవాబు
కారుకు షెడ్డు        మెట్టని దార          కవేలూ గరీబు
తప్పుకు సొడ్డు        పాచిన కూర           కలిగినచో షబాబు    
ఉండిన  గుడ్డు       ఎందుకులేర          కలుపునులే షరాబు

చల్లటి గాలి            కాయని కొమ్మ      కైపులేని రమ్మ
సరసపు ఆలి          పూయని రెమ్మ       పనికిరాని సిమ్ము
పోయిన వాలి          పగిలిన బొమ్మ        బందుకది లెమ్ము
పోదుము తేలి         ఎందుకు లెమ్మా      తెలుసుకో నిజమ్ము

చదువులో సున్న           శాంతి లేని ఇల్లు        రష్ లేని బారు
స్టై లు లో మిన్న            సరుకు లేని మిల్లు       రుచిలేని సాంబారు
ఏమిలేకున్న                 పనికిరాని విల్లు           నడవలేని కారు
తపన ఎందుకన్న          ఉన్న ఎట్లు చెల్లు         ఉంది కూడా బోరు

చెల్లని చెక్కు         ఉండదు జెండా      జడ కల జుట్టు
వాడని హక్కు         ఉండదజెండా        నుదిటిన బొట్టు
మారని లక్కు         కనబడ కుండా       చీరల కట్టు
తీరని చిక్కు          స్వార్ధమె నిండా       మగువకు మట్టు

వాడని డబ్బు     తగలని తూటా       ఇతరుల బుద్ధి           టాపులేని టేబులు
రాలని మబ్బు    నడవని బాట        వదిలినట్టి గద్ది            మితి మీరిన డాబులు
అరిగిన సబ్బు    పేలని మాట          పాసినట్టి సద్ది              తెగిపోయిన కేబులు
ఎందుకు సుబ్బు  ఎందుకు బేట    పనికిరాని సుద్ది          ఎందుకొరకు బాబులు

కదలని క్యాబు      పళ్ళు పుచ్చుడెంటిస్ట్రీ          ముగిసిన జన్నం        చిరిగిన బుక్కు
కాలిన ట్యూబు       పస నెరుగని పోయట్రీ       కడుపుకు అన్నం        వదులగు హక్కు
చిల్లుల జేబు        పనికిరాని ఆర్టిస్ట్రీ              గడచిన బన్నం          వాడని హక్కు
వద్దుర బాబు        పండ్లనివ్వ లేని ట్రీ             బాధకు భిన్నం           వీడని చిక్కు

ఉండదు నిక్కు      పేదకు టెక్కు        మూతికి మీసము        ఇంటిముందు ముద్దబంతి
కూడదు టెక్కు        కారెడు ముక్కు    పెదవికి హాసము         ఇంతి జడన చేమంతి
కరిగిన లక్కు         లూజగు టక్కు     వంటికి కూసము         మోవిపైన హాస కాంతి
దేవుని మొక్కు      ఉండిన చిక్కు     సరి సహవాసము         అదేకదా సంక్రాంతి

పశువుకు గడ్డి       జాబెందుకు బోడి    పోర్ వీలరు గాడి     మానని జిద్దు
బిడ్డకు చెడ్డి          సిక్సు పేకు బాడి       డూప్లెక్సు మాడి         చదవని మొద్దు
అప్పుకు వడ్డీ          నైసు ఫ్రెంచి దాడి     సాధించే వేడి          తెమలని పద్దు
ముఖ్యము రెడ్డి       ఉన్న చాలు దాడి    ఉంటే నా జోడి         వద్దనె వద్దు 

అరిగిన బూటు       తెరవని గుడి          కళ్ళకు జోడు           పెరగని షేరు
విరిగిన బ్యాటు      కుదరని మది        కన్నెకు తోడు             కదలని కారు
పగలిన పాటు         జరగని బడి          షేవుకు బ్లేడు           తెలియని ఊరు
ఉండియు లోటు    ఎందుకు సుడి      ముఖ్యము చూడు      బహు బేజారు

మూసినా మండి      లేని జాలి         అత్త మాటు      బీరు చుక్క         అంబలి చట్టి
నచ్చని తిండి          పడనీ గాలి      భర్త చాటు      చికెను ముక్క      నోటికి పెట్టి
పగిలిన కుండ        వినని యాలి    ఉన్నచోటు       ఫోము పక్క         లాగిన పట్టి
ఎందులకండి         వద్దు జోలి       లేదు లోటు       సుఖము దక్క     స్వర్గము చిట్టి 

వదులు భ్రాంతి       పనులు చేయు దిట్ట    స్పీడుగ కారు           పులిసి యున్న  తైరు
వలదు క్ర్రాంతి         మాటల వస పిట్ట          మార్చక గేరు             నీరు లేని పైరు
వలయు దాంతి       జ్ఞాపకాల పుట్ట            పోయెడు జోరు        గాలి లేని టైరు
అపుడె శాంతి        తీపి పండ్ల బుట్ట          చూడర సారూ           బందిలేని  షైరు

భూమికి పలుగు                ఉండలేని ఇల్లు           తెలియని త్రోవ     గుడ్డికి చూపు
చేలకు అలుగు                 కట్టలేని బిల్లు             మునిగే నావ        కుబ్జకు రూపు         
కుదిరిన కలుగు                 పెదవి దాటు పల్లు       తీరని యావ        నటునికి డూపు  
పంటల జిలుగు                చూడ వళ్ళు ఝల్లు      వదులుము జీవ   దొరికిన పూవు  
మల్లె పువ్వు  
బోసి నవ్వు
మొదటి లవ్వు
మనసు జివ్వు


అన్నానికి పళ్ళెము   చల్లని పలుకు              క్రెడిటుకార్డు అరువు          మరుగు పడిన చట్టము
గుఱ్ఱానికి కళ్ళెము   చక్కని కులుకు           తీర్చకున్న బరువు               పొగపోవని గొట్టము
వాకిళ్ళకు గొళ్ళెము  తేనెలు చిలుకు           వీపుపైన దరువు                కూడెట్టని పట్టము 
లేకుండా వెళ్ళము   ముచ్చటలొలుకు        గుండెయగును చెరువు      పనికిరాని చుట్టము  

ఫారిస్ కల్చరు క్రేజు             దడ దడ దడ మ్యూజిక్కు     తినుటకు పన్ను         కాలియందెల ఘల్లు
నేకేడ్ పిక్చరు మోజు          దరియనీదు లాజిక్కు         చూపుకు కన్ను          బీరు బాటిలు ఛిల్లు
యువతకు పట్టినబూజు      యువతభవితకది చిక్కు     ఠీవికి వెన్ను               జేబులో ఘలు ఘల్లు
జీన్స్ పాంట్ రివాజు          మంచియేట్లు తలకెక్కు       మనిషికి దన్ను          కలుగవళ్ళు ఝల్లు

బ్యాటు సిక్సర్లు కొట్టు          జంట కవులు        చేసిన తప్పు                      లేని బెట్టు
స్పిన్ను పేసు కనికట్టు           ప్రేమ తెలుపు         తప్పక చెప్పు                      లోని గుట్టు
చూడ చూడ కిరికెట్టు          సంతు గొలుపు     దాచిన నిప్పు                     తెలియనట్టు
యువతనేమో చెడగొట్టు     పెళ్లి మలుపు        కాల్చును కప్పు                   అణచి పెట్టు

నీటిలోని బురద              ఘాటులేని చారు               అన్నమెట్టనితల్లి           చెప్పలేని గురువు
ఇచ్చు లేని దురద          చల్లారిన సాంబారు            గోడపట్టని బల్లి            చేవ లేని తరువు
నోటిలోని జరద              అన్నములో నీరు             మంచమెక్కని నల్లి        వేయలేని దరువు
చెడుగుచేయ సరద      తినుటకు బేజారు            చూడలేమే చెల్లి             మోయలేని బరువు   

చీరకట్టు
 పంచకట్టు
మూట కట్టు
దాచిపెట్టు   
శిరసువారి          చేతిలోన శూలము        దయను చూపుమయ్య భవా
అర్ధనారి              భక్త వరద సాలము         భవ తారణ చేయి శివా                 
భస్మధారి            పంచాక్షరి మూలము     శివము గూర్చి కావవా
శివుడే మరి         కరుణ కాలవాలము          కావరమును బాపవా