Thursday, 22 October 2015

దశహర

దశహర -- దశవిధ పాప హర
పరుల వస్తువులు అపహరించడం, శాస్త్ర వ్యతిరేకమైన హింసాచరణం, పరస్త్రీ సంగమం- ఇవి కాయకాలు. పరుషం, అసత్యం, అసంబంద్ధాలాపం, చాడీలుచెప్పుట- వాచకాలు. పరద్రవ్యాభిలాష, పరులకు కీడు కలిగే రీతిలో యోచించడం, అహంకారం- మానసికాలు. దశవిధ పాపహారిణియైన ఈ వ్రతం 'దశహరా' సంజ్ఞ గలది.
ఈ రుగ్మతలను సమూలముగా హరించమని అమ్మను వేడుకొందాము.

DASHAHARA – ERADICATION OF THE TEN EVILS
1. Stealthiness against others belongings.
2. Violence, uninvited, against virtuous
3. Lust against ladies who belong to somebody else
(These three are related to body.)

4. Stern or harsh against meek
5. Untruthfulness against people who trust him
6. Irrelevant and impertinent talk before learned
7. Tails carrying against Virtuous and amiable
(These are related to speech)

8. Aspiring for other’s wealth
9. Thinking evil of other
10. Ego
(These are related to mind)
Let us pray Parameswari to draw us out from these clutches.
చెరుకు రామ మోహన్ రావు – Cheruku Rama Mohan Rao




Tuesday, 20 October 2015

నాడు 
బడియున్నది వడి రమ్మని
బడుగులచే బిలువనంప బడి అయ్యోరుల్
బడిమీద బండ బడనీ
బడుగెనుముల గాచుకోనిన బ్రతుకగలేమే !
అన్నారు 
నేడు 
చదువుకొన్న వచ్చు సర్కారు నౌకరీ
యన్న నాకు జెప్పె కన్న కొడుకు
'కొన్న' వచ్చు చదువు కోరిన నౌకరీ
కొనుట కిమ్ము సొమ్ము కూర్మి దనర
అని అంటున్నారు

Friday, 2 October 2015

విజయీభవ


సూర్య చంద్ర గతుల నీవు సూక్ష్మ మరయ వలదులే
భూమి ఇరుసు మార్చుపనికి పూనుకొనగ వలదులే
తిన్న తిండి వంట బట్టు తీరు తెలియ వలదులే
మనిషి మనిషి పుట్టుకలో మార్పులెరుగ వలదులే
చేతనున్న చిన్నపనిని చేయగలుగ చాలులే
ఈర్ష్యాసూయలు మానుము ఇచ్చువాడు పరమాత్ముడు
ఎవరికెంత ఇవ్వవలెనొ ఇచ్చునతడు లోటులేక
ఆనందమునభిలషించు ఐశ్వర్యము తలపోయకు
కోపమెపుడు కోరబోకు కోరికలను పెంచబోకు
నీలిగగనమై నిరతము నిశ్చలముగ నిలిచినచో
ఉరుములైన మెరుపులైన ఉండబోవు అనవరతము
ఈనిజమును గమనించుము ఈశుని మది తలంచుము
నీకుసుఖము కలుగు మరియు నీదు ఇరుగు పొరుగునకు
నీదు సంఘమునకు మరియు నీ రాష్ట్రము దేశమునకు
నిత్య శుభము నిత్య జయము నిక్కముగా కల్గు నిజము

Try not to know the paths of Sun and Moon
Nor try to change the axis of the earth
Nor endeavour to know about DNA or jeans 
As there is no need to find the roots of mankind

Be not *gripple, for,the wealth is ripple
HE gives you what you deserve and not desire
To give thy poor neighbour you are capable
Be kind and the needy may be,you behind
For *emulousness and *egotism you be blind
Be delighted and crave not for wealth

Prevent *pique, detach desire,be as *angelic sky
how long clouds calamitous hover on the head
Find the truth, have faith in him whom you hum
this takes you and thus your neighbourhood too
to the place where you have only tranquility
but no tribulation,this,a real tribute to your nation

gripple= greedy

emulousness=strong desire to surpass the others

egotism = too much boasting

pique = anger

angelic =  One who manifests goodness, purity,and selflessn

Thursday, 17 September 2015

శుక్లాంబరధరం ...(అర్థము)

శుక్లాంబరధరం విష్ణుం

https://cherukurammohan.blogspot.com/2015/09/blog-post_17.html


शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम्

प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ll

अगजानन पद्मार्कं गजाननं अहर्निशम्

अनेकदंतं भक्तानां एकदन्तं उपास्महे

శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం l

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయె ll

అగజానన పద్మార్కం గజాననమహర్నిశం l

అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే ll 

Shuklaambara dharam vishnum shaSi varnam chaturbhujaml

Prasanna vadanam dhyaayet sarva vighnOpa SaamtayEll

Agaja-[A]anana Padma-Arkam Gaja-[A]ananam Aharnisham |

Aneka-Dam-Tam Bhaktaanaam Eka-Dantam Upaasmahe ||

శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం l

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయె ll

శుక్ల+అంబర+ధరం --శుభ్రమైన వస్త్రము ధరించినవాడు (ఇది మనకు బాహ్యముగా 

కనిపించే అర్థము)

దీనిలోని అంతరార్థమేమిటంటే  నక్షత్రములతో కూడిన స్వచ్చమైన ఆకాశము 

కలిగినవాడు అని చెప్పవచ్చును.

నీలిరంగు మన భ్రమ.'ఆకాశం గగనం శూన్యం' అనే కదా అన్నారు.

విష్ణుం -- సర్వాంతర్యామి ఐనవాడు (విష్ణుమూర్తి అని మాత్రమే అర్థమును గైకొనరాదు)

శశి వర్ణం --చందన ఛాయ కలిగినవాడు (చంద్రుడు ఆ రంగు లోనే వుంటాడు కదా) లేక 

కుందేటి రంగు కలిగిన వాడు

చతుర్భుజం --నాలుగు భుజములు కలిగినవాడు . పాశము, అంకుశము, మోదకము 

మరియు అభయ హస్తము కలిగినవాడు అన్నది స్థూలమైన  అర్థము. మన ఆశా 

పాశమునకు అంకుశము వేస్తే ఆయనకది  మోదకము. అప్పుడు ఆయన 

అభయహస్తము మనకు సిద్ధిస్తుంది.

ఆయన సర్వాంతర్యామి అని చెప్పుకొన్నాము గదా మరి సర్వాంతర్యామికి నాలుగు 

భుజాలేవి : నాలుగు దిక్కులూ కావచ్చు నాలుగు వేదములు కావచ్చు .

ప్రసన్న వదనం : నగుమోము కలిగినవాడు అన్నది స్థూలమైన అర్థం .

'నిరుక్తము'ను ఆశ్రయించితే  'ప్రసన్నో గజయూధపః' అని తెలియబరచుతుంది . 

గజయూధము అంటే ఏనుగుల సమూహము. '' అంటే అధిపతి రాజు అని అర్థం . 

ఒకటి కాదు రెండు కాదు చతుర్దశ  భువనాలలోని ఏనుగులకూ ఆయన అధిపతి. అంటే 

ఆయన ఎవరు 'గజాననుడే.'

సర్వ విఘ్నోపశాంతయే-- ఆటంకముల నన్నింటినీ మట్టుబెట్టుటకు (సర్వ+ విఘ్న 

ఉపశాంతయే)

ధ్యాయేత్ --ప్రార్థింతుము .

అగజానన పద్మార్కం

గజాననమహర్నిశం

అనేకదం తం భక్తానాం

ఏకదం తముపాస్మహే

అ =లేనిది,

గ=చలనము ( అంటే చలనము లేనిది=పర్వతము=హిమాలయము=దానికిరాజైన 

హిమవంతుని )

జ= కుమార్తె (అనగా పార్వతీదేవి)

ఆనన= ముఖమను

పద్మ= పద్మమునకు

అర్కం= సూర్యుడైనట్టి( సూర్యుని చూస్తే తామరలు అనగా పద్మములు వికసించును. 

అంటే ఆ కొడుకును చూస్తే ఆ తల్లికంత ప్రేమ.)

గజ +అనననం =ఏనుగు ముఖము కల్గిన (నిన్ను)

అహస్+నిశం = పగలూ రాత్రి అంటే రోజంతా

అనేకదం= ఎంచ వీలు లేనంత

తం =తమరి, మీయొక్క

భక్తానాం = భక్తులలో

ఎకదం= ఒకడు

తం= తమరిని

ఉపాస్మహే= ప్రార్థించుచున్నాడు

ఈ శ్లోకములో అనెకదంతం అని ఎకదంతమని చదువరాదు. అనేకదం తంభక్తానాం  

అని ఏకదం తంఉపాస్మహే  అని చదువవలెను.

విఘ్నేశ్వరుడు తన అమృత హస్తములతో మనలనందరినీ దీవించు గాక . 

నిరాటంకమైన  విజ్ఞానమును మనకు కలుగజేయు గాక . మంచిని పంచు సామర్థ్యము 

'రామమోహనుక్తి రమ్యసూక్తికి' కలిగించు గాక.

నేను పెద్దలవద్ద తెలుసుకొన్నది మీ ముందుంచినాను.


Shuklaambara dharam vishnum shaSi varnam chaturbhujaml

Prasanna vadanam dhyaayet sarva vighnOpa SaamtayEll

Agaja-[A]anana Padma-Arkam Gaja-[A]ananam Aharnisham |

Aneka-Dam-Tam Bhaktaanaam Eka-Dantam Upaasmahe ||

Suklambaradaram - {sukla+Ambara+Dharam} While Sukla depicts spotless pure white 

that is the Nakshatramandala (stellar universe) and the Ambara denotes Vastra or 

cloth and also AkAsam or sky we can interpret the vaakyam or sentence that he who 

wears the stellar universe as his Vastra (cloth).

Visnum - all pervading

Sasivarnam - who has brilliant complexion as the full moon

Chaturbhujam - also having four hands that is the four sides viz. East West North South. 

(Also interprets 4 Vedas)

Prasannavadanam - one who has an ever smiling face is the apparent meaning. 

Nirukta says that PRASANNO GAJAYUDHAPAHA means he who is the emperor of the 

elephants of the universe that is God Ganesa (गणेश) (not गणेषा)

Dhyayet - I meditate upon

Sarvavighnopashantaye- Sarv+Vighna+upasantaye - For the removal of all obstacles.

Agaja = daughter of Himalaya viz. Parvati

Anana = Face

Padma = (resembling like) Lotus

Arkam == Sun (As soon as thee lotus finds the sun it starts blooming. Same case with 

Mata Parvati when she sees Vinayaka)

Gajaananam - you, having the face of an elephant

Aharnisam - Day and night

Anekadam = of many of

Tam bhaktaanaam - Your Devotees

Ekadam = one that is me

Tam upaasmahe = praying you with all reverence and devotion.

He, Lord Ganesha the Sun of Mata Parvati's Lotus face, meaning, Lotus blossoms by 

seeing sun. In the same way the lotus face of Maa Parvathi blossoms when she sees 

her resplendent son (Sun) Ganesha, with elephant's face I, worship you day and night, 

being one among the infinite number of devotees.

స్వస్తి.

Tuesday, 15 September 2015

రావణ లంక దొరికింది.. సీతను దాచిపెట్టిన లంక దొరికింది. ఆంజనేయుడు సంజీవినీ పర్వతాన్ని తీసుకువచ్చి లక్ష్మణుణ్ణి కాపాడిన లంక దొరికింది.. రామ రావణ యుద్ధం భీకరంగా జరిగిన లంక దొరికింది. ఇవి ఒట్టి మాటలు కావు.. పుక్కిటి పురాణం అంతకంటే కాదు.. లక్షల సంవత్సరాల నాటి యథార్థ గాథ.. ఒక మహా అసురుని ఉనికిని ఇవాళ్టికీ చాటి చెప్తున్న కథ.. ఇంతకాలం మిథ్యగా భావిస్తున్న చరిత్ర. రావణ రహస్య మిది..
ఇదేదో సోది రామాయణ కథ కాదు.. రావణ లంక.. ఇది ఒక నిజం.. నిప్పులాంటి నిజం... వైజ్ఞానికులకు కొత్త సవాలును విసురుతున్న నిజం.. భారత దేశ చరిత్రను గొప్ప మలుపును తిప్పనున్న నిజం... ఒక నాడు రావణుని రాజరికం అప్రతిహతంగా సాగిన రాజ్యం... సాక్ష్యాలతో సహా లభించింది. రామ రావణ యుద్ధంలో ఆనాడు రావణుడు చనిపోయి ఉండవచ్చు. కానీ, శ్రీలంకలో కనిపిస్తున్న సాక్ష్యాలలో రావణుడు ఇంకా జీవించే ఉన్నాడు.. ఇది నిప్పులాంటి నిజం..
లంక మిథ్య కాదు.. లంకేశ్వరుడు రాజ్యమేలిన లంక.. ప్రపంచాన్నంతా జయించి తెచ్చిన బంగారంతో నిర్మించిన మహానగరం లంక.. సముద్రం మధ్యలో అందమైన దీవిలో, అపురూపంగా రావణుడు నిర్మించుకున్న నగరం లంక ఇదే..మీరు రాముణ్ణి నమ్మకపోవచ్చు.. రాముడు ఉన్నాడా.. లేడా అని హేతువాదులతో వాదాలకూ దిగవచ్చు. కానీ, రావణుడి ఉనికిని మాత్రం ఇవాళ ఎవరూ కాదనలేరు.. రావణుడు ఉన్నాడన్నది వాస్తవం. సాక్షాత్తూ శ్రీలంక సర్కారే రావణుడి ఆనవాళ్లను అధికారికంగా గుర్తించింది. రాజముద్ర వేసింది.
రావణుడి ఆనవాళ్ళు శ్రీలంకలో అడుగడుగునా కనిపిస్తున్నాయి. అశోకవనంతో ఈ గుర్తులు మొదలవుతాయి. అశోక వాటిక అని పిలిచే ఈ వనంలోనే సీతాదేవిని ఆనాడు రావణుడు బంధించి ఉంచాడు.. ఈ ప్రదేశంలో ఎవరు ప్రతిష్ఠించారో తెలియని వేల ఏళ్ల నాటి సీతారామచంద్రుల విగ్రహాలు మనకు కనిపిస్తాయి. ఈ ఆలయం పక్కనే సీతాజల పారుతుంది. సీతాదేవి కన్నీటితో ఏర్పడిన నీటి కుండమని ఇక్కడి ప్రజల విశ్వాసం..ఈ నీటి కుండాన్ని ఆనుకుని హనుమంతుని అడుగులూ మనకు కనిపిస్తాయి. అశోక వాటిక సమీపంలోమొక్కల్లో నల్లని మట్టి ఉంది.. ఇది మామూలు నల్లరేగడి మట్టో, లేక మరో రకమైన మట్టో కాదు.. బాగా కాలిపోయి ఉన్నట్లు కనిపించే మట్టి ఇది.. ఈ మట్టి ఇలా ఎందుకు ఉందో ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్తలకూ అంతుపట్టలేదు.. అశోక వాటిక చుట్టూ లెక్కలేనన్ని కోతులు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. ఈ ప్రదేశంలో ఇక్కడ మాత్రమే కోతులు కనిపిస్తాయి.
సీతా జలకు దగ్గరలోనే మరో చిన్న ఏరు పారుతుంటుంది.. అది నిత్యం రావణుడు స్నానం చేసే ఏరు.. ఇక్కడ స్నానం చేసి పరమేశ్వరుని అర్చించేవాడు రావణుడు...
2
ప్రతి చారిత్రక ప్రదేశాల్లో కొన్ని ప్రాంతాలను చూపించి స్థల పురాణాలు చెప్పటం సహజమే.. లంకలో కనిపిస్తున్న ఆనవాళ్ళు కూడా ఇలాంటివే అనుకుంటే పొరపాటే.. ఇవాళ్టి శ్రీలంకలో ఆనాటి తేజోమయ రావణ లంక స్మృతులు చాలా చాలా ఉన్నాయి.. త్రేతాయుగాన్ని మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి.
రావణ లంక సామాన్యమైంది కాదు.. రామాయణం ఉనికిని చాటిచెప్తున్న లంక.. రావణ స్నానం చేసే నది నుంచి దూరంగా చూస్తే ఓ పెద్ద పర్వతం కనిపిస్తుంది. ఆ పర్వతాన్ని జాగ్రత్తగా పరికిస్తే అతి పెద్ద హనుమాన్‌ ఆకృతి నిద్రిస్తున్నట్లుగా గోచరిస్తుంది.
ఈ పర్వతాన్ని రాము సోలా అని ఇక్కడి ప్రజలు పిలుస్తారు.. ఈ పర్వతం ఒక విచిత్రమైన పర్వతం.. రామ రావణ యుద్ధం జరుగుతున్న సమయంలో లక్ష్మణుడు మూర్ఛ పోయినప్పుడు హనుమంతుడు హిమాలయాల నుంచి సంజీవని మొక్కను తీసుకువచ్చిన పర్వతం ముక్క ఇది..
ఇది సంజీవని తీసుకువచ్చిన పర్వతమేననటానికి రుజువేమిటి? ఏదో టూరిజం డెవలప్‌ చేసుకోవటానికి లంక సర్కారు ఏదో ఒక కొండను చూపించి ఇదే సంజీవని అంటే నమ్మేదెలా?
శ్రీలంక సర్కారు ఏమైనా చెప్పవచ్చు. కానీ, ఇది ఆంజనేయుడు సంజీవని తీసుకువచ్చిన సుమేరు పర్వతమనటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇలాంటి పర్వత భాగం శ్రీలంకలో మరెక్కడా కనిపించదు.. మనకు ఇది మామూలు కొండ.. కానీ, శ్రీలంక ప్రజలకు ఇది హాస్పిటల్‌... ఈ పర్వతంలో దొరికే మొక్కలన్నీ ఔషధ మొక్కలే కావటం ఇది సుమేరువే అనటానికి బలమైన సాక్ష్యం.
దీనికి దగ్గరలో ఉన్న ప్రజలు ఏ జబ్బు వచ్చినా డాక్టర్ల దగ్గరకు వెళ్లరు.. ఈ పర్వతం దగ్గరకు వచ్చి ఇక్కడి మొక్కలతోనే వైద్యం చేయించుకుంటారు..నికోల్‌ పారమల్‌ ఫార్మాస్యూటికల్‌‌స.. ఇతర దేశీయ, అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు ఈ ప్రాంతానికి వచ్చి ఔషధ మొక్కలను పరిశోధించాయి.
విచిత్రమేమంటే ఈ ఔషధ మొక్కలు పెరగాలంటే ప్రత్యేకమైన మట్టి కావలసి ఉంటుంది.. ఈ కొండపై మనకు కనిపించే మట్టి హిమాలయాల్లో మాత్రమే కామన్‌గా కనిపిస్తుంది...
3
రావణుడు దశకంఠుడు.. అంటే పది తలలు ఉన్నవాడు.. అంటే శారీరకంగా కాదు.. అతనిలో పది రకాల వ్యక్తిత్వాలు ఉన్నాయని అర్థం. అతని మేధస్సు పది రకాలుగా, అనేక రంగాల్లో విస్తరించిందని అర్థం. ఇందుకు సాక్ష్యం మనకు లంకలో స్పష్టంగా కనిపిస్తుంది. అతను పండితుడో, సీతను అపహరించుకు వచ్చిన రాక్షసుడు మాత్రమే కాదు.. రావణుడు గొప్ప శాస్త్రవేత్త కూడా..
మీకు పుష్పక విమానం గుర్తుందా? అందులోనే సీతాదేవిని రావణుడు అపహరించుకు వెళ్లాడు... రావణ సంహారం తరువాత రాముడు అందులోనే అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఆ కాలంలో విమానాలు ఉన్నాయా? అంటే ఉన్నాయని లంక చెప్తోంది.. చూపిస్తోంది.. రావణుడు తన లంకాపట్టణంలో నిర్మించిన అయిదు విమానాశ్రయాలను శ్రీలంక సర్కారు గుర్తించింది.. అంతే కాదు.. ఒక విమానాల మరమ్మతు కేంద్రాన్ని కూడా గుర్తించింది.. వీటన్నింటినీ హనుమంతుడు లంకాదహన సమయంలో కాల్చివేశాడు..
శ్రీలంక పరిశోధనల్లో గరుడ పక్షి ఆకారంలోని ఓ బొమ్మ దొరకింది. ఈ ఆకారాన్ని జాగ్రత్తగా పరిశోధించారు... గరుడపక్షి ఆకృతిలో ఉన్న ఈ బొమ్మ మామూలు విగ్రహం కాదు.. దీనికి ఉన్న రెక్కలు సాధారణ గరుడ పక్షికి ఉండే స్థాయి కంటే కొద్దిగా ఎత్తులో ఉన్నాయి. దీనిపై ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు.. వాస్తవానికి ఇది ఓ లోహ యంత్రం. వేల ఏళ్ల నాటిది.. ఆనాడు ఇది ఎలా ఎగిరిందీ అన్నదానిపై లంక ప్రభుత్వం ఇంకా పరిశోధిస్తూనే ఉంది..
ఇక విమానాశ్రయం దగ్గరకు వస్తే.. శ్రీలంక రాజధాని కొలంబో నుంచి దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రయాణం చేస్తే ఓ పెద్ద పర్వత ప్రాంతం వస్తుంది. ఇక్కడ దాదాపు ఎనిమిది వేల అడుగుల ఎత్తున సుమారు ఎనిమిది కిలోమీటర్ల విస్తీర్ణంలో మైదాన ప్రాంతం ఉంది.. అంత ఎత్తున ఇంత విస్తీర్ణంలో మైదానం ఉండటం, ఈ మైదానానికి నాలుగు వైపులా కొండలు ఉండటం విశేషం. ఈ మైదానం మానవ నిర్మితమైనదేనని స్పష్టంగా కనిపిస్తోంది. దీన్నే రావణుడు తన విమానాశ్రయంగా వినియోగించాడని శ్రీలంక పరిశోధన బృందం నిర్ధారించింది.
మరో విశేషమేమంటే ఈ మైదానం అంతటా కాలిపోయిన గుర్తులు ఉన్నాయి. ఇక్కడి మట్టి కాలి నల్లగా మాడిపోయింది.. ఇక్కడి రాళు్ల కాలి కనిపిస్తున్నాయి. ఎనిమిది వేల అడుగుల ఎత్తులో తక్కువ వాతావరణం ఉన్న ఈ ప్రాంతంలో ఇంకా వేడి వాతావరణం ఉండటం విశేషం.. లంకాదహనం చేసినప్పుడు హనుమంతుడు ముందుగా రావణుడి రవాణా వ్యవస్థను, సాంకేతిక వ్యవస్థలనే దహనం చేశాడు.. అందుకు సాక్ష్యం ఈ విమానాశ్రయం.
4
రావణుడికి సంబంధించిన వివరాలు ముఖ్యంగా వాల్మీకి రామాయణంలో, ఆ తరువాత తులసీదాస్‌ రామచరిత మానస్‌లో మనకు ముఖ్యంగా కనిపిస్తాయి.. లంకలో అడుగడుగునా రామాయణ కాలం నాటి గుర్తులు లభిస్తున్నాయి..
తులసీదాస్‌ రాసిన రామచరితమానస్‌ ఒరిజినల్‌ ప్రతి ఒకటి చిత్రకూటంలో భద్రంగా ఉంది. అయితే ఆయన స్వయంగా రాసిన వాటిలో ఒకే ఒక అధ్యాయం ప్రపంచానికి మిగిలి ఉంది. చేత్తో తయారు చేసిన కాగితంపై రాసిన ఈ రామాయణంలో మిగిలి ఉన్న అధ్యాయం 117 పేజీల్లో ఉంది. ఒక్కో పేజీకి 7లైన్లు రాసి ఉంది.
కెలీనియా.. రావణుడి తమ్ముడు విభీషణుడి రాజభవనం ఉన్న ప్రాంతం.. ప్రస్తుతం బౌద్ధ ధర్మాన్ని పాటిస్తున్న శ్రీలంకలో కెలీనియా చాలా ముఖ్యమైన ప్రదేశం. బుద్ధ భగవానుడు ఈ ప్రాంతానికి వచ్చినట్లు చరిత్ర చెప్తోంది. ప్రపంచంలోని బౌద్ధులు శ్రీలంకకు వస్తే కెలీనియా చూడకుండా వెళ్లరు.. ఆ పక్కనే విభీషణుడి భవనాన్నీ సందర్శిస్తారు.. ఇంతెందుకు లంక సార్లమెంటులో విభీషణుడి ఫోటో కనిపిస్తుంది...
ఆ తరువాత నరోలియా.. ఇక్కడే అశోక్‌ వాటిక ఉంది. దీనికి సమీపంలోనే సీతాదేవి అగ్ని ప్రవేశం చేసింది. అయితే ఇక్కడ విచిత్రం ఉంది. ఇక్కడ అటవీ ప్రాంతంలో కొన్ని చిత్రమైన గోళీలు దొరుకుతాయి. ఈ గోళీలను సీతా గోళీలంటారు.. ఇవి అలోపతి మాత్రల్లాంటివి.. ఈ గోళీలను దొరకడమే భాగ్యంగా ప్రజలు భావిస్తారు. వీటిని తలకు రాసుకోవటం, కడుపుకు రాసుకోవటం, వాటిని పొడిని చేసి కొద్దిగా తీసుకోవటం వంటివి చేస్తారు.. ఈ గోళీలను శ్రీలంక ప్రభుత్వం జపాన్‌కు పంపించి పరీక్ష చేయించింది. ఇందులో వైద్య లక్షణాలు ఉన్నట్లు దాదాపు పదివేల సంవత్సరాలకు పూర్వ కాలం నాటివేనని నిర్ధారణ అయింది. రావణుడికి సంబంధించి ఇప్పటి వరకు లభించిన ఆధారాలన్నీ ఒక ఎత్తైతే , అసుర రాజు అస్తిత్వానికి సంబంధించిన అత్యంత కీలక సాక్ష్యం మరొకటి ఉంది. అది రావణ గుహ. లంకలో రామరావణ యుద్ధం భీకరంగా జరిగింది. రామబాణంతో రావణుడిని శ్రీరామ చంద్రుడు హతమార్చాడు.. రావణుడు మరణించిన తరువాత ఏం జరిగింది? వాల్మీకి రామాయణంలో కానీ, రామ చరితమానస్‌లో కానీ, రావణుడు చనిపోయిన తరువాత ఏం జరిగిందో ప్రస్తావన లేదు.. రావణుడి అంత్యక్రియలు జరిగాయో లేదో తెలియదు.. కానీ, ఇప్పుడు రావణుడికి సంబంధించిన అత్యంత గొప్ప రహస్యం వెలుగులోకి వచ్చింది. అదే రావణ గుహ..
శ్రీలంకలోని కెలీనియాకు కొద్ది దూరంలోఎత్తైన ప్రదేశంలో ఒక పెద్ద గుహ ఉంది.. ఈ గుహలోకి ప్రవేశించటం చాలా కష్టమైన పని.. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం పశువులు కాసుకునే ఒక కాపరి ఈ గుహలోకి అనుకోకుండా వెళ్లాడు.. ఈ గుహలో ఒక పెద్ద శవపేటిక ఉంది.. ఈ పేటికలో ఒక శవం ఉందని, దాన్ని చూడగానే భయంతో వెనక్కి వచ్చేసినట్లు అతను చెప్పాడు.. అది రావణుడి భౌతిక శరీరమని చెప్తున్నారు.. ఈ శవపేటిక దాదాపు పదిహేడు అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పుతో ఉంది. ఈ శవపేటిక చుట్టూ రకరకాల రసాయన లేపనాలు రాసి ఉన్నాయి.
రావణుడు చనిపోయిన తరువాత ఆయన భౌతిక దేహాన్ని నాగజాతి ప్రజలు తీసుకెళ్లి ఈ శవపేటికలో భద్రపరిచారట. శ్రీలంక ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని పంపించి ఈ శవపేటికను తెరిచేందుకు పలుమార్లు ప్రయత్నించింది. ప్రయత్నించిన ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ఒకసారి చిరుతపులులు, మరోసారి పెద్ద పాములు అడ్డం వచ్చాయి. హెలికాప్టర్‌లో వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు సరిగ్గా గుహ దగ్గరకు వచ్చేసరికి వాతావరణం హఠాత్తుగా మారిపోయి తప్పనిసరిగా వెనక్కి మళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ గుహలో అతని అనుచరులు కాపలా ఉన్నారని, లక్ష్మణుడి మాదిరిగా సంజీవని తో తమ రాజు పునర్జీవుతుడవుతాడని నమ్ముతున్నారు .. రావణుడి ఉనికికి సంబంధించిన చాలా ముఖ్యమైన సాక్ష్యం ఇది. ఈ పేటిక రహస్యాన్ని ఛేదించగలిగితే చరిత్రలో అనేక కొత్త కోణాలు వెలికి వస్తాయి. చూద్దాం ఏం జరుగుతుందో ............................. కాలమే సమాధానం
రావణుడు.. రామాయణం... భారతీయ సంస్కృతి, నాగరికతలతో గాఢంగా పెనవేసుకుని పోయిన అంశాలు.. శ్రీలంకలో రావణుడి ఆనవాళ్లు అనేకం మనకు కనిపిస్తాయి. అడుగడుగునా కనిపించే అక్కడి నిర్మాణాలు, కట్టడాల శిథిలాల్లో ఏడువేల సంవత్సరాల క్రితమే అత్యంత వైభవంగా భారత ఉపఖండంలో విలసిల్లిన నాగరికత స్పష్టంగా కనిపిస్తుంది.. అంతే కాదు.. రామాయణం గురించి మనకు అందుబాటుకు ఇంతకాలం రాని అనేక అంశాలు మనకు లంకలో కొత్తగా కనిపిస్తాయి... లంకలో రావణ రహస్యం గురించి మరి కొన్ని అంశాలను మనం తెలుసుకుందాం..
మనలో ప్రత్యేకించి ఈ తరంలో వాల్మీకి స్వయంగా రాసిన అసలైన రామాయణాన్ని చదివిన వాళ్లు వేళ్లపైన లెక్కించదగిన వాళ్లే ఉంటారు.. ఈ తరానికి తెలిసిందల్లా, ఎక్కువగా సినిమాల్లో చూసిన రామాయణ కథే...ఈ దేశంలో ఎన్ని రామాయణాలు వెలుగులోకి వచ్చాయో చెప్పలేం.. వాల్మీకి రాసింది ఒక రామాయణం.. వేర్వేరు భాషల్లో వేర్వేరు సమయాల్లో వచ్చిన రామాయణాల్లో కొత్త కొత్త ఉపకథలు పుట్టుకొచ్చాయి.. ఇప్పుడు లంకలో మనకు చూపిస్తున్న ఆనవాళ్లలో మరో సరికొత్త రామాయణం ఆవిష్కారం అవుతోంది..
రావణుడు సీతాదేవిని పంచవటి నుంచి అపహరించుకుని వెళ్లి ఎక్కడ దాచాడు? అని అడిగితే టక్కున వచ్చే జవాబు అశోక వనం.. కానీ లంక అదే శ్రీలంకలో సీన్‌ వేరేలా ఉంది.. సీతాదేవిని పరిస్థితులను బట్టి, ముందు జాగ్రత్త చర్యగా వేర్వేరు ప్రదేశాలకు రావణుడు తరలించాడట..పంచవటిలో, పర్ణశాలలో ఉన్న సీతాదేవిని తన పుష్పకంలో లంకకు తీసుకువచ్చిన రావణుడు వెరగన్‌ తోటలోని తన ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయ్యాడు.. పక్కనే ఉన్న తన భార్య మండోదరి దేవి భవనానికి సీతమ్మను తీసుకువెళ్లాడు.
లంకాపురంలో అతిగొప్ప ప్యాలెస్‌ మండోదరికి ఉండేదిట..చుట్టూ జలపాతాలు.. పూల తోటలు. అక్కడ సీత ఉన్నది కొన్ని రోజులే. ఆ తరువాత అశోకవాటికకు తరలించాడు.. మండోదరి భవనానికి చాలా దూరంలో అశోక వాటిక ఉంది. అక్కడికి విమానంలోనే సీతను రావణుడు తీసుకువెళ్లాడు.. ఆకాశమార్గంలో లంకానగర సౌందర్యాన్ని అద్భుతంగా ఏరియల్‌ వ్యూ ద్వారా సీతాదేవికి వర్ణిస్తూ చూపించాడట రావణుడు..
అశోక వాటికకు సమీపంలోనే సీతా పకన్‌ అనే చిన్న ప్రాంతం ఉంది.. చుట్టూ కమ్ముకుని ఉన్న దట్టమైన అడవి.. నిటారుగా నిలుచుని వున్న వృక్షాల మధ్య ౨౦౦ గజాల మేరకు ఉన్న చిన్న స్థలం.. అంత అడవిలో ఇక్కడ చిన్న మొక్క కూడా మొలవదు.. గతంలో ఇక్కడ నీళ్లు ఉండేవట.. సీతాదేవి లంకనుంచి అయోధ్యకు వెళ్లిన తరువాత ఇది పూర్తిగా డ్రెユ అయిపోయింది.. అప్పటి నుంచి ఇలాగే ఉంది..
.. ఇస్త్రిపుర . అంటే ఏరియా ఆఫ్‌ వుమెన్‌ అని అర్థం. హనుమంతుడు లంకకు వచ్చి చేయాల్సిన బీభత్సం అంతా చేసేశాక, ముందు జాగ్రత్త చర్యగా రావణుడు సీతాదేవిని అశోకవాటిక నుంచి ఇస్త్రిపురకు తరలించాడట. ఇక్కడి నుంచి కూడా రావణ గోడా అనే ప్రాంతానికి సీతను షిప్ట్‌ చేసినట్లు చెప్తారు.. అది ఇస్త్రిపురకు మరోవైపున ఉంది...
ఈ ప్రాంతాన్ని దిశృంపోలా అంటారు ఇప్పుడు ఇక్కడ బుద్ధుడి ఆలయం ఉంది.. దీంతో పాటే అతి ముఖ్యమైన ప్రాంతం ఇది.. రావణ సంహారం తరువాత సీతాదేవి అగ్ని ప్రవేశం చేసిన ప్రదేశం ఇదే... ఇక్కడ బౌద్ధ మతాచార్యులు ఓ స్తూపాన్ని కూడా నిర్మించారు..
2
లంకలో సీతాదేవికి సంబంధించిన చాలా ఆనవాళ్లను మనం చూడవచ్చు. అదే సమయంలో రామాయణంలో రావణుడి సంబంధించినంత వరకు మిగతా కేరెక్టర్లు కొన్ని ఉన్నాయి..వాళ్లకు సంబంధించిన స్మృతులు కూడా ఇప్పటికీ మనకు లంకలో కనిపిస్తాయి...
లంకలోని కెలీనియాలో రావణ సోదరుడు విభీషణుడికి పట్టాభిషేకం జరిగినట్లు గతంలోనే చెప్పుకున్నాం...ఇక్కడ విభీషణుడికి ఓ ఆలయం కూడా ఉంది.. లంక పార్లమెంటులో కూడా విభీషణుడి చిత్రపటం మనకు కనిపిస్తుంది..అంతే తప్ప అంత గొప్ప నాగరికతను ప్రపంచానికి అందించిన రావణుడికి మాత్రం ఎక్కడా ఆలయం లేదు..
రావణుడి కొడుకు ఇంద్రజిత్‌.. ఇతను కూడా శివుడికి మహా భక్తుడు.. ఈతడు శివుని పూజించిన ఆలయం, అందులో శివలింగం ఇవాళ్టికీ పూజలందుకుంటున్నాయి.
రావణుడి తల్లి కేకసి.. ఈమె భవనం సముద్రానికి సమీపంలో ఉండేది.. ఆమె నిత్యం ఉదయం ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి దానికి పూజ చేసి వచ్చేది.. శ్రీలంకలోని తిరుక్కోవిల్‌లో ఆమె తల్లి భవంతి ఉండేది.. ఇప్పుడా ప్రాంతంలో దేవాలయం ఉంది..ఇక్కడో విచిత్రం ఉంది.. తన తల్లి మరణించిన తరువాత ఆమె అంత్యక్రియలు జరిపిన తరువాత స్నానాదులకు మంచినీరు కరవైందట.. అప్పుడు రావణుడు తన త్రిశూలంతో ఏడుసార్లు నేలను గట్టిగా కొట్టాడట.. దీంతో ఏడు ప్రాంతాలలోని నీటిధార ఉబికి వచ్చింది. సముద్రానికి దగ్గరలో మంచినీటి బావులు ఇవి. ఈ ఏడింటిలో నీటి ఉష్ణోగ్రతలు ఏడు రకాలుగా ఉండటం ఇక్కడి విచిత్రం.
తోటపాలకొండలో రావణుడి అతి పెద్ద గోశాల ఉంది.. లంకారాజ్యానికంతటికీ అదే ఏకైక డైరీఫారమ్‌.. శ్రీలంకలోనే కలుతర అన్న ప్రాంతంలో రావణుడికి మరో కోట ఉండేది.. ఈ కోట ఇప్పుడు సముద్ర గర్భంలో కలిసిపోయిందని చెప్తారు.. దీనికోసం లంక సర్కారు పరిశోధిస్తోంది.. ఇప్పుడు ఈ ప్రాంతంలో లైట్‌ హౌస్‌ కనిపిస్తుంది.
ఇక్కడ హనుమంతుడి గురించి కొంత చెప్పుకోవాలి.. లంకాదహనం చేశాక ఓ ప్రాంతంలో కాసేపు రెస్ట్‌ తీసుకున్నాడు.. దాన్ని ఇప్పుడు రామ్‌ బోడా అంటారు.. అక్కడ చిన్మయ మిషన్‌ వాళ్లు అతి పెద్ద ఆలయ నిర్మాణం చేశారు..

రామాయణంలో మనకు తెలిసిన రావణుడు వేరు..లంకలో కనిపిస్తున్న రావణుడు వేరు.. ఆయన సీతను ఎత్తుకుపోయిన సంగతే చాలామందికి తెలుసు. ఆయన పండితుడన్న సంగతి కొందరికి తెలుసు.. కానీ, రావణుడిలో మనకు అంతు చిక్కని అనేక కోణాలు ఉన్నాయి..
రావణుడు ఆర్కిటెక్ట్‌
రావణుడు ఏరోనాటికల్‌ ఇంజనీర్‌
రావణుడు డాక్టర్‌
రావణుడు వార్‌ఫేర్‌ టెక్నాలజిస్ట్‌
రావణుడు నిత్య పరిశోధకుడు
రావణుడు గొప్ప సంగీతవేత్త
ఇలా చెప్పుకుంటూ పోతే రావణుడిలో అనేక కోణాలు బయటపడతాయి. తన భార్య మండోదరితో సరదాగా ఆడుకోవటానికి చెస్‌ను కనుక్కొన్నాడట. ఆమెతో కలిసి వీణ అద్భుతంగా వాయించేవాడట రావణబ్రహ్మ.
రావణుడికి సంబంధించి అయిదు విమానాశ్రయాలను లంక సర్కారు కనుక్కొందని చెప్పుకున్నాం.. గుర్లపోతలో విమాన మరమ్మతు కర్మాగారం ఉంది.. వాల్మీకి రామాయణంలోనూ ఈ గుర్లపోత ప్రస్తావన ఉంది. రావణుడి విమానం పెద్ద నెమలి ఆకారంలో ఉండేదిట.. దీనికి సింహళభాషలో గుర్లపోత అంటారు..అంటే పక్షి వాహనం అని అర్థం. విమానాన్ని సింహళ భాషలో దండు మోనరా అంటారు.. అంటే ఎగిరే నెమలి అని అర్థం.
రావణ లంకానగరం అపూర్వమైంది.. అపూర్వ నిర్మాణాన్ని కలిగి ఉన్నది.. లంకానగరం శత యోజన విస్తీర్ణంలో నిర్మించారని రామాయణం చెప్తోంది.. ఏడు ప్రాకారాలు, ఎనిమిది ద్వారాలు.. మూడు కందకాలతో అత్యంత సురక్షితంగా లంకా నగరాన్ని నిర్మించాడట రావణుడు.. ఆనాటి లంకలో నాలుగు లక్షల వీధులు ఉండేవిట.
లంకలో చాలా ప్రాంతాల్లో అనేక గుహలు, సొరంగాలు కనిపిస్తాయి. ఇవన్నీ రావణ కాలం నాటివే. రావణుడి ఆర్కిటెక్చరల్‌ ప్రతిభకు ఇవి నిదర్శనంగా నిలుస్తాయి. ఈ సొరంగాలు లంకలోని అన్ని పట్టణాలకు ఒకదానితో మరొకటి లింక్‌ కలిపే నెట్‌వర్క్‌ వ్యవస్థను కలిగి ఉన్నాయి.
ఈ సొరంగాలు తొందరగా ఒకచోటి నుంచి మరోచోటికి తరలివెళ్లేందుకు సరైన రవాణా వ్యవస్థను కలిగి ఉన్నాయి.
ఈ సొరంగాలు సహజంగా ఏర్పడినవి కావు.. ప్రతి సొరంగం మానవ నిర్మితమేనని స్పష్టంగా తెలుస్తుంది.. రావణ గుహకే దాదాపు ఏడు వందల దాకా కిటికీలు ఉన్నాయి,
ఎంత గొప్ప నగర నిర్మాణం.. ఎంత సాంకేతిక పరిజ్ఞానం.. ఎంత గొప్ప నాగరికత.. భారత దక్షిణా పథాన కనీవినీ ఎరుగని సాంస్కృతిక వైభవం విలసిల్లిన లంకానగరం ఎంత దారుణంగా ధ్వంసమైంది? తన ప్రజలకు ఎలాంటి కష్టం లేకుండా చేసిన సార్వభౌముడు ఎలా పతనమయ్యాడు..
పధ్నాలుగేళ్ల వనవాసానికి అయోధ్య నుంచి బయలు దేరిన రామచంద్రుడు చిత్రకూటం మీదుగా పంచవటికి వెళ్లాడు.. అప్పటికి దండకారణ్యం దాకా రావణుడి ఆధిపత్యం కొనసాగినట్లు తెలుస్తుంది.. దండకారణ్యంలో రావణుడి గవర్నర్‌ ఖరుడు పరిపాలన సాగించాడు.. రాముడు ఖరదూషణులను ఇక్కడే చంపాడు..
పంచవటి నుంచి కిష్కింధకు వెళ్లిన రాముడు అక్కడ వానర సైన్యాన్ని కలుసుకున్నాడు.. ఆ సైన్యం తోనే శ్రీలంకకు చేరుకున్నాడు.. భారతీయ నిర్మాణ రంగంలోనే అపురూపమైన సేతువును రాముడు రామేశ్వరం మీదుగా లంకలోని తలైమన్నార్‌ దాకా నిర్మించాడు. నీటిపై తేలే రాళ్లతో వానర సైన్యంలోని నీలుడి పర్యవేక్షణలో ఈ సేతు నిర్మాణం సాగింది.. ఇదేం విచిత్రం కాదు.. నీటిపై తేలే ఇటుకలను ఇప్పుడు వరంగల్‌లోని రామప్ప దేవాలయ గోపురంలోనూ మనం చూడవచ్చు.. లైట్‌వెయిట్‌ స్టోన్స్‌, నీరు, ఇసుక.. పునాదులపై నిర్మాణాలు భారతీయులకే సాధ్యమైన విద్యలు.. రామ సేతువు ఇవాళ్టికీ సుమారు ౩౦ కిలోమీటర్ల మేర మనకు కనిపిస్తుంది..
శ్రీలంక సరిహద్దులకు చేరుకున్నాక రాముడు తన సైన్యంతో నీలవరై పుత్తుర్‌ దగ్గర మొదట ఆగాడట.. అక్కడ రాముడు తన సైన్యం కోసం సృష్టించిన నీటి జల ఇప్పటికీ కనిపిస్తుంది..
నీలవరై పుత్తుర్‌ దగ్గర నుంచి లగ్గల అన్న ప్రాంతానికి రాముడి సైన్యం తరలింది.. లగ్గల అంటే టార్గెట్‌ రాక్‌ అని అర్థం.. ఈ పర్వత పై భాగం నుంచి రావణ సైన్యం రాముడి గురించిన సమాచారాన్ని అందించింది.. ఈ ప్రాంతం భౌగోళికంగా ఉత్తర లంకలో అత్యంత ఎతెユ్తన ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతానికి ఈశాన్య భాగంలో తిరుకోణేశ్వరం ఉంది.. అటు వాయవ్య దిశలో తలైమన్నార్‌ ఉంటుంది.. రామసేతువు లంకకు కలిపింది ఇక్కడే.. ఈ తిరుకోణేశ్వరంలోనే రావణుడు తపస్సు అదేనండీ ఇవాళ మనం అనే మెడిటేషన్‌ చేసేవాడు..
ఈ యుద్ధ భూమిలోనే భీకరంగా రామరావణుల పోరాటం జరిగింది. రామబాణానికి దశకంఠుడు నేలకొరిగాడు.. రాక్షస సంహారం జరిగింది. సుందరలంక స్మశానంగా మారిపోయింది.. రాముడు వనవాసానికి వెళ్లేనాటికా ఆయన వయసు ౨౫ సంవత్సరాలు.. రావణున్ని హతమార్చేప్పటికి రాముడు ౩౯ ఏళ్ల వాడు...
రావణ సంహారంతో రామాయణం ముగియలేదు.. యుద్ధం తరువాత రాముడు సీతాలక్ష్మణ సమేతంగా బయలు దేరినప్పుడూ లంకలోని కొన్ని ప్రాంతాలలో ఆగాడు.. సేద తీరాడు.. పరమేశ్వరుని కొలిచాడు..
రావణ వధ తరువాత సీతారామలక్ష్మణులు పుష్పకంలో అయోధ్యకు బయలు దేరుతూ వందారుమూలై అన్న ప్రాంతంలో కాసేపు ఆగారు..
వందారుమూలైలో ఉన్నప్పుడు రాముడికి అనుమానం కలిగింది.. రావణుడు బ్రాహ్మణుడు.. అతణ్ణి చంపినందుకు తనకు బ్రహ్మహత్యాదోషం చుట్టుకుంటుంది కదా అన్న సందేహంతో దీనికి పరిష్కారం చెప్పమంటూ పరమేశ్వరుని కోరాడు.. అప్పుడు శివుడు నాలుగు ప్రాంతాలలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజించమని రాముడికి సూచించాడట.. దీంతో రాముడు లంకలో మానావారి అన్న ప్రాంతంలో తొలి శివలింగాన్ని ప్రతిష్ఠించాడు.. దీన్ని రామలింగ శివుడని కొలుస్తారు.. ఆ తరువాత తిరుకోణేశ్వరంలో, అక్కడి నుంచి తిరుకేదారేశ్వరంలో మరో రెండు శివలింగాలను ప్రతిష్ఠించాడు... చివరగా భారత భూభాగంలో ఇప్పుడున్న రామేశ్వరంలో మరో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు..
పుష్పకంపై తిరిగి వెళ్తూ, రాముడు రామసేతువును పాక్షికంగా ధ్వంసం చేసి వెళ్లాడని కూడా కథనం చెప్తారు.. మొత్తం మీద రావణ లంక భారతీయ నాగరికతలోని అనేక కొత్త కోణాలను వెలికి తీస్తున్నది.
మోక్షగుండం విశ్వేశ్వరయ్య - MV - (సెప్టెంబర్ 15, 1860 — ఏప్రిల్ 12, 1962),
ఇది జ్ఞాపకముగా కన్నాజీ రావు గారు , విశ్వేశ్వరయ్య గారి జన్మదినమున, వారిని గుర్తుచేస్తూ వేసిన
వారి వ్యంగ్య చిత్రము. గుర్తు చేసిన వారిని అభినందించుతూ , విశ్వేశ్వరయ్య గారిని గూర్చి నాలుగు మాటలు వ్రాస్తూ వున్నాను. చదివేది.
భారతదేశపు ప్రముఖ ఇంజనీరు. బెంగుళూరు నగరానికి 40 మైళ్ళ దూరంలోని ముద్దెనహళ్ళి గ్రామంలో శ్రీనివాస శాస్త్రి, వెంకాయమ్మ దంపతులకు ఆయన జన్మించాడు. వీరు ములకనాడు తెలుగు వైదిక అనగా స్మార్త బ్రాహ్మణులు.వీరి పూర్వీకులు ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని మోక్షగుండం గ్రామానికి చెందిన వారు. మూడు శతాబ్దాల కిందట వారు మైసూరుకు వలస వెళ్ళడం జరిగింది. వీరు చిక్కబళ్ళాపూరు లో ప్రాథమిక విద్య, బెంగుళూరు లో ఉన్నతవిద్య పూర్తి చేసినారు. 1881లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి.ఏ., పట్టాను పుచ్చుకొన్నతరువాత పుణె సైన్సు కాలేజి నుండి సివిలు ఇంజనీరింగు పట్టా పుచ్చుకొన్నారు.
ఆయన తండ్రి సంస్కృత పండితుడు, హిందూ ధర్మశాస్త్ర పారంగతుడే కాక ఆయుర్వేద వైద్యుడు కూడా. విశ్వేశ్వరయ్య గారికి 15 ఏళ్ళ వయసులో తండ్రి కర్నూలులో మరణించాటం జరిగింది.
బొంబాయి ప్రజాహిత కార్య శాఖలో చేరిన తరువాత, భారత నీటిపారుదల సమాఖ్య లో (commission) చేరవలసినదిగా ఆహ్వానమును పొందినారు. ఆయన దక్కను ప్రాంతంలో చక్కని నీటిపారుదల వ్యవస్థను రూపొందించినారు. ఒక స్వయంచాలక (automatic) వరద గట్టు (Flood Gate ) వ్యవస్థను ఆయన రూపొందించినారు. 1903 లో మొదటిసారిగా దీనిని పుణె దగ్గరి ఖడక్‌వాస్లా వద్ద నెలకొల్పటం జరిగింది. వరద సమయంలో ఆనకట్ట భద్రతను దృష్టిలో ఉంచుకుంటూనే అత్యధిక నీటి నిల్వ చేసే విధానం ఇది. తరువాత గ్వాలియర్ వద్ద అలతిగ్రా వద్ద, మైసూరు వద్ద గల కృష్ణరాజ సాగర్ ఆనకట్టలలోను దీనిని వాడటం జరిగింది. అప్పట్లో కృష్ణరాజ సాగర్ ఆనకట్ట భారతదేశంలోనే అతిపెద్దది.
హైదరాబాదు నగరాన్ని వరదల నుండి రక్షించడానికి ఒక వ్యవస్థను రూపొందించినపుడు, ఆయనకు గొప్ప పేరు వచ్చింది. విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలో ఆయనది ప్రముఖపాత్ర.
1908లో స్వఛ్చంద పదవీ విరమణ తరువాత, మైసూరు సంస్థానంలో దివాను గా చేరి సంస్థాన అభివృద్ధికి అపారమైన కృషి చేసినారు. 1917 లో బెంగుళూరు లో ప్రభుత్వ ఇంజనీరింగు కాలేజి స్థాపించడంలో ప్రముఖ పాత్ర వహించినారు. తరువాత ఈ కాలేజికి ఆయన పేరే పెట్టడం జరిగింది. ఈనాటికి కూడా యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కర్ణాటక లోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటి. మైసూరు విశ్వవిద్యాలయం నెలకొల్పటంలో కూడా ఆయన పాత్ర ఉంది.
మైసూరు దివానుగా ఉండగా ఆయనకు బ్రిటిషు ప్రభుత్వపు నైట్‌హుడ్ (సర్) బిరుదు వచ్చింది. 1955 లో భారత దేశపు అత్యంత గొప్ప పురస్కారం - భారతరత్న - వచ్చింది. కర్ణాటక లోని ఇంజనీరింగు కాలేజీలన్నీ అనుబంధంగా ఉండే సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని ఆయన పేరిట నెలకొల్పారు.
ఆయన జన్మశతి సంవత్సరంలొ బెంగుళూరు లో విశ్వేశ్వరయ్య పారిశ్రామిక, సాంకేతిక ప్రదర్శనశాల నెలకొల్పబడింది.
స్వార్థమంటే తెలియని ఇటువంటి మహనీయులను గూర్చి తెలుసుకొనుట, దేశమునకు వారు జేసిన
సేవ ను గూర్చి తెలుసుకొనుట నేటి యువతకు అత్యవసరము. ఇటువంటి మహనీయులను తలుచుకోకుంటే మనము కృతఘ్నులు కావలసి వస్తుంది.
రాళ్ళను రత్నాలుగా భ్రమింపజేసే ఈ కాలములో నిజమైన రత్నాలను గూర్చి తెలుసుకొనుట అత్యంత అవసరము.
K for Cartoon..

Saturday, 11 July 2015

బాహుబలి ఎందుకు చూడాలి..

??? @ కోస్తా లైఫ్
ఎనిమిది అక్...షౌహిణుల సైన్యం… పర్వత ప్రాంతమంతా పరుచుకుంది కాల్బలం. ఘీంకరిస్తున్న ఏనుగులు ప్రళయ భీకరంగా కనిపిస్తున్నాయి. సేనాని గంభీరంగా విగ్రహమైపోయినట్టు నిలబడ్డాడు. మౌన సముద్రంలా ఉంది ఆ ప్రాంతమంతా ! దూరం నుంచి వస్తున్న గుర్రపు డెక్కల చప్పుడు శత్రుసైన్యం రాకకి సంకేతంలా కనిపిస్తోంది. గాల్లోకి లేచిన దుమ్ము ముక్కుపుటాలకి సందేశం ఇస్తోంది. వీరత్వానికి మానవ రూపంలా ఉన్న రాకుమారుడు గుడారంలోంచి అపుడే అడుగు బైటపెట్టాడు. తుఫాన్ ముందు ప్రశాంతత అంటే ఇదే !
ఇలా మొదలవుతుంది కథ. పక్కనోళ్లు పిలిచినా… పరీక్షలు దగ్గరపడినా… పెద్దోళ్లమైపోయామని తెలిసినా వదలకుండా చదివిన చందమామ కథ ఇది. అక్షౌహిణి అంటే ఎంతో తెలీదప్పుడు మనకి. కాల్బపం పరుచుకుంది అంటే అర్థంకాదు అంత తేలిగ్గా. అయినా ఇలాంటివి ఎన్నో చదివి ఉంటాం ! ఊహించుకునేందుకు ప్రయత్నం చేశాం. కానీ విజువల్ గా చూశామా? బ్రాడ్ పిట్ నో… రస్సెల్ క్రోనో చూడ్డం వేరు. కామెరూన్ గొప్పని ఇంగ్లిష్ లో చదివి సబ్ టైటిల్స్ తో సంతోషించడం వేరు. తెలుగులో ! తెలుగులో సంగతి అడుగుతున్నా ? చూడలేదన్నదే సమాధానం కదా ! మరి హాలీవుడ్ హాలీవుడ్డే అనుకునే రోజుల్ని మార్చేందుకు ఇన్నాళ్లకి ఒక్కడొచ్చాడు. తెలగోడి దెబ్బంటే ఏంటో చూపించేందుకు… కోలీవుడ్ నో బాలీవుడ్ నో కాదు హాలీవుడ్ ని ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాడు. బాహుబలితో బరిలో నిలిచాడు. ఇపుడు బాక్సాఫీసే మహీష్మతి. గెలవబోతున్నాడు బాహుబలి.
వారానికోసారి వచ్చే సినిమా కాదు బాహుబలి. పోనీ ఏడాదికోసారి రిలీజయ్యే స్టార్ హీరో మూవీ కూడా కాదు. సంవత్సరాల తరబడి ప్రాణంపెట్టి శ్రమించి చెక్కిన అద్భుత కళాఖండం బాహుబలి. ఖండాంతరాలు దాటింది క్యూరియాసిటీ ఇప్పటికే ! అపూర్వ దృశ్యాన్ని చూసేందుకు ప్రపంచం కళ్లు నులుముకొని ఎదురుచూస్తోంది. మరి మనం… ? శుక్రవారం సినిమాలా సరిపెట్టుకుంటామా ? ఇదో పండగ. ప్రపంచవ్యాప్తంగా ఎగిరే తెలుగోడి జెండా ! లైఫ్ సైజ్ కేన్వాస్ పై ఊహలకి రంగులద్ది… 24 క్రాఫ్ట్స్ కాదు పంచ ప్రాణాలు పెట్టి… సంవత్సరాల తరబడి నిద్రలేని రాత్రుల్ని దాటి తెలుగోడి టాలెంట్ ని స్పెషల్ ఎఫెక్ట్స్ గా మలిచి… హాలీవుడ్ కి అలవోకగా విసిరిన సవాల్ బాహుబలి. రాముడుఎలా ఉంటాడో తెలీదు. క్రిష్ణుడు ఎలా ఉంటాడో తెలీదు. దేవుడంటే ఇలా ఉంటాడని వెండితెరమీద చూపించింది అన్నగారు. ఆ తర్వాతే విగ్రహాలు, ఫోటోల రూపు రేఖలు మారాయ్. శ్రీరామ నవమొచ్చినా… ఏ పండగొచ్చినా ఇప్పటికీ ఎన్టీఆర్ రూపమే కనిపిస్తుంది ఆలోచిస్తే. అది మైథాలజీ. మరి మన చరిత్ర మన కోటలు… మన వైభవం… మన వీరత్వం ఇవన్నీ ఎక్కడ చూడాలి ? ఐకానిక్ అప్పీల్ ఎలా ? దానికి సమాధానం బాహుబలి. ఇది ప్యాథాలజీ. మన ఫిక్షనల్ హిస్టరీ. చెప్పుకోడానికి బాగానే ఉంటుంది. నేనెందుకు చూడాలి బాహుబలి ? అనే క్వశ్చన్ ఎవరికైనా ఉందా ? కచ్చితంగా ఉండి ఉండదు. ఆ ప్రశ్నఉన్నా లేకపోయినా దానికి మాత్రం సమాధానం ఉంది కచ్చితంగా ! ప్రతి తెలుగోడూ బాహుబలి ఎందుకు చూడాలంటే … దానికి ఒకటి కాదు ఐదు కారణాలున్నాయ్ !
1. ఇది తెలుగోడి తడాఖా…
తెలుగు సినిమా అంటే ఓ రిజినల్ ఇండస్ట్రీ. కనీసం ఇండియన్ సినిమా కూడా కాదు. అమెరికన్ బాక్సాఫీస్ లో మన దూకుడు టాప్ టెన్ లోకి వెళ్లినా… బాలీవుడ్ మన స్టోరీలు కాపీకొట్టినా… మాయాబజార్ అకీరా కురసోవా లాంటి దిగ్గజాల్ని ఆశ్చర్యపరిచినా సాయంత్రం అయ్యేసరికి మన
గొప్పంతా చీకట్లోకి జారిపోతుంది ! అలాంటిదిప్డుడు… జీవితంలోనే మొదటిసారిగా ఓ సినిమా హాలీవుడ్ ని ఆశ్చర్యంలో పడేస్తోంది. బీబీసీ దిగొచ్చి ఇంటర్వ్యూ చేసింది. ప్రపంచం ఊపిరి బిగపట్టి చూస్తోంది. హారీపొట్టరో…లార్డ్ ఆఫ్ ద రింగ్సో కాదు బ్రదర్…ఇది బాహుబలి. ఇది మన తడాఖా ! నీదీ…నాదీ…అందరిదీ !
2. ఇది మన స్టోరీ…
పర్షియన్ యుద్ధనౌకల్ని గ్రీకులు మధ్యలోంచి చీల్చి దెబ్బకొట్టారని చూశాం … అది 300. సైబీరియన్ కనుమల్లో ఓ మహా వజ్రం కోసం ఐదు సామ్రాజ్యాలు తలపడ్డాయ్. అబ్బో అదుర్స్ అన్నాం. దానిపేరు హాబిట్. చక్రవర్తి మీద బానిస యుద్ధం చేస్తే… అందులోనూ పట్టుమని రెండుమూడు వార్ సీన్లు ఓల్టేజ్ పెంచితే నెత్తిన పెట్టుకున్నాం. గ్లాడియేటర్ అంటూ గొప్పలు పోతున్నాం. వీటిలో ఎక్కడా మన స్టోరీ లేదే ? తెలుగు నేల మీదగానీ ఇండియాలోగానీ జరిగినట్టు… నీకో చరిత్ర, వైభవం ఉన్నట్టు… నీ కల్చర్ ని ప్రపంచం గుర్తించినట్టు ఎప్పుడైనా అనిపించిందా ? లేదు. మరిప్పుడు నీదీ ఈ స్టోరీ. ఈ గొప్పందా నీది. నిన్ను నువ్ చూసుకోవా ? 70ఎంఎం అద్దంలో మనం కనిపించడం మనకి ఇష్టం లేదా ?
3. వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్…
సూర్యుడు పండలా కనిపిస్తున్నాడని తినాలనిపించింది. ఎగిరితే కానీ అందుకోలేడు. ఎగిరాడు. తిన్నాడు. అప్పుడే తెలిసింది హనుమంతుడికి తన శక్తేంటో! పురాణం. మన ఓపికెంతో తెలిసే ఎఫర్ట్ టాలీవుడ్ ఏమైనా పెట్టిందంటే అది బాహుబలి. నిన్న జరగలేదు ఇలాంటి ప్రయత్నం. రేపు కూడా జరుగుతుందన్న గ్యారెంటీ లేదు. మళ్లీమళ్లీ చేసేందుకు శక్తి సహకరించదు. అందుకే ఇది ఒక్క జీవితకాలంలో ఒక్కసారి మాత్రమేవచ్చే అవకాశం. ఐఫోన్ కోసం రెండు మూడు రోజుల ముందే దుప్పట్లు పరుచుకొని అమెరికా రోడ్డు మీద పడుకుంటుంది. ఎందుకు ? అది వాడిగొప్ప. వాడి చూడాలని. మరి మనం మన గొప్ప ఏ రేంజిదో చూడమా ? మనకేం తక్కువ ? జిల్ … జీల్ అన్నీ ఉన్నాయ్.
4. బాహుబలి రిలీజ్ కి ముందు… తర్వాత…
అవతార్ సినిమా చూశాక… ఎనిమిది బిగ్ బడ్జెట్ సినిమాలు ఆగిపోయాయ్. అప్పటికే 20-30% షూటింగ్ అయినవే అన్నీ. ఆ రేంజ్ లో తీస్తే తీయాలి… లేదంటే అరకొర ప్రయత్నాలు ఎందుకు ? ఇప్పుడు మనం అంత హై స్టాండర్డ్స్ అందుకోలేం. లెటజ్ పోస్ట్ పోన్ ఇట్ అని. ఇది ఫాక్స్ న్యూస్ ఇన్ఫో. ఒక గీత గీసి… దీనికి ముందు దీని తర్వాత అంటే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. బాహుబలి అలాంటి గీతే ! ఇది టాలీవుడ్ రాత మార్చే గీత. అందుకే కరణ్ జోహర్ వచ్చి కలుస్తాడు. తమిళ్ ఇండస్ట్రీ సినిమాలు వాయిదా వేస్తుంది. శ్రీమంతుడు దారిస్తాడు. హాలీవుడ్… వావ్ ఎ మిరాకిల్ ఫ్రమ్ ఇండియా అంటుంది. ఇది పీకే కాదు స్టోరీతో పడగొట్టడానికి. ఇది బాహుబలి…విజువల్ ఎఫెక్ట్స్, భారీతనంతో తొడగొడుతుంది.
5. హాలీవుడ్ వయా తెలుగు నేల
హాలీవుడ్ మన దగ్గరకొస్తుందా ? ఖర్చుతగ్గుతుందంటే మన దగ్గరకేంటి..లక్కవరం లాంటి ఊళ్లకి కూడా వచ్చేస్తుంది. ఖర్చు తగ్గించుకోవాలని హాలీవుడ్ ఇప్పటికీ… న్యూజీలాండ్ లాంటి దేశాలకి వెళుతోంది స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం. సగం సినిమాలకి ఎగ్జిక్యూషన్ అండ్ ఫినిషింగ్ వర్క్ అంతా జరుగుతున్నది న్యూజీలాండ్, ఆస్ట్రేలియాల్లోనే ! హాంకాంగ్ లో కూడా కాస్ట్ తక్కువే హాలీపుడ్ తో పోలిస్తే. అందుకే పెద్ద సినిమాలకి ఆ రెండే డెస్టినేషన్స్ ఇప్పటికీ ! బాహుబలి రిలీజ్ అయ్యాక మనవైపు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇందులో పనిచేసిన వాళ్లు మూడొంతుల మంది మన టెక్నీషియన్లే !
వీలైతే… మళ్లీ మళ్లీ చూద్దాం డ్యూడ్. పోయేదేం లేదు. మహా అయితే సీక్వెల్ తీస్తారు !
– అభి
అమ్మా చాలా గొప్పగా వుంది నీ విశ్లేషణ. విషయము ఏదయినా ఒక అవగాహనతో వ్రాస్తే ఎంత చక్కగా వుంటుంది అన్నదానికి ఇది దృష్టాంతరము. నేను దీనిని నాగోడపై కూడా చేర్చుతాను, నా అభిప్రాయమును గూడా జతపరుచుతూ !
చాలామంది ఇందులో సన్నివేశాలు కాపీ అని అన్నారు. మనుషుల బోలిన మనుషులను పుట్టించుట ద్వారా దేవుడు కూడా కాపీ చేస్తాడని రుజువవవుతూ వుంది. పైగా బాహుబలిలో ఒక 10 హాలివుడ్ సినిమాల దృస్యాలను కాపీ చేసినాడనుకొందాము. అన్ని సినిమాలను అర్థము కాక, అర్థము (ధనము ) లేక చూడలెనివారికి ఒకే టికెట్టు తో చూపించడమైనది కదా. ఇక జానపద గాథలన్నీ ఒకటిగానే ఉంటాయి beaten Track అయిపోయింది అని అనుకొనేవాళ్ళకు చెప్పగలిగినది ఏమిటంటే మన సంస్కృతి 'కళ్యాణ సాహిత్యమూనకే పట్టము కట్టినది. రాముడు రావణుని జయిస్తాడు, కృష్ణుడు కంసుని వధిస్తాడు,పాండవులు కౌరవులను మట్టు పెడతారు . ఈవింధంగా మన సాహిత్యములో ఏ కథ చూచినా చెడ్డపై మంచికి విజయమే. ఇతర సంస్కృతులకిది అందని ద్రాక్ష.ఈక copy విషయానికొస్తే మన సనాతన మతమునుండి గ్రహించిన అంటే copy కొట్టని అధునాతన మతగ్రంథము లేదు.
ఇక చిత్ర నిర్మాతలు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టినారని వింటున్నాము. సినిమా చూచినవారికి అది నిజమని కూడా అర్థమై వుండవచ్చు. ఈ దేశములోని ఏ ప్రాంతము వారూ సాహసించని చిత్రాన్ని మన మన ప్రాంతీయుడు మనభాషలో తీయుటకు సాహసించినాడంటే ఒక టికెట్టుకు ఖర్చు పెట్టుకోలేమా! ఆత్మ విమర్శ చేసుకొంటే మనము చేసే దుబారాలో ఇది ఎంత? ఈ చందా మనకొరకుగాదు. మనకంటే ఆర్థికపరంగా క్రిందవుండే వారికి మనము సహకరిచినట్లు. బాగుందంటే తానూ చూస్తాడు. విమర్శనా దృష్టి తో కాదు వినోద దృష్టి తో!
ఈ సినిమా నిలిస్తే ముందు కాలానికి ఇటువంటిసాహసము చేసేవారికి ఇది కరదీపిక కావచ్చు. వారు తీయబోయేవి అందరికీ నచ్చేవిధంగా కూడా వుండవచ్చు. ఇది ఇప్పుడు ఒక మొక్క . మంచినీరు పోసిపెంచితే మహావృక్షమౌతుంది, ఉప్పునీరు పోస్తే ఉనికి లేకుండా పోతుంది.
ఇది పేద నిర్మాతలకు పెద్ద దెబ్బ అనుకొంటె వారి సంఖ్యతో పోల్చినపుడు తక్కువ డబ్బుతో ఎక్కువ వినోదమును కోరే సగటు మనుషుల సంఖ్య వారికన్నా  లక్షల రెట్లలో ఎక్కువగా వుంటుంది. ఇందులో పనిచేసిన కొన్నివేల కార్మికులకు ఈ సినిమా సంపూర్ణమయ్యెవరకూ జీవనోపాధి ఐనది. ఇంకొక సినిమా ఎవరైనా తలపెడితే అది కూడా ఇంతమంది కుటుంబాలను కాపాడుతుంది. వారి సంఖ్యతో పోలిస్తే చిన్న నిర్మాతల సంఖ్య ఎంత. Share Market లో ఎప్పటికీ పెద్ద shares కొనే వాళ్ళతోబాటూ చిన్నవి కొనేవారుకూడా ఎప్పటికీ వుంటారు. కాబట్టి చిన్న నిర్మాతలకొచ్చిన నష్టము ఏమీ లేదు.
'లోకో భిన్నరుచి' అన్న వాస్తవము గుర్తుంచుకొని చదవగలరని ఆశ.