Wednesday, 9 June 2021

ఎవరు అసలైన గురువు

 ఎవరు అసలైన గురువు

https://cherukurammohan.blogspot.com/2021/06/blog-post.html

గురువు లక్షణములను గమనించండి. 

శుచిర్జితేంద్రియో వేద వేదాంగాది విచక్షణః l

యోగజ్ఞ సర్వశాస్త్రజ్ఞః సమదాస్థానమర్హతిః ll

శుద్ధమయిన చరిత్రం గలిగినవాడుగా ఉండాలి. ఇంద్రియములను జయించినవాడయి ఉండాలి. వేదము వేదాంగములుక్షుణ్ణముగా తెలుసుకొని ఆచరించేవాడయి ఉండాలి. పతంజలి తెలిపిన యోగశాస్త్రమును ఆచరించేవాడయి ఉండాలి. సకలశాస్త్రములను ఆసాంతము తెలిసిన వాడయి ఉండాలి అంటే సకల శాస్త్రముల మర్మము తెలిసియుండాలి. అట్టి వ్యక్తి మాత్రమే పీఠాధిపత్యమునకు అర్హుడు.

గురవో బహవస్సంతి శిష్య విత్తాపహారకాః l

గురవో విరళాస్సంతి  శిష్యహృత్తాపహారకాః ll

ఈ లోకములో గురువులు విరివిగా ఉన్నారు. ఎందుకు అంటే శిష్యులవద్దనుండి దానికని, దీనికని డబ్బు గుంజేవాళ్ళు. మరి లేనివారు అంటే, ఈ సంపద్గురువుల వద్ద ఇమడడు. శిష్యుని యొక్క సందేహమును జడము తో పెకలించి విజ్ఞాన  దానము చేయగలిగినవాడు నిజమైన గురువు. అట్టి గురువులు 'విరళాస్సంతి' చాలా అరుదుగా గాని లభించరు. ఈ విషయమునే పరమాత్మ గీతలో ఈ విధముగా చెబుతాడు.

తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ।

ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః ।।  ll4-34 ।।

ఒక ఆధ్యాత్మిక గురువుని చేరి పరమ సత్యమును నేర్చుకొనుము. వినయంతో ఆయనను ప్రశ్నలు అడుగుతూ మరియు ఆయనకు సేవ చేయుము. అటువంటి మహాత్ముడైన జ్ఞాని నీకు జ్ఞానోపదేశం చేయగలడు ఎందుకంటే అతను స్వయంగా యథార్థమును దర్శించినవాడు. అంటే ఆ విధమగు గురువే గురువు. మిగతావారు భూమికి బరువు.

అనాద్యవిద్యా యుక్తస్య పురుషస్యాత్మ వేదనం

స్వతో న సంభవాదన్యః తత్త్వ-జ్ఞో   జ్ఞాన-దో భవేత్ (11.22.10)

 "ఆత్మ యొక్క బుద్ది అనంత జన్మల అజ్ఞానంచే కప్పివేయబడి ఉంది. అవిద్యచే ఆవరింపబడి ఉండి, బుద్ధి తన అజ్ఞానాన్ని తన స్వంత ప్రయత్నంచే జయించలేదు. పరమ సత్యాన్ని ఎరిగిన భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ముని ద్వారా ఆ జ్ఞానాన్ని అందుకోవాలి."

అంటే గురువు అంతటి గరిమ గోప్పదనమును కలిగియుండాలి. పెద్దలు 'శిష్య వాత్సల్యము' అన్న మాటను ప్రయోగించుతారు. 'వత్స' అంటే ఆవుదూడా. ఆయు శాఖాహారి అయినా తనకు బిడ్డపుట్టిన వెంటనే ఆ బిడ్డ శరీరమునకు ఉన్న జిగురు వర్ణించుటకు వీలుకాని ఎంతో ఆప్యాయతతో  అంతా నాకివేసి శుభ్రపరుస్తుంది.  ప్రేమ చూపించవలసి వచ్చినపుడల్లా తన దూడ శరీరమును నాకుతూ వుంటుంది. గురువునకు శిష్యునిపై అంత ప్రేమ ఉండాలి. ఆవు మాటలు రానిది చేష్టలతో తన మనోభావమును వ్యక్తపరుస్తుంది. గురువు మాటలు నేర్చినవాడు, ప్రపంచము తెలిసినవాడు మరియు తత్వ్వరహస్యమును ఎరిగిన విజ్ఞుడు. ఆయన ప్రేమకు పాత్రుడయినవాడే నిజమైన శిష్యుడు. అంతటి మహా జ్ఞానియే గురువు. మొదట తెలిపిన శ్లోకము నిజమైన గురువునకు నిర్వచనము.

గురువు వద్ద విద్య నేర్చుకొనుటకు ఉపాయములు శాస్త్రము ఈ విధముగా చెప్పుచున్నది.

గురు శుశ్రూషయా విద్యా పుష్కలేన ధనేనవాI
అధవా విద్యయా విద్యా చతుర్థం నోపపద్యతేII 

అంటే విద్యను అభ్యసించే విషయంలో 1.గురువును సేవించి,సపర్యలు చేసి ,2.ఆయనకు సమ్మతమైతే పుష్కలమైన ధనమును ఇచ్చి ,3.తన దగ్గర ఉన్న విద్యను ఆయనకు నేర్పి ఆయన దగ్గర ఉన్న విద్య ను నేర్చుకోవడం  ఈ మూడు రకాలుగా తప్ప నాలుగో రకము లేదు అని.

శంకరులవారి పంచదశి ఈవిధముగా పేర్కొంటున్నది:

 తత్పాదాంబురు హద్వంద్వ సేవా నిర్మల చేతసాం

సుఖబోధాయ తత్త్వస్య వివేకో ఽయం విధీయతే (1.2)

 "గురువు గారిని స్వచ్చమైన మనస్సుతో, సందేహములు విడిచి సేవించండి. తదుపరి ఆయన మీకు శాస్త్ర జ్ఞానాన్ని మరియు వివేచనాత్మకత ఉపదేశించి, గొప్ప ఆనందాన్ని కలిగిస్తాడు." జగద్గురు శంకరాచార్య ఇలా పేర్కొన్నాడు: యావత్ గురుర్న కర్తవ్యో తావంముక్తిర్న లభ్యతే "గురువు కి శరణాగతి చేయకుండా నీకు భౌతిక మాయ నుండి ముక్తి లభించదు."

అట్టి పరిశుద్ధ లక్షణ సముపెతుడే అసలయిన గురువు. సచ్చీలతకు, సాధువర్తనకు సరియైన సమాధానము సద్గురుఉ. ఆయనే జగద్గురువు.

స్వస్తి.

4 comments:

  1. The expression is like a cream
    We can't imagine in our dream
    Stupendous thoughts you have
    Quit impressively you gave (to us)
    Thanks for the article, Sir

    ReplyDelete
    Replies
    1. న హం కర్త హరిః కర్త. At the out set I thank you for your affectionate response. I know, I know only a little. But what little I know I don't want to hide for myself. Jence the effort. Thank You.

      Delete
  2. చాల చక్కగా సరళం గా సూటిగా వివరించారు ఉపయుక్తం కృతజ్ఞతలు

    ReplyDelete