సమస్య : గుండ్రాతికి
కాళ్ళు వచ్చి గునగున నడిచెన్
ఈ సమస్యను గూర్చి ఒక మాట ముందు చెప్పవలసియుంటుంది. ఈ సమస్య
కందపద్యము యొక్క రెండు లేక నాలుగవ పాదము. దీనిని రెండవపాదములో ఇమిడ్చి పద్యము
పూరించలేము. కావున ఇది కందమునకు నాలుగవ పాదమే కావలెను. ఇక ఇది కందపద్యము కాబట్టి
యతి ప్రాస నియమములు వుంటాయి. యతి తో సమస్య లేదు కానీ ప్రాస కొంత క్లిష్టమే! ఇందు బిందు పూర్వక రేఫాయుక్త డకార ప్రాస దుష్కరమగు ప్రాసయే. నేను 26 వతేదీ
జూన్ 2౦16 లో ఈ సమస్యను నాదగు రీతిలో పూరించియుండినాను. దీనికి అవధానుల పూరణలు వున్నట్లు
మిత్రులు డాక్టర్ ప్రభాకర రెడ్డి గారు తాము రచించి ప్రెమతో 13 జూన్ 2018 న నాకు
పంపిన నాలుగు పుస్తకములలో ఒకటగు సాహితీ 'రసాయనము'నందు తెలియబరచే వరకు నాకు
తెలిసిరాలేదు. ఇందు తత్సమ శబ్దములను యండ్రాముడు, కోదండ్రాముడు
అని వాడుత జరిగింది. ఈ ప్రయోగములను వ్యాకరణము ఒప్పుకొనదని పెద్దలు చెప్పగా
విన్నాను. ఆ పద్యములను మీకై ఇచట పొందుపరచుచున్నాను. నేను వ్రాసినది చిత్రరూపమున (Image)
మీముందుంచబోవుచున్నాను. చదువగలరు.
1. ఉండ్రాని యడవి లోపలి 2.ఉండ్రా
యోరి దురాత్మక
గుండ్రాయై యున్న మౌని కోమలిపై గో యిండ్రా ప్రాసమ్ము కవుల
కీయ్యందగునా
దండ్రాము పదము సోకిన యండ్రాము పదము సోకిన
గుండ్రాతికి కాళ్ళువచ్చి
గునగున నడచెన్ గుండ్రాతికి
కాళ్ళు వచ్చి గునగున నడిచెన్
నా పూరణను చిత్తగించండి
కొండ్రాళ్ళ నడుమ చక్కని
గుండ్రాయిని జూపి మేస్త్రి కూలీలకు తా
తెండ్రా యని చెప్పగనే
గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్
చెరుకు రామ మోహన్ రావు
No comments:
Post a Comment