ఉత్తమ
పురుషుడు
సహా
ధర్మపత్నిగా స్త్రీ ఏవిధముగా వుండవలెననేకాదు, పురుషుడు ఏవిధంగా ఉండాలో కూడా ధర్మ
శాస్త్రం చెప్పింది, కానీ ఎందుకోఈ శ్లోకము అంతగా జనబాహుళ్యం లో లేదు.
కార్యేషు
యోగీ, కరణేషు
దక్షః
రూపేచ
కృష్ణః , క్షమయాతు
రామః, భోజ్యేషు తృప్తః,
సుఖదుఃఖ
మిత్రం, షట్కర్మయుక్తః
ఖలు ధర్మనాథః
(కామందక నీతిశాస్త్రం)
1.కార్యేషు
యోగీ : పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి
2.
కరణేషు దక్షః : కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.
3.
రూపేచ కృష్ణః: రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా,సంతోషంగా ఉండాలి.
4.
క్షమయా తు రామః: ఓర్పులో రామునిలాగా ఉండాలి.పితృవాక్య పరిపాలకుడైన రాముని వలె
క్షమించేగుణాన్ని కలిగిఉండాలి
5.
భోజ్యేషు తృప్తః: భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా)
భుజించాలి.
6.
సుఖ దుఃఖ మిత్రం: సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి
చెడ్డలలో పాలు పంచుకోవాలి.
ఈ
షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు
No comments:
Post a Comment