స్వానుభవమును వ్యష్టి అంటారు. అదే
అనుభవము సామూహికముగా జరిగితే సమిష్టి అంటారు. ఒక రైతు సాటి రైతుల వలె
వాతావరణానుకూలమగు పంటను వేయక తనకు తోచింది వేసినాడు అనుకొందాము. ఆతను నష్టపోతాడు అది అతని అనుభవము
మాత్రమె. అది వ్యష్టి అవుతుంది. అదే మిగత రైతులందరూ వాతావరణానుకూలమగు పంటను వేసి మంచి ఫలితము అది సమిష్టి అవుతుంది. ఒక్కొక్క పర్యాయము
బస్సు, రైలు లేక విమాన
ప్రమాదములు జరుగుతూ వుంటాయి. ఒకేసారి ఉమ్మడిగా కొంత మంది ప్రయాణీకులు ఆయా
ప్రమాదములకు ఆహుతి అవుతూ వుంటారు. అదే సమిష్టి. అంటే వారు ఒకే విధమగు కర్మఫలమును
అనుభవించినారన్నమాట.
ఈ విషయమై ఒక చిన్న కథ చెబుతాను. ఒకసారి ఒక బస్సులో కొంత మంది
ప్రయాణీకులు పోతూ వుండినారట. అందులో ఒక జ్యోతిష్యుడు, ఈ
బస్సులో కూర్చున్న జనానికి, ఇందులోవున్న
ఒక వ్యక్తిచే ప్రాణాపాయము కలుగనుంది అని
చెప్పినాడట. అట్లు చెప్పి అతడు తన మజిలీ వద్ద దిగిపోయినాడు. డ్రైవరు బస్సు నిలిపి
ఎదురుగా వున్న చెట్టును చూపి ఒక్కొక్కరిగా ఆ చెట్టు వద్దకు పోయి రమ్మన్నాడట. అందరివంతూ అయిపొయింది ఒక్కడు మాత్రము
మిగిలినాడు. బస్సులోనున్న ప్రయాణీకులంతా ఇక అతనిని దింపివేస్తే సరిపోతుంది అతనే ఆ
నష్టజాతకుడని నిర్ధారించినారు. ఆతనిని దింపి బస్సును పోనివ్వమన్నారు. అంతే! కొంత
దూరము పోతూనే పెద్ద ప్రేలుడు సంభవించి లోన వున్నవారంతా అగ్నికి ఆహుతియైపోయినారు.
ఇక్కడ దిగినవాని కర్మ వ్యష్టి పోయినవారిది సమిష్టి.
ఈ అనుభవము అన్నది ఒక గత స్మృతి. ఇవి
అన్నీ ఒకే విధముగా వుండవు. కొన్ని చెరగని ముద్ర వేస్తే కొన్ని మసకగా జ్ఞాపకు వుంటే
కొన్ని స్మృతి పథము నుండినే ఎగిరిపోతాయి. జీవితములో ఒక వ్యక్తికి ఎన్నోకలలు
వస్తాయి. అది తన సుషుప్తిలో జరుగుతూవుంది. సుషుప్తి వీడనంత వరకూ, కల జరుగుతూ ఉన్నంతవరకు తాను పాత్రధారి అయినా కాకున్నా ఆ విషయమునకు తానూ
సాక్షీభూతమై మసలుతాడు. అదీ అనుభవమే! మేలుకొన్న తరువాత కూడా అది తన మదిలో
నిలచిపోతూవుంది, దాని ప్రాముఖ్యతను బట్టి. మరి ఆ
అనుభవమునకు ఒక సాక్షి లేకపోతే సుషుప్తిలో వున్న నీకు ఎవరు జ్ఞాపకము చేసినట్లు? కాబట్టి నీకు తెలియకుండానే నీలో ఒక నిర్విరామ నిరంతర సాక్షి ఉన్నట్లే కదా! ఆ
సాక్షే లేకుంటే నీకు అనుస్యూతి (Continuity) ఏర్పడదు. ఈ అనుస్యూతి వల్లనే కర్మ ఆత్మ
యొక్క జన్మ జన్మాంతరాలను అనుసంధానము చేస్తూవుంది. అది ఆ విధముగా వస్తూవున్నది
కాబట్టే ఆయా అనుభవ కర్మఫలముల బట్టి ఈ 'పునరపి జననం పునరపి మరణం' జరుగుతూ వుంది.
ప్రతిజీవిలోనూ అవ్యక్తుడగు వ్యక్తి సాక్షిగా ఉన్నాడు అన్నది ఒక మరువగూడని
సత్యము. అతడు వ్యాపించి ఉన్నాడు. అతడే మార్గదర్శి (guide, ఉపదేష్ట), రక్షకుడు (care-taker)
ఇక్కడ వ్యష్టి , సమిష్టి అనే పదాలకు అర్థము ఆంగ్లములో చెప్పుకోనవలసివస్తే, individual, dividual అని చెప్పుకొనవచ్చును. రెండో పదం వాడుక తక్కువ. Individual = (n) a single human being, as distinguished
from a group. (Adj) single; particular; separate; dividual = (adj) divisible or
divided, distributed; shared. Aspect of one ultimate truth is in you, located
in you.
కావున ఏ సాక్షి మనకొరకు మన కర్మఫలమును
గుర్తు పెట్టుకొని ఆయా అనుభవ ఫలితములను మనము అనుభవింపజేస్తున్నాడో ఆయనను
సర్వాంతర్యామిగా కీర్తించున్నాము.
స్వస్తి.
Good info sir
ReplyDelete