శివోహం
శివుని గూర్చి నేను వ్రాసిన ఈ సీసాన్ని ఆస్వాదిస్తారని అనుకొంటున్నాను
నొసట నేత్రమ్మేది నుగ్గు జేయగ కంతు
గడుసు జటలవేవి గంగ నిల్ప
మురహరి తోడేది ముప్పురాల జయింప
గణములేవీ ధూర్త గుణము తప్ప
కంఠాన విషమేది కారుణ్యమును దెల్ప
శంకరా ర్పణమేది శంకదప్ప
భార్య భర్తకు యర్ధభాగంబు యని తెల్ప
గల్గు మేటికి నేను గాను సాటి
ఇట్టి వైరుధ్యముల మధ్య నెట్టులైన
సామ్యమొక్కటి చూప నే సాహసింతు
పాప ధారిని తా కూడ పాప తాల్పు
చాలు నీ మైత్రి తనతోమసలగ నేను
ఇక్కడ పాప ధారి(సంస్కృతం) అంటే పాపాత్ముడు అని, పాప తాల్పు(తెలుగు) అంటే పాములు భూషణములుగా
ధరించినవాడు అని అర్థము. పదములోకటిగా జేసి ఆయన పదము చేరి వారి పాదములపై వాలి సేవించ
కొరుకొనుచున్నాను.
No comments:
Post a Comment