Saturday, 11 July 2015

బాహుబలి ఎందుకు చూడాలి..

??? @ కోస్తా లైఫ్
ఎనిమిది అక్...షౌహిణుల సైన్యం… పర్వత ప్రాంతమంతా పరుచుకుంది కాల్బలం. ఘీంకరిస్తున్న ఏనుగులు ప్రళయ భీకరంగా కనిపిస్తున్నాయి. సేనాని గంభీరంగా విగ్రహమైపోయినట్టు నిలబడ్డాడు. మౌన సముద్రంలా ఉంది ఆ ప్రాంతమంతా ! దూరం నుంచి వస్తున్న గుర్రపు డెక్కల చప్పుడు శత్రుసైన్యం రాకకి సంకేతంలా కనిపిస్తోంది. గాల్లోకి లేచిన దుమ్ము ముక్కుపుటాలకి సందేశం ఇస్తోంది. వీరత్వానికి మానవ రూపంలా ఉన్న రాకుమారుడు గుడారంలోంచి అపుడే అడుగు బైటపెట్టాడు. తుఫాన్ ముందు ప్రశాంతత అంటే ఇదే !
ఇలా మొదలవుతుంది కథ. పక్కనోళ్లు పిలిచినా… పరీక్షలు దగ్గరపడినా… పెద్దోళ్లమైపోయామని తెలిసినా వదలకుండా చదివిన చందమామ కథ ఇది. అక్షౌహిణి అంటే ఎంతో తెలీదప్పుడు మనకి. కాల్బపం పరుచుకుంది అంటే అర్థంకాదు అంత తేలిగ్గా. అయినా ఇలాంటివి ఎన్నో చదివి ఉంటాం ! ఊహించుకునేందుకు ప్రయత్నం చేశాం. కానీ విజువల్ గా చూశామా? బ్రాడ్ పిట్ నో… రస్సెల్ క్రోనో చూడ్డం వేరు. కామెరూన్ గొప్పని ఇంగ్లిష్ లో చదివి సబ్ టైటిల్స్ తో సంతోషించడం వేరు. తెలుగులో ! తెలుగులో సంగతి అడుగుతున్నా ? చూడలేదన్నదే సమాధానం కదా ! మరి హాలీవుడ్ హాలీవుడ్డే అనుకునే రోజుల్ని మార్చేందుకు ఇన్నాళ్లకి ఒక్కడొచ్చాడు. తెలగోడి దెబ్బంటే ఏంటో చూపించేందుకు… కోలీవుడ్ నో బాలీవుడ్ నో కాదు హాలీవుడ్ ని ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాడు. బాహుబలితో బరిలో నిలిచాడు. ఇపుడు బాక్సాఫీసే మహీష్మతి. గెలవబోతున్నాడు బాహుబలి.
వారానికోసారి వచ్చే సినిమా కాదు బాహుబలి. పోనీ ఏడాదికోసారి రిలీజయ్యే స్టార్ హీరో మూవీ కూడా కాదు. సంవత్సరాల తరబడి ప్రాణంపెట్టి శ్రమించి చెక్కిన అద్భుత కళాఖండం బాహుబలి. ఖండాంతరాలు దాటింది క్యూరియాసిటీ ఇప్పటికే ! అపూర్వ దృశ్యాన్ని చూసేందుకు ప్రపంచం కళ్లు నులుముకొని ఎదురుచూస్తోంది. మరి మనం… ? శుక్రవారం సినిమాలా సరిపెట్టుకుంటామా ? ఇదో పండగ. ప్రపంచవ్యాప్తంగా ఎగిరే తెలుగోడి జెండా ! లైఫ్ సైజ్ కేన్వాస్ పై ఊహలకి రంగులద్ది… 24 క్రాఫ్ట్స్ కాదు పంచ ప్రాణాలు పెట్టి… సంవత్సరాల తరబడి నిద్రలేని రాత్రుల్ని దాటి తెలుగోడి టాలెంట్ ని స్పెషల్ ఎఫెక్ట్స్ గా మలిచి… హాలీవుడ్ కి అలవోకగా విసిరిన సవాల్ బాహుబలి. రాముడుఎలా ఉంటాడో తెలీదు. క్రిష్ణుడు ఎలా ఉంటాడో తెలీదు. దేవుడంటే ఇలా ఉంటాడని వెండితెరమీద చూపించింది అన్నగారు. ఆ తర్వాతే విగ్రహాలు, ఫోటోల రూపు రేఖలు మారాయ్. శ్రీరామ నవమొచ్చినా… ఏ పండగొచ్చినా ఇప్పటికీ ఎన్టీఆర్ రూపమే కనిపిస్తుంది ఆలోచిస్తే. అది మైథాలజీ. మరి మన చరిత్ర మన కోటలు… మన వైభవం… మన వీరత్వం ఇవన్నీ ఎక్కడ చూడాలి ? ఐకానిక్ అప్పీల్ ఎలా ? దానికి సమాధానం బాహుబలి. ఇది ప్యాథాలజీ. మన ఫిక్షనల్ హిస్టరీ. చెప్పుకోడానికి బాగానే ఉంటుంది. నేనెందుకు చూడాలి బాహుబలి ? అనే క్వశ్చన్ ఎవరికైనా ఉందా ? కచ్చితంగా ఉండి ఉండదు. ఆ ప్రశ్నఉన్నా లేకపోయినా దానికి మాత్రం సమాధానం ఉంది కచ్చితంగా ! ప్రతి తెలుగోడూ బాహుబలి ఎందుకు చూడాలంటే … దానికి ఒకటి కాదు ఐదు కారణాలున్నాయ్ !
1. ఇది తెలుగోడి తడాఖా…
తెలుగు సినిమా అంటే ఓ రిజినల్ ఇండస్ట్రీ. కనీసం ఇండియన్ సినిమా కూడా కాదు. అమెరికన్ బాక్సాఫీస్ లో మన దూకుడు టాప్ టెన్ లోకి వెళ్లినా… బాలీవుడ్ మన స్టోరీలు కాపీకొట్టినా… మాయాబజార్ అకీరా కురసోవా లాంటి దిగ్గజాల్ని ఆశ్చర్యపరిచినా సాయంత్రం అయ్యేసరికి మన
గొప్పంతా చీకట్లోకి జారిపోతుంది ! అలాంటిదిప్డుడు… జీవితంలోనే మొదటిసారిగా ఓ సినిమా హాలీవుడ్ ని ఆశ్చర్యంలో పడేస్తోంది. బీబీసీ దిగొచ్చి ఇంటర్వ్యూ చేసింది. ప్రపంచం ఊపిరి బిగపట్టి చూస్తోంది. హారీపొట్టరో…లార్డ్ ఆఫ్ ద రింగ్సో కాదు బ్రదర్…ఇది బాహుబలి. ఇది మన తడాఖా ! నీదీ…నాదీ…అందరిదీ !
2. ఇది మన స్టోరీ…
పర్షియన్ యుద్ధనౌకల్ని గ్రీకులు మధ్యలోంచి చీల్చి దెబ్బకొట్టారని చూశాం … అది 300. సైబీరియన్ కనుమల్లో ఓ మహా వజ్రం కోసం ఐదు సామ్రాజ్యాలు తలపడ్డాయ్. అబ్బో అదుర్స్ అన్నాం. దానిపేరు హాబిట్. చక్రవర్తి మీద బానిస యుద్ధం చేస్తే… అందులోనూ పట్టుమని రెండుమూడు వార్ సీన్లు ఓల్టేజ్ పెంచితే నెత్తిన పెట్టుకున్నాం. గ్లాడియేటర్ అంటూ గొప్పలు పోతున్నాం. వీటిలో ఎక్కడా మన స్టోరీ లేదే ? తెలుగు నేల మీదగానీ ఇండియాలోగానీ జరిగినట్టు… నీకో చరిత్ర, వైభవం ఉన్నట్టు… నీ కల్చర్ ని ప్రపంచం గుర్తించినట్టు ఎప్పుడైనా అనిపించిందా ? లేదు. మరిప్పుడు నీదీ ఈ స్టోరీ. ఈ గొప్పందా నీది. నిన్ను నువ్ చూసుకోవా ? 70ఎంఎం అద్దంలో మనం కనిపించడం మనకి ఇష్టం లేదా ?
3. వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్…
సూర్యుడు పండలా కనిపిస్తున్నాడని తినాలనిపించింది. ఎగిరితే కానీ అందుకోలేడు. ఎగిరాడు. తిన్నాడు. అప్పుడే తెలిసింది హనుమంతుడికి తన శక్తేంటో! పురాణం. మన ఓపికెంతో తెలిసే ఎఫర్ట్ టాలీవుడ్ ఏమైనా పెట్టిందంటే అది బాహుబలి. నిన్న జరగలేదు ఇలాంటి ప్రయత్నం. రేపు కూడా జరుగుతుందన్న గ్యారెంటీ లేదు. మళ్లీమళ్లీ చేసేందుకు శక్తి సహకరించదు. అందుకే ఇది ఒక్క జీవితకాలంలో ఒక్కసారి మాత్రమేవచ్చే అవకాశం. ఐఫోన్ కోసం రెండు మూడు రోజుల ముందే దుప్పట్లు పరుచుకొని అమెరికా రోడ్డు మీద పడుకుంటుంది. ఎందుకు ? అది వాడిగొప్ప. వాడి చూడాలని. మరి మనం మన గొప్ప ఏ రేంజిదో చూడమా ? మనకేం తక్కువ ? జిల్ … జీల్ అన్నీ ఉన్నాయ్.
4. బాహుబలి రిలీజ్ కి ముందు… తర్వాత…
అవతార్ సినిమా చూశాక… ఎనిమిది బిగ్ బడ్జెట్ సినిమాలు ఆగిపోయాయ్. అప్పటికే 20-30% షూటింగ్ అయినవే అన్నీ. ఆ రేంజ్ లో తీస్తే తీయాలి… లేదంటే అరకొర ప్రయత్నాలు ఎందుకు ? ఇప్పుడు మనం అంత హై స్టాండర్డ్స్ అందుకోలేం. లెటజ్ పోస్ట్ పోన్ ఇట్ అని. ఇది ఫాక్స్ న్యూస్ ఇన్ఫో. ఒక గీత గీసి… దీనికి ముందు దీని తర్వాత అంటే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. బాహుబలి అలాంటి గీతే ! ఇది టాలీవుడ్ రాత మార్చే గీత. అందుకే కరణ్ జోహర్ వచ్చి కలుస్తాడు. తమిళ్ ఇండస్ట్రీ సినిమాలు వాయిదా వేస్తుంది. శ్రీమంతుడు దారిస్తాడు. హాలీవుడ్… వావ్ ఎ మిరాకిల్ ఫ్రమ్ ఇండియా అంటుంది. ఇది పీకే కాదు స్టోరీతో పడగొట్టడానికి. ఇది బాహుబలి…విజువల్ ఎఫెక్ట్స్, భారీతనంతో తొడగొడుతుంది.
5. హాలీవుడ్ వయా తెలుగు నేల
హాలీవుడ్ మన దగ్గరకొస్తుందా ? ఖర్చుతగ్గుతుందంటే మన దగ్గరకేంటి..లక్కవరం లాంటి ఊళ్లకి కూడా వచ్చేస్తుంది. ఖర్చు తగ్గించుకోవాలని హాలీవుడ్ ఇప్పటికీ… న్యూజీలాండ్ లాంటి దేశాలకి వెళుతోంది స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం. సగం సినిమాలకి ఎగ్జిక్యూషన్ అండ్ ఫినిషింగ్ వర్క్ అంతా జరుగుతున్నది న్యూజీలాండ్, ఆస్ట్రేలియాల్లోనే ! హాంకాంగ్ లో కూడా కాస్ట్ తక్కువే హాలీపుడ్ తో పోలిస్తే. అందుకే పెద్ద సినిమాలకి ఆ రెండే డెస్టినేషన్స్ ఇప్పటికీ ! బాహుబలి రిలీజ్ అయ్యాక మనవైపు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇందులో పనిచేసిన వాళ్లు మూడొంతుల మంది మన టెక్నీషియన్లే !
వీలైతే… మళ్లీ మళ్లీ చూద్దాం డ్యూడ్. పోయేదేం లేదు. మహా అయితే సీక్వెల్ తీస్తారు !
– అభి
అమ్మా చాలా గొప్పగా వుంది నీ విశ్లేషణ. విషయము ఏదయినా ఒక అవగాహనతో వ్రాస్తే ఎంత చక్కగా వుంటుంది అన్నదానికి ఇది దృష్టాంతరము. నేను దీనిని నాగోడపై కూడా చేర్చుతాను, నా అభిప్రాయమును గూడా జతపరుచుతూ !
చాలామంది ఇందులో సన్నివేశాలు కాపీ అని అన్నారు. మనుషుల బోలిన మనుషులను పుట్టించుట ద్వారా దేవుడు కూడా కాపీ చేస్తాడని రుజువవవుతూ వుంది. పైగా బాహుబలిలో ఒక 10 హాలివుడ్ సినిమాల దృస్యాలను కాపీ చేసినాడనుకొందాము. అన్ని సినిమాలను అర్థము కాక, అర్థము (ధనము ) లేక చూడలెనివారికి ఒకే టికెట్టు తో చూపించడమైనది కదా. ఇక జానపద గాథలన్నీ ఒకటిగానే ఉంటాయి beaten Track అయిపోయింది అని అనుకొనేవాళ్ళకు చెప్పగలిగినది ఏమిటంటే మన సంస్కృతి 'కళ్యాణ సాహిత్యమూనకే పట్టము కట్టినది. రాముడు రావణుని జయిస్తాడు, కృష్ణుడు కంసుని వధిస్తాడు,పాండవులు కౌరవులను మట్టు పెడతారు . ఈవింధంగా మన సాహిత్యములో ఏ కథ చూచినా చెడ్డపై మంచికి విజయమే. ఇతర సంస్కృతులకిది అందని ద్రాక్ష.ఈక copy విషయానికొస్తే మన సనాతన మతమునుండి గ్రహించిన అంటే copy కొట్టని అధునాతన మతగ్రంథము లేదు.
ఇక చిత్ర నిర్మాతలు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టినారని వింటున్నాము. సినిమా చూచినవారికి అది నిజమని కూడా అర్థమై వుండవచ్చు. ఈ దేశములోని ఏ ప్రాంతము వారూ సాహసించని చిత్రాన్ని మన మన ప్రాంతీయుడు మనభాషలో తీయుటకు సాహసించినాడంటే ఒక టికెట్టుకు ఖర్చు పెట్టుకోలేమా! ఆత్మ విమర్శ చేసుకొంటే మనము చేసే దుబారాలో ఇది ఎంత? ఈ చందా మనకొరకుగాదు. మనకంటే ఆర్థికపరంగా క్రిందవుండే వారికి మనము సహకరిచినట్లు. బాగుందంటే తానూ చూస్తాడు. విమర్శనా దృష్టి తో కాదు వినోద దృష్టి తో!
ఈ సినిమా నిలిస్తే ముందు కాలానికి ఇటువంటిసాహసము చేసేవారికి ఇది కరదీపిక కావచ్చు. వారు తీయబోయేవి అందరికీ నచ్చేవిధంగా కూడా వుండవచ్చు. ఇది ఇప్పుడు ఒక మొక్క . మంచినీరు పోసిపెంచితే మహావృక్షమౌతుంది, ఉప్పునీరు పోస్తే ఉనికి లేకుండా పోతుంది.
ఇది పేద నిర్మాతలకు పెద్ద దెబ్బ అనుకొంటె వారి సంఖ్యతో పోల్చినపుడు తక్కువ డబ్బుతో ఎక్కువ వినోదమును కోరే సగటు మనుషుల సంఖ్య వారికన్నా  లక్షల రెట్లలో ఎక్కువగా వుంటుంది. ఇందులో పనిచేసిన కొన్నివేల కార్మికులకు ఈ సినిమా సంపూర్ణమయ్యెవరకూ జీవనోపాధి ఐనది. ఇంకొక సినిమా ఎవరైనా తలపెడితే అది కూడా ఇంతమంది కుటుంబాలను కాపాడుతుంది. వారి సంఖ్యతో పోలిస్తే చిన్న నిర్మాతల సంఖ్య ఎంత. Share Market లో ఎప్పటికీ పెద్ద shares కొనే వాళ్ళతోబాటూ చిన్నవి కొనేవారుకూడా ఎప్పటికీ వుంటారు. కాబట్టి చిన్న నిర్మాతలకొచ్చిన నష్టము ఏమీ లేదు.
'లోకో భిన్నరుచి' అన్న వాస్తవము గుర్తుంచుకొని చదవగలరని ఆశ.

Saturday, 30 May 2015

పుష్కరములు
పుష్కరమును గూర్చి తెలుసుకొనే ప్రయత్నము చేసే ముందు వాయు పురాణములోని ఈ కథ కాస్త చదువుతాము.

పూర్వం తుందిలుడనే ధర్మాత్ముడు శంకరుని గురించి తపమాచరించి  ప్రత్యక్షం చేసుకున్నాడు. స్వామి వరం 

కోరుకోమన్నాడు. తుందిలుడు ' స్వామీ శాశ్వతంగా నీలో ఐక్యంచేసుకొ'మ్మన్నాడు. ఈశ్వరుడు  తన అష్టమూర్తులలో 

ఒకటైన జలమూర్తిలో  శాశ్వతంగా స్థానం కల్పించినాడు.  ఇలా సకల జీవరాశిని పోషించగలిగే శక్తి అతనికి 

లభించింది. ఎన్నో అర్థాలు గలిగిన పుష్కరమునకు పోషక శక్తి అన్నది కూడా ఒకటి. అలా తుందిలుడు 

పుష్కరుడైనాడు. బ్రహ్మదేవునికి, సృష్టికి జలముతో అవసరం ఏర్పడినప్పుడు ఈశ్వరుని 

ప్రార్థించగా జలాధిపతియైన  పుష్కరుడు బ్రహ్మదేవుని కమండంలంలోకి ప్రవేశించుట జరిగింది. బ్రహ్మ కార్యం పూర్తి 

అయిన తరువాత ప్రాణులను బ్రతికించే ధర్మము నెరవేర్చడానికి బృహస్పతి ప్రాణులకు జీవాధారమైన 

జలంకావాలని బ్రహ్మదేవుని ప్రార్ధించగా బ్రహ్మవలె నన్నాడు కానీ పుష్కరునికి బ్రహ్మను వదలుట ఇష్టము లేదు.. 

అప్పుడు బృహస్పతి, బ్రహ్మ, పుష్కరులు కలసి  చేసుకొన్న నిర్ణయము ఏమిటంటే గ్రహరూపంలో ఉన్న బృహస్పతి 

మేష వృషభాది పన్నెండు రాశులలో ప్రవేశించేటప్పుడు పన్నెండు రోజులు,మిగత సంవత్సరములోని  మధ్యాహ్న 

సమయంలో రెండు మూహూర్తములు  పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించుకొన్నారు. 

ఆ సమయంలో సమస్త దేవతలు బృహస్పతి అధిపతిగా పుష్కరునితో కూడి యున్న నదికి  వస్తారు కనుక  

పుష్కరకాలంలో నదీ స్నానం పుణ్యప్రదమని పురాణముల సారాంశము.

అందరూ పండితులై వుండరు గనుక సామాన్య ప్రజకు సరళమైన రీతిలో సారాంశము చెప్పే ఉద్దేశ్యముతో ఎంతో 

ఆదరముతో మనకు ఈ కథలు అందింపబడినాయి. 

భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము అన్న పంచ భూతాత్మకమైనది దేహము. దేహి ఉన్నంతవరకు ఈ పంచ 

భూతాలతో సంబంధ బాంధవ్యములు ఉండవలసిందే. ఏది లేకున్నా కష్టమే! ఇందులో మొదటిది నీరు.అందుకే 

'జల్ జో న హోతా తో యే జగ్ జాతా జల్ ' అన్నారు జాతీయ భాషలో! మనలను కాపాడేది దేవతలినపుడు ,మనల

కాపాడే జలము దేవతే కదా!

మొదట పుష్కరము 12 సంవత్సరాలకెందుకు అన్నది చూస్తాము.మనకు ప్రభవ, విభవాది 60 సంవత్సరములు 

వున్నాయి. 60 సంవత్సరములెందుకు అంటే భూమికి అతి దూరముగా వున్న గురు గ్రహము యొక్క భ్రమణకాలము 

12 సంవత్సరములు. అదే అత్యంత దూరములో వున్న శని గ్రహము 30 సంవత్సరములు తీసుకొంటుంది. అంటే 

బయలుదేరిన బిందువు నుండి తిరిగి ఈగ్రహములు ఒకే సరళ రేఖ మీదికి వచ్చుటకు 60 సంవత్సరాల కాలం 

పడుతుంది. అంటే గురువు (12 x 5 = 60) ఐదు మార్లు, శని (30 x 2 = 60) రెండు మార్లు, తిరుగవలెనన్నమాట. 

అంటే 60 సంవత్సరముల కాలం ముగియగానే మరులా ప్రభవ నుండి 60 సంవత్సరముల కాలం 

మొదలౌతుందన్నమాట. అది  పుష్కరమునకు బృహస్పతికి గల సంబంధం లేక జల సంబంధం. మనకు 12 

రాశులు . కాబట్టి గురువు ఒకరాశినుండి బయలుదేరి అదే రాశికి రావటానికి 12 సంవత్సరాలు పడుతుందన్నమాట. 

ఆ విధంగా 12 సంవత్సరాలు 12 రాశులు 12 నదులు మనకు పునః పునః తెస్తూనే వుంటాయి.

గంగ కు మేషరాశి లో,నర్మద (రేవా) కు వృషభ రాశిలో,సరస్వతికి మిథున రాశిలో, యమునకు కర్కాటక రాశిలో, 

గోదావరికి సింహరాశిలో, కృష్ణకు కన్యారాశిలో, కావేరికి తులారాశిలో, భీమాకు వృశ్చిక రాశిలో పుష్కరవాహినికి ధనుః 

రాశిలో , తుంగభద్రకు మకర రాశిలో , సిందుకు కుంభ రాశిలో, ప్రాణహితకు మీనా రాశిలో పుష్కరాలు 

జరుగుతాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణముగా 

ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, 

చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఇవి అత్యంత ప్రాధాన్యమైనవి.

 మిగిలిన మధ్యకాలములో , మధ్యాహ్న కాలమందు 2 ఘడియలు పుష్కర పుణ్య కాలమున్తుందని శాస్త్రవచనము.

సాధారణంగా పుష్కర కాల నదీ స్నానములలో తర్పణం ,పిండ ప్రదానం మరియు శ్రాద్ధ కర్మలు చేసి పితరులను 

తృప్తి పరచి వారి ఆశీశ్శులు అందుకోవడం శుభప్రదమని శాస్త్ర వచనము.మొదటి రోజున హిరణ్య శ్రాద్దం,తొమ్మిదవ 

రోజున అన్న శ్రాద్ధం,పన్నెండవ రోజున ఆమ శ్రాద్ధం చేయడం మంచిదని ఋషులు చెప్పినారని పురాణాలు 

చెప్తున్నాయి.శ్రాద్ధకర్మలు ఉపనయనం,వివాహం అయిన పురుషులు పితృ వియోగము పిదపనే అర్హులు.

ఈ  12 రోజులూ 12 దానాలను కూడా నిర్దేశించినాయి శాస్త్రాలు.

నేటి మానవ జీవనములో కొన్ని మాత్రమె సుసాధ్యములు, కొన్ని సాధ్యములు మిగతావి అసాధ్యములు. చివరి రోజున 

తిల (నువ్వులు ) దానము మంచిది. సప్తర్షులేగాక, చాలా మంది దేవతలు కూడా సూక్ష్మరూపులై ఈ నదుల 

ప్రాంతంలో పుష్కరాలప్పుడు సంచరి స్తుంటారనీ, పుష్కర స్నానాలు చేసే వారికి శుభాలను కలిగిస్తారనీ 

కూడా నమ్మకం. పుష్కరాలు జరిగే సంవత్సర కాలంలో నదికి సవిూప ప్రాంతాలలోని వారు వివాహాది శుభ కార్యాలు 

చేయరు. తప్పని సరిగా చేయవలసి వస్తే వేరే ప్రాంతాలకు వెళ్లి 

చేస్తారు. 

ఉత్సవాలు జరిగే పన్నెండు రోజులూ అవకాశం ఉన్నవారు నదీ స్నానాలు చేస్తారు, తీరంలో పూజలు,  తర్పణాలు,  

జపాలు, దానాలు చేసే సాంప్రదాయం ఉంది. నీటిలో మానవుంకి ఉపయోగపడే రెండు శక్తులున్నాయని వేదం 

చెప్తుంది. ఒకటి దాహార్తిని తీర్చడం, రెండు దేహ శుద్ధి అంటే శుభ్రపరచడం . ఈ  రెండు బాహ్య శక్తులైతే 

అంతరంగికంగా మేధ్యం,సంప్రోక్షణం, అనే రెండు శక్తులున్నాయని వేదం వివరిస్తుంది. మేధ్యం అంటే  నదిలో 

స్నానంచేసి మూడుసార్లు మునక వేస్తే తెలిసి తెలియక చేసే పాపాలు పోతాయని అలాగే సంప్రోక్షణం 

అంటే నీటిని చల్లడం వలన ద్రవ్య శుద్ధి జరుగుతుందని పురాణాల చెబుతున్నాయి.నీరు నారాయణ స్వరూపం.  

పాపాలు స్నానంద్వారా పటాపంచలౌతాయని విశ్వసిస్తారు. సాధారణ స్నానమునకంటే తీర్ధ స్నానం ఉత్తమం, 

దానికంటే నదీ స్థానం ఉత్తమం దానికంటే పుష్కర సమయ నదీస్నానం ఉత్తమోత్తమం. ఆసమయంలో 

దేవతలలంతా పుష్కరునితో నదిలో ప్రవేశీస్తారని హిందువుల విశ్వాసం.త్రికరణాలతో చేసే పాపాలు పోతాయని,

పుష్కర స్నానం ఒకసారి చేస్తే పన్నెండు సంవత్సరాల కాలం పన్నెండు పుణ్య నదులలో స్నానంచేసిన పుణ్యం 

లభిస్తుందని,అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని ఋషి వాక్కు. మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ 

పురాణం వర్ణిస్తుంది.నదీ జలాలను సేవిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని నదీ జలాలలో స్నానమాచరిస్తే  బుద్ధి 

మాంద్యం,అలసత్వం మొదలైన శారీరక ఋగ్మతలు నశిస్తాయని తైత్తరీయ ఉపనిషత్తు వివరిస్తుంది.

 పుష్కర ఫలితమస్తు

Thursday, 7 May 2015

మనవాళ్ళు తెలుగు మరచిపోతున్నారు



      • మనవాళ్ళు తెలుగు మరచిపోతున్నారు 
        తెలుగును  పిల్లవాళ్ళు మరచి పోతున్నారు అంటుంటే ఏంటో అనుకొన్నాను. మొన్న మా పక్కింటికి బందువులు వచ్చారు. అక్కడ ఒక యీల పిల్ల ఒక ఆవిడను మీరు నాకు ఏమి అవుతారు అంది ఆమె "నీ మేనత్తకు అక్కని అవుతాను కాబట్టి నీకు అత్తనౌతాను  అంది. అత్త అంటే ఆంటీ మేనత్త అంటే ఎవరూ? అంది అక్కడున్న నాకు తల తిరిగింది అ పిల్ల తెలిసి అందో తెలియక అందో తెలియదు గాని తెలుగు భాష కు పడుతున్న గతి మాత్రం తెలుస్తునది.
        Like ·  · Unfollow Post ·  · 20 hours ago
        • Rajasree Raje అక్కడ ణు యీల అవి మిస్ పడ్డాయి. అవి ను బంధువుల పిల్ల
          20 hours ago · Like · 1
        • Vasudevarao Konduru మొన్నీమధ్య తిరుమల కొండ మీద ఒక చిరుత వాహనం క్రింద పడి చనిపోయింది. ఆ ఘటనని వివరిస్తూ, బహుశః తి.తి.దే అధికారి అనుకుంటా, వారు వర్ణించిన తీరు ఈ విధంగా ఉంది. 

          ఒక cheeta down నుంచి up కి ఈ road crosss చేస్తుంది, ఇంతలో ఒక vehicle speed గా వచ్చి cheeta ని hit 
          చేసింది. వెంటనే cheeta died అయ్యింది. మేము ఈ accident ని immediate గా wild life department officials కి inform చేసాము. వారి కోసం wait చేస్తున్నాము. 

          ఇందులో ఎంత తెలుగు ఉందో, ఈ తెలుగుకి తెలుగువాడైన ప్రతివాడు గర్వించవలసిందేనా.
          18 hours ago · Like · 2
        • Seshu Bandaru మీరు గమనించ వలసిన విషయం ఒకటుంది. ఒకవేళ ఆ అధికారి పూర్తిగా తెలుగులో విషయాన్ని వివరిస్తే ఎంతమంది దానిని అర్ధం చూసుకోగలరు అని
        • Rajasree Raje seshu bandaru గారు సరిగ్గా చెప్పారు. నేటి పిల్లలకే కాదు పెద్దలకే తెలుగు రాదూ విచ్చిత్రం ఏమిటి అంటే వల్లి తెలుగు మీడియం లోనే చదవరు అంట
          3 hours ago · Like · 1
        • Vasudevarao Konduru రైలు, బస్సు, కార్, లారీ, సైకిల్, రైల్వే స్టేషన్, బస్సు స్టాండ్. సామాన్య మానవుడు, పామరుడు కూడా వాడే జన బాహుళ్యం పొందిన ఇలాంటి ఆంగ్ల పదాలకు తెలుగులో సమానాంతర పదాల కోసం ప్రయత్నించకపొయినా, క్రింద(down), మీద(up),రోడ్డు దాటుట (road cross), వాహనం (vehicle), వేగం (speed), గుద్దుట (hit), చనిపోవుట (died), ప్రమాదం (accident), వెంటనే (immediate), వన్య ప్రాణుల సంరక్షణ (wild life protection), తెలియచేయుట (inform). ఇవేమీ శుధ్ధ గ్రాంధిక పదాలు కాదే. వీటిని వాడటానికి తెలుగులో Phd చేయవలసిన అవసరం లేదే. మాతృ భాష మీద పట్టు లేనివాడు, పరాయి భాష మీద పట్టు సాధించలేడన్న సత్యాన్ని ఈ అరకొరక ఆంగ్ల పాండిత్యం కోసం వెంపర్లాడేవాళ్ళు గ్రహించాలి.




          • Cheruku Ramamohanrao వాసుదేవ రావు గారు వెలిబుచ్చిన అభిప్రాయాన్నే నేను 4,5 రోజులక్రితం వెలిబుచ్చాను . 'మెఅల్స్ అయిందా' అంటే 'just now' అనే తెలుగు ఇప్పుడు మాట్లాడుచున్నాము . భోజనమైందా అంటే నోటి ముత్యాలేమీ రాలి పోవు గదా . just now లో ఏమి తెలుగుంది . భవిష్యత్తు యువతది. శ్రద్ధ చూపితే భాష నిలుస్తుంది. భాష సంస్కృతి రెండూ నాశనమే. అమ్మ నాన్నలు మొదట పిల్లలతో mummy , dady అని అనిపించుకొన గూడదని శపథం చేయవలె . dady sounds as deady and meaning of mummy everybody knows. ఇంకొక హీనమైన పదం వుంది . అది MADEM. idi ma- dame అనే రెండు ఫ్రెంచి పదాల కలయిక . ఆంగ్లములో దాని అర్థము 'my lady' ani.
            'యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః 
            యత్రైతాస్తు అపూజ్యంతే తత్రైతా స్థఫలా క్రియః '
            అన్నారు మన పెద్దలు. ఆడవాళ్ళలో అమ్మవారే కనిపించాలని చిన్న పెద్ద తేడా లేకుండా అందుకే మా కాలములో, మేము ఇప్పుడు కూడా, అమ్మా అనే పిలుస్తాము . ఇప్పటికైనా తెలుగువాడు ఒక్క సారి వళ్ళు దులుపుకొని పొరుగు రాష్ట్రాలను చూసి అయినా నేర్చుకొంటే మంచిది.
          • Vasudevarao Konduru ఎంత సేపు ఒకరు చెపుతుంటేనో, మాట్లాడుతుంటేనో వినటం తప్ప చదివి తెలుసుకుందామన్న ఆసక్తి ఈ తరం వాళ్ళలో చచ్చిపోయింది. కేవలం విని నేర్చుకోవటమనేది అలవరచుకుని, పుస్తక పఠనం మరిచి వ్యావహారిక బాషను మాత్రమే భాషగా గుర్తిస్తే అనర్ధమే ఎక్కువ. పాఠశాలల్లో సైన్స్, లెక్కలు కు ఇచ్చినంత ప్రాధాన్యత అది ఆంగ్లమైన, తెలుగైనా మరో భాషైన, భాష కు లేదు, మొక్కుబడికి కేవలం మార్కుల కోసమే నన్నట్టుగా బోధించటమే తప్ప భాషను పెంపొందిద్దామని లేదు. భాష మీద గాని, ఉచ్చారణ మీద కాని పట్టులేని ఉపాధ్యాయులు, టీవీ ఆంకర్లు, విలేఖరులు, సినిమా రచయితలు, వాటి వాటి యాజమాన్యాలు భాష నాశనానికి తమ వంతు కృషి చేస్తున్నారు


          • Cheruku Ramamohanrao కొందరు పూర్వీకులైన మహానుభావులు తాము మునిగిందే గంగ తాము వలచిందే రంభ యని పుర్రెకు తోచిన ఆలోచనలను అంటగట్టి భాషను ఎట్టకేలకు కట్టకడపటికి చిట్టచివరకు భాషను కాష్టం పైన పడుకోబెట్టడం లో కృతకృత్యులైనారు. 
            అసలు వ్యావహారిక భాష అంటే ఏది. విజయనగరం విశాఖ శ్రీకాకుళం ద
            ా, తూర్పు పశ్చిమ గొదావరిదా విజయవాడ గుంటూరిదా, రాయలసీమదా, ఏది? అందులోకూడా ఏ మాండలీకం. వారు శిష్ట వ్యవహారమనే మాట ఉపయోగించినారు. మరి దుష్ట వ్యవహారాన్ని నిర్వచిన్చినారా .

            తిరిగి కొనసాగిస్తాను
          • Rajavaram Usha నిజమే!ఇంట్లో కొన్నాళ్ళు పూర్తి గ తెలుగు భాషలోనే అందరు మాట్లాడుకుంటే కొంచెం పిల్లలకు కూడా పట్టు దొరుకుతుంది అదేంటో ఆంగ్లము మాట్లాడితే గొప్ప అనుకోవటం ఎక్కువయ్యింది ఈ మధ్య.. ఎవరైనా రహదారి పై మాట మాట అనుకున్నప్పుడు ఒకడు ఆంగ్ల పద ప్రయోగం చేయగానే అవతలి వాడు కొద్దిగా వెనక్కి తగ్గుతాడు అదె.... తెలుగు లోనే మాట్లాడాడు అనుకోండి గొడవ సద్దు మణ గదు ఇలా ప్రత్యక్షం గ చూసాకనే వ్రాస్తున్నాను
          • Rajavaram Usha కనీసం ప్రసార మాధ్యమాల ద్వార నైన తెలుగు భాష పై మక్కువ కలిగించేలా రక్తి కట్టించే తెలుగు కార్యక్రమాలు ప్రసారం అయితే చూసిన కాస్త నేర్చుకుంటారేమో ఈ కాలం కుర్ర కారు
          • Rajavaram Usha ఇలాంటి చర్చ లు అంతర్జాలం లో ఇంకా చాల పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ చర్చ ను ప్రారంభించిన రాజశ్రీ గారికి, పాల్గొన్న వారికి నా అభినందనలు



          'face book'