Thursday, 10 April 2014

ఆంధ్రులు-- వారి మూలములు

ఆంధ్రులు


ఆంధ్రులు వారి మూలములు అన్న విషయ ప్రస్తాపన ఎవరు చేసినా కార్యారంభములో గణపతి ప్రార్ధన చేసినట్లు మహనీయులు, వేదముర్తులు, పరివ్రాజకులై విరూపాక్ష జగద్గురు పీఠాధిపతులై శ్రీ శ్రీ శ్రీ అద్వయానంద శంకర భారతీ స్వామిగా కొనియాడబడి  కైవల్య పదమలంకరించిన మాన్యవరులు కోట వెంకటాచలం గారి పాద యుగళికి నమస్కరించకుండా పూనుకొన మనస్కరించదు.  కంప్యూటరు, అంతర్జాలము,గూగులు లేని కాలములో వ్యయ ప్రయాసల కోర్చి ఎన్నో గ్రంధములను పరీక్షించి, పరిశీలించి, పరిశోధించి వాస్తవములను వెలికి తీసినవారి అకుంఠిత దీక్షా దక్షత అనితర సాధ్యము.  నేను వ్రాయబోయే వ్యాసమునకు వారి ఆంధ్రులను గూర్చిన పరిశోధనయే మూలము. 21-4-1885 లో పుట్టిన వీరు 12-11-1959 లో బ్రహ్మసాయుజ్యమును పొందినారు.
గతములో పాశ్చాత్యుల ప్రలోభమునకు గురియైనవారు కొందరైతే, ప్రభావమునకు లోనైనవారు ఎందరో ? మన దుస్థితి ఏమిటంటే మనకు విస్సన్న చెప్పింది వేదము, జేమ్సు చెప్పిందే చరిత్ర. అందువల్ల మనమేరోజూ మన చరిత్ర తెలుసుకొను నుత్సుకత చూపింది లేదు.  ఒక వేళ ఎవరైనా భారతీయులు ఉత్సుకత చూపినా వానిని చదివి, వ్రాసిన వారిని ప్రోత్సహించిందీలేదు.  పాశ్చాత్యులిచ్చిన గుడ్డి దీపముతోనే చీకటి వాత పడిన మన చరిత్రను వెదుకుకొనుచున్నాము. ఇకనైనా యువకులు అంతర్జాలమనే విద్యుద్దీప కాంతిలో మన చరిత్రను దొరక బుచ్సుకొనే ప్రయత్నము చేసిన మంచిది.
వేదమూర్తులగు విశ్వనాథ వారి ఈ పద్యము వినండి:
ఇమ్ముగ కాకుళమ్ము మొదలీవరకుంగల యాంధ్ర పూర్వరా
జ్యమ్ముల పెరుజేప్పిన, హృదంతరమేదొ చలించిపోవు, నా
ర్ద్రమ్మగు చిత్తవృత్తుల పురాభవ నిర్ణయమేనని నెన్ని జ
న్మమ్ముల గాక నీ తనువునన్ బ్రవహించునో యాంధ్ర రక్తముల్
శ్రీకాకుళము మొదలు చివరికంటా గల పూర్వపు ఆంద్ర రాజ్యముల పేరు జెప్పిన నాహృదయాంతరాళములందు
ఎదో అలజడి, ఒక విధమైన అవినాభావ సంబంధ ప్రకంపనలు కలుగుతాయి. ఆర్ద్రతా భరితమైన ఈ నా చిత్తవృత్తికి కారణము, నా తనువులో,ఊహకందని, ఎంతోకాలమునుండి ప్రవహించే యాంధ్ర రక్తము యైయుండనోపునని ఉద్వేగభరితమైన మనస్సుతో వాక్రుచ్చుతారు వేదమూర్తులగు విశ్వనాథ వారు.
అదేవిధంగా “ఆంధ్ర భాష సుజనోత్సవ మొప్పగ నిర్వచించి…” అంటూ 
“నృసింహపురాణం”లో కూడా ఆంధ్ర శబ్దం వినియోగించబడింది.
యిక మహాభారతగాథ ఆధారాలు యిలా తెలియ జేస్తున్నాయి.
కవిత్రయంలో నన్నయ తర్వాత విరాట పర్వ ఆంధ్రీకరణ ప్రారంభ దశలో 
“ఆంధ్ర కవితా విశారదుండు విద్యాదాయితుండు నరించే మహితాత్ముడు 
నన్నయభట్టు దక్షతన్ “ అంటూ ఆదికవి నన్నయామాత్యుని కీర్తించాడు 
మహాకవి తిక్కన..
 ఆపస్థంభమహర్షి వర్ణనల ప్రకారం నాటి ఆంధ్ర బ్రాహ్మణులు అతి గొప్ప 
విద్వత్వేత్తలుగా కొనియాడ బడేవారని తెలుస్తోంది.

పాశ్చాత్యుల ముఖ్యమైన తలంపు వారు పరమ నాగరికులని, మనము అనాగరికులమని మొహెంజోదారో,హరప్పా శిధిలాలు బయల్పడేవరకు తలచిన ఆ గొప్పవారి నోట్లో, అవి బయల్పడిన తరువాత, పచ్చి వెలగ పడిన  చందమైనది.  వారి దృష్టిలో ఆంధ్రులు ఆటవికులు.  నాగరికత లేని వారు.  వారి పుక్కిటి పురాణమునకీ కథ ఆలంబనము అని నాకు తోచుచున్నది.  ఐతరేయ బ్రాహ్మణములో గల ఈ కథ ఈ విధముగా ఉన్నది.
హరిశ్చంద్రుడనే రాజు (సత్య హరిశ్చంద్రుడు కాదు)  వరుణుని గూర్చి తపస్సు చేసి తనకు కొడుకు కలిగితే వానిని యజ్ఞ పశువును జేసి యజ్ఞము చేసెదనని విన్నవించుకొంటాడు.  కొడుకును కలిగిన తరువాత తన మాటను దాటవేసుకొంటూ వస్తాడు. వరుణుడు కోపించి, అతనిని జలోదర వ్యాధిగ్రస్తుడు కమ్మని శపించితే కనువిప్పు కలిగి అతను చేయునంతలో కన్నకొడుకందుకు భయపడి కాననాగతుడౌతాడు. అప్పుడు రాజు కుల గురువైన వశిష్టుని బోధన మేరకు వేదవిద్యావిదితుడు యోగ్యుడు ఐన బ్రాహ్మణ వటువును బలి పశువు చేయనెంచి భటుల దేశపు నలు మూలలకు పంపుతాడు.  చివరకు అటువంటి వటువు వారికి ఒక అగ్రహారములోని బ్రాహ్మణ కుటుంబములోని ముగ్గురు కుమారులలో మధ్యమునిగా తారస పడతాడు.  అతని పేరే శునశ్శేపుడు.  తండ్రికి జ్యేష్టుడు తల్లికి కనిష్టుడు ఇష్టమని తలంచి కష్టమైనా ప్రాణ నష్టమైనా స్పష్టముగా తాను అందులకు ఒప్పుకొంటాడు.  కారణం,రాజు అందుకు గానూ  ఇవ్వబోవు ధనము తో తన తల్లిదండ్రులు సుఖముగా బ్రతుకుతారనే తలంపే.  భటులు అతనిని తీసుకొని పోవు మార్గ మద్యములో విశ్వామిత్రుడు ఎదురై విషయములు గ్రహించి, ఆ బాలునితో తాను కూడా రాజు వద్దకు బయలుదేరుతాడు.  రాజువద్దకు జేరి ఆ బాలుని బలిచేయకనే యజ్ఞఫలము అతనికి ప్రాప్తించు నట్లు చేసి బాలుని తన వెంట తీసుకొని పోయి తన నూర్గురు కుమారులకు పరిచయము చేసి వారి కన్న పెద్దవాడైన కారణాన తమకు  జ్యేష్ఠునిగా అంగీకరించమంటాడు.  మొదటి ఏబది మంది, వీరి పేర్లు మనకు తెలియవు కానీ పెద్దవాని పేరు మాత్రము అష్టకుడు అని భాగవతమున చదివిన గుర్తు, వీలు పడదనీ వాదించగా వారిని చండాలాది నీఛ జాతులుగా పుట్టమని శపించి, మిగిలిన ఏబది మందిలో పెద్దవాడైన మధుచ్చందుని అడుగగా తాను తన సోదర గణమూ అందుకు సమ్మతమేయని అంటాడు.  ఛండాలురైన మొదటి ఏబది మంది అంధ్ర (ఆంద్ర కాదు),  శబర, పుళింద, మూతిబా ఆదిగా గల హీనవర్ణులై జెలగిరి.  ఇందులోని అంధ్ర శబ్దము చూసి చరిత్రకారులు అందులో మనవారలు కూడా వున్నారని భ్రమించి  శాపగ్రస్తులై, వైదిక ధర్మాచార భ్రష్టులై ఆటవిక జాతులతో కలిసి హింసా చౌర్యాదులచేజీవించుచూ వచ్చినవారు మన పుర్వీకులనుట ఎంత వరకు సహజమో, సమంజసమో  పాఠకులు ఊహించ గలరు. అసలు వీరిని విశ్వామిత్రులవారు మీరు నీతి బాహ్యులైనా కృష్ణా గోదావరీ తీరములకు పోయి నివశించమని చెప్పినట్లు ఏ పురాణేతిహాస బ్రాహ్మణకములందునూ లేదు. అరణ్యాలలో నివశించే వీరు , ఎందఱో ఆటవికులు నేటికీ అరణ్యములలో నివశించుచుండగా వీరు మాత్రము గోదావరీ కృష్ణా తీరములకు ఏవిధముగా రాగలిగినారో వ్రాసిన ఆ ఆంగ్లేయ చరిత్రకారులకే ఎరుక. మరి ఆంధ్రులెవరో పరిశీలింపనారంభింతము.
రామాయణములోని కిష్కిందా కాండలోని నలభైఒకతవ సర్గలో 11,12,13 శ్లోకాలు ఏమి చెబుతున్నాయో వినండి.
విడర్భాన్ ఋషి కాలశ్చైవ రమ్యాన్ మాహిషకానపి
తథా వంగాన్ కళింగాశ్చ కానికామ్శ్చ సమన్తతః
అన్వీక్ష్య దండకారణ్యం సపర్వత నదీ గుహాం
నదీ గోదావరీం చైవ సర్వేమేమనుపశ్యత
ఈ శ్లోకములను సుగ్రీవుడు , దక్షిణ దిశకు పంపబోతున్న తన ఉద్యోగులగు హనుమద్నలనీలాదులకు చెబుతాడు. ఇక్కడ ఆయన తెలిపినవన్నీ రాజ్యములు గానీ జాతులు కాదన్నది సుస్పష్టము కదా !

భారతములోని సభా పర్వములోని శిశుపాలవధ ఘట్టములో నన్నయ వ్రాసిన ఈ పద్యమును తిలకించండి

రయ విచలత్తురంగ మత రంగములై మదనాగ నక్రసం
చయముల సంచలచ్చటల సైనిక మత్స్యములన్ భయంకరం
బయియ దువృశ్ని భోజకు కురాంధకవాహిని యుంజె లంగని
ర్దయతర రోషమారుతనింకాంత సావీ హితమై క్షణంబునన్

ఇందులో కూడా కుకుర అంధక.... అన్న శబ్దము వస్తుంది.  మరి దానిని కూడా ఆంధ్ర శబ్దమునకు అన్వయించుకొనవచ్చును.  మధువు కుమారుడు క్రోష్టు యొక్క వంశములోని వారు ఈ భోజ, వృష్టి,
అంధకాదులు .ఇంత వరకు మనము చెప్పు కొన్నవేవి తర్కమునకు నిలువవు.
ఇంకొక విషయము భారతము లోనే సహదేవుని విజయ యాత్రలోఓఢ్ర, ద్రావిడ, పాండ్య,మళయాళ దేశాములనేగాక,కళింగ ఆంద్ర దేశములనుగూడా జయించినట్లు చెప్పబడియుంది. అసలు రాజసూయ యాగములో ఆంద్ర, ద్రావిడ, పాండ్య, ఓఢ్ర రాజులు కూడా ఉన్నట్లు తెలుపబడినది.మరి ఇంతటి నాగారీకతకలిగి దేశమును పాలించిన ఆంధ్రులను ఆటవికులతో ముడిపెట్టుట సమంజసమా!

  శ్రీమత్ భాగవతములోని నవమస్కందములోని 5, 6 శ్లోకములు

!!శ్లో!! అంగ వంగ కళింగాద్యాః  సుంహ పుండ్రాంధ్ర సంజ్ఞితాః
       జజ్ఞిరే దీర్ఘత మర్షిసో బలేః క్షేత్ర మహే క్షతః

!!శ్లో!! చక్రుస్వ నామ్నా విషయాన్ షడిమాన్ ప్రాచ్చకాంశ్చతే

పూర్వ శ్లోకముల అన్వయముతో పై శ్లోక భావమే మన బలి యను మహారాజునకు దీర్ఘతముడను ఋషి యనుగ్రహము వల్ల 1.అంగ, 2.వంగ, ౩.కళింగ, 4.సుంహ, 5.పుండ్ర, 6.అంధ్ర అను ఆరుగురు కుమారులు కలిగిరి.  వారు తూరుపు దేశమునకు రాజులై ఆరు భాగములుగా విభజించుకొని ఆ రాజ్యములను సార్ధకమొనరించిరి.  ఆ విధమున అంధ్రుని దేశము ఆంధ్ర దేశమైనది.  శ్రీ బమ్మెర పోతన శ్రీమదాంధ్ర భాగవతములోని నవమ స్కందమున గల ఈ వచనము చూచిననూ అర్ధము కాగలదు.
వచనం: తితిక్షునకు ఋశద్రథుండు, అతనికి వేముండు, అతనికి సుతపుండు, అతనికి బలియు పుట్టిరి. ఆ బలివలన అంగ, వంగ, కళింగ, సుంహ, పుండ్ర, ఆంధ్రులను పేర్లు గల ఆర్వురు కుమారులు జన్మించి తమ తమ నమధేయముల దేసమ్ముల నేలిరి.  కావున ఆంధ్రులు విశ్వామిత్ర సంతానము కాదనియు, క్షత్రియ కుల సంజాతుడైన ఆంధ్రుని రాజ్య వాసులనియు మనము గ్రహింప గలుగుచున్నాము.
విశ్వామిత్రుని కనిష్ట అర్ధ శత సంతానము శునశ్శేపుని అగ్రజత్వమునకు అంగీకరించినవారై తమ తండ్రి దీవెనలు పొందిరి.  శునశ్శేపుడు దేవరాతుడని పిలువబడి విశ్వామిత్ర గోత్ర ప్రవరుడయ్యెను.  బ్రాహ్మలలోని విశ్వామిత్ర గోత్రజులకు ఈ విషయము తెలియగలదు. ఈ ప్రవరాన్వితులు నేటికినీ పుష్కలముగా యున్నారు.  మరి ఆంధ్రులు కిరాతకులైనవారియందు వీరేట్లు ఇమడ గలరు.
పాశ్చాత్యులు సముద్రపు దొంగలై (pirates)  ప్రయాణీకులను హింసించుచూ రాను రాను మాన దేశ ప్రాభవమును గూర్చి తెలుసుకొని, అన్వేషకులు (explorers) అన్న ముసుగులో మన దేశమున ప్రవేశించి, మన దేశమును కొల్లగొట్టినారు.  ఒక వైపు ముస్లీములతో మరొక వైపు ఆంగ్లేయులతో కొల్లగొట్టబడి కూడా తన ఉనికిని కాపాడుకోగలిగినది.  తమ తమ మత ప్రచారమునకు వారు చేసిన రాక్షస పైశాచిక కృత్యములు తలచుకొంటే నేటికీ వళ్ళు గగుర్పొడుస్తుంది.  అందులోని భాగంగానే పాశ్చాత్యులు మన వేదములను, పురాణములను వక్రీకరించి తాము నాగరికులుగానూ, మనమనాగరికులుగానూ చిత్రించుటయే కాక క్రొత్తగా ఆర్య ద్రావిడ విభేదములనేర్పరచి, ఔత్తరాహులని దక్షిణాత్యులని, మనల వేర్పరుప జూచినారు.  ఆర్యాః అనగా ఈశ్వర పుత్రాః అని యాస్కాచార్యులవారు 5000 సంవత్సరముల క్రితమే తెలిపినారు.  అదే మాటను 500 సంవత్సరములకు పూర్వం వేద భాష్యమును వ్రాసిన విద్యారణ్యులవారు కూడా ఇదే విషయమును చెప్పినారు.  ఇక ద్రవిడ శబ్ధము చుట్టూ ద్రవము కలిగి యుండుట వలన ఈ దక్షిణ దేశ ప్రాంతము ద్రావిడమైనదని కొందరంటే ద్రమిళుడు అను రాజు చేత పాలింపబడిన ప్రాంతము కాబట్టి ద్రమిళము అదే రానురానూ ద్రవిడము ఐనదని కూడా పండితులు తెలియబరచినారు.  అంతే కానీ వేరేమియుకాదు.  ఆర్యులు ఎర్రగాను ద్రావిళ్ళు నల్లని వారని తేల్చినారు పాశ్చాత్యులు.  మరి రాముడు, కృష్ణుడు, వ్యాసుడు ద్రౌపది మొదలైనవారంతా ద్రావిళ్ళేనా! వీరు వేద పురుషులు గారా ! వేదము, పాశ్చాత్యుల ప్రకారము సుమేరు నుండి వచ్చిన ఆర్యజాతి వ్రాసిన లొల్లాయి పదాలని వేదాలను వక్రీకరించినారుకదా, మరి  సీతాన్వేషియై లంకా నగరము నకు వెళ్ళిన హనుమంతుడు అక్కడి రాక్షసులు వేదపారాయణులని  తెలిపినాడు. మరి వారు ఆర్యులా ద్రావిడులా !
విష్ణు సహస్ర నామములో

సులభః సువ్రతస్సిద్దః శత్రుజిచ్చత్రుతాపనః
న్యగ్రోధోదుంబరోశ్వత్తః చాణూరాంధ్ర నిశూధనః

అంటే దాదాపు ఐదు వేల సంవత్సరములకు పూర్వమే ఆంధ్రుల ఉనికి తెలియ వచ్చుచున్నది.
“అంధ్ర” ‘‘ఆంద్ర’’ అను పదములు స్వల్ప మార్పులతో గూడియున్నందున అన్నియు ఎకోచ్చారణ కలవియై కాలక్రమమున పాశ్చాత్య ధోరణుల నభ్యసించి అభిలషించిన మన చేత ఏకార్ధమున ఉపయోగింప బడినవి. అంత మాత్రమున మూలమునాశ్రయింపక రెంటిని ఒకటే గాట కట్టుట సమంజసము కాదు.

అంధ్ర లేక ఆంద్ర అను జాతి యొకటి  విలోమ సంకర జాతులలో నున్నట్లు మను స్మృతి చెప్పుచున్నది.

!!శ్లో!! మత్స్య షూతో నిషాదానాంత్వష్టిస్వా యోగావస్యచ
       మేదాంద్ర చుంచు మద్గూనామారణ్య పశు హింసనామ్  (మను 10-48)

అర్ధమేమిటంటే నిషాదులకు చేపలు పట్టుటయు అయోగవులకు వడ్రంగమును,మేదులు,అంద్రులు (మేద+అంధ్ర) చుంచులు మద్గులు మొదలగువారు అడవి మృగముల హింసించు వృత్తుల గొనియున్నారు. ఇంత విశధముగా ఈ ఆంధ్రులు ఆటవికులని మను ధర్మ శాస్త్రములో ఉన్న విషయాన్ని వక్రీకరించుట కంటే దానిని యధా తధముగా గ్రహించి తార్కికముగా ఆలోచించిన అంతంత మంది వేదశాస్త్ర పురాణాలనభ్యసించ యుద్ధ విద్యనభ్యశించి వ్యాపార వ్యవసాయములు  నేర్చుకొని వివిధ కళల యందు నిష్ణాతులై వారిలో వారే మీరీ వర్ణము మీరీ వర్ణమని నిర్ణయించుకొని రాజ్యములేలిరనుట అందలి పౌరులై వర్ణాశ్రమ ధర్మములను పాటించిరనుట నమ్మశక్యమా! అదియును గాక అటువంటి విధముగా జరిగినట్లు ఎటువంటి చారిత్రిక ఆధారమును లేదే! ఇది పాశ్చాత్య పండితుల, వారి అనుచరుల స్వకపోల కల్పనము.  ఆటవికులయిపోయిన విశ్వామిత్ర సంతానము ఆర్యులుగా మారి రాజ్యములు స్థాపించి వర్ణాశ్రమ ధర్మములను పాటించినట్లు ఏదైనా లెక్క దాఖలాను చూపగలరా!
ఒక వేళ అదియే నిజమైన వేదభాష్యము వ్రాసిన విద్యారణ్యుల వారు ఆంద్ర దేశపు ప్రశస్తిని జగతికి చాటిన వీర, విక్రమ, విద్యావిభవ సంపన్నులైన మాన అంధ్ర దేశపు రాజులు వ్యాపార వ్యవసాయముల నపారముగా జేసి అంధ్ర దేశమును సుసంపన్నము జేసిన వైశ్యులు, రాజులు నశించి దేశ మరాచక స్థితి యందున్నసమయమున
రాచరికపు పగ్గములును చేత బూని సమర్థవంతముగా అంధ్ర రాజ్యములనేలిన అనితర దీక్షా దక్షులగు వెలమ,కమ్మ, రెడ్డి, కాపు తెగలను అరణ్య జాతులనుట న్యాయమా  ఒకవేళ అది నిజమగుచో అటువంటి చోద్యము ఆంధ్రులకు మాత్రమే సంభవించినదా!   అసలు వేదాధ్యయమునకు మన రాజమహేంద్రి పట్టుకొమ్మ కాదా! దేశములోని ఆంధ్రము రెండవ భాషగా ప్రభవించ గలదా! వారు చెప్పినదే నిజమైతే మిగత అనాగరిక భాషలు కూడా దేశవ్యాప్తి అయిఉండవలెను కదా!
దీనివల్ల మనకు అవగతమగుచున్న దేమిటన ‘అనువు’ వంశములో యయాతినుండి ప్రముఖ వంశములను లెక్కించ, 15వ వంశమున జన్మించిన ‘బలి’ యను రాజు కుమారులైన 1.అంగ, 2.వంగ, ౩.కళింగ, 4.సుంహ, 5.పుండ్ర, 6.ఆంధ్రులను వారలకు (భాగవతము 9-685) రాజ్యమును పంచి ఇవ్వగా ఆ దేశ వాసులు ఆ యా రాజుల పేర్లతో బరగినట్లు నిర్దారితమగుచున్నది.

తన గోత్రమే ఉపయోగించుకొన నర్హత లేని ఆటవికులైపోయిన విశ్వామిత్రుని మొదటి యాభైమంది పుత్రులు వారి గోత్రమునుపయోగించుకొను బ్రాహ్మణులెప్పుడైరి.  చాతు వర్ణముల నెప్పుడు ఏర్పరచుకొనిరి
దేశము, కాలము, వంశపరంపరాచారము, సాంప్రదాయము, సంఘ వ్యవస్థ మొదలగు వానినన్నిటినీ విచారించి కదా జాతి నిర్ణయము చేయవలసి యుండును.  ఇట్టి స్థితిలో మన సాంప్రదాయము లవగతము లేని ధర్మ బాహ్యులై దేశాంతర గతులైన పాశ్చాత్యులు మనలను గూడ ధర్మ బహ్యులుగా ప్రకటించి మనకు ఎగ్గుజేయదలచిన  వ్యర్ధ ప్రయత్నమును  మనము సాలోచనముగా నవలోకించిన గాని అవగతము కాదు. మన హైందవ హూణవిద్యాధికులు కూడా వారికి వంత పాడుచూ వారి భావములను, పలుకులను మన దేశ భాషలలోకి తర్జుమా చేసి ఆంధ్రుల నధములుగా జీసినారు.

శాపహతులైన విశ్వామిత్రుని సంతానమే ఆంధ్ర దేశములోని యాంధ్రులని చెప్పనెడల, విశ్వామిత్ర గోత్రీ కులే గాక మూడువందల ఆర్షేయ గోత్రములుగల బ్రాహ్మణులును, క్షత్రియులును సుమారు రెండువందల గోత్రములు గల్గిన వైశ్యులును అనేక గోత్రములు గల్గిన శూద్రులును నివశించుచున్నారు. మరి వీరందరూ ఆటవికులని అనగలమా ! వీరు విశ్వామిత్ర సంతానము కాదనుటకు ఇంతకు మించిన సాక్ష్యాధారము అవసరమా!
పాశ్చాత్య పండితులు హైందవులందరు తమవలెనే సంకరులని నిరూపింప దలచి మన దేశ చరిత్ర వ్రాయుటకు ఈ చతుస్సూత్రముల నెన్నుకొన్నారు.
1. హిందూ నాగరికత 3000 సంవత్సరములు మించినది కాదు.
2.హిందువుల నాగరికత, విద్య  అంతయును గ్రీసు మోసపుటేమియా నుండి దిగుమతి కాబడినది.
‘ పోకాక్’ అను పాశ్చాత్య పండితుడు దీనిని సమూలముగ ఖండించుతూ మన దేశమునుండి గ్రీసుకు మన వారు వలస పోవుట వల్ల వారికి మన సంస్కృతము, సంస్కృతి అబ్బినవని తన పుస్తకము ‘India in Greece’ లో సాధికారముగా నిరూపించినారు.
౩.వేద శాస్త్ర వాగ్మయము క్రీ!పూ! 1200 సంవత్సరముల నుండి ఇటీవలి కాలమున ఏర్పడినది.
హిందువులందరూ తమలాగే సంకరులే యని నిరూపించుట.
మాక్సుముల్లరు తన గ్రంధము 'Six systems of Indian Philosophy' లోని 8, 9 పుటలలో ఇట్లు వివరించాడు. (క్లుప్తముగా కేవలము సారాంశము పొందుపరచుచున్నాను)

This term CASTE has found most mischievous and misleading and the less we avail ourselves of it the better we shall be able to understand the true state of society in the ancient times of India.  Caste is of course a Portuguese word.  It should be most carefully defined afresh otherwise every social distinction will be called caste every stick a totem and every idol a fetish.

ఇండియా లో cast అనగా వర్గము  అని అర్థము. అదే పోర్చుగల్లులో'fetish' అంటే ఏమిటని యడిగినట్లుండును.మనము నిజముగా తెలుసుకోనగోరునదేమన మన దేశములో కులము అనగా కుటుంబము 'గోత్రము' అనగా జాతి లేక పుట్టుక 'ప్రవర' అనగా వంశ పరంపర అని తెలుసుకోనవలయును. అందుకే మాక్సుముల్లరు మన దేశము లోని సాంఘీక వ్యవస్థ ను 'cast' అని పిలువకూడదనియు  అది 'వర్ణ' అను పదమునకు సరియైన అర్థము నివ్వజాలదనియు నుడివెను.

వేదాధ్యయన తత్పరులై ఘనాపాఠీలై విలసిల్లి దేశములోనే బ్రాహ్మణ్యమునకు ప్రతిష్థ తెచ్చిన మన తెలుగువారు, శాతవాహన,ఇక్ష్వాక, ఆది వంశజులు వెలమ కమ్మ రేనాటి రాజులచే (రేనాటి రాజులే రెడ్లు) పరిపాలింపబడి వాసికెక్కిన మన తెలుగు వారు  ఈ ఆంధ్ర దేశ అభ్యుదయమునకు పాటుబడిన వాసవి కన్యకాంబ,మన పొట్టి శ్రీరాములవారి వంశజులైన ఆర్య వైశ్యులు, తమతమ రంగములలో అనన్యఖ్యాతి గడించిన శూద్రులు (services)
(శూద్రులు అన్న పదానికి ఎటువంటి నీచార్థము లేదు) అందరూ ఆనాటి నీతి బాహ్యులైన పుళిందులు, వ్యాధులు,నిషాదులు అను మాటలో ఇసుమంతయేని వాస్తవమున్నదా!

ఆంగ్లేయ మరియు వారి అనుచరవర్గ చారిత్రికులు చెప్పినట్లు 'ఆంధ్రులు ఆటవికులు' కాదు కాద్ఫ్హు కానే కాదు. సంస్కృతి నాగరికత ఘనకీర్తి యగు  గతము కలిగినవారు.

తత్సత్










Monday, 24 March 2014

కాల గణన (పాశ్చాత్య శైలి, భారతీయ భారతీయ శైలి)

కాల గణన

https://cherukurammohan.blogspot.com/2014/03/blog-post.html

కాల గణన పాశ్చాత్య శైలి, భారతీయ భారతీయ శైలి అన్న ఈ రెండు వ్యాసములు నేను కాగితములపై వ్రాసి, టైపు చేయలేక యుంటే నా మిత్రుడు జి. నాగేశ్వరరావు, నాకంటే 4 సం. చిన్న, టైపుచేసి మీకు అందజేయడానికి ఎంతో దోహద పడినాడు.నాపై ఆయనకు గల అభిమానానికి నాడూ నేడూ ఋణపడియే వున్నాను. ఈ విషయములో ఎంతో సహకారాన్నందించిన పుత్రికా సమానురాలు చి.కుం. భావరాజుపద్మిని ,తనచేతనైన చేయూతనిచ్చిన చి. మీగడ త్రినాధ్ లకు కృతజ్ఞత తెలుపుతూ అశీర్వదించకుండా ఎట్లుండగలను. చివరిగా మనసుపెట్టి చదివే మీ జిజ్ఞాసకు, నాపై అభిమానానికి నేనెంతో కృతజ్ఞుణ్ణి. మీ ప్రోత్సాహమే పెద్దలమైన (వయసు లోనే సుమా ) మాకు ఉత్సాహము.

పాశ్చాత్య శైలి కాలగణన చదివిన తరువాత తప్పక మన పూర్వుల ఘనత మీరు తప్పక తెలుసుకోన గలుగుతారు. పేరు కాంక్షించని వారి గొప్పదనము తెలియజెప్పుటే నా లక్ష్యము.

ఇది కూడా మనసారా చదివి మీరు మన సంస్కృతికి వాసి వన్నె తెస్తారని ఆశిస్తాను

కాల గణన (పాశ్చాత్య శైలి)

అనంతమైన కాలాన్ని గణించడం అంత సులభం కాదు. ఐనా దానిని ఎంత నిర్దుష్టంగా మన పూర్వీకులు గణించారో తెలుసుకొనుటకు ముందు పాశ్చాత్యుల క్యాలెండరు ను పరిశీలించుదాము.

క్యాలెండరు అన్నమాట లాటిన్ భాషలోని క్యాలండీ నుండి పుట్టినది ఇచ్చిన అప్పులు మొదటి రోజున వసూలు చేసుకొనుటకు అది ఏర్పరుపబడినది. తరువాత పౌర అనుశాసనమునకు ప్రజా ప్రయోజన కార్యాచరణమునకు ఇది పాశ్చాత్యుల చేత ఉపయోగింప బడినది. దీనిని వీరు కాల క్రమేణ Almanec అని గూడా అన్నారు. నిజానికిది Al – manakh అంటే వాతావరణ సూచిక అని అన్వయించుకొనవచ్చును. ఈ పదము Spanish Arabic భాషలకు చెందినది.

నేడు మనముపయోగించే క్యాలాండరు రోము, ఈజిప్టు గ్రెగొరీ విధానాల కలయిక. రోము రాజ్యాన్ని పాలించిన రోములస్ కాలంలో ఏడాదికి 304 రోజులుండేవి. సంవత్సరానికి 10 నెలలుండేవి. మార్చి నుండి కొత్త సంవత్సరం మొదలయ్యేది. తరువాత కాలంలో దీనిని 10 నుండి 12 నెలలకు మార్చి, సంవత్సరమునకు 354 రోజులుగా నిర్ధారించినారు. పంపీలయస్ చక్రవర్తి క్రీ ||పూ|| 7వ శతాబ్దంలో తిరిగి సరి సంఖ్య మంచిదికాదనుకొని 355 రోజులు చేసినారు.

ప్రపంచమంతటా నూతన సంవత్సరము మొదలయ్యేది వసంత ఋతువు(spring) లో అంటే మార్చ్ నెలలో. ‘Spring’ అప్పుడే కదా వచ్చేది. తరువులు చివురులు తొడుగుట అప్పుడే కదా. అంటే అది పుట్టుకతో పోల్చవచ్చు కదా! పండువారి పోవడము, మట్టిలో కలవడము శిశిరము (autumn) కాదా! కాని పాశ్చాత్యులు వేడుకలు spring (March) లో కాదని శిశిరం (autumn) అంటే జనవరి లో చేయ మొదలిడినారు.. క్రీ ||పూ|| 153 లో సంవత్సరాన్ని జనవరికి మార్చటం జరిగింది. మరుల దానిని ఎందుకనో మార్చికి మార్చినారు.

తరువాత క్రీ ||పూ|| 46 వ సంవత్సరములో అప్పటి రోమన్ చక్రవర్తి యగు జూలియస్ సీజరు ఈజిప్ట్ వెళ్ళినపుడు అక్కడి క్యాలెండరు విధానాలను గమనించి ఖగోళ శాస్త్రజ్ఞుడైన సోసీజెనాస్ అనునతని సహయంతో రోమను సంవత్సరానికి 365.25 రోజులుగా నిర్ణయించి, ఫిబ్రవరి (అప్పుడు సంవత్సరానికి చివరి నెల) నుండి 30 రోజులలో ఒక రోజును తీసి మార్చి నుండి 5 వ నెలయైన పెంటలిస్ (పెంట=5) కు చేర్చి, ఏప్రిల్, జూన్, ఆగష్టు, సెప్టెంబరు, నవంబరు నెలలకు 30 రోజులనుంచి, ఫిబ్రవరి కి 29 రోజులు చేసి, సంవత్సరమును తిరిగి జనవరికి మార్చి, పెంటలిస్ పేరును తన పేరుతో జులై గా మార్చుకొని సంవత్సరారంభం జనవరి తో చేయ ప్రారంభించినారు. 0.25 తేడాను, 4 సంవత్సరములకు ఒక రోజు ఔతుంది కాబట్టి దానిని ఫిబ్రవరి నెలకు కలిపి (29+1) 30 రోజులు చేయటం జరిగింది. దీనిని leap year అన్నారు.

సీజరు మేనల్లుని కొడుకైన ఆగస్టస్ సీజరు 27 B.C. లో రోము చక్రవర్తియైన పిమ్మట సెక్స్ టలిస్ అను నెలకు (సెక్స్ట్టట =6) తన పేరుతో ఆగస్ట్ అని పెట్టి దానికి ఫిబ్రవరి నుండి ఒక రోజు తీసి, అంటే దానిని 28 రోజులుగా చేసి, ఆగష్టుకు కలిపి దానిని కుడా 31 రోజుల నెలగా చేసినాడు. లీపియరును ౩ సంవత్సరములకు మార్పు చేసి , ఫిబ్రవరి కి కలిపేవారు.

తరువాత కాలంలో రోజుల లెక్కలో కచ్చితత్వము పెరిగి సంవత్సరానికి 365.242199 రోజులు చేసినారు. ఇందువల్ల ఏడాదికి 11 ని||14సె|| తేడావస్తుంది. దీనిని 13 వ పోపు గ్రెగొరీVIII కొందరు ఖగోళ శాస్త్రజ్ఞుల కూటమిని ఏర్పరచి క్రీ |||| 1582 లో గ్రెగోరియన్ క్యాలెండరు పేరుతో క్రొత్త క్యాలెండరును ప్రవేశ పెడుతూ లీపియర్ ను తిరిగి 4 సంవత్సరములకొకసారి చేస్తూ ఫిబ్రవరి కి ఆ ఒక  రోజును కలిపేవారు. అట్లు చేయుటవలన ఒక వర్షమునకు .007801 రోజు ఎక్కువగా వచ్చేది. దీనిని చక్కబరచుటకు 400 తో భాగింపబడే శతాబ్ది సంవత్సరములు మాత్రమె లీపు సంవత్సరములుగా తీసుకొని 4చేత భాగింపబడినవి తీసుకొనకుండా వదిలి పెట్టినారు. ఈ మార్పును చెయుటకుగనూ october 4, 1582 తరువాత, అక్టోబరు 15, 1582 గా ప్రకటింపబడినది. ఆ 10 రోజులు, కాలముతో ఆడిన క్యాలెండరు ఆటకు,బలియైపోయినాయి. అందువల్ల వారి పండుగ తేదీలకు వారు పండుగ చేసుకొను సందర్భములకు పొంతన లేదని వారి శాస్త్రజ్ఞులే వాక్కణించుచున్నారు. క్రీ |||| 1582 వరకు  వారికి సరియైన కాలగణనా విధానమే లేకుంటే వారి పండుగలకు వానికి సంబంధించిన తేదీలకు పొంతన రాదు కదా.

ఇక వారు నెలలకు పెట్టిన పేర్లను గూర్చి తెలుసుకొందాము.

జనవరి: జానస్ అన్న రెండుతలల దేవుడు స్వర్గంలో ప్రధాన ద్వారం వద్ద వుంటూ ఒక తలతో జరిగిన వర్షమును ఒక తలతో జరగబోయే వర్షమును చూస్తూఉంటాడట. ఆయన పేరుతో ఈ నెల ఏర్పడింది. 29 రోజులు కల్గిన ఈ నెల 31 రోజుల నేలగా జూలియస్ సీజరు చేసినాడు.

ఫిబ్రవరి: రోమన్ల పండుగ ఫిబ్రువా అన్నది లూపర్కాస్ అన్న దేవుని పేరుతో పునీతులగుటకు (to get purified) జరుపుకుంటారు. దీనికి కొంతకాలం 23, 24 రోజులుండేవి. తరువాత 30 రోజులై ఆతరువాత జూలియస్ సీజరు, అగస్తస్ సీజరు ల వల్ల 28 రోజులై కూర్చుంది.

మార్చి: మార్స్ రోమనుల యుధ్ధ దేవత. ఈయన ఒక చేతితో శూలం మరొక చేతితో డాలును ధరించి రెండు గుర్రాలమీద వస్తాడు. ఈయన పేరుతో ఈ నెల ఏర్పడింది.

ఏప్రిల్: రోమన్ల వసంత దేవత పేరు అమ్నియో ఏప్రిట్. ఈమెను రోమన్లు ఎంతో అందమైనదిగా, పునరుజ్జీవనకు నాందిగా భావించుతారు.

మే: భూగోళాన్ని తన భుజస్కంధాలపై మోసే అట్లాసు యొక్క ఏడుగురు కూతుళ్ళలో మేయో ఒకటి. అట్లాసు ఈ ఏడు మందిని ఏడు నక్షత్రములుగా మార్చివేసినాడు (మన సప్తర్షి మండలం) దీనిని అంటే ఈ నెలను వయసులో పెద్దవాళ్ళకు (maiores) అంకితమిచ్చినారు.

జూన్: జూపిటర్ భార్య జూనో ఈ జూన్ మాస స్థానానికి ఈవిడ జూనియస్ అన్న దేవునితో పోరాడుతుంది. వారిరువురి పేర్లతో జూన్ వచ్చింది. దీనిని యువతకు (juniores) అంకితమిచ్చినారు.

తరువాత నెలల పేర్లు పెంటలిస్, సేక్స్టలిస్, సెప్టంబర్,అక్టోబర్, నవంబర్, డిసెంబర్ గ ఉండేవి. 5, 6 నెలలైన పెంటలిస్, సేక్స్టలిస్ లను జూలై, ఆగష్టులుగా తమ పేర్లతో జూలియస్, అగస్టస్ సీజర్లు మార్చుకొన్నట్లు మనము చెప్పుకొన్నాము. 7వ నెలనుండి 10వ నెలవరకు పేర్లు అట్లే వుండిపోయినాయి.

సెప్టెంబర్ – సెప్ట్ అంటే సప్త 7వ నెల

అక్టోబర్ – అక్ట్ అంటే అష్ట 8వ నెల

నవంబర్ – నవ అంటే నవ 9వ నెల

డిసెంబర్ – డెస్సి అంటే దశ 10వ నెల

దీనిని బట్టి ఈ మార్పులకు ముందు 11వ నెలగా జనవరి, 12వ నెలగా ఫిబ్రవరి వున్నట్లు రూఢియై పోయింది.

ఇక వారములైన సండే, మండే .. .. .. .. సాటర్ డేలను మన వారముల పేర్లను వారు వారి భాషలలోనికి మర్చుకొన్నావే.

ఇన్ని మార్పులు చేర్పులు కూర్పులు జరిగిన తరువాత కుడా వారి కాలమానము భుభ్రమణముతో పోల్చిన 26 సెకన్ల తేడా వున్నది. ఆ సెకన్లు 3323 సంవత్సరములకు ఒకరోజు ఔతుంది. దానిని ఆ సంవత్సరములోని ఒక నెలకు (బహుశ ఫిబ్రవరికేనేమో) కలుపుకొన వస్తుంది.

వాస్తవ కాల గణన కొరకు తమ తప్పులు తాము తెలుసు కొనుచూ కృషి చేసిన శాస్త్రజ్ఞులు కల్గిన ఈ రోమన్ క్యాలెండరు తప్ప, ప్రాచీన నాగరికత కలవని చెప్పుకొనెడు ఎన్నోపాశ్చాత్య దేశములు వారి వారి దేశ కాలానుకూలంగా తయారు చేసి వాడుకొన్నానూ, కాలానికి కాలొడ్డి నిలువలేకపోయినవి. మయుల క్యాలెండరు లోని చివరి దినమైన 21 డిసెంబరు 2012 న యుగాంతము కాలేదు కదా!

చివరిగా ఒక మాట చెప్పి ముగించుతాను. మనకు రోజు అనేది ఉదయం (ఇంచుమించు) 6గం. లకు ఔతుంది. ఈ విషయాన్ని పాశ్చాత్యులు తమ కేలెండరునకు అనుకూలముగా మార్చుకోలేక యదా తధంగా తీసుకొన్నారు. మరి వాళ్ళకు రోజు రాత్రి 12 కు గదా మొదలయ్యేది అంటారేమో. వాళ్ళకు మనకు కాల వ్యత్యాసము ఇంచుమించు 6 గంటలు. మనకు 6గం. ఉదయమైతే వాళ్ళకు అర్ధరాత్రి 12గం. కదా.

డిసెంబర్ 25 న క్రీస్తు పుట్టుక జరుగలేదు. జనవరి 1 క్రొత్త సంవత్సరము కాదు. ఇప్పటికైనా మనసు పెట్టి ఆలోచించితే మన పూర్వీకుల ప్రతిభను పునరుజ్జీవింప జేయ గలము.ఇకనైనా క్రొత్త సంవత్సరము ఉగాదితో మొదలౌతుందన్న వాస్తవాన్ని భాతీయ కాలగణన చదివిన తరువాత ఆకళింపు చేసుకొని ఆప్రకారంగానే మొదలు పెడతారని ఆశిస్తున్నాను.

మాటలలో ఏదన్నా చొరవ తీసుకోనివుంటే తప్పుగా తలవరని ఆశిస్తాను.

స్వస్తి.


  • Ravi Sudhakar Musunuri Excellent very elaborative explanation on 
    9 hrs · Unlike · 1
  • Calender in western style. Thank you so much for such an important informative 
  • posting sir.
  • Srinivcasa Subrahmanya Sai Bhagavatula ఆర్యా ! మీ వివరణ చాలా 
    8 hrs · Unlike · 1
  • సమయోచితంగాను అద్భుతంగాను ఉన్నది. అందుకోండి శతకోటి ధన్యవాదాలు. 

  • శ్రీనివాస సుబ్రహ్మణ్య సాయి.
  • Rishignanam Surya NICE INFO. with your permissions sir, 00.00 hrs is 
    3 hrs · Unlike · 2
  • calculated from GMT.INDIA is 5.30 hrs ahead of this time. even before christ, the 
  • calculatiion was the change of day was 00.00 hrs correlating with the sunraise in 
  •  east ie. the first ray on Mount kailash. So even 00.00 hrs is not changing of 
  • date. The cange of date is entirely based on on sunraise in east ie. 5.30 
  • hrs.Though the assy needs some more additions, due to time, right now i am 
  • unable to add. I write to you seperately.eg. 21 dec. the 21st of March, june, 
  • Sept., Dec. are the cosmic quarter endings. every 21st sun angle changes ( this 
  •  correlates with the breaths of human 21600 ) even (confirmed by NASA) 
  •  There is a place in space where one year on earth will be 1 day.(probably thats 
  • the reason anniversaries conducted once in a year)Indians diaraised time 
  • according to planetary moments, whwere as west, rulers changed according to 
  • their will.
  • Subrahmanyam Nishtala తప్పులెంచుట చాలా సులభం. ఈ వయస్సులో 
    1 hr · Unlike · 1
  • నేటి తరానికే కాక మావంటి విషయపరిజ్ఞానం లేనివారికి కష్టపడి మన పూర్వీకుల 

  • ప్రతిభాపాటవాలను తెలియజేయాలనే తాపత్రయం బహుదా అభినందనీయం. 

  • మీకునా మనః పూర్వక నమస్సుమాంజలులు.











  • వెండి డోనిగేర్ పాల్ కార్ట్రైట్, మైకెల్ విట్జెల్, పోలక్ వంటి విశ్వవిద్యాలయ 

  • ఆచార్యులు, పోప్ వంటి అనేక చర్చిల మతాధినేతలు, క్రైస్తవ మత ప్రచారకులు, 

  • ముల్లాలు, ఆమిర్ ఖాన్ వంటి సీనీమాల వాళ్ళు, అంతర్గత శత్రువులైన మార్క్సు 

  • వాదులు, జవహర్ లాల్  నెహృ యూనివర్సిటీ, ఇతర విద్యాసంస్థలలోని చరిత్ర, 

  • సోషియాలజి వంటి  విభాగములలోని,ఆచార్యులు, వోట్ బాంకు లే ధ్యేయంగా గల 

  • రాజకీయ నాయకులు - వీరందరూ ఈ కౌరవ సేనలోని మహారథులే. ఇంకా పాండవ 

  • ప్రముఖుల పాత్ర ఎవరు వహిస్తారో తెలియడంలేదు. ఆ పార్థ సారథిని నమ్ముకొని 

  • ప్రార్థించడమే మన కర్తవ్యం.
  • Cheruku Ramamohanrao నేను ఇంచుమించు 6గం.అని వాడినాను. 

  • అర్థముచేసుకోగలవు. నావ్యాసములోనిముఖ్యఉద్దేశ్యము 

  • వారిగణనవిధానముఅనేకమార్పులకుగురికాగా 

  • మనదినాటికినేటికీమారనివిధంగానిలువటమేఅందుకుసాక్ష్యము. All that you have 

  • mentioned in your comment was inferred by our ancestors.

  • my aim is to first shun these celebrations for the reasons mentioned above. 

  • Though I know the latter developments in their calender ours is time tested. Let 
  • us sincerely put a full stop of celebrating in Autumn which symbolises death.

  • AM= AROHAN MARTHAND  PM= PATAN MARTHAND

  • Vvs Sarma Our concept and model of cycle of time is in tune with 
    9 mins · Like
  • astronomy. They are even now talking of linear time with their calendar which is 

  • like saying Earth is flat.
  • Vvs Sarma Even a religious festival like Christmas and the insignificant 
    3 mins · Like

  • calendar new year day have been converted to marketing commerce and merry 

  • making, Significance of Time in Life, is to be understood along with our 

  • measurement of Time. God is verily time. Winter solstice and March equinox are 

  • the points of time that are important.events


                                                         కాలగణన(భారతీయ శైలి)

  
మన దేశమునకు వేదశాస్త్రేతిహాస పురాణములు ప్రమాణములు. ఇందులో పురాణములు సృష్ట్యాది మొదలుఎన్నో విషయములు, వివరణలు, ఎంతో మంది రాజులు, మహాపురుషుల చరిత్రలు కలిగి వుంటాయి. బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ కాలం చెప్పేవాళ్ళు అక్కడక్కడున్నా వినేవాళ్ళు తగ్గిపోయినారు. మన సంస్కారమే మన సంస్కృతి. ఈ సంస్కృతే మన దేశపు ఆకృతి.

అసలు విషయానికొస్తే పురాణం పంచ లక్షణమన్నారు ఆర్యులు. ఆర్యులంటే అప్రాచ్యులు చెప్పినట్లుగా సుమేరియ నుండి దిగబడినవారు కారు. (అప్రాచ్యులు అంటే న + ప్రాచ్యులు ~ తూర్పు దేశస్తులు కానివారు. అంటే పడమటి దేశస్తులు లేక పాశ్చాత్యులు).

ఈశ్వర పుత్రాః ఆర్యాః అని యాస్కాచార్యులవారు 5000 సంవత్సరముల క్రితం తన ఋగ్వేద భాష్యంలోనూ; 600 సంవత్సరముల క్రితం విద్యారణ్యులవారు తమ 

వేదభాష్యం లోనూ వ్రాసి యున్నారు.

పురాణము యొక్క 5 లక్షణాలు ఏమిటి వంటే 1.సర్గ 2.ప్రతిసర్గ 3.మన్వంతర 4.రాజవంశ 5.అనువంశములు. మన చర్చకు మొదటి మూడు అవసరము .

1. సర్గ: సర్గయనగా సృష్టికి ఆది పునాది. పునాది అటులనే వున్నా ఆది కల్గినది అంతము కావలసినదే. పునాది ఆ నిరంజన నిరాకారుడే.

2. ప్రతిసర్గ: ప్రళయము వచ్చి ఈ సృష్టి అంతమైన తరువాత జరిగే పునఃసృష్టి మనకు తెలిసిన మత్సావతార కథ ప్రతిసర్గకు సంబంధించిందే. ఈ ఉదంతాన్ని బైబిల్ లో కుడా చూస్తాము. నోవా అనే నాయకుడు పడవలో జీవరాశిని మచ్చుకొకటి తీసుకొని క్రొత్త తీరమునకు వెళ్ళినట్లున్నది. మన పురాణ నిర్వచనము ప్రకారము ఇది ప్రతిసర్గయే. కాని వారందులో దీనిని నిర్వచించలేదు. అవగాహనా రాహిత్యము వల్ల దీనినే సృష్ట్యాడిగా పరిగణించినారు.  ఇటువంటి ఉదంతములను గూడా మననుండి పాశ్చాత్యులు గ్రహించ్నట్లు తేట తెల్లమగుచున్నది. ఈ విధంగా సృష్ట్యాది మొదలు అనేక విషయములను తమ దివ్య దృష్టి చే పరీక్షించి పరిశీలించి పరిశోధించిన మన మహర్షులు శాస్త్రజ్ఞులు ఐన పూర్వీకులు పాశ్చాత్యులు చెప్పినట్లు ఆటవికులా! అనాగారికులా! పాశ్చాత్యుల ప్రకారము సృష్ట్యాది క్రీస్తుకుపూర్వము 2000 సంవత్సరముల క్రితం జరిగినది. కానీ మన ఖగోళ శాస్త్ర ప్రకారము సృష్టి జరిగి 195,58,85,115 సంవత్సరములు (2013 వరకు) ఐనవి. ఇది ప్రతి ఉగాదికి వచ్చే మన పంచాంగములలో ప్రతివర్షము తెలియజేస్తారు. “మిస్టీరియస్ యూనివర్స్” గ్రంధ కర్త 
 మరియు ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త యైన ‘సర్ జేమ్స్ జీన్స్’ పై పుస్తకములో చేసిన అంచనా (ఇంచుమించు 200 కోట్లు). మన పూర్వీకుల ప్రమాణమునకు చేరువలోనున్నది. ఇప్పటి కలి యుగము వచ్చి 5115 సంవత్సరములైనది. ఇంత నిర్డుష్టముగా లెక్కలు కట్టి వ్రాయబడినదే “పంచాంగము”.

పంచ + అంగము = పంచాంగము. ఐదు అంగములు కల్గినది. అవి ఏవన: 1.తిధి 2.వారము 3.నక్షత్రము 4.యోగము 5.కరణము.

1. తిధి: ప్రతి రోజు సూర్యుడు 1అంశ (1డిగ్రీ) చంద్రుడు 13 అంశలు ముందుకు నడుస్తారు. అంటే వారిరువురి భ్రమణములోగల అంతరము 12డిగ్రీలు. (సూర్యుని భ్రమణమును సాపేక్ష భ్రమణము అంటారు. నిజానికి తిరిగేది భూమి. కాని మనము భూమిపై నిలబడి ఖగోళమును గమనించెదము కావున సూర్యునిది సాపేక్ష భ్రమణము. ఈ విషయము వేదములలోవున్నది. దీనిని వెలికితీసి ఆర్యభట్ట వరాహమిహిర ,భాస్కరాది గణిత ఖగోళ శాస్త్రజ్ఞులు ఎప్పుడో చెప్పినారు.) ఈ 12 డిగ్రీల అంతరమును తిధి అంటారు.

 మొదటి రోజు 12 డిగ్రీలు ఐతే రెండవ రోజు 24 డిగ్రీలు ఇట్లు 180 డిగ్రీలు చంద్రుడు సుర్యునినుండి జరిగినపుడు పౌర్ణమి, తిరిగి సూర్యుని చేరినపుడు (360 డిగ్రీలు లేక ౦ డిగ్రీ) వరకు కృష్ణ పక్షమని ఈ చంద్రయానమునంటారు. ఒక సౌర దినము = 0.9483 చంద్ర తిధి. ఈ విధంగా ఒక చంద్రమానమునకు 29.53 రోజులుంటాయి.

 2. వారము: “అర్క శుక్ర బుధశ్చంద్రః మందో జీవ కుజః పుమాన్ 

సార్ధ ద్వి ఘటికా హోరాః ఇత్యే తత్ హోర లక్షణం”

అన్నది జ్యోతిష శాస్త్రము. ఘడియల కాలము = 1హోర(hour). hour ను సరిగా పలుకవలెనంటే 'హోర్' అని పలుకవలె . అంటే 'హోర' రానురాను 'హోర్', ఆ తరువాత వారి నాగరీకము ముదిరి 'అవర్' అయినది. మొదటి హోర 'అర్క' అంటే సూర్యుడు అంటే ఆదిత్యుడు. మొదటి హోరతో మొదలయ్యే రోజు కావున మొదటి వారము ఆదివారమైనది. ఒక రోజుకు 24 హోరలు. అర్క తో మొదలుపెట్టి ఎంచితే 24 హోరల తో ఆ దినము పుర్తియౌతుంది. 25 వ హోర 'చంద్ర'హోర అంటే సోమవారము. ఈ ప్రకారముగా వరుసగా 7 వారాలు వస్తాయి.  ఈ వారముల క్రమము ఈ విధముగా ఏర్పడినదని పాశ్చాత్యుల కెరుకలేదు. కాని ఈ వారముల క్రమమును యధా తధముగా తమ భాషలోనికి పేర్లను గూడా తర్జుమా చేసుకొని వాడుకొనుచున్నారు.౩. నక్షత్రము: సాపేక్ష సౌర గమనమునకు ఒక ఏడాది కాలము పడితే, ఆ పథంలో ఆయనకు 12 మజిలీలను (మజిలీలను రాశులు అంటారు) ఆయన ప్రయాణాన్ని 27ప్రాంతాలు (నక్షత్రాలు) చుట్టునట్లు విభజించినారు. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదములు. 4+4+1 పాదము కలిస్తే ఒక రాశి. అశ్వని,భరణి, కృత్తికాః పాదం మేషం. అంటె అశ్వని యొక్క 4 పాదాలు భరణి యొక్క నాలుగు పాదాలు కృత్తిక లోని 1 పాదము మేష రాసి ఔతుంది. అదే విధంగా 3వ నక్షత్రములోని మిగిలిన 3 పాదములు నాల్గవ నక్షత్రములోని 4 పాదములు 5 వ నక్షత్రములోని 2 పాదములు కలిస్తే 2 వ రాశి. అంటే (3+4+2=9) ఇది రెండవ రాశి. ఇట్లు 9 పాదములతో ప్రతి రాశి ఏర్పడుతుంది. కావున రాశికి 9 పాదముల చొప్పున 12*9=108 లేక 27 నక్షత్రములలోని 4+4 .. .. .. పాదములను కలిపితే 27*4=108 పాదములగును. మానవుని పేర్లు ఈ 108 పాదములలో (ఆడ గాని, మగ గాని) ఏదో ఒక దానికి చెందును గాన అందరు సుఖంగా ఉండాలనే అష్ట్తోతర శత నామార్చన (108 పేర్లు) దేవునికి చేస్తారు. నక్షత్రముల పేర్లు రాశుల పేర్లు ఈ క్రింద పొందు పరచబడినవి

1.అశ్వని, 2.భరణి, ౩.కృత్తిక, 4.రోహిణి, 5.మృగశిర, 6.ఆర్ద్ర, 7.పునర్వసు, 8.పుష్యమి, 9.ఆశ్లేష, 10.మఖ, 11.పుబ్బ, 12.ఉత్తర, 13.హస్త, 14.చిత్త, 15.స్వాతి, 16.విశాఖ, 17.అనురాధ, 18.జేష్ఠ, 19.మూల, 20.పూర్వాషాఢ, 21.ఉత్తరాషాఢ, 22.శ్రవణం, 23.ధనిష్ఠ, 24.శతభిషం, 25.పూర్వాభాద్ర, 26.ఉత్తరాభాద్ర, 27.రేవతి.

 12 రాశుల పేర్లు : 1.మేషం(Aries), 2.వృషభం(Taurus), 3.మిథునం(Jamini), 4.కర్కాటకం(Cancer), 5.సింహం(Leo), 6.కన్య(Virgo), 7.తుల(Libra), 8.వృశ్చికం(Scorpio), 9.ధనుస్సు(Sagitarius), 10.మకరం(Capricorn), 11.కుంభం(Acquarious), 12.మీనం(Pisces). ఈ సంస్కృత రాశుల పేర్లకు లాటిన్ ప్రతి నామాలు బ్రాకెట్లో ఇవ్వబడినవి. గ్రీకు, బాబిలోనియన్ ఇత్యాదిభాషలలో కుడా రాశులకు వారు వారుపయోగించిన పేర్లు 


ఇంచుమించుగా ఇవే సంస్కృతార్ధములు కలిగియున్నవి.

 

4.యోగము: యోగమంటే కలయిక. దైనిక చంద్ర గతి, సాపేక్ష సూర్య గతి కలిపితే (13.20’) యోగమంటారు. ఈ యోగములు 27. అవి: 1.విష్కంభము, 2.ప్రీతి, 3.ఆయుష్మాన్, 4.సౌభాగ్య, 5.శోభన, 6.అతిగండ, 7.సుకర్మ , 8.ధృతి, 9.శూల, 10.గంధ, 11.వృద్ధి,12.ధృవ, 13.వ్యాఘాత, 14.హర్షణ, 15.వజ, 16.సిద్ధి, 17.వ్యతిపాత, 18వరియన్ (వరిష్ట), 19.పరిఘ, 20.శివ, 21.సిద్ధ, 22.సాధ్య, 23.శుభ, 24.శుక్ల, 25.బ్రహ్మ, 26.ఇంద్ర, 27.నైద్రుతి. ఈ యోగము ప్రభావము మానవ శరీరము ఆరోగ్యముపైనుం టంది.

 

5.కరణము: చంద్రుడు రోజుకు 12 డిగ్రీల వంతున సుర్యునినుండి దూరమౌతూ వస్తాడు. పాడ్యమికి 12 దిగ్రీలయితే విదియకు 24 డిగ్రీలు ఆ ప్రకారంగా 180 డిగ్రీలకు పున్నమి, 360(౦) డిగ్రీలకు అమావాస్య అని తెలుసుకొన్నాము. అర్ధ తిధిని కరణము అంటారు (అంటే 12/2=6) అంటే ఏ అర్ధ తిధియైన 6 చేత నిశ్శేషముగా భాగింపబడుతుంది. ఈ కరణములు 11 అవి: 1.భవ, 2.బాలవ, 3.కౌలవ, 4.తైతుల, 5.ఖర జి, 6.వణిజి,7.విష్టి, 8.చతుష్పద, 93శకుని, 10.నగ, 11.కింస్తుఘ్నము. మొదటి 7 ఒక చంద్ర మాసములో 8 మార్లు వస్తాయి. అంటే 28 రోజులు. చివరి 4 కరణములు వరుసగాను స్థిరముగాను వస్తాయి. సూర్య చంద్ర భూ చలనములను ఇంత నిశితముగా పరిశీలించి గ్రహచారములనధ్యయనముచేసి భూమి పై వాని ప్రభావమును గూర్చి తెలిపినదీప్రపంచములో ఈ దేశము తపపంచ అంగముల తరువాత మాసములను గూర్చి ముచ్చటిద్దాము. చంద్రుడు తన గమనమున పౌర్ణమి రోజు ఏ నక్షత్రమునకు దగ్గరగా ఉన్నాడో ఆ నక్షత్రము పేరుతో ఆ మాసము ఏర్పడింది. అంటే పున్నమి రోజున చిత్ర నక్షత్రము వద్దకొస్తే చైత్ర మాసము, విశాఖ నక్షత్రము వద్దకొస్తే వైశాఖ మాసము ఆ ప్రకారంగా 12 మాసములు ఏర్పడినవి కాని నిరర్ధకమైన పేర్లను ఉపయోగించలేదు. ఈ 12 మాసముల పేర్లు ఈ దిగువన ఇవ్వబడినవి

 1.చైత్రము, 2.వైశాఖము, 3.జ్యేష్టము, 4.ఆషాఢము, 5.శ్రావణము, 6.భాద్రపదము, 7.ఆశ్వయుజము, 8.కార్తీకము, 9.మార్గశిరము, 10.పుష్యము, 11.మాఘము, 12.పాల్గుణము

వేద కాలంలో మాసాల పేర్లు వేరు. మధు మాధవ మాసాలు వసంత ఋతువు. శుచి, శక్ర మాసాలు గ్రీష్మము. నభ, నభస్య మాసాలు వర్షఋతువు. ఈష, ఊర్జ మాసాలు శరత్తు. కార్తీక మాసాన్ని వేదము ఊర్జ మాసము అంటుంది. దామోదర మాసము అనికూడా దీనికి పేరు ఉన్నది. ఊర్జ వ్రతము అనికూడా వాడుకలో ఉన్నది. సహ, సహస్య మాసాలు హేమంతము. తప, తపస్యలు శిశిరం. వేదాంగమైన జ్యోతిషము అభివృద్ధిలోకి వచ్చాక మాసములకు నక్షత్రనామాలు వాడుకలోకి వచ్చినవి.

 చీకటి రాత్రి అయిన అమావాస్యకు అర్థం అమా+వాస్య (ఇంటిలో ఉండుట) పౌర్ణమాసి అంటి మాసము పూర్ణమౌతుంది.

 ప్రతి నేలలోను సూర్యుడు 12 రాశులలోని ఒక రాశి లో ప్రవేశిస్తే అది నిజ మాసమౌతుంది. లేకుంటే శూన్య/అధిక మాసమౌతుంది. అదే ఒక నెలలో రెండు సంక్రమణములొస్తే అది క్షయ మాసమౌతుంది. ఇది 141 సంవత్సరములకొకసారి వస్తుంది. ఒక సారి వచ్చిన తరువాత తిరిగీ 19 సంవత్సరములకే వచ్చే అవకాశమున్నది. ఈ విధంగా కాల గణన ఎక్కడికక్కడ సవరించుకొంటూ దోష రహితంగాను నిరాఘాటంగానూ సాగిపోతూంటుంది.

 ఇక సంవత్సరముల విషయానికొస్తే సాపేక్ష సూర్య భ్రమణమును వర్తులాకారముగా తీసుకొన్నాము కావున ఆ భ్రమణము 360 డిగ్రీలు కలిగి వుంటుంది. సూర్యుడు రోజుకు ఒక అంశ (డిగ్రీ) ముందుకు జరుగుతాడని ఇదివరకే చెప్పుకొన్నాము. కావున ఒక సౌర సంవత్సరానికి 360 రోజులు. ఈ విధమైన సంవత్సరములు ప్రభవ విభవ మొదలు 60 పేర్లతో గడచిన తరువాత తిరిగి ప్రభవతో పునరావృత్తమౌతాయి. ఈ 60 పేర్లు ఈ క్రింది విధముగా వున్నాయి:

 1.ప్రభవ, 2.విభవ, 3.శుక్ల, 4.ప్రమోదూత, 5.ప్రజోత్పత్తి, 6.ఆంగీరస, 7.శ్రీముఖ, 8.భవ, 9.యువ, 10.ధాతు, 11.ఈశ్వర,12.బహుధాన్య, 13.ప్రమాది, 14.విక్రమ, 15.విషు, 16.చిత్రభాను, 17.స్వభాను, 18.తారణ, 19.పార్ధివ, 20.వ్యయ , 21.సర్వజిత్తు, 22.సర్వధారి, 23.విరోధి, 24.వికృతి, 25.ఖర, 26.నందన, 27.విజయ, 28.జయ, 29.మన్మధ, ౩౦.దుర్ముఖి, 31.హేవళంబి, 32.విళంబి, ౩౩.వికారి, 34.శార్వరి, 35.ప్లవ, 36.శుభకృతు, 37.శోభకృతు, 38.క్రోధి, 39.విశ్వావసు, 40.పరాభవ, 41.ప్లవంగ, 42.కీలక, 43.సౌమ్య, 44.సాధారణ, 45.విరోధికృతు, 46.పరీధావి, 47. ప్రమాదీచ, 48.ఆనంద, 49.రాక్షస, 50.నళ, 51.పింగళ, 52.కాళయుక్తి, 53.సిద్ధార్ధి, 54.రౌద్ర, 55.దుర్మతి, 56.దుందుభి, 57.రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59.క్రోధన, 60.అక్షయ.

 ఈ సంవత్సర సమూహమును ‘60’గా ఎందుకు ఏర్పరచినారు అన్నది తెలుసుకొనుటకు ముందు మన వాళ్ళు గ్రహములకాయా పేర్లు ఎందుకు పెట్టినారో చూస్తాము. సాపేక్షముగా భూమిపై నిలబడి గ్రహ గతిని పరిశీలించితే, దూరమునుండి చేరువరకు గ్రహ భ్రమణమీవిధంగా వుంటుంది.

 మంద అమరేఢ్య భూపుత్ర అర్క శుక్ర బుధ ఇందవః”

 శని బృహస్పతి అంగారక సూర్య శుక్ర బుధ చంద్ర, ఇది గ్రహముల వరుస.

 మంద అన్నా శని అన్నా అత్యంత నెమ్మదిగా నడిచేది. అన్ని గ్రహములకన్నా ఈ గ్రహము ఒక భ్రమణమునకు ఎక్కువ సమయం తీసుకొంటుంది. ఇది ఒక భ్రమణమునకు 30 సంవత్సరములు తీసుకొంటుంది. బృహత్ అంటే పెద్దది. బృహత్ + పతి =బృహస్పతి. అతి పెద్ద గ్రహములకు రాజు అంటే మన సౌర మండలములో అత్యంత పెద్ద గ్రహము. అంగారము అంటే అగ్ని. ఈ గ్రహము ఆరంగులో మనకు కనిపిస్తుంది కావున అది అంగారకమైనది.

 ఇక 'అర్క' అంటే సూర్యుడు. సూర్యుని గూర్చి ఒక్క సారి మన దేవాలయాలలోని నవగ్రహ మంటపం గమనించితే సూర్యుని గ్రహమండలంలోని నట్ట నడుమన ప్రతిష్టించివుంటారు అంటే సూర్యుని కేంద్రముగా గొని మిగతా గ్రహములన్నియు భూమితోకుడా వర్తులాకారములో చుట్టుచున్నవనియే కదా! వరాహమిహురుడు, ఆర్యభట్టు, భట్టోత్పలుడు, భాస్కరుడు ఆదిగాగల భారతీయ ఖగోళ వైజ్ఞానికులు కోపర్నికస్ వంటి పాశ్చాత్య వైజ్ఞానికులకన్నా ఎన్నో శతాబ్దాల పూర్వమే తమ వేద విజ్ఞానముతో భూమి గుండ్రముగానున్నదని, భూమి సూర్యుని చుట్టూ తిరుగుచున్నదని, గ్రహ భ్రమణమునకు సూర్యుడు కేంద్రమని, తమ గ్రంధములలో రచించియున్నారు. కాణాదుని వంటి మహర్షులు సూర్యకిరణములు వక్రగతిన ప్రయాణము చేయుననియు సూర్య కిరణములో 7 రంగులున్నవనియు కుడా చెప్పినారు. మన పూర్వులు సూర్యుని గూర్చి తెల్పుచూ అయన రథానికి ఒకటే చక్రమనియు (కాల చక్రము) అయన రథ సారధికి నడుము మాత్రమే వుంది తొడలు లేవని (ఆయన పేరు అణూరుడు) అంటే రథము లో కదలకుండా ఎప్పుడూ 

నడుపుతూనే వుంటాడనియు, రథమునకు పూన్చిన గుఱ్ఱములు 7 అనియు (7 రంగులు) పగ్గములు పాములనియు (సూర్య కిరణములు వంకరటింకరగా వుంటాయి నిగూఢముగా తెల్పినారు.ఈ విషయాన్ని తమ స్వంతము చేసుకొని తమ పరిశొధనగా ప్రకటించుకొన్నారు అరిస్టాటిల్ లాంటి గ్రీకు దేశస్తులు. మన గ్రంథాలు చదవ లేక పొడవడం వల్ల గ్రీకు గ్రంథాలు చదవగలగడం వల్ల డచ్చిదేశస్థుడైన క్రిస్టియన్ హుయిన్స్ ( Christiaan Huygens) ఆ సిద్దాంతాని బలపరచటం జరిగింది. గమనించితే ఈ వేద విజ్ఞానమెంత గొప్పదో అర్థమౌతుంది. 

 ఇక శుక్ర గ్రహము: శుక్రము అంటే తెలుపు, కాంతివంతము అని అర్ధం సాయం సమయమున ఆకాశం పరిశీలించితే ఈ వాస్తవం తెలుస్తుంది.

 బుధగ్రహము: బుధుని సౌమ్యుడు అని అంటారు. అంటే చూడ ముచటైన చందన వర్ణములో ఉంటాడని అర్థం.

 చంద్ర గ్రహము: చంద్రము అంటే బంగారము. చంద్రుడు ఆ వర్ణములో వుంటూ చల్లని కిరణాలను ప్రసరింప చేస్తాడు కావున ఆయనను చంద్రుడని శీత కిరణుడని అన్నారు.

 ఈ విధంగా పేర్లుంచుట యందు కూడా ఎంతో యోచించి అర్ధవంతంగా పెట్టినారు కాని, స్వోత్కర్షతో తమ పేర్లను ఎక్కడా ఉపయోగించుకోలేదు.

 

ఇక 60 సంవత్సరములెందుకు అన్న అసలు విషయనికి వస్తాము; భూమికి అతి దూరముగా వున్న గురు గ్రహము యొక్క భ్రమణకాలము 12 సంవత్సరములు. అదే అత్యంత దూరములో వున్న శని గ్రహము 30 సంవత్సరములు తీసుకొంటుంది. అంటే బయలుదేరిన బిందువు నుండి తిరిగి ఈగ్రహములు ఒకే సరళ రేఖ మీదికి వచ్చుటకు 60 సంవత్సరాల కాలం పడుతుంది. అంటే గురువు (12 x 5 = 60) ఐదు మార్లు, శని (30 x 2 = 60) రెండు మార్లు, తిరుగవలెనన్నమాట. అంటే 60 సంవత్సరముల కాలం ముగియగానే మరులా ప్రభవ నుండి 60 సంవత్సరముల కాలం మొదలౌతుందన్నమాట. 

 ఇక కాలగణన విషయానికొస్తే, సూర్య సిద్ధాంతము ప్రకారము

 తృటి – వాడి సూది మొన తామరాకును తాకేకాలం (1/33750 Sec.,) నుండి మొదలు పెట్టినా ప్రాణము అన్న కొలమానము నుండి ఎవరైననూ సాధారణ కాలగణన చేయవచ్చును.

 జీవి ఇన్ని ప్రాణముల కాలము బ్రతకవలెనని నిర్ణయించ, బ్రహ్మ ఆ జీవిలో అన్ని ప్రాణములనూది భూమి పైకి పంపుతాడన్నది పెద్దలమాట. ఆరోగ్యవంతుడు శ్వాస తీసుకొని వదులుటకు పట్టు కాలము ప్రాణము. ఇంచుమించు 4 Sec., = 1 ప్రాణము

6 ప్రాణములు = 1 వినాడి ( విఘడియ)

 60 వినాడు లు = 1 నాడి (ఘడియ)

 60 నాడులు = 1 అహో రాత్రము (1 రోజు)

 360 రోజులు (24 హోరలు) = 1 సౌర వర్షము

 (దేవతలకు ) 1 దివ్య వర్షము = 360 సౌర వర్షములు

 కృతయుగము = 4800 దివ్య వర్షములు = 17,28,౦౦౦ (4 పాదములు)

 త్రేతాయుగము = 3600 దివ్య వర్షములు = 12,96,000 (౩ పాదములు)

 ద్వాపరయుగము = 2400 దివ్య వర్షములు = 8,64,000 (2 పాదములు)

కలియుగము = 1200 దివ్య వర్షములు = 4,32,000 (1పాదము)

 మహాయుగము = 12000 దివ్య వర్షములు = 42,20,000 (10 పాదములు)

 ఒక మన్వంతరము = 71 మహాయుగములు

 ఈ మనువులు 14గురు. ఇపుడు జరిగేది వైవస్వతమన్వంతరము

 కల్పము = 14 మన్వంతరములు + 15 సంధులు = (71 x 14) + 6 (మహాయుగములు)=994+6=1000మహాయుగములు

 15 సంధులెట్లంటే ఒక మన్వంతరము ముగిసి వేరొక మన్వంతరము వచ్చుటకు మధ్య కాలము సంధి. అంటే 

 పగటికి రాత్రికి, రాత్రికి పగటికి మధ్య సంధి వున్నట్లు. ఆవిధంగా 14 సంధులు గడిచిన తరువాత ఒక మహామన్వంతరమునకు(14 మన్వంతరముల కాలము మరొక మహామన్వంతరమునకు మధ్య కాలము 1 సంధి. వెరసి 15 మన్వంతరములు.

 1 సంధి కాలము = 4800 దివ్యవర్షములు. 15 సంధులు = 4800 x 15=7200 ది.వ. = 6 మహాయుగములు

 2 కల్పములు : బ్రహ్మకు ఓకే అహోరాత్రము = 1 రోజు

 ఇట్టి 360 రోజులు ఒక బ్రహ్మవర్షము.బ్రహ్మ ఆయుర్దాయము : 100 బ్రహ్మ వర్షములు

 ఇది సూక్ష్మముగా మన కాల చరిత్ర. ఇంతటి సునిశిత శాస్త్ర జ్ఞానము కల్గిన ప్రపంచములోని ఏకైక దేశమైన ఈ భారతదేశంలో జన్మించినందుకు ఆ పరమాత్మకు కృతజ్ఞతలు చెప్పుకొని గర్విద్దాం.

 స్వస్తి.