Friday, 23 September 2022

బేంకంటే బేంకు స్టేటు బేంకిరా

 బేంకంటే బేంకు స్టేటు బేంకిరా

https://cherukurammohan.blogspot.com/2022/09/40-sbi.html

40 సంవత్సరాలు నాకు నా కుటుంబానికీ బాసటగా నిలచి న్నం పెట్టి పోషించిన తల్లి కాని తల్లి SBI. ఆ తల్లిని మదినేంచుట, కృతజ్ఞత ప్మీరకటించుట నా విధి బాధ్యత కర్తవ్యము.  మరువలేని ఒక మధురమైన అనుభవము మీతో  పంచుకోవాలని అనిపించింది. అందులొ భాగమే ఈ ప్రయత్నము. ఈ అనుభవమును సెప్టెంబర్ 23, 2015 న ఆస్యగ్రంధిలో మొదటి సారిగా ప్రకటించి యున్దినాబుయ్. అప్పుడు:

  219 Likes 100 comments 66  shares Posted on 2015 Sept 23rd

వచ్చియుండినవి. చాలా సంవత్సరాలు గడచినవి అందుకే తిరిగీ మీ ముందు ఉంచుచున్నాను. 

 అవి నేను తిరుపతి ప్రాంతీయ కార్యాలయములో అధికారులలో (Officers) ఒకనిగా పని చేయుచున్న రోజులు. అప్పుడు శ్రీ శంకర్ నారాయణన్ గారు మా ఉప మహా నిర్వహణాధికారిగా(Dy. General Manager) ఉండేవారు. ఆయన తమిళుడై యుండి కూడా తెలుగుపై అమిత అభిమానమును చూపేవాడు. అది 15.8.84 సాయంకాలసమయము. తిరుపతికి కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రావటము వారిని శ్రీయుతులు మాడుగుల నాగఫణి శర్మ గారి సహితముగా ఆహ్వానించటము తటస్థించింది. మాడుగుల నాగ ఫణి శర్మ గారు గురుతుల్యులైన వారిని అనుసరించి యుండినారు. అప్పుడప్పుడే శర్మగారు అవధానములు మొదలుపెట్టి కూడా యుండినారు. మా DGM గారు నా మిత్రులైన బాల కృష్ణా రెడ్డి గారిని, నన్ను పిలిచి వారితో ఉపన్యాసము ఇప్పించితే బాగుంటుందన్నారు. రెడ్డిగారు స్థానికులు తెలుగు హిందీ లో స్నాతకోత్తర పట్టా పుచ్చుకొన్నవారు. వెంటనే ఇరువురము వారిరువురి వద్దకు వెళ్లి నొప్పించక మెప్పించి ఒప్పించి మా కార్యాలయమునకు ఆహ్వానించి రప్పించినాము. శర్మ గారు కరుణశ్రీ గారిని గూర్చి ఎంతో హృద్యంగామముగా మాటలాడినారు. తరువాత శాస్త్రిగారు యువకుడైన శర్మ గారి ప్రతిభను గూర్చి తెలుపుతూ ఆయనను ఆశీర్వదించి తనకిష్టమైన పోతన్నను గూర్చి చెప్ప మొదలుపెట్టినారు. ఆనందాతిరేకముతో నిండిన కరతాళ ధ్వనుల మధ్య తన ఉపన్యాసమును చాలించిన వెంటనే ఇరువురిని గూర్చి మాట్లాడిన వక్తలలో నేనూ ఒకడిని. వారిని గూర్చి చెరియొక పద్యము వంతున ఈ విధముగా చెప్పినాను. మీ కోసం ఈ దిగువన :

సుందరమైన శైలి బహు సుందరమైనటువంటి భావముల్

విందును గూర్చ వీనులకు వీణను మీటిన వాణి రీతిగన్

వందన మాచరించుటకు వాఙ్మయ ధీనిధి పాపయాఖ్యుకున్

అందర మొక్కటై నిలుతు మంకిత భావము తోడమ్రొక్కగన్

శ్రీ ధర మూర్తులౌ కరుణ చిప్పిలు  పాపయ శాస్త్రి వర్యులున్

నాద వినోద పుష్టి పద నాధుడు నాగాఫణీంద్ర శర్మయున్

మాదగు తిక్త చిత్తముల మాధురి నింపిరి పెంపు మీరగన్

చేదగు కాఫి పౌడరుకు చేర్చిన చక్కెర  వేడి పాలుగన్

వ్యక్తిగతంగా శాస్త్రి గారి ఆశంసనములు శర్మ గారి అభినందనలు సభ ముగిసిన పిదప నాకు దక్కిన బహుమతులు.

రెండు రోజులతరువాత మా DGM గారు రెడ్డి గారిని నన్ను పిలిచి మీరు ఒక భాషా సమాఖ్యను మన Bank తరఫున ఏర్పాటు చేయకూడదా అన్నారు. రాజు తలచితే దూషణ కైనా భూషణ కైనా కొదవ లేదు కదా! రెండు రోజులలోనే 'భావన' అన్న పేరుతో తెలుగు భాషా సమితిని ఏర్పాటుచేసి , రెడ్డిగారు బదిలీ అయిన పిదప TG రామకృష్ణ గారు నేను కలిసి , రామ కృష్ణ గారు కూడా బదిలీ అయినతరువాత నేనొక్కడనే అవిశ్రాంతముగా నడిపినాము. తరువాత భావన భాస్వరము పాలైపోయినది.

ఆ మద్య కాలములో ఒకసారి నేను DGM గారి వద్దకు పోవుట జరిగినది. ఆయన ఎంతో అభిమానముతో ఏమైనా వ్రాసినారా అన్నారు. సర్, నేను మన Bank ని గూర్చి ఒక పాట వ్రాసినాను అన్నాను. ఆయన అది వినకుండానే ఒక కాగితము పై వ్రాసి నాకు ఇవ్వండి , నేను మధ్యాహ్నము వాయుయానమున హైదరాబాదు పోవుచున్నాను మీ పాట మన 'Circle News Bulletin' లో ప్రచురింప జేయించుతాను అన్నారు. అంతవరకూ నా రాత (తలరాత ) నా రాతల పత్రిక లంట నివ్వలేదు. వారడిగినదే తడవుగా నేను చేతులు పిసుకు కొంటూ వుంటే ఆయనే తెల్ల కాగితమిచ్చి వ్రాయమన్నారు. వ్రాసిన పిదప చదువమన్నారు. చదివిన వెంటనే bank ని గురించి కూడా ఇంత బాగా పాట వ్రాయవచ్చునా అన్నారు. సర్, ఆధునిక కవిత్వానికి ఆద్యులలో ఒకరైన శ్రీ శ్రీ గారే 'కాదేదీ కవిత కనర్హం' అన్నారు అని అన్నాను. నవ్వి ఆ కాగితము భద్రముగా తన BRIEFCASE లో వుంచుకొని ఇక పోయి రమ్మన్నారు.

రెండు రోజుల తరువాత వారు హైదరాబాదునుండి వచ్చి తిరిగి ఆసనమునందాసీనులై నాకొరకు పిలువనంపినారు. నేను వారి వద్దకు వెళ్ళిన వెంటనే MAGAZINE నా చేతిలో ఉంచినారు. హైదరాబాదులో కూడా చాలామంది బాగున్నదన్నారండి. MAGAZINE editor ఇప్పుడే latest magazine ప్రింట్ కు పోతూవుంది మీకు copy కూడా ఇచ్చిపంపుతాను అని నా చేతికి ఈ పత్రిక నిచ్చి పంపినారు అన్నారు. నా ఆనందమునకు అవధి లేదు. ఆయను కృతజ్ఞత సమర్పించుకొని ఆనందాతిరేకము తో నా కుర్చీని చేరుకొన్నాను. వారు ఆనతి కాలములో transfer అయి తరువాత వచ్చిన వారు కూడా transfer అయిన తరువాత కొంత కాలము శ్రీ భండారు రామ చంద్ర రావు గారు DGM గా officiate చేయవలసి వచ్చినది. వారికి సాంస్కృతిక విషయముల పై మక్కువ ఎక్కువ. అనుకోకుండా అప్పటి HYDERABAD CIRCLE Chief General Manager శ్రీ K.S. పురోహిత్ తిరుపతికి వస్తున్నారన్న కబురు వారికి అందింది. వారు నన్ను అప్పటి Official Languages Officer కర్నావట్ గారిని పిలిపించి తెలుగులో bank ని గూర్చి మీరు వ్రాసిన పాట పాడండి హిందీలో కర్నావట్ గారు ఒక పాట వ్రాస్తారు అదికూడా పాడుతురుగానీ అన్నారు . కర్నావట్ గారు నేను వచనమైతే వ్రాయ గలను గానీ పాట వ్రాయలేనన్నారు . ఆశపోతును కాబట్టి అవకాశము జారవిడువలేదు. అదికూడా నేనే వ్రాస్తానన్నాను. రామ చంద్ర రావు గారు సరేనన్నారు.

ఆరోజు రానే వచ్చింది. రెండు పాటలూ నేను chorus తో కూడా పాడటము జరిగినది. పురోహిత గారు హైదరాబాద్ వెళ్లి అభిమాన పూర్వకముగా నా పేరున ఉత్తరము వ్రాయుట గూడా జరిగినది. మా DGM రామచంద్ర రావు గారు ఎంతో సంతోషించినారు . ఆజ్ఞాపకాల దొంతరనుండి హిందీ పాటది పల్లవి మాత్రమే వ్రాస్తూ తెలుగు పాట పూర్తి పాఠమును పొందుపరచు చున్నాను. ఇవి మనసును హత్తుకొన్న విషయములు కాబట్టి మరచి పోలేదు, మరచిపోలేను. అందుకే ఆప్తులుగా భావించి మీ ముందుంచుతున్నాను.

హిందీ పాటల పల్లవులు :

आप है हम सब के नेता

बात आप की कृष्ण गीता

माननीय महामहोदय

स्वागतम शुभ स्वागतम .........

तिरुपति तिरुमला में तो देखते हम ने पुरोहित

ए न पूछो उनमे कितने कर रहे हैं लोक हित

आप है असली पुरोहित जो रखे जनता को अंचित

हृदयपूर्वक नामन तुमको जो कभी मत करते वंचित ll माननीय ll

 

सकल सद्गुण अभिग्राही करुण कारण अम्बुवाही

नीति नियम के अग्रदाही  दीन संकट सुलभग्राही

दीन हीन सुजनोद्वाही कलह निर्णय अनिग्राही

हम हैं आप के  पथ के राही आपके हम pen के स्याही

 

 

हम भारतीय स्टेट बैंक वाले हैं

हम तेरे तेरे दौलत के रखवाले हैं

 

चाहे मानो गरीब है तन्दाना

मेहनत की बचत को तन्दाना

अरे बैंक में डाले तन्दाना

होता है राशी तन्दाना ll हम तेरे ll

 

चाहे कर्षक हो कोइ तन्दाना

चाहे कार्मिक हो कोइ तन्दाना

हम उन को करज देते तन्दाना

अपने साथ जताके तन्दाना ll हम तेरे ll  

అని వ్రాసినాను. రెండవ పాట మాత్రము 'హం కాలే హై తో క్యాహువా దిల్వాలే హైఁ ...... అన్న 'గుమ్నాం' హిందీ సినిమాలోని పాట యొక్క బాణీకి అనుకరణగా వ్రాసినాను. .

ఇక తెలుగు పాట :

బేంకంటే బేంకు స్టేటు బేంకిరా

బేంకంటే బేంకు స్టేటు బేంకిరా

అది నీదీ నాదీ అందరిదిరా

ధనమే దాచాలన్నా ఋణమే చేయాలన్నా

మనకోసం పాటుబడే మనసుండే మనుషులున్న ||బేంకంటే ||

చేతనున్న చిల్లిగవ్వ బ్యాంకున జమ చేయరా

కూడబెట్టుకొన్న రూక రూపాయవుతుందిరా

ముందు జీవితాన నీవు విందు భోజనాలు చేయు

కళలు నిజాము చేసేసే కాతాలను తెరచు బ్యాంకి ||బేంకంటే ||

కాడిగట్టి సాగుచేసి కష్టపడే రైతన్నా

కండలరగ శ్రమ జేసే ఓరిక్ షా రంగన్నా

నీకూ నీకూ నాకు అందరికీ మేలుజేయు

పథకాలను సూచించి ఋణ సహాయమిచ్చు బాంకి ||బేంకంటే ||

 

టక్కు టయ్యి ఉండినా సూటు బూటు వేసినా

చెవికి పోగులుంచినా తలకు గుడ్డ చుట్టినా

అందరినొకటిగ జూచి ఆదరాన చేరబిలచి

అడిగిన సదుపాయమిచ్చు అస్సలు సిసలైన బేంకి ||బేంకంటే ||

అదండీ కథ ఇదండీ పాట.

(ఇది చదివి సంతోషించుటకే విమర్శలకు తావు లేదు.)

స్వస్తి.


 

 

Thursday, 19 May 2022

ఆత్మస్తుతి పరనింద

 

ఆత్మస్తుతి పరనింద

https://cherukurammohan.blogspot.com/2022/05/blog-post.html

తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను. ఇందులో ఎక్కువ లాభాలున్నాయి. నీవు మాట్లాడినందున నీకు వచ్చేదిలేదు. విన్నందువలన నీ గౌరవము మొక్క పోబోయేదీ లేదు. వినుట వల్ల నీకు అనేక విషయాలు తెలియవచ్చు. వాగుట వల్ల మాత్రము నీవు కొత్తగా ఏమీ తెలుసుకొనే అవకాశమే లేదు. అదీగాక ప్రతివారు మాట్లాడ తలుస్తారు తమకు విషయము నిజముగా తెలిసినా తెలియకున్నా! నీవు ఇతరుల దృష్టిలో మంచివాడవని అనిపించుకోవాలంటే శ్రద్ధగా ఇతరులు చెప్పేది విను.

మంచి తెలుసుకొనగ మారు మాటాడక

శ్రద్ధబూని వినును శాంతముగను

వాక్కు మహిమ నెరుగు  వాగకు గొప్పలు

రామమోహనుక్తి రమ్య సూక్తి

ఎంత మంచిగా వింటే అంత చక్కగా మాట్లాడుతాడు మనిషి, తనవంతు వచ్చినపుడు. 

అప్పుడు స్వోత్కర్షకు తావివ్వడు. విషయమును గూర్చి మాట్లాడవలెను కాబట్టి 

పరనిందకు తావుండదు.   సంభాషణకు వాగ్వాదము పూర్ణబిందువు. అనగా అప్పుడు 

విషయమును గూర్చి గాక తగవులాటలతో తలపట్టుకో వలసి వస్తుంది. ఆతరువాత  

సంభాషణ వక్రగతిని అనుసరించి ‘ఆత్మస్తుతి పరనిందకు దారితీస్తుంది. ఆతరువాత 

జరిగేది పాఠకుల ఊహకే వదలుచున్నాను.  అందుకే శ్రీనాథుడు ఆగ్రహోదగ్రుడై 

రాజమహేంద్రి పండిత వైతండికులను  ఇలా అన్నాడు:

బోధమల్పంబు గర్వమభ్యున్నతంబు,

శాంతి నిప్పచ్చరంబు ,మచ్చరము ఘనము

కూప మండూకముల బోలె కొంచెమెరిగి

పండితమ్మన్యులైన వైతండికులకు 

అని.

నిప్పచ్చరము అనగా దరిద్రము, అంటే శాంతముగా సాంతము ఆలోచించలేనివాడు అని అర్థము. మచ్చరము అనగాఈర్ష్య. పండితమ్మన్యులు అనగా కుహనా పండితులు అని అర్థము (పండితశ్రేష్ఠులని కాదు). ఇప్పుడు ఆ మహాకవి ఏమంటున్నాడో చూడండి. తనకంటూ ఒక వాదం లేకుండా ఎదుటి వారిని ఖండించడమే ధ్యేయంగా ఆత్మస్తుతి పర నిందతో  .అప్రస్తుత విషయాలు తెచ్చి రాద్ధాంతం చేసేవాళ్ళను  వితండ వాదులు లేక వైతండికులు అంటారు. ఇలాంటి వాళ్ళకు తెలిసినదొక్కటే ‘శేషం కోపపేన పూరయేత్’ అంటే తన మిగిలిన వాదమంతా కోపముతో పూరించవలసినదే!

ఈ సందర్భముగా ఈ శ్లోకమును గమనించండి :

ఆత్మోత్కర్షం న మార్గేత పరేషాం పరనిందయా ।

స్వగుణైరేవ మార్గేత విప్రకర్షం పృథక్ జనాత్ ॥ (మహాభారతము)

ఇతరులను గురించి తేలికగా మాట్లాడి తాను ఏదో గోప్పవాడన్నట్లు చెప్పుకోవడానికి ప్రయత్నించకూడదు.  తనలో ఏమైనా మంచి గుణాలుంటే చూపి వాటిద్వారా ఇతరులకంటే తనకున్న గొప్పతనాన్ని నిరూపించుకొనడానికి ప్రయత్నించాలి.

ఈ మాట అర్జునునికి శ్రీ కృష్ణుడు చెప్పినట్లు గుర్తు.

పద్మవ్యూహం లో అభిమన్యుడు మరణించినాడన్న విషయం తెలుసుకున్న అర్జనుడు

అందుకు కారణం ధర్మరాజు అభిమన్యుని పద్మవ్యూహము భేదింప పంపటమేనని తెలిసి బాధపడి

అన్నగారైన ధర్మరాజును హతమారుస్తానని ప్రతిజ్ఞ చేసి  కత్తి పైకెత్తుతాడు.

అప్పుడు శ్రీకృష్ణుడు అర్జనుని  వారించి ప్రతిజ్ఞా భంగము కలగకుండుటకు ఒక 

ఉపాయము చెబుతాడు. నిందిస్తే చంపటంతో సమానమని దర్మజుని 

నిందించమంటాడు అప్పుడు అర్జనుడు ధర్మరాజును నిందించటం మొదలు పెడతాడు. 

అంటే పరనింద చేసినాడన్నమాట.మనం ఇన్ని కష్టాల పాలగుటకు కారణము నీవు. నీ వ్యసనము. నీమూలంగానే అరణ్యవాసము అజ్ఞాతవాసము చేసినది. ఇప్పుడు యుద్దములో కూడా నీఉ ప్రోయ్సహించుట చేతనే నా కొడుకును పోగొట్టుకొన్నాను.  అని నోరు నొప్పిపెట్టేటట్లు నిందించినాడు. అంతటితో ఆగక అర్జనుడు తనను తాను పొగుడుకోవటం ప్రారంభించి తాను చేసిన గొప్ప పనులను ఏకరువుపెట్ట ప్రారంభించినాడు. "నేనంతటివాడిని ఇంతటివాడిని అంటూ బాల్యము  నుండీ తాను చేసిన గొప్పపనులను చెప్పుకోసాగినాడు. ఇంతాచెప్పుకొంటూ నేను ఒక్కడినే భారతయుధ్దమును ఒంటిచేత్తో గెలిపిస్తానన్నాడు. అంటే కృష్ణుడు చెప్పిన విధముగా తిట్లతో అన్నను హతమార్చినంతపని చేసినాడు. కారణమేమయినా ఇది ఆత్మస్తుతి పరనిందయే! శ్రీకృష్ణుని ఆదేశముతో, భ్రాతృ దూషణమునాపి  అర్జనుడు ఈ లోకం లోకి వచ్చి ఇంత సేపటినుండీ అన్నగారిని తిట్టినాను. నేను పాపిని నాజన్మకు నిష్కృతి లేదు, నాకు మరణమే శరణమంటూ ఒరలోనుండి కత్తి తీసి తనను హతమార్చుకోబోయినాడు.

అప్పుడు మళ్ళీ శ్రీకృష్ణుడు నిన్ను నీవు పొగడుకొని చచ్చినవానితో సమమైనావు. తిరిగీ 

వేరుగా చావనవసరము లేదు అన్నాడు. దీనిని బట్టి ‘ఆత్మ స్తుతి పరనింద’ ఎంత చెడ్డ 

పనులో మనము గ్రహించవచ్చును. అవి ఆత్మహత్యా సదృశ్యములు మాత్రమే కానీ అన్యతా 

కాదు. 

మనలను మనం పొగుడుకుంటే మనలను చంపుకున్నట్లే, ఎదుటిపెద్దలను పండితులను 

నిందిస్తే వారిని చంపినట్లే అనుకోని అప్పుడు కూడా మనలను మనమే  

చంపుకొంటున్నాము. అందుచేత సంభాషణలో మనలను మనము గొప్పవారమని, 

 అధికముగా మాట్లాడరాదు. అసలు అధికంగా మాట్లాడటమే తప్పు,అది అనేక అనర్థాలకు ఆలవాలం.

సవ్యమయిన జీవితానికి ఈ సాధనాసూత్రమును. కలకాలమూ గుర్తుంచుకొంటే మంచిది.

స్వస్తి.

 

Friday, 29 April 2022

శ్రీలంకలో ఆంధ్రులు

 

శ్రీలంకలో ఆంధ్రులు

 https://cherukurammohan.blogspot.com/2022/04/blog-post.html

శ్రీలంక పేరు వినగానే మనకు ముందుగా తమిళులు గుర్తుకు వస్తారు. అయితే  లంకను ఏలిన రావణాసురుడు మహాపండితుడు మరియు తెనుగునకు మొదటి వ్యాకరణకర్త అని  జనశ్రుతి. శ్రీలంకలో తొలి రాజ్యం స్థాపించింది మాత్రం తెలుగువాడు. అక్కడి ఆఖరి రాజ్యమూ తెలుగు వారిదే. శ్రీలంక జనావాసములలో తెలుగు వారున్నారు. ‘వెంకటరంగమ్మ దేవిచివరి రాణి మరియు ఆమె భర్త విక్రమ రాజ సింహ చివరి రాజు. తమిళులు నేను చదివి తెలుసుకొన్నమేరకు కడుపు చేత పట్టుకొని ఉపాధికి తరలివచ్చినవారే కానీ ఇచట రాజ్యములనేలలేదు.

బృహత్ కథ వ్రాసిన గుణాఢ్యుడు తెలుగు వాడనీ, మెదక్ జిల్లాకు చెందిన కొండాపూర్ లో వ్రాసినాడన్నది జనవాక్యం. ఇందు వాస్తవము కలదు. తెలుగు రాజయిన శాతవాహనుని ఆస్థానములో ఒక తెలుగు నాటికి చెందిన పండితుడు ఉండుట ఆశ్చర్యపడవలసిన విషయమేమీ కాదు.

ఈ ఆంధ్రకవి గుణాఢ్యుడు వ్రాసిన గాథా సంపుటి బృహత్కథ. ఆ బృహత్కథలో ఆంధ్రులు సింహళ రాజధానితో బాగా వర్తక సంబంధాలు కలిగి ఉన్నట్లు స్పష్టమౌతున్నది. నాటి ఆంధ్రుల ఓడరేవయిన తామ్రపర్ణి రేవులో శ్రీలంక ఓడలు దిగేవట. సింహళం నుండి లవంగపు చెట్టు యొక్క పట్ట (దాల్చీనీ), కొబ్బరి, లవంగాలు, కర్పూరము, లక్క, మిరియాలు, పచ్చ రత్నాలు దిగుమతి అయితే ఆంధ్రులు బంగారము, రంగులు, పోకలు, యాలకలు, లోహపుసామానులు, వస్త్రాలు శిల్పకళకు వలయు సామానులు సింహళానికి ఎగుమతి చేసేవారు. ఆ కాలములో ఆంధ్రులూ సింహళలూ బౌద్ధులు. ఆంధ్రుడైన శ్రీనాగార్జున బోధి సత్వుడు బౌద్ధము లోని మహాయాన శాఖకు ఆద్యుడు. నాగార్జునుడు సింహళంలో కొంతకాలం నివసించి మహాయానమును వ్యాపింపజేసినాడని  తెలియవస్తూ ఉన్నది. ఆ విధముగా ఆతని మహాయాన శాఖ సింహళమున అత్యధికముగా వ్యాపించింది. ఈ విషయమును గమనించండి. ధాన్యకటకం లోనూ, ఇక్ష్వాకులు రాజధాని అయిన నాగార్జున కొండ అనబడు విజయపురి లోనూ, సింహళుల సంఘారామాలు ఉన్నట్లు శాసనాలు ఉన్నాయి. సింహళము నందలి స్తూపములు, ఆంధ్రుల స్తూపములూ ఒకే రూపంలో ఉన్నవి. పవిత్రమైన బుద్ధుని దంతము ఆంధ్రదేశంనుండియే సింహళము వెళ్ళినది.

సింహళ దేశంలో ప్రాచీన శిల్పం జాగ్రత్తగా గమనిస్తే, సింహళ మహారాజులు అప్పటికే ప్రసిద్ధిగాంచిన ఆంధ్ర శిల్పులను సింహళం తీసుకువెళ్ళి ఉంటారని తెలుసుకొనవచ్చును. పల్లవభోగంలో (పల్నాడు) దొరికే పాలరాయి గంధపు చెక్కపై శిల్పం మలచినట్లు మలచుటకు అనువైన మెత్తనిరాయి. అలాంటిరాయి సింహళంలో దొరకలేదు. ఆంధ్రదేశంనుండి ఆరాయిని కొనిపోవడం కష్టం. కాబట్టి ఆంధ్రదేశము నుండి వెళ్ళిన శిల్పులు అలాంటి రాయిని సింహళంలో వెదికినారు. సింహళం రాజధాని అయిన అనూరాధాపురం చుట్టు నల్లరాయి కావలసినంత ఉంది. అయినా ఆ శిల్పులు దానితో శిల్పం మలచడానికి ఇష్టంలేక పల్నాటిరాయిని పోలిన ఒక విధమైన పటికపు రాయిని అనూరాధాపురానికి కొదిమైళ్ళ దూరంలో కనిపెట్టి ఆరాతిని విరివిగా వారి శిల్పానికి ఉపయోగించినారు. అనురాధాపురంలో దర్శనమిచ్చే ప్రాచీన బుద్ధ విగ్రహాలన్నీ ధాన్యకటకాది ఆంధ్రబౌద్ధ శిల్ప క్షేత్రాలలో దొరికే బుద్ధవిగ్రహాలకు ప్రతిరూపాలు.

చోళులు క్రీ.శ.16వ శతాబ్దములో అనూరాధాపురం నాశనం చేసి ‘పాలనారువా’లో రాజ్యం స్థాపించినారు. వారు నిర్మించిన దేవాలయమూ, శిల్పములూ అచ్చట  ఇంకా ఉన్నాయి. మధ్యయుగంలో చివర సింహళానికి స్కంధపురం రాజధాని. ‘కంది కోట’ అని కూడా దీనిని పిలిచేవారు. బహుశ కడపజిల్లా జమ్మలమడుగు తాలూకాలిని ‘గండికోట’కు దీనికి సంబంధము కూడా ఉండియుండవచ్చు. గండికోటను పాలించినది కూడా నాయక రాజులే! మీర్ జుమ్లా గోల్కొండ నవాబు తరఫున యుద్దముచేసి మోసముతో ముఖ్యమైన నాయకులను మట్టుపెట్టిన తరువాత, వారు దక్షిణమునకు వలసపోయినారని చరిత్ర చెబుతూవున్నది. అట్లు వెళ్ళిన వారు ఏ తిరునెల్వేలి ప్రాంతములోనో ఏకత్రితులయి శ్రీలంకకు సైనికాధికారులుగా సైనికులుగా వలసపోయి ఉండవచ్చును. తామున్న ఆప్రాంతమునకు తమ ప్రాంతీయాభిమానముచే ఆపేరు పెట్టుకొని యుండవచ్చును. ఆనగరానికి నేటిపేరు క్యాండి. ఆరాజులు దండెత్తివచ్చి పోర్చుగీసువారితో యుద్ధాలు చేసేటప్పుడు తంజపురి ఆంధ్రనాయక రాజులూ, మధుర ఆంధ్రనాయకులు శ్రీ లంక రాజులకు సహాయం చేసినారు. చివర సింహళరాజులు, ఇల్లటం వెళ్ళిన మధుర ఆంధ్ర నాయకరాజ వంశంవారు. వారు తీసుకొనివెళ్ళిన, నృత్యశిల్ప, చిత్రలేఖన సంప్రదాయాలు ఇంకా ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్నాయి. వారి సింఘాలీ భాష పాలిభాష జన్యము. పాళీ ప్రాకృత భాషాజన్యము. తెలుగు కూడా ప్రాకృత జన్యమే! ఆ విధముగా తెలుగునకు, లిపి మరియు భాష, సింహళ భాషకు కొంత సారూప్యము కలదు. మరి ఆంద్ర రాజులు ఎందఱో ఆ దేశమును ఏలినారు కదా!

కాండీ నగరంలో, ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన  బౌద్ధ ప్రార్థనా స్థలాలలో ఒకటైన శ్రీ దళాద మలిగావా ఉంది. దీనిని1988లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.

శ్రీలంక దేశంలోని మధ్య మరియు తూర్పు ప్రాంతములను ప్రధానముగా తెలుగు రాజులు పాలించినారు. అనేకులగు తెలుగు అధిపతులు, సైనిక మరియు ఇతర సిబ్బందిని హిందూ దేశ దక్షిణ ప్రాంతము నుండి ఈ ద్వీపానికి తీసుకువచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి. కానీ వారు సాధించిన విజయాల గురించి ఎటువంటి ఆధారములూ  ఇప్పటివరకూ అందుబాటులోనికి రాలేదు. అయితే, ముఖ్యంగా కీర్తి శ్రీ రాజాసింహ (రాజా సింఘే)  హయాము నుండి విలువైన సమాచారాన్ని పొందగలుగుచున్నాము. .          

ఈ విషయంపై అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కీర్తి శ్రీ రాజాసింహ విజయ  రాజవంశములోని చివరి రాజు. రాణి విజయనగర రాజుల వంశం నుండి వచ్చింది. కీర్తి శ్రీ రాజాసింహ (1747-1780) జాతీయ అధోకరణం మరియు క్షీణత యొక్క ఆటుపోట్లను అడ్డుకున్నారు మరియు మతపరమైన పునరుద్ధరణను కూడా తీసుకువచ్చినారు. స్వయంగా పండితుడైన అతని సోదరుడు, రాజాధి రాజ సింహ, కీర్తి శ్రీ వారసుడు, మరియు అతని కాలంలో ఉన్నత స్థాయి కాకపోయినా సాహిత్య ప్రభంజనం ఉంది మరియు అతని పాలన 1798 వరకు కొనసాగింది. అతని వారసుడు శ్రీ విక్రమ రాజ సింహ (1798- 1815).  దాదాపు రెండు వేల నాలుగు వందల సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన రాజవంశంలో చివరిది ఈ రాజవంశము. బ్రిటీష్ వారు రాజు మరియు అతని రాణిని పట్టుకుని తంజావూరుకు బహిష్కరించారు. కండీ చివరి రాజు ప్రత్యక్ష వారసులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా నరసింగరావుపేటలో నివసిస్తున్నట్లు సమాచారము.

మిగిలినది మరొకమారు .................

శ్రీలంకలో ఆంధ్రులు- 2వ భాగము

 

తెలుగు రాజుల పాలనలో తెలుగు కళలు మరియు సంస్కృతి విలసిల్లినప్పటికీ, వారి పాలన కాలమున కల్లోలముల కారణంగా వారి పరిపాలన గుర్తింపదగ్గ ముద్ర వేయలేకపోయిందేమో! ఈ కాలంలో శ్రీలంకకు వలస వచ్చిన తెలుగు ప్రజలు ఎక్కువగా భారతదేశంలోని దక్షిణ జిల్లాలైన తంజావూరు, సేలం, మదురై మొదలైన ప్రాంతాల నుండి వచ్చినారు. అపుడు తెలుగు నాయక రాజుల పరిపాలన ఉండినది.

కాలక్రమేణా మరియు అధికారాలలో మార్పులతో, శ్రీలంకలోని తెలుగు శ్రామికులు, తమిళులతోనూ ఉన్నత వర్గము వారు సాహిత్యపరంగా కొంతవరకు, ప్రధానంగా క్యాండీ మరియు అనురాధపురలోని సింహళీయ సమాజంతో కలిసిపోయినారు. అయితే, వారిలో చాలా కొద్ది మంది మాత్రమే దూరంగా ఉంటూ తమ వాణిజ్య మరియు వృత్తిపరమైన కార్యకలాపాలను చిన్న స్థాయిలో, ఎక్కువగా కొలంబో, క్యాండీ, ఉత్తర మరియు తూర్పు ప్రావిన్షియల్ పట్టణాలలో, కొనసాగించినారు.

ఇచ్చటి తెలుగు సమాజం అసమానతలు తమ మధ్య ఉన్నప్పటికీ, మనుగడ కోసం పోరాడి, నేటికీ క్యాండీ, జాఫ్నా, బట్టికలోవా వంటి కొన్ని ప్రాంతాలలో, వారు పరిమిత స్థాయిలో తమ గుర్తింపును నిలుపుకున్నారని గమనించడం హర్షణీయం. వ్యాపారం మరియు తక్కువ ఆదాయ వృత్తులలో వారి కార్యకలాపాలను కొనసాగిస్తునే ఉన్నారు.          

శ్రీలంక యొక్క ప్రస్తుత పతాకము శ్రీ విక్రమ రాజసింహ యొక్క రాజచిహ్నమును  కలిగియుంది అని పైన చెప్పుకొన్నాము. సెప్టెంబరు 1945లో ఈపతాకమును శ్రీలంక జాతీకేతనముగా స్వీకరించాలని స్టేట్ కౌన్సిల్‌కు చేసిన ప్రసంగంలో ప్రతిపాదించబడింది, ఇపుడదియే అనుసరించబడుచున్నది.

కాండీ సరస్సు , కాండీలోని భవనమునకు ఎదురుగా ఉన్న ఒక కృత్రిమ సరస్సు, శ్రీ విక్రమ రాజసింహ చేత ప్రారంభించబడింది.

శ్రీ దళా మాలిగావా యొక్క పత్తిరిప్పువా లేదా అష్టభుజి, క్యాండియన్ సింహళీ వాస్తుశిల్ప సారము అనదగ్గ ఈచిహ్నమును సృష్టించుటయేగాక దీనిని దీనికి శ్రీలంక ప్రాతినిధిగా గుర్తించబడినది. దీనిని క్రీ.శ. 1802లో రాజు శ్రీ విక్రమ రాజసింహ సూచనల మేరకు శిల్పకళా పారంగతుడు మరియు ప్రధాన రాజ శిల్పి యగు దేవేంద్ర మూలాచారి నిర్మించినారు.

శ్రీ విక్రమ రాజసింహ వేలూరు కోటలో రాజ ఖైదీగా ఉన్న సమయంలో, అతను అతి తక్కువ రాజ భరణమును అందుకొనేవాడు., అతని వారసులు భరణమును  1965 వరకు శ్రీలంక ప్రభుత్వం నుండి పొందుతూనే ఉన్నారు. ముత్తు మండపం అనేది చివరి దక్షిణ భారతదేశం అయిన శ్రీ విక్రమ రాజసింహ సమాధి చుట్టూ నిర్మించిన స్మారక చిహ్నం. కాండీ యొక్క మూల పాలకుడు. పాలార్ నది ఒడ్డున ఉన్న ఇది వెల్లూరు పట్టణానికి ఉత్తరాన కేవలం ఒక కి.మీ. దూరములో ఉన్నది.

శ్రీ విక్రమ రాజసింహ పాలనలో, తానూ తెలుగువాడయ్యును,కాండీలో తమిళమును ఆస్థాన భాషలలో ఒకటిగా నియమించబడినది - ఇది శ్రీలంక యొక్క ప్రస్తుత రాజకీయాలకు సంబంధించిన ఒక చారిత్రక వాస్తవం.

2018లో, రాజు శ్రీ విక్రమ రాజసింహ నిజ జీవిత కథను వర్ణించే గిరివస్సిపుర అనే సింహళ చిత్రం నిర్మించబడింది మరియు విడుదల చేయబడింది. [15]

శ్రీలంకలో అత్యంత ప్రసిద్ధి చెందిన, అత్యధిక రాబడి కలిగిన ఆలయం శ్రీదళాద మాలిగావా. దీనికి కారణం ఆ ఆలయంలో బుద్ధుడి దంతం భద్రపరచి ఉండడమే. ఆ ఆలయం గోడల మీద ఉన్న రాకుమారి హేమమాలి, ఆమె భర్త దంతకుమారుడి నిలువెత్తు పెయింటింగ్ ఆకట్టుకుంటుంది; హేమమాలి– కళింగరాజు గుహసివ కుమార్తె. క్రీస్తుశకం మూడో శతాబ్దినాటి మాట.. పాళిగ్రంథం దలద వంశం ఈ కథనంతా వివరంగా తెలియజేస్తోంది. బుద్ధుడి నిర్యాణం తరవాత ఆయన ఎడమ వైపు దంతాన్ని ఖీమథెరా అనే భిక్షువు సేకరించి, దాన్ని కళింగరాజు బ్రహ్మదత్తుడికి బహుమతిగా అందజేసినాడు. బుద్ధుడి దంతానికి గౌరవంగా ఆ రాజు స్థూపాన్ని నిర్మించగా ఆప్రాంతము క్రమముగా దంతపురిగా మారినదని చారిత్రక కథనాలు తెలియజేస్తున్నాయి. దంతపురం ఎక్కడ అనేదానిపై అనేక పరిశోధనలు జరిగినాయి. మన పురాతత్వవేత్తలు నేటి శ్రీకాకుళం జిల్లాలో ఆముదాలవలస సమీపంలోని దంతపురమే అదని రూఢి చేసినారు. శిథిలావస్థలో ఉన్న కోట గోడలను ఈనాటికీ అక్కడ చూడవచ్చు.

మిగిలినది మరొకమారు .........

శ్రీలంకలో ఆంధ్రులు- (౩వ) చివరి భాగము

ఆ దంతమును కలిగిన వ్యక్తి ఆ దేశమును దంతము తనవద్దనున్నంతకాలము రాజ్యము ఏలుతాడన్న ఒక నమ్మకము ఉండేది. అందువల్ల ఆ దంతం కోసం రాజుల మధ్య నిరంతరం యుద్ధాలు జరిగేవి. దంతాన్ని రక్షించేందుకు గుహశివుడు ఓ పథకం యోచించించి తన కూతురు, అల్లుడికి దానిని అప్పగించినాడు. హేమమాలి తండ్రి ఆదేశం మేరకు దంతాన్ని తన కొప్పులో దాచుకుని, భర్తతో పాటు అతి సామాన్యుల్లా వేషం వేసుకుని శత్రువుల బారిన పడకుండా నౌకలో శ్రీలంకకు చేరుకుంటారు. దంతము శత్రువులనుంది కాపాడుకొంటూ చివరకు క్యాండి లో శ్రీదళాద మాలిగావా చేరుకొంటుంది.

క్యాండీని పరిపాలించిన ఆఖరు ప్రభువుల్ని ‘వడగర్లు’ అని పిలిచేవారట. అంటే ఉత్తరం నుండి వచ్చిన వాళ్లని అర్థము. వారు మధురై నాయక రాజవంశీయులు. వారి మాతృభాష తెలుగు. దాదాపు 200 ఏళ్ల పాటు వీరు క్యాండీని పరిపాలించారు. అప్పట్లో కండికోట అనేవారట. దీనికి కడప దగ్గరున్న గండికోట పేరుతో దగ్గర సంబంధం కన్పిస్తోంది. వెంకటరంగమ్మకి సావిత్రమ్మ అని మరో పేరూ ఉందట. అలాగే సింహాసనం అధిష్టించక ముందు విక్రమ రాజసింహ పేరు కన్నస్వామి నాయకుడు. క్యాండీని పరిపాలించిన సింహళ రాజులు తంజావూరు, మధురై రాకుమార్తెలను వివాహం చేసుకునే ఆచారాన్ని పాటించేవారట.

సింహళ రాజు నరేంద్ర శింహుడు పిల్లలు లేకుండానే మరణించుటచే ఆ రాజు పట్టపు రాణి తమ్ముడు విజయ రాజ సింహ, చక్రవర్తిగా రాజ్యాన్ని చేపట్టినాడు. అలా క్యాండీ 1739లో మధురై నాయక రాజుల పరిపాలనలోకి వచ్చింది. విజయరాజ సింహ తరవాత అధికారంలోకి వచ్చిన కీర్తిశ్రీ రాజసింహ క్యాండీలోని కోటను, శ్రీ దళాద మాలిగావా గర్భగుడిని నిర్మించినాడు. తన 35 ఏళ్ల పాలనలో కీర్తిశ్రీ డచ్ కోటల మీద దండయాత్ర చేసి క్యాండీ రాజ్యాన్ని ఎంతో పటిష్టం చేసినాడు. గుర్రపుస్వారీ చేస్తూ కింద పడి కీర్తిశ్రీ 1782లో మరణించినాడు. ఆ తరవాత కూడా మరో ఇద్దరు నాయక వంశస్థులు క్యాండీని పరిపాలించినారు. 1815లో ఈ కోటను ‘క్యాండీ కన్వెన్షన్’ ప్రకారం బ్రిటిషర్లు స్వాధీనం చేసుకున్నారు.

రాజు విక్రమరాజ సింహను, రాణి వెంకటరంగమ్మను కొంతకాలం కొలంబోలో బందీలుగా ఉంచి, ఆ తరవాత నేటి తమిళనాడులోని రాయవెల్లూరుకు తరలించినారు. మార్గమధ్యంలోనే రాణి ప్రాణాలు కోల్పోయింది అని చెబుతారు. రాజు రాయ వెల్లూరు కోటలో బందీగా ఉంటూ అక్కడే ప్రాణాలు విడిచినాడు. వారి సమాధులు నేటికీ అక్కడ ఉన్నాయి. క్యాండీలో నేటికీ తెలుగు జాతి ఘన చరిత్ర పదిలంగా ఉంది. ఆ విషయం మన దాకా చేరకపోవడమే శోచనీయం.

శ్రీలంకలో తొలి రాజ్యాన్ని స్థాపించిన వాడు విజయుడు. క్రీ.పూ. 5వ శతాబ్దికి చెందినవాడు. అతడు నిర్మించిందే అనురాధపుర. శ్రీలంక ప్రాచీన రాజధాని నగరం అది. ఆ విజయుడు కళింగానికి అంటే నేటి శ్రీకాకుళం జిల్లాకు చెందిన సింగపురం వాడని మన పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఈ ఊరు పేరు మీదే సింహళ జాతి పేరు కూడా ఏర్పడిందని అంటారు. ఇప్పుడు ఆ దేశంలో కళింగ అనగానే ఒరిస్సా అంటారు కానీ, ఒకప్పుడు కళింగ అంటే మూడు భాగాలు.. ఉత్తర కళింగము, మధ్య కళింగము, కళింగము. ఉత్తర కళింగమే నేటి ఒరిస్సా. గంజాం నుంచి గోదావరి వరకూ ఉన్న ప్రాంతమంతా మిగతా రెండు భాగాలు.

శ్రీలంకలోని నాగారీకులలోనూ  తెలుగు వారు గోప్పసంఖ్యలో అనురాధపురా,

సీగిరి (సీ గిరి అనగా. శ్రీ పర్వతం అనగా మనకు నాగార్జునకొండ వలె), డంబుల్లా లాంటి పర్యాటక పర్యాటక  ప్రదేశాలలో పాముల్ని, కోతుల్ని ఆడిస్తూ కొందరు కన్పిస్తారు. ఆడవాళ్లు చేయి చూసి జోస్యం చెబుతుంటారు. వీళ్లందరి మాతృభాష తెలుగే. వీరిని, అహికుంటికలు {పాములనాడించేవారు} రామకుళవరలు ( కోతుల నాడించేవారు) వాగైలు(సోది చెప్పేవారు}అని అంటారు. పదివేల మంది దాకా వీరి జనాభా ఉంది. వీళ్లు ‘తెలుంగు జాతి’, ‘మన జాతి’ అని చెప్పుకుంటారు. దీవరగమ్మ, కుడాగమా, పుత్తళం, చీమలగస్స తదితర ప్రాంతాల్లో వీరి గ్రామాలు కన్పిస్తాయి. కన్పించిన ప్రతి చోటా వీళ్ల దగ్గరికి వెళ్లి ‘మీరు తెలుగా’ అంటే వెంటనే ‘అవు అక్కా’ అని బంధుత్వాన్ని కలుపుకున్నారు. లచ్చిమి, వెంకటక్క, సరోజ, మసక్క, మసన్న, సుబ్బడు, ఎర్రన్న, సోము.. ఇలా ఉన్నాయి వాళ్ల పేర్లు. పాములోళ్లు ‘తేబల’, ‘దుగుడీ’ తెగల వాళ్లు. ఉపతెగలూ లేకపోలేదు. కోతులోళ్లలో ‘పసుపులేటి’, ‘పాయసం’ లాంటి ఇంటి పేర్లు ఉన్నాయి. ఈ ఇంటి పేరున్న వాళ్లు ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాల్లో కన్పిస్తారు. కానీ పాములోళ్ల ఇంటి పేర్లున్న వాళ్లు భారత నేలల్లో కన్పించడం లేదు. అలాగే వాళ్ల భాషలో మన మూడు మాండలిక పదాలు కన్పించడం విశేషం. అంటే వాళ్లు అక్కడి మూల జాతుల వాళ్లని చెప్పొచ్చని పురాతత్వ శాస్త్రవేత్తలు తీర్మానించినారు. పంతొమ్మిది వందల అరవైల నుంచే వీళ్లు గ్రామాల్లో స్థిరనివాసం ఏర్పరచుకుంటున్నారు. వీళ్ల కోసం ప్రత్యేక స్మశానాలు లేకపోవడంతో బౌద్ధానికో, క్రిస్టియానిటీకో మారుతున్నారు. మరణానికి భయపడి మతం మారడం ఎంతో శోచనీయం. కాలక్రమేణ ఈ తెగలు కూడా కనుమరుగైపోతాయి. telugu పైన, తెలుగువారిపైన, మన ధర్మమూ పైన మనవారికి మక్కువ తక్కువ. పోతే పోనీలే అన్న వ్యర్థ వేదాంతులు మనవారు.

బ్రిటీష్ వారి హయాంలో తేయాకు తోటల్లో కూలిపనుల కోసం వెళ్లిన తెలుగువాళ్లూ శ్రీలంకలో ఎక్కువే. నేడు వీరి జనాభా ఎనిమిదిన్నర లక్షల వరకు ఉంటుంది. మా భాషకు గుర్తింపు లేకుండా పోయిందని, మమ్ము పట్టించుకొనేవారు లేరని  కొలంబోలో ఉన్న తెలుగు జాతీయులు వాపోతున్నారు. ఇక్కడ ‘తెలుంగు నగర్’, ‘అల్లంపల్లి’ లాంటి తెలుగు ఊర్లు కన్పిస్తాయి. కొలంబోలో ఒకప్పుడు తెలుగు మాతృభాషగా గల వడ్డర్లు మూడులక్షల మంది ఉండేవారట. అంతా చెల్లాచెదరైపోయారు. ‘అఖిల శ్రీలంక తెలుగు కాంగ్రెస్’ పేరున ఓ రాజకీయపార్టీ కూడా ఉంది. వీళ్లు కోరుతున్నది ఒకటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొలంబోలో తెలుగు వారి కోసం ఓ ఆడిటోరియం కట్టించి తెలుగు అభివృద్ధికి తోడ్పడాలని. ఇటీవల టూరిస్టులుగా ఆ దేశం వెళ్లిన తెలుగువాళ్లని పలుకరించడానికి పాములోళ్లు వెళితే, వీరిని చూసి అడుక్కునేవాళ్లుగా భావించి ఈసడించుకున్నారట. ‘మేమూ మీ తోబుట్టువులమే అని భావించండి. మా వేషభాషలని చూసి దూరం చేసుకోకండి’ అని వాళ్లు కోరుతున్నారు. మన బాగుకే గతి లేదు వారి బాగు మనమేమి చూస్తాము.మన వారిది ఎంత హీన స్వభావమో అర్థము చేసుకోండి.

నేడు రాజకీయంగా గిరి గీసుకున్న రెండు రాష్ట్రాలలోనే కాదు, అనాదిగా వింధ్య దిగువన నుండి శ్రీలంక వరకూ అనేక ప్రాంతాల్లో మన తెలుగువాళ్లు ఉన్నారు. ఆమాటకొస్తే బీహారు ఒరిస్సా, గుజరాత్, మరాట్వాడా ఉత్తర ప్రదేశ్ లలో కూడా మనవారున్నారు, ఇప్పటికీ మన ఉగాది లాంటి పండుగలను అనుసరించుతారు. వాళ్ల తెలుగు మనలా ఉండకపోవచ్చు అంతాత్రాన మనము అధికులమూ కాదు వారు అధములూ కాదు.  ఆమాటకొస్తే వారిలో కొందరు నేటికీ, మనకు చేతకాని, తెలియని గ్రాంధికమైన తెలుగు మాట్లాడే వారు ఉన్నారు. రాకపోకలు లేని కారణంగా వాళ్ల భాష 16వ శతాబ్ది దగ్గరో, 18వ శతాబ్ది దగ్గరో ఆగిపోయి ఉండవచ్చు. ఆ మాత్రాన వాళ్లు మన అన్నదమ్ములు కాకపోరు. దేశమేదైనా, రాష్ట్రమేదైనా, ప్రాంతమేదైనా, వృత్తులేవైనా తెలుగు మాతృభాషగా ఉన్నవాళ్లందరం ఒక్కటే అన్నది గుర్తుంచుకుందాం.

మన తెలుగు తల్లికి నమస్కారము.

స్వస్తి.

Sudhakar Yv
You are really a walking encyclopaedia that too you are from Banking industry 🙏

Tuesday, 8 March 2022

బ్రతికియుండగనే నేతాజీకి నివాళులిచ్చిన నాటి భారత ప్రభుత్వం

బ్రతికియుండగనే నేతాజీకి నివాళులిచ్చిన నాటి భారత ప్రభుత్వం

https://cherukurammohan.blogspot.com/2019/11/blog-post_25.html

కాంగ్రెసు వారి క్విట్టిండియా పోరాటం కొన్నేంళ్లకే ముగిసిపోయింది. కనుచూపు మేరలో మనలనేలుచున్న బ్రిటీషు వారితో  పోరాటాలూ లేవు. అటువంటి సమయములో సడి సవ్వడి లేకుండా వారు పలాయనము చిత్తగించుట జరిగినది. అంత అర్ధాంతరముగా మనకు స్వాతంత్య్రమును ఇచ్చివేసి వారు ఎందుకు పోవలసి వచ్చినది. GD Bakshi గారి 'Bose: An Indian Samurai' పుస్తకము చదివితే తెలిసివస్తుంది.

India Today Magazine has been able to exclusively access an advance copy of a Knowledge World Publication, 'Bose: An Indian Samurai'. In this book General GD Bakshi quotes from a conversation between former British Prime Minister Clement Attlee and the then Governor of West Bengal Justice PB Chakraborthy. In 1956, Clement Attlee had come to India and stayed in Kolkata as a guest of the then governor. Remember, Clement Richard Attlee was the man, who as leader of the Labor Party and British Prime Minister between 1945 and 1951, signed off on the decision to grant Independence to India.

PB Chakraborthy was at that time the Chief Justice of the Calcutta High Court and was also serving as the acting Governor of West Bengal.

అంటే - ఈనాడు మనము అనుభవిస్తున్న స్వాతంత్య్రం ప్రధానంగా నేతాజీ శౌర్యఫలం. ఆయనే అసలు సిసలు జాతీయ నాయకుడు అని నిస్సంకోచంగా పేర్కొనవచ్చు. బాధాకరమగు విషయమేమిటంటే ఆయన కనీస మర్యాద, మన్ననలకు కూడా నోచుకోలేదేమో అనిపిస్తుంది.

ప్రపంచంలోని ఏ దేశంలోనైనా - విముక్తి పోరాట కాలంలో ప్రజాకంటక ప్రభుత్వం జాతీయ యోధులను వెంటాడి, వేటాడుతుంది. స్వాతంత్య్రము సిద్ధించైనా పిమ్మట అదే యోధులు స్వదేశంలో ఘన నీరాజనాలందుకుంటారు. కానీ స్వాతంత్య్రంవచ్చిన తదుపరి కూడా అట్టి మహానీయులగు జాతీయ వీరులను ప్రమాదకారులుగా పరిగణించి, వారి కుటుంబాల మీద నిఘా పెట్టే తప్పుడు పని చేయుటకు నాటి మన ప్రభుత్వమునకే చేల్లినదేమో!

ప్రజాస్వామ్య విలువలను, ఉదార భావాల మహానాయకునిగా గుర్తింపబడిన మాననీయ  నెహ్రూ గారు బోసు కుటుంబీకులకు, ఆయన సన్నిహితులకు వచ్చే ఉత్తరాలపై నిఘా ఉంచమని, వారి కదలికలను నీడలా వెంటాడమని కేంద్ర గూఢచారి దళాన్ని పురమాయించాడట. ఆయన నిష్ఠగా సాగించిన ఈ నిఘా యజ్ఞాన్ని ఆయన సుపుత్రిక ఇందిర కూడా 1971 దాకా యథావిధిగా నడిపించిందట. ఏ రాజకీయ లబ్ధిని ఆశించి, ఎవరిని సాధించడానికి అయితేనేమి పశ్చిమ బెంగాల్ ఏలిక మమతా దీదీ బయట పెట్టించిన ప్రభుత్వ రహస్య పత్రాల్లో ఈ గుట్టు కాస్తా రట్టు అయింది.

ఇక్కడో సందేహం సహజం.

నేతాజీ బోస్ 1945 ఆగస్టు 18నే ఫార్మోసా వద్ద విమాన ప్రమాదంలో మరణించినట్టు సర్కారు వాఋ ధృవపరచినారు కదా? ఆయన చితాభస్మమని చెప్పబడేదాన్ని టోక్యోలోని రెంకోజీ బౌద్ధ మందిరంలో భద్రపరచడమూ ఆ రోజుల్లోనే అయింది కదా? తమకు సింహస్వప్నమైన నేతాజీ మరణించినప్పుడు, ఆయన వలె రాజకీయాల్లోకి దూసుకొచ్చి తమకు తలనెప్పి తేగలవారూ ఆయన బంధువుల్లో ఎవరూ లేనప్పుడు నెహ్రు ప్రభుత్వం ఎందుకు భయపడింది? తమ మానాన తాము బతుకుతున్న సామాన్య కుటుంబీకుల కదలికల మీద ఎందుకు గూఢచర్యం జరిపింది?

వారిని చూసి కాదు బెదురు. అసలు భయం నేతాజీకి ఏమయిందన్న రహస్యం దేశవాసులకు ఎక్కడ తెలిసిపోతుందోనని!

1945 విమాన ప్రమాదంలో బోస్ మరణించాడన్న అబద్ధాన్ని 1956 నాటి షానవాజ్ ఖాన్ కమిటీ చేత, 1970 ఖోస్లా కమిటీ చేత నొక్కి చెప్పించినా బూటకపు విచారణలను ఎవరూ నమ్మలేదు. 1999లో కోర్టు ఉత్తర్వువల్ల సుప్రీంకోర్టు మాజీ జడ్జి మనోజ్‌కుమార్ ముఖర్జీతో ఏర్పాటైన విచారణ కమిషన్ విమాన ప్రమాదం అబద్ధం, ఆ తరవాత కూడా నేతాజీ బతికే ఉన్నాడు అని నిర్ధరించింది. కాని దాని నివేదిక వెలువడే సరికి ఎన్డీఏ సర్కారు పోయి యుపిఎ జమానా వచ్చింది. తమ ఇలవేల్పులను ఇరుకున పెట్టే నివేదికను మన్మోహన్ సర్దార్జీ బానిస ప్రభుత్వం ఎంచక్కా బుట్టదాఖలు చేసింది.

శత్రువుకు శత్రువు మిత్రుడని భావించి, దేశానికి బ్రిటిష్ పెత్తనం పీడ విరగడ చేయటానికి, బ్రిటన్ శత్రువులైన జర్మనీ, జపాన్‌లతో చేతులు కలిపి సాయుధ సమరం సాగించాలని నేతాజీ ఆలోచన. ఈ ప్రణాళిక మొదట్లో బాగానే సాగింది. కాని నాజీ హిట్లర్ నమ్మదగిన వాడు కాదని అర్థమయ్యాక, జపాన్ సైతం చిక్కుల్లో పడ్డాక వ్యూహాన్ని మార్చుకోవటం తప్పనిసరి అయింది. సోవియట్ యూనియన్‌ను ఆశ్రయించి, బ్రిటన్‌పై పోరుకు సహాయం పొందాలని సుభాష్ బోస్ ఆశించాడు. ఆ ఉద్దేశంతోనే విమాన ప్రమాదం మిషతో మాయమై రష్యా చేరాడు. వేగంగా మారిపోయిన సైనిక సమీకరణల్లో బ్రిటన్, రష్యాలు ఏకమయ్యాయి. మిత్రదేశపు రాజకీయ ప్రయోజనాలకు తగ్గట్టు నేతాజీని సోవియట్ నియంత స్టాలిన్ సైబీరియాలో నిర్బంధించాడు.

విమాన ప్రమాదంలో బోస్ మరణించాడని టోక్యో రేడియో చేసిన ప్రకటన అనుమానాస్పదంగా ఉంది. అతడు అజ్ఞాత వాసంలోకి వెళ్లదలచుకుంటే ఇలాంటి ప్రకటనే చేయిస్తాడని నా నమ్మకం. ఇంతకీ ఏమయిందో, అతడు ఎక్కడున్నాడో కనుక్కో’మని అప్పటి ఇండియా వైస్రాయ్ వేవెల్ తన హోం మెంబరును పురమాయించినాడు. ఆగ్నేయాసియాలోని బ్రిటిషు గూఢచారి దళం ద్వారా అతను సమాచారమును  రాబట్టినాడు. యుద్ధ నేరస్థుడిగా బోస్‌ను ఇండియాకు తీసుకొస్తే ప్రమాదం. ప్రజల సానుభూతి అతడికి దండిగా ఉంది. అతడిని ఉన్నచోటనే ఉండనివ్వటం మనకు క్షేమం అని హోం మెంబరు చెప్పగా, వైస్రాయ్ తల ఊచినాడు.

ప్రపంచ యుద్ధం ముగిసింది. ఇండియాలో అధికారం చేతులు మారింది. దేశవాళీ సర్కారు గద్దెనెక్కింది. విమాన ప్రమాదంలో నేతాజీ మరణం కట్టుకథ అని నెహ్రూ ప్రభుత్వానికి తెలుసు. బోస్ బతికే ఉన్నాడని గాంధీగారు కూడా చెబుతూనే ఉన్నాడు. కొత్త ప్రభుత్వం తలచుకుంటే నేతాజీని సైబీరియా చెరనుంచి విడిపించి స్వదేశానికి సగౌరవంగా తీసుకురాగలిగేదే!

కాని బోస్ వస్తే తమ పని ఖాళీ అని నవభారత నేతలకు తెలుసు. ప్రజాబలము కలిగిన అతడి ముందు వినాయకులగు ఈ నాయకులు  ఎదురు నిలవగలగటం కలలో మాట. కాబట్టి అతడిని ఉన్నచోటే ఉండనివ్వటం తమకు క్షేమమని తలచినారు. ఈలోపు అసలు సంగతి బోస్ బంధుమిత్రులకు ఎక్కడ తెలిసి పోతుందోనని భయపడి నేతాజీ సన్నిహితులందరి మీద గూఢచారులను పెట్టినారు. వారికొచ్చే ఉత్తరములను చించి, చదివి తమకు ఇబ్బంది కలిగించే లేఖలను రహస్యముగా దాచియుంచినారు. సైబీరియా ఖైదులో సుభాష్ బోస్‌ను తాను చూసినట్టు... ఆ వైనాన్ని రహస్యంగా ఉంచే షరతు మీద అధికారులు రష్యాలోని భారత రాయబారి కూడా ఆయనను చూడనిచ్చినట్టు సోవియట్ గూఢచారి సంస్థ కె.జి.బి.లో పని చేసిన వాడు ఒకడు తాను రాసిన పుస్తకంలో కొన్ని సంవత్సరాల క్రితమే బయటపెట్టినాడు. అప్పట్లో అదో పెద్ద సంచలనము. ఎవరెన్ని ప్రశ్నలు గుచ్చిగుచ్చి అడిగినా భారత సర్కారు నోరు మెదిపితే ఒట్టు.

ఎట్టకేలకు తుట్టతుదకు కట్టకడపటికి చిట్టచివరకు పాత ప్రభుత్వము ఎన్నికలలో కానీ ఎన్నికలలో ఓడిన తరువాత క్రొత్త ప్రభుత్వము ఒక్కొక్కటిగా బయట పెడుతూ వుంది. నేడు ఆ మహావీరుడు సహజ మరణము పొంది ఉండవచ్చును. భారత దేశము భూమిపై ఉన్నంతవరకు ఆయనను ఈ దేశము మరువదు,

స్వస్తి.