Friday, 13 September 2019

రామాయణ ముఖ ద్వారము


రామాయణ ముఖ ద్వారము
First Time Published On 7th April 2014 now revised


యావత్ స్థాంస్యతి గిరియః సరితశ్చ మహీతలే l
తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతిll
రామాయణ మహా కావ్యం శతకోటి ప్రవిస్తరంl
ఏకైకమక్షరం ప్రోక్తం పుంసాం పాతక నాశనంll
గిరులు తరులు ఝరులు ధరలో వరలినంత కాలం రామాయణ కథ ఈ లోకంలో ప్రచలితమై వుంటుంది.  శతకోటి ప్రవిస్తరమైన  ఈ మహాకవ్యములోని ఒక అక్షరం వల్లించినా జనుల పాతకములు పటాపంచలౌతాయి. రామస్య అయనమ్ రామాయణమ్. రమాయాః అయనమ్ రామాయణమ్. అయనమ్ నామ ఆధారమ్.
అయనము లేక ఆయనము అంటే ప్రయాణము.  అది రాముని యొక్క ప్రయాణమా   రాముని కొరకు ప్రయాణమా రాముని యొక్క ప్రయాణమైతే పరుడైన పరమాత్మ నరుడై ధర్మపరుడై పిత్రువాక్య తత్పరుడై అసురోత్పల (ఉత్పల=కలువలు) దివాకరుడై, వనచరుడై వనచరసహితుడై, జనహితుడై, జగన్మహితుడై మానవాళికి ఆదర్శప్రాయుడై నిలచిన నరుడు.
రాముని కొరకు ప్రయాణమైతే విష్ణుడై ప్రియహృచ్చరిష్ణుడై, సంపద్వరిష్ణుడై, వసుదైక జిష్ణుడై, యశోరోచిష్ణుడై, భక్తహర్షణుడై, వైరిధర్షణుడై, కృపావర్షణుడై, పరుడై, విశ్వంభరుడై, నిలచిన యా హరిని చేరుట.
అంటే రామాయణమన్న కత్తికి రెండువైపులా పదునే.  పరుడు నరుడై అవతరించి అవనికి ఆదర్శమై నిలచినాడు. తన విభూతులను అవతారసమాప్తివరకు ఎక్కడ చాటుకోడు.
ఆదికావ్యమై, అజరామరమై, ఆదర్శవంతమై, అత్యంత సునిశిత ధర్మ సంపన్నమై అనంత మానవాళి ఆర్తిని తీర్చి అచ్యుతుని పాదసన్నిధికి చేర్చే అద్భుత సాధనముగా రామాయణమును వాల్మీకి మహర్షి మలచినాడు.
ఎవరు ఈ వాల్మీకి? వాల్మీకి చరిత మనకు ఉత్తర కాండలో వస్తుంది.  స్కాంద పురాణాదులలో కూడా వాల్మీకి చరిత్ర వస్తుంది.  కానీ ఇచట తన కథ తనచే రచింపబడిన రామాయణము నుండే గ్రహిచుట జరిగినది.  వాల్మీకి పేరు రుక్షుడు.  నిజదారసుతోదర పోషణార్ధం వ్యాధుడై, మమకార వికారగ్రస్తుడై, మునుల దయతో భవబంధ పరాజ్ఞ్ముఖుడై  విలోమ “రామ” మంత్ర స్వీకృతుడై అకుంఠిత తపో దీక్షా దక్షుడై, శరీరమును విస్మరించి పరమేశ్వర ధ్యానమునందు మనసును సంధించిన వాడై, తన చుట్టూ వల్మీకము (పుట్ట) పెరిగినా, శరీర ధ్యాసను వదిలి ఆత్మను పరమాత్మకు అనుసంధించిన నాడౌత, ఆయన వాల్మీకి ఐనాడు. వరుణుని ప్రచేతసుడంటారు. ఆ వరుణుని అనుగ్రహముతో కల్గిన వర్షము వల్ల ఆయన ప్రాచేతసుడని కూడా పిలవబడియుండవచ్చును. దీని వాల్ల మనము గ్రహించినది ఏమిటంటే వాల్మీకి మమకారమునకతీతుడై, మనసునందు పరమాత్మ భావన నింపుకొన్న తరువాతనే ఆయన రామాయణ రచనకు యోగ్యుడైనాడు. అంటే రజస్తమోగుణ విముక్తుడై శుద్ధ సాత్వికుడైనాడు.
అటువంటి రామనామ మహిమ మాత్రమే తెలిసిన వాల్మీకిని తగిన వానిగా నెంచుకొని, రామ మహిమ గూర్చి జగతికి తెలియజెప్ప,ప్రేరేపించుటకు వచ్చినాడు నారదుడు.
నారదుడు ఎటువంటి వాడు అంటే
తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరంl
నారదం పరిప్ర ప్రచ్చ నాత్మకర్మునిపుంగవంll
అన్న ఈ శ్లోకం  వల్ల  తెలుసుకొనవచ్చు
నారదుడు బ్రహ్మజ్ఞుడెట్లైనాడు అంటే 'తపసా బ్రహ్మ జిజ్ఞాసస్య' అన్నారు పెద్దలు.  అందువల్ల ఆయనను  “తపస్వి” అని సంబోధించినాడు వాల్మీకి.  ఇక రెండో విశేషణము స్వాధ్యాయ నిరతుడు.  తండ్రియగు బ్రహ్మ నుంచి వేదములను గ్రహించి నిరతము మననము చేయుచునే వుండేవాడు.  వేదనాదము విష్ణువు.  విష్ణువును నిరంతరము జపించుట వల్ల ఆయన స్వాధ్యాయుడైనాడు.  ఇంకొక విశేషణం వాగ్విదాం వరుడు. వాక్కు అనగా త్రికరణ శుద్ధి కలిగిన మాట, 'విద్' అంటే వేదమును ఎరిగినవాడు, అంటే వేదముచే ప్రతిపాదింపబడిన ధర్మమును బ్రహ్మము కూడి భూమి పై నడయాడు నరజన్ముని గూర్చిన ఎరుక కలవాడు “వాగ్విదాంవరుడు”.  అందువల్లనే ఆయన సరియైన శిష్యుని వాల్మీకి రూపంలో ఎంచుకొన్నాడు.  అసలు నారము అంటే జ్ఞానము అంటే దైవజ్ఞత.  ద అంటే ఇచ్చువాడు. నరుడు అన్న పేరు భగవానునికి కుడా కలదని విన్నాను.  నారమే తానై యున్నవాడు నరుడే కదా. అంటే పరుడే కదా. నర శబ్దము మాత్రమె గైకోన్నచో జీవుడని అర్ధము. జీవుడు జ్ఞానియగువరకు అజ్ఞానియేకదా.  అంటే నరునియొక్క అజ్ఞానము నారమే కదా.  కావున నారమును పోద్రోలి నారమును గ్రహించి, నారమునకు ఆదియౌ నరుని యందు ఐక్యము గొనుటయే ఈ రామాయణ రచనా ఉపోద్ఘాతము.
రామాయణ ముఖద్వారము - 2
రామాయణమునకు మూడు పేర్లు గలవు.  1. రామాయణము 2. సీత చరిత్ర  3. పౌలస్య వధ. ఈ మూడు పేర్లు రామాయణమును మూడు ముక్కల్లో చెప్పినట్లు మనకు స్ఫురిస్తాయి.  రామాయణము అంటే దేవుడు, రాముడుగా భూమి పై వెలయుట, సీత చరిత్ర రామునికూడి సీత వనములలో చరించుట, పౌలస్య వధ అంటే రావణ సంహారము.  అంటే ఒక కావ్యానికి అందులోనూ ఆదికావ్యానికి ఇంత  భావస్ఫోరకమైన మూడు పేర్లను వుంచిన ఆ మహర్షిది ఎంతటి ప్రాజ్ఞత, ఎంతటి విజ్ఞత, ఎంతటి ఉపజ్ఞత, ఎంతటి సర్వజ్ఞత.  ఇక్కడ ఇంకొక అంతరార్ధము కలదు.  రాముడు పరమాత్మ, సీత మనసు, రావణుడు ‘వాసనా’ భరితుడు.  ఈ ప్రాపంచిక వాసనలు మనసును వశపరచుకో దలిస్తే మనసు చలించక తనయందు పరమాత్మనే నింపుకొని ఆయననే చేరుట అంతరార్ధము.  ఎందుకు రావణుడు వాసనా భరితుడు అంటే అసలు ‘రవము’ అంటే శబ్దము.  ఈ ప్రపంచం శబ్దమయము. దీనికి తోడు అతడు దశముఖుడు కుడా.'దశవారా విరాట్.'  విరాడన్నం అన్నది వేదం వచనం.  దశ దిశలా వ్యాపించిన ఈ విరాడ్రూపమైన జగత్తే కదా దశ ముఖుడంటే.  అది అసలు విషయం.

ఇక రామాయణ కావ్య రచనా ఉపక్రణమెట్లు జరిగినదో ఒక సారి పరిశీలించెదము.

వాల్మీకి మహర్షి యొకనాడు గౌతమాది శిష్య సమేతుండై సరయూ నదీ తీరంబునకు తన ప్రాతః సంధ్యాది విధులను నిర్వర్తించుకొన బోవు సమయంబున ఒక నిషాదుడు చెట్టు పైగల క్రౌంచ పక్షుల జంటను కొట్టగా మహర్షి శోకముప్పొంగి
  భూమిపై వెలసిన మొదటి శ్లోకమైనది.  ఇక ఆ శ్లోకమును విశ్లేషించి చూద్దాము.  మహనీయుల వాక్కులు ఎప్పుడునూ అప్రతిహతములు. అటువంటి వాక్కులు అనుకోకుండా వెలువడినపుడు వానికి అర్ధమేకాక అర్ధాంతరములు కుడా ఉండునని పండిత వాక్కు.  ఇపుడు ఈ శ్లోకములో గల  1.బాహ్యర్ధ  2.అంతరార్ధ  ౩.గుడార్ధాలను గమనించుదాము.
1.బాహ్యర్ధము:
నిషాద :  ఓరీ కిరాతకుడా త్వం=నీవు; పుతిష్టాం=లోకంలో నివసించడమనేది; శాశ్వతీసమాః = ఎన్నో ఏండ్ల; మాగమః = పొందలేవు; యత్ = ఎందుకంటే; క్రౌంచమిధునాత్ = క్రౌంచ పక్షుల జంట నుండి; ఏకం = ఒకదానిని; కామమోహితం = కామసుఖమనుభవించుచుండగా; అవధీః = వధించితివి.
కామ మొహితమైయున్న ఈ క్రౌంచ మిదునమునకదానిని వధించిన కిరాతకుడా! నీవు ఎక్కువ కాలము భూమిపై నిలువలేవు.
2.అంతరార్ధము:
మానిషాదః = ఓ శ్రీపతీ; త్వం = నీవు; శాశ్వతీసమాః = కలకాలము; ప్రతిష్ఠాం ఆగమ = లోకములో ప్రష్టను పొందితివి; యత్ = ఎందుకంటే; క్రౌంచమిధునాత్ = రాక్షస జంటనుండి; కామమోహితం = పరదారా కాముకుడైన; ఏకం = ఒకడిని; అవధీ = వధించితినవి.
ఓ శ్రీహరీ! రాక్షస జంటనుండి పరదారాకాముడైన యొకనిని వధించి జగతిన శాశ్వతమైన ప్రతిష్టను పొందితివి.
గూడార్దము:
మానిషాద = మాయాశక్తికి అధీనమైన ఓ జీవుడా; త్వం = నీవు; మానిషాద = మాయాజీతుడైనయా పరమాత్మ భావాన్ని; ప్రతిష్ఠాం ఆగమః = పొందగలిగితిని;   యత్ =  ఎందుకంటే; క్రౌంచమిధునాత్ = ‘ద్వాసుపర్నాసయుఔస్సఖాయా’ అంటే పక్షుల జంటను బోలిన జీవాత్మ పరమాత్మలతో; ఏకం కామమోహితం = ప్రాపంచిక సుఖాలపై మనసు  పడిన జీవాత్మయనుదానిని; అవధీ = వధించితివి; (బ్రహ్మ విద్య యను బాణముతో మనో ఏకాగ్రత యను ధనువునకు సంధించి) ఓ మాయ శక్తి కి అధీనమైన జీవుడా! ప్రాపంచిక  సుఖాలపై మోజు పడిన; జీవాత్మ  పరమాత్మయను పక్షుల జంటలోని యొక దానిని వధించి మాయాతీతుడైనయా పరమాత్మ భావాన్ని పొందగాల్గితిని.
చూచితిరికదా! ఎంతటి భావము, ఎంతటి భాష, మాటలో ఎంతటి  సంస్కారము.  తత్వమరసిన  ఆది కవి వాల్మీకి మహర్షికే ఇది సాధ్యము. అందుకే కాళిదాసు తన రఘువంశములో వాల్మీకి తో తనని పోల్చుకొంటాడు. 'ప్రాంశులభ్యే ఫలేలోభా   దుద్బాహురివవామనః' ఎత్తైన వ్యక్తికి చేతికందే ఫలాన్ని, పొట్టివాడు అందుకొన సాధ్యమా! అని అన్న కాళీదాసునిది ఎంత వినయము, ఎంత విధేయత, వాల్మీకి కవిపై ఎంత గౌరవమో చుడండి.  వాల్మీకి రామాయణముండగా  మళ్ళీ నీచంపూ రామయణమెందుకయ్యా?  అని భోజరాజును ప్రశ్నిస్తే ఆయన ఈ విధముగా సమాధానమిస్తాడు.  'గంగాజలైః భువి భగీరథ యత్న లబ్ధైః కింతర్పణం నవిదధాతి జనః పితౄణాం.'

అంటే గంగా జలాన్ని భగీరధుడే తెచ్చినా పుణ్య కార్యములకు ఆ నీటిని అందరు వాడుటలేదా అని తిరిగి ప్రశ్నించినాడు.  కానీ వాల్మీకిని భగీరధుడు  అన్నాడు భవభూతియైతే వాల్మీకిని బహువచనముతోనే సంబోధించి గౌరవించుటయే కాక ఆయనయొక్క అమృతమయమైన వాక్కునకు కూడా నమస్కరిస్తాడు.  ఇంతా జేసి అయన ‘కవి’ మాత్రమే.  కానీ నేడో ‘భావకవి’ ‘మధురకవి’ ‘విప్లవకవి’ ‘దిగంబరకవి’ ‘యుగకవి’ ‘వచనకవి’ 'తుత్తికవి' 'సుత్తికవి' యని తప్పించి నిర్విశేషణముగా ఉత్తి ‘కవి’ అనిపించుకొనేవారు  బహు అరుదు. అంటే ఆవిధంగా కూడా కవి యన్న పేరు గల్గిన వాల్మీకి కి మేము బహుదూరము అని నిరూపించుకొన్నారేమో.
మిగిలినది రేపు........
రామాయణ ముఖ ద్వారము- 3
అసలు రామాయణ ముఖద్వారము వద్దకు ఎందుకు పోవుచున్నాము రాముని తలచుటకు అంటే రాముని కోలుచుటకేకదా! మరి ఇపుడు రాముని గూర్చి పెద్దలచే విన్నంత కన్నంత, తెలియవచ్చినంత లోని తేటను మాత్రమే గ్రహించిన నేను నా శక్తి కి వంచన చేయకుండా తెలిపే ప్రయత్నము  చేస్తాను.

రామాయణ ప్రబోధమొక్కటే! పరుడే నరుడు నరుడే పరుడు.
 ఈ భూమిపైకి మహా విష్ణువు  రావణుని మానవ రూపములోనే వచ్చి వధించ వలయునని మునులు తెల్పగా తధాస్తు అంటూ ఆయనే “దశవర్శసహస్రాణి దశవర్ష శతానిచ వత్స్యామి మానుషే లోకే  పాలయన్  పృథివీమిమాం” అని పదకొండు వేల సంవత్సరములు భూమిపై మానవునిగ  నిలిచి పాలించెదనని హామీ ఇస్తాడు.  ఇక పుట్టినది మొదలు సరయూ నదిలో ఆత్మ త్యాగము చేసుకొను వరకు దేవునిగా తన విభూతులను ఎక్కడ ఏ పరిస్థితి లోను ప్రదర్శించడు.

రామాయణం ,తపస్వాధ్యాయనిరతం... 'తో మొదలౌతుంది.
 మహత్తరమైన ఈ ఇతిహాసాన్ని  ‘త’ తో మొదలుపెట్టుటయే  శుభ సూచకము.  'త కారో విఘ్న నాశాయ త కారో సౌఖ్యదాయకం' అన్నది ఆర్య వాక్కు.  పై శ్లోకమును గూర్చి ముందే  ముచ్చటించు కొన్నాము కావున పై శ్లోకములోని విశేషణములు కల్గిన నారదుడు వాల్మీకి యడిగిన ప్రశ్నలకు  బదులుగా చెబుతాడు.  వాల్మీకి ప్రశ్న ఏమంటే పురుషులలో ఉత్తముడై ఈ క్రింది పదునారు గుణములు కల్గిన వ్యక్తిని గూర్చి?  అసలు   పురుషులలో ఉత్తముడు పురుషోత్తముడే  కదా!  అంటే ఇంకో విధముగా పురుషోత్తముని లక్షణములు గల పురుషుని గూర్చియడుగుచున్నాడు.  ఆ లక్షణములేవియన
1.గుణవంతుడు, 2.వీర్యవంతుడు, ౩.ధర్మజ్ఞుడు, 4.కృతజ్ఞడు, 5.సత్యవాక్యుడు, 6.ధృడవ్రతుడు, 7. సుచరితుడు, 8.సర్వ భూత హితుడు, 9.విద్వాంసుడు, 10.సమర్ధుడు, 11.ఏక ప్రియ దర్శనుడు, 12.ఆత్మవంతుడు, 13.జితక్రోధుడు, 14.ద్యుతిమంతుడు, 15.అనసూయుడు,  16.సుదీరుడు.
అనగా యుద్ధమున కోపమే కల్గిన దేవతలనే భయపెట్టు వాడు.  ఈ పదునారు లక్షణములు గలవాడు శ్రీరాముడేయని  నారదుడు వాల్మీకితో అంటాడు.  ఈ పదునారు లక్షణములతో పదునారు కళలు గల చంద్రుని బోలి రామచంద్రుడైనాడు.  అని మనమనుకోవచ్చునేమో.
బ్రహ్మమొక్కటే... యన్న అన్నమయ్య మాటను మనము తీసుకొంటే బ్రహ్మ అను పదములో ‘ర’ ‘మ’ అను రెండక్షరాలను మనము అంతర్లీనముగా చూడవచ్చును.  ‘ర’ అంటే దావానలమై దహించేది.  అనగా మనలోని దుష్ట, దురహంకార, దురశాపూరిత సకల కామాళిని దహించి వేసి  ‘మ’ అనగా మనసును మహదానంద తుందిలితమై యోప్పారునట్లు చేయునది. అందుకే పరమ శివుడు ‘రామ’ తారక మంత్ర పరవశుడు.  రామ మంత్రము రామజననాత్పూర్వమే రాజిల్లు చుండినది.  రమింప జేసే తత్వము కలుగుట  వలననే రామాయణ నాయకుడు రాముడై, జగద్భిరాముడైనాడు. రామ శబ్ధములో ఇంకొక ప్రత్యేకత వుంది.  అక్షరమాలలో య ర ల వ లో  ‘ర’ రెండవ అక్షరము.  అదేవిధంగా ప ఫ బ భ మా  లో ‘మ’ ఐదవ అక్షరము 2 x 5 = 10.  కేనోపాయేనలఘునా’ అని పార్వతీ దేవి విష్ణు సహస్ర నామ ఉత్తర పీఠికలో అడిగితే ఈశ్వరుడు శ్రీ రామ రామ రామేతి... అని రామ రామ రామ మూడు సార్లంటాడు.అంటే   10x10x10=1000.  అందువల్లనే అదే శ్లోకములో... సహస్ర నామ తత్తుల్యం అన్నాడేమో!

రాముని దశావతారాలలో ఒక అవతారముగానే పరిగణింప బడినది.  ‘పరిత్రాణాయ... అని భగవద్గీతలో అన్నట్లు రామునిగా కూడా పదకొండు వేల సంవత్సరములు మానవుని వలె మాత్రమే జీవించి మానవులకు ఆదర్శ ప్రాయుడైన మానవుడు ఏ రీతిగా వుండవలె ననేది నిరూపించినాడు.  ఇక దీనికి వత్తాసు జయ విజయుల కథ. ఇది అందరికి తెలిసిందే.
మిగిలినది మళ్ళీ.............
రామాయణ ముఖ ద్వారము- 4
కానీ రాముడు కృష్ణుని లాగ  ఎటువంటి లీలలను చూపడు.  ఆయన మానవుని గానే వుంటానన్నాడు కాబట్టి ఆయన పదునారు లక్షణములతో సత్యవాక్పరిపాలన కూడా కలదు గదా.  ఆయన జితక్రోధుడు.  కోపము కావలిసినపుడు తెచ్చుకొంటాడు.  సముద్రుని విషయంలో అదే కదా చేస్తాడు.  సముద్రుని సేతుబంధనకు వసతి కల్పించమంటే మౌనము వహిస్తాడు సముద్రుడు. అది కూడా మూడురాత్రులు. తన కార్యము ఆలస్యమగుచున్నందువల్ల రాముడు కోపమును, సముద్రునిపై తెచ్చుకుంటాడు. అప్పుడు ఆయన లక్ష్మణుని తో ఈ విధముగా అంటాడు :
ప్రశమశ్చక్షమా చైవ  ఆర్జవం ప్రియవాదితా
అసామర్థ్యంఫలన్త్వేతే నిర్గుణేషు సతాం గుణాః
సత్పురుషులు మంచిగుణములు కలిగియుందురు. ఓరిమి,ఇంద్రియ నిగ్రహము,మనోవాక్కాయ కర్మలలో ఋజుత్వము,ప్రియ భాషనమును కలిగి యుందురు.అది వారి సహజ గుణము. కానీ గుణహీనులు వారి మంచితనమును చేతగానితనముగా భావిస్తారు. చూసినావా ఈ సముద్రుని గర్వము
ఆత్మా ప్రశంసినం దుష్టం ధృష్టం విపరిధావకం
సర్వత్రో త్సృశత దండం చలోక స్సత్కురుతే నరం
న సామ్నాశక్యతే కీర్తి రణ సామ్నాశక్యతే యశః
ప్రాప్తుం లక్ష్మణ లోకే స్మిన్జయోవా రణ మూర్ధని
క్రోధము లేకుండా ఎదుటివారి తప్పులను ఓర్చుకొనుచూ వారి మనసును అనుసరించి కపటము లేక ప్రియముగా మాట్లాడువానిని నీచులు అసమర్థుడని భావింతురు.ఎవడు తనను తానూ పోగాడుకోనుచూ , పరుల నిందించుచూ,
ఆవిధముగా వారిని తన కపటము మరియు వంచనకు గురిచేయుచూ నుండునో వానిని లోకము గౌరవిన్చును. గొర్రె నమ్మేది గోసాయిని కాదు కసాయినే కదా  ! సముద్రమును ఇంకింపజేసి దాటి ఈ సముద్రుని పోగరణచెదను . ఈ నీచునివడ్డ ఓరిమి చూపుత అవివేకమంటాడు శ్రీ రామ చంద్రుడు.
అప్పటికీ వారధి కట్టుకొని పొమ్మంటాడేకాని, బాలకృష్ణుని బుట్టలో మోసుకొని పోవునపుడు దారి వదిలిన యమునలాగా దారినివ్వడు సముద్రుడు.  ఇదంతా మానవుడు అనుకొంటే సాధించ లేనిది లేదు అని నిరూపించేటందుకే ఆ నరునికి తోడు దేవ ముని తాపసులను  తన వక్త్రము (నోరు) నుండి బయల్వెడలిన జాంబవంతుడు తోడు రాగా వీరంతా వాలి సుగ్రీవ హనుమన్నల నీల కుముద పనస గజగవయ గంధమాదనాదులుగ జన్మించి తమ తమ వర్గములతో  వానరులై భూమి నిండిపోయినారట. అంటే పరుడు నరుడైతే  పరివారము  వానరులైనారు.
విశ్వామిత్రుని అనుసరించే ఘట్టములో కుడా ఆ బ్రహ్మర్షి నుండి ఎన్నో విద్యలు  నేర్చుకొంటాడు.  తాను పరమాత్మయన్న స్పృహను దరిచేరనీయాడు. విశ్వామిత్రుడు “నృశంస మన్న శం సం వా  ప్రజారక్షణకారణాత్ పాతకంవాసీంరోషంవా కర్తవ్యం రక్షతా  సతా  రాజ్య భార నియుక్తానాం ఏష ధర్మస్సనాతనః”  యాగ రక్షణకు  నియమించబడిన  రాకుమారులు పాలిత రక్షణకు కౄరమేయైననూ, నిందింప దగినదైనను, పాపమేయైనను వెనుకాడక అట్టి కర్మలు చేసి తీరవలెనని  ‘తాటక సంహారమప్పుడు  తెల్పగా  రాముడు  ఆయనకు ఈ విధముగా  బదులిస్తాడు.
 పితుర్వచన నిద్దేశాత్
పితుర్వచన గౌరవాత్
వచనం కౌశికసస్యేతి
కర్తవ్యమనిశంకయా
గురువర్యా! మా తండ్రి గారైన దశరథుని ఆజ్ఞ వలన ఆయనపై గౌరవము వలన మీరు నిర్దేశించిన ఎడల స్త్రీ వధనైనను చేయగలనని అంటాడు.  ఆ విధంగానే చేస్తాడు.  రాముని ధర్మనిరతికి మెచ్చి తన వద్ద కలిగిన సకల శస్రాస్త్ర విద్యలన్నీ సమంత్రకముగా ఉపదేశించెను.  మానవునిగా గుర్వనుగ్రహమునకు పాత్రుడగుట తప్పించి పరాత్పరుడనైన  నాకే నేర్పించుచున్నాడే యనుకోలేదు.  యాగ సంరక్షణ సమయమున కూడా ఇంకా ఆ రాక్షసులు రాలేదే యని అడుగుతాడు.  ఇది చివరి రోజైన ఆరవ రోజు ఈ రాత్రికి వారు విజృంబింతురని తెల్పుటయూ, అటులనే వారు  విజృంబించుటయు రాముడు ఆగ్నేయాస్త్రమున సుబాహుని కుల్చుటయు, మానవాస్త్రమున శతయోజన దూరము గల్గిన సముద్రములోనికి మారీచుని విసరుటయు చేస్తాడు శ్రీరాముడు. తన దైవత్వమునే వుపయోగించియుంటే ఇంత రామాయణమవసరమేలేదు.  దేవతలే దిగివచ్చి నీవు సాక్షాత్తు నారాయణుడవంటే ఆయన ‘అత్మానంమానుషంమన్యే.'  అని తనను మానవునిగానే తెలియజేస్తాడు.

కైకేయి చేసిన పనికి ఆగ్రహోదగ్రుడై ఆమెను కొడతానని లక్ష్మణుడంటే నన్నెంతో వాత్సల్యముగా చూచుకొనే తల్లి ఇంత దారుణంగా ప్రవర్తించిందంటే 'యది భావోన దైవోయం' అంతా దైవ ప్రేరణే అంటాడు.  ఆ దైవము తానే మరియు ఆమె తోడ్పాటు లేకుంటే అడవి దారి పట్టేవాడా రావణుని తన కోలతో కొట్టేవాడా!  కృతయుగములో తాను విష్ణువుగా ధనుజుల గెలిచిన ధనుర్బాణాది మహాస్త్రములు అగస్త్యునినుండి పొంది మహర్షికి కృతజ్ఞతలు వ్యక్తము చేసుకొంటాడే తప్పించి నావి నాకే గదా వచ్చినాయన్న అహంకారాన్ని చూపడు.  ఆయన  అగస్త్యుని ఆశ్రమానికి పోయి అతిథి సత్కారములు ముగిసిన పిమ్మట  శరభంగ సుతీక్ష్ణకులను గూర్చి మరీ మరీ అడిగి వారి వద్దకు పోతాడు.  లోనఏమున్నా పైకిమాత్రం అంతా మానవ గుణమే.  అగస్త్యునివద్దకు పోవుటలోని మరొక  అంతరార్ధం చిత్రకూట నివాసం.  అగస్త్యమహర్షి సీతా రామ లక్ష్మణులను పంచవటికీ వెళ్లి అక్కడ వుండమని సలహాయిస్తాడు.  రాక్షస మయమైన ఆ ప్రాంతమున వారిని తుదముట్టించుటతో రావణ సంహారానికి నాంది పలుకవచ్చు.  లోపల ఏమున్నా పైకి మానవుడే. భార్య బంగరు లేడి కావలెనన్నపుడు కూడా అది మాయ అంటూనే తెచ్చియిస్తానంటు యలుదేరుతాడు.  తన ప్రవర్తనతో ఇక్కడకూడా తాను దైవమన్న  అనుమానానికి తావివ్వడు.  
మిగిలినది మరొకసారి.......
రామాయణ ముఖ ద్వారము-5   

ఒక సందర్భములో లక్ష్మణునితో కామతురుడయ్యు తనపై ఆవ్యయమైన అభిమానము కల్గిన తండ్రికి తనను అడవులకు పంపుటకు హేతువై ప్రాణ త్యాగమే చేయవలసి రావడం తన పాపానికి ప్రాయశ్చిత్తమని ఒక సాధారణ మానవుని లాగా మాట్లాడుతాడు. లంక ఎంత గొప్పగా వుంది అని లక్ష్మణుడంటే ఏ దేశము ఎంత గొప్పదైన 'జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి' అంటాడు.  అందుకే శత్రువైన మారీచుని చేతనే 'రామో విగ్రహవాన్ ధర్మః'అని కొనియాడబడుతాడు.
శరణాగతుడై వచ్చిన విభీషణునికి రక్షణ ఇవ్వవలదని ఒక్క హనుమంతుడు తప్ప అందరూ చెప్పినవారే ! కానీ రాముడు వారందరితో ఇతడు" 'రాఘవం శరణం గతః'శరణ్య శరణం గతః' అనినాడు.నాకు ఇతడు ఇకపై మిత్రుడే, శరణాగతుడు కూడా కాదు." అని నొక్కి వక్కాణించుతాడు. అసలు ఈ మాట చూడండి ఎంత సంస్కారవంతమైనదో!
సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే
అభయం సర్వభూతేభ్యో దదామేతద్వ్రతమ్మమ
ఒక్కసారి నేనే త్రాతనని నమ్మి, నేను నీవాడను అని శరణు కోరినవాని, సర్వ భూతములనుండి కూడా రక్షణ కల్పించుట నా వ్రతము. మానవ, దేవ, దానవ, పశుపక్ష్యాది సమూహముల నుండి ఎవరైనాసరే ఏవయినా సరే నా అభయమునకు అర్హులు. అసలు ' సకృత్ +ఏవ 'అనడములోనే అసలుమర్మము దాగివుంది.ఒక్కసారి 'రక్షమాం' అని దృఢమైన నమ్మకముతో అంటే చాలుఆయన రక్షకునిగా నిలుస్తాడు. అసలది ఆయన వ్రతము. కానీ మనది 'ఏరు దాటించితే ఎంగన్న' వ్రతము. భక్తీ, యోగము, తపస్సు ఎన్నివున్నా పరమాత్మ పై అచంచల విశ్వాసము అత్యంత ప్రాముఖ్యము. ఈ శ్లోకము సర్వులకూ సర్వదా పఠనీయము. శ్రీ రాముడు ఎంతటి మహానీయుడో చూడండి.పాశ్చాత్య పుస్తకాలలో ఇటువంటి కమనీయ గుణాభిరాముడు భూతద్దము పెట్టి వెదకినా దొరకడు.
 ఇంకొక ముఖ్యమైన విషయం :
ధర్మాత్మా సత్యసంధస్యరామో దాశరధిర్యధిః
పౌరుషేచాప్రతిద్వన్ద్వః శరైనంజహిరావణిం
ఈ మాటలనే మంత్రముగా జేసి రావణ కుమారుడైన ఇంద్రజిత్తు పైకి వదిలి అతనిని  కూల్చినాడు. అసలు ఈ మాటల సారాంశమేమి? అవి మంత్రమని మనమేవిధముగా చెప్పగలము. చంపేది లక్ష్మణుడు చచ్చేది మేఘనాథుడనబడు ఇంద్రజిత్తు. కానీ బాణము పై  ఆవాహన చేసిన మంత్రము రామునికి సంబంధించినది. అది విశేషము. అసలు ఈ విశేషములో గల విశేషము ఎంతో ముఖ్యమైనది ఒకటి ఉంది. ఈ శ్లోకములో మూడు  విశేషణములు రామునికి వాడబడినాయి. 1. ధర్మాత్మ 2. సత్యసంధస్య 3.పౌరుషేచ అప్రతిద్వందః, ఈ మూడిటినీ మన మూడవ కన్నుతో ఒకసారి చూస్తాము.
1. చెట్టు చాటునుండి వాలిని చంపినా వ్యక్తి ధర్మాత్ముడా?
2. తండ్రికి, ప్రజలకు యౌవరాజ పట్టాభిషేకమునకు ఇచ్చగించినట్లు తెలిపి తెల్లవారిన వెంటనే అడవులకు పోవుట సత్యసంధత అనిపించుకొంటుందా?
3. ఖరునితో యుద్ధము చేయునపుడు మూడడుగులు వెనుకకు తగ్గిన రాముడు పౌరుషమందు ఎదురులేనివాడా?

 పై మూడు ప్రశ్నలకు వీలయినంత క్లుప్తముగా వాల్మీకి రామయణము నుండి నేను అర్థము  చేసుకొన్న మేరకు జవాబు చెబుతాను.
ఇంకా ఉన్నది..............
రామాయణ ముఖ ద్వారము-6

1.   పై సందేహమును వాలియే రామునితో వెలిబుచ్చినాడు. దానికి రాముడిచ్చిన జవాబు  ఒక పర్యాయము చూద్దాము. శ్రీరాముడు వాలిని సంబోధించడమే ఆయన యొక్క పరిణతిని తెలుపుతుంది. ఆయన వాలిని వాలీ! నీవు వయసు వచ్చిన బాలుడవు. నేను  కాననలకు బయలుదేరు సమయమున భరతుడు రాజ్యము తనకు వలదని పట్టుబట్టినా, నేను తనకు నచ్చజెప్పి త్వం రాజా భారత భవ స్వయం వారాణాంఅహమపి  రాజరాట్ మృగాణాంll అని తెలిపినాను అందుచేత నేను ఆతని ఆదేశమును పాలించుచూ వన్యమృగ శాసకుడనైనాను. నీవే చెప్పుకొన్నట్లు నీవు మృగానివి, పైగా  రాజువైయుండి బ్రతికియున్న తమ్ముని భార్యను బలవంతముగా అనుభవించుచున్న వానివి. అందుచే దోషివి. అదికాక అగ్నిసాక్షిగా నేను సుగ్రీవ మిత్రుడను. రావణునితో  మైత్రి ఘటించిన నిన్ను నేను మిత్రునిగా చేసుకొని ధర్మమునకు కళంకము  నాపాదించలేను.  సుగ్రీవుడు నిన్ను శరణుకోరినా, రక్షించవలసిన రాజువైయుండి  కూడా  ఆతనిని ఉపేక్షించి వెడలగొట్టితివి. నీవు ఏదిఏమయినా తిర్యగ్జాతికి చెందిన  వాడవే. దూరమున ఉండుటచే నీ దృష్టి నాపై పడలేదుగానీ, నాబాణము నీ గుండెనే చీల్చినది, వీపును కాదు. కావున నాకేదోషము అంటదు అని  శ్రీరాముడు వాలికి తెలియజేసినాడు. అప్పుడు వాలికూడా పురుషోత్తమా నీవు ఏది పలికితివో అది వాస్తవము. నీచేత మరణించుట సంతోషదాయకము అని అసువుల బాసినాడు. ఈ మాత్రము చాలు శ్రీరాముడు వాలి విషయములో ధర్మ పథమును వీడలేదు అనుటకు.

2.    ఇపుడు రాముని సత్య సంధత గురించి పరిశీలిద్దాము. ముందురోజు   పట్టాభిషేకానికి తండ్రివద్ద ప్రజల సమక్షములో కూడా తన సమ్మతిని తెలిపినాడు, కానీ తరువాత రోజు కైకేయి స్వార్థము దశరథుని మేధోదిగ్బంధము చేయుటచే కుమారుని   అడవులకు పంప సమ్మతిస్తాడు. అసలు నాటి ధర్మము ప్రకారము 14 సంవత్సరములు  వనవాసము చేసిన రాకుమారుడు రాజ్యాధిపతియగు అధికారమును కోల్పోతాడు.  అందుకేనా అన్నట్లు కైకేయి 

నవ పంచచ వర్షాణి దండకారణ్యమాశ్రితఃl

చీరాజిన జటాధారి రామో భవతు తాపసఃll (2-11-27)

అని అంటుంది. ఆమె అన్నట్లే దండకారణ్య నివాసము తరువాత సమయము సీతాన్వేషణకే సరిపోతుంది. తండ్రి మొదట చెప్పిన మాట యగు పట్టాభిషేకమునకు రాముడు ఒప్పుకొన్నా కైకేయి మరియు తండ్రి ద్వారా అడవులకు పోవలెనను మాట విన్న తరువాత, ఆ మాటకే కట్టుబడుతూ, ఈ విధంగా అంటాడు.

   ధర్మోహి పరమోలోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితంl

   ధర్మ సంశ్రితమే తచ్ఛ పితుర్వచనముత్తమంll

   అంటే ధర్మముతో కూడిన సత్యము అత్యంత ఆచరణయోగ్యము. దశరథుడు రెండవ        పర్యాయము చెప్పిన మాటలో అట్టి ధర్మయుత సత్యము దాగి ఉన్నది కాబట్టి అదే తనకు యోగ్యమని చెబుతాడు. ఇక్కడ ఇంకొక విషయము ఉన్నది. సుమంతుడు రామలక్ష్మణ సీతలను రథమునందు కూర్చుండబెట్టుకొని పోతూవుండగా రథమును ఆపమని దశరథుడు సుమంతుని ఆదేశించుతాడు. రాముడు ఆపవలదని చెబుతూ, తిరిగీ పైన తెలిపిన శ్లోక భావార్తములో రథ చక్రముల సవ్వడి మూలమున వినిపించలేదని చెప్పమంటాడు అట్లు చెప్పకుండియుంటే తన తండ్రి అసలు మాట తప్పినవాదవుతాడు. పైగా తానూ ధర్మమార్గామును వీడి రాజ్యమునకై అర్రులుచాచినట్లవుతుంది. అందుకే రాముడు ధర్మముతో కూడిన సత్యమార్గమును అనుసరించినాడు.

3.  ఇక మూడవ మాట పౌరుషేచ అప్రతిద్వందః. ఖరునితో యుద్ధము చేయునపుడు 3 అడుగులు శ్రీరామచంద్రుడు వెనుకకు తగ్గినాడు అన్న అపవాదు. ఇద్దరు యోధుల నడుమ యుద్ధము జరుగబోవు క్షణమున యోధుడు ప్రత్యాలీఢ పాదమును ముందుంచి బాణము సంధించుటకు వెనకడుగు వేస్తాడు. అంటే ఒకే చోటున ఉన్న రెండు పాదాలలో కుడిపాదముతో వెనుకడుగు వేసి ఆపై ఎడమ పాదమును కుడి పాదము వద్దకు చేర్చి తిరిగీ కుడిపాదమును వెనుకకు వేయుటతో యుద్ధమునకు సన్నద్ధమైనట్లు ప్రస్ఫుటమౌతూవుంది. కావున ఆయన పౌరుషేచ అప్రతిద్వందుడైనాడు కానీ అన్యథా కాదు.

ఇంకొక మాట. పై మూల మంత్రములో శ్రీరామునికి దాశరథిఅన్న శబ్దము ఉపయోగించబడింది. కొందరు వెకిలిగా రాముడు 'పాయస పాత్రుడు' కానీ 'దశరథ జాతుడు' కాదు కదా అని అన్నారు. దశరథుని శక్తి ఆ పాయసములో నిక్షిప్తము చేయబడినదని నా బాల్యమున ధర్మానుసారులైన పండితులు చెప్పగా విన్నాను. ఆ యాగమే పుత్రకామేష్టి. దానిని గూర్చి, సమగ్రముగా జరిపించిన వశిష్ఠ మహర్షికే తెలియగలదు. రామాయణములో విడివిడిగా జరిగిన  ఈ ఉదంతముల నుటంకించిన వారికిఈ శ్లోకమే/మంత్రమే కనువిప్పు .

ఒకసారి పరికించండి. యుద్ధము జరిగేది లక్ష్మణ మేఘనాథుల మధ్యన. లక్ష్మణుడు బాణమును అభిమంత్రించినది రాముని పేరుపై. అప్పటికి ఉన్న యుద్ధ మంత్రములగానీ , లేక తన సుగుణ సంపదను,భాతృభక్తిని, మంత్రముగా చేసిగానీ వాడలేదు. అదిచాలు రాముడెంత గొప్పవాడు అని మనము తెలుసుకోడానికి, కువిమర్శకుల నోరు మూయించడానికి. పై శ్లోకము మంత్రము. కులాతీతమైన మంత్రము. తప్పక కంఠస్థము చేసి అనునిత్యము , ముఖ్యముగా మీ నూతన కార్యారంభములలో విధిగా, పైన చెప్పిన శ్లోకముతోబాటూ

 సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతేl

అభయం సర్వభూతేభ్యో దదామేతద్వ్రతమ్మమll

 అన్న శ్లోకము తో కూడా అనునిత్యము భక్తిశ్రద్ధలతో మననము చేసుకొనేది.

 

    ఈ ఒక్క మంత్రమే అన్నింటికీ జవాబుచెప్పింది. దీనిని మూల మంత్రమంటారు. ఎందువల్లనంటే ఈ మంత్రమునభిమంత్రించి లక్ష్మణుడు ఇంద్రజిత్తుపై వదలిన వెంటనే శిరస్త్రాణ, కుండలసహితమైన బంగారు కాంతులీను ఇంద్రజిత్తుని తల మొండెము నుండి తొడిమెను విడిచిన పండులా వేరుపడినది. ఈవిధంగా షోడశ గుణాకరుడైన రాముని గూర్చి, ఎంతైనా చెప్పుకొంటూనే పోవచ్చు.  రామాయణములో విడివిడిగా జరిగిన ఈ

ఉదంతముల నుటంకించిన వారికి ఈ శ్లోకమే/మంత్రమే కనువిప్పు .

మిగిలినది మరొకసారి........


రామాయణ ముఖ ద్వారము-7
బాలకాండ నుండి ఉత్తరాకాండ దాకా  మనము గమనించితే శ్రీ రామ చంద్రుడు ఏడు కాండలలోను ఏడు ధర్మాలు పాటించినాడు. బాలకాండలో శిష్య ధర్మం, అయోధ్యకాండలో పుత్ర ధర్మం, అరణ్యకాండలో క్షాత్ర ధర్మం, కిష్కింధకాండలో మిత్రధర్మం, సుందరకాండలో స్వామి ధర్మం, యుద్ధకాండలో వీరధర్మం మరి ఉత్తరకాండలో రాజధర్మం.  అడుగడుగునా అణువణువునా తాను మానవునిగానే నడుచుకొంటూ పదకొండు వేల సంవత్సరాలు ధర్మ ప్రతిష్ఠాతయై, ఆదర్శ మానవుడై, అరివీర భయంకరుడై, ఆశ్రిత రక్షకుడై, జితక్రోధియైన ఆ మహనీయుని ఎంత తలచుకొన్నా తక్కువే.
ఎందరో మహనీయులు రామాయణ గంగా ప్రవాహములో మునకలు వేసినారు.  నాలో వ్రాయవలయునన్న చపలతే కానీ చతురత లేదని తెలుసు.  ఈ గంగలో నేనూ ఒక మునక వేసినానని చెప్పుకొంటాను.
దాసరి తప్పలు దండముతో సరి.
వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే
పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం
తత్సత్
ఈ దిగువ మనః పూర్వకముగా చదివి తమ అభిప్రాయమును తెలియజేసిన పెద్దలకు నమస్కరించుతూ వారి ఆశీర్వాదమును ఈ క్రింద పొందుపరచుచున్నాను.


Ghorakavi Sreenivasa Venkata Subbarao Very good pl continue enlightening people though this is the threshold Narada laid the foundation with his teachings to Valmiki I think so. thank you
Varanasi Gangadhara Rao mee sradha,tapana maboti vandlaku tetatellamu mariyu mee akhuntitha deekshaku na namassulu;mee vopikaku thagina daiva krupa kalagalani sada bhagavanuni pradhhanaga vedukuntanu. nijam cheppalante mee postings chuseka books chadavadam thagginchenu,sir thanks for your dedicated service through facebook.please devise a method to uplift the havenots through this media,if possible,so that you can educate them for their betterment in their social life
తరువాత ఇంకా కొంత ........

రామాయణ ముఖ ద్వారము-8

ఇంత రామాయణము జరిగినది కదా! అసలిది ఎప్పుడు వాల్మీకిచే వ్రాయబడినట్లు?
వాల్మీకి అసలు పేరు రుక్షుడు. ఆటవికునిగా ఉన్న కాలములో నారద మహర్షి ఆయనకు కనువిప్పు కలిగించి విలోమ “రామ” మంత్ర దీక్షనొసగి 'వాల్మీకి మహర్షి’ని చేసినాడు. ఉత్తర రామాయణములో సీత వాల్మీకి ఆశ్రమము చేరుతుంది. ఆమె జనక జాత, అగ్ని పునీత, దివ్య చరిత, శ్రీరామంకిత సకల లోకారాధ్య దేవత సీత గా గుర్తించి ఆమెను తన పుత్రికగా  నెంచి తన ఆశ్రమములో ఉంచుకొంటాడు. ఆమె ఒకానొక రోజు తన భర్త చరిత్ర ఆచంద్ర తారార్కముగా నిలచిపోవునట్లు 'రామాయణమును వ్రాయమని చెబుతుంది. తనకంతటి  సామర్థ్యము కలదా అని తలపోయు సమయమున నారదులవారు వాల్మీకి ముందు నిలిచి, తగిన వాడవు నీవే నని తెలిపి, గురువుగా ఆజ్ఞ నొసగి రామాయణ రచనకు  పురిగొల్పుతాడు. అప్పుడు ఆయన చెప్పిన సంక్షిప్త రామాయనమునే ‘శత శ్లోకి రామాయణ’మని ప్రపంచములో నేటికీ నిలిచిపోయినది. మిగతా విషయములను ముందే  తెలిపినాను.
భవిష్యోత్తర పురాణము లోని  ఉమామహేశ్వర సంవాదములో ఈ శ్లోకాన్ని చూస్తాము.
చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం
ఏకైకమక్షరం ప్రోక్తం మహా పాతక నాశనం
రాముడు 11,000 వేల సంవత్సరములు పరిపాలించినాడు. మరి వాల్మీకి మహర్షి వ్రాసిన రామాయణము కలిగినది 24,000 వేల శ్లోకములే! పై శ్లోకము ప్రకారము ఆ శ్రీరామచంద్రుని జీవిత కథనము సంపూర్ణముగా వ్రాస్తే నూరుకోట్ల శ్లోకములౌతాయని పరమేశ్వరుడు పార్వతీ దేవికి చెప్పినట్లు తెలియవస్తూవుంది. అందుకే వాల్మీకి మహర్షి అత్యంత ముఖ్యమైన చారిత్రిక ఘట్టములను మాత్రమె తీసుకొన్నాడని తలువ వచ్చు. అందునా రామ పట్టాభిషేకముతో వాల్మీకి రామాయణము ముగిసినది అన్న ఒక వాదన లోకములో ఉన్నది. అది నిజమయితే మిగిలిన 10,960 సంవత్సరాల చరిత్ర మనకు తెలిసే అవకాశమెట్లు? ఈ ప్రశ్నకు జవాబే వాల్మీకి కాలములోని అనేక మహితాత్ములు తమకు తెలిసిన విషయములను తమ పేరునకు రామాయణము అన్న పదమును జోడించి గ్రంథస్థము చేసినారు. వాల్మీకి తోబాటుగా 108 మంది మహర్షులు రామాయణమును వ్రాసినారని
డా. మల్లంపల్లి మల్లికార్జున రావు గారి పరిశోధన ద్వారా తెలియవస్తూ వుంది. రావణ సంహరణానంతరము రాముడు అయోధ్య చేరి పట్టాభిషిక్తుడగు సమయానికి ఆయన వయసు 40 సంవత్సరములని పండిత పరిశోధకుల ద్వారా తెలియుచున్నది.
ఒక 4, 5, శతాబ్దముల క్రితము వ్రాసిన భాస్కర రామాయణము, రంగనాథ రామాయణము, మొల్ల రామాయణము, తులసీ రామాయణము, కంబరామాయణము మరియు ఇవికాక తాయ్ ల్యాండ్, కంబోడియా మలేషియా  మొదలగు దేశముల రామాయణాలు ఇంకా ఎన్నేన్నో రామాయణాలు ప్రక్కన ఉంచితే, ఒక వాల్మీకి మహర్షి కాలములో వ్రాసిన రామాయణాలే పుంఖానుపుంఖాలుగా ఉన్నాయి అని మనము పైన చెప్పుకొన్నాము.. అవి అన్నియు గూడా రాములవారిని గూర్చిన చారిత్రిక సత్యాలు తెలిపేవే! ఈ రామాయణముల ఆవిర్భావమునకు ఆ 100 కోట్ల శ్లోకముల రామాయణము ఆధారమేమో! నేడు మనకు అది కనిపించదు. ఈ విషయమై కొంత విశదముగా తెలుసుకొందాము. హనుమంతుడే స్వయముగా వ్రాసిన హనుమద్రామాయణము ఒకటి ఉన్నది. నేడు అందలి పూర్తి పాఠము అలభ్యము. 2, 3 వందల సంవత్సరాల క్రితము కూడా ఈ హనుమద్రామాయణము లభ్యమౌతూ ఉండేదట. ఇప్పుడు కొన్ని కొన్ని పుటలు మాత్రమే లభ్యమౌతూ వున్నాయని తెలుసుకొన్నాను. ఈ రామాయణములో ముఖ్యముగా వానరుల పుట్టుపూర్వోత్తరములు, వారి ఆహారఆచారవ్యవహారాలూ, పరిపాలనా విధానము, వారి విద్యలు, శక్తులు మొదలగు వాల్మీకములో లేని విషయములు చర్చించబడినాయి. అసలు ఈ వాల్మీకి రామాయణము కూడా బ్రిటీషు వారు పరిపాలించే కాలమున కోల్కతా, చెన్నై, ముంబాయి పట్టణ గ్రంధాలయము లందు లభించగా నాటి పండితులు వానిని పరిశోధించి పరిష్కరించి కోల్కతా ప్రతిని ఆలంబనగా తీసుకొని అచ్చు యంత్రము సహాయమున ముద్రించటము జరిగినది.
నాటి రామాయణములు లెక్కకు మిక్కుటములుగా ఉన్నా, ఆధ్యాత్మ రామాయణము లోని, ఒక విషయమును గూర్చి అతి క్లుప్తముగా తెలుసుకొందాము. ఇది వేదవ్యాసుడు బ్రహ్మాండ పురాణంలో 61వ అధ్యాయము నుండి రామకథను పార్వతీ, పరమేశ్వరుల సంవాదంగా రచించినాడు. ఇదే ఆధ్యాత్మ రామాయణముగా ఖ్యాతి చెందింది. వాల్మీకి రామాయణములో కథ, కథనాలు ప్రధానము కాగా, ఆధ్యాత్మ రామయణంలో తత్వ వివేచన ప్రధానము.
అందుగల, నాకు ముఖ్యమని తోచిన ఈ విషయమును గమనించండి. విశ్వామిత్రుడు,ఇతర మహర్షి గణముతో కలిసి తన యజ్ఞదీక్ష నిర్విఘ్నముగా కొనసాగించుటకై రామ రక్షణ బడయుటకు దశరథుని వద్దకు వస్తాడు. అప్పుడు ఆయన రాముడు ఏదో నిర్వేదములో ఉన్నట్లు పసికడతాడు. ఆ మాటే శ్రీరాముని అడుగుతాడు విశ్వామిత్రుడు. దానికి దశరథుడు, రాముడు గురుకుల దీక్ష ముగించి దేశాటనము చేసి వచ్చినప్పటినుండి దేనియందునూ శ్రద్ధలేక ఎంతో నిర్లిప్తతతో ఉన్నట్లు చెబుతాడు. దానికి విశ్వామిత్రుడు “దశరథా! నేను శ్రీరామచంద్రుని కదా అడిగితిని. తన నుండియే జవాబు వినగోరెదను” అన్నాడు. అప్పుడు శ్రీరాముడు చెప్పిన మాటను సూక్ష్మముగా తెలిపెదను. తన వంశములో వివస్వంతుడు, వైవస్వత మనువు, ఇక్ష్వాకుడు, నాభాగుడు, అంబరీషుడు, భగీరథుడు, దిలీపుడు, రఘువు, అజుడు మున్నగు అవకర పరాక్రములై అఖండ రాజ్య పాలనా విభాసితులై, ప్రజాక్షేమమే తమ ధర్మముగానేంచి పాలించిన వారు. ఇక తన తండ్రి దశరథుడు 13000 సంవత్సరములు పరిపాలించినాడు. మరి ఇందరు మహనీయులు పాలించి సమస్త సామ్రాజ్యమును సుభిక్షముగా ఉంచిన తరువాత తాను రాజ్యాధికారియై పాలించావలసినది ఏమున్నది. అట్లుకాక ప్రజలు నిరంతరమూ మానసిక పరివర్తన చెందుతూ తాము ధర్మ మార్గము వీడకుండా ఒక అదుపును ప్రజలు నిరంతరమూ కోరుటచే రాజు రాజ్య పాలన యొక్క ఆవశ్యకత తిరిగీ ఏర్పడుచున్నదా! తాను క్రమబద్ధముగా ప్రజాజీవనమును ఏర్పరచిన తరువాత తన పుత్రపౌత్రులూ తిరిగీ చేయవలసిన సంస్కరణలు అనేకములుంటాయికదా! ఈ విధులకు అంతము లేదా!  అన్న సందేహమును వెలిబుచ్చుతాడు. అప్పుడు విశ్వామిత్రుడు “శ్రీరామా ఇదే సందేహమును నేనూ మరియు వశిష్ట మహర్షి బ్రహ్మదేవుని అడుగగా ఆయన ఎంతో ఓరిమితో మాకు సందేహ నివృత్తి గావించినాడు. ఈ విషయమును సవిస్తరముగా వశిష్ట మహర్షి నుండి వినగాలవాడవు” అని చెబుతాడు. దానికి సహేతుక సమాధానము చెబుతాడు వశిష్టుడు. ఏమి చెప్పినాడు అన్న వివరణ నేను ఇక్కడ ఇవ్వబోవుట లేదు. ఇక్కడ మన దృష్టి సాధారణముగా పడని ఒక విషయమును గూర్చి చెబుతున్నాను. విశ్వామిత్రుడు రాముని ప్రశ్నించినాడు. బాలుడు కదా అని దశరథుడు జవాబిచ్చినాడు. అప్పుడు విశ్వామిత్రుడు తాను జవాబును రాముని ద్వారానే వినగోరుచున్నట్లు తెలిపినాడు.
మిగిలినది మరొకసారి..........
రామాయణ ముఖ ద్వారము- 9
8 లక్షల ఏళ్లకు పూర్వమే ఉన్న ఆ సంస్కారమును గమనించండి. అది రాజయినా తన హద్దు మీరితే గురుస్థానములో ఉన్న మహర్షులు వారికి తమ హద్దును నిర్దేశించినారు. మరియొక విషయము. విశ్వామిత్రుడు విషయము తనకు తెలిసికూడా తానూ చెప్పక వశిష్ఠ మహర్షిని అడిగి తెలుసుకోమన్నాడు. వశిష్టుడు ఈ విషయముల గూర్చి 3 దినములు శ్రీరామచంద్రునికి బోధ చేస్తాడు. ఈ ఇందుకు కారణాలు రెండు. 1. వశిష్టుడు తనకన్నా పెద్దవాడు. వయసులో, బ్రహ్మఋషిత్వములో. 2. ఆయన ఇక్ష్వాకు వంశ గురువు. కావున ఆబాధ్యత ఆయనదే! ఇది యే అనుక్రమణికను పాటించుట (Maintaining Protocolనాడు దీనిని సభామర్యాద అని పిలచేవారు) అంటారు. నాడు దీనిని సభామర్యాద అని పిలచేవారు. ఇటువంటి అనేక విషయములను మనము పరిశీలనాత్మకముగా మరియు పరిశోధనాత్మకముగా వివిధ రామాయణములను అనుసరించినట్లయితే తెలుసుకొన వచ్చును. కావ్య పరముగా ఇది 34 వేళా శ్లోకములు కలిగియుండగా ప్రతి శ్లోకమూ ఉపమాలంకారము కలిగియుంటుంది. మొదటి కావ్యమనుకొనే వాల్మీకి రామాయణ కాలమునాటి రామాయణములలో ఇంతటి కవితా వైభవము ఉంటే, ఈ సంస్కృత భాష, ఈ భారతీయ సంస్కృతి ఎకాలమునాటిదని లెక్కకట్ట సాధ్యమౌతుందా?
ఇదికాకుండా నారదుడు ‘శత శ్లోకి రామాయణము’ కాకుండా నారద రామాయణము వ్రాసినాడు. ఇంకా లఘు రామాయణము, బృహత్ రామాయణము, అగస్త్య రామాయణము, సార రామాయణము, దేహ రామాయణము, వృత్త రామాయణము, క్రౌంచి రామాయణము, భారద్వాజ రామాయణము, భారత రామాయణము, జైమినీ రామాయణము, శ్వేత కేతు రామాయణము, జటాయు రామాయణము, దేవీ రామాయణము, రవి రామాయణము, పౌలస్త్య రామాయణము అంటే రావణాసురుడు వ్రాసిన రామాయణము ( ఇందులో అధికముగా రాక్షస జన్మ వృత్తాంతములు, వారికి సంబంధించిన చరిత్ర ఉన్నాయి.) అసలు ఇన్ని రామాయనముల్;ఉన్నాయన్న విషయము ఆనంద రామాయణమున పొందుపరుప బదినదని డా. మల్లంపల్లి మల్లికార్జున రావు గారు 30 సంవత్సరములు చేసిన విశేష కృషి వాళ్ళ మనకు తెలియవస్తూ వున్నది. ఇవికాక ఇంకా ఆనాటి ఎన్నేన్నో రామాయణములు ఉన్నవి. ఆనంద రామాయణము వాల్మీకియే వ్రాసినాడని చెప్పబడుతూవున్నా తగిన ఆధారాలు లేవు. పైగా ఇందులోని ఎన్నో ఉదంతములు అవాల్మీకములు. ఇంకా ముఖ్యముగా సుగ్రీవామయనము విభీషణ రామాయణములు కూడా వున్నాయి. 16వ శతాబ్దము వాడు కావచ్చునని పండితులు చెబుతున్న సంత్ ఏకనాథ్ మరాఠాకు చెందినా మహాభక్తుడు. ఆయన వ్రాసిన ‘భావార్థ రామాయణము’లో పైన తెలిపినట్టి వివిధములగు 31 రామాయనములను తానూ చదివినట్లు వ్రాసినాడు.
మరి ఈ రామాయణములన్నీ ఉన్నాయా అంటే సందేహమే అన్నది మాత్రమే సరియైన సమాధానము. లేవు అని చెప్పుటకు వీలు లేదు. ఎందుకంటే మనదేశములోని అనేక అత్యంత సుప్రసిద్ధ గ్రంధాలయాలలో కట్టలు కట్టి దొంతరలుగా ఇప్పటికీ పెర్చియుంచిన గ్రంథములు అనేక లక్షలు. నేడు అంత శ్రమకోర్చగాలిగిన జిజ్ఞాసువులు లేరు, గురువులు లేరు, వీరిరువురూ ఉనారనుకొన్నా గ్రంథాలయములలో తగిన సిబ్బంది లేరు. 1787 లో
చక్రి వంశమునకు చెందిన మొదటి రాజు రామా-1 రాజ్యమును స్థాపించినాడు. ఆయన థాయి రామాయణ గ్రంధ కర్త. ఈ గ్రంధములో రామాయణ కాలము నాటి అనేక క్రొత్తవిషయాలు ఉన్నాయని తెలియవస్తూ వున్నది. ఇప్పుడు రామా-10 పారిపాలించుచున్నాడు. అమెరికా లోని పేరూ లో రామాయణము లభ్యము. ఆఫ్రికా లో రామాయణ గ్రంధము ఉన్నది. ఇట్లు చెప్పుకొంటూ పోతే ఎన్ని రామాయణాలో! ఈ ఒక్క విషయమే ఆయన లోకప్రియత, సార్వభౌమత్వమును చాటుచున్నాయి.
      విదేశీ పాలనక్రింద దాదాపు ఒక సహస్రాబ్దము ఉండిపోయినా కూడా వేద శాస్త్రములు కృశించినాయి గానీ, పురాణ, ఉపనిషత్తులలో ప్రక్షిప్తములు సంభవించినవి కానీ, రామాయణ భారత ఇతిహాసములు మాత్రము హరికథల రూపములోనో, ప్రవచన రూపములోనో, ఇండ్లలో తల్లులు తమ పిల్లలకు కథలరూపములో చెప్పుట వలననో తమ ఉనికిని ఏ పరిస్థితులలో కూడా పోగొట్టుకోలేదు. ఆయా మహర్షులు అంటే వాల్మీకి వ్యాసులు ఆచంద్ర తారార్కము భువిపై నిలుచునని చెప్పిన మాట ఎంతటి సత్యవాక్యముగా నిలిచినదో చూడండి. రామాయణమును గూర్చి స్కాందపురాణము ఎంతగా ప్రశంసించుతూ వుందో చూడండి. 
తదుపరి మరియొక మారు......  

Friday, 30 August 2019

మిలారేపా - ఒక మహనీయ టిబెట్ యోగి కథ

మిలారేపా (టిబెట్టుకు చెందిన అసమాన బౌద్ధయోగి)


మిలారేపా
మిలారేపా ఇది మనలో చాలామంది బహుశ వినని పేరు. కానీ మన ముందుతరము వారు ఈయనను గురించిన అనేక విషయములను మనకు సమగ్రముగా అందించినారు. వివరములు తెలుసుకొనుటకు ముందు స్వల్పముగా ఆయన గొప్పదనము తెలియజేస్తాను.
12వ శతాబ్దానికి చెందిన ఈ మహా యోగి బౌద్ధంలో కొత్త ప్రయోగములు చేయుటయే గాక  తద్వారా మోక్షమును సాధించిన ధర్మభిక్షువు ఈయన.
తనదైన పద్ధతిలో యోగ సాధనచేసి అమరుడైనవాడు. మిలారేపా గౌతమ బుద్ధుడంతటి జ్ఞాని. త్రివిష్టపము (టిబెట్) వారికి మిలారేపాయే అపరబుద్ధుడు. ధ్యానసాధనకు  కొత్త బాటలు వేసినవాడు మిలారేపా. పూర్వ జన్మల పాపాలన్ని ఒక జన్మలోనే నశిస్తాయని బోధిసత్వులు కావడం ప్రతి ఒక్కరికీ సాధ్యమన్నవాడు ఈ మహానుభావుడు. ప్రేమకు కొత్త నిర్వచనం ఇచ్చి యోగంలో స్త్రీలకు మహోన్నత స్థానం కల్పించినవాడు. మిలారేపా జీవితమునుగూర్చి తెలుసుకొనడము  మన అదృష్టము. ఆ మాటే కదా ఆంద్ర భాగవతములో పోతన్న మనకు తెల్పినది.
నీపాద కమల సేవయు
నీ పాదార్చకులతోటి నెయ్యము, నితాం
తాపార భూత దయయును
తాపస మందార నాకు దయసేయగదే
కావున మహనీయుల చరిత్రలు మనము తప్పక చదువవలసినవే! మన జీవితములో అవి ఎంత మార్పులు కలిగించుతాయో మనము తెలుసుకొనక ముందే తెలుపలేము కదా!
12వ శతాబ్దానికి చెందిన ఈ యోగి కథను శ్రీ శార్వరి గారు  మంచి ఆధ్యాత్మికానుభూతిని ఇవ్వగల గ్రంథముగా  మలిచినారు. లబ్ధప్రతిష్ఠులగు ఎక్కిరాల భరద్వాజ గారు కూడా వీరి చరిత్రను విస్తారముగా వ్రాసినారు.
సాధకులకు ఈ యోగి ఆత్మకథ ఆవశ్య పఠనీయమన్న విషయయము ముందే తెలుపుకొన్నాను. బుద్దుని బోధనలుధ్యాన సూత్రాలు ‘మహాముద్ర’గా టిబెట్‌లో అందిపుచ్చుకున్న వారిలో ‘మార్ఫా\మార్వా’ ఈ ‘మిలారేపా’కు గురువు.
దక్షిణ టిబెట్‌లో ఓ కుగ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన ‘మిలారేపా’ తండ్రి మరణంతోసాటి బంధువుల ఈసడింపులకు గురియైతల్లి మాట మీదప్రతీకారం తీర్చుకోవడానికై క్షుద్ర విద్యలు అభ్యసిస్తాడు. అయితే తదనంతరంతన దృష్కృత్యాల వల్ల జరిగిన నష్టాల్ని చూసిఆత్మ విచారణ చేసిచైతన్యంపొందిసన్మార్గంలోకి వస్తాడు.
ఉద్రేకము ఉరకలువేసే యవ్వనంలో తన మంత్రశక్తితో వడగళ్లవాన కురిపించిపంటచేలను నాశనం చేసిగ్రామస్థుల్ని భయభ్రాంతులను చేసిన వ్యక్తే. 83 ఏళ్ల వయసులో - ఆ గ్రామస్తులకే ‘ఆరాధ్య దైవ’ముగా మారిన సద్గురువు - ‘మిలారేపా’.
భౌతిక దశలో గురువు సహాయ సహకారాలు అవసరంగానీసాధన తీవ)తరమైఅంతః చైతన్యము ఆవిష్కృతమైన దశలోగురు చైతన్యంలో తన చైతన్యం కలిసిపోయిఒక మహా చైతన్యంగా పరిణమిస్తుందని ‘మిలారేపా’ కథ మనకు చెబుతుంది. ఒకసత్యాన్వేషి సాధనాక్రమాన్నిమనకళ్ళముందుంచుతుంది. శిష్యుల మానసిక స్థితిగతులను బట్టి సద్గురువు నిర్దేశించే పద్ధతులుంటాయనికూడా ఈ రచన చెబుతుంది. ఆత్మజ్ఞానం ఎవరికివారు పొందవలసిందే. ఈ ఒక్క మానవ జన్మలోనే జన్మ జన్మల కర్మశేషాలు విదుల్చుకుని మనము జన్మరహితులకావచ్చని మిలారేపా కథ ప్రబోధిస్తుంది.
నేను ఈ మిలారేపా చరిత్రను ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారు రచించిన ‘టిబెట్ యోగి’ మిలారేపా చరిత్రను చదివినవాడనయినందున నాదయిన రీతిలో వ్రాసి మీ ముందుంచుచున్నాను.
మిలారేపా గారి శిష్యుడైన ‘రేచుంగ్’ నకు సమాధి స్థితిలో మిలారేపా గారు దర్శనమివ్వగా ఆయనను సమగ్రముగా తన జీవిత చరిత్రను తెలుపమని అర్థించుట జరిగినది. అందుకు సమ్మతించి ఆయన స్వయముగా తెలిపిన తన చరిత్ర మనకు మహనీయులు ఎక్కిరాల భరద్వాజ గారు, తెలుగులో రేచుంగ్ ద్వారా చెప్పించినారు.
మిలారేపా పూర్వులు క్షుద్రవిద్యా ఉపాసకులు. ఆయన పూర్వులలో ఒకరు, ఎవరూ వదిలించలేని దయ్యాన్ని ఒక వ్యక్తికి వదిలిన్చినపుడు అది ‘మిలా’ మిలా’ అని అరుస్తూ వెళ్ళిపోయిందట. అందువల్ల మిలారేపా పూర్వీకులు ఆ ఉదంతము తరువాత ‘మిలా’ అన్న పేరుతో ప్రారంభించి నామకరణము జరుపుకొనేవారు. ‘మిలా’ అంటే మానవుడు అని అర్థమట.
మిలారేపా తండ్రికి తండ్రి అంటే తాతగారు జూదములో సర్వస్వము పొగుట్టుకొని కుమారుడు దోర్జీ సింగ్ మిలా మరియు  సంసారముతో వీధినబడినారు. ఆతను తనకు తెలిసిన క్షుద్రవిద్యల సహాయముతో పంటలను నాశనము చేయబోవు వడగళ్ళ వానలను  దారి మళ్ళించి ఆ పొలముల స్వంతదారులు ఇచ్చే డబ్బుతోనూ చిన్న పిల్లల బొమ్మలు తయారుచేసి వానిని అమ్మి వచ్చే డబ్బుతోనూ కుటుంబ పోషణము చేసేవాడు. తరము మారింది. ఆయన కాలమైపోయినాడు.
ఇప్పుడు ‘మిలారేపా’ తండ్రి ఇంటిని నడుపుతున్నాడు. ఆయన తల్లిపేరు ‘కాల్మోయాస్’ అంటే తెల్లని దండ అని అర్థమట. 1052 ఆగస్టు 25న మన కథానాయకుడు జన్మించినాడు. పిల్లవాని ఏడుపు విని ఆతని తండ్రి ‘తోపగ’  ‘తోపగ’ అని అరచినాడట. తోపగ అన్న మాటకు శ్రావ్యమైన కంఠము అని అర్థము.   తరువాత కొంత కాలానికి ఆదంపతులకు ఒక కుమార్తె పుట్టింది. ఆమె పేరు ‘గొంగిట్’ అయినాకూడా, నోరు తిరుగనందువల్ల మన మిలా ఆమెను ‘పేటా’ అని పిలిచేవాడు. దోర్జీ తండ్రి సంపాదనా విధానమును అనుసరించక ఉన్ని దుప్పట్లు శాలువలు తయారుచేసి అమ్మేవాడు. అనతికాలములోనే ఐశ్వర్యవంతుడైనాడు. ఎప్పుడు సంపద గల్గిన అప్పుడు బంధువులు వత్తురన్న సామెతగా అయిన వారెందరో వారి ఊరు చేరి వారి ఇంటిచుట్టూ తమ తమ శక్తికొలది ఇళ్ళు కట్టించుకొని ఉండి, తమకవసరమైనపుడు ఆయన నుండి అన్ని విధములా సహాయము పొందజొచ్చినారు. మిలారేపా బాల్యము ఆనందముగా గడిచే సమయములో ఆయన తండ్రి తీవ్రమైన అస్వస్థతకు గురియైనాడు. బాల్యముననే మిలా కు ‘జేసే’ అనే అమ్మాయితో వివాహము నిశ్చయంయ్యింది. కానీ ఆయన ఆమెతో అంటీ ముట్టనట్లు తిరిగేవాడు. ఇంతలో ఆయన తండ్రికి, ఆరోగ్యము దినదినమూ క్షీణించుటచే మరణమాసన్నమైనది. తనకు తమ్ముని వరుస అయ్యే అతను అతని భార్యకు తన ఆస్తిని అప్పగించి తన భార్యను పిల్లలను జాగ్రత్తగా చూచుకొమ్మని, అబ్బాయి యుక్త వయస్కుడయిన తరువాత ఆస్తి అప్పజెప్ప,మని  అసువులు బాసినాడు. అమిత దుర్మార్గులగు ఆ దంపతులు ఆయన చెప్పినవన్నీ మరచిపోయి ఆ సంసారమును అష్టకష్టముల పాలుజేసి ఆస్తిని అసాంతమూ సొంతము చేసుకొన్నారు. అది చాలదన్నట్లు మిలా కుటుంబమును  పడరాని ఇడుముల బడవేసి పరిపరి విధముల హింసించినారు.
మిలారేపా తల్లి లోని సహనమును, ఒక విధముగా, వారు చంపివేయుటతో  ఆమెకు మార్గాంతరము తోచక, మొదటి నుండీ క్షుద్రవిద్యలతో సంబంధమున్న కుటుంబము కాబట్టి, మిలా తో ఈ దుర్మార్గులు పెట్టె కష్టాలను ఇక భరించలేము నీవు తగిన గురువు వద్దకుచేరి క్షుద్రవిద్యలు సంపూర్ణముగా నేర్చుకొని వారిని మట్టుబెట్టు’ అని చెప్పింది. ఆ బాలునికి తగిన పైకమును, తనకు కానుకగా తన అన్న ఇచ్చిన అర ఎకరము పొలమును అమ్మి, చేత పెట్టినది.
తగిన గురువును సంపాదించుకొనుటయే గాక క్షుద్రవిద్యలన్నీ సమగ్రముగా నేర్చుకొన్నాడు వడగళ్ళను దారి మళ్ళించి పంటలను పాడు చేయుట మరియు పంటలను కాపాడుట అనబడు విద్యతో గూడా! ఆ శక్తితో తమకు విరోధులయిన వారినందరినీ సమూలముగా మట్టుబెట్టినాడు. తన పిన్నమ్మ, చిన్నాయనాలు తనకెంత ద్రోహము చేసినా వారి ఆస్తులను నాశానముచేసి వారిని ప్రాణములతో వదిలిపెట్టినాడు.
కొంతకాలము గడిచింది. మిలారెపా మేనమామ అండదండతో మరియు ‘జేసే’ ఆమె తల్లిదండ్రుల సహాయముతో రోజులు సజావుగా సాగిపోతూ వచ్చినాయి. ఒకానొకరోజు మిలారెపా ఇంకా క్రొత్త క్రొత్త విద్యలు నేర్చుకొనుటక అమ్మ అనుమతిని గ్రహించి, ఆమెచే కొంత డబ్బు తీసుకొని, ఒక పేరుపొందిన గురువు వద్దకు ప్రయాణమైనాడు. ఆయనను చేరి మెప్పించి అనుంగు శిష్యుడైనాడు.
ఒకనాడు గురువు వేరు ఊరిలోనున్న తన మిత్రుడు అవసాన దశలో ఉన్నాడను వార్త వస్తే అతనిని చూచుటకుపోయి, అతను మరణించగా ఎంతో నిర్వేదముతో వెనుదిరిగి వచ్చినాడు. దుఃఖము చేత ఖిన్నుడైన ఆ గురువు మిలా తో ‘నాయనా! నీవు వయసులో ఉన్నవానివి. కష్టమునకు ఒర్చుకోగల శక్తి కలిగినవానివి. క్షుద్ర విద్యలు మనకు పాపమును చేకూర్చేవే కానీ పరమాత్మ దర్శనమునకు పనికి రానివి. అందుచే ఒక సద్గురువును ఆశ్రయించు. నీజన్మ చరితార్థముచేసుకొని అందలి సారమును నేను బ్రతికి ఉంటే నాకూ తెలియజేయి’ అని జ్ఞాన బోధ చేసినాడు. ‘నార్’ అన్న ప్రాంతము క్రొత్తగురువు నివాస స్థలమని చెప్పి ఒక ‘యాక్’ ను ఉన్ని దుస్తులను మిలా కు ఇచ్చి ఆ గురువునకు బహుమతిగా ఒసంగుమని చెప్పి పంపినాడు.
ఆయన ‘నార్’ వెళ్లి గురువును చేరి తెచ్చిన బహుమతులనిచ్చి మంత్రోపదేశము పొందినాడు, కానీ ఒకరోజు ఆగురువు “తోపగా!(మిలాకు తండ్ర చేసిన నామకరణము) నీవు నన్ను మించిన సాధకుడవు అన్నది నాకు తెలిసిపోయినది. అందుకే నేను నిన్ను ఒక మహా గురువు వద్దకు పంపుచున్నాను. ఆయన భారత దేశపు యోగీశ్వరుడయినా ‘సరోపా’ గారి శిష్యుడు. ఆయనను ‘మార్ఫా’ అంటారు. మీ ఇరువురిదీ గతజన్మ సంబంధము. కావున తక్షణం నీవు ఆయన వద్దకు వెళ్ళుము” అని ఆదేశించినాడు.
గురువు చెప్పిన విధముగానే ఎంతోప్రయాసకు ఓర్చి, ఎన్నడూ పొలమునకు పోని మార్ఫా తగిన ఆహారమును అతిథికి కూడా భార్యతో  చేయించుకొని పొలములో వుంటే , గురువును కలసినాడు. మిలా, మార్ఫా గారిని గూర్చి అడిగితే “ముందు నీవు ఈ పొలము దున్ని ఈ ఆహారము తిని, నేను ఉన్న కుటీరమునకు వస్తే నీకు మార్ఫాను చూపుతా” నన్నాడు. మిలా అలాగే చేసి ఆ కుటీరము లోనికి వెళ్లి అక్కడ కూర్చున్న మహనీయుని అప్రతిభుడై చూసినంతనే ఆయన “నేనే మార్ఫాను, ఇప్పుడు నమస్కరించు” అన్నాడు. నమస్కరించిన తరువాత తన చరిత్ర దాపరికము లేకుండా చెప్పి తనకు ‘అద్వితీయ మంత్రోపదేశము’ మరియు ‘వసతి’ ని కోరితే ఆయన ఎదో ఒకటే ఇస్తానన్నాడు. మిలా ‘మంత్రోపదేశమే’ కోరినాడు. వీరి సంభాషణ విన్న గురుపత్ని మిలాకు అండగా నిలిచి ఆహారము ఎదో ఒక విధముగా మిలాకు పెట్టి, భర్త ఆమోదముతో వారి ఇంటనే ఉండజేసింది.
ఇక అక్కడి నుండి మిలా కష్టాలు మొదలైనాయి. గురువు, మిలాతో తన శత్రువుల ఉనికిని జెప్పి వారిపై ప్రతీకారము తీర్చి రమ్మన్నాడు. అవి చేసినతరువాత మళ్ళీ వారిని బ్రతికించి తన కుమరుని కొరకు ఒక స్థలము చూపించి ఇల్లుకట్టమన్నాడు. అది పూర్తి అయిన వెంటనే అక్కడ కాదు అని వేరొక దిక్కునకు పిలుచుకు పోయి అది చూపినాడు. ఈ విధముగా ఇల్లు కట్టడము పడగోట్టడము చేయుటచే శక్తికి మించి శ్రమించిన మిలాకు తొడల మూలమున వీపు మీద గడ్డలు కట్టి నడచుటయే కష్టతరము చేసినా గురువు చెప్పుట మానలేదు.
చివరకు గురుపత్ని జోక్యముతో 10 అంతస్తుల మేడ మొదటి స్థలములో కడితే ఉపదేశము చేస్తానన్నాడు. ఏడంతస్తులు కట్టిన తరువాత పక్క స్థలము చూపించి 10కాళ్ళ మంటపము కట్టమన్నాడు. అదయిన తరువాత తాను శిష్యులకు ఉపదేశము చేయు రోజున రమ్మన్నాడు. మిలా అందరి వెనకల చేరి కూర్చోగానే మార్ఫా తనకు తెచ్చిన బహుమతి చూపమన్నాడు. ఏమీ తెలేదంటూనే తన్ని తరిమివేసినాడు. పదే పదే అవమానాలు దండనలు మిలా భరించేది చూడలేక, మార్ఫా సతి మిలాకు, మార్ఫా గురువగు సరోఫా, మార్ఫా కు, ఇచ్చిన కంఠమాలను మరియు  ఉంగరమును భర్తకు తెలియకుండా ఇచ్చుటయే గాక, తన భర్త వ్రాసినట్లు, ఆతని చేతివ్రాతను అనుకరించుతూ ఒక ఉత్తరమును వ్రాసి, అతనిని ‘గోగ్ డన్’ అన్న తన భర్త యొక్క అతిముఖ్య శిష్యుడు, గురువు వద్ద సమగ్రముగా మంత్రోపదేశము పొందినవ్యక్తి వద్దకు పంపింది. అందులో స్పష్టముగా మిలా కు ఆత్మా విద్య నేర్పమని ఉంది. ‘గోగ్ డన్’ ను అంతకు మునుపు ఒకసారి గురువును చూడ వచ్చినపుడు, మిలా అతనిని చూసియుండినాడు.
గోగ్ డన్ కూడా చూసియుండుటచే ఆతనిని శిష్యునిగా అంగీకరించినాడు.
ఇక్కడ మార్ఫా ఇంటివద్ద, మిలాను గూర్చి ఆయన తన భార్యను వాకబు చేస్తే ఆమె బహుశా మీ పోరు పడలేక వెడలిపోయినాడేమోనని చెబుతుంది. నావద్దకు రాకుండా వాడు ఎక్కడికి పోతాడో చూద్దాం అని, అని మౌనముగా ఉండిపోయినాడు.
ఇక్క గోగ్ డన్ కూడా మార్ఫా వలెనే మిలాను పరీక్షింపనెంచి తనకు ద్రోహము చేసిన మూకను, మిలా క్షుద్రశక్తులచే చంపమన్నాడు. గురు వాక్యమును త్రుణీకరించలేక  అట్లే చేసి పరితాపముతో “గురువుగారు మంచి మార్గము లో పోవలసిన నేను మళ్ళీ చెడుదారి తోక్కుచున్నాను” అని అన్నాడు. అప్పుడు గోగ్ డన్, ఇది నీకు పరీక్ష మాత్రమే! చూడు ఆ మరణించిన పక్షులు రెక్కలల్లార్చుతూ ఎంచక్కగా ఆకాశములోకి ఎగిరి పోతున్నాయో ! అట్లే నీచేత చంపబడిన మనుషులు జంతువులు కూడా నిదురించి లేచినట్లుగా తమ తమ పనులు చేసుకొంటున్నారు అని అన్నాడు.
మిలాను శుచియై వచ్చి తన వద్ద కూర్చోనమని ఉపదేశము చేసి, గాలి ఆడుటకు గోడకు ఒక చిన్న తూము గలిగిన గుహ చూపించి తిండితో అందులో ఉండి గొళ్ళెము వేసుకొని సాధన చేయమన్నాడు. ఎంత సాధన చేసినా మిలాకు ఫలితము దక్కలేదు. గోగ్ డన్ కు సందేహము కలిగి మిలాను నిగ్గదీసినాడు. ఉన్నదంతా మిలాచెప్పివేయుటతో ఇకపై విద్య నేర్పే గురువులతో ఇటువంటి ఆటలాదవద్దు అన్నాడు. అంతలో మార్ఫా నుండి గోగ్ డన్ కు, తన కొడుకు ఉపనయనమునకు  శిష్య సమేతముగా రమ్మని ఆహ్వానము వచ్చింది. గోగ్ డన్ మిలాతో కూడా అందరుశిష్యులను తీసుకొని బయలుదేరినాడు.
ఊరి పొలిమేరలకు వచ్చిన తరువాత మిలాను మార్ఫా వద్దకు వెళ్లి ఆహారము, నీరు, బీరు (అక్కడి వాతవరణమునకు బార్లీ పంట ఎక్కువ కావున వారు దానితో చేసిన బీరును త్రావుట ఒక సంప్రదాయముగా పాటీంచుతారు.) తెమ్మని పురమాయిచినాడు. ఇష్టము లేకున్నా మిలాకు పోవ తప్పలేదు.
ఆతడు మార్ఫా గారి గృహమునకు వెళ్లి గుట్టుగా గురుపత్నిని కలసినాడు. అప్పుడామె “గోగ్ డన్ ఉత్తముడు, కానీ ఇప్పుడు గురువుగారికి నీవు వచ్చిన విషయము తెలిపితే అగ్గిపి గుగ్గిలమౌతాడు. అందుకే గోగ్ డన్ చెప్పినవి తీసుకొని నీవెంట నేనే వస్తానని చెప్పింది. వారించినా వినకుండా, గోగ్ డన్ చెప్పిన వస్తువులు తీసుకొని అతనితో బయలుదేరింది.
వారి భోజనము,విరామము ముగిసిన తరువాత అందరు బయలుదేరి మార్ఫా వద్దకు చేరుకొన్నారు. భార్య ద్వారా విషయము తెలుసుకొని అటు ఆమెకూ ఇటు గోగ్ డన్ కు కావలసినంత వడ్డించి తన కోపమును చల్లార్చుకొన్నాడు మార్ఫా.
తదనంతరము పిచ్ఛాపాటీ లో  మొదట ‘నాకేమి తెచ్చినావు, గురువు వద్దకు రిక్త హస్తములలతో రాకూడదని తెలుసు కదా!’ అని అడిగినాడు గోగ్ డన్ ను మార్ఫా. ‘ఒక కుంటి మేకను తప్ప నా సర్వస్వము తెచ్చినాను’ అని అన్నాడు గోగ్ డన్ . ‘అది నిర్ణయించ వలసినది నీవు కాదు, నేను’ అన్నాడు మార్ఫా అధికార స్వరముతో. పొరబాటును క్షమించమని ఎంతో వినయముతో  ఆయనకు విన్నవించి తన ఊరికి పోయి ఆ మేకను భుజముపై వేసుకొని తెచ్చినాడు గోగ్ డన్. మార్ఫా ‘నాకు ఇఒది ఎందుకూ పనికిరాదు, కానీ నీ శిష్యులకు గురుభక్తి అంటే ఏమిటో నిన్ను చూసి తెలుసుకోనుతకిట్లు చేసితిని’ అన్నాడు మార్ఫా. ఆ తరువాత ఏవేవో మాట్లాడుతూ, మార్ఫా మిలాను గూర్చి అడిగినాడు.
గోగ్ డన్ మిలా ద్వారా తాను తెలుసుకొన్నదంతా చెప్పినాడు.
కుపితుడైన మార్ఫా ‘వానిని నీ వద్దకు పంపలేదు. నాసా గురువు సరోఫా నాకు ఇచ్చిన ఆ అమూల్యమైన వస్తువులు నేను పంపలేదు. వాడు వచ్చియుంటే వానిని నా ముందు నిలబెట్టు’ అన్నాడు మార్ఫా. మిలాను చూస్తూ కోపముతో కంపించిన మార్ఫా నిజాయితీగా నిజము చెప్పమన్నాడు. భయ విహ్వలుడైన మిలా చెమటచే నానిపోయిన శరీరము కలవాడై వాస్తవము చెప్పుచున్నంతలో రాబోవు ఆపద గ్రహించిన గురుపత్ని దేవుని గదిలోకి వెళ్ళి లోపలి తలుపును బిగించుకొంది. మార్ఫా తో, ఆమెను తానేమీ అనను, అన్నంతవరకు తలుపు తీయలేదు. ఆయన నేరుగా దేవుని మంటపము వద్దకు చేరి నిమేరేలిత నేత్రుడై ధ్యానముద్రలో భగవంతుని ఆరాధించి, ప్రశాంత చిత్తుడై భార్యతో కూడా బయటికి వచ్చినాడు గోగ్ డన్. మిలా, మొదలైనవారంతా కూర్చున్నచోటికి.
అప్పుడు అందరినీ ఉద్దేశించుతూ ఈ విధముగా చెప్పదొడగినాడు. “కోపము నిప్పుతో సమానము. అది తననూ కాలుస్తుంది ఎదుటి వారినీ కాలుస్తుంది.మరి నేనట్టి కోపమును అంతంత గా అందరిపైన ముఖ్యముగా  తోపగా పైన చూపుచూ వచ్చినాను. ఎందుకు అంటే ఆ కుంకకు ఈ జన్మలోనే దైవసాక్షాత్కారము కలుగావలేనని నా పట్టుదల. వాడు చేసిన పాపకర్మలు సామాన్యమైనవి కావు. మరి ఆ పాపము ప్రక్షాలణమైతే తప్ప వాడు వాడు నావద్ద దీక్ష పుచ్చుకొనుటకు అర్హుడు కాదు. అందుకే వానిని ఎన్నోమార్లు ఇళ్ళు కట్టమనటము, ఇంకా ఎన్నో విధములుగా హిమ్సిన్చాతము, జరిగినది. వాడు నావద్దకు రాకముందే నాగురువు సరోపా కలలో కనిపించి, నాకు ఎనలేని ఖ్యాతి తెచ్చే శిష్యుడు వస్తున్నాడు అని చెప్పినాడు. వాడు కానుకగా తేబోయే వస్తువులలో రాగిపాత్ర తనకెంతో ప్రియమైనది అని కూడా చెప్పుట జరిగినది. అందుకే ఆ పాత్ర చూడవలెనన్న తహ తహ తో వాడు వచ్చిన వెంటనే నాకొరకు ఏమి తెచ్చినావని అడిగినాను. వాడు నాకు తాను తెచ్చినవన్నీ అందించినవెంటనే రాగి పాత్రను తీసుకొని దైవమందిరమునకు దానిని తీసుకొనిపోయి దేవుని ముందు దీపము వెలిగించుటకువాడే పరిశుద్ధమైన వెన్నతో నింపి అక్కడే ఉంచినాను.
వాడు జ్ఞాన ప్రాప్తికి చిన్నవాడు. అందువల్ల తన వయసుకు తగిన విధముగా నానుండి, విసుగు చెంది, పోదలచినాడు. వానికి నా భార్య అండదండ లభించుటతో ఉరకల పరుగుల మీద నీవద్దకు చేరినాడు. ఇక నా భార్య విషయమా! ఆమెది మాగురువుగారి వస్తువులను ఇచ్చుతలోగానీ, నా దస్తూరి తో గోగ్ డన్ కు లేఖ వ్రాయుటలో కానీ తప్పులేదు. ఆమె వానిని మొదటి చూపులోనే వానిని తన పుత్రునిగా స్వీకరించింది. మరి తల్లికి కొడుకుపై మమకారము ఉండుట సహజమే కదా! ఇక గోగ్ డన్ ను కుంటిమేక తెమ్మని ఎందుకన్నానంటే అంతనూ ఎంత ఆదర్శప్రాయమన శిష్యుడో తక్కిన వారాలకు చూపదలచుకొన్నాను. గురువుగా తానొక గొప్ప స్థానములో ఉంటూకూడా నాకు శిష్యుడే అన్నది నిరూపించి ఆదర్శ ప్రాయుడై నిలచినాడు. కావున ఇంతవరకూ జరిగిన విషయములలో ఎవరిదీ తప్పులేక పోగా తమ తమ విధులు చక్కగా నిర్వర్తించినారు. తోపగా లోని తృష్ణ లోకానికి తెలియబడినది. నేటినుండి వానికి నా బోధన మొదలౌతుంది.” అని చెప్పినపుడు మిలా ముఖము సూర్యుని జూచిన సహస్రదళ కమలము వలె వికసించినది.
ఆ మాట వింటూనే మిలాకు ఆనందముతో ఆకాశమునంటినట్లయ్యింది.
“గురుదేవా మిమ్ము మనసులో అప్పుడప్పుడు కష్టముల కోర్వలేక తప్పుగా తలచినాను. నా తప్పును మనసారా క్షమించండి. నా ఉన్నతిని కోరేవారేవరున్నా వారంతా మీ తరువాతనే! మీరుమీ పత్నియగు నాకు అమ్మ గారునాకు చేసిన సహాయానికి నేను మీ అడుగుజాడలో నడచి జీవన్ముక్తి సాధించి మాత్రమె మీ ఋణము తీర్చుకోగలను. నేను వ్రేమీ చేయనూలేనుఎదో వంతుకు ఒక బహుమతి ఇచ్చి నా బాధ్యత దులుపుకోనూ లేను. నేను బుద్ధునికిసంఘానికిధర్మానికి నా దీక్షనునా భావ చిత్తములను సమర్పణ చేసిఅష్టాంగా మార్గములో ముక్తిని సాధించుతాను. ఇది త్రికరణ శుద్ధిగా నేను మీ పాదములంటి జేయు ప్రమాణము.”
తరువాత రోజు ఉదయము మిలాకు నవోదయము. గురుబోధ మొదలయ్యింది.
గువాజ్ఞ ప్రకారము  గురు గృహము వద్దనే వారు చెప్పిన ప్రకారము ఒక గుహను నిర్మించుకొని గాలి నిరంతరము వచ్చు విధముగానూఆహార పదార్థములను అందివ్వవలసి వచ్చినపుడు ఇవ్వగలిగిన తీరుగానూ తగిన ఒక కిటికీ నిర్మించుకొనిగురుపత్ని మనసారా నాకందించిన ఆశిస్సులతో ఆహారముతో గుహలో చేరిపోయి  సాధనను ప్రారంభించినాడు.
గురు దీక్ష లభించినది మొదలుగా మిలారేపా తన సమయమునంతా ఆయన ఆజ్ఞ ప్రకారమే గడుపదొడగినాడు. ఒకనాడు మార్ఫా గారు తన ధ్యానమునుండి బాహ్య ప్రపంచాములోనికి వచ్చి మిలాతో గంభీరముగా నీవు సంపాదించిన జ్ఞానముతో నీవు ధ్యానమగ్నునివి కాలేకుండా ఉన్నావు. నీవు కైలాస శిఖరముజేరి నీద్యానమునచట కొనసాగించమని ఉపదేశము చేసినాడు. మిలా తన శిష్యగణముతో అచటికి 1093 లో బయలుదేరినాడు. ఆయన కైలాస పర్వతమును పశ్చిమ దిశనుండి అధిరోహించ దలచినాడు. మొదట వచ్చే గుల్రాసేహీ అన్న ప్రాంతము చేరినాడు. అచట ఆయనకు దేవతలు ఆతిధ్యమిచ్చినట్లు చెప్పబడినది. తిన్నగా మానస సరోవరము వైపు నడవసాగినాడు ఆయన తన శిష్యులతో. చేరిన పిమ్మట ఆయనకు నారోవాన్ చుమ్ అన్న బాన్ మతస్థునితో పరిచయము అయ్యింది.
కుశల ప్రశ్నలు ముగిసిన పిమ్మట చుమ్ ప్రశ్నకు జవాబుగా మిలా తాను కైలాస శిఖరము చ్వ్హెర సంకల్పించినట్లు తెలిపినాడు. దానితో అది బాన్ మతస్తులకే సాధ్యమన్న వితండ వాడములోనికి దిగినాడు చుమ్. అంతటి తో ఆగక బ్రాహ్మీ ముహుర్తములో బయలుదేరి సరిగా సూర్యుడు ఉదయించు సమయమునకు ఎవరు చేరుతారు అన్న పందెము కాసినాడు చుమ్. మిలా కూడా అందుకు అంగీకరించినాడు. చుమ్ వేకువనే లేచి తన సాధనా శక్తితో వడివడిగా శిఖరము చేరదొడగినాడు. మిలా మాత్రము తన శిష్యుడు వచ్చి లేపెవరకూ నిడురపోతూనే ఉండినాడు. శిష్యుడు ఆతనిని లేపి విషయము వివరించినంతనే ఆతను శిఖర పాదమును జేరి తన అసాధారణమైన యోగ శక్తితో శిఖరముచేరి ఉదయార్కుని వెలుగురేఖలను తన శరీరమునకు సంతరించుకొని సూర్యునికి కృతజ్ఞతా పూర్వకముగా నమస్కరించి ఒక మంచు పేళ్లను భూమిపైకి విసరి తిరిగి స్వస్థానము చేరినాడు. పరాజితుడైన చుమ్ తన ఓటమిని అంగీకరించి నమస్కరింపగా, తానూ విసరిన మంచుపెల్ల ఒక మంచుగుట్టయై దర్శనమివ్వగా, చుమ్ తో నీ ఇకపై అక్కడ ఉంది కైలాస శిఖర దర్శనము చేసుకొంటూ నీ ధ్యానము సాగించుమని తెల్పినాడు. ఆయన తన శిష్యులతో ఇకపై ఎవరూ ఆ ఉన్నత శిఖరము జోలికి పోవాడ్డు అని చెబుతూ, అట్లు మొండిగా పోయిన వారు తిరిగీ రారు అనికూడా తెల్పి, తన ధ్యానమును గురువు తెల్పిన నిబంధనల ప్రకారము ముగించుకొని తిరిగీ గురువును చేరినాడు. (Obtained from roar.media)
మార్ఫా యజ్ఞము చేసే సమయములో ఎవరో దేవతా స్త్రీలు వచ్చి, తన గురువు సరోఫా గారు చెప్పిన, అప్పట్లో అర్థము కాని కొన్ని విషయములు గుర్తుచేయగా, తదనంతరము కొంతవరకు ఆ విషయములు అర్థము చేసుకొన్నా మార్ఫా భారత దేశములోని తన గురువు సరోఫా వద్దకు బయలుదేరినాడు. ఆయన గురువు వద్ద ఉన్న సమయానికి ఇక్కడ మిలాకు కూడా కలలో ఒక దేవత కనిపించి అతను ఇంకా ‘డోగ్ జగ్’ అన్న ఒక యోగవిద్యను  నేర్చుకోనవలసియున్నట్లు తెలియజేసింది.
మిలా గురువుగారినుద్దేశించి ఈ విధముగా చెప్పినాడు "నిన్నటి రాత్రి నాకొక కల వచ్చినది. అందులో మన ఊరికి ఉత్తరముగా ఉన్న కొండపై నేను నిలబడి ఉన్నాను. ఆ శిఖరము ఆకాశాస్మునంతినడా అన్నంత ఎత్తులో ఉంది. పర్వతము నాలుగు వైపులా జలపాతములున్నాయి. ఆ నాలుగు నదులూ సముద్రములో కలుస్తూ ఉన్నాయి. ఆ సాగారతీరమున పూదోటలు వికసించిన పూలతో కళకళలాడుతూ ఉన్నాయి. ఆ పర్వతమునకు గల తూర్పు శిఖరములపై అమితమగు జూలుభయంకరమగు గోర్లు ఉన్న  ఆ సింహము ఆకాశము వైపు చూస్తూనిల్చుంది. కాసేపట్లు తిరిగిన తరువాత ఆ శిఖరమునుండి దిగి పర్వత సానువులలో అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. దక్షిణ శిఖరముపై ఒక ఆడ పులి కనిపించింది. అది అటూఇటూ తిరుగుతూ హటాత్తుగా ఆకాశము వైపు ఎగిరింది. పశ్చిమ శిఖరము పై వాలియున్న గ్రద్ద సముద్రపు అలలయంత విశాలమయిన రెక్కలనల్లార్చుచూ ఆకాశామువైపు చూస్తూ వుంది. అది ఉన్న స్థలమును ఆనుకొని యుఇన్న గూట్లో దాని పిల్లలున్నాయి. అది కాసేపు ఆవిధముగా పైకి చూస్తూ చూస్తూ ఎగిరి పోయింది.” ఇదీ నాకు వచ్చినకల అన్నాడు.
ఆ స్వప్న వృత్తాంతము విన్న మార్ఫా అమితానందభరితుడై తన భార్యతో షడ్రసోపేతమగు వంటలను చేయమన్నాడు. ఆమెకు ఆ మాట చెప్పి ఆ స్వప్న వృత్తాంతమును తన శిష్యులకు ఈవిధముగా చెప్పదోదగినాడు. మిలా అయితే తన గురువు చెప్పేది అమితమైన శ్రద్ధతో ఆలకించ సాగినాడు.
మార్ఫా అక్కడ గుమి కూడిన వారినందరినీ ఉద్దేశించుతూ మిలా కు వచ్చిన కలయోక్క వివరణ ఈ విధముగా ఇవ్వదొడగినాడు “ తోపగా కు వచ్చిన కలలో ఉత్తరమున బౌద్ధము ఒక మహాపర్వతమువలె నిలచియుండగా అందు ఉన్న అత్యున్నత శిఖరము త్రివిష్టపము(టిబెట్) అని తెలుపుతూ వున్నది. అక్కడ కనిపించిన పర్వతము నేను ఏర్పరచిన సాంప్రదాయము. మీరంతా ఆ సాంప్రదాయమునకు చెందినవారే! ఆ పర్వత శిఖరము ఆకసమునంటుట  ఈ సాంప్రదాయము ఎంతటి ఉన్నత ధర్మాలు కలిగివుందో  తెలుపుతుంది. దాని చుట్టూ తిరుగుతున్న సూర్య చంద్రులు జ్ఞానమునకు వాత్సల్యమునకు గురుతులు. వాటి కాంతి భూమిపై వ్యాపించడము ఈ ప్రపంచముపై వేదజల్లబడే భగవంతుని కృపకు చిహ్నము. ఆ పర్వత మూలము భూమిని ఆక్రమించుకొనుట మన సాధనా సంపత్తిని ప్రపంచమునందు విస్తరించుతాను తెలియజేయుచున్నది. ఇక తోపగా చూసిన ఆ నాలుగు నదులు భగవంతుని చేరుటకు  పెద్దలచే నిర్దేశింపబడిన నాలుగు ముఖ్య మార్గములు. ఆ సముద్రమే భగవంతుడు. ఆ సముద్రపు ఒడ్డున ఉన్న పూల చెట్లు సాధకునిచే గ్రహింపబడిన విషయములు.
ఇక తూర్పున కనిపించిన సింహము ‘పిరటన్ వాంగి’. అతను సింహస్వభావుడు. ఆతను గోళ్ళను భూని పట్టియుంచడము ఆయన పట్టుదలను తెలుపుతుంది. ఎక్కువగా ఉన్న ఆ సింహపు జూలు ఆయన నేర్చిన అగణిత విద్యలకు సంకేతము. యధేచ్చగా సంచరించుట ఆయన బంధములను అతిక్రమించినాడు అంటే బంధముక్తుడు అన్న విషయము తెలుపుతుంది.
దక్షిణదిశలో ఉన్న ఆడపులి నా పోరాస్తమ శిష్యుడు ‘గోగ్డన్-చు-డోర్’. అతను ఆడపులి వంటి మనస్తత్వము కలిగినవాడు. అంటే తనను నమ్మిన శిష్యులను తన అక్కున చేర్చి కాపాడుకొనుటయేగాక వారికి, తనకు తెలిసిన విద్యనంతటినీ నేర్పువరకు వదిలిపెట్టడు. ఆయన ఒంటిపై కనిపించే చారలు ఆయన సాధించిన ఆధ్యాత్మిక సత్యములు. గోళ్ళను భూమిలోనికి క్రుచ్చి యుండుట  బోధిసత్వుని నాలుగు ధర్మములను గ్రహించినటువంటి తన పట్టుదలను తెలియజేస్తాయి. ఆపులి ఆకాశమును చూచుట అతనికి లౌకిక విషయములపై ఉన్న విరక్తిని తెలుపుతుంది.
ఇక పశ్చిమమున రెక్కలను విశాలముగా విప్పార్చియుంచిన గ్రద్ద ‘మొటాన్ నోఫా’. విప్పారిన ఆరెక్కలు అతను సాధించిన ఆధ్యాత్మిక సత్యములు. ఇక ఉత్తహర దిశగా ఉన్న రాబందే మన ‘తోపగా’. ముందు ముందు ‘గాంగ్ తాంగ్’ ప్రాంతములో స్థిరపడి ‘మిలారేపా’ గా ప్రసిద్ధిగాంచనున్నాడు. ఆ రాబందు ఏర్పరచుకొన్న రాతినివాసము వలె శాశ్వతము కానున్నది. ఆ గూటిలోని పిల్లలు అతనికి ఉండబోయే అశేష శిష్య సంపదను తెలియజేస్తుంది.ఇది ఆ స్వప్న వృత్తాంతము” అని ముగించినాడు. మిలా సంతోషానికి అంతు లేదు.
ఎందుకో మార్ఫా కు తన నలుగురు శిష్యులకు ఈ ఈ ఆధ్యాత్మిక విద్యలు తగియున్నాయో తెలుసుకోవలెనను తలంపుతో ధ్యానమగ్నుడైనాడు. అందు ఆ నలుగురూ తమకు తగిన శాఖలనే ఎంచుకొని సాధన చేస్తున్నారని తెలుసుకొన్నాడు. అందు మిలా ‘తు-ము’ అన్న సాధన చేస్తున్నట్లు తెలుసుకొనుటయే గాక అది అతనికి తగినదని ఆయన తెలుసుకొన్నాడు. అది సాధకునియండలి అగ్నితత్వమును ఉద్దీపితము చేస్తుంది. ఆ సాధనయే మిలా కు ‘రేపా’ అన్న పట్టము కట్టినది. రేపా అంటే ‘నూలు వస్త్రములు ధరించేవాడు’ అని అర్థము. పై యోగ్యతను సాధించినవారే ఆ వస్త్రములను ధరించుతారు. ఆవిధముగా ఆ మహానుభావుడు ‘మిలారేపా’ అయినాడు. గురువు అందరికీ వారి వారి సాధనకు తగిన గ్రంధాలను ఇచ్చి సాధన చేయమన్నాడు.
మిలా తానూ ఏర్పరచుకొన్న గుహలో తీవ్ర సాధన చేస్తూవుండగా తన తల్లి మరణించినట్లు, తన ఇల్లు పాడుబడినట్లు, తన చెల్లెలు బిచ్చగత్తెగా మారి ఊర్లు పట్టుకొని తిరుగుతూ అడుక్కుతింటున్నట్లు కలగనాడు. తన తల్లిణి చూడవలేనన్న బలమైన కోరికను ఆపుకోలేక తాను కట్టుకొన్న గుహను బద్దలుకొట్టి బయటికి వచ్చినాడు. ఇంకా బ్రాహ్మీ ముహూర్తము జరుగుతూవుంది అంటే ఇంకా సూర్యోదయము అగుటకు కొంత సమయము పడుతుంది అన్న మాట. మిలా గురువు పడుకొని నిడురించుచున్న ప్రక్క వద్దకు చేరి తనగోడు చెప్పుకోన దొడగినాడు. చివాలున లేచిన మోఫా ముఖము ఎంతో కాంతివంతముగా ప్రకాశింపజొచ్చినది. అప్పటికే లేచిన గురుపత్ని తినుటకు పదార్థములను పట్టుకు వచ్చినది. శిష్యుని చూసిన వెంటనే కోపపడిన మోఫా శాంత చిత్తుడై దంతదావనాదులు గావించుకొని వచ్చి ఆహారమును తీసుకొమ్మన్నాడు. ఆహార్తము తీసుకొంటూ వుండగా విషయమును అడిగినాడు మోఫా. మిలా తనకు తనగ్రామము చేరి ఇల్లును తల్లిని చూడవలెనని అనిపించుచున్నదని చెప్పినసాడు. అప్పుడు ఆయన అనుమతించుతూ “నీకు జ్ఞాన ప్రాప్తి జరిగినది. 4,5, దినములలో నీకు అత్యంత ముఖ్యమైన మంత్రోపదేశములను చేసి, అత్యంత క్లిష్టమయిన పరిస్థిలో తెరిచి చూడవలసిన విషయముగల్గిన ఒక కాగితపు చుట్టను అంటించి నీకు ఇస్తాను. మనము బ్రతకబోయే కాలములో ఇక కలిసే అవకాశము లేదు” అని అనీ అనగానే గురుపత్ని కన్నీరు మున్నీరై ఏడ్వదొడగింది. మొర్ఫా ఆమెను ఓదార్చి మిలాను గుహలోనే సాధన చేస్తూ తనవద్దకు తానూ చెప్పినపుడు వస్తూ ఉపదేశము తీసుకొమ్మన్నాడు.
అంతా సవ్యముగా ముగిసింది. చెప్పవలసినది ఇవ్వవలసినది అంతా జరిగిపోయింది. మున్నీరై ప్రవాహించుతున్న కన్నీటితో గురు దంపతుల కాళ్ళు పట్టుకొని కదిగినంత పనిజేసి, గురువు ఓదార్పు మాటలతో లేచి నిలబడినాడు. గురుపత్ని మిలాకు తాను మోయగలిగిన తిండినిచ్చి ఆశీర్వదించింది.  దంపతులవద్ద శెలవు తీసుకొని విషణ్ణవదనుడై  బయలుదేరి, గురువాజ్ఞ ప్రకారము ‘గోగ్ డన్’ వద్దకువెళ్ళి ఆయన వద్దనుండి తీసుకోవలసిన ఉపదేశమును తీసుకొని  కష్టాలకు కడగళ్ల్లకు ఓర్చుకొంటూ సొంత ఊరు చేరినాడు.
చీకటి పడేవరకూ అటూ ఇటూ తిరిగి రాత్రికి ఇల్లుచేరినాడు. కాలికి బలంగా ఎదోతగిలితే దానిని తీసి పుర్రెగానూ, అది తన తల్లిదిగానూ గుర్తించి ఎడ్చినాడు. తన యోగ శక్తితో పితృలోకములలోయున్న తల్లిదండ్రులతో మాట్లాడి వారి ఆశీస్సులను తీసుకొన్నాడు.
తెల్లవారిన తరువాత ఊరిలో తిరుగుతూవుంటే పిన్ని కనిపించింది. ఎట్లో మిలాను గుర్తించింది కానీ స్వార్థము ఆమెను వదలలేదు. ఇహము పై ఆసక్తిలేని మిలాను బుజ్జగించి అతనిదయిన ఇల్లూ పొలము తన వశము చేసుకొంది. ఊరికి కొంత దూరముగా పాకవేసుకొని  ధ్యానములో ఉన్న మిలాను చూచుటకు, తమ పెళ్లి నిశ్చితార్థములోనే ఆగిపోయిన ‘జేసే’ ఎంతో ఆసక్తితో  మధుర పానీయముతో చూడ వచ్చింది. తానూ పెల్లిచేసుకోలేదని, మిలాకొరకే వేచియున్నానని చెప్పింది. ఆధ్యాత్మికము తలకెక్కిన మిలా ఆమెను అనునయించి వేరే పెళ్లి చేసుకొమ్మంటే వీలుపడదని తెలుపుతూ తానూ తనదయిన భక్తిమార్గమును ఎన్నుకొని బ్రహ్మచారిణిగానే ఉంటానంటూ వెళ్లిపోయింది.
రోజులు గడుస్తున్నాయి. మిలా సాధనలోపడి ఒంటిపైన బట్ట, కంటిపైన నిద్ర, కడుపులోకి తిండి అన్న విషయమునే విస్మరించి ఉండిపోతున్నాడు. ఒకరోజు జేసే పెటా ను వెంటపెట్టుకొని తినుటకు త్రావుటకు కావలసిన పదార్థములను తీసుకొని మిలా వద్దకు వస్తే ఆ సమయమున ఆయన ఒంటిపై వస్త్రమేలేక తన పనిలో నిమగ్నమైయుండినాడు. వారు ఆయన స్థితిని చూసి క్షణకాలము నివ్వెరపోయి శిగ్గుతో తల వంచుకొన్నా, పెటా వెంటనే తేరుకొని అన్నాను ఆలింగనము చేసుకొని వలవల ఎదుస్తూవుందిపోయింది. ఆయన ఆమెను ఒడార్చుతఎగాక ఆధ్యాత్మికముగా తానెంత ఎదిగినదీ తన మాటలతో పాటలతో తెలియజేసినాడు. పెతా అప్పుడప్పుడు ఆయన తినుటకు ఏవయినా వస్తువులు తెస్తోవుంతానని చెప్పింది. ఆయన ధ్యానమునకు అంతరాయము లేకుండా ఇరువురూ శెలవు తీసుకొని బయలుదేరినారు.
మిలా తన ధ్యాన తీవ్రస్తాను హెచ్చించి ఎక్కడ ధ్యానము చేసుకోవలెనంటే అక్కడికి చేరుకోగల శక్తిని పొందగలిగినాడు. ఈ శక్తి రావటముచే తన శరీరమునందు యోగాగ్నిని మేలుకోలుపుటను తాను సాధించుటకు అతిదగ్గరలో ఉన్నట్లు మిలాకు అర్థమైపోయింది.
ఒక రోజు ఒక బాలుడు తన తండ్రి తో వీధిలో నడుస్తూ ఆకసముపై ఎగురుచున్న మిలాను చూపి “నాన్నా ఆయన ఎంత మహానీయుడో చూడు” అన్నాడు. అతనికి మిలా పూర్వ వృత్తాంతము మాత్రమే తెలిసిన వాడయినందున “ అతడు పాపి. అతనిని చూడవద్దు” అని ఆ బాలుని దండించినాడు.  “మరి నీవు పాపములు చేయలేదు కదా, నీవు ఎగురు చూద్దాము” అన్నాడు. ఆతని వద్ద సరియైన సమాధానము లేదు. ఈవిధముగా రానురానూ మిలా చెడుగు నుండి మచివాడు, మహనీయుడు అన్నపేరు సంపాదింప దొడగినాడు.
ఇట్లే ఒక రోజు గుంపుగా కొంత మంది కలిసి పోతూ శుష్కించిపోయి చూచుటకే అసహ్యముగా ఉన్న మిలాను అవహేళన చేస్తూ తమకు ఆకలిగా వున్నదనియు, తినుటకు ఏమయినా పెట్టమనియు అడిగితే మిలా ఎటువంటి అసహనము బాధ చూపక తన దీనావస్థను తెలిపి తానూ లతలు ఆకులతో కడుపు నింపుకొంటున్నట్లు తెలిపి కావాలంటే అవే వారికి ఇస్తానన్నాడు. అప్పుడు ఆ గుంపులో ఒక ముదుసలి, ఆ ఎగతాళి చేసిన వ్యక్తిపై వ్సుగు కొని “ఆయన యోగాసాదనలో వుండే వ్యక్తిగా కనిపించుతున్నాడు. మీరు ఆయనతో హాస్యాలదకండి” అని తెలిపి, ప్రార్థనా పూర్వకముగా “ఏదయినా ఒక తత్వమును పాడి వినిపించాగాలరా” అని అడుగగా ఈ క్రింది భావము కల్గిన ఒక పాటను తమ భాషలో అందుకొన్నాడు మిలా.
‘ఈ శరీరమనే దేవాలయములో, హృదయమనే పూజాపీఠము వద్ద, మనసు అనే గుఱ్ఱము చిందులు త్రొక్కుతూ వుంది. జీవితానికి కావలసిన ఏకైక లక్ష్యమును గురించిన నిశ్చిత బుద్ధి ఆగుర్రమును నిగ్రహించాగాలిగిన కళ్ళెము. ఆ గుర్రమును ధ్యానము అను గుంజకు కట్టివేసి, గురుబోధ అను ఆహారమును దానికి వేయాలి. దానికి త్రాపే నీరు చైతన్యమనే నిరంతర స్రవంతినుండి వస్తుంది. దానిచుట్టూ వున్నా ప్రాంగణము శ్యూన్యత అనబడు నిరాకార తత్వము. ధృడ సంకల్పమే ఆ గుర్రముపై వేయవలసిన జీను. ఆ గుర్రమునకు కల్లెము బుద్ధి. దానిని ముక్కులకు వేసిన బంధమే ప్రాణచలనము. దానిపై స్వారి చేసేవాడు నిరంతర స్మృతి, తదేక ధ్యాస కలిగి యుండవలెను. ఆ రౌతు ధరించే శిరస్త్రాణము సర్వజీవులపై గల ప్రేమ. ఆరౌతు ధరించే కవచము శాస్త్ర పాండిత్యము.అందుండి ఏర్పడే తత్వ చింతన అతని వీపునకున్న డాలు. ఓరిమి అతని చేతిలోని బరిసె. ఉత్తమస్థితికి చేరుటకు ఏర్పరచుకొన్న లక్ష్యమే అతని విల్లు. విశ్వ చైతన్యమును గూర్చిన అవగానయే అతని అంబులపొదిలోనున్న బాణములు. ఆ బాణముల ములుకులు ద్వేషము, ఈర్ష్య అన్న రెండు దోషములను తొలగించు వరకు తరిణె పట్టబడినవి. ప్రతి బాణమునాకు పవిత్ర లక్షణములు అనబడు నాలుగు ఈకలు కట్టబడి ఉన్నాయి. ఆ నాలు ఏమిటివంటే 1. నిత్యానిత్య వివేకము, 2. వైరాగ్యము, 3. శమాది షట్కము దీనినే షట్సంపత్తి అంటారు, 4. ముముక్ష తత్వము.
 వీనిని గూర్చి వేరోక సందర్భములో వివరించగలను. ఇన్ని లక్షణములు తమ తమ స్థానములలో ఉన్నపుడు గుఱ్ఱము బుద్ధత్వము అన్న బాటలో సజావుగా సాగగలుగుతుంది.  ఆ విధముగా ముందునకు సాగే గుఱ్ఱమునకు వెనుకబడుతూ వున్నట్లు కనిపించే ప్రాపంచిక పశుపక్ష్య జడములు మనకు రౌతుకు ఏర్పడిన వస్తు విరక్తిని తెలియజేస్తుంది. అప్పడు సాధించిన గమ్యమే ముక్తి.’
ఇంతటి మహత్తరమైన భావమును పాట రూపములో ఆ మహానుభావుడు, తన చుట్టూ వున్న గుంపులోని వృద్ధుని అభ్యర్తన మేరకు ఆశువుగా పాడి వినిపించినాడు. ఎంతటి తపస్సాధన, ఎంతటి కారుణ్య స్వభావము. ఎంతటి లోకల్యాణ తత్పరత.  మనము కథకన్నా కూడా ఇటువంటి విషయములను ఎంతో శ్రద్ధతో, లగ్నముతో, జిజ్ఞాసతో చదువవలసి యుంటుంది.
మిలాకు రాను రానూ ఏకాగ్రత కొరవడింది. ఎవరెస్టు వైపు పోతే సాధనకు తగిన గుహలున్నాయని విని, ఒకే మట్టిపాత్ర పట్టుకొని బయలుదేరినాడు. రెండడుగులు వేసినాడో లేదో కాలికి రాయి తగిలి ఆ మట్టిపాత్ర చేయిజారి పగిలిపోయింది. సన్యాసికి ఈ లంపటము కూడా తగదనుకొన్నాడేమో పరమాత్ముడు, అందుకే, అదీ లేకుండా చేసినాడు.
తన పరిసరములలో ఉన్న ఒకరిద్దరు అడిగితే తాను ఎవరెస్టు పరిసరాలకు పోతున్నట్లు చెప్పి రిక్త హస్తములతోనే బయలుదేరినాడు ఆ నగ్న సాధకుడు.
అన్నను చూచుటకు ఒక రోజు, అన్న ఒంటికి ఆచ్ఛాదనగా  కొన్ని గుడ్డ పీలికలు, కొంత తిండి, తీసుకొని బయలుదేరిన పేటా అన్న ఉండిన పాత చోటుకు పోతే అతను ఎవరెస్టు వైపు వేలుతున్నాడని తెలిసి తానూ అదేత్రోవలో బయలుదేరింది. దారిలో ఆడంబరములతో అట్టహాసములతో అన్నీ తానేనని నమ్మించే ‘బారిలోద్సావా’ అన్న గురువును చూసింది. అతని డాబు, అతని శిష్యులు చేసే సేవలు, అమాయక భక్తులు ఈ విధముగా అన్నీ చూస్తూ చూస్తూ చివరకు అన్నను చేరింది.
అన్న దీనావస్థను చూచి తాను తెచ్చిన ఆ బట్టలనిచ్చి కట్టుకొమ్మనింది. కప్పుకోమ్మనింది. దారిలో తానూ చూసిన గురువుకు శిష్యునిగా కమ్మని పేటా మిలాకు నచ్చచెప్ప ప్రయత్నించింది. అప్పుడు మిలా తానము ఆధ్యాత్మికముగా ఎంతో ముందున్నానని, తన గురువు మోఫా అండదండలు తనకు ఎపుడూ ఉంటాయని, తన ఆధ్యాత్మిక గమ్యమును చేరుకోలేకపోతే ప్రాణమైనా వదుల్తానని  నచ్చజెపుతూ బారిలోద్సావా వంటి వారు దొంగాసంయాసులనీ, వారికి, తగిన కాలములో, తీవ్రమైన శారీరిక మానసిక ముప్పు వాటిల్లుతుందని చెబుతాడు. పెతా మాత్రము పట్టువిడువక “నీ సాధనకయినా దేహదార్ఢ్యము అవసరము. కావున తగిన ఆహారము తీసుకొమ్మని బ్రతిమలాడి చెప్పి శెలవు తీసుకొంటుంది. తన ప్రయాణము అంగుళము కూడా కొనసాగించలేని స్థితిలో మనసుకు పెతా చెప్పినది నిజమని అనిపించదొడగినది. తన వివేకము గురువు ఇచ్చిన ఆ కాగితపు చుట్టను తెరిచి చూడమని బలవంతము చేసినది. ఎట్టకేలకు తెరచి చూస్తే అందులో కూడా పెతా చెప్పినట్లే ఉంటూ ఇకపై చేయవలసిన ధ్యాన కార్యాచరణను గూర్చి కూడా వుంది. నీరునిండిన కనులతో గురువును మనసారా తలచుకొని శరీరమును కాపాడుకోనవలసిన ఆవశ్యకతను గుర్తెరిగి తదనుగునముగా ప్రవర్తించ మొదలిదినాడు మిలా!
ఎన్నేన్నో గుహలను తానూ ఆశ్రయించి తన సాధనను అకుకుంఠితముగా కొనసాగించినాడు. ఎంతగా నంటే ఆయనలోని ధ్యానము, ధ్యాత, ధ్యేయము అన్న మూడు ఒకటై ఆయన ఆసాధనకు ప్రతిరోజూ అప్రయత్నముగానే అంకితమైపోయేవాడు. రోజులు దొరలిపోతూనే వున్నాయి. మిలా సాధన పరాకాష్ట దిశగా సాగుతూనే వుంది. తన సాధన త్వరితపరచుకొనుటకు నాటి ప్రజలకు తెలిసిన, తెలియని ఎన్నో గుప్త గుహలను వెదుకుతూ సాధన చేసుకొంటూ ముందుకు సాగుతూనే వున్నాడు. అతని అంతులేని ప్రయానములోని భాగముగా ఒకసారి ‘బ్రిస్’ అనే ప్రాంతమును చేరుకొన్నాడు.
'బ్రిస్'లో 'సాకువాఅన్న పేరుగల ఒక మహా పండితుడు ఉండేవాడు. ఆయన పాండిత్య ప్రతిభావాటవములకు ఆకర్షితులైన అక్కడి ప్రజలుఆయనక్లు అపూర్వమైన 'గేష్అన్న బిరుదును ఇచ్చి గౌరవించినారు. అట్టి బిరుదు సామాన్య పండితులకు అందని మ్రాని పండు. మిలారేపా గారు తన సాధన యాత్రలో 'బ్రిస్చేరినారు. రానురాను అక్కడి ప్రజలు మిలారేపా గొప్పదనమును గుర్తించదొడగినారు. దీనిని గమనించిన సాకువా ప్రజలు మిలా వైపు మొగ్గు చూపటము సహించలేక పోయినాడు. పైపైన మాత్రము మిలారేపా కనిపించినపుడు తన ఆదరమును వ్యక్తపరచేవాడు. సాధారణముగా  తనవద్ద శ్రోతలోతన భక్తులో ఉన్నపుడు మిలారేపా కనిపించితే ఆయననుమనసులో కుల్లుబుద్ధి వున్నాతన వద్దకు ఆహ్వానించి ఉచిత రీతిన ఆసనము అలంకరిమ్పజేసిపైకి తెలుసుకోవలేనన్న జిజ్ఞాస కనబరచుతూ జటిలమైన ప్రశ్నలు వేసేవాడు. మిలా అవలీలగా అద్భుతమైన సమాధానములు చెబుతూవుంటే అక్కడున్నవారంతా కళ్ళు తెలవేసేవారు. సాకువా దానిని అరిగించుకోలేకపోయేవాడు. మిలా జవాబులో లొసుగులు వెదకేవాడు. తనధ్యేయమంతా మిలారెపాను ఇరుకునపెట్టి తన గొప్పదనము తన చుట్టూ వున్నవారిముందు ప్రకతిన్చుకోనవలేనాను కాంక్షయే! ఎన్నిమార్లు ప్రయత్నించినా అది వీలు పడలేదు సాకువాకు.
ఇది ఇలా కొనసాగుతూ వుండగా మిలా గారి భక్తుడొకడు తనయింట జరుగు వివాహమునకు ప్రత్యేకముగా ఆహ్వానించినాడు. వేదిక వద్ద ఏర్పరచిన ఉచితాసనములలో అత్యున్నతమైన దానియందు మిలారేపా గారిని కూర్చుండజేసి, ప్రక్కన ఉన్న స్థానమును సాకువా కొరకు కేటాయించినారు. కార్యక్రమములోని భాగముగా అందరూ మిలారేపా గారికి నమస్కరింప మొదలిడినారు. సాకువా కూడాలేచి, తానూ నమస్కరింపబోవు సమయములో తనను వారించి గౌరవించుతారను భ్రమపడి, తటపటాయిస్తూనే, అప్రయత్నంగా సాష్టాంగ నమస్కారము చేసినాడు.
ఈ భౌతిక మర్యాదలకు మిలారేపా ఎప్పుడో అతీతుడైనాడు. తన గురువుకు తప్ప ఇతరులకు నమస్కరించని నిష్ఠ కలిగినవాడు. అందుచేత ఆయన సాకువా నమస్కారమునకు స్పందన ఏమీ చూపలేదు. సాకువా అహము దెబ్బతిన్నది. ఆతడు నమస్కారభంగిమ నుండి లేచి తేరుకొని తన వద్దనున్న ఒక పుస్తకమును తీసి దానిని చదివి అంతరార్థ బాహ్యార్థ గూడార్థములను చెప్పమన్నాడు. అప్పుడు మిలారేపా “అయ్యా మీరు స్వతహాగా పండితులు. ఒక వేళ మీకు అర్థము కానిదేదయినా ఉంటే వ్యాకరణ నిఘంటువుల సాయమున తెలుసుకోగలరు. నేను దైవమార్గమున ఉన్నవాడను. ఈ పుస్తకములు వీటికి సంబంధించిన విషయములు మరచినవాడను. పైపెచ్చు వానిని గూర్చి తెలుసుకొను ఆసక్తి లేనివాడను. ఎంత సేపయినా జీవన్ముక్తికి  తగిన విషయములగూర్చి నాకు తోచిన పాటల రూపముననో ప్రవచన రూపముననో తెలుపగల వాడను. అందువల్ల దీనిని గూర్చి నేను తెలుపలేను” అని అన్నాడు.
దీనిని అపార్తముగానూ అలుసుగానూ తీసుకొని మిలారేపాను తన సూటిపోటి మాటలతో అవమానింప ప్రయత్నము చేసినాడు సాకువా. కానీ ఆ సభలో ఉన్న ప్రతియోక్కరితో బాటూ సాకువా శిష్యులు కూడా అతని చర్యను గర్హించి అతనిని దుయ్యబట్టినారు. అవమానముతో అవనత శిరస్కుడైన సాకువాలో ప్రతీకార జ్వాల రగిలింది. ఇంటికి వచ్చి దీర్ఘముగా ఆలోచించి తన ఉంపుడుకత్తెలలో ఒక అందము తోబాటు చురుకుదనము కలిగిన ఒక ఆవిడను పిలిచి ఆమెకు భయంకరమగు విషముతో చేసిన పానీయమునిచ్చి ఎత్తులయినా మిలారేపాకు తాపించమని చెప్పి, అందుకు ప్రతిగా తన సంపాదనలోని ఒక అత్యంత విలువైన మణిని ఇస్తానని ఆతడు era చూపినాడు. ఆ మనిమీద ఆమెకు ఎప్పటిండియో వ్యామోహము కలిగినదగు ఆమె  అందులకు ఒప్పుకొని మిలారేపా వద్దకు ఆ పానీయమును తీసుకొని పోయింది. ఆయన వర్చస్సు వాలకము చూస్తూనే అంతా ఆయనకు తెలిసినదేమో నన్న భయముతో వణికిపోయినది. అంత మిలారేపా “అమ్మా నీవు ఇంకా రెండురోజులు ఆగు. అప్పుడు నేను నీకు చెబుతాను ఈ ఆసవమును నాకు ఎప్పుదివ్వవలసినది” అని తెలిపినాడు. అప్రతిభురాలై, అవమాన భారముతో కృంగిపోయి వెనుదిరిగి సాకువా వద్దకు పోయి జరిగినది చెప్పినది. మదమాత్సర్యముతో మతి గతి తప్పినా సాకువా ఆమెను మళ్ళీ వెళ్ళమన్నాడు. ఆమె కానేకాదు అంటే ఆమెను తన అర్ధాంగిని చేసుకొని ఆస్తీ అంతటినీ ఆమె కైవశము చేస్తానన్నాడు. ఆశ చెడ్డది. ఆమె అతని సలహాను అనుసరించింది.
మిలారేపా చెప్పిన విధముగా రెండురోజుల తరువాత ఆయన వద్దకు పోయి నిలచినది. అప్పుడు ఆయన “అమ్మా! ఆరోజు, సాకువా తన మాట ప్రకారమూ, నీవు నాకీ పానీయమును తాపించి యుండినా తనపని జరిగిపోయినదని నీకు మొండిచేయి చూపించియుండేవాడు. ఈ రోజు అట్లు చేయదు కాబట్టి ఆ రసమును నాకివ్వు. నేను త్రాగుతాను” అని చెప్పి ఇప్పించుకొని గుక్క త్రిప్పుకొకుండా త్రాగివేసినాడు. ఆమె తక్షణమే ఆయన కాళ్ళపై బడి తనను క్షమించమని వేడుకొంది. అప్పుడు మిలారేపా “అమ్మా! నీవు మొదటిసారి పానీయముతో వచ్చినపుడే అది విషపూరితమనీ, సాకువా దానిని తయారుచేసి నిన్ను ప్రలోభపెట్టి పంపినాడనీ నాకు తెలుసు. అపుడే నేను త్రాగివుంటే నీకు మణిని ఇవ్వకుండా ఉండిపోయే వాడు. ఇప్పుడు అతడు మానసికముగా నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకొనుటకు సిద్ధపదియున్నాడు కాబట్టి నేను త్రాగినాను. నేను నెరవేర్చవలసిన పనులు కొన్ని భూమిపై ఉన్నాయి కాబట్టి కొన్ని రోజులు కాయముతో కనిపించుతాను. ఈ విషము యొక్క తీవ్రతను నాలోనే అణచుకొంటాను” అని చెప్పిన వెంటనే ఆమె వలవల ఏడ్చుతూ అచటి నుండి నిష్క్రమించినది.
మిలారేపా తన ధ్యానముపై ఎక్కువగా ధ్యాసను ఉంచి ఉధృతము చేసినాడు. ఒక వారము తరువాత స్మారకము వచ్చినపుడు తన శిష్యగణముతో భక్తులకు, ఆ దినము తన అనుగ్రహ భాషణము ఉంటుందని తెలియజేయమని చెప్పినాడు. అందరూ మిలారేపా గారి ఆశ్రమమువద్ద గుమిగూడినారు.
మిలారేపా గారు గొంతు సవరించుకొని తన భాషణము ప్రారంభించినారు. ఆ ప్రాంతమంతా ఆయన దివ్య భాషణము తప్ప వేరు శబ్దము ఏదీ వినిపించలేదు. తన ప్రసంగామునకు అనుబంధముగా ఎన్నో తత్వాలు పాడుతూ అక్కడ ఉన్నవారినందరినీ తన్మయులను చేసినాడు.
తన భాషణములో  పూర్తిగా మునిగిన ఆ మహానుభావుడు తన శరీరము కూర్చునుటకు కూడా సహకరించుట లేదని గుర్తించలేదు. అనుకోకుండా చుక్క మంచినీరు గుక్కలో పోసుకొనుటకు తన ఉపన్యాసమును నిలిపిన వెంటనే ప్రక్కనే ఉన్న శిష్యుడు ఆయన పరిస్థితి గుర్తుచేసి ఇక చాలించమని సలహా ఇచ్చినాడు. పైగా అతడు తమ గురువు తిన్న ఆహారములో ఏదయినా విషము కలిసిండా అన్న అనుమానమును కూడా మిలారేపా గారితో వ్యక్తపరచినాడు. అప్పుడు తన సంభాషణా విషయమును విషము పైకి మరలించి చెప్పదొడగినాడు.
వారి గురువు మార్ఫా గారు తాను శిష్యరికము చేస్తున్న సమయములో నేర్పిన మాటలను గుర్తుకు తెచ్చుకొని అక్కడ చేరిన భక్త గణమునకు ఈ విధముగా చెప్పినాడు. మనిషి చంపే విషములు 5 ఉన్నాయి. అవి ఏవంటే కామము, ద్వేషము, మూఢత్వము, అహంకారము, అసూయ. వీనిని తొలగించుకొనే ఉపదేశమును ఆయన పొందుటచే ఆ విషములు తనపై ప్రభావమును చూపవని తెలియజేసినారు. వానికి మించిన విషము ఏదీ తానూ చూడలేదన్నాడు.
జీవితములో ఏపని చేసినా తదనంతర కాలములో ‘అయ్యో! నేను ఈ పని చేయకుంటే బాగుండేది’ అన్న పశ్చాత్తాపము రాకూడదు. నీవు చేసినపని నలుగురిలో నీకు అవమానము తెచ్చేదయి ఉండకూడదు. ఈ విధముగా చేయుట చేత నేనూ, నా పూర్వ గురువులు పైలోకములనుండి మిమ్ము దీవించుతాము.
నావల్ల ఒకవ్యక్తి పశ్చాత్తాపముతో మంచి మార్గము వైపు మరలినాడు. నా శరీరమును ఆతని ‘చూచార్’ అన్న పట్టణములో విడువవలసి యున్నది. ఇక అక్కడికి బయలుదేరుతానన్నాడు. ఇక్కడ సుస్తీ అన్న ప్రక్రియను ప్రదర్శించినట్లే అక్కడ మృత్యువు అన్న లీలను ప్రదర్శిస్తానన్నాడు.
రేచుంగ్, వారి వద్దకువచ్చి చూచార్ లో కలిసినపుడు తాను తనవద్ద ఉంచుకొన్న నూలు గుడ్డనూ, వెదురు చేతికర్ర ఇవ్వమన్నాడు. పంచ ప్రాణాలను తన ఆధీనములోనికి తెచ్చుకొనే అతని సాధను, అవి అంతరాయము కలుగకుండా కాపాడుతాయి. అదే విధముగా ‘ఉపా-తోపా’ అన్న నా శిష్యునికి, ‘మైత్రి’ అన్న గురువుగారి వద్దనుండి నేను పొందిన తలపాగా, దండము ఇవ్వాలి. వానివల్ల అతనికి లోతుగా ధ్యానము కుడురుటతోబాటు, బౌద్ధధర్మమునుద్ధరించుతాకు గానూ తనలోవున్న ఆశలు ఆశయాలు సిద్ధిస్తాయి. ‘శీబా-ఉద్’ అను శిష్యునకు ఈ కొయ్య భిక్షాపాత్ర నివ్వండి. ‘గాస్’ అన్నవానికి ఈ పుర్రె తోపీనివ్వండి. ‘శేబవ్- రేపా’ అన్న వానికి ఈ చెకుముకి రాళ్ళు, ఉక్కుముక్క ఇవ్వండి. ‘బ్రిగ్రుం’ అన్నవానికి ఈ ఎముకతో చేసిన ‘చెంచా’ ఇవ్వండి. ఇక మిగిలిన వారందరికీ ఈ నూలువస్త్రమును చిన్న చిన్న పీలికలుగా చించి ప్రతి శిష్యునికీ పంచేది. వీటితో, వారిపై నా ఆశీస్సులు కలకాలమూ ఉంటాయి.’ అని ఆయన చెబుతూవుంటే విన్నవారంతా ఆయన శిష్యవాత్సల్యతకు అవాక్కయిపోయినారు.
ఎంతో నీరసించి తూలి పడబోతూవుండే ఆ మహానుభావుని చూసి సాకువా సాహిమ్పలేని రీతిలో ఎగతాళి చేసినాడు. మిలారేపా గారిని ఎంతగానో కవ్వించినాడు. ఎంత ఊరకున్నా రెచ్చకోట్టిన సాకువా నోరు మూయించుటకు, తన బాధను అచట ఉన్న ఇంటి తలుపుపైకి తన మంత్రం శక్తితో చొప్పించినాడు. అది అటు ఇటు ఊగి ఉబ్బి తబ్బిబ్బయి పగిలి పోయింది. అప్పుడు కూడా అది మిలారేపా గారి కనికట్టన్నాడు  ఆ విషహృదయుడు. మార్గాంతరము లేక తన బాధలోని పాతిక భాగమును సాకువా కు ఆవహింపజేసినాడు. మెలికలు తిరిగిపోయి సాకువా తనను రక్షించమని మిలారేపా గారి కాళ్ళపై బడినాడు. ఆ సుధామయ హృదయుడు ఆతనిని మన్నించి ఆ బాధను వెనక్కు తీసుకొన్నాడు. అప్పటికి సాకువాకు జ్ఞానోదయమై తన ఆస్తిని అందరికీ పంచి తానూ బౌద్ధ భిక్షువైపోయినాడు.
      ఆయన తన మాటగా లౌకికమయిన కీర్తి అనే విషము తాగకండి. జీవితమును పరార్థము, పరమార్థములకై  ఉపయోగించండని ఉద్బోధ చేసినాడు. సంపూర్నమగు నిస్స్వార్థ సేవ అన్నది అలవరచుకోవలసిన అతి ముఖ్య గుణమని నొక్కి పలికినాడు. శాంతము  దాంతము అనగా మనస్సులో తనకు ఎవరయినా చేసిన చెడుగును తలవక మనః పూర్వకమైన మౌనమును కలిగియుండుట మరియు ప్రతిక్రియ లేని నెమ్మదితనము కలిగియుండుట అన్న గుణములు అత్యంత ముఖ్యమైనవని ప్రబోధించినాడు. వారికి చివరిగా “నేనిక ఎక్కువ కాలము ఉండబోవటము లేదు. కనుక నేను చెప్పిన బోధనలను జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని తన అడుగు జాడలలో నడువండి”అని చెప్పినాడు.
ఈ మాటలన్తూనే ఆయన ఒక విధమగు ధ్యానస్థితిలోనికి వెళ్లి తిరిగీ లౌకిక స్ప్రుహలోనికి రాలేదు. ఆయన 84 సంవత్సరముల వయసులో 1135 వ సంవత్సరము జనవరి మాసములో సమాధి చెందినారు.
మిలారేపా చివరిరోజుల్లో అనేకానేక అద్భుత విషయములు జరిచోటు చేసికొన్నాయి. ఆయన మరణించిన వెంటనే ఆ ప్రాంతమంతా సుగంధ సుమ పరిమళము వ్యాపించింది. అత్యంత శ్రావ్యమైన సంగీతము వినిపించింది. దేవతలే దిగివచ్చి ఆయనపై పుష్పవృష్టి  కురిపించినట్లు చెప్పబడింది. ఆవిధంగా వారు తమ గౌరవమును ఆయనకు ప్రకటించుకొన్నారు. ఆ దృశ్యము వర్ణనాతీతము.
ఇంతలో యానాం నుండి భక్తులు బ్రిస్ ప్రాంతములోని కొందరు ధృఢకాయులతో వచ్చి మిలారేపా గారి పార్థివ శరీరమును తమవెంట తీసుకుపోతామని అక్కడి వారిని బెదిరించినారు. అందరూ పరిపూర్ణ భక్తులే కానీ అంతరాలాలలో దాగిన స్వార్థము అంతపని చేయించుతూవుంది. అప్పుడు మిలాగారు ప్రత్యక్షమై అందరితో ఈ విధముగా చెప్పినాడు. యానాం, బ్రిస్ భక్తులారా మీ చర్య వితండమే అయినా మీ భక్తి నిరుపమానము. అందుచే నా పార్తివ దేహము ఇప్పుడు మీకు మూడుగా కనిపించుతాయి. మద్యలో వున్నది వాస్తవ మగు పార్థివ దేహము. దాని సంస్కారము చోచార్ అంటే ఇక్కడే జరుగుతుంది. కుడి ప్రక్కది యానాం భక్తులు ఎడమ ప్రక్కది బ్రిస్ భక్తులూ తమ తమ ప్రాంతములకు తీసుకుపోయి ఉత్తరక్రియలు నిర్వహించండి అని చెప్పి అంతర్హితుడైనాడు ఆ మహనీయుడు. మొదలే రేచుంగ్ అన్న శిష్యసత్తముడు వచ్చేవరకూ శరీరమును దహనము చేయవద్దని చెప్పుటచే వారు ఊరక ఉండిపోయి రేచుంగ్ కై ప్రతీక్షించ మొదలు పెట్టినారు. రేచుంగ్ కు వార్త అందిన వెంటనే ఆఘమేఘాలపై చూచార్ కు బయలుదేరి, చూచార్ కు దగ్గరగా ఒక గుట్ట వద్ద పడిపోయినాడు. అప్పుడు మిలారేపా వచ్చి ఆతని సేదతీర్చి నీవు నెమ్మదిగా బయలుదేరి రా. నేనన్తలో అక్కడ చేయవలసిన పనులు చేస్తానని చెప్పి వెళ్లినాడు.
రేచుంగ్ చూచార్ చేరే సమయానికి జనమంతా దుఃఖసాగరములో మునిగి తన గురువుగారు విడచిన తనువు చుట్టూ చేరి  రోడించుట గమనించినాడు. అప్పుడు అతనికి అర్థమైనది తన గురువుగారి లీలావిలాసము.
అంతా ఆయన అనుదినమూ కూర్చుని ధనమగ్నుడై ఉన్న బండరాయివడ్డ దహనమునకు ఏర్పాటు చేసినారు. ఆవిధముగా చితి మండుతూ వుండగా అందుండి మిలారేపా గారు లేచి “రేచుంగ్ తత్వసాధనలో మీ అందరికన్నా ఎంతో ముందు వున్నాడు. అందుచే ఆతనిని నా తదనంతరము గురువుగా స్వీకరించేది. దేహాన్ని నమ్ముకోవద్దు. అది ఎప్పటికయినా మోసము చేసేదే! మీఆధ్యాత్మిక సాధనే మీకండదండ.” అంటూ ఈ విధముగా ఎన్నో ఉపదేశ వాక్యములను తెలిపి ఆయన తిరిగీ చితిపై పడుకొన్నాడు. అంతా ముగిసిణ తరువాతి రోజు అస్థికలు బూడిద కోసం భక్తులందరూ వస్తే ఆ ప్రదేశము ఏమియును లేక ఎంతో స్దుభ్రముగా వుంది. వాళ్ళు అదిచూసి ఒకవైపు ఆశ్చర్య పడుతూనే విలపించుతూ వుంటే దేవతలు ప్రత్యక్షమై వీరు విలపింప పనిలేదు. మిలారేపాగారు తమ బోధనల ద్వారా, తత్వలుల ద్వారా, ఉపదేశముల ద్వారా మీలోని ప్రతియోక్కరిలో ఉన్నారు. ఆ అనుభూతిని కలకాలం మీరు భూమిపై ఉన్నంతవరకూ మిగిల్చుకోండి అని చెప్పి అంతర్ధానమందినారు.
ఈ విధముగా ఆ మహనీయుడు టిబెట్ ప్రజల హృదయాలలో చిరంజీవియై నిలచిపోయినాడు.
ఆ మహనీయుని కథను నాకు జ్ఞాపకమున్న మేరకు, తోచిన మేరకు మీ మున్డున్చినాను. ఇటువంటి మహానీయుళ జీవిత చరిత్రలు విన్నా చదివినా, తెలిపినా అనిర్వచనీయమైన ఆనందము గుండెలు నిండిపోతాయి. అట్టి ఆధ్యాత్మిక సృష్టి కర్తల చరిత్రలకు మనము దృష్టి కర్తలమైనా పుణ్యమే!



స్వస్తి.

Sunday, 25 August 2019

వైద్యో నారాయణో హరి:


వైద్యో నారాయణో హరి:
https://cherukurammohan.blogspot.com/2019/08/blog-post_60.html
శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరేl 
ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణో హరి:ll 
శరీరం అశాశ్వతం. దీనికి జరామరణాలు సహజం. ప్రాణాలు ఉన్నకాలంలో శరీరాన్ని బాధలపాలు చేసేవి వ్యాధులు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అన్నది పెద్దలమాట. మనం చేసిన పాపాలకు ప్రతిరూపాలుగా రోగాలు మనను ముసిరి ముప్పుతిప్పలు పెడతాయి. రోగానికి ధన్వంతరిగా శ్రీమహావిష్ణువు అవతరించాడు. ఎన్నో ఔషధాలను తయారుచేసి మాన వాళికి అందించాడు. ఆ విధంగా నారాయణుడు ధన్వంతరి రూపు దాల్చి  వైద్య నారాయణుడైనాడు. ఆయన జగ త్తునకే వైద్యుడు. ఆయన సృష్టించి ఇచ్చిన దివ్య ఔషధం గంగాజలం. ఇప్పుడు కాలుష్యం బారిన పడినా గంగ లోని మౌలిక లక్షణాలు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికైనా సజీవంగానే ఉంటాయి. దాన్ని అసలు  కలుష్యము నుండి  కాపాడుకోగలిగితే  నిజానికి దేశాన్నే ఆరోగ్యముగా ఉంచినవారమౌతాము. ప్రాణమే పోతుంది అన్న క్షణంలో గంగా జలం తాగి లేచి కూచున్న వారెందరో మన సామాజిక అనుభవములో అగుపించుతారు. గంగాజలము  అందుబాటులో లేనివారు ఇప్పటికీ తులసీతీర్థం ప్రాణము పోయే సమయములో రోగికి పోయడము చూస్తూనేవుంటాము. బ్రతకలేదు అంటే ఋణము తీరింది అనిగానీ భగవంతుని అనుమతి లేదు అనిగానీ తలువవలసి ఉంటుంది.
అసలు వ్యాధి అన్నది ఏ పూర్వజన్మ వశాత్తో సంక్రమించితే దానిని తొలగించుకొనుటకు వైద్యశాస్త్రములో ఏమి చెప్పబడిందో ఒకసారి గమనించండి.
“పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడ్యతే
తచ్ఛాంతిః ఔషధైఃదానైఃజపహోమ క్రియాదిభిః”

అంటూ శారీరక,మానసిక రుగ్మతలకు ఉపశాంతిగా ఔషధులు,దానాలు,జపాలు,హోమాలు చేయుట ద్వారా తగ్గించుకొనవచ్చునని చెప్పబడినది. కలిమాయలకాలవాలమైన ఈ కాలములో కనికరించి మంచి చేసే మనిషి దొరికితే తప్పకుండా హోమము కూడా సత్ఫలితమును ఇస్తుంది. కొంత అసంగతమని పాఠకునికి అనిపించినా కొంచెము హోమ సమిదేలను గూర్చి తెలియజేస్తాను.  హోమములో నవగ్రహములలో ఒక్కొక్క గ్రహమునకు ప్రీతికరమైన ఒక్కొక్క సమిధ ఉపయోగించుట వలన ఒక్కొక్క రోగము నివారించబడుతుంది.

హోమ ధూమము కంటిని  కప్పుట వలన కంటిలో ఉన్న నలతలన్నీ కన్నీటి రూపములో వెళ్లిపోతుంది. హోమాగ్ని సెగ మోకాళ్ళకు తాకటం వలన మోకాళ్ళ నొప్పులు రాకుండా నివారించుకోవచ్చు. గ్రహాలకు వేరు వేరు వృక్షాల సమిధలతో హోమం చేస్తే వేరు వేరు సత్ఫలితాలు సమకూరుతాయి.

రవి:-తెల్లజిల్లేడు వాత,కఫ వ్యాదులను తగ్గిస్తుంది.తెల్లజిల్లేడు సమిధలతో ఇంట్లో హోమం చేస్తే వాస్తుదోషాలు నివారణ అవుతాయి. కళ్ళకు సంబంధించిన అనారోగ్యాలు నయమవుతాయి. కోపము యొక్క తాపము తగ్గుతుంది. తలనొప్పి భాధలు ఉండవు. ఆయుర్వేదం ప్రకారం తెల్లజిల్లేడుకు  కుష్టు వ్యాధిని నయం చేసే శక్తి వుందని ఆయుర్వేద వైద్యులు చెప్పేవారు..

చంద్రుడు:-మోదుగ సమిధలతో హోమం చేస్తే మానసిక సమస్యలు ఉండవు.ఆలోచనావిధానంలో మార్పులు వస్తాయి. సుఖవ్యాధులు దరిచేరవు. మోదుగాకును మెత్తగా నూరి పాలతో తాగిన స్త్రీలకు ఋతుసంబంధ సమస్యలు,గర్భ సంబంధ సమస్యలు ఉండవు. మోదుగ పువ్వులు,గింజలు ఎండబెట్టి నీటిలో ఒక పావు చెంచా వేసి కాగబెట్టుకొని తాగితే లావుగా ఉన్నవారు సన్నగా అవుతారు. వైద్యపరంగా చూస్తే జీర్ణ వ్యవస్థను అద్భుతంగా పునరుజ్జీవింప చేసే శక్తి మోదుగకు వుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది అని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతూవుంటారు.

కుజుడు:-చండ్ర సమిధతో హోమం చేస్తే ఎర్రరక్త కణాల ఇబ్బందులు,ఎముకల బలహీనత ఇబ్బందులను అరికడుతుందంటారు. పచ్చి పోక చెక్కలు కషాయం పెట్టి సేవిస్తే మధుమేహం,కోపస్వభావాలు తగ్గుతాయని చెబుతారు.

బుధుడు:-ఉత్తరేణి సమిధను హోమంలో ఉపయోగిస్తే చర్మవ్యాదులు తగ్గుతాయి. జీర్ణ సంబంధ సమస్యలు ఉండవు. ఉత్తరేణి పూల్లతో గాని,వేరుతోగాని రోజూ దంతధావనం చేసుకుంటే దంతదోషాలు తొలగిపోతాయి. ఉత్తరేణి ఆకులు,గింజలు పొగ వేసి పీలిస్తే దీర్ఘ కాలంగా ఉన్న దగ్గు,జలుబు,ఆయాసం తగ్గుతాయి అన్నది విజ్ఞుల వాక్కు.

గురువు:-రావి సమిధలతో హోమంచేస్తే సంతాన ప్రాప్తి జరుగుతున్దంటారు. ఈ ధూమము శరీరములో చేరి భార్యాభర్తల దోషములను భారించుతుందని చెబుతారు .రావి చెక్కకాషాయాన్ని తేనెలో కలిపి తీసుకుంటే వాత రక్త దోషాలు తగ్గుతాయి. నోటిపూత పోతుంది. రావి చెక్కకాషాయాన్ని రోజు తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. కాలేయ సమస్యలు ఉండవు. వివిధ కఫ దోషాలను రూపుమాపుతుందని ఆయుర్వేదంలో వుంది.

శుక్రుడు:-మేడి చెట్టు సమిధలతో హోమంచేస్తే వివాహ సమస్యలు, వైవాహిక సంబంద సమస్యలు ఉండవు. గురు దత్తాత్రేయులవారికి అత్యంత ప్రీతికరమైన వృక్షం ఔదుంబర వృక్షం (మేడి చెట్టు). దత్తాత్రేయుల వారు ఎల్లప్పుడు సుక్ష్మరూపంలో సుప్రతిష్టితులై ఈవృక్ష మూలమునందు ఉంటారని అంటారు. దీని కాయలు, చెట్టు మొదలు నుండి తీసిన రసం వాడితే మధుమేహవ్యాధి నివారించబడుతుంది అని వైద్య శాస్త్రమున చెప్పబడినది. దీని విత్తనాలు పొడి చేసి, తేనెతో కలిపి తీసుకున్నా మధుమేహం దరిదాపుల్లో కనిపించకుండా పోతుందంటారు.

శని:-జమ్మి సమిధలతో హోమంచేస్తే అప మృత్యు భయం తొలగి పోతుందణి శాస్త్ర వచనము. దీర్ఘకాల అనారోగ్యాలు తొలగిపోతాయి. జమ్మిచెట్టు గాలి శరీరానికి కలిగిన ఇబ్బందులు తొలగించుతుంది. ప్రతి రోజు శమీ వృక్షానికి ప్రదక్షిణ చేసినచో దీర్ఘకాల అస్వస్థతలు తొలగిపోతాయి.

రాహువు:-గరికలతో హోమంచేస్తే ఇంటిలో నరదృష్టి తొలగిపోయి సర్ప సంభంద దోషాలు తొలగిపోతాయి. గరిక రసాన్ని గజ్జి,చర్మంపైన ఉన్న కురుపులపై పెట్టిన ఎడల చర్మరోగాలు నివారించబడతాయి. దెబ్బతగిలి రక్తం కారిపోతుంటే గరిక రసాన్ని పిండితే రక్తం ఆగి పోతుంది.

కేతువు:-ధర్భలతో హోమంచేస్తే కాలసర్పదోషాలు తొలగిపోతాయి. మూర్ఛ రోగాలను తగ్గిస్తుంది.

జాతకంలో ఏదైనా సమస్యలు ఉంటే శాంతి ప్రక్రియలో భాగంగా హోమం చేసుకోవాలి అని చెబితే ఇంట్లో స్థలం లేదని దేవాలయంలోనో, మరెవరైనా ఇంట్లోనో హోమాలను చేయించుట కూడా కద్దు.  ఈ విధముగా చేయుటవల్ల గ్రహ బాధలు తొలగిపోవు. ఇబ్బంది ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోనే హోమం చేస్తే మంచి ఫలితము దక్కుతుంది. హోమంవల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. హోమము ప్రత్యక్షముగా
మనకారోగ్యమును,  పరోక్షంగా నవగ్రహాల అనుగ్రహమును మనకు అందించుతాయి.
తిరిగీ అసలు విషయానికొస్తే ..........
రోగపీడల నుంచి జీవజాతులను కాపాడి ఆనంద తీరాల వైపు నడి పించగల మహనీయ మూర్తి విష్ణుమూర్తి. ఒకరిని బతికించాలన్నా, సంహరించాలన్నా విష్ణుమూర్తి సంకల్పించుకోవాల్సిందే! అందుకే గీత లో కూడా అధర్మవర్తనులైన రాజలోకాన్ని చంపినట్లు భగవంతుడు చెబుతాడు. అదే ధోరణి అన్నిటా వర్తిస్తుంది. రోగకారకుడు, రోగ నిర్మూలకుడు కూడా ఆయనే! అందుకే ‘నాహం కర్త హరి: కర్త’ అన్న శాస్త్ర వాక్యమును అక్షరాలా మనము పాటించితే భూమిపై ఉన్నా భూమి దాటుకున్నా ఆనందముతోనే ఉండగలము. కర్త నారాయణుడు. ఆయన అనుగ్రహంతో చికిత్సకు, వైద్య ప్రక్రియకు పూనుకునేవాడు వైద్యుడు. పూర్వము నారాయణుని ప్రతినిధిగా వ్యవహరించేవాడు వైద్యుడు, ఇప్పుడు పార్టీ ఫిరాయించి యముని మినిస్ట్రీ లో చేరినాడు.యముని ప్రభుత్వమునకు కలిపురుషుడు Chief Secretary అయినాడు. అందుకే ఈ నూతన నారాయనుడైన వైద్యునిచేతిలో రోగి హరీమంటున్నాడు.    ఈ విషయము అందరు వైద్యులకు వర్తించదు. లోకములో విధి బాధ్యత కర్తవ్యముగా నెంచి చికిత్స చేసే వైద్యులు కూడా ఉన్నారు. ఎటొచ్చీ మేకకు Butcher ఎవరు Vet. Doctor ఎవ్వరు అన్నది నిర్దుష్టముగా తెలియవలసిన అవసరము ఎంతో వున్నది.
ఆది వైద్యుడు ధన్వంతరి రూపుడైన విష్ణువే కావచ్చు కానీ  వైద్యవిద్యకు ఆద్యుడు బ్రహ్మ. ఆయన దక్షప్రజాపతికి దాన్ని అందించినాడు. ఆయన ఆశ్వనీదేవతలకు అందించినాడు. వారు ఇంద్రుడికి అప్పగించినారు. ఆయన భరద్వాజ మహర్షికి ఇచ్చినాడు. ఆ మహర్షి ఆత్రేయ మహర్షికి ఇచ్చినాడు. ఆయన పునర్వసుకు, ఆయన అగ్నివేశుడికి ఇచ్చినాడు. ఆ తర్వాత ఈ విద్యలో విశేష పరిశోధనలు చేసినవాడు చరకుడు. ఆయన సాంఖ్య, వైశేషిక, న్యాయ శాస్త్రాల నుంచి సాంకేతిక పదాలను స్వీకరించి వైద్యం ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆది దైవికాలకు భిన్నమైనదికాదని ఇది కూడా ఒక వైదిక కార్యమేనని నిరూపించినాడు. ఈ రోజులలో డాక్టర్లు చదువుకుంటున్న అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, క్లినికల్‌ మెడిసిన్‌ వంటి పలు అంశాలను చర కుడు ఆనాడే స్పృశించినాడు. ఆ తర్వాత వచ్చిన వాడు శుశ్రుతుడు. ఆయన శుశ్రుత వ్రాసినాడు. ఈయనను మొదటి శస్త్ర చికిత్సకునిగా పాశ్చాత్యులు కూడా గుర్తించినారు.
మనకు సనాతన వైద్యవిద్యగాఅందివస్తున్న ఆయుర్విద్యను ఉపవేదంగా  గుర్తించి మన పెద్దలు దానిని ఆయుర్వేదమన్నారు. ఈ విద్యకు అథర్వణ వేదం తల్లి. ఈ వేదం నుండి పుట్టిన గర్భోపనిషత్తు కూడా ఆయుర్వేదమునకు ఉపాంగమైయున్నది.
చాణుక్యుని నీతిశాస్త్రము ఈ విధముగా అంటూవున్నది:
ధనిక: శ్రోత్రియో, రాజా, నదీ, వైద్యస్తు పంచమ:
పంచ యత్ర నవిద్యంతే తత్ర వాసం న కారయేత్‌
ధనికుడు, బాగా చదువుకున్నవాడు, రాజు, నది, వైద్యుడు- ఈ అయిదుగురు లేని ఊళ్ళో ఉండకు అని దాని అర్థం. ఇదే క్రమం కాకపోయినా, ఒక్క రాజును వదలి, దాదాపు ఇలాంటి మాటే అన్నాడు సుమతీ శతకకారుడగు మన బద్దెన కవి
అప్పిచ్చువాడు, వైద్యుడు,
ఎప్పుడు ఎడతెగకపారు యేరును, ద్విజుడున్‌
చొప్పడిన నూర నుండుము
చొప్పడకున్న ఊరు చొరకుర సుమతీ!
నేటి వైద్యుల పరిస్థితికి నేను వ్రాసిన  ఈ శ్లోకము అద్దము పడుతుంది గమనించండి.
రోగార్తస్య భిషక్ దేవో రోగాంతేచ భిషక్ నరఃl
మూల్య పత్ర ప్రదానేన వైద్యో భవతి రాక్షసఃll
వ్యాధిగ్రస్థునికి వైద్యుడు దేవునివలె కనిపించుతాడు. రోగము ఉపశమించిందంటే ఆదిదేవుడు, రోగము కుదిరిన వానికి సాధారణ మానవునిగా కనిపించుతాడు. అదే వైద్యునికి డబ్బు ముట్టజెప్పేటపుడు, వైద్యుడు రక్కసునిగా అగుపించుతాడు.
నిజమే కదా!
స్వస్తి.