Showing posts with label INDIA అన్నది ఒక అర్థహీనమగు మాట. భారత అన్నది అత్యంత భావ స్ఫోరకము. Show all posts
Showing posts with label INDIA అన్నది ఒక అర్థహీనమగు మాట. భారత అన్నది అత్యంత భావ స్ఫోరకము. Show all posts

Wednesday, 6 September 2023

భారతం – భారత - భారత్

 

భారతం – భారత - భారత్

https://cherukurammohan.blogspot.com/2023/09/blog-post_6.html

‘భ’ అన్న అక్షరమునకు కాంతి ప్రకాశము ఇత్యాది అనేక అర్థములున్నాయి. కానీ నేను ఒక మహా పండితునివద్ద తెలుసుకొన్న ఒక అర్థము నామనసుకు హత్తుకొన్నది. అది నా బాల్యములో జరిగినది. ఆయన ‘భ కు ‘అభివృద్ధి అన్న అర్థము ఉన్నది అని చెప్పినారు. నిఘంటువులలో చూడలేదు గానీ పెద్దయిన తరువాత అన్వయించుకొంటే అదెంతో సమంజసమనిపించింది. ఉదాహరణకు ౧. నభ= అ+భ=అభివృద్ధి లేనిది=ఆకాశము. మరి ఆకాశానికి అభివృద్ధి లేదుకదా! శుభ = సు+భ = మంచి అభివృద్ధి. సభ=అభివృద్ధితో కూడినది. భగ=స్త్రీ జననాన్గము= ఈ అవయవము వల్లనే కదా కుటుంబము మరియు జనాభా అభివృద్ధి (భ) మరియు పురోగమనము(గ)నాకు హేతుభూతము అయినది. మన సంస్కృతము మన సంస్కృతి ఇంత గొప్పది. దీనినిబట్టి భరత అంటే భ+రత అభివృద్ధియందు మక్కువగల దేశము మన భరత దేశము. INDIA అన్న ఆంగ్లపదమునకు అర్థము భూతద్దము పెట్టి వెదకినా దొరుకదు. ‘సింధు’ నదిని దాటివచ్చి తురుష్కుకులు బహుశ నోరు తిరుగక నెమో ‘హిందుస్తాన్ అన్నారు. ఆ ‘హింద్ అన్నశబ్దాన్ని భూష పలుకలేకనేమో క్రుతకము చేసి ‘హింద్ కు బదులు ‘Ind’ అని పలికి ‘IA’ చేర్చినారు. అదే మహాప్రసాదమని ఒక అర్థవంతమగు ‘భారత’ అన్న పేరును విస్మరించి ‘INDIA’ పట్టుకొని

ఊగులాడుచున్నాము.                        

మన దేశము యొక్క మొట్టమొదతటి పేరు ‘అజనాభము అజుడు అంటే ‘పరబ్రహ్మ ‘నాభము అంటే ‘బొడ్డు అంటే ప్రపంచమునకు మనదేశము గరిమనాభి అని అన్వయము. అటుపిమ్మట జడ భారతుడను మహాయోగి తన పూర్వజన్మములో ఈ దేశమును చెప్పలేనంత సుభ్క్షముగా పాలించగా ఆయన పేరుతొ ఈ దేశము భరతదేశమైనది. శకుంతలాదుష్యంతుల కుమారుడైన ‘భరతుని’ పేరుతో ఈ దేశమునకు ‘భరతదేశ మన్న నామకరణ జరుగలేదు.

ఇక ఈ దేశపు ఎల్లలను గూర్చి బ్రహ్మాండ పురాణము ఏమి చెప్పినదో గమనించండి:  

ఉత్తరీయ సముద్రస్య హిమవత్ దక్షిణం చయత్l

వర్షం తత్ భారతం నామ యత్రేయం భారతీప్రజాll

దిగువన ఉండే సముద్రమునకు ఉత్తరమున హిమవత్ పర్వతమునకు దక్షిణమున ఉన్న భూభాగము ‘భారతము గానూ అందు నివసించు ప్రజలు భారతీయులు గానూ పిలువబడుదురు. ఇక ఈ ‘ భారతమునకు ఎల్లల గూర్చి ఏమి చెప్పబదినవో గమనించండి:

ద్వీపోః ఉపనిరుష్టోయం మ్లేశ్చైః రంతేషు సర్వశఃl

పూర్వే కిరాతాః యస్యాంతే పశ్చిమే యవనా స్మృతాఃll

హిమాలయమునకు ఆవల మ్లేచ్ఛదేశము, తూర్పున కిరాతదేశములు మరియు పశ్చిమమున యవన దేశములు గలవు. మన గుర్తు కొరకు పెట్టుకొన్న ఆయాదేశాములల పేర్లను వారు దత్తత చేసుకొనలేదు. మరి వారి ఉచ్చిష్టమును మనము గ్రహించుట హీనము కాదా!

పైన తెలిపిన మొదటి శ్లోక భావమునే విష్ణు పురాణము కూడా ఈ విధముగా చెప్పుచున్నది:

ఉత్తరీయ సముద్రస్య  హిమాద్రేశ్చైవ దక్షిణంl

వర్షం తత్ భారతం నామ భారతీ యాత్ర సంతతిఃll

మరి ఇంతగా మన పురాణవచనములను తుంగలదద్రొక్కి INDIA ను కౌగిలించుకొనుట సమంజసమా అన్నది మీ వితరనకే వదిలిపెడుతున్నాను.

స్వస్తి.