Showing posts with label బ్ర.శ్రీ.వే. రేమెళ్ళ అవధానులు గారు -. Show all posts
Showing posts with label బ్ర.శ్రీ.వే. రేమెళ్ళ అవధానులు గారు -. Show all posts

Sunday, 16 May 2021

బ్ర.శ్రీ.వే. రేమెళ్ళ అవధానులు గారు

 

బ్ర.శ్రీ.వే. రేమెళ్ళ అవధానులు గారు

 https://cherukurammohan.blogspot.com/2021/05/blog-post_16.html

ఆయననను గురించి వారి మాటల్లోనే! అతి క్లుప్తముగా...

  మాది తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని పొడగట్లపల్లి. చిన్నప్పటి నుంచీ వేదాలూ

మంత్రాల మీద అవగాహన ఉండేది .  కాకపోతే , నా లక్ష్యం వేరేగా ఉంది. 1969 లో 

నేను పరమాణు భౌతిక శాస్త్రం (Nuclear Physics) లో ఎమ్మెస్సీ చేశాను. అప్పుడే మన 

దేశం లో కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన మొట్టమొదటి ప్రకటన ఓ ప్రైవేటు కంపెనీ 

నుంచి వెలువడింది.  నేను అందులో చేరి డిప్లొమా పూర్తిచేశాను. తరవాత రాజోలు  డిగ్రీ 

కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్ గా ఉద్యోగం వచ్చింది. రోజూ డ్యూటీ అయిపోయాక ఖాళీగా 

ఉండటం ఇష్టంలేక పక్కనే ఉన్న వేదపాఠశాలకు వెళ్లి  వేదం నేర్చుకునేవాణ్ణి .  ఇది పూర్తి 

కాకుండానే హైదరాబాదులోని ఇసిఐల్ లో టెక్నికల్  ఆఫీసర్ గా ఉద్యోగం రావడంతో 

1971 లో హైదరాబాదు వచ్చేశాను. మన దేశం లో మొట్ట మొదటి కంప్యూటర్ తయారీ 

కంపెనీ ఇసిఐల్ .  అక్కడ శిక్షణ సమయం లో కొన్ని పుస్తకాలు చదువుతుంటే ఎ ప్లస్  బి 

హోల్ స్క్వేర్ చరిత్ర కనిపించింది . దాన్ని భారితీయులు మూడువేల ఏళ్ళ కిందటే 

కనుక్కున్నారట.  ఆ విషయం చదివాక మన ప్రాచీన గ్రంధాలపై ఆసక్తి పెరిగింది .

తెలుగును కంప్యూటర్లోకి ....

ఇసిఐల్ లో ఎనిమిదేళ్ళు పని చేశాను. ఇక్కడ కూడా Duty అయిపోయాక వేదం 

నేర్చుకునేవాణ్ణి. అప్పటికి ఏ భారతీయ భాషనూ కంప్యుటరీకరించలేదు. అప్పుడు మాకు 

తెలుగును కంప్యూటరీకరి౦చాలన్న  ఆలోచన వచ్చింది . అందుకోసం నేనూ మా 

స్నేహితులమూ ఆరునెలల పాటు శ్రమించా౦. తెలుగు అక్షరాలను కంప్యుటర్లో పెట్టాం 

.అలా 1976 లో మనదేశం లో కంప్యుటర్లోకి వచ్చిన మొదటి దేశభాష తెలుగే...అప్పట్లో 

అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్న వావిలాల గోపాల కృష్ణయ్య గారికీ ఈ 

విషయం తెలిసి మా ఆఫీసుకు వచ్చి నన్ను అభినందించారు, నా పనిని 

కొనసాగించమన్నారు. కానీ, ఆఫీసులో  ప్రోత్సహించక పోవడంతో దాన్ని పక్కన 

పెట్టేశా.”

ఎన్నో ఉడుదుడుకులు, ఎన్నో సమస్యలు, ఎన్నెన్నో అడ్డంకులు అన్నీ అధిగమించి 

నిస్వార్థముగా మన వేదములకు, సంస్కృతికి, భాషకు సేవచేయుచున్న ఆయన 

సహృదయతకు నమస్కారము.

విశదముగా మరొక మారు.