Showing posts with label ఒక సాధారణ సనాతన ధర్మావలంబి మనోవ్యథ చదవండి.. Show all posts
Showing posts with label ఒక సాధారణ సనాతన ధర్మావలంబి మనోవ్యథ చదవండి.. Show all posts

Saturday, 12 December 2020

మతాంతరీకరణలు

 

మతాంతరీకరణలు

(ఈ వ్యాసమునకు స్పూర్తి గోపాలకృష్ణ గౌతం గారు.)

https://cherukurammohan.blogspot.com/2020/12/blog-post_12.html

శ్రీయుతులు గోపాల కృష్ణ గౌతమ్ గారిని గురించి నాకు తెలిసిన ఒకటి, రెండు 

విషయములను తెలుపుతాను. వారు శ్రీశైలమును తమ స్థిర నివాసముగా 

ఏర్పరచుకొన్నారు. వారి వయసు 80 సంవత్సరములకు పైచిలుకే! ఈ వయసులోనూ 

తన వయసుకు మించిన సమస్యలను కలిగి కూడా, సనాతన ధర్మ పరిరక్షణకై ఎంతో తపించుతారు ఆయన. వారు వ్యక్తము చేసిన ఈ ఆవేదనాభరితమైన ఈ సందేహమును గమనించండి.

గోపాల కృష్ణ గౌతమ్: నా మనస్సు ఎందుకో పురుషసూక్తంతో మనం భగవంతునికి 

అభిషేకిస్తూ నిత్యం పూజిస్తూ ఉన్నాము. మన దేవాదాయముల నుండి క్రైస్తవ 

చర్చీలకోసం డబ్బు మళ్ళిస్తూ ఉంటే ఇక మనం ఉపేక్షిస్తూ ఉంటే పట్టించుకునే 

నాథుడేలేడు. కావున మనకర్తవ్యం జనాల్నిజాగృతం చేయవలసిన పరిస్థితి 

ఆసన్నమయినది. మనపరిస్థితి ఏమిటి ? దీనికి ఉపాయమేలేదా?

నా సమాధానము: శ్రీ గోపాల కృష్ణ గౌతమ్ గారూ మీ సందేహము ఎంతో 

సమంజసమైనది. మీరు పురుష సూక్తముతో ప్రారంభించినారు, అందుచేత అందులోని 

కులమునకు సంబంధించిన ఒక ముఖ్యమైన మంత్రముతో ణా సమాధానమును 

ప్రారంభించుతాను.

యజుర్వేదములోని పురుష సూక్తములో 'బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యః 

కృతః  ఉరూ తదస్యయద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత' అన్నారు. నాకు తెలిసిన 

మేరకు దీని అర్థాన్ని వివరించుతాను.

ఈ సమాజాన్ని పురుషాకృతి గా వూహించుకొంటే జ్ఞానము(బ్రహ్మ జ్ఞానము కల్గిన వాడు 

బ్రాహ్మణుడు) తలలో వుంటుంది. బ్రాహ్మలు కాని ఎంతోమంది పరమ జ్ఞానులైనారు  

లైనారు. ఊదాహరణకు :విశ్వామిత్రుడు,వాల్మీకి,మతంగుడు,శౌనకుడు సూతుడు ఆ 

మాటకు వస్తే వ్యాసుడు, మొదలగు వారంతా తమ సాధనతో జ్ఞానమును పొంది 

బ్రాహ్మణులైన వారే. వారందరినీ మొదట పూజించినది బ్రాహ్మణ జాతిలో పుట్టినవారే 

కదా!  జ్ఞానమును సంపాదించనూ వలసిందే, దానిని కాపాడనూ కాపాడ వలసిందే.  

జ్ఞానమును(సైన్స్) కాపాడుకొంటే సమాజానికి ప్రగతి వుంటుంది. నాడు, వీరికి(ఈ 

జ్ఞానులకు లేక ఈ బ్రాహ్మలకు) సలహాలిచ్చుట తప్పించితే సంపాదించే హక్కు లేదు. 

సలహా తీసుకొనే వాళ్ళే వారి అవసరాలు తీర్చేవారు. మరి ఈ జ్ఞానము సురక్షితముగా 

ఉండుటకు  సైనిక బలగము అవసరమేకదా! మన అణు కేంద్రాలు అంతరిక్ష కేంద్రాలు 

మొదలైన ఎన్నో ముఖ్యమైన కేంద్రాలకు సైనిక రక్షణ వున్నదా లేదా? కావున 

జ్ఞానమునకు రక్షణ క్షత్రియులు. క్షత్రియ శబ్దమునకు అర్థమేమంటే 'క్షతయేన త్రాత ఇతి 

క్షత్రియః' అన్నారు. అంటే గాయము కలుగకుండా ఉండుటకు రక్షణే కాని నిజానికి 

గాయము చేయు అధికారము వారికిలేదు. వీరికి మాంసభక్షణ అనివార్యము. 

రాజసికమగు గుణమునకు మాంస భక్షణ లేనిదే వీర్య, ధైర్య సాహసాదులు రానేరవు. 

ఎదిఎమయినా నిర్వచనమును బట్టి వీరికి  'డిఫెన్సు' తప్పించితే 'అఫెన్సు' లేదు. 

ఏమయినా ఎదుటివానిని గాయపరుచవలసి వచ్చినా లేక చంప వలసి వచ్చినా అది 

రక్షణ లోని భాగమే ఔతుంది. అంటే రాజులమని అహంకరించి మరొక రాజుపై దండయాత్ర చేయుట సవ్యమని శాస్త్రము చెప్పలేదు. పైగా బాహువులకుండేది బలమౌతుంది. బాహు బలము సైనిక బలము మనకు తెలిసిన పదాలే. బాహు శక్తి 

అనరు. కావున ఈ బాహు బలము జ్ఞానమునకు అతి చేరువలో వుంటుంది.  మరి ఈ 

రక్షణ కు వలసినదేది? ధనము. ఈ క్షత్రియబలగపు  ఖర్చంతా భరించుటకు  కావలసింది 

ఆర్థిక శక్తి. ఆర్ధిక శక్తి (Economic Strength) అంటారు. ఆర్ధిక బలము అనరు. ఈ ఆర్ధిక 

శక్తికి కావలసినవారు ఆర్ధిక నిపుణులు. వీరే 'వైశ్యులు.' ఈ వైశ్యుల వృత్తి వ్యాపారమే 

కాదు వ్యవసాయము కూడా. వీరికి మాంస భక్షణ నిషిద్ధము. ఈ మాంస భక్షణము 

త్రిగుణములలోని సత్వము ను నశింప జేసి  తామసము తో గూడిన రాజసమును 

పెంపొందించుతుంది కావున. వ్యాపారము లోనూ వ్యవహారములోను ఓర్పు చాలా 

అవసరమన్న విషయము అందరికీ తెలిసిందే. అందుచేత వీరికి మాంసభక్షణ నిషిద్ధము. 

వ్యవసాయము  ఒకప్పుడు రాజ్యములేలిన రెడ్డి(కాపు కొన్నిచోట్ల), కమ్మ, బలిజలు (కాపు 

కొన్నిచోట్ల), రాజ్యములంతరించిన తరువాత   వ్యవసాయము చేపట్టినట్లు తెలియవస్తూ 

వున్నది.

ఈ ‘కాపు’ అన్న శబ్దము ఆయా తెగలవారిని ‘దేశ రక్షకులుగా’ అంటే సైన్యములోను, 

సైన్యాదికారులుగాను ఉన్న ఒక వర్గము, తదుపరి రెడ్లగాను, బలిజలుగాను రెండు 

వర్గములయినట్లు తెలియవచ్చుచున్నది. కమ్మ వారు కూడా దేశారక్షణా దీక్షను స్వీకరించి 

యోధులై రాజ్యములను ఏలినవారు. కమ్మలు వేలమలు అన్నవి ప్రాంతములను బట్టి 

రెండు శాఖలాయి ఉండవచ్చు. నాటి పల్నాటిసీమ వీరి ఆవాసమై గుండ్లకమ్మ 

ప్రాంతమున నివసించుటచే బహుశ కమ్మవారయి యుండవచ్చు. రాజ్యములు పోయినతరువాత వీరు వైష్యులనుండి వ్యవసాయమును గ్రహించి ఆ వృత్తిలో స్థిరపదినారని చెప్పుటకు ఆధారములు కానవచ్చుచున్నవి.

సమాజము లేక దేశము యొక్క ఆర్ధిక స్థోమతను  'ఆర్ధిక శక్తి' (ఎకనామిక్ స్ట్రెంగ్త్) 

అంటారు.తొడలలో వుండేది శక్తియే కదా. కావున ఊరువులు అంటే తొడలు 'వైశ్యులు'. 

ఇక మిగిలినవి పాదాలు. పాదాలను శూద్రులతో పోల్చబడింది . ఈ సమాజము, దేశము 

నడవాలన్నా సాటి దేశాలకన్నా వేగంగా పరిగేత్తాలన్నా పాదాలుండి  తీరవలసిందే. 

సమాజ ప్రగతికి 'సేవ' లేకపోతే అసలు సమాజమే లేదు.వృత్తిని ఎన్నుకొన్న వాళ్ళు 

శూద్రులు.

సమాజశ్రేయస్సే వారి మీద ఆధార పడివుంది. ఎవరైనా సాష్టాంగ నమస్కారము కాళ్ళకు 

చేస్తారు కానీ తలకు చేయరు. కాలి చిటికెన వెలికి దెబ్బ తగిలినా ఆ వార్త తలకు 

చేరుతుంది. తక్షణం తల చేతులకు అంటే రాజుకు పురమాయించి తగిన చికిత్స 

చేపట్టజేస్తుంది. ఇంకొక ముఖ్య విషయం. తోమ్మిదిగజాల నేత చీరను అగ్గిపెట్టె లో పెట్టి 

ఇచ్సినాడట ఒక సాలెవాడు. ఆయన నైపుణ్యమునకు నమస్కరించకుండా ఉండగలమా. 

శిల్పము చిత్రలేఖనము వడ్రంగము కంసాలి పని, అది ఇది ఏల అన్నిరంగములలో 

సర్వతోముఖ అభివృద్ధి చెందినదీ వైదిక దేశము. కారణము సంతానము వారసత్వమును 

పుణికి పుచ్చుకోవడమే. వారి వారి తెలివి తేటలతో తమ తమ పరిశ్రమలను 

సర్వతోముఖముగా అభివృద్ధి చేసుకోవడమే. మరి నేడీ దేశము ఎందుకింత వెనుక 

బడినది?ఆంగ్లేయానుకరణ,ఆంగ్లేయానుసరణ. కమ్యూనిష్ట్ క్రిస్టియన్, ముస్లిం వర్గముల 

ప్రచారము మన ఉదాసీనత. వీటికి తోడు వాస్తవములు తెలుసుకొనే తపనను 

తామసము ఆవరించుట. అసలు మాల మాదిగా తెగలు పంచమ వర్ణస్తులు కారు . వారు శూద్ర విభాగమునకు చెందినవారు. వీరికి ప్రత్యెక సంఘములు నాయకత్వము కూడా ఉండేదని శిలాశాసనములు కడపజిల్లాలో కానవచ్చుచున్నవి.

మరి పంచమజాతి ఎవరు?

మిగిలినది రేపు........

మతాంతరీకరణలు – చివరి భాగము.

(ఈ వ్యాసమునకు స్పూర్తి గోపాలకృష్ణ గౌతం గారు.)

ఆ కాలము లో కూడా స్త్రీపురుషులు కామాతురులై అనులోమ, విలోమ వివాహములను 

చేసుకొని, అంటే నాడు నిర్దుష్టముగా అమలులో నుండిన వర్ణ ధర్మమును 

పాటించక,వర్ణ సాంకర్యము జరిగితే, దానికి తగిన కఠినమైన దండన వుండేది, కావున 

వారిని దేశ  బహిష్కృతి గావించే వారని పెద్దల మూలమున విన్నాను. వారు రాను రాను 

సమాజ బహిష్కృతులుగా ఆటవిక జన జాతులుగా(నేటి S.C.,S.T. లు ఆవిర్భవించి 

పంచమ జాతి యన్న క్రొత్త వర్గమును ఏర్పడినది. వృత్తిని ఆశ్రయించిన వారంతా 

నాలుగవ వర్గమునకు చెందినవారే!

చతుర్వర్ణ సంకలితమైన ఈ దేశ విభవమును దోచుకొనుటకే అన్య జాతులు ఈ 

దేశముపై దండయాత్ర సాగించి మన ధన మాన ప్రాణములను దోచుకొన్నారు. 

ఎంతమంది హిందూ స్త్రీలను చెరిచి మత మార్పిడి చేసినారో చెబితే బహుశా మాటలతో 

తీరదెమో! ఇతర మతముల దేవుడంతటి కౄరుడా. మన దేశములోని నేటి అన్య 

మతస్తులొకప్పుడు  ఆర్ష ధర్మాన్ని పాటించిన వారే కదా. వారిని పాశవికంగానో

ప్రలోభాలతోనో  నే కదా మార్పిడి చేసింది.

మన దేశానికీ దుర్దశను ప్రసాదించిన  ఘజని, ఘోరి, మీర్ ఖాసీం, సర్ విలియం జోన్సు 

మెకాలే కాల్డ్వెల్ మాక్స్ ముల్లర్లను మనము మరచి పోలేము. పురుషులను  కౄరముగా 

భయపెట్టి, స్త్రీలను పాశవికముగా చెఱచి తమ మతములోనికి, వారి మతగ్రంధము 

ననుసరించి, ముస్లీములు మార్చితేకిరస్తానీలు సామ దాన భేద దండోపాయాలతో, వక్ర 

భాష్యములతో, తమ మత గ్రంధము చెప్పిన విధముగా మార్చినారు. కానీ వారు ఏ రోజూ 

మన వేదాంతులతో వాడమునకు నిలిచి తమ గొప్పదనము చాటుకొన్నది లేదు.

Caste అన్న పోర్చుగీసు పదము 'వర్ణము' 'కులము 'నకు సమానము కాదు. విద్య 

నేర్పించే గురువు వద్ద వున్న పలువర్ణముల విద్యార్థులను కలిపి గురు కులము అనేవారు. 

'కుల్యుడు' అంటే గౌరవింప దగినవాడు. కుల్యా అంటే ఒక చిన్న నీటి ప్రవాహము . అంటే 

ఇవన్నే కలిసే 'భగవంతుడు' అనే సముద్రము చేరుతాయి అని అర్థము . పెద్దలు ఏపనీ 

విచక్షణారహితముగా చేయలేదు. మన పెద్దలను మనము గౌరవిద్దాం .

అది జరగవలెనంటే యువకులలో చైతన్యము రావాలి. మనకు  అంటే మనధర్మానికి 

జరిగే అన్యాయమును ముందు వారు గుర్తించితే తమ కర్తవ్యమేమిటి అని వారు 

తెలుసుకొని తద్విధముగా అన్యాయమును, అక్రమమును ప్రతిఘటించగలరు. దీనికి 

కావలసిన ఆయుధము ఆవేశము కాదు అత్యధిక సత్వము. నిమ్నవర్గమని తలచి   తగిన 

పునాదియే లేని క్రైస్తవమునకు మరలుచున్న కాందిశీకులలో ఈ ధర్మమూ యొక్క 

గొప్పదనము, వాల్మీకి మతంగ, శబరీ, గుహ, సూత, శౌనక ఇత్యాది మహాపురుషులు 

అగ్రవర్ణములవారు కారని, వారు నిమ్న కులస్తులయ్యును భగవంతుని సాయుజ్యమును 

పొందగలిగినారన్న వాస్తవములను ఎరుక పరచ వలసియుంటుంది. హిందూ 

మిషనరీలు ఇందు ఎక్కువ పాలు పంచుకొనవలసియుంటుంది. నేటి మన పేరు 

పొందిన పౌరాణికులు వారి వాడలలో విరివిగా ప్రసంగించవలసిన ఆవశ్యకత ఎంతయో 

ఉన్నది. మన స్వామీజీలు ఆ దళిత వాడలలో వారు చతురత వర్ణములోని వారే కానీ 

పంచామజాతి వారు కారని ప్రశాస్త్రాదారాలమూలముగా ప్రకటించవలసి యుంటుంది. 

శివశక్తి అన్న ఒక సనాతన ధర్మోద్ధారణ సంస్థ తనవంతు కృషి చేస్తూ వుంది కానీ పైన 

చెప్పిన పౌరాణికులు, స్వామీజీ లు ఈ ధర్మానికి అంత పెద్దగా చేస్తూ వుండేది ఏమీ లేదు. 

భజరంగ దళ్, విశ్వహిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తమ 

కార్యాచరణను ఉధృతము చేస్తేనే సద్యః ఫలితములను పొందగలము. అంటే వీరు 

నాయకులను ఉపనాయకులను ఏర్పరచి పేద వర్గ సముదాయముల లోనికి 

ప్రచ్ఛన్నముగానో ప్రత్యక్షముగానో పంపి వారితో మమేకమై వారి సమస్యలను వారి 

మతమార్పిడికి తగిన కారణములను తెలుసుకోగలిగితే ఈ సమస్యలకు తగిన 

పరిష్కారమును కనుగొని మార్పిడులను అరికట్టవచ్చును. ఇక దేవాదాయ శాఖకు 

సంబంధించి మొదట పెద్దఎత్తున హిందూజన జాగృతిని చేపట్టి హిందూదేశము

లోనే హిందువులు ఎంతగా వంచింప బడుతున్నారు అన్నది ప్రభుత్వము యొక్క దృష్టికి 

తెచ్చి తగిన మార్పుల కొరకు పోరాడవలసియున్నది. అసలు ఎవరూ లేనట్లు, మన 

సనాతన ధర్మమునకు చెడిన జనాభా ఎక్కువ ఉండికూడా పరమతస్థుని రాష్ట్రమునకు, 

చాలాకాలము దేశమునకు నాయకులను చేసి వారిచేత  పాలింపబడుట ఈ ధర్మమును, 

ఈ దేశమును, మన పూర్వులను అనగా మన ఋషి మునులను వారి నీతి బాటను 

నీటిబాట చేయుట కదా! వారి మాటలను నీటి మూటలు చేయుట కాదా! అని 

తలపోసేవారు ఉదయించితే ఈ ధర్మమూ ఈ దేశము సుభిక్షముగా ఉండగలదు.

ఒక వివేకానందుడు, ఒక హెగ్డేవార్ వంటి మహానుభావులు తిరిగీ మన మధ్యన 

ఆవిర్భవించితేనే ఈ పని సాధ్యమౌతుందన్న నమ్మకము పెట్టుకొన గలము.

వివేకానందులవారు ఈ కఠోపనిషత్తు శ్లోకమును పదే పదే గుర్తుచేసేవారు.

ఉత్తిష్ఠ, జాగ్రత

ప్రాప్య వరాన్నిబోధత

క్షురస్య ధారా నిశితా దురత్యయ

దుర్గ పథస్తత్కవయో వదంతి

మనకు వలసిన రీతిలో , ఇప్పటి పరిస్థితులకు అనుగుణముగా, అర్థము చెప్పుకోనవలసి 

వస్తే లే! మెలుకో! ఈ పని కత్తిమీద సాము వంటిది. ఇది దుర్గమ మార్గము. నీ శక్తి 

యుక్తిని పూర్తిగా ప్రదర్శించగలిగితేనే నీ ధ్యేయమును పొందగలవు.

స్వస్తి.

శ్రీ గోపాల కృష్ణ గౌతమ్ గారూ మీ అనుమతితో మీ సందేహమును, 

నాసమాధానమును నా కుడ్యము పై ప్రకటించుతాను.