ఇది నిజము
https://cherukurammohan.blogspot.com/2021/02/blog-post_9.html
నీతి చెప్పే అర్హత నాకు వుందో లేదో
తెలియదు,అందువల్ల నేను చెప్పే ఈ మాట మీరు గమనించి ఆచరించమని
చెప్పుటలేదు .
కానీ నిజము మాత్రము చెప్పవద్దని ఎవరూ
అనరు కదా. కావున నేను చెప్పే ఈ క్రింది మాట నిజమనిపిస్తే మీరూ నలుగురితో పంచుకొండి
.
ఇది నిజము
సూర్య చంద్ర గతుల నీవు సూక్ష్మ మరయ వలదులే
భూమి ఇరుసు మార్చుపనికి పూనుకొనగ వలదులే
తిన్న తిండి వంట బట్టు తీరు తెలియ వలదులే
మనిషి మనిషి పుట్టుకలో మార్పులెరుగ వలదులే
చేతనున్న చిన్నపనిని చేయగలుగ చాలులే
ఈర్ష్యాసూయలు మానుము ఇచ్చువాడు పరమాత్ముడు
ఎవరికెంత ఇవ్వవలెనొ ఇచ్చునతడు లోటులేక
ఆనందమునభిలషించు ఐశ్వర్యము తలపోయకు
కోపమెపుడు కోరబోకు కోరికలను పెంచబోకు
నీలిగగనమై నిరతము నిశ్చలముగ నిలిచినచో
ఉరుములైన మెరుపులైన ఉండబోవు అనవరతము
ఈనిజమును గమనించుము ఈశుని మది తలంచుము
నీకుసుఖము కలుగు మరియు నీదు ఇరుగు పొరుగునకు
నీదు సంఘమునకు మరియు నీ రాష్ట్రము దేశమునకు
నిత్య శుభము నిత్య జయము నిక్కముగా కల్గు నిజము
LikeLike · Comment · Share
Rajasekhar Somanchi, Vvs Sarma, Sahana Meenakshi and 27 others like
this.
Srinivas Bandi శుభంకరమైన కవిత్వం
రాంమ్మోహన్ రావు గారు
Feb 9 at 6:04pm · Unlike · 1
Boreddy Bagareddy cheptanu guruvugaru Andhariki.....
Feb 9 at 6:16pm · Unlike · 1
Kalyani Gauri Kasibhatla ఆనాటి స్వేచ్చాగీతము,
రాష్ట్ర గానము చదువుతున్నట్టుంది
Feb 9 at 8:03pm · Unlike · 1
Srinivasa Chakravarthy Jonnalagadda DHANYAVADAALU GURUVU GAARU.
Feb 9 at 9:36pm · Unlike · 1
Mukkavilli Dharma Prakasa Rao శుభ శుభోదయం
- చాలా చక్కటి కవిత శ్రీ రామ్మోహన రావు గారు
Feb 9 at 5:29am · Unlike · 1
Cheruku Ramamohanrao కృతజ్ఞతలు MDP గారూ
Feb 9 at 9:00am · Like
Kannaji Rao Jr. నిజము
Feb 9 at 9:25am · Unlike · 1
Sadanandeeswaraiah Vallamkondu ఛాలా నిజాలు
కవితతొ చెప్పారు. ధన్యవాదాలు కవి గారు
Feb 9 at 10:42pm · Unlike · 1
Vijaya Suvarna జల జల నది వలె సాగు
పదములతో,
తన స్వంత శుభము నుండి రాష్ట్రమునకు మరియు దేశమునకు కూడా
శుభం కలుగునని చెప్పడం చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది ...
3 hrs · Unlike · 2
Vijaya Suvarna రామమోహనరావు గారు, మీరు రాసిన ఈ కవిత ఆంగ్లం లోనికి అనువదించి ఇవ్వగలరా??? తెలుగు రాని మా ఇతర స్నేహితులకు, మా పిల్లలకు పంచాలని ఉన్నది...
3 hrs · Unlike · 1
Cheruku Ramamohanrao ప్రయత్నిస్తాను
అమ్మా
3 hrs · Like
Vvs Sarma Excellent sir! English Translation would definitely be
useful. It espouses the Sanatana Dharma viewpoint.
1 hr · Unlike · 1
Rajasekhar Somanchi chala bagundi guruvu garu
13 mins · Like
Krishna Mohan Mocherla నీలిగగనమై నిరతము
నిశ్చలముగ నిలిచినచో
ఉరుములైన మెరుపులైన ఉండబోవు అనవరతము
ఈనిజమును గమనించుము ఈశుని మది
తలంచుము good one sir !
Neeli gaganamai nirathamu nishalamai nilichinacho....manashu lacharimpa Koncham kastam guruvu gaaru.....But Sadhyamagunu...eshuni talachinacho...Idhi satyamaina ma guruvu bangaaru mata.
ReplyDelete