Tuesday, 22 December 2020

సహవాసమునకు రామానుజన్ గారి నిర్వచనము

సహవాసమునకు రామానుజన్ గారి నిర్వచనము

https://cherukurammohan.blogspot.com/2020/12/blog-post_22.html

1887 డిసెంబరు 22న శ్రీయుతులు రామానుజన్ గారి జన్మదినము. ఈ 

సందర్భముగా స్నేహితమును గూర్చి వారు ఏమిచేప్పినారో ఒకసారి మననము 

చేసుకొందాము.

ఆస్యగ్రంధిలో అందరూ ఒకరినొకరు ఎక్కువగా Friend (మిత్రమా) అంటూ సంబోధిస్తూవుంటారు. కొందరికి నచ్చుతుంది. కొందరికి నచ్చదు. నచ్చని వారిలో నేనూ ఒకడిని. పరిచయము అన్నది స్నేహితము కాజాలదు. అట్లు ఆపరిచయము స్నేహితముగా మారుటకు కొంతకాలము పడుతుంది, అదీ ఇరువురినడుమ భావసారూప్యము ఏర్పడితేనే! ఈ విషయము చదవండి. జీవితములో ఈ కాలము ముగ్గుతూ నలుగురు ఆవిధమైన స్నేహితులు దొరికితే అది ఆ వ్యక్తి అదృష్టము.

సహవాసమునకు రామానుజన్ గారి నిర్వచనము

శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ అన్నది రామానుజం గారి పూర్తి పేరు. ఈయన

డిసెంబర్ 22, 1887 న జన్మించి ఏప్రిల్ 26, 1920 న పరమపదించినారు.  20

శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఈయన ఒకరు. అతి

పిన్న వయసులో పరమపదించుట ఈదేశమునకు కలిగిన దురదృష్టము. ఈయనకు 

పది సంవత్సరముల వయసులోనే గణితశాస్త్రంతో అనుబంధము ఏర్పడినది.

బాల్యముననే  గణితము పట్ల ఆయనకు  ప్రకృతి సిద్ధమైన ఇష్టము గణితములో ఎదో చేయవలెనన్నది ఆయన అభీష్టము. బాల్యముననే  తన సొంతంగా సిద్ధాంతములను  రూపొందించ ప్రారంభించిన బాల మేధావి ఇతడు. ఈయన  ఎన్నో గణిత సిద్ధాంతములను (Hypothesis)  ప్రతిపాదించుట జరిగినది. అవన్నీ తిరుచిరాపల్లి

దగ్గరవున్న నామక్కల్ అన్న ఊరిలోని నరసింహస్వామి దేయాలయములోని, స్వామివారి

అర్దాంగియైన నామగిరి అమ్మవారు ఆయనకు కలలో కనిపించి ఏవేవో ఆయన మనో

ఫలకముపై వ్రాస్తే నిదుర లేచిన పిమ్మట ఆయన చిత్తుకాగితములలో వానిని

వ్రాసిభద్రపరచేవాడట.  ఈ నామగిరి దేవి ఆయన కలలో

కనిపించి ఇంగ్లాండ్ వెళ్ళమని అనుజ్ఞ ఇచ్చుట చేతనే ఆయన కేంబ్రిడ్జి యూనివర్సిటీ

ప్రొఫెసర్ హార్డీ గారి పిలుపు మేరకు వెళ్ళినట్లు చెబుతారు.

ఒకసారి ఒక జిజ్ఞ్యాసువు ఆయన స్నేహితులను గూర్చి తెలుసుకొన దలచి మీకు

ఎవరెవరు స్నేహితులు అని అడిగినాడట. అందుకు ఆయన నాకుతగిన స్నేహితుడు

ఇంతవరకూ దొరకలేదన్నాడట. అందుకు అతను " మీ ఉద్దేశ్యములో సహవాసము

ఏ విధముగా ఉండవలెనని కోరుకొంటారు" అని అడిగినాడట. రామానుజన్ గారు

అందుకు ఈ విధముగా జవాబు చెప్పినారు:

"వారు 220, 284 సంఖ్యల్లాగా వుండాల"ని చెప్పినారట. అడిగిన వ్యక్తికి అది అర్థము

గాకవిశధపరుచుమని అడిగినాడట. అందుకు రామానుజన్ గారు ఈ విధముగా

విశధపరచినారు:

"220 కి కారణాంకాలను (Factors) వ్రాస్తే అవి 1,2,4,5,10,11,20,22,44,55,110,220.

అదేవిధంగా 284 కు వ్రాస్తే అవి 1,2,4,71,142,284.

ఇప్పుడు మనము ఏ సంఖ్యలను అనగా 22౦ మరియు 284 ను మనము గ్రహించినామో

అవి పై పట్టికలలో తొలగించితే మనకు, 1,2,4,5,10,11,20,22,44,55,110 మరియు

1,2,4,71,142 మిగులుతాయి. ఇప్పుడు ఆ శ్రేఢులను విడివిడిగా కూడితే ఎంతవస్తుందో

చూస్తాము.

1+2+4+5+10+11+20+22+44+55+110 = 284

1+2+4+71+142 = 220

అంటే ఒకరిలో ఒకరి వుండిపోయేటంతగా మనసులు కలిస్తేనే సహవాసము. ఎంత గొప్ప మాటనో చూడండి.

No comments:

Post a Comment