Friday, 25 December 2020

.విపాశ-బిపాష-బీయాస్

 

విపాశ-బిపాష-బీయాస్

https://cherukurammohan.blogspot.com/2020/12/blog-post_25.html

బిపాషా బసు కాదండోయ్! ఇది ఒక నది. దీనిని ఇప్పుడు ఎంగిలిపీసు వాడు పెట్టిన 

‘బియాస్’ పేరుతో పిలుచుకొంతున్నాము. ఈ నది పంజాబులో ప్రవహించే  నదులలో 

ఒకట. అసలు ఈ 5 నదుల ఇప్పట పేర్లు ఏమిటంటే 1. ఝీలం 2. చీనాబ్ 3. రావి 4. 

బియాస్ 5. సట్లేజ్. మనమిపుడు బియాస్ నదిని గూర్చి మాట్లాడుకొనుచున్నాము. 

ఇప్పటికీ దీనిని బిపాష అని పిలిచేవారున్నారు. జాన్ అబ్రహం అన్న హిందీ సినిమా 

హీరోతో సంబంధము నెరిపి అటుపిమ్మట కరణ్ సింగ్ గ్రోవర్ అన్న Model ను 

పెళ్ళిచేసుకొంది. ఆ వాస్తవికతను అక్కడ వదిలి అసలు కథకు వద్దాము.

వశిష్ఠుమహర్షి కల్మాష పాదుడు అనే మహారాజుకు యాజకుడు అనగా యజ్ఞములు 

చేయించే పురొహితునిగా ఉంటూవుండినాడు. విశ్వామిత్రునికి కూడా అదే కోరిక 

కలిగింది.

ఒకరోజు కల్మాషపాదుడు వేటకు వెళ్ళి అలసిపోయి సమీపములో ఉన్న వశిష్టుని 

ఆశ్రమానికి వెళుతున్నాడు. దారిలో వశి వశిష్ఠుని కుమారులలో పెద్ద వాడైన శక్తి 

ఎదురుగా వస్తున్నాడు. కల్మాష పాదుడు గర్వంతో శక్తిని తప్పుకొని తనకి దారి 

ఇవ్వమన్నాడు.

"రాజా, ఎంతటి గొప్ప వారైనా, బ్రాహ్మణులు ఎదురుగా వచ్చినపుడు తప్పుకొని దారి 

ఇస్తారు. ఇది ధర్మం" అని అన్నాడు. ఆ మాటలకు కోపంచి, కల్మాష పాదుడు తన 

చేతికర్రతో శక్తిని కొట్టినాడు.

శక్తికి కోపం వచ్చి "నన్ను రాక్షస బుధ్ధితో అవమానించావు. నువ్వు రాక్షసుడివై 

నరమాంసం తింటూ జీవించు" అని శాపం ఇచ్చినాడు.అప్పుడు కళ్లు తెరిచాడు 

కల్మష పాదుడు. అతనిని వశిష్టుని పెద్ద కుమారుడిగా గుర్తించి, శాప విమోచన 

కొరకు ప్రార్థించినాడు.

ఇదంతా దూరం నుండి చూస్తున్న విశ్వామిత్రుడు, కల్మష పాదుని మనసులోకి 

కింకరుడు అనే రాక్షసుని ప్రవేశపెట్టినాడు. అప్పటి నుండి కల్మాష పాదుడు 

రాచకార్యములు మానివేసినాడు.

ఒకరోజు ఒక బ్రాహ్మణుడు కల్మష పాదుని వద్దకు వచ్చినాడు. తనకు మాంసాహార 

భోజనం కావాలని అడిగినాడు. సరే నని రాజు అనగా ఆ బాపడు వెడలిపోయినాడు. 

కాని రాజు ఆ మాట వంటవానికి చెప్ప మరచినాడు. రాత్రి పొద్దు పోయిన తరువాత 

విషయము గుర్తుకు వచ్చిన రాజు వెంటనే వంట వాడిని పిలిచి "నేను ఒక 

బ్రాహ్మణుడికి మాంసాహార భోజనం పెడతాను అని చెప్పినాను. అతనికి భోజనం 

పెట్టు" అని అన్నాడు.

దానికి వంట వాడు ఇంత చీకటివేళ మాంసము దొరుకదన్నాడు.  కింకరుడు 

అప్పటికే కల్మష పాదుని మనసును ఆవహించియుండుటచే నర మాంసమైనా వండి 

వడ్డించమని ఆదేశించినాడు.

సరేనని వంటవాడు ఆ బ్రాహ్మణుడికి నరమాంసం వండి పెట్టినాడు. ఆ బ్రాహ్మణుడు 

దానిని తిని అది తిన్నది నరమాంసమని గ్రహించినాడు. ఆతను కోపముతో "నర 

మాంస భోజనము నాకు పెట్టినందుకుగానూ  నీవుకూడా  నరమాంస భక్షకుడగు 

 రాక్షసుడివై పొమ్మని శపించినాడు. కల్మాష పాదుడు వెను వెంటనే రాక్షసునిగా 

మారిపోయినాడు.

కల్మాష పాదుడు వెంటనే శక్తి వద్దకు వెళ్లి "దీనికంతా నువ్వే కారణం ముందు నిన్నే 

తింటాను" అని శక్తిని చంపి తిన్నాడు. అంతటితో ఆగకుండా వశిష్ఠుని 

మిగతపుత్రులను చంపి తిన్నాడు.

ఆ ఘోరమమును గాంచి భరించలేక ప్రాయోపవేశమును గావించనెంచినాడు అంటే 

ఆత్మ హత్య చేసుకోదలచినాడు ఆ మహర్షి. పుత్ర శోకముతో తల్లడిల్లు వశిష్ఠుడు 

ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించి ఆ ప్రాంతమున పారే నదిలో కాళ్ళకు పెద్ద 

బండరాతి కట్టుకొని దూకినాడు. లోకోత్తర పుణ్యాత్ముడగు ఆ మహానుభావుని తనలో 

ఇముడ్చుకొనలేక ఆ నదీదేవత ఆయన బంధములను విడదీసి ఒడ్డు చేర్చింది. దైవ 

సంకల్పమును అర్థము చేసుకొన్నవాడైన ఆయన ఆశ్రమమునకు బయలుదేరినాడు.

వశిష్ఠుని కట్లు విప్పి ఆత్మ హత్యనుండి కాపాడిన ఆసమయము నుండి ఆ నదికి 

‘విపాశ’ అన్నపేరు వచ్చినది. ‘విపాశ’ అంటే ‘పాశ విముక్తుని చేసిన’ అని 

అన్వయము. 

ఆ ‘విపాశ రాను రాను ‘బిపాష’యై ఆంగ్లేయుల నోటబడి ‘బీయాస్’ అయినది.

స్వస్తి.

Tuesday, 22 December 2020

డిసెంబర్ 25-- జనవరి --1 (పాఠకుల స్పందన నా ప్రతి స్పందన)

  

డిసెంబర్ 25-- జనవరి --1 (పాఠకుల స్పందన నా ప్రతి స్పందన)

https://cherukurammohan.blogspot.com/2020/12/25-1_22.html

పై విషయమును గూర్చి ఈ దిగువన ఒక పాఠకుడి అభిప్రాయము ఇచ్చుట జరిగినది.

అది ఒక ఎంజాయ్ మెంటు తేదీ తప్ప మనకు వేరేరకమైన ప్రాముఖ్యం లేదు. ఆ రోజు 

మన ప్రభుత్వ శలవు దినం కాదు. అది మనకు అంతర్జాతీయం గా ఒక కాలచక్ర సూచిక 

మాత్రమే.

మనం ఏమీ పండుగ జరుపడం లేదు కదా! ఒక సరదాగా జరుపుకునే దానికి మనం 

విమర్శలు చెయ్యడం సరికాదేమో!

విశ్వవ్యాప్తంగా ఏకీకృతమైన భావనకోసం మనం ఇంగ్లీషువారి నూతన సంవత్సరం 

జరుపుకోవటంలో సమతౌల్యత అలోచించాలే కానీ స్వాభిమానపు పోకడలు పోయి 

ప్రక్కవారిచేత వీడిదో చాదస్తం అనిపించుకోవటం మంచిదా మిత్రమా ఆలోచించి 

రాబోయే నూతన సంవత్సరాదిని ఆహ్వానిద్దాం....

ఆనన గ్రంధము గోడపై అంటించినఒక కరపత్రమునకు పైన కొందరు విజ్ఞులు తమ 

తమ స్పందనలను తెలియజేసినారు. పేర్లిచ్చట పొందుపరుపబడలేదు.

నాకు తోచిన నాలుగు మాటలు వ్రాయలనిపించి వ్రాస్తున్నాను. సహజ సామాన్యముగా 

'పోనీలేఅన్నది మన మనస్తత్వము. ఒకసారి సింహావలోకనము చేస్తే ఏమేమి 

పోగొట్టుకోన్నామో అన్నది తెలియలేనంత పోగొట్టుకొన్నాము అని మనకవగతము 

కాగలదు. ఈ దేశపు విజ్ఞానము అపారము కావున పోయినది పట్టించుకోకుండా 

వున్నది పట్టుకొని ప్రాకులాడుచున్నాము. ఇప్పుడు 'ముదిమి మీదపడినది అని అనుకొనే 

వాళ్లయినా ఆలోచించకుంటే తదుపరి తరానికి ఇచ్చుటకు ఏమి మిగులదు. ఇక వారు 

వారి తరువాత తరానికి ఏమివ్వగలరు అన్నది విజ్ఞులు ఊహించగలరు.

‘Enjoyment’, తప్పుగా తలవకపోతేకు ఏమని అర్థము చెప్పుకొందాము. త్రాగడమా

అన్య స్త్రీల పొందును అభిలషించడమామై మరచి గంతులు వేయడమా

దీపాలనార్పడమా. తనపర అన్న విచక్షణ లేని క్లబ్బు పబ్బు గబ్బులలో అర్ధరాత్రి 

అరుపులతో కేరింతలతో మసలడమా ఏమిటి? దాదాపు రెండు పదుల సంవత్సరాల 

క్రితము వరకు ఈ దినము సెలవు దినముగా కూడా వుండేది. ఆంగ్లేయుల 

అధిపత్యముండినది కావున అది తప్పుల పట్టికయైనా మనపై రుద్దినారు. ప్రపంచ 

పటములోని ఎన్నో దేశములలో మన దెశమునకున్నంత పూర్వీక సంస్కృతి లేదు . వారికి 

ఆంగ్లేయుల ననుసరింపక తప్పదు. నా బాల్యమున కూడా ఇంగ్లీషు కేలెండర్ వుండేది. 

నాడు అది ప్రభుత్వ కార్యాలయములకు మాత్రమె పరిమితము . నాగరీకులు మన 

పంచాంగమునే అనుసరిచేవారు . 

ఇక డిసెంబర్ 25 సమీప దినములలో సాంటాక్లస్ వేషములో ఎవరో అగున్తకుడు వచ్చి 

పిల్లలకు ఏవో వస్తువులు పంచుతాడు. ఎంతమంది పంచుతున్నాడు, ఆడబ్బు 

ఎక్కడినుండి వస్తూ వున్నది. ధనవంతులు ఈ పని చేయరు. కావున మధ్యతరగతి 

లేకుంటే అంతకు క్రింది తరగతుల వారు ఎదో ఒక క్రైస్తవ తెగ తరుఫున, వారిచ్చే 

డబ్బులకు ఆశపడి చేయాలి, లేకుంటే ఆ చర్చివారే తమ ఉద్యోగులతో చేయించాలి. 

పిల్లల మనస్తత్వము అతి సున్నితమైనది. దానిపై వారు దేబ్బకోట్టుచున్నారు. పెరిగి పెద్దయిన తరువాత దానిపై ఒక అవ్యాజ ప్రేమ కలుగుతుంది. అది మతాంతరీకరణకు  దారి తీస్తుంది. 'వజ్రాదపి కఠోరాణి మ్రుదూని కుసుమాదపి' అన్నది మన పూర్వులు చెప్పిన మాట. కాఠిన్యము వహించవలసిన విషయములలో వజ్రముకన్నా కఠినముగా ఉండవలసినదే! దయ, జాలి, సానుభూతి చూపవలసిన చోట పుష్పమునకనా కోమలముగా ఉండవలసినదే! ఇది ఎప్పటికీ గుర్తుంచుకొనవలసిన విషయము.

   డిసెంబర్ 25 న క్రీస్తు పుట్టలేదని ఎందఱో పాశ్చాత్యులు నిరూపించినారు.

క్రిస్టమస్ క్రైస్తవులకు ముఖ్యమైన పండగ. యేసు క్రీస్తు పుట్టిన రోజును ఈ రోజు 

జరుపుకుంటారు. కొంతమంది క్రైస్తవులు డిసెంబర్ 25మరికొంత మంది ఆర్థడాక్స్ 

చర్చిలకు చెందిన క్రైస్తవులు జనవరి 7న క్రిస్టమస్‌ను జరుపుకుంటారు. చారిత్రక 

మరియు సందర్భోచిత ఆధారాల ప్రకారం యేసుక్రీస్తు డిశంబరులో పుట్టి 

ఉండకపోవచ్చు. ఈ రోజును ఒక రోమన్ల పండగ రోజు అయినందునో లేదా వింటర్ 

సోల్టీస్ అయినందునో క్రిస్టమస్ జరుపుకోవటానికి ఎంచుకున్నారు. (వికిపీడియా నుండి)

అసలు,

William J. Tighe is Associate Professor of History at Muhlenberg College in Allentown, Pennsylvania, and a faculty advisor to the Catholic Campus Ministry. He is a Member of St. Josaphat Ukrainian Catholic Church in Bethlehem, Pennsylvania. He is a contributing editor for Touchstone.

విలియమ్ తిఘే గారి మాటలలో చదవండి.

It is true that the first evidence of Christians celebrating December 25th as the date of the Lord’s nativity comes from Rome some years after Aurelian, in A.D. 336, but there is evidence from both the Greek East and the Latin West that Christians attempted to figure out the date of Christ’s birth long before they began to celebrate it liturgically, even in the second and third centuries. The evidence indicates, in fact, that the attribution of the date of December 25th was a by-product of attempts to determine when to celebrate his death and resurrection.

How did this happen? There is a seeming contradiction between the date of the Lord’s death as given in the synoptic Gospels and in John’s Gospel. The synoptics would appear to place it on Passover Day (after the Lord had celebrated the Passover Meal on the preceding evening), and John on the Eve of Passover, just when the Passover lambs were being slaughtered in the Jerusalem Temple for the feast that was to ensue after sunset on that day.

Solving this problem involves answering the question of whether the Lord’s Last Supper was a Passover Meal, or a meal celebrated a day earlier, which we cannot enter into here. Suffice it to say that the early Church followed John rather than the synoptics, and thus believed that Christ’s death would have taken place on 14 Nisan, according to the Jewish lunar calendar. (Modern scholars agree, by the way, that the death of Christ could have taken place only in A.D. 30 or 33, as those two are the only years of that time when the eve of Passover could have fallen on a Friday, the possibilities being either 7 April 30 or 3 April 33.)

Clemens Alexandrinus, Origen, Tertullian, Julius Africanus, Lactantius, Jerome, St. Austin, Sulpicius Severus, Prosper, and as many as place the death of Christ in the 15th or 16th year of Tiberius, make Christ to have preached but one year, or at most but two.

మరి వాస్తవికతయే లేకుండా పుర్రెకు తోచినట్లు ఏర్పాటు చేసిన పండుగకు మనము 

ప్రాధాన్యత ఇచ్చుట చిన్నబుచ్చుకోవలసిన విషయము కాదా. ఇక సాంటాక్లాస్ ఒక 

అభూత కల్పన. ఎందుకు మనము వెర్రిగా దానిని బట్టుకొని మన పిల్లలతో 

వ్రేలాడదీయించుతున్నామో తెలియదు.

జనవరి 1 న ఏమేమి ఆ మతస్తులు జరుపుకొను చున్నారో మనమదే జరుపుకొంటూ

పండుగ జరుపుకొనుట లేదంటే ఆ మాట సమంజసతకు దూరమౌతుందేమో.

తెల్లవాడికి సాంప్రదాయము గొప్ప అని ఎవరో వ్రాసినారు . తమ మతస్తులు కానివారి 

తలలు కోయుట సాంప్రదాయమాతమ మతస్తులయ్యును పరమతము నుండి 

నేర్చుకోనవలసినది చాలా ఉందని  పరిశోధించి తెలిపిన వారిని చిత్రహింసల పాలుచేసి 

చంపడము సాంప్రదాయమా, 14 వ శతాబ్దము వరకు సక్రమమైన కుటుంబ వ్యవస్థ 

లేకుండుట సాంప్రదాయమా, నా కొడుకుకు\కూతురికి పెళ్లి చేస్తున్నాను అని 

స్వతంత్రముగా పెళ్లిపత్రిక అచ్చోత్తించక తమ తమ చర్చిలను ఆశ్రయించుట 

సాంప్రదాయమాపుట్టిన రోజున దీపములార్పుట సాంప్రదాయమా. ఏది సాంప్రదాయము.

జనవరి మాసము పాశ్చాత్యుల 'autumn' (శిశిరము ) లో వస్తుంది . గ్రహ గమనములో 

ఎటువంటి ప్రత్యేకత వుండదు. శిశిరము రాలిపోవోటకు సంకేతము. వసంతము 

అంకురించుటకు సంకేతము. అసలు september అంటే సప్త అంటే 7 అట్లే october 

november december లు 8,9,10, మాసాలను తెలుపుతాయి . అంటే january 11 వ 

నెల february 12 వ నెల,  March క్రొత్త సంవత్సరము మొదటి నెల . అంటే విశ్వ 

వ్యాప్తంగా 'వసంతములోనే అందరికీ సంవత్సరాది యుండేది. వారి కాల గణనలో 

తప్పులు దిద్దుకొనుటకు వారు కొట్ట కొనకుకట్ట కడపటికితుట్ట తుదకు

చిట్టచివరకుఎట్టకేలకు  pope geregory తన శాస్త్రజ్ఞ సముదాయముతో 

1582 లో మార్చుట సంభవించినది. ఆ మార్పులో గాలికి 1౦ రోజులు కొట్టుకొని 

పోయినవి. మరి డిసెంబర్ 25, జనవరి 1 తేదీలు ఏవిధముగా నిర్దుష్టముగా ఆ 

పర్వదినములను సూచించగలవు. ఈ క్రింద తెలియజేసిన వాస్తవమును గమనించండి.

The Julian calendar day Thursday, 4 October 1582 was followed by the first 

day of the Gregorian calendar, Friday, 15 October 1582 (the cycle of 

weekdays was not affected). ఈ కాల గణనా ప్రవాహములొ ఎన్ని రోజులు కొట్టుకు 

పోయినవో గమనించగలరు.

అసలు వాళ్ళకు అర్ధరాత్రి ఎందుకు ఒక దినము మొదలౌతుందంటేవారి కేలెండరును 

మనలాగే సూర్యోదయాదితో మొదలు పెట్టుటకు వీలులేక మన సూర్యోదయాది 

సమయమునే ఎంచుకొన్నారు. మనకంటే  సగటున 6 గం. వెనకలుంటారేమో  కావున 

వారు రాత్రి 12 గం.లకే తెల్ల వార్చుకొన్నారు. ఇక స్వాభిమానమునకు వస్తే ,కాకిపిల్ల 

కాకికి ముద్దుఅన్నసామెత మన పూర్వీకులు చెప్పినదే కదా. మరి మనకవసరము లేదా.

ఏ రాజగోపాలాచారి గారోఏ రాధాకృష్ణ గారో ,ఏ ప్రకాశం పంతులుగారో ఇంగ్లీషు 

అనర్గళంగా మాట్లాడగల్గినా వారి బాసనే తప్ప యాసను సొంతము చేసుకోలేదు. 

జనవరి 1 వేడుకలు జరుపుకొన్న దాఖలాలను నేను గుర్తెరుగను. ఇక చివరిగా మన 

సాంప్రదాయమిది అని మన తరువాతి తరానికి చెప్పక లేక పొతే వారి చేతిలోకో వారి 

పిల్లల చేతి లోకో వారి పిల్లల చేతి లోకో మతగ్రంధములు మనమొద్దన్నా వచ్చేస్తాయి. 

అయినా వద్దనుట కప్పుడు మన ముండముగా!

ఒకవేళ అప్పుడు మన అను ఈ సంస్కృతీ అంతా పోయి వసుధైవ కుటుంబకము లో 

కలిసి పోయి మత గ్రంధాలను చేతిలో పట్టుకోవలసి వస్తుందేమో!

ఆర్ష ధర్మముపై అభిమానము గలిగినవారు మనసారా చదివి మన సంస్కృతిని 

పునరుద్ధరించండి.

Comments

రేపు పదుగురు వ్రాసిన Comments తో మీముందుకు వస్తాను.

Kiran Mva

Nice discussion sir. Jan 1 is just a holiday and not a new year for us. Neither do we celebrate the calendar date as birthday. We celebrate the thithi

 · Reply · 6y

Cheruku Ramamohanrao

The future of this culture, nation, and traditions are in the hands of youth kiran. If they take our negligence to heart we can rebuild our nation on the glories of the past. The youth of this dharma should put their heart and soul to know things and then start taking up measures to rebuild our dharma for the benefit of the entire world.

 · Reply · 6y · Edited

Ravi Sudhakar Musunuri

Very good ideas of implementing by all of us immediately. Thanks for excellent posting sir.

Australian PM Julia Gillard should be made Queen of the world. What she has said requires a lot of courage and confidence.

All the countries in the world should have leaders like her.

She says "Muslims, who are demanding Sharia law have been asked to leave Australia by Wednesday because Australia sees fanatic Muslims as terrorists. Each and every mosque will be searched and Muslims will cooperate with us in this process. All the Muslims who have migrated from other countries to Australia will have to adept and change themselves as per our country and not expect us to change as per them.

If they are unable to do so, they are most welcome to leave Australia.

A lot of Australian are worried that we may be insulting a particular religion....but I assure the people of Australia that whatever is being done is for the betterment of Australia and its people.

We speak English here and not Arabic or Urdu or any of the Islamic language so if you want to stay in our country you better learn to speak English.

In Australia we believe in Jesus who is our God and we believe in God. Just because we believe in and follow Christianity and no other religion, does not make us Communal which is why you will find God's Pictures and religious books everywhere.

If you have any objection to this, you are free to leave Australia and go anywhere else in the world.

Australia is our land, our country and this is our culture.

We do not follow your religion but we respect your sentiments which is why if you want to read Koran and offer namaz, please do not create noise pollution by using speakers and reading out loudly. Please DO NOT Read Koran or offer prayers in our schools, offices or public places.

You can do so in the quiet of your home or in a mosque which will not inconvenience us.

If you have any issues with our national flag or national anthem or our religion or our lifestyle, kindly leave Australia at this very moment and never ever return back".

Australian Prime Minister Julia Gillard

Indian Politicians and Leaders please learn something from her........& also from Russian President Vladimir Putin.

 · Reply · 6y · Edited

Vvs Sarma

Actually Christmas and Easter historically were attempts by the Catholic Church to discourage the Winter solstice and March Equinox observed earlier and to change the concepts of the early entrants to those of Christianity. Today the Winter solstice day is Dec 21. The Gregorian calendar is a slight modification of Julian calendar and has nothing to do with birth of Christ. There is some evidence that Christ was born around 8 BC. Today the Calendar era universally followed in the World is Gregorian calendar and the era is now called Common Era - Dec 2014CE. BC and AD terms associated with Christian era are no longer in use. In Telugu I write Samanya Sakam and not kristu.sakam. .

 · Reply · 6y · Edited

Prasad Puligella

So very true and hope we all understand and appreciate.

 · Reply · 6y

Cheruku Ramamohanrao

Govindarajulu Ch గారూ చెప్పు కరిచితే పనికిరాని పాత చెప్పుముక్క కాల్చి పెడితే తగ్గి 

పోయేది. సూదులు మత్రించి పంచ గూట్లో వేస్తే కామెర్లు తెల్లవారికల్లా తగ్గుముఖము 

పట్టేది. Hoot అన్నఆంగ్లేయ సైనికాధికారికి ఒకమంగలి అతను తెగినముక్కు అతికించినాడన్నది చారిత్రికసత్యము. రొంప జలుబుకు శొంటి మిరియాలు 

పసుపు చక్కర వెచ్చనిపాలు మందు. ఆలోపతిలో ఇంతవరకు మందే లేదు. 

ఇవిమచ్చునకుమాత్రమే. చరక సంహిత చదివితే మనవాళ్ళు వైద్యములోఎంత 

ముందంజ వేసియుండినారో తెలుస్తుంది. కామెర్లు మంగలి ఇంటికి వచ్చిశస్త్రచికిత్సచేసి 

తీసేవాడు. మనవాళ్ళు ఏర్పరచిన కులవ్యవస్థలో ఒకరెక్కువ ఒకరు తక్కువ లేదు. 

ఆయాతెగలు ఆయావృత్తులలో నిష్ణాతులుగా ఉండేవారు. పొడిదగ్గు వస్తే 

సాంబ్రాణికుసుమ అన్న వస్తువు పచారు కొట్టులో దొరికేదిఅది తమలపాకులో 

వేసుకొని తీవ్రతను బట్టి రోజూ రెండు పర్యాయములు తింటే తగ్గిపోయేది. పూర్వులు నిర్ణయించిన ఎన్నో విషయాలను, పాశ్చాత్యుల మోజుకు లోనై, నాడు అవహేళన చేసిన వైద్యులే నేడు తమవిగా చెప్పుకొని ఆచరింప జేయించు చున్నారు. అమెరికా మొదటిప్రెసిడెంటు కు హిపోక్రేటిస్ ఆలోపతి సిద్దాతము ననుసరించి చేసిన వైద్యము వల్ల తెల్లవారేసరికి ఆయన ప్రాణములు అనంత వాయువులలో లీనమైనాయి.

వారి గొప్పలు ఒప్పుకోవడము మనలో అవగాహనలోపము ఆత్మబల లోపముచంచల 

విశ్వాసములు కారణములు. ఆయుర్వేదము ఒక సంపూర్ణ వైద్యశాస్త్రము. అలోపతి వలె 

సమయానుకూలముగా మారేది కాదు.

నాకుటైపింగ్ చేతకాదు. అయినా మీసందేహనివృత్తికొరకు ఈమాత్రమువ్రాసినాను. 

వ్రాయవలసినది చాలా వున్నా వ్రాయలేక నిలిపివేస్తున్నాను.

ధర్మ ఏవహతోహన్తి ధర్మో రక్షతి రక్షితఃl

తస్మాత్ ధర్మో నహన్తవ్యో మానోధర్మోహతోవధీర్ll

 · Reply · 6y · Edited

Akella Ramakrishna

Inspiring article. congrats.

 · Reply · 6y

Kannaji Rao Jr.

 · Reply · 5y

Ravi Sudhakar Musunuri

I am sharing this now sir with your kind concurrence.

No photo description available.

 · Reply · 5y

DrChintalapati MuraliKrishna

నాయనలారా !! కొంత నిబ్బరించండి.. ఇంతలో హిందూత్వం అని చంకలెగరేయకండి. 

సంప్రదాయం అని చెప్పండి.. సంస్కృతి అని చెప్పండి. అవతలివాడు ఎగిరిపడకుండా 

ఉంటాడు. హిందూత్వం అని అప్పుడే ఎందుకు వద్దంటున్నానో కారణాలున్నాయ్. నా 

పుటలలో చెప్తున్నా చూడండి. తొందర పడకండి.

 · Reply · 5y

DrChintalapati MuraliKrishna

ఇక్షు రస సింధూరం గారూ- అంటే చెరుకు రామ మోహన రావు గారూ- మీరు 

సంప్రదాయ విశేషాలను చాలా చక్కగా చెప్తున్నారు. మీ మాటలను కొట్టివేయటానికి 

వీలులేదు. అవి సత్యాలు కనుక. కానీ విజ్ఞులైన మీరు చెప్పడం ఓపిగ లేకపోయినా 

తెలుగులో వ్రాయడం ఇప్పటి తరం అదృష్టం. మీ పెద్దరికానికి అందరూ తలవంచి 

నమస్కరించాలి. ముందుగా నేనే నా శీర్షాభివందనం చేస్తున్నాను. ఇదిగో ఇలా : 

ఎవ్వడు జాతి గౌరవము నింతగ నెత్తికి యెత్తుకొన్న వా

డెవ్వడు సంప్రదాయమును నింతగ సాక్ష్యముతోడ జెప్పు నిం

కెవ్వడు నిబ్బరమ్ము గొని యింతగ పూర్వుల బుద్ధి శీలముల్

నొవ్వనిరీతి చెప్పగల నుత్తము డీవొకరుండు గా కిలన్‌ !!

 · Reply · 5y · Edited

Ravi Sudhakar Musunuri

మీరిద్దరూ ఒకరిని మించి మరొకరు హేమాహేమీలు. మీరు ఇలాగే పది కాలాలు

అందరికీ స్పూర్తినిస్తూవుంటే మంచి రోజులు తప్పక వస్తాయి.

ఇరువురికి హృదయపూర్వక ప్రణామములు..._/||\_...

 · Reply · 5y

Banda Gangaraju

In places like Machilipatnam, Kakinada etc., government employees visit their bosses on NYD taking with them many presents like flowers, sweets, apples etc. That was part of colonial heritage. On the night of 31st December, at exactly 00-00 hours the railway staff used to let sirens and whistles blow by engines. Throughout the night of 31st Dec., energetic young men were partying till late hours to usher in NYD. Holiday on 1st Jan., is mostly to overcome the hangover. Now we continue the hangover of British rule.

 · Reply · 5y

Karre Srinivas Rao

Ela sadduku povadam valana terroristlaku kuda shava yatra chestunnaru.

 · Reply · 5y

Sudha Jandhyala

ఏది చెప్పినా ఎంతో శోధంచి వివరముగా తెలియచేస్తారు అందుకు ముందు 

ధన్యవాదములు. అన్నీ వాస్తవాలు చెప్పిన తరువాత తలవంచి ఆచరించటమే కర్త్వవ్యము

 · Reply · 4y

Ramakrishnan Ct

Ippudu nadustunnadi Ade

 · Reply · 4y

Cheruku Ramamohanrao

Let us corroborate to discontinue these practices forth with. This is what the humble submission we can make to the motherland.

 · Reply · 4y

Ramakrishnan Ct

Ipudu manchi cheppina vine manusulu takkuva padimandi velledare manadi

 · Reply · 4y

మిగతది రేపు చూద్దాము..................

ఒక పాఠకుడు

కొంతకాలమునకు మునుపుబహుశా కొన్ని యుగములకు మునుపు

భరతఖండంలోకూడా మార్గశిరమాస పౌర్ణమిని ‘ఉగాది’గా పరిగణించేవారనియిదే 

యావత్తు ప్రపంచమునకు విస్తరించివుండవచ్చుననిఅందుకే January 1st నూతన 

సంవత్సరాదిగా యేర్పడివుండవచ్చని కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖర 

సరస్వతి ఒకచోట అంటారు. గీతలో భగవాన్ తన అత్యంత ఉన్నతమైన విభూతులను 

చెబుతూ (10వ అధ్యాయంలో’) ‘మాసానాం మార్గశీర్షోఽహం’ అని అంటున్నారుఅంటే 

భగవాన్ మార్గశిరమాసమునకు అంతటి ఔన్నత్యమును యిచ్చివున్నారుగీత 

పుట్టడంకూడా మార్గశిర మాసంలోనేకాబట్టి పాశ్చాత్యులు January 1st ను ‘ఉగాది’గా 

పరిగణించడం సమంజసమేనేమో?

 · Reply · 4y

అదే పాఠకుడు

కొంతకాలమునకు మునుపుబహుశా కొన్ని యుగములకు మునుపు

భరతఖండంలోకూడా మార్గశిరమాస పౌర్ణమిని ‘ఉగాది’గా పరిగణించేవారనియిదే 

యావత్తు ప్రపంచమునకు విస్తరించివుండవచ్చుననిఅందుకే January 1st నూతన 

సంవత్సరాదిగా యేర్పడివుండవచ్చని కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశ See More

 · Reply · 4y

Cheruku Ramamohanrao

మార్గ శీర్ష పౌర్ణమి నుండి సంక్రమణము వరకు ఉన్నది పంటలు చేతికి వచ్చే కాలము. 

సూర్యుని దయవలన తమ పంటలు బాగా పదినాయన్న కృతజ్ఞతతో ఈ పండగ ను 

వేడుకల రూపములో చాలా కాలము జరుపుకొనే వారు. సంక్రాంతి సంబరాలను గూర్చి 

మీకు తెలియనిదేమున్నది. ఆ కాలములో గ్రీకులు కూడా Saturnalia అన్న పేరుతో ఈ 

విధముగానే జరిపే వారు. India in Greece అన్నపోకాక్ గారు వ్రాసిన గ్రంధము 

చదివితే మన ధర్మము గ్రీకు దేశములో ఎంత లోతునకు పాతుకొని యున్దినదో మనము 

గ్రహించవచ్చు.ఈ ధర్మము నాడు విశ్వవ్యాప్తమై ఉండేది. వారు మనలను PAGANS 

అనేవారు.

ఉగాది మార్గశిరములో మొదలయ్యేది అని నేను కూడా చదివినాను కానీ దానికి 

ఆధారము నాకు దొరుకలేదు. ఇక January మార్గాశిరమునకు లంకె కుదరదు. 

ఎందుకంటే పాశ్చాత్యులు ముఖ్యముగా గ్రీకులు రోమనులు వారి calendar ను చాలా 

మార్లు మార్చుకొన్నారు. అందువల్ల మనము సామ్యమును ఏర్పరుచలేము. వారి 

Autumn అంటే శిశిరము లో వారి ఉగాది వస్తుంది. శిశిరము, పండి రాలిపోవుట 

సూచిస్తుంది. అదియునుగాక భూతప్రేత పిశాచ గణములు బలోపేతములై చెలరేగు 

నిశీధిలో ఆ మతముల వారు కూడా ఆ గణముల ననుసరించుచూ ఆడే చిందులను మన 

సాంప్రదాయములో వెదుక గలమా! చిగురులు వేయుట పుట్టుకకు సంకేతము. అపుడు 

వసంత ఆవిర్భావము ఉగాదికి ఎంత సమంజసమో గమనించండి. వారి CALLENDER 

మరియు మన కాలగణనను గూర్చి నా శక్తియున్నంతవరకు ఒక వ్యాసమును 

చాలాకాలము క్రితమే వ్రాసినాను. తిరిగీ సమయము చూసి ప్రచురించగలను.

 · Reply · 4y

అదే పాఠకుడు: నేను చెబుచున్నది శ్రీ పరమాచార్యులవారి భాషణ 

ఆధారముతో. నాకు తెలిసినంతవరకు మన వేద సంస్కృతిని గుఱించిగానీపాశ్చ్యాత్యుల 

పద్ధతులను గుఱించి యింకా వారి చరిత్ర గుఱించి శ్రీచరణులకు తెలిసినంతగా 

వేఱెవరికిగానీ తెలియదని నా ధృఢమైన విశ్వాసం. ఇది గ్రుడ్డి నమ్మకము కాదు. ఈ 

విషయమును గుఱించి మాత్రమేగాదుఆయన మన సంస్కృతికి సంబంధించి అనేక 

విషయములయందు దీర్ఘమైన పరిశీలన చేసినవారు. మీకు కూడా తెలిసివుంటుంది. 

వారు చెబుతున్నది యేదైనప్పటికీ దానిని వేద వాక్కుగా నేను పరిగణిస్తున్నాను.

తరువాతమార్గశిరమాసం సుమారుగా డిసంబరు 15  జనవరి 14 తేదీల మధ్య 

వస్తుంది. (అధికమాసములకు అనుగుణంగా). కాబట్టిచాలా వరకు జనవరి 1వ తేది 

మార్గశిర మాసములోనే వస్తుంది. దీనికి సంక్రాంతి పండుగకు సంబంధం లేదు. 

సంక్రాంతి పండుగసూర్య భ్రమణ ఆధారముగా జరుపుకొంటున్న పండుగ - 

సాధారణంగా పౌష్యమాసంలో వస్తుంది. మనకు మాఘఫాల్గుణ మాసములే శిశిర 

ఋతువు. కాబట్టిశిశిర ఋతువుకుమార్గశిర మాసానికి సంబంధం లేదు.

శ్రీచరుణులు చెబుతున్నదేమిటంటే ‘మనం కూడా మార్గశిర మాసంలోనే ఉగాది 

చేసుకొనే వాళ్ళం. మన పద్ధతినే యితరులకూడా పాటించేవారు. మనము ఆ పద్ధతిని 

యెందుకనో విడిచివేశాము. వాళ్ళు యింకా ఆచరిస్తున్నారు’ అన్నది. ఈ విధంగా 

వదిలిపెట్టడం పెద్ద దోషమనికూడా ఆయన చెప్పలేదు.

ఇప్పుడు నా అభిప్రాయమును చెబుతాను: లోక వ్యవహారిక విషయాలన్నిటిలో కూడా 

మనం ఇంగ్లీషు Calendarనే వాడుకొంటున్నాము. ప్రపంచమంతా ఆ విధముగానే 

వాడుకొంటున్నారు. ఇంట్లో పండుగలకుపెళ్ళిలకుశ్రాద్ధాలకు మొదలైనవాటికి మన 

పంచాగమునే వాడుకొంటున్నాము. మనకు యిష్టం లేక పోతే New Year’s Dayని 

అంత Grandగా చేసుకొనవలసిన అవసరం లేదు. డబ్బులున్నవాళ్ళ సరదాలకు 

చేసుకొంటున్నది వారి యిష్టం. దానిని మనం ఆపగలమాచేసుకొననివ్వండి. క్లబ్బులు 

యింకా యితర విషయాలకు New Year’s Dayకి సంబంధం లేదని నా అభిప్రాయము. 

అదే విధముగా జనవరి 1కి తిరుమలలో పెద్ద Queueకూడా వుంటుంది.

కానీ ఒక్క విషయాన్ని పాటిస్తే బాగుంటుంది. పుట్టినరోజు పండుగను English 

Calendar ప్రకారం కాకుండా వారి వారి జన్మ నక్షత్రముననుసరించి చేసుకొనవచ్చు. దీని ద్వారా ఆయా నక్షత్రములు వారికి శుభఫలితములనిచ్చి ఆయురారోగ్యాలను వృద్ధిగావించి సుఖశాంతుల నిస్తాయి.

 · Reply · 4y

Cheruku Ramamohanrao

శ్రీ చరణులవారిని నేను కూడా తలుస్తాను. కొలుస్తాను. ఆయన నిస్సందేహముగా 

శంకరాంశయే. వారు నాకు తెలిసిన వరకుఉండవచ్చునని మాత్రమె అన్నారు. వారది 

నిజమంటే నేను కాదనబోయేది కూడా లేదు. ఈ విషయమై నేను విస్తారముగా కొన్ని 

విషయములను, మీ అభిప్రాయమునకు ధన్యవాదములు సమర్పించుతూ, 

సమాధానమును మీతో బాటు పాఠక లోకమునకు  అందజేయుచున్నాను.

వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యవతారిదారియైన విష్ణువు వేదాలను 

బ్రహ్మకప్పగించిన శుభతరుణ పురస్కారముగా విష్ణువు ప్రీత్యర్ధం 'ఉగాది

ఆచరణలోకి వచ్చెనని విష్ణు పురాణం. చైత్రశుక్లపాడ్యమినాడు విశాలవిశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుతుందని బ్రహ్మాండ పురాణము.

చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా 

చెప్పబడింది.

వాల్మీకి రామాయణము బాలకాండలో ఈ విధముగా చెప్పబడినది.

తతః చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ |

నక్షత్రే అదితి దైవత్యే స్వ ఉచ్ఛ సంస్థేషు పంచసు ||

గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా ఇందునా సహ |

ప్రోద్యమానే జగన్నాథం సర్వ లోక నమస్కృతం ||

అంటే 12వ నెలయైన చైత్ర మాసములో నవమి తిథి నాడుపునర్వసు నక్షత్రంలొ

కర్కాటక లగ్నంలొ రామచంద్రమూర్తి జన్మించినట్లు చెప్పబడినది.

దీనినిబట్టి రామాయణ కాలంలో వైశాఖ ప్రారంభమే సంవత్సరాది. మార్గశిర పుష్య 

మాసాలున్న హేమంతంతో సంవత్సరం ప్రారంభమని కౌత్యుడు మతం. 

అమరసింహుడు అమరకోశము కాలవర్గంలో మార్గశిర పుష్య మాసాలతోనే మొదటి 

ఋతువని అన్నాడు. మార్గశిర మాసానికి ‘ఆగ్రహాయణికః’ అనేది పర్యాయ పదం. 

ఆగ్ర స్థానములో ఉంటూ ఆయనం ప్రయాణము చేయునది- అంటే సంవత్సరమంతా 

ముందుండేదిలేక సంవత్సరాగ్రంలో ఉండేది. రామాయణంలో అన్నట్లు వైశాఖంలో 

సవత్సరం ప్రారంభించే ఆచారం వల్లనే కాబోలు నేడు ఉత్తరాపధంలో సూర్యమాన 

సంవత్సరాదికి బైసాఖి ( వైశాఖి) అనే వ్యవహారం ఉంది. భారతంలో చైత్ర వైశాఖ 

మాసాలు వసంత ఋతువనే గణన ఉంది. భవిష్య పురాణంలో యుగాదులను 

గూర్చిన వర్ణన కూడా సంవత్సరాది వైవిధ్యాన్ని ధ్రువ పరుస్తాయి. కృతయుగం వైశాఖ 

తృతీయనాడుత్రేతాయుగం కార్తీక నవమినాడుద్వాపరయుగం ఆశ్వీజ 

త్రయోదశినాడుకలియుగం ఫాల్గుణ పౌర్ణమినాడు పుట్టినట్లు కృష్ణుడు ధర్మరాజుకు 

చెప్పి వీటిని యుగాదులంటారని అన్నట్టు ఉంది.

ఆదిలో ఎన్నో మన్వంతరములకు పూర్వమే, అజనాభమని పిలువబడిన ఈ 

దేశములో ప్రాణులు మొదట పురుడు పోసుకొనుట జరిగినది. ఆ తరువాత ఎప్పుడో  పాశ్చాత్య దేశాలలో ప్రాణుల ఉత్పత్తి జరిగినది. 12,13 శతాబ్దములలో కూడా పాశ్చాత్యులు నాగరికత కలిగిన వారు కాదని తెలియవస్తూ ఉన్నది. వారికి వివాహ 

సాంప్రదాయము కూడా ఆరోజులలో లేదు. ఇందుకు సంబంధించిన అనేక 

విషయములు E. Pococke’ గారు వ్రాసిన పరిశోధనా గ్రంధము ‘India in 

Greece’ చదివితే మనకు మనదేశమును గూర్చిన అనేక విషయములు 

అవగతమౌతాయి. పాశ్చాత్యులు పునరుజ్జీవనము( Renaissance) (14 -16 

Centuries) నుండియే మన సంస్కృతి నాగరికతలలో కొన్నివిశాయములను 

గ్రహించి వానికి పాశ్చాత్య ముసుగు తొడిగి తమ సంస్కృతిగా మార్చుకొన్నారు.

ఇక QUEUE లగురించి అంటారా! మనము మనకు తెలిసిన విషయమును 

విశధపరచుచూ మంచి చెడ్డ తెలుపుతాము. అంగీకారము వారి ఇష్టమే! మీరు చెప్పిన 

విధముగా ఎదో భక్తిచేత జనవరి 1న హిందువులు పోతున్నారు అంటే, అదే రాను రానూ 

సామ్ప్రదాయమౌతుంది. ఒకప్పుడు క్రిస్మస్ మనము పట్టించుకొనే వారమే కాదు. 

ఇప్పుడు హిందువులు పిల్లలకు సంతాక్లాస్ వేషము వేసి సంబరాలు చేసుకొంటున్నారు. 

అసలు వారి నెలలు September, October, November, December, అన్నవి 

7,8,9,10 నేలలనే కదా తెలుపుతాయి. అసలు July, August నెలల పేర్లు Julius Caeser మరియు Augustus Caesar లు మార్చక మునుపు Pentalis మరియు Sextalis గా పిలువబడేవి. అంటే 5,6 నెలలుగా పిలువబడేవి.

ఒకటి మాత్రము నిజము. ఇప్పటికయినా ముఖ్యముగా నేటి బాలల తలిదండ్రులు మన 

సాంప్రదాయమును తెలుసుకొని అనుసరించక పోతేకిరస్తానీయులు, చర్చి లోనే మీ 

దేవుని కూడా చూపిస్తాము అనే రోజు రావచ్చు. పర మతస్తులతో ఉదార వాదము 

ఉపయోగపడదని నా నిశ్చితాభిప్రాయము. అట్లని వారిపై యుద్ధము ప్రకటించమని 

చెప్పుటలేదు. ఆ సాంప్రదాయము ‘Crusades’ అన్న పేరుతో క్రైస్తవము లోనూ ‘జీహాద్’ 

అన్నపేరుతో ఇస్లాము లొనూ వున్నవి.

జనవరి 1 న మనము బయటికి పోము కానీ పోతే తెలుస్తుంది ఆడా మగ తేడా లేకుండా 

ఎంత బరితెగించినారో! గుడికి పోవుట మాత్రమే తమరు తెలిపినారు అంతకు కనీసము 

5 రెట్ల యువతీ యువకులు 31 రాత్రిని పబ్బుల్లో తలిదండ్రులతో కూడా 

గడుపుచున్నారన్నది వాస్తవము. జనవరి 1 మన సవత్సరారంభముకాదు. డిసెంబరు 25 

న దేవదూత పుట్టలేదు.

 · Reply · 4y

అదే పాఠకుని ప్రత్యుత్తరము: ఉండేది’ అనే శ్రీచరణులు అన్నారు. నేను చెప్పిన 

Queueల విషయం ఆయనకు సంబంధించికాదు. జనవరి1కి మనవాళ్ళు యిస్తున్న 

ప్రాధాన్యత గుఱించి. తిరమలలోనేగాదు దేశంలోని ప్రతి గుడిలోకూడా ఆ రోజు పెద్ద 

Queue వుంటుంది. ఇది పెద్దగా పట్టించుకొనవలసినది కాదని నా అభిప్రాయం. కనీసం 

ఆ రోజునైనా భగవంతుడిని మనసారా ప్రార్థించుకొంటున్నారు. ఆ విధముగానే 

ఉగాదికూడా వెళ్ళేవాళ్ళు చాలామంది వున్నారు. గుడికి వెళ్ళడమన్నది తేదీలకు 

సంబంధించిన విషయము కాదు.

మీ మనసు నాకు అర్థమైనది. మనవాళ్ళు పాశ్చాత్య పోకడలలో వెళుతున్నారన్నది 

మీయొక్క బాధ. దీనిని అంత తొందరగా నివారించలేము. మన మతంయొక్క

సంస్కృతియొక్క విశిష్టత అర్థమయినప్పుడు ఈ విధముగా బయటి సంస్కృతుల వైపు 

మోజు తగ్గుతుంది. మొదట చేయవలసిన కార్యం అదే. ఇప్పుడుకూడా అమెరికావంటి 

దేశాలలో వుంటూ మన సంస్కృతియొక్క ఔన్నత్యమును తెలుసుకొని దానిని పాటిస్తున్న 

మనవారు వున్నారు. విదేశీయులనెందరినో తిరవణ్ణామలైలో చూడవచ్చు. 

విదేశీయులలో మన సంస్కుృతిపై గౌరవభావమును కలిగినవారు యెందరో వున్నారు. 

కానీ మనమే తగిన విధంగా నడుచుకొనడం లేదు. మన మతం గుఱించిగానీమన 

సంస్కృతి గుఱించిగానీ మనలోనే చాలమందికి అవగాహన లేదు! భగవద్గీత Great అని 

అంటాం. కానీ మనలో వేయి మందిలో ఒక్కరికైనా అందులో యేమున్నదని తెలుసా

అర్థమవుతున్నదో లేదో Christiansలో అనేకులు Bible చదువుతారు! మనలో యెంత 

మంది గీతను చదువుచున్నాము.

మనము గుడికి వెళ్ళడం వరకు మాత్రమే కొందఱైనా చేస్తున్నాము! అది కూడా 

యెందుకు చేస్తున్నాముమనకుంటున్న కోరికలను తీర్చమని భగవంతుడిని 

ప్రార్థించడానికియింకా మనకుంటున్న యేదో బాధను తొలగించమని దేవుడిని 

వేడుకోవడానికి మాత్రమే. మన మతాచరణ యింతటితో సమాప్తం. అదేనా గీతలో 

భగవానుడు చెప్పినది?

కాబట్టికావలసినది మనవాళ్ళు మన సంస్కృతిని గుఱించి పూర్తిగా తెలుసుకోవడం. 

దాని ఔన్నత్యాన్ని అంగీకరించడం. ఇది జరిగిన తరువాత దానిని పాటించడం

యితరులకు కూడా చెప్పి వారినికూడా పాటింపజేయడం. అప్పుడు automaticగా 

పాశ్చ్యాత్య మోజు తగ్గుతుంది.

ఈ విషయంలో యితర దేశస్థులను నిందించడందూషించడంవంటి వాటిలో 

యెటువంటి ప్రయోజనంగానీ లేదు. నిజమే దాదాపు రెండువందల సంవత్సరాలకు 

మించి వారు మనలను పాలించడమేగాకమన ఆలోచనా ధోరణిలోనే యెంతో 

మార్పును తెచ్చారు. మనకు మన సంస్కృతిపై గౌరవం తగ్గేటట్టు చేశారు. మన 

వాళ్ళుకూడా వాళ్ళ మోజులోపడ్డారు. ఇది అంతా చరిత్ర మాత్రమే. ఇప్పుడు మనకు 

స్వరాజ్యం వచ్చింది. ఇప్పుడు మన ఆలోచనా ధోరణిని మనకు కావలసిన విధంగా 

మాఱ్చుకొన వచ్చు. మనపై యెవరి ఆధిపత్యం లేదు. కానీ మనలో యింకా పూర్తిగా 

వివేకంతో ఆలోచించగల ధోరణి అలవడలేదు. విదేశీయుల ఆలోచనా ధోరణికి 

బానిసలుగా వుంటున్నాము. దీనినుండి బయట పడటానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం 

జరిగితే మనమే యితర దేశస్థులకు మార్గదర్శులుగా మాఱవచ్చు. యావత్తు ప్రపంచం 

మనలను చూచి నేర్చుకొనవలసిన స్థితికి మనము రాగలము. వారికి కూడా మన 

ఉన్నతమైన పద్ధతిని పంచుదాం. ప్రపంచమే సుఖశాంతులతో వెలసిల్లే విధముగా 

చేయగలిగిన సామర్థ్యం మనలో వున్నది. దానిని వెలుపలికి తెద్దాం.

 · Reply · 4y

Cheruku Ramamohanrao: శ్రీచరణులు ‘ఉండవచ్చు’ అన్నారా ఉండేది’ అన్నారా 

అన్నవిషయము పై వాదము వితండమునకు దారి తీస్తుంది. అందుచే నేను దానిని 

సరకు గొనుట లేదు. ఇక జనవరి 1కి ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకముగా గుడికి వెళ్ళడము మన ధర్మాచరణ దృక్పథముతో చూచిన మిక్కిలి అసంబద్ధము. ఈ విధముగా చేయుట పరోక్షముగా వారి నూతన సంవత్సరమునకు మద్దత్తు పలుకుటయే! వారు దీనిని మనపై ఒక నైతిక విజయముగా భావిన్చుతారు. పైపెచ్చు వారేపుడైనా మన ఉగాదిని తమ New Year’s Day గా భావించుతారా! వినాయక చవితి, దశరా వంటి పండుగలు వాళ్ళు చేస్తారా! అది పోనివ్వండి పంటలు చేతికి వచ్చినపుడు చేసే ‘సంబరాల సంక్రాంతిని’ వాళ్ళు గుర్తించుతారా! వాలకు లేని ఔదార్యము మనకెందులకు అన్న ఆలోచన ఒక సారి చేయండి. ఆ మతము యొక్క వయసు  2000 సంవత్సరములు. అంతుతెలియని కాలమునుండి అనూచానముగా వచ్చుచున్న మాన సాంప్రదాయములు మట్టికరచుచున్నవను పరితాపము మనలోనే లేకపోతే మన వారసులకు వచ్చే అవకాశము ఉంటుందంటారా! ఈ సమయములో మహా పండితకవి భవభూతి గారు తమ త్తర రామ చరిత్రలో వ్రాసిన శ్లోకమును ఇచ్చట ఉటంకించుచున్నాను.

వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి |

లోకోత్తరాణాం చేతాంసి కో హి విజ్ఞాతుమర్హతి||

లోకంలో శ్రేష్ఠులైన మహానుభావుల మనస్సులని ఎవరు తెలియగలరువారి మనస్సులు 

ఆయా సమయాలని అనుసరించి ఒకసారి కుసుమకోమలములుగానుమరొకసారి 

వజ్రసదృశ కఠోరముగాను ఉంటాయి.

కావున ‘పిండికి పిడుగుకు’ ఒకే మంత్రము పనికిరాదు.

‘కావలసినది మనవాళ్ళు మన సంస్కృతిని గుఱించి పూర్తిగా తెలుసుకోవడం’ అని 

అన్నారు మీరు. దానికి కావలసిన వనరులు శ్రోతలు ప్రవచన కారులు కావాలి. వారికి 

చిత్తశుద్ధి కావాలి. ఇవి మృగ్యమై, ఇంకా అట్టివారు లభించే వరకూ మన లాంటి వారి 

కర్తవ్యము మన వారసులను అన్యమత్ అనుభవములకు దూరముంచడమే! అది 

చేయకపోతే మన ధర్మమునకు అన్యాయము చేసినవారమౌతామని ణా 

నిశ్చితాప్రాయము.

‘మనలో యింకా పూర్తిగా వివేకంతో ఆలోచించగల ధోరణి అలవడలేదు’ అని 

మీరన్నారు. ఆమాట వాస్తవము. నా ప్రయత్నమంతా అందుకే! మీరన్నట్లు 

అంతుతెలియని సంవత్సరముల కాలమునుండి వస్తూవున్న మన సాంప్రదాయము 200 

ఏండ్ల పాలనాకాలమునునకు తలయోగ్గి, అనుకరించుట, అనుసరించుట 

శిగ్గుపడవలసిన విషయము. అన్యథా కాదు.

‘వారికి కూడా మన ఉన్నతమైన పద్ధతిని పంచుదాం. ప్రపంచమే సుఖశాంతులతో 

విలసిల్లే విధముగా చేయగలిగిన సామర్థ్యం మనలో వున్నది. దానిని వెలుపలికి తెద్దాం.’ 

అన్న మీమాతను ప్రచారములోనికి తేవలెనంటే ముందు మనిల్లు చక్కబెట్టుకోవాలి. 

తరువాతనే పరాయి ఇంటికి పంచగలము మన సలహాలను. ఒక పరుగు పందెపు 

యోదునికి అస్వస్థత చేస్తే అతానిని పరుగెత్తుటకు ప్రోత్సహించుట కాదు ముఖ్యము, 

అతని రుగ్మత నయము చేయటము.

స్వస్తి.

Vijaya Rao Atmakur

Previously banks used to give holiday for 1-1-xxxx, now discontinued.Not only 1st Jan we (my family) enjoy holidays of other religion festive days. We find more time to spend outside.

 · Reply · 4y

Cheruku Ramamohanrao

నేనిపుడు చేసే పని అదేనండి శాస్త్రిగారు

 · Reply · 4y

అదే పాఠకుని స్పందన

Doing good work continue! Raogaru!

 · Reply · 4y

Cheruku Ramamohanrao

Thank You

 · Reply · 4y