ఆచారాలు
- ఆదరాలు - ఆడపడచులు
ఆడపడచులను
గూర్చి మనువు ఈ విధముగా చెబుతాడు.
శోచంతి
జామయో యత్ర వినశ్వత్యాశు తత్కులంI
న
శోచంతితు యత్రైతా వర్ధితే తద్ది సర్వదాII
అనగా
ఆడపదచులు ఎక్కడయితే అన్నదమ్ములచేత ఆడరించబడరో
ఆ
వంశము నశిస్తుంది. అదే ఆ ఆడబిడ్డలను ఆడరించితే ఆ వంశము
అత్యున్నతముగా
వర్ధిల్లుతుంది.
తస్మాన్నేతాన్
సదా పూజ్యాః భూషణాచ్చాద నాశనైI
భూతికామైర్నరేన్నిత్యం
సత్కారేషూత్సవేషుచII
తమతింత
పండుగలు పబ్బాలు మొదలగు శుభకార్యములు జరుపుకొనునప్పుడు ఆడపదచులను పిలిచి మంచి
భోజనము పెట్టి, వస్త్ర భూషణాదులనిచ్చి సంతృప్తి పరచి పంపవలెనని మనువు చెబుతాడు.
ఆమె ఇంట ఏదయినా శుభకార్యము జరిగితే పుట్టినిన్తివారు తప్పక వెళ్లి ఆమెను తమ తమ అభిమానముతో
సంతృప్తి పరుచవలెను. అసలు బావమరదులు బ్రతుక గోరితే దాయాదులు చావు కోరుతారన్న సామెత
ఉండనే వున్నది కదా! ఆడబిడ్డ కంటతడి ఏ పరిస్థితిలోనూ ఆమె పుట్టినింటికి మంచిదికాదు.
కనుకనే
అన్నివిధములగు
శుభకార్యములలో తమ ఆడపదచులను మరియు వారి భర్తలను అంటే అల్లుళ్ళను మరియు వారి
సంతానమును సగౌరవముగా ఆహ్వానించి,తమ తల్లిదండ్రులు గతించినా, ఆదరించ వలసిన బాధ్యత అన్నదమ్ములకున్నది. ఇది
శాస్త్రవచానము.
పరమత
గ్రంధాలలో పెళ్ళి అయినా పిదప ఆడపదచులను గౌరవించే సాంప్రదాయము వుండాలేదా అన్న
తర్కమును వదిలివేస్తే మన వేద శాస్త్రపురాణేతిహాస గ్రంధాలలో మాత్రము ఎన్నో ఉదాహరణలు
పుష్కలముగా లభించుతాయి.
స్వస్తి.
No comments:
Post a Comment