Tuesday, 27 December 2016

అప్రాచ్య కాలగణన

 అప్రాచ్య కాలగణన ఒక పరిశీలన 

https://cherukurammohan.blogspot.com/2016/12/blog-post_27.html

క్రిస్మస్ ను గూర్చి వ్రాసిన వ్యాసానికి లభించిన ఆదరణకు పాఠకులకందరకూ  ఇందుమూలముగా ధన్యవాదములు సమర్పించుకొనుచున్నాను.. ఇపుడు పాశ్చాత్య  నూతన సవత్సరము సమీపించినది. మరి దానిని గూర్చికూడా  చదివి అందున్న లొసుగులు గ్రహించవలెనని నా ఆకాంక్ష. నిజమునకు నాకు ఈ పనులు నా వయసుతో పోలిస్తే శ్రమతో కూడినవే. కానీ నాలో వున్న, తెలియజెప్పవలెనను తపన నాతో ఈ పని చేయిస్తూ వుంది. చాలా మంది యువకులకు ఇందు నేను పొందు పరచిన వాస్తవాలను చదివిన తరువాతనైన మన పూర్వుల శాస్త్ర పరిజ్ఞానమును, జగతికి వారు చేసిన నిస్వార్థ సేవను గుర్తించండి. శాస్త్రీయ దృక్పథములేని పరమత పర్వదినముల జోలికి పోవద్దండి. మన ఉగాదిని తెలుగు సంవత్సరాది అనంటారు. అంటే తెలుగు వారి పండగ అనేకదా! మన రాష్ట్రములో ఉండే పరమతస్తులు కూడా వారి తాత ముత్తాతల కాలమునుండి తెలుగువారే కదా! మరి, ప్రత్యేకముగా ఏ దేవునికీ సంబంధించని , తెలుగు పండగను ఎందుకో జరుపుకోరు. మనమెందుకు January 1st ఒక పండుగ కంటే ఎక్కువగా జరుపుకొంటూ వున్నాము. ఒక్క సారి ఈ క్రింది లంకెలో 'ప్రాచ్యా ప్రాచ్య కాలమానము'ను గూర్చి చదవండి. వాస్తవమును గ్రహించండి.

లంకె: 

https://cherukurammohan.blogspot.com/2016/12/blog-post_27.html

 అప్రాచ్య అంటే పడమటి అని అర్థము. న+ప్రాచ్య = తూరుపు కానిది అని అర్థము.    అనంతమైన కాలాన్ని గణించడం అంత సులభం కాదు.  ఐనా దానిని ఎంత నిర్దుష్టంగా మన పూర్వీకులు గణించారో తెలుసుకొనుటకు ముందు పాశ్చాత్యుల క్యాలెండరు ను పరిశీలించుదాము.

క్యాలెండరు అన్నమాట లాటిన్ భాషలోని క్యాలండీ నుండి పుట్టినది ఇచ్చిన అప్పులు 

సంవత్సరపుమొదటి రోజున వసూలు చేసుకొనుటకు అది ఏర్పరుపబడినది.  తరువాత పౌర అనుశాసనమునకు ప్రజా ప్రయోజన కార్యాచరణమునకు ఇది పాశ్చాత్యుల చేత 

ఉపయోగింప  బడినది. దీనిని వీరు కాల క్రమేణ Almanac   అని గూడా అన్నారు. నిజానికిది Al – manakh అంటే వాతావరణ సూచిక అని అన్వయించుకొన వచ్చును.

 పదము Spanish Arabic భాషలకు చెందినది.

నేడు మనముపయోగించే క్యాలండరు రోము, ఈజిప్టు గ్రెగొరీ విధానాల కలయిక.  

రోము రాజ్యాన్ని పాలించిన రోములస్ కాలంలో ఏడాదికి 304 రోజులుండేవి.  సంవత్సరానికి 10 నెలలుండేవి.  మార్చి నుండి కొత్త సంవత్సరం మొదలయ్యేది. తరువాత 

రాజయినపంపిలియస్ కాలంలో దీనిని 10 నుండి 12 నెలలకు మార్చి, సంవత్సరమునకు 354 రోజులుగా నిర్ధారించినారు. పంపీలయస్  చక్రవర్తి క్రీ ll పూll 7 శతాబ్దము వాడు. రోములస్ తరువాత రోము నగరమునకు రాజయిన రెండవ వ్యక్తి.   ఈయన తిరిగీ సరి సంఖ్య మంచిది కాదనుకొని 355 రోజులు చేసినారు.  క్రీ ll పూll 153 లో సంవత్సరాన్ని జనవరికి మార్చటం   జరిగింది.

అంటే ప్రపంచమంతటా నూతన సంవత్సరము  వసంత ఋతువు(spring) లో మార్చ్ 

లేదా ఏప్రిల్ నెలలలో వ్స్స్తుంది.  అప్పుడే వారి క్రొత్త సంవత్సరముకూడామొదలయ్యేది.

అప్పుడేతరువులు చివురులు తొడుగును.  అంటే అది పుట్టుకతో పోల్చవచ్చు కదా!  

పండువారి పోవడము, మట్టిలో కలవడము శిశిరము (autumn) కాదా!  కాని పాశ్చాత్యులు వేడుకలు spring(March) లో కాదని శిశిరం (autumn) అంటే జనవరి లో చేయ 

మొదలిడినారు

తరువాత  క్రీ ll పూll 46  సంవత్సరములో అప్పటి రోమన్ చక్రవర్తి యగు జూలియస్ 

సీజరు ఈజిప్ట్ వెళ్ళినపుడు అక్కడి క్యాలెండరు విధానాలను గమనించి ఖగోళ 

శాస్త్రజ్ఞుడైన సోసీజెనాస్ అనునతని సహయంతో రోమను సంవత్సరానికి 365.25 

రోజులుగా నిర్ణయించి, తిరిగీసంవత్సరమును మార్చికి మార్చి, ఫిబ్రవరి

(అప్పుడు సంవత్సరానికి  చివరి నెల) నుండి 30 రోజులలో ఒక రోజును తీసి 5వ నెలకు చేర్చినారు.  మార్చి నుండి 5  నెలయైన నెలపెంటలిస్ (పెంట=5) అవుతుంది. ఏప్రిల్, జూన్, ఆగష్టు, సెప్టెంబరు, నవంబరు నెలలకు 30 రోజులనుంచి, ఫిబ్రవరి కి  29 రోజులు చేసినారు.  పెంటలిస్ పేరును తన పేరుతో జులై గా మార్చుకొని సంవత్సరారంభమును తిరిగీ  జనవరి తో చేయ ప్రారంభించినారు. 0.25 తేడాను, 4 సంవత్సరములకు ఒక రోజు ఔతుంది కాబట్టి దానిని ఫిబ్రవరి నెలకు కలిపి (29+1) 30 రోజులు చేయటం జరిగింది.  దీనిని leap year  అన్నారు.

సీజరు మేనల్లుని కొడుకైన ఆక్టేవియస్ సీజరు సింహాసనమును అధిష్ఠించు సమయమున తన పేరును అగస్టస్ సీజరుగా మార్చుకొని  27 B.C. లో రోము 

చక్రవర్తియైన పిమ్మట సెక్స్టలిస్ అనునెలకు(సెక్స్ట్=6) తనపేరుతో ఆగస్ట్ అని పెట్టి దానికి ఫిబ్రవరి నుండి ఒక రోజు తీసి, అంటే దానిని 28 రోజులుగా చేసి, ఆగష్టుకు 

కలిపి దానిని కుడా 31 రోజుల నెలగా చేసినాడు. లీపియరును  సంవత్సరములకు 

మార్పు చేసి ,  ఫిబ్రవరి కి కలిపేవారు.

తరువాత కాలంలో రోజుల లెక్కలో కచ్చితత్వము  పెరిగి  సంవత్సరానికి 365.242199  రోజులు చేసినారు.  ఇందువల్ల ఏడాదికి 11 నిll 14సెll తేడావస్తుంది.  దీనిని 13  పోపు 

గ్రెగొరీ VIII క్రీ llll 1582 లో గ్రెగోరియన్ క్యాలెండరు పేరుతో ప్రవేశ పెడుతూ లీపియర్ ను  తిరిగి 4 సంవత్సరములకొకసారి చేస్తూ  ఫిబ్రవరి కి 1 రోజును కలిపేవారు.  అట్లు 

చేయుటవలన ఒక వర్షమునకు .007801 రోజు ఎక్కువగా వచ్చేది. దీనిని 

చక్కబరచుటకు 400 తో భాగింపబడే శతాబ్ది సంవత్సరములు మాత్రమే లీప్ ఇయర్స్ గా తీసుకొన్నారు. 4 చేత భాగింపబడి తీసుకోలేదు. మార్పును చెయుటకుగానూ 

October 4, 1582 తరువాత, అక్టోబరు 15, 1582 గా ప్రకటింపబడినది. 

 10 రోజులు కాలముతో ఆడిన క్యాలెండరు ఆటకు బలియై పోయినాయి.  అందువల్ల వారి పండుగ తేదీలకు వారు పండుగ చేసుకొను సందర్భములకు పొంతన లేదని వారి శాస్త్రజ్ఞులే వక్కాణించుచున్నారు.

జనవరి:      జానస్ అన్న రెండుతలల దేవుడు స్వర్గంలో ప్రధాన ద్వారం వద్ద వుంటూ ఒక తలతో జరిగిన వర్షమును ఒక తలతో జరగబోయే వర్షమును చూస్తూ ఉంటాడట.  ఆయన 

పేరుతో  నెల ఏర్పడింది.  29 రోజులు కల్గిన  నెల 31 రోజుల నెలగా జూలియస్ సీజరు చేసినాడు.

ఫిబ్రవరి:      రోమన్ల పండుగ ఫిబ్రువా అన్నది లూపర్కాస్ అన్న దేవుని పేరుతో పునీతుడగుటకు (To get purified) జరుపుకుంటారు.  దీనికి కొంతకాలం 23, 24 రోజులుండేవి.  తరువాత 30 రోజులై ఆతరువాత జూలియస్ సీజరు, అగస్టస్ 

సీజరు  దయవల్ల 28 రోజులై కూర్చుంది.

మార్చి: మార్స్  రోమనుల యుద్ధ దేవత.  ఈయన ఒక చేతితో శూలం మరొక చేతితో 

డాలును ధరించి రెండు గుర్రాలమీద వస్తాడు.  ఈయన పేరుతో  నెల ఏర్పడింది.

ఏప్రిల్:        రోమన్ల వసంత దేవత అమ్నియో ఏప్రిట్ ఈమెను రోమన్లు ఎంతో 

అందమైనదిగా పునరుజ్జీవనకు నాందిగా భావించుతారు.

మే:    భూగోళాన్ని తన భుజస్కంధాలపై  మోసే అట్లాసు యొక్క ఏడుగురు కూతుళ్ళలో మేయో ఒకటి.  అట్లాసు  ఏడు మందిని ఏడు నక్షత్రములుగా మార్చివేసినాడు (మన 

సప్తర్షి  మండలం) దీనిని అంటే  నెలను పెద్దవాళ్ళకు (maiores) అంకితమిచ్చినారు.

జూన్: జూపిటర్ భార్య జూనో   జూన్ మాస స్థానానికి ఈవిడ జూనియస్ అన్న దేవునితో పోరాడుతుంది.  వారిరువురి పేర్లతో జూన్ వచ్చింది.  దీనిని యువతకు (Juniores) అంకితమిచ్చినారు.

తరువాత నెలల పేర్లు పెంటలిస్,  సేక్స్టలిస్, సెప్టంబర్, అక్టోబర్, నవంబర్, 

డిసెంబర్  ఉండేవి. 5, 6 నెలలైన  పెంటలిస్, సెక్స్టలిస్ లను జూలై, ఆగష్టులుగా 

తమ పేర్లతో జూలియస్, అగస్టస్ సీజర్లు మార్చుకొన్నట్లు మనము చెప్పుకొన్నాము.  7 నెలనుండి 10 నెలవరకు పేర్లు అట్లే వుండిపోయినాయి.

సెప్టెంబర్  సెప్ట్ అంటే సప్త 7 నెల

అక్టోబర్  అక్ట్ అంటే అష్ట 8 నెల

నవంబర్  నవ అంటే నవ 9 నెల

డిసెంబర్  డెస్సి అంటే దశ 10 నెల

 దీనిని బట్టి  మార్పులకు ముందు 11 నెలగా జనవరి, 12 నెలగా ఫిబ్రవరి వున్నట్లు 

రూఢియై పోయింది.

ఇక వారములైన సండే, మండే .. .. ..సాటర్ డేలను మన వారముల పేర్లను వారు 

వారి భాషలలోనికి మర్చుకొన్నావే.

         ఇన్ని మార్పులు చేర్పులు కూర్పులు జరిగిన తరువాత కుడా వారి కాలమానము భుభ్రమణముతో పోల్చిన 26 సెకన్ల తేడా వున్నది.  సెకన్లు 3323 సంవత్సరములకు 

ఒకరోజు ఔతుంది.  దానిని  సంవత్సరము లోని ఒక నెలకు (బహుశ ఫిబ్రవరికేనేమో) కలుపుకొనవలసి వస్తుంది.

         వాస్తవ కాల గణన కొరకు తమ తప్పులు తాము తెలుసు కొనుచూ కృషి చేసిన 

శాస్త్రజ్ఞులు కల్గిన  రోమన్ క్యాలెండరు తప్ప ప్రాచీన నాగరికత కలవని చెప్పుకొనెడు కొన్నిపాశ్చాత్య దేశములు వారివారి దేశ కాలానుకూలంగా తయారు చేసి వాడుకొన్ననూ

, కాలానికి కాలొడ్డి నిలువలేకపోయినవి.  మయుల క్యాలెండరు లోని చివరి దినమైన 21 డిసెంబరు 2012  యుగాంతము కాలేదు కదా! పాశ్చాత్యులది శాసనము. మనది నిర్దుష్టమైన శాస్త్రీయ గణనము. ఈ దిగువ మీ ముందు ఉంచుచున్న పరిశీలనను కూడా ఒకపరి గమనించి మన పూర్వుల గొప్పదనమును గ్రహించండి.
       మన పూర్వుల కాల గణన ప్రతిభతెలియుటకు ముందు అప్రాచ్య నూతన కాలగణన ఏవిధముగా అమలు పరచినదీ ఒకపరి చూడండి.

ఋతువుల్లో గానీ, ఖగోళంలో గానీ  ప్రకృతిలో గానీ ఎలాంటి మార్పులు లేవు ఏ యుగ పురుషుడు/సంఘ సంస్కర్త/ప్రవక్త /శాస్త్ర వేత్త ఎక్కడా జన్మించలేదు. లోక కంటకుడెవడూ సంహరించబడలేదు.ఏ చక్రవర్తీ సింహాసనమధిరోహించలేదు. ఏ విజయాలు సాధించబడలేదు, ఎటువంటి విప్లవాలు ప్రారంభం కాలేదు. కొత్త పంటలు చేతికి రావు. చెట్లు చిగురించే కాలమూ కాదు. ప్రకృతిలో పచ్చదనమే కనబడదు.  ఏ మతపరంగా చూసినా ఎటువంటి ప్రాముఖ్యత లేదు.శాస్త్రీయరంగా ఎటువంటి ప్రాధాన్యత లేదు. వారి మతగ్రంధమగు బైబిల్ లోకూడా జనవరి 1 వారి నూతన సంవత్సరపు ఆది అని తెలుపలేదు. పైపెచ్చు, బైబిల్ లోని"ఎజ్రా"పుస్తకం 10:17 వ వచనం సంవత్సరం లోని మొదటి నెల మార్చి - ఏప్రిల్ లో ప్రారంభమౌతుందని సాక్ష్యం పలుకుతోంది.  మరి ఎందుకు NEW YEAR'S DAY జరుపుకోవడం?

మనకు ఉగాది రోజుననే ప్రకృతి పరంగా  మార్పు సంభవిస్తుంది, చెట్లకు కొత్త చిగుళ్ళు  వస్తాయి మల్లెలు గుబాళిస్తాయి, మామిడి పళ్ళు కాస్తాయి. ప్రకృతి కొత్తదనము కొని తెస్తుంది. కాబట్టి ఉగాది రోజున నూతన సంవత్సర వేడుకలు చేసుకోవాలి. ఉగాదిని గూర్చి విశదముగా మన ఉగాది రోజున తెలుపుతాను. ఇపుడు, కొంత అవసరము కాబట్టి క్లుప్తముగా తెలియజేస్తాను.  
రామాయణంలో చైత్రం 12 వనెల.రాముడు ఋతువులన్నీ గడిచి 12 వ నెల అయిన చైత్రమాసంలో శుద్ధ నవమినాడు జన్మించినట్లు బాల కాండలో ఉంది. ( తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిధౌ) దీనినిబట్టి రామాయణ కాలంలో వైశాఖ ప్రారంభమే సంవత్సరాది. మార్గశిర పుష్య మాసాలున్న హేమంతంతో సంవత్సరం ప్రారంభమని కౌత్యుని మతం. అమరసింహుడు అమరకోశము కాలవర్గంలో మార్గశిర పుష్య మాసాలతోనే మొదటి ఋతువని అన్నాడు. మార్గశిర మాసానికి ఆగ్రహాయణికః అనేది పర్యాయ పదం. ఆగ్రమందున ఆయనము కలది- అంటే సంవత్సరగమనమును ముందుండి నడిపించేది అంటే సంవత్సరాగ్రంలో ఉండేది. అంటే మన సంవత్సరాది మార్గశిర పుష్య, మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖాల వరకు మారుతూ వచ్చిందనుట మనకు తేటతెల్లమౌతూవుంది. రామాయణంలో అన్నట్లు వైశాఖంలో సవత్సరం ప్రారంభించే ఆచారం వల్లనే కాబోలు నేడు ఉత్తరాపధంలో సూర్యమాన సంవత్సరాదికి బైసాఖి ( వైశాఖి) అనే వ్యవహారం ఉంది. భారతంలో చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువనే గణన ఉంది. భవిష్య పురాణంలో యుగాదులను గూర్చిన వర్ణన కూడా సంవత్సరాది వైవిధ్యాన్ని ధ్రువ పరుస్తాయి.

ఋతువులు కాలధర్మంతో సంబంధించినవి కనుక సాయనాలు. ఎప్పటికప్పుడు కదిలిపోతుంటాయి విషువత్తునుబట్టి. విషువత్ మారినా మనం ఇప్పటికీ చైత్ర వైశాఖమాసాలు వసంతఋతువు అంటున్నాము. రామాయణకాలంలో వైశాఖజ్యేష్ఠాలు వసంతము. ద్వాపర యుగాంతములో, విషువత్తు చలించడంవల్ల చైత్ర వైశాఖమాసాల్లో పడినది.అంటే భారతకాలంలో విషువత్తు మృగశిరంలో వచ్చి, వరాహమిహిరుని కాలానికి అశ్విన్యాదికి చలించింది. కనుకనే విష్ణుపురాణం 'మేషాదౌచ మృగాదౌచ మైత్రేయ విషవః స్థితాః' అని చెప్పింది. తర్వాత మారుతూ వచ్చిందనే కదా!! నేడు నిజానికి మాఘమాసంతోనే వసంతఋతువు ప్రారంభమవుతుంది. చైత్ర వైశాఖ మాసాలలో ఎండలు.నేడు ధర్మసింధువు రచయిత ఉగాది కాలానికి వేప ఇగుళ్ళు తినడం చేయమన్నాడు. కాని మన ఉగాది కాలానికి వేపయిగుళ్ళు ముదిరి పూతకూడ రాలిపోయి, పిందెలు పుడుతున్నాయి. వరాహమిహిరుడు క్రీస్తుశకం 5వ శతాబ్దివాడు.తనకు కొన్ని శతాబ్దాలముందే విషువత్తు మృగశిరనుండి అశ్వినీనక్షత్రం ప్రథమపాదానికి రావడం గుర్తించినాడు. వేదాంగ జ్యోతిష్య కాలంకంటే ప్రాచీనమైనబ్రాహ్మణకాలకాలంలో వసంత విషుత్కాలం కృత్తికానక్షత్రంలో సంభవించిందని పరిశీలించినాడు. తనకాలంలో వసంత విషువత్కాలం అశ్విన్యాదిలో సంభవించడం చేత ఆనాటినుంచి ఉత్తరాయణం దేవమానదినం ప్రారంభం కావడం ప్రాచీన సాంప్రదాయం కనుక అదే వసంత కాల ప్రారంభంగాను, ఆనాడే సంవత్సర ప్రారంభంగాను నిర్ణయించి మాస ఋతు సామరస్యం చేసాడు. వసంత విషుత్కాలం చైత్రమాస ప్రారంభంగా పరిగణితమైందన్నమాట, కాని మనం ధర్మసింధు కారుడన్నట్టు శుక్ల ప్రతిపదాదినుంచి అమావాస్యతో ముగిసే కాలాన్ని నెలగా పరిగణిస్తున్నాము. నాటినుంచి నేటివరకు చైత్రమాసంలోనే ఉగాది పండుగ అనే ఆచారం ఏర్పడింది.

వరాహమిహిరుడు వసంత విషువత్తునుబట్టి ఋతుమాస సామరస్యం సాధించనేమో సాధించినాడు కాని అప్పటినుంచి వసంత విషువత్ 23 డిగ్రీలు వెనక్కు వస్తూ ఉంది.

మన ఉగాది చైత్ర మాసంతోనే ఎందుకు మొదలవుతుంది అనే ప్రశ్నకు హేమాద్రి పండితుడు:

చైత్రమాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రధమేహనిl

శుక్ల పక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతిll

చైత్రశుద్ధ పాడ్యమి సూర్యోదయ సమయంలో బ్రహ్మ ఈ జగత్తును సంపూర్ణంగా సృష్టించినాడు అని సమాధానం చెప్పినాడు. ఇది ఇలా ఉంచితే మన దేశంలో పుష్య-మాఘ మాసాలు పంటలు పండి ప్రకృతి రసభరితంగా ఉండేకాలము. ఇదే మొదట్లో మన సంవత్సరాది. దీనిని సూచించే దినం మకర సంక్రమణం. ఇది మార్గశిర-పుష్య-మాఘమాసాల మధ్యన వచ్చేది విషువత్కాలం. విషువత్కాలమంటే పగలూ రాత్రీ సరిసమానంగా ఉండే కాలము. ‘సమరాంత్రిందివే కాలే విషువత్’ అన్నాడు అమరసింహుడు. ఈ విషువత్తులు రెండు. మకర సంక్రాంత్రి అలాంటి విషువత్తు లలో ఒకటి. ఈనాటి నుంచి ప్రకృతిలో క్రొత్త క్రొత్త మార్పులు కలగడం ఆరంభం అవుతుంది. అందుకే మనము చైత్రమాసమున శుక్ల పాడ్యమిని ఉగాదిగా ఏర్పరచుకొన్నాము. అప్పటినుండి చెట్లు చిగురించే కాలముగా దానిని గుర్తించినాము.పాడ్యమి నుడి 9 రోజులు వసంత నవరాత్రులుగా పండుగ చేసుకొని నవమి నాడు శ్రీరామజయంతి జరుపుకొంటాము. చైత్ర శుద్ధ పాడ్యమి రామ నవరాత్రుల మొదటిరోజు అగుట కూడా ఉగాదికి దోహదము చేసినదేమో!
ఏది ఏమయినా మన పూర్వులు తాము చేసిన ప్రతిపనికీ సహేతుకత, ఒకత్ర్కమును చూపించినారు. పాశ్చాత్యులు అట్లు కాదు. వారు ఏమిచేసినా తమ పెరుకోరకు ప్రాకులాడుటే మనకు కనిపిస్తుంది.

అసలు ఈ ఇంగ్లీష్ క్యాలేండర్ విధానం ఏమిటో మీరే గమనించండి. క్రీశ 1582 లో పోప్ గ్రెగేరియన్ సరిచేసిన క్యాలెండర్ ఇది. ఈ క్యాలెండర్ ప్రకారం మనం యదార్థ సంవత్సరం కంటే 24.6 సెకన్ల ఎక్కువ సమయాన్ని లెక్కించుకుంటున్నాము. ఆప్రకారం 3,513. సంవత్సరాలకు ఒక రోజు ఎక్కువ వస్తుంది. ఈ క్యాలెండర్ లోని లోపాలను సరిచేయడం అవసరమని సూచనలు చేస్తూ "నానాజాతిసమితి" ఒక కమిటీ ఏర్పాటుచేసింది. ఆ కమిటీ 185 రకాల పరిష్కారములను పరిశీలించి, క్రీశ 1926 లో ఒక రిపోర్టు ఇచ్చింది. ఇప్పటి దాకా అది ఎటూ తేలలేదు. ఇంకా ఇలాంటి చిన్నచిన్న చిక్కులు చాలానే ఉన్నాయి. ప్రపంచమంతా పూర్వం నూతన సంవత్సరం ఉగాదినాడు ప్రారంభమయ్యేది. ఫ్రాన్స్‌ లో క్రీశ 1582 వరకూ, ఇంగ్లాండులో క్రీశ 1752 వరకూ నూతన సంవత్సరం మార్చి 25 న ప్రారంభం అయ్యేదని చరిత్ర ద్వార తెలుస్తుంది. అయితే కాలగమనంలో ఇది ఎప్పుడు మారిందో తెలియదు కానీ, అది ఏప్రిల్‌ కు మారింది. అయితే నూతన సంవత్సరం మార్చిలో ఉంచాలా, ఏప్రెల్ లో ఉంచాలా అనేది వారికి కొంత సమస్యగా మారింది. సంవత్సరం ఆరంభం ఎప్పుడూ ఒకే నెలలో ఒకే తేదీన వస్తే బాగుంటుంది అని వారు ఆలోచించసాగారు.  ఆ సమయంలో క్రీశ 15 శతాబ్ది చివరి కాలంలో ఫ్రాన్స్‌ చక్రవర్తి " చార్లెస్ "అంతవరకూ 11 వ నెలగా ఉన్న జనవరిని మొదటి నెలగా నూతన సంవత్సరంగా ప్రారంభించాడు. ఈ విధంగా ప్రస్తుత మన నూతన సంవత్సరం ప్రారంభమైంది. ఇందుకు ఎలాంటి శాస్త్రీయ, ప్రకృతి పరమైన, ఆధారమూ లేదు. ముందుగా ఫ్రాన్స్‌, ఇటలీ, పోర్చుగీసు, స్పెయిన్ దీనిని అంగీకరించాయి. క్రీశ 1699 లో జర్మనీ, క్రీశ 1752లో ఇంగ్లండు, క్రీశ 1873 లో జపాన్‌, క్రీశ 1912 లో చైనా, క్రీశ 1916 లో బల్గేరియా, క్రీశ 1918 లో రష్యాలు ఈ క్యాలెండర్ ను అంగీకరించాయి. 17,18 శతాబ్దంలో తమ ఆధీనంలో ఉన్న అన్ని దేశాలలో బ్రిటిషువాడు దీన్ని ప్రవేశపెట్టినాడు. కానీ భారతీయ క్యాలెండర్ ఋషులచే తయారుచేయబడింది. ఆర్యభట, వరాహమిహిర, భాస్కరాచార్య 1 మరియు 2  వంటి మహా శాస్త్రజ్ఞులచే పరిశోధించబడింది. కొన్నివేల సంవత్సరాల తర్వాత ఏ సంవత్సరం లో ఏ నెలలో ఏ రోజున ఏ గ్రహణం వస్తుందో వారం వర్జ్యము తో సహా చెప్పగలిగేంతగా శోధించబడింది. ప్రకృతికి అనుగుణంగా, వసంత ఋతువు చైత్రశుద్ధ పాఢ్యమి రోజున ఉగాది ప్రారంభ మవుతుంది. కొన్నిచోట్ల వసంత ఋతువు మేషరాశి లో సూర్యుడు ప్రవేశించటాన్ని ఉగాదిగా చేస్తారు.  ఇంత పరిశోధన చేసి మనకు శాస్త్రబద్ధము చేసి పంచాంగమును అందించినవారిని గూర్చి మనము తెలుసుకోనవలసినది ఏమిటంటే ఉగాది మార్గశిరమున శుద్ధపాడ్యమిన మొదలయినా 

లేక చైత్రమున శుద్ధ పాడ్యమిన మొదలయినా మన శాస్త్రజ్ఞులు  ఖగోళ 

జ్యోతిశ్శాస్త్రములను బట్టి లెక్కలుకట్టి మార్పులను నిర్ణయించుతూ వచ్చినారు గానీ 

జూలియస్ సీసర్ అగస్టస్ సీజర్ల వలె,  రోజులను కలిపితమ పేర్లతో నెలలను 

మార్చుకోలేదు.

మొదటి నుండి అనుసరిస్తున్న ఉగాదిని కాదని ఫ్రాన్స్‌ వాడు ఏ ఆధారమూ లేకుండా ప్రతిపాదించిన నూతన సంవత్సరమును అనుసరించవలసిన కర్మ మనకు పట్టలేదు. మన ఖగోళ మేధావులు మనకిచ్చిన ప్రకృతి పరమయిన  విధానమునే మనము ఆచరించవలెను.  ఉగాదే మనకు కొత్త సంవత్సరము.

పాశాత్య నూతన సంవత్సరమునకు స్వస్తి చెబుదాము.

స్వస్తి.

·         Ravi Sudhakar Musunuri Excellent very elaborate explanation on Calendar in western style. Thank you so much for such an important informative posting sir.

9 hrs · Unlike · 1

·        

Srinivasa Subrahmanya San Bhagavatula ఆర్యా! మీ వివరణ చాలా సమయోచితంగాను అద్భుతంగాను ఉన్నది. అందుకోండి శతకోటి ధన్యవాదాలు. 
శ్రీనివాస సుబ్రహ్మణ్య సాయి.

8 hrs · Unlike · 1

·        

Rishignanam Surya NICE INFO. with your permissions sir, 00.00 hrs is calculated from GMT.INDIA is 5.30 hrs ahead of this time. Even before Christ, the calculation was the change of day was 00.00 hrs correlating with the sun raise in east i.e. the first ray on Mount Kailash. So even 00.00 hrs is not changing of date. The change of date is entirely based on sun raise in east i.e. 5.30 hrs. Though the essay needs some more additions, due to time, right now I am unable to add. I write to you separately, eg. 21 Dec. the 21st of March, June, Sept., Dec. are the cosmic quarter endings. Every 21st sun angle changes (this correlates with the breaths of human 21600) even (confirmed by NASA) THERE IS a place in space where one year on earth will be 1 day. (Probably that’s the reason anniversaries conducted once in a year)Indians diarised time according to planetary moments, whereas west, rulers changed according to their will.

3 hrs · Unlike · 2

·        

Subrahmanyam Nishtala తప్పులెంచుట చాలా సులభం. ఈ వయస్సులో నేటి తరానికే కాక మావంటి విషయపరిజ్ఞానం లేనివారికి కష్టపడి మన పూర్వీకుల ప్రతిభాపాటవాలను తెలియజేయాలనే తాపత్రయం బహుదా అభినందనీయం. మీకునా మనః పూర్వక నమస్సుమాంజలులు.

1 hr · Unlike · 1

·        

Vvs Sarma మన మతము, మన సంస్కృతులపై క్రూసేడులు, జిహాద్ లు అనే మత యుద్ధాలు జరుగుతున్నాయి. హిందువులు మాత్రమే ఈ యుద్ధాలను గమనించడములేదు. అమెరికా యూరప్ లలోని, ఇండాలజిస్టులు, వెండీ డోనిగర్, పాల్ కార్ట్రైట్, మైకెల్ విట్జెల్, పోలక్ వంటి విశ్వవిద్యాలయ ఆచార్యులు, పోప్ వంటి అనేక చర్చిల మతాధినేతలు, క్రైస్తవ మత ప్రచారకులు, ముల్లాలు, ఆమిర్ ఖాన్ వంటి సీనీమాల వాళ్ళు, అంతర్గత శత్రువులైన మార్క్సు వాదులు, జవహర్ లాల్ నెహ్రౌ యూనివర్సిటీ, ఇతర విద్యాసంస్థలలోని చరిత్ర, సోషియాలజి వంటి విభాగములలోని,ఆచార్యులు, వోట్ బాంకు లే ధ్యేయంగా గల రాజకీయ నాయకులు - వీరందరూ ఈ కౌరవ సేనలోని మహారథులే. ఇంకా పాండవ ప్రముఖుల పాత్ర ఎవరు వహిస్తారో తెలియడంలేదు. ఆ పార్థ సారథిని నమ్ముకొని ప్రార్థించడమే మన కర్తవ్యం.


·        

Cheruku Ramamohanrao నేను ఇంచుమించు 6గం.అని వాడినాను. అర్థముచేసుకోగలరు. నావ్యాసములోనిముఖ్యఉద్దేశ్యము వారిగణనవిధానము అనేకమార్పులకుగురికాగా మనది నాటికినేటికీ మారనివిధంగా నిలువటమేఅందుకుసాక్ష్యము.

All that you have mentioned in your comment was inferred by our ancestors.
My aim is
 to first shun these celebrations for the reasons mentioned above. Though I know the latter developments in their calendar ours is time tested. Let us sincerely put a full stop of celebrating in autumn which symbolizes death.
AM= AROHAN MARTHAND
 PM= PATAN MARTHAND

 

·        

Vvs Sarma Our concept and model of cycle of time is in tune with astronomy. They are even now talking of linear time with their calendar which is like saying Earth is flat.

9 mins · Like

·        

Vvs Sarma Even a religious festival like Christmas and the insignificant calendar New Year day have been converted to marketing commerce and merry making, Significance of Time in Life, is to be understood along with our measurement of Time. God is verily time. Winter solstice and March equinox are the points of time that are important. Events

3 mins · Like

 

 

 

పూర్ణ చంద్ర రావు మంత్రాల Adbhuta vishayam teliya parchinaradi dhanyavadamulu

 

1

Manage



Show more reactions

Vijay Maruti Babu · Friends with Kiran Mva and 15 others

పంచాంగ గణకము జ్యోతిశ్శాస్త్రములు ఉపవేదములుగ భగవంతునిచే అనుగ్రహించబడినవి కావున అపౌరుషేయాలు. ప్రస్తుత ప్రపంచంలో ఉన్న ఎలక్త్రానిక్ పరిజ్ఞానాన్ని వాడి కూడా తెలియలేని అద్భుత విజ్ఞాన భండారమది. 

మతాంతరీకరణ, సరైన అవగాహనలేని రాజకీయ నాయకత్వం మన విజ్ఞానాన్ని ప్రజానీకానికి అందకుండా నాశనం చేస్తున్నాయి.

 

 

2

Manage

 

Show more reactions

  ·

Gowrishankar Gowri very interesting matter.You are genious.All your views are food for thoughts.We expect more from your pen Thanq sir.Namaste Namasye Namonamaha.

 

1

Manag

 


Show more reac

Sudha Jandhyala అసలు ఇంతగా ఆలోచించాలని ఎవరూ అనుకోక ప్రవాహవేగానికి కొట్టుకుపోతున్నాము.మూసాలోచనలే అందరికి.మీరు పెడుతున్న విషయాలు ఎందరు చదువుతున్నారో తెలియదుకాని, అందరు చదవగలిగితే కొంచెమైనా చైతన్యము రావటానికి వాస్తవాలు తెలుసుకోవటానికి (ముఖ్యంగాయువత భవిష్యత్తు అంతా వాళ్లదేకదా)చాలా వుపయోగపడ్తాయి

 

2

Manage

 


Show more react

Satyanarayanareddy Mallidi చాలా చక్కని వివరణ అండీ ఇంతటి పరిఙ్ఞానాన్ని చరిత్రనీ ఉంచుకుని మనం
ప్రపంచకాలమానంలోకి చొచ్చుకుపోలేకపోయాం

 

1

Manag

 

Show more reactions

  ·

Sudha Jandhyala V

 

1

Manag

 

Show more reactio

Rekha , chalabaga vivarincharu dhanyulumu telusukonnanduku

 

1

Manage

 

Show more reactions

  ·

Subramanyam Juturu kaalaanni daani pramukhyathanu adbhutamugaa vivarinchinandulaku meeku dhanyavadamulu rao gaaru.

 

1

Manag

 

Show more reactions

  ·

Sitha Mytreyi Rentala · 14 mutual friends

నమః

 

 

1

Manag

 

Show more reactions

  ·

Varanasi Gangadhara Rao great information and thoughtful observations take place in your nice postings,sir..thanks

 

 

 

 

 

 

 


1 comment: