Friday, 5 August 2016

జన్మదిన ఆశంసనములు

జన్మదిన ఆశంసనములు

స్నేహం
బంధాలను తెగ పెంచేసేది 
అనుబంధాలను ఉంచేది 
అనురాగాలను పంచేసేది 
ఆత్మీయతతో అలరించేది
మరుపు రానిది, మరువ లేనిది
తియ్యనైనది , తిరుగులేనిది 
నిత్యమైనది, సత్యమైనది
కపటమన్నదే కానరానిది 
కలహమన్నదే కలుగలేనిది 
మేని అందమును చూడబోనిది 
మేలిమి మనసుల కలయికైనది
అపార్ధమన్నది అర్థం కానిది
అనుమానానికి తావివ్వనిది
ఆత్మానందము కలిగించేది
సృష్టిలోనె తా పుట్టు చున్నది
సృష్టి తోటే లయమందుచున్నది
తియ్యనైనది కమ్మనైనది
పెరుగుటె కానీ కరిగి పోనిది
ఎంత పంచినా తరిగి పోనిది
అనురాగానికి అమ్మ వంటిది
అలుపెరుగనిది సొలుపెరుగనిది
అసలు స్నేహమది అన్నది నామది

శతంజీవ శరదో వర్ధమాన ఇత్యపినిగమో భవతి శతమితి 

శతం దీర్ఘ మాయుర్మరుత ఏనా వర్ధయంతి 

శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం 

భవతి శతమైశ్వర్యం భవతి శతమితిశతం దీర్ఘమాయుః . 


జన్మదిన శుభాకాంక్షలు

No comments:

Post a Comment