Saturday, 28 May 2016

రామా -- మణి ప్రవాళ కందములు


రామా -- మణి ప్రవాళ కందములు
దండము తొండము దేవర
దండము గండములబాపు దళితాళివరా
దండము బ్రహ్మాండోదర
దండము వేదండ వక్త్ర దాక్షిణ్యకరా
1.   శివభక్తి శివుని పూజలు   
శివ చింతన చేయునిన్ను శివరూపునిగా
శివమంత్రమొకటి నమ్ముచు
శివపదముల చేర్చి మ్రొక్కు శిరమును రామా!

2. నాల్కే తిరుగని పాపకు
యల్కేజీ నమ్మనాన్న ఎంట్రీ నొసగా
పల్కంగ పిల్లి కూతలు
మిల్కీ బార్లంచు మిగుల మెచ్చిరి రామా!

౩.పెల్ఫు (Pelf) న్నదంచు ప్రౌడుగ
సెల్ఫన్నది పెంచి సెల్ఫు సెంటరువైనన్
హెల్పింగు హాండు గానక
గల్ఫున పడిపోదువీవు గనరా రామా!

4. మమ్మీ హంగ్రీ యంచును
అమ్మీ తన తల్లి నడుగ నాకలి తోడన్
యుమ్మీ ని వండి యట్లే
కొమ్మంచును అమ్మ ఇచ్చె కూతుకు రామా!
5. డెట్టిచ్చు వాడు డాక్టరు
ఫిట్టై యున్నట్టి రోడ్లు ఫేమస్ కార్లున్
సెట్టైన ఫ్రండ్స్ సర్కిలు
హిట్టౌ టౌనందు నుండు హైఫై రామా!
6.సెల్లుకు ప్రాణము సిమ్మగు
పిల్లుకు ప్రాణంబు ఎక్సు పైరీ డేటున్
బెల్లుకు ప్రాణము సౌండగు
బిల్లుకు ప్రాణంబు చూడ పేమెంట్ రామా!
7. బోరింగు మాటలాడిన
సోరింగుగ నుండు సాటి సోదర తతికిన్
జారింగు విడిచిపెట్టుము
నీరంగొక కామెడీగ నిలుపకు రామా!
8. అమ్మల వంటలు వద్దని
గుమ్మలు హోటళ్ళ పెద్ద గుమ్మాలెక్కన్
గమ్మున గుమ్మడి మేనితొ
జిమ్ముల పాలైరి జూడు చిత్రము రామా!
9. తల పైన జుట్టు గల్గక
తలలోపల సాఫ్టువేరు తలపుల తోడన్
తలపించు నార్యభట్టును
తలపడ లాప్టాపు తోడ తానిటు రామా!
10. మ్యానేజరన్న పేరున
మ్యానూ, 'ఏజు'న్నదంచు , మగువల తోడన్
టీనేజి లాగ జెలగిన
డ్రైనేజిన ముంచుతారు టప్పున రామా!
11.స్పీచికి ప్రాణము హ్యూమరు
మ్యాచికి ప్రాణంబు తగ్గ మ్యాచింగ్ టీమే
క్యాచికి ప్రాణము ఫీల్డరు
కోచికి ప్రాణంబు శ్రద్ధ కుదురుగ రామా!
12. చెక్కుకు చెల్లుట ముఖ్యము
కుక్కుకు ముఖ్యమ్ము టేస్టు కూర్చుట కనగా
బుక్కుకు మాటరు ముఖ్యము
లక్కుకు దేవుండె దిక్కు లవ్లీ రామా!
13. పిజ్జాల దినుచు నొక్కడు
బొజ్జను భూలోకమంత పూర్తిగ, బెంచన్
బెజ్జమ్ము పూడ బొడ్డుకు
లజ్జన్నదె లేక చినిగె లాగులు రామా!
14. లిల్లీ చెల్లెలు లల్లీ
పల్లీలను తినగ పల్లె పల్లెల లోనన్
గల్లీల లోన గల్గిన
ఇల్లిల్లూ  తిరిగి చూడ ‘ఇల్లై’ రామా!
15. మేకప్పుకేల ఎప్పుడు
పైకమునంతంత నీవు పేజేతువనన్
నీ కొరకె ప్రాణనాధా
చేకొన ప్రియమార యంచు చెలి యనె రామా!
16.   నీకేల తాగుడనగా 
నాకాంగన బోలె నీవు నాకగుపించన్
నా కైపటంచు భర్తయు
నికరమ్ముగ నమ్మబల్కె నిజముగ రామా!
17. రా,మారు మాటలాడక
రా, మా గృహసీమ నీవు రంజిలజేయన్
రా, మావి పళ్ళబుట్టతొ
రా, మాకది చాలు రమ్ము రయమున రామా!
18. కప్పను గురువుగ నెంచిన
ఎప్పటికీ ముప్పురాదు ఎందులకనగా
ఇప్పట్టునప్పుజేయుచు
అప్పట్టుకు మారుమయ్య అప్పుల రామా!
19. ముప్పన్న మాట లేనిది
అప్పొకటే కలదు జగతి నన్యంబేదీ
అప్పిచ్చినట్టివానిని
ఎప్పుడు గుర్తుంచుకోక  ఎదుగుము రామా!
20.తగు డాబు దర్పమొదవగ
వగరును పొగరునకు చేర్చి వరలితివన్నన్
తెగ లోనులిచ్చు బేంకులు  
తగునా లేదా యటంచు తలువక రామా!
నీలో డాబు దర్పము బాగా కనిపిస్తూ వున్నాయి అంటే బ్యాంకులు నీవు లోనుకు తగుదువా లేదా అన్నది చూడకుండా ఎన్ని కోట్లయినా లోన్లను ఇస్తుంది, నీ security ని నాలుగింతలు చేసి మరీ చూపిస్తూ. 
21. పిజ్జాలు తినుట మరిగిన
సొజ్జప్పాలెట్లు తినగ సొంపగు మరియున్
బెజ్జాల గారె గతకడు
ఇజ్జత్తును వదలి తినడు ఇడ్లీ రామా!
 22. కల లోని రాకుమారుని
కలియుటకై పూలచీర కట్టుచు ముఖమున్
పలు తెరగు క్రీములన్నియు
పులుముచు నిదురించ పొలతి పడుకొనె రామా!
23. సరదా ముద్దుల నివ్వగ
పరదాలో దోమ జేరె, పడుకొని యుండన్
తెరదీసి పంప జూడగ
బిరబిర దోమల్ని తాను పిలచెను రామా!
24.విందున్ మందును సుందరి
సందడి ఫ్రీ యన్న ఎడల సందియ పడకన్
వందల మందలు గట్టుచు
ముందుగ తాముందురయ్య మోహన రామా!
25.  తలపోసి యల్లుడత్తకు
ఫలములు గొనిపోవ సంచి పట్టి టమేటా
ఫలములు పది కొక కేజీ
పలురీతుల బేరమాడి బడసెను రామా!


26.మధ్యము త్రాగుట యందున
మధ్యమ మార్గంబునేది మది గొనక యదే
మాధ్యమము సుఖము కందురు
మధ్యన నీ జోక్యమేల మానుము రామా! 
హిందీకందము
 27.కిస్ కిస్ కో దూఁ ఎ మయ్యబు
కిస్ కిస్ నే మాఁగ్ రహే ఎ కిస్ కో మాలూం
కిస్ కిస్ కొ నై జరూరత్
కిస్ కిస్ కొ హై సునావొ ‘కిస్ మిస్’ రామా!

ఎవరెవరికి ఇవ్వవలేనో నాకు అర్థమగుట లేదు. ఎవరికి అవసరమో ఎవరికీ అనవసరమూ  తెలుసుకుంటే అవసరమైన వారికి ‘కిస్ మిస్’ ఇస్తాను రామా! 
ఆంగ్ల కందము
28.మేరీ మేరీ లవ్యూ 
సారీ నౌ కాంటు లవ్ యు సారీ కర్జన్
మారీ మీ, దెన్ వీ విల్  
కారీయాన్ లవ్వు, సెడ్డు కర్జన్ రామా
మేరీ మేరీ నిన్ను ప్రేమిస్తున్నాను. ఇప్పుడు నిను ప్రేమించలేను, సారీ కర్జన్
అయితే పెళ్ళిచేసుకో తరువాత ప్రేమించుకొందాము అన్నాడు కర్జన్, రామా!
తమిళ కందము
29.అంబా కేఫు కు పోణాల్
సాంబారొరు సొంబు సొన్న సర్వర్ అదియుం
రొంబా మిదు రెండిడ్లీ
వంబే ఇల్లామె  కొండు  వరువాఁ రామా! 
అంబా కేఫునకు వెళ్ళి ఒక చెంబు సాంబార్ ఆర్డర్ చేస్తే , దానితో బాటూ ఇబ్బంది లేకుండా ,సర్వరు రెండు మెత్తటి ఇడ్లీలు కూడా తెస్తాడు రామా! సాంబారు రేటు ఏ వంద రూపాయలో వుంటుంది.
30.దెబ్బకు దబ్బున గబ్బును
అబ్బా యను రీతి బాపు నబ్బకునైనన్ 
అబ్బబ్బ దెబ్బలాడక
అబ్బా! యీ సబ్బువాడు మబ్బీ రామా! 
31.పిల్లే వ్యాధికి మందగు
పిల్లే మందౌను ప్రేమ పిచ్చికి నిలలో
పిల్లే ఎలుకల మందగు
పిల్లే లేకున్న చాల పెనుగులు రామా! 
32. బస్తా పిస్తా దినుచును
కుస్తీ వస్తాదులాగ కోస్తా లోనన్ 
బస్తీల్ మస్తుగ తిరుగుచు
సుస్తీయై మంచమెక్కె చూస్తివ రామా!
33.కుక్కే ఇంటికి ముఖ్యము 
కుక్కే ముఖ్యమ్ము జూడ కూటికినైనన్ 
కుక్కే సొల్లుకు ముఖ్యము
కుక్కేదే కోరు పెట్టె కుదురుగ రామా!
34.కప్పే ఇంటికి ముఖ్యము
కప్పే ముఖ్యమ్ము వాన కలుగుటకైనన్
కప్పే నిద్రకు ముఖ్యము 
కప్పే లేకున్నా లేదు కాపీ రామా! దాడీ


35.దాడీ పెంచిన వానిని 
జోడీ నోదిలేసినట్టి చోద్యపు వానిన్ 
కేడీ పాకుకు మొగుడిని 
మోడీగా గుర్తెరుంగు మోహన రామా!
36. సోడా బీడీ బీడా
వాడకమున గొప్పదెల్పు, వాడే వాడే 
వాడనివాడది ఎట్టుల
'వాడని' యా రుచులదెల్పు వాడిక రామా!
37. కోటుకు ప్రాణము బొత్తము 
సూటుకు ప్రాణంబు రంగు సూక్ష్మంబరయన్
హేటుకు ప్రాణము హెడ్డగు 
బూటుకు ప్రాణంబు లేసు బోల్పగ రామా!
38. కత్తికి పదునే ముఖ్యము
నెత్తికి ముఖ్యమ్ము చూడ నయమగు కురులే
నత్తికి మౌనము ముఖ్యము
సుత్తికి ముఖ్యమ్ము చెత్త చూడర రామా!
ఇవి మన తెలుగు సినిమాల పేర్లు
39 బాబి కబాలీ సైఁ ఢీ
బాబా జిల్ డాను కిక్కు బాషా రైట్ రైట్
బాబూ ఒక్కడు పోకిరి
రోబో టెంపర్ లెజెండు రౌడీ, రామా!
అంతో ఇంతో ఎంతో కొంత అర్థము కలిగిన ఈ పద్యములో చివర రామా! అన్న మకుటము తప్పించి అన్నీ సినిమాల పేర్లే. సినిమాకు తెలుగు పేరు  పెట్టుకోలేని దౌర్భాగ్య స్థితి మనది.

4౦.చక్కని కాఫీ ఊపుకు
చిక్కని కాఫీకి ఊపు చెప్పగ పాలే
కిక్కుకు ఊపగు లిక్కరు
లిక్కరు కూపేమొ చూడ లేబిల్ రామా!
41.కమ్మనియనుచో రమ్మని
కమ్మనియని యన్న ఎడల కడు మధురంబౌ
కమ్మనియంటే తక్కువ
కమ్మని కెన్నెన్ని పేర్లు కలవో రామా!
42. ‘తల నొప్పికేమి తింటివి’
‘తలపోయుచు నొక్క మాత్ర తల్లట పోగా’
‘తలక్రిందులేల యుంటివి’
‘తలలో జేరంగ మాత్ర తప్పక’ రామా!
43. సంబంధితోడ నొక్కడు 
సంబంధము గట్టి గాగ సారానీరున్
సంబంధి ముందు నుంచగ
సంబంధము చెడునువద్దు జలమనె రామా!
 An intelligent father of a bride offered water and liqueur to groom's father.He said our tradition restricts taking water, jut offer the other one . That is enough.
44. , టీ త్రాగుటకైనా
ఎటనైనా పోవనాటొ ఎక్కుటకైనా
ఏటీఎమ్మునకంటే
పేటీయం మేలుజేయు పెన్నిధి రామా!


45.'మందూభాయికి మగువకు
ఎందున కలదయ్య పోల్కె నేర్పడ చెపుమా' 
'మది మాట వినక నిరువురు
కదిలినచో వాంతులాప కష్టము రామా!'       
46. నడచుట నతిగా గల్గిన
గడియారపు సెకను ముల్లు కడు సన్నంబౌ
వడిలేని ముళ్ళు లావయి
నడయాడగ కష్టపడుచు నడచును రామా!
 47. నడచుటనతిగా గల్గిన 
 గడియారపు సెకను ముల్లు కడు సన్నంబౌ
 వడిలేని ముళ్ళు లావయి 
 నడయాడగ కష్టమంది నడచును రామా!
 48. చేరుకే చక్కెరకమ్మగు
 చెరుకే బెల్లమునకమ్మ చింతింపంగా
చెరుకే కమ్మదనమ్మా
చెరుకే నీ యింటిపేరు చెణుకుల రామా!
    49.కన్నా ముసలితనంబున
    కన్నులు గన మసకబారె గమనించంగా
   కన్నులు కాంతల గానక
   కాయమునకు మేలుజేసె కదరా రామా!
   50. దినమున చంద్రుని బింబము
   కనగానాశ్చర్యమాయె కలికీ యనగా
   దినమున గూబల కూతలు
   వినుటయునూ  వింత కాదె వెంగలి రామా!
51. వైఫై - వైఫై (wifi - Wife Eye)
హైఫై ఫోనుకు కూడా
వైఫై నెట్వర్కు గాంచ వెలయును మితమై
వైఫై (Wife+Eye) నెట్వర్కెప్పుడు
నైఫై (Knife+ఐ) దూరాలు ప్రాకు  నిజమిది రామా!

52.కాలేజి వెళ్ళే ఆటో
ఇద్దరు యువతుల నడుమన
ఒద్దికగా కూరుచున్న ఒక విద్యార్థిన్
వద్దని ఆటో డ్రైవరు
సద్దుకు పోదాము రమ్ము సారనె రామా!
పెళ్లి
53. ఎంగేజి రింగు మొదటిది
అంగన వెడ్డింగు రింగు నది యౌను సెకండ్
ఆ గతము ఇచ్చులే సఫ
రింగను ఒక థర్డురింగు రియలైజ్ రామా!

54. పులి అడవిలోన యాతని
ఆలిని తాజంప గెంత, నరచెను 'షూటిట్'
"కలుగదు కెమెరా బేటరి
బాలా షూట్ చేయలేను, బాయ్" అనె రామా!
ఆలూ మగలు రివాల్వారు మరియు కెమెరా తీసుకొని అడవికి వెళ్ళినారు . అనుకోకుండా పులి ఒకటి భార్య మీదికి ఎగురబూనింది. ఆమె 'SHOOT' అని గట్టిగా అరచింది. భర్త నింపాదిగా కెమెరాలో బేటరీ లేదు BYE అని అన్నాడు. ఇక నవ్వడము మీ ఇష్టమే!
55.'నాన్నా నీవీజిప్టున
తిన్నగ నింకొక్కమమ్మి తెచ్చితివంటే
నన్నీ మమ్మీ తిట్టుల
తన్నుల తప్పింతు' వనెను  తనయుడు రామా!
  సుపుత్రుడు తండ్రితో  ఎంత మంచి కోరిక కోరినాడో చూడండి. 'నాన్నా ఉన్న మమ్మీతో తిట్లు తన్నులు భరించలేక పోతున్నాను.   ఈ సారి ఈజిప్ట్ పోయినపుడు చక్కటి మమ్మీని పట్టుకురావా! తండ్రి ఎంత సంతోషపడి ఉంటాడో! మరి ఈ మమ్మీ గతి            ఏమిటని సుపుత్రుడు ఆలోచించినట్లు లేదు. అసలు అబ్బాయికి మమ్మీ అంటే పీనుగు అని తెలిసినట్లు లేదు. 
  
    56. ఇల్లాల్ని కోరియొక్కడు
          ఎల్లాగో క్లాసిఫైడు ఇవ్వగ, భర్తల్
          అల్లాగె పుచ్చుకొనుమని
          ఇల్లాళ్ళను పంపబూని రిదివిను రామా! 
ఈ చోద్యము చూసినారా ! ఎవరో వివాహము చేసుకోనవలెనను తలంపుతో 'ఇల్లాలు కావలెను' అన్న ప్రకటన ఇచ్చినాడట.
మావద్ద సిద్ధము మావద్ద సిద్ధమని తెలుపుతూ ఫ్రీ డెలివరీ కూడా ఇస్తామన్నారట.
57. దిండొకటుండిన నీ కడ
మెండుగ కౌగిళ్ళ నిచ్చు మెదలక, నీకున్
గుండే చెరువై ఏడ్చిన
గుండెల్లో దాచు నిన్ను కుదురుగ రామా
దిండు ఇంత సహాయకారి అన్న విషయాన్ని మీరు గమనించే అవకాశము కలిగియుండదు. ఎందుకంటే మీ priorities మీకుంటాయి కదా! మన తలగడ కన్నా మన సుఖము కోరి మనకు అనుకూలముగా స్పందించేవారు అసలు ఈ లోకములో ఎవరూ లేరనే నా అభిప్రాయము. ఎటువంటి కసుబుస్సులు లేకుండా ఎన్ని కిస్సులయినా ఇస్తుంది. ఎదురు చెప్పక ఎంతసేపయినా మన కౌగిట్లో నలుగుతుంది.
మనకు ఎంతో బాధ కలిగి ఏడ్వదలచినా కూడా అంతసేపు మన ముఖాన్ని తనగుండెలో దాచుకొని ఎంతో ఒదార్పునిస్తుంది. ఇంతకన్నా మనకు కావలసినది ఏముంది.
58. కళ్ళాపి కాలమాయెను
మెళ్ళో గల పుస్తె లేమొ మెల్లగ జారెన్
వెళ్ళేది పబ్బులయ్యో
 పెళ్ళాన్నేమన్న చెంప ఫెళ్ళను రామా!
కళ్ళు పొడుచుకొని చూసినా కలిమాయలు కనుగొనలేము. అందులోని ఒక మాయ ఇది. ఇంటి ముందు కళ్ళాపి చల్లటము మాయమైంది. అంతేనా! మెడలో తాళిబొట్లు మెల్లగా locker లో నిలచినాయి. 
59. తెలుసా 'గాంధీ' బిడ్డా?
తెలుసును మా సారు చెప్పె తెలియుము మామా
వెలసె'దినేశన్' తండ్రిగ
తెలిసినదా ఇప్పుడైన తికమక రామా!
'బాబూ నీకు గాంధీ తెలుసునా!' 'తెలియకేమి మామా మా సారు చెప్పినారు కదా ఆయన 'దినేశన్' తండ్రియని. ఇప్పటికైనా తెలిసిందా! అని ఎదురు ప్రశ్న వేస్తున్నాడు మామయైన రామునితో. 'The Nation' అన్న మాట బహుశ పంతులుగారే పలుకలేక ఇట్లు చెప్పించినారేమో! '' కు '' కు ఎంత తేడా వస్తుందో గమనించండి. బడిలో శేషు ఉపాధ్యాయుని గాంధీ కొడుకు పేరు అడిగినాడు. టీచరు తడుముకోకుండా 'దినేశన్' అని చెప్పినాడు. శేషుకు సందేహమేర్పడి అదెట్లు అని అడిగినాడు. నేను పాఠ్యపుస్తకములో ఛదివినాను . ఆయనను "ఫాదర్ ఆఫ్ 'దినేశన్' " అంటారని. ఈ మాటను కంద పద్యములు ఇమిడ్చినాను.
60. నేనొక వ్యక్తిని జంపెద 
ననుమాటకు ఫ్యూచరేమి టని గురువడుగా 
కనుమా జైలే ఫ్యూచరు
అని తెల్పెను శిష్యుడంత అదివిను రామా!  
'క్లాసు'  లో టీచరు 'నేను ఒక వ్యక్తిని చంపెద' అన్న వాక్యమునకు భవిష్యత్ కాలము ఏమిటి అని అడిగితే శిష్యుడు లేచి 'జైలే' భవిష్యత్ కాలము అని జవాబు చెప్పినాడట. 
61.జాతీయ గీతమందున
చూతుము ద్రావిడుని పేరు చూడము 'కోహ్లీ'
నేతయ్యు నందు నామము 
రాతము నికనైన యనెను రాహుల్ రామా!
ఎంత తెలివి మంతుడో ఈ రాహుల్ చూడండి. అతను తన వారిని ఈవిధంగా అడుగుచున్నాడు. మన జాతీయగీతమును చూసినారా! అందులో ' ద్రావిడ్ ఉత్కల్ బంగా...' అని ఉన్నది కదా! అందులో ద్రావిడ్ పేరున్నది గానీ మన దేశపు క్రికెట్ టీముకు నాయకుడైన కోహ్లీ పేరు లేదు గమనించినారా! ఇకనైనా ఆపేరు వ్రాయండి అని ఎంత తెలివిగల మాట చెబుతున్నాడో మన రాహుల్  గమనించండి.
62.తానేమొ చెట్లు నరుకుచు 
తను వ్రాయగ కాగితమును దర్జా వొదవన్
తను జేసికొనుచు వ్రాసెను 
తన మాటగ చెట్లు నరుక తగదని రామా! 
మానవుడు ఎంత బుద్ధిమంతుడో వినండి. తానేమో చెట్లు నరికి కాగితము తయారు చేస్తాడు. మళ్ళీ దానిమీదనే చెట్లు నరక కూడదు అని రాస్తాడు. ఇది చోద్యము కాదా!
మన నేతలు 
6౩. పొల్యూషనొకని ముంచిన
సొల్యూషను మంద ముంచ సో గుడ్ సజెషన్
ఇల్యూషనొదిలి వినుమీ 
డైల్యూషన్ లేనిమాట డార్లింగ్ రామా!
అయితే నాకేంటి అనే ఈ రోజుల్లో ఒకడు ఒక political leader ను చెరువులో  ముంచితే water pollution అదే మొత్తము మందను ముంచితే అది solution. వాళ్ళు మంచి చేస్తారనే illusion వదిలి dilution లేని ఈ నిక్కమైన సలహా పాటించితే జై హో భారత్ అనవలసినదే కదా!
 64.తాగుట మంచిది కాదని
తెగ టీవీ యాడ్లు వచ్చితెలియగ జేయన్
తగు రీతి ప్రతిన బూనుచు
తెగదెంచితి టీవి దోస్తి తెలియునె రామా!
ఈ వ్యక్తి ఎంత గొప్పవాడో చూడండి. త్రాగుట మంచిదికాదు అని టీవీ లో రోజూ ఆడ్స్ వస్తూ వుంటే ప్రతిజ్ఞ పూనినాడట. ఏమని తెలుసా? ఇక మీదట తాగకూడదనికాదు! ఇకమీదట టీవీ చూడకూడదని. ఆ మహనీయునికీ ఆయన నిర్ణయానికీ జోహారు.
65.'బట్టల బిట్టుల, కట్టిన
ఎట్టుల చూచేము టీవి ఇంతుల' పౌత్రా
'కట్టగ నవియూ కానని
మట్టపు స్త్రీజూతు ననెను' మనవడు రామా!
హ హ హ ఈ వింత జూడండి. తాత మనవడితో చినచిన్న పేలికలు కట్టుకొని ఈ స్త్రీలు ఎట్లున్నారో చూడు మనవడా! అన్న తాతతో అదిలేని స్త్రీని చూడాలని వుంది అన్నాడట మనుమడు.
66. బోటిని పొందగ ఇక్కీస్
అటు పదవిని పొందు వయసు అఠ్ఠారహ్హే 
పటుతరపు నేతకన్నను
ఎటులైనా భర్త బాధ్యతెక్కువ రామా!
ఇది ఎంత చోద్యమో చూసినారా! అమ్మాయిని పొందు వయసు, భార్యగా నండోయ్! వయసేమో 21. అదే పదవికి గానీ ఓటుకు గానీ 18 సంవత్సరాలే చాలు. ఇదేమి చోద్యము అనుకొంటున్నారేమో! పదవీ నిర్వహణ కన్నా సుదతీ నిర్వహణ అంటే భార్యను నిర్వహించటము చాలా కష్టము. వెనుకటి కెవడో అన్నాడట ఆఫీసులోని తన మిత్రులతో'నేను సింహాన్ని' అని. మరి యింట్లోనో ? అని వారంటే "నేనక్కడయినా సింహమే కానీ ఇంట్లో నా భార్య 'దుర్గ' అని".
ఈ చోద్యము చూడండి

67.'ఎక్కడ ఉందురు మీ'రన 
'చిక్కడుపల్లె'నగ భామ 'ఛీఛీ నాతో 
చక్కగ ఇంటికి వచ్చిన 
నిక్కము బంజార హిల్సు నీ'దనె రామా!
బజారులో ఒంటరిగా అమ్మాయి కనపడితే లేని ప్రేమ చూపిస్తూ ఎక్కడుంటారు అని అడిగినాడు  ఒక నవయవ్వనుడు. ఆ అమ్మాయి 'చిక్కడుపల్లె' అని అంటూనే ఛీఛీ మాయింటికి నాతో రండి అప్పుడు బంజారా హిల్స్ అంతా మీదే అన్నాడట. ఎంతటి దయార్ద్రహృదయమో చూడండి.
67.    జీయస్టీ
'జి' కన 'గుడ్నైట'గు మరి
'ఎస్' కనగా 'స్వీటు డ్రీమ్సు' ఏర్పడ తెలుపన్
'టి' కనగ 'టేకుకేర'గు
'ఠీకై' యని తెల్పె నొకడు ఠీవిగ రామా!
GST అంటే Goods and Service Tax అని. కానీ ఒక మేధావి ఏ విధమగు జవాబు చెప్పినాడో చూడండి.
G = గుడ్ నైట్
S = స్వీట్ డ్రీమ్స్ 
T = టేక్ కేర్ ఎంత చక్కని అర్థమో
 గూగులు
68. గూగులు గర్లా బాయా?’
గూగులు బాయెట్లదౌను గూగులు గర్లే
తగు ప్రశ్న ఒక్కటడిగిన
సగటు బదుళ్ళొచ్చు లక్ష చప్పున  రామా!'
గూగులు అమ్మాయా అబాయా అంటే 'గూగులు' అమ్మాయేనట. ఇందుకు అంటే ఒక్క ప్రశ్న అడిగితే లక్ష జవాబులు చెబుతుందట
69. స్ప్లిట్ట్ ఏ సీ
మొగుడు గన స్ప్లిట్టు ఏసీ
తగ ఇంట్లో సౌండు లెస్సు తగు కూలింగ్తో
తగియుండు సతి రిమోటుకు
సెగ సౌండుల తోటి బయట  చెలగును రామా!
భర్త ఒక Split A/C లాంటివాడు. భార్య అనబడే Remote కు అనుకూలముగా నడుచుకొంటూ ఇంటి లోపల శబ్దము లేకుండా Cool గా ఉంటాడు. బయట మాత్రం సెగతో శబ్దముతో రెచ్చిపోతూ వుంటాడు.
70. ఇల వెడ్డింగ్ వెల్డింగుల
కలదొక్కటి పోల్కె జూడు కడు నిశితముగా 
కలిసి విడగలదు మొదటిది
కలిసిన రెండవది విడదు కనుగొన రామా!
వెడ్డింగుకు వేల్డింగుకు ఒక సామ్యము వుంది. మొదటిది కలిసినా విడి పద వచ్చు. రెండవది మాత్రము అతికితే చితకదు.
71.'ఒవరున కెన్ని బంతులు'
'వివరిపగ బంతియొకటె విసరెదనదియే 
జవసత్వములను గల్గుచు
అవలీలగనారుమార్లదంతే రామా!
నా లాంటి ఒక అమాయకునికి ఒక చాకు లాంటి బౌలర్ ఎంత చక్కని సమాధానము చెప్పినాడో చూడండి. ఒవరునకు ఎన్ని బంతులు అని నేనడిగిన ప్రశ్న కు ఆ తెలివయినవాడు 'అయ్యా బంతి ఒకటే కానీ ఒవరునకు ఆరు మార్లు జవ సత్వములతో విసరుతాను' అని చెప్పినాడు.
72. బాలురొక వందనిచ్చిన
బలెబలె యనురీతి దేశ భవితను మార్తున్
బాలికల దశకమిచ్చిన
ఇలకే నొక క్రొత్త దేశమిత్తును రామా!
నాకు ఒక వంద మంది బాలురను ఇస్తే వారికి ఉన్నతమైనక్షణనిచ్చి ఈ దేశ భవిష్యత్తునే మారుస్తాను అని నేనంటే ఒక దుర్బుద్ధి ఈ విధముగా జవాబు చెప్పినాడు నాకు : రామా! నాకు 10 మంది బాలికలనిస్తే ఒక కొత్త దేశాన్నే ఇవ్వగలను' అని. 
73. బ్రష్యూజు చేసి టీతుకు
పుష్యూ అని పారవేతురని పొగిలేడ్వన్
ఇష్యూ కాదది చూడని
టిష్యూ తన నెలవు జూపె టెల్, మీ రామా!

'74.నామది సెల్లుగ నీవట
సీమితమై యుండు ప్రియుడ  సిమ్మై' యనగా
'లేమా డ్యూయల్ సిమ్ముకు
నీమాటగ చెప్పు చాన్సు నిల్ల’ ని రామా! 

75. నదిలోన గులక వేయగ
అదిగాంచిన కప్ప కోపమందుచు నాతో
ఎద గాయమాయె సతికిని
పద నీపని పట్టె దనుచు పలికెను రామా!

76. ముందర 'ప్రేస్స'ను బోర్డుతొ
అందమ్మౌ స్కూటరెక్క ఆపుచు పోలీస్
ఎదనగ తనదు పేపరు
కాదది నే 'ధోబి' ననుచు కదలెను రామా!
77. అక్కరకు రాని లిక్కరు
బక్కెటతో తాగి కూడ ఫలితము సున్నా 
కిక్కన్నదెక్కకుండా
చుక్కేయుట ఎందుకన్న సుందర రామా!
78. చిక్కని పాలకు తోడుగ
చక్కని కాఫీ పొడింక చక్కెర కలువన్
చక్కగ స్వర్గము చూపును
తక్కిన చవులెల్ల జూడ తక్కువె రామా!
79. భామకు దోమకు తేడా 
గమనింపగ భామ లేటుగా బస చేరున్ 
దోమట్లు గాక సంధ్యకు
ఏమైనా వచ్చిజేరు నింటికి రామా!
80. శ్రీమతి దప్పిక గొనగా
సోమరి పతి గుర్తుజేయ సుదతికి గారెల్
నీ  మాట నూరె నీరన
భామా అవి తాగ మనుచు పతియనె రామా!  
81. రేపగు సుదినము గాంచగ
ఆపక నే  చదువు జిమము ఆరంభింపన్
ఆపెద సిగరెట్సారా 
రేపటితో ననుచు దెల్పు రేపును రామా
రామా! నేను చదువు జిమము ఆరంభించుటకు రేపు
మంచిరోజు.అట్లే సిగరెట్టూ, సారా కూడా రేపే మానుకోనుకొంటాను 
అని రేపుగూడా చెబుతాడు. గమనించితే ఆ రేపుకు రూపేదీ!
82.ఏటికి తాతా అవ్వను
మాటికి స్వీటీ యటంచు మరి పిలిచెదవే
యైటీకి వచ్చినంతనె
నాటీ! తనపేరు మరచినాననె రామా!
తాతా ఇంత ముసలివానివైనా ఇంకా అవ్వను స్వీటీ అని పిలుస్తావెందుకు అని మనవడడిగితే, ఒరే నాటీ! నేను యైటీకి వచ్చినతరువాత మీ అవ్వ పేరు మరచిపోయినాను అందువల్ల స్వీటి అని పిలుస్తున్నానని చెప్పినాడట రామా!
83. చచ్చేటప్పుడు మనిషికి
ఇచ్చెద బిర్లాసిమెంటు ఇంపుగనందున్
మెచ్చే ప్రాణము కలదని
వచ్చే ప్రకటనను గంటి వన్నెల రామా!
ఒకడు తానెంతో పరిశోధన చేసి కనుగొన్న విషయాన్ని నాకు చెబుతున్నాడు: "రామా! నేను బిర్లా సిమెంటు ప్రకటన చూసినాను. ఆ సిమేన్తులో ప్రాణం వుందని తెలిపినారు. చచ్చే వానికి కానుకగా ఇస్తే వానిని బ్రతికించినట్లవుతుంది కదా!"
 నా నోట మాట రాలేదు.
84. ఆలిని చూచినయంతనె
ఏలా ఆ నవ్వు యనగ, 'ఇది గురు బోధే!
ఇలనే ప్రాబ్లము గాంచిన
పిలిచెదచిరు నవ్వు తోడ' పిడుగనె రామా!
85. నా మది సెల్లుగ నీవట
సీమితమై యుండు ప్రియుడ సిమ్మై' యనగా
'లేమా డ్యూయల్ సిమ్ముకు
నీ మాటగ చెప్పు ఛాన్సు నిల్ల'ని రామా!
86.అద్దాలు పెట్టుకొన్నచొ
వద్దన్నను గుడ్లగూబ వలె వుందురనన్
అద్దాలు తీసి చూసిన 
మొద్దా ఎలుగౌదువీవు మూర్ఖపు రామా!

87.అక్కరకు రాని చెక్కులు
ఇక్కట్టుల పాలుజేయు ఏటీయమ్ముల్
చిక్కులు బాపని బేంకులు
గ్రక్కున విడువంగవలయు గదరా రామా!
88. టీచరు పాఠము మొదలిడ
గోచర మౌ నామె గొంతు కోకిల రీతిన్
నాచెవులు తాకినంతనె
నే చేరెద కలలలోకి నిజమిది రామా!
89.‘మాలను నర్సూ కేలను
ఏలా నువు దాల్చినావు ఎరుకపరుపుమా?
‘పలురీతి చింత చేసితి
తెలియుము పేషంటటంచు  తెల్పెను యిటులన్
 ‘సర్జనుది మొదటి సర్జరి
అర్జంటుగ సక్సెసయిన హారము తనకున్
నిర్జించె నేని నిన్నట
ఫర్జుగ నీదౌ’నటంచు  పల్కెను రామా!
'అమ్మా నర్సూ చేతిలో ఆ పూలమాలను ఎందుకు పట్టుకొని వున్నావు' అని తన ఉత్సుకతను చంపుకోలేక అడిగినాడు పేషంటు. అందుకు నర్సు ' ఓ పేషంటూ! ఇది మా సర్జను గారి మొదటి ఆపరేషను. జయిన్చితే ఆయన మేడలో, నిర్జింంచితే నీ మేడలో!' అన్నది. అంతే పేషంటు నోట్లో పచ్చివెలగ కాయే!

90. రంగా రంగా అనియెడు
బంగారపు భజనలెల్ల పాతుచు భూమిన్
సింగే సాంగులు కలిపెను
బంగాళాఖాతమందు భక్తిని రామా!

91.వీపున బుక్కుల సంచులు
ఆపై తమ లంచిబాక్సు ఆక్వా బాటిల్
ఏపైన బూట్ల బరువులు
రేపటి కూలీల నేటి రూపము రామా!
92. అక్కరకు రాని పట్టము 
ఇక్కట్టుల పాలుజేయు ఈశాసనముల్
తుక్కున్న డ్రైను గొట్టము
టక్కున ఉపయోగపడవు డార్లింగ్ రామా!
93. ఇష్టమగు కాయ వదలక 
కష్టమ్మును గూర్చు వంగ కాయను విడుతున్
దుష్టమది నవల గూర్చును 
స్పష్టమ్ముగ గంగ జేర్తు సారస రామా!

94. ముట్టరు చీరలు రవికెలు
పెట్టరు తిలకమ్ము నుదుట ఫేకు ఇగోతో
జుట్టును జడలోకల్లరు
పట్టరు వంటింట గరిటె పడతులు రామా!

95. అడ్డమగు హేర్కటింగులు
గుడ్డలు మరి జీన్సు దప్ప కోరరు కనగా
గడ్డములు బెంచి తిరుగుటె
గుడ్డిగ మగ యువత కోరు కోరిక రామా!
96. మాటలకు ‘పంచి’ యుండును
పాటలకెల్లపుడు బూతు పదములు యుండున్
ఆటలకు గెంతులుండును
సూటిగ మన చిత్రసీమ చూడగ రామా!
97. టాటా ఉప్పును దినుచును
బేటా ఏర్టెల్లు డిష్షు బెషరమై, నీ
వేటికి వాడెదవంచును
ఛోటూ ఒకడడిగె నన్ను చూడుము రామా! 
98.తరగతి పాఠములన్ పటు
తరగతి తా చదివి ఫస్టు తడయక నిలిచెన్
తరగ, తిన తిండి, నాల్గవ
తరగతి ఉద్యోగమునకు తా జనె రామా!
చదివినంత కాలము తరగతిలో అగ్రగణ్యునిగా నిలచినవాడు, మంచి ఉద్యోగమూ కొరకై ఇంటిలోనే ఉంటూ ఇంటిలోనే తింటూ చదువుకు తగిన ఉద్యోగముకోరకై  ప్రయత్నిచుతూ ఉండినాడు. సంపాదన లేకపోవుటచే ఖర్చు పెరిగింది తిండి తరిగింది. ఇట్లు కాదని నాలుగవ తరగతి ఉద్యోగము అంటే attender ఉద్యోగమును సంపాడించుకొని అందులో చేరిపోయినాడు. ఈ పద్యములోని ప్రత్యేకత ఏమిటంటే  'తరగతి అన్న పదమే నాలుగు పాదములలో వచ్చి 'పద ప్రాస' గా నిలిచింది. 
99.  తన నెలవు దప్పె రాముడు
కన రావణు సోదరాళి కట్ట మసీదున్
తన పుట్టినింటి కంపెను
కన సీతకు సుఖము గూర్ప కలిలో రామా!
100. కన కాలకూట ప్రథమము
గొని పీయూషమ్ము 'పీ' ని కూర్చగ 'కాఫీ'
మనపాలిట వరమాయెను
వినుమిది యారెండు రుచుల వివరము రామా!
101. తెలియుము నే టైపిస్టును
కలిగితి మరియందుచేత కవలల నందున్
కలిగితి ఒరిజినలున్ మరి
కలిగితి కర్బనపు కాపి గాంచగ రామా!
102. బ్రాందియు భార్యకు మధ్యన
ఉందయ్యా భేదమొకటి ఊహింపంగా
మందేసి వాగునతడే
ఎందులకో మౌని, భార్య ఎదురుగ రామా!. 
103. 'సదువెందుకు సంకనాకనా' అన్న నానుడి బాల్యము నుండి వింటూ వస్తున్నాను. ఈరోజెందుకో నామనసు దానిపై మరలింది. సరేనని దానిని ఆలంబనగా తీసుకొని ఒక గొర్రెల కాపరి మాటగా ఈ పద్యమును వ్రాయుచున్నాను. 
సదువులు సంకలు నాకనె
పది గొర్రెల పెంచుకొన్న పాలూ పెరుగున్
పదుగురికి తిండి యగుచూ
మది మెచ్చగ కంబళిచ్చు మనకవి రామా!
104. కన కాలకూట ప్రథమము
గొని పీయూషమ్ము ‘పీ’ ని కూర్చగ ‘కాఫీ’
మన పాలిట వరమాయెను
వినుమిది యారెండురుచుల వివరము రామా!
కాఫీ
క్షీర సాగారమధనమును గూర్చి అందరికీ తెలిసినదే! అందు మంధర పర్వతము కవ్వము గానూ వాసుకియను సర్ప రాజును కవ్వపుతాడుగానూ ఉపయోగించినది అందరికీ తెల;ఇసిన విషయమే! సముద్ర మదనము చేయు సమయమున మహా బుద్ధికుశాలుడైన శ్రీ మహావిష్ణువు రాక్షసులను వాసుకి తలవైపు దేవతలను వాసుకి తోకవైపు పట్టుకొనునట్లు చెప్పి ఒప్పించి పట్టించినాడు. అందువల్ల చిలుకుసమయమున వాసుకి వెడలగ్రక్కు విషము రాక్షసులకు, చిలుకుతచే వచ్చిన అమృతము దేవతలకు లభించినది. 
నా మిత్రుడు మరి మానవులకు ఆ సమయమున లభించినది ఏమీ లేదా అని నన్ను ప్రశ్నించినాడు. అందుకు నేను 'అది దేవ రహస్యము. అయినా నీకు చెబుతున్నాను.' అని ఈ విధముగా చెప్పినాను.
మానవులు ఇదే ప్రశ్నను శ్రీమహావిష్ణువునకు సంధించితే ఆయన' కాలకూటము యొక్క తలతో పీయూశము యొక్క తలను సంధించి కాఫీ పేరుతో ఆరెంటి రుచి కలుగుతూ అనుదినమూ సేవించే అదృష్టమునకు మిమ్ము నోచుకోనిచ్చుచునాను’ అని సమాధానమిచ్చినాడు. ఆయన అనుగ్రహముచే మనకు కాఫీ నిత్యామృతమైనది.
15.కారుకు భార్యకు, గాంచిన
చిరుతేడా కోపమందు చెప్పెద వినుమా
అరచుట ఆపును కారులు
మరి అరచుట  మొదలుపెట్టు  మానిని రామా!

106. ముసలికి ముడుతలు చూడగ
వసి వాడిన మేనిపైనె వరలును గానీ
పసితనము మనసు వీడదు
మసిపట్టిన కుక్కరీల మానునె రామా!
107. గమనింప భార్య ఖర్చుల
నమితముగా మించునట్టి ఆర్జనచేసే
సముదీర్ణవంతుడే మరి
సమరస సంసార నేత సారస రామా!
మనసు తెల్పిన మాట
108. కలకలము కలుగ జేసెడు
కల గాంచినమనసు తెలిపె కంపము చేతన్
కలగలిసి పోక మునుపే
కలకలమును కలిపి వ్రాయి కందము రామా!
109. బ్రాందీ తాగే వ్యక్తికి
'ఏందీ?' అను పాలనివ్వ ఎంచగ మహిలో
అందాల సరసు నందున
ఎందైనా నాచు దొరక నెట్లగు రామా!
110. కం కం యూఆల్ కం కం
కం కం వి ప్లే క్రికెట్టు కం ఆల్ యూ నో
కం కం ఫర్ అంపైరింగ్
కం కం క్రిస్ గేలు కమ్ము కం అండ్ యు స్టాండ్
111. శరవణ భవనుకు పోలాం
పూరీ ఉర్లక్కెళంగు పోయ్  సాప్పిడలాం
పరిసిరిక పారు మొదలిల్
శరి శరి అది ఉట్టుడుంగొ సామీ పోలాం
 112. బెగ్గర్లనేవగించుచు
సిగ్గెగ్గుల విడచితినెడు చీపగు మనుజుల్
మగ్గిరి మరుజన్మంబున
స్విగ్గీ బాయిస్ గ నిజము చెప్పగా రామా!
113. మహనీయులు మన నేతలు
అహరహమూ ధనము తినుచు ఆహారముగా
అహమంత దాచి ముసుగున
ఇహసుఖమే సర్వమండ్రు ఇది విను రామా!     
114. అల కడలి మలిన రాశిని  
అలవోకగ దరికి జేర్చు నద్భుత రీతిన్   
తొలగించుచు  కలి బాధల  
వెలయించుము నందనమును ఇలపై దుర్గా!
115. పాటకు ప్రాణము పల్లవి
ఆటకు ప్రాణమ్ము తాళ మది యేదైనన్
మూటకు ప్రాణము ముడియగు
మాటకు ప్రాణమ్ము ‘నిజము’ మాత్రమె రామా!
   పెదవులు తాకని కందము                 

కాలికాలి కట్టె గాలిన కలిసిన

గాంచనెంచ కళ్ళ గానగలనె

దరిన చెడ్డచేయ తలచి చేరినయట్టి

ఖల జనాళి చెంత కలియగలనె

పదే పదే పెదవులు ముద్దాడే పద్యము

ఒప్పులకుప్పా అప్పళ

దప్పళముళ కొప్పు తోడు తప్పక పప్పే

ఇప్పటికిప్పుడె చెప్పెద

పప్పే నాకేప్పుడిష్టమని బాపడనెన్

భోజనప్రియా!

కడుదడబడలే సేయక

కడ మెతుకును కూడ నీవు కనబడనీకన్

కడిగిన రీతిని కంచము

కడు నేర్పుగ నుంచు నీది కడుపా కడవా!

ఒక రజనీకాంత్ తెలుగు వీరాభిమానికి ఆయన మెడలో

మల్లెమాల వేయవలెనని మరులుగొని ఈ విధముగా కందపద్యము

ద్వారా తమిళములో  నివేదించుచున్నాడు.

మామణి రజని తలైవా

మా మన్నవ మా మనిదనె మరగద వైరం

మామలయప్పా ఉడనడి

మామల్లిగె మాలపోడ మనదిల్ ఆశై

నవ్వే మనిషికి గుర్తగు
నవ్వే ఆరోగ్యమునకు నాణ్యత పెంచున్
నవ్వే మైత్రికి సఖుడౌ
నవ్వే లేనట్టివాడు నరుడా రామా!
నవ్వే మోమునకందము 
నవ్వే బంధాలబండి నగలౌ కనగా 
నవ్వే బాధల మందగు
నవ్వే మన రాయభారి నయముగ రామా!
కందము వ్రాయుట కవితల 
కందమ్మని తెలిపి  చదువ కడు వేడుకతో
కందము రమ్మని చదువగ
కందకు బచ్చలిని గూర్చు కవితల రామా!

కందములందములంచును
కందక తగ మెచ్చినాము  కడు మోదముతో
కందుకము ఓలె నవ్వుల
కందకమున పడుచులేచి కవివర రామా!



 ********************************************************
తేటగీతి. పోయి వాష్రూమునొక్కడు ఫోర్సు జూప
అంత రాత్మనె నతనితో నంత ఫోర్సు
చదువు పై జూపియుండిన చక్కగాను
గొప్ప సీటేక్కియుండవె గొర్రె బుద్ధి 
*********************************************************
దువ్వెన పట్ట నెత్తికిని దుప్పటి ఎండకు నిండు పొట్టకున్
తవ్వెడు బియ్యపన్నమును తవ్వని భూమిన గల్గు సంపదల్
జివ్వను దంతపంక్తికిని జిల్లను శీతల పాన పాత్రలున్
ఎవ్విధి వాడగల్గెదవు ఏర్పడ తెల్పుము రామ మోహనా!

ఇటువంటి పట్టణముంటుందా!
కోమల చిత్ర శాలలును కోరిన బట్టలకొట్లు లేకయున్
కామిత పాదరక్షతతి గల్గని మాలులు గోల్డు షాపులున్
క్రీముల స్టోరు లేములును కీలకమైన సెలూను లుండకన్
భామలు బాధ జెందునొక పట్టణ మెక్కడ రామమోహనా!

చిత్ర శాలలు = CINE THEATRES
ప్రేమను పంచలేని సతి పేరుకు మాత్రమె కన్న బిడ్డలున్
తూములు లేక పల్వలపు తోయము పారెడు ప్రాంతమందునన్
దోమలు గల్గు సీమలనుతోడుగ నెవ్వరు లేని కొంపలో
ఏమని యుండగోరనగు నెవ్విధి జూచిన రామమోహనా!

చేటును గోరు మిత్రులును చెడ్డ దలంచెడు  భార్య సోదరుల్
కాటికి జేరు కాలమున కానగ రానటువంటి బంధువుల్
ధాటిగ బెంచినట్టి తన తల్లిని దండ్రిని వీడు బిడ్డలున్
చేటకు చింపి బోలుదురు చింతన జేయగ రామ మోహనా! 

ఉత్సాహము
జాతి రకానికి చెందినది ఈ పద్య విశేషముఇందు 15 నుండి 22 అక్షరములు ఉండును. 4 పాదములు ఉండును. ప్రాస నియమం కలదు. ప్రతి పాదమునందు 5 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము. ప్రతి పాదమునందు ఏడు సూర్యగణములుఒక గురువు ఉండును. నేను ఈ ఛందస్సు లో వ్రాసిన పద్యమును గమనించండి.
కలికి నీదు మోము మిదువు గన చపాతి  వుల్లెయౌ
చెలియ నీదు కోపమేమొ చెలగు వేడి పెనమనన్
కాలెనేని దోరగనది   కమ్మని రుచి గూర్చెడున్
వలపు చెట్ని తోడు కూడ వల్లకాదు పొగడగన్


No comments:

Post a Comment