కనికరించు
కనికరించు ఎడబాయక కమల నయన నాయకా
కలుష జలధి బడనీయక కామిత వరదాయకా
దిశనెరుగని మీనమేను తిరముగనే నిలువలేను
పాడుపడిన వీణియను పాడగనే పనికిరాను
ఆలకించు నామొరలను ఆశ్రిత వరదా సదా
నీదయ నాపైన లేక నీ నెలవును చేరలేను ||కనికరించు||
అలల కడలి పోలిక మది అది నిశ్చలమెట్టులౌను
ఆశల అంబరమేవిధి అందుకొనగ వీలు పడును
నీపదమ్ము నీపదములు నిన్నుపొగడు నాపదముల
అండతోడ చేరగలుగు అవకాశము కలుగనౌను ||కనికరించు||
చెరుకు రామ మోహన్ రావు
కనికరించు ఎడబాయక కమల నయన నాయకా
కలుష జలధి బడనీయక కామిత వరదాయకా
దిశనెరుగని మీనమేను తిరముగనే నిలువలేను
పాడుపడిన వీణియను పాడగనే పనికిరాను
ఆలకించు నామొరలను ఆశ్రిత వరదా సదా
నీదయ నాపైన లేక నీ నెలవును చేరలేను ||కనికరించు||
అలల కడలి పోలిక మది అది నిశ్చలమెట్టులౌను
ఆశల అంబరమేవిధి అందుకొనగ వీలు పడును
నీపదమ్ము నీపదములు నిన్నుపొగడు నాపదముల
అండతోడ చేరగలుగు అవకాశము కలుగనౌను ||కనికరించు||
చెరుకు రామ మోహన్ రావు
No comments:
Post a Comment