అజరామర సూక్తి – 99 పై
స్పందన ప్రతి స్పందన.
https://cherukurammohan.blogspot.com/2021/01/99.html
అజరామర సూక్తి పై శ్రీనాథ బాబు గారు, రవి సుధాకర్ గారు, పార్వతీశం గారు నా
లేఖనమును అణువణువూ చదివి స్పందించినారు. వారికి హృదయపూర్వక
ధన్యవాదములు.
వారి స్పందనలను దృష్టిలో ఉంచుకొని నాకు తోచిన నాలుగు మాటలు
వ్రాయుచున్నాను. ఇందులో ఊకదంపుడు ఉండదు.
Srinatha Babu
Chakkani Ajaramara Sukthi. Manasuku
aalochana kaluga chesthundi. Meeku dhanyavadamulu.
Ravi Sudhakar Musunuri
కాకి వెనుక ఇంత కథ ఉందా? చాల బాగుంది బావగారు
పార్వతీశం గారి అభిప్రాయము:
అజరామర సూక్తి..99
ఇది నిజంగా అజరామరమేనండి ఎందుకంటే కాకి తత్వము గూర్చి చెప్పినది. కాకులు
భువిని ఉన్నా,పోయినా వాటి తత్వం మాత్రం భూమిపై ప్రజలు నోళ్ళలో నిలచి
ఉంటుంది...
శ్లోకం
కాకా ఆహ్వయతే కాకాన్,యాచకో న తు యాచకాన్
కాకా యాచకయోర్మధ్యే వరం కాకోన న యాచకః
కాకి తనకు కాసిన్ని మెతుకులు దొరికినంతనే తాను తినక కావు కావు మని మిగిలిన
కాకులను పిలిచి వాటితో యీ కాసిన్ని
మెతుకులనూ పంచుకుంటుంది.
కాని దొంగ తనకు యెంతో ధనము దొరికిననూ అది యెవరితోనూ పంచుకోడు అని
వివరించారు.
అందువల్లనే "యాచకో
యాచకశ్శతృః"అన్నట్లు తెలిపారు.
ఒక ధనికుడు మరణించగా తమ భటులు వస్తే అతనికీ యమభటులకూ, జరిగిన
సంభాషణా,ధనికుని భంగపాటు, చాలా హాస్య భరితంగా జ్ఞానోదయం కలిగించే రీతిలో
చెప్పేరు.
గొప్ప మెదడు గల మానవుడు యోచించలేని పరహితాన్నీ ఉన్నది పంచుకోడాన్నీ
హృదయము గల కాకి యోచించి ఆచరించింది.అది వివరించే యీ మీ పద్యం అతి
ముఖ్యమైనది.
"కాకియొకటి దొరుకుకాసిన్ని మెతుకుల
నైన వారి బిల్చి యారగించు
కాకి బుధ్ధి మనకు కలనైన రాదిది
రామ మోహనుక్తి రమ్య సూక్తి"
అనే పద్యంతో వివరించేరు....
చాలా చాలా విశేషమైన విశిష్టమైన విశ్లేషణ,పద్య రచన లకు అనేకానేక
అభినందనలండీ రామ మోహన రావు గారూ. వందనములండి
Ravi Sudhakar Musunuri
Parvateesam Vepa అన్నయ్య గారు - మీ
విశ్లేషణాత్మక స్పందన అద్భుతం.
Parvateesam Vepa
Ravi Sudhakar Musunuri తమ్ముడు గారూ మీకు నా విశ్లేషణ నచ్చినందుకు చాలా
సంతోషం.
నా ప్రతిస్పందన
దత్తాత్రేయులవారు తనకు ఎవరెవరు గురువులని తెలుపుచున్నారో గమనించండి. నేను
సమస్త ప్రకృతిని పరిశీలించి అన్నింటి
నుండీ జ్ఞానం సంపాదించాను. చెప్తాను విను.
ప్రకృతిలో నాకు 24 మంది గురువులున్నారు. కొన్నింటినుండి ఎలా ఉండాలో
తెలుసుకున్నాను, కొన్నింటినుండి ఎలా ఉండకూడదో
తెలుసుకున్నాను. అని
1. భూమి నుండి – క్షమా, పరోపకారత్వం నేర్చుకున్నాను.
2. వాయువు నుండి- నిస్సంగత్వం, నిర్లేపత్వం.
3. ఆకాశము నుండి- సర్వవ్యాపక తత్త్వం.
4. జలము నుండి – నిర్మలత్వం, మాధుర్యం స్నిగ్ధత్వం,
5. అగ్ని నుండి – తేజస్సు, ఈశ్వర తత్త్వం.
6. సూర్యుని నుండి - జలగ్రాహి, జలత్యాగియు,లోకబాంధవుడు, సర్వలోకాలకు
అతడొక్కడే అని తెలుసుకున్నాను.
7. చంద్రుని నుండి – వృద్ధి క్షయాలన్నవి దేహానికే కాని, ఆత్మకు కావు అని
తెలుసుకున్నాను.
8. పావురాల జంట నుండి – కామక్రోధాలకు వశమైనచో ఆత్మానురాగం కోల్పోతారని
తెలుసుకున్నాను.
9. అజగరము నుండి (కొండ చిలువ) – దైవికంగా లభించిన దానికి తృప్తి చెంది,
లభించని దానికై
వెంపర్లాడక ఉండాలని కొండచిలువ నుండి నేర్చుకున్నాను.
10. సముద్రం నుండి- తనలో ఉన్న మనోభావాలను బైటకు పొక్కనీయకూడదని
నేర్చుకున్నాను.
11. మిడత నుండి – సుఖమని భ్రమించి మోహమనే జ్వాలాగ్నికి బలి అయి, మృత్యువుకి
చేరువవుతుందని తెలుసుకున్నాను.
12. తేనెటీగ – యోగి ఎవరినీ నొప్పించకుండా భిక్ష సంపాదించుకొన్నట్లు, తేనెటీగ
కూడా ఏ పువ్వు కూడా బాధపడకుండా, గాయపడకుండా తేనెను సంగ్రహిస్తుంది. ప్రతీ
పుష్పాన్ని వదలకుండా తేనెను సేకరించినట్లే ఏ గ్రంథాన్ని, ఏ ఒక్క విషయాన్ని
వదలకుండా శాస్త్రాధ్యయనం చేయాలనేది తెలుసు కున్నాను. తాను కష్టపడి కూడబెట్టిన
తేనెను (తేనెపట్టును) పరాయి వారికి వదిలేస్తుంది. కానీ యోగులు రేపటి అవసరాల
కోసం సంపాదించరు.
13. వారణము (ఏనుగు) నుండి – ఏనుగు తనకున్న స్త్రీలౌల్యం వల్ల ఎంత
బలమైనదైనప్పటికీ, ఇతరులకు
వశపడుతుంది.
14. మధుహారి – ఇతరులు కూడబెట్టిన వస్తువును, న్యాయాన్యాయాలు
ఆలోచించకుండా అపహరించేవాడు నీచుడు అనబడతాడు.
15. లేడి నుండి- అమాయకత్వంతో వేటగాని వలలో పడుతుంది. అమాయకత్వం
కూడదని తెలుసుకున్నాను.
16. చేప నుండి – జిహ్వ చాపల్యంతో ఇంద్రియనిగ్రహం కోల్పోయి ఎరకు చిక్కి
బాధపడుతుంది. జిహ్వ ఎంత చేటు చేస్తుందో
తెలుసుకున్నాను.
17. పింగళ (ఒక వేశ్య) నుండి – భౌతిక వాంఛలకు, ధనాశకు లొంగి కాలాన్ని,
సాధనాన్ని (మనశ్శరీరాలు) దుర్వినియోగం చేసుకోకూడదని తెలుసుకున్నాను.
18. కురరము (లకుముకి పిట్ట) నుండి – ఇతరులకు, తనకు మధ్య తేడాలు గ్రహించక
వారితో పోటీపడటం మంచిది కాదు అని
గ్రహించడం.
19. బాలుడి నుండి – పాపపుణ్యాలు ఎరుగక యోగితో సమానుడిలా ఉండాలని
తెలుసుకున్నాను.
20. కన్యక నుండి - ఎటువంటి
పరిస్థితులున్నప్పటికీ, కుటుంబ గౌరవాన్ని
కాపాడటం.
21. శరాసనుని (విలుకాడు) నుండి – ఏకాగ్రత.
22. సర్పము నుండి – జీవితం అశాశ్వతమని గ్రహించినదానివలె తనకంటూ
స్థిరనివాసం ఏర్పరుచుకోదు.
23. సాలెపురుగు – ఎన్నిసార్లు లయమయినా, మరల మరల సృష్టిస్తుంది. ప్రయత్నం
వల్ల కార్యసిద్ధి.
24. పురుగు నుండి – భ్రమరకీటకన్యాయం వలె మనస్సంతా భగవంతుని మీదే
లగ్నంచేసి చివరకు భగవంతునిలో లీనం అవ్వాలి అనేది
తెలుసుకున్నాడు.
ఆ విధంగా ప్రకృతిలోని ప్రతీ అణువు తనకు గురువేననీ, తన మనస్సు కూడా తనకు
గురువేనని
తెలియచెప్పినారు.
ఆ విధంగా తానే స్వయంగా దేవతలు, రాజులు, మహర్షులకి ఎందరికో గురువైనప్పటికీ,
అహంకారం లేకుండా సృష్టిలోని ప్రతీ అణువు నుండి నేర్చుకుంటూ శిష్యుడు కూడా
అయినాడు.
ఇంత పరిశీలన చేసే ఓర్పు, సమయము, ఆకాంక్ష, సాత్వికత, కామ వికర్షణ మనలో
మచ్చుకయినా ఉన్నాయా!
పురాణ ప్రవాచకులగు కొందరి బియ్యములో ఊక ఎక్కువ. మనకు వూకను వేరుచేసి
బియ్యము తీసుకొనే శక్తి ఓపిక రెండూ లేవు. వారు ఊక ఉంచకుంటే తరువాతి రోజుకు
తగినంత విషయముండదన్న చింత. 'ధనమూలమిదం జగత్' కదా. జ్ఞాన సంపన్నుడు
ఆ దిగులు పెట్టుకోడు.
ఏతావాతా నేను చెప్పదలచుకొన్నదేమిటంటే
క్షణశః కణశశ్చైవ - విద్యామర్థంచ
సాధయేత్ l
క్షణ త్యాగే కుతోవిద్యా - కణ
త్యాగే కుతో ధనంll
అన్నారు పెద్దలు. నేర్పించే సద్గురువు దొరికినపుడు క్షణము కూడా వృధా చేయకుండా
విద్య ఏర్చుకోవాలి. చీమకు ఆహారమే ధనము. ఒక్కొక్క రేణువును తన సహచరుల
సహాయముతో కూడబెడుతుంది. మనిషి తప్పనిసరి అయితే తప్ప ధనము
విషయములో ఒకరి సహాయము కోరడు. అయినా అవసరానికి మించకుండా ధనము అణువణువూ కూడబెట్టవలసినదే, అవసరము లేని ఖర్చులు చేయకుండా! ఇది జీవిత సత్యము. మంచి తెలుసుకొనుట జీవితమునకు ఎంతో మంచిది.
స్వస్తి.
🙏
ReplyDeletePrakrutinundi emi nerchukovalo cheppina guruvu padalaku pranamu pranamu
ReplyDelete