ఆర్ద్రత
శ్రీ మహావిష్ణువునకు శ్రవణా నక్షత్రము ముఖ్యమైతే శంకరునికి ఆర్ద్రా నక్షత్రము అతి ముఖ్యము.శ్రవణమంటే వినుటయే కదా. భక్తుడు నా సహస్ర నామ శ్లోకములలోని ఒక శ్లోకమును నాకు వినిపించినా నా చెంతకు చేరుతాడంటాడు పరమాత్మ. నా నెత్తి పై కాసిన్ని నీళ్ళు పోసి ఒక బిల్వం పెడితే చాలు నావద్దకు చేర్చుకొంటానంటాడు పరమేశ్వరుడు. వారెంత భక్త సులభులో గమనించండి.
అశ్వని,భరణి .... రేవతి వరకు గల 27 నక్షత్రాలూ తమిళులకు గూడా వున్నాయి కానీ ఆపేర్లను వారు వారి భాషకు అనుకూలముగా పలుకుతారు. తమిళములో 'తిరు' అంటే 'శ్రీ' అని 'శ్రేష్టము' అని అర్థము. ఈ తిరు శబ్దాన్ని వారు అటు శ్రవనానికి ఇటు ఆర్ద్రకు మాత్రమె వాడుతారు కానీ వేరు నక్షత్రములకు వాడరు. శ్రవణాన్ని'తిరువాణం'
అంటారు. ఆర్ద్రను 'తిరువాదిరై' అంటారు. ఎందుకంటే ఈ రెండు నక్షత్రాలు వారిరువురికీ అంత ముఖ్యమైనవి కాబట్టి.విషయము 'ఆర్ద్రత'ను గూర్చి కాబట్టి మొదలు దాని అర్థము చెప్పుకొందాము.ఆర్ద్రత అంటే తడిసిన అని అర్థము. కన్నులు ఆర్ద్రత తో నిండిపోయినాయి అంటే కన్నులు చెమ్మగిల్లినాయి అని అర్థము.మరి శివునికి 'ఈ ఆర్ద్రత చాలా ఇష్టము. ఆయన దుఃఖము సహించలేడు. అశ్రు పూరితనయనములతో ఆయనను ఒక్క సారి వేడుకొంటే కనిగుడ్డే శివలింగముగా కన్నీరే అభిషేకజలము గా భావించి మనల నాదుకొంటాడు. చితంబరములో మార్గశిరమాసములో వచ్చే ఆర్ద్ర నక్షత్రము చాలా ముఖ్యమైన దినము.మార్గశిర పౌర్ణిమ రోజు చంద్రుడు మృగశిర నక్షత్రము దాటగానే ఆర్ద్ర ను చేరుతాడు.అప్పటికి పున్నమి ఘడియలె వుంటాయి. మార్గశిర మాసమే చలికాలము అందులోనూ శీతకిరణుని పౌర్ణిమ. అంటే ఒకటే చలి. అభిషేకము చేసి స్వామికి చల్లదనాన్నిచ్చే చందనమును అలదుతారు. ఆ పరమేశుడు ఎంత 'ఆర్ద్రత'ను భరించుతాడో చూడండి.
ఈ విషయాన్ని తీసుకొని ఒక శివభక్తకవి ఈ శ్లోకాన్ని ఎంత మనోహరంగా చెప్పినాడో చూడండి.ఒకవైపు ఇంత చలిని ఎట్లు భారించుతావయ్యా అంటూనే దానికి మార్గము కూడా నిరుత్తరుడైన పరమేశ్వరునకు చెబుతాడు.
మౌళౌ గంగాశశాంకౌ కరచరణ తలే శీతలంగా భుజంగా
వామే భాగే దయార్ద్ర హిమగిరి దుహితా చందనం సర్వగాత్రే
ఇత్థం శీతం ప్రభూతం కనక సభా నాథ సోఢుం క్వ శక్తిః
చిత్తే నిర్వేదతస్తే యది భవతి నతే నిత్యవాసో మదీయే
కనక సభానాథా : కనక సభాపతీ మౌళౌ : శిగలో
గంగా శశాంకౌ : గంగాయును మరియు చంద్రుడును
కరచరణతలే : చేతులు కాళ్ళ నంటుకొని
శీతలాంగాం : చల్లని శరీరములు కల
భుజంగాః : పాములు
వామే : ఎడమ
భాగే : వైపున
దయార్ద్రా : దయచేత తడిసిన (అమితమగు దయగలిగిన)
హిమగిరిదుహితా : మంచుమల పట్టి
సర్వగాత్రే : ఒడలంతా
చందనం : మంచి గంధము
ఇత్థం : ఇట్లు , ఈ విధంగా
ప్రభూతం : ఎక్కడైనా
శీతం : చలువదనమును
సోఢుం : ఉందా
నిత్యతప్తే : ఎల్లకాలమునందును వేడి పుట్టించే
నిర్వేద తప్తే : ఉదాసీనత చేత కాగాబడుచూ వున్న
మదీయచిత్తే : నా మనసు నందు
తే : నీకు
నిత్య వాసః : నిరంతర నిలయము
యది న భవతి : అట్లుకానిచో
శక్థిః : సత్తువ
క్వ : ఎక్కడ (అంటే శక్తి ఎక్కడ నుండి వస్తుంది)
పరమేశ్వరునికి పృథివి పైన ఐదు నాట్య సభలు తమిళనాడు లోని ఐదు దేవాలయాలలో వున్నాయి .
అవి 1. చితంబరములో కనకసభ, దానికి నాయకుడైన శంకరుడు కనక సభాపతి 2. తిరువలంగాడు లో రత్న సభ, దానికి నాయకుడైన శంకరుడు రత్న సభాపతి. 3. తిరుక్కుట్రాలం లో చిత్ర సభ, దానికి నాయకుడైన శంకరుడు చిత్రసభాపతి 4.తిరునెల్వేలి లో తామ్రసభ, దానికి నాయకుడైన శంకరుడు తామ్ర సభాపతి 5. మధురై లో రజత సభ, దానికి నాయకుడైన శంకరుడు రజత సభాపతి .
ఇప్పుడు మన నాయకుడు కనక సభాపతి. మహనేయుదగుఆ అజ్ఞాత కవి స్వామితో ఈ విధముగా మాటలాడుచున్నాడు.
స్వామీ కనక సభాపతీ నీవా వ్యోమ కేశునివి. నీ జటల శిగలో ఒడలు జలదరించే గంగ, శిగపువ్వు చల్లదనాన్ని సమకూర్చే నెలవంక,చేతులు కాళ్ళు మేనూ చూతమా నీ ఆభారనాలైన పాములు వెన్నులో వణుకు పుట్టిస్తుంటాయి, నీ నెలవా మంచుకొండ ,వామ భాగము (ఎడమ వైపు) చూస్తేనో దయాంబురాశియైన నీ ఇల్లాలు హైమజ, ఇవి ఇట్లుండగా మార్గ శీర్ష ములో చలి, దానికి తోడూ చల్లని పున్నమ రేయి,జలధారలతో అకుంఠిత అభిషేకము ఆపై శైత్యము కలిగించే చందన గంధము నీ మేనికి అలదుతూ వుంటే అంతటి చలిని ఎట్లు భరింపగలుగు చున్నావయ్యా మహానుభావా.
బహుశ ఈ ప్రశ్నకు, తనలో 'ఇంత ఆర్ద్రత' ఉందా అన్న ఆశ్చర్యముతో అవాక్కయిపోయి ఉంటాడు
శివుడు. అడుకని ఆ భక్త కవే జవాబు చెప్పుచున్నాడు. స్వామీ నీవు చింతించ నక్కరలేదు. వాసనా భరితుడనై, జనితుడనై, మొహపరవశుడనై, బాదాగ్ని వలయ పరివేష్టితుదనై వున్నా నావద్ద కావలసినంత వేడి దొరుకుతుంది.నా మది యన్న గది నీ కొరకే ఖాళీగా వుంచినాను.
అక్కడ ఉండిపోతే నీకూ హాయి నాకూ హాయి మరి నీవేమంటావు అన్నాడు భక్తుడు వేరేమంటాడు సరే అనక శివుడు.
చిత్తము శివునికి నెలవైతే మరి భక్తి ఆ భగవంతుని అర్చనా పుష్పమే కదా !
తత్సత్

No comments:
Post a Comment