భారత జాతి శైవలిని పారగ, నీరద బింబమంటి, ఇం
పారగ నిల్చినట్టి తరు పారము నందున వాని పచ్చ కై
జారుచు బాలభాను రహి జేరుచు వారిజ యంచులంట,యా
కారము దాల్చె జాతి ధ్వజ కైవడిగా జనులెల్ల మ్రొక్కగన్
భారత జాతి యనబడు గంగ ఆకసమున గల తెల్లని మేఘము యొక్క బింబమును తనయందమర్చుకొని ఒడ్డున నిల్చిన ఆకుపచ్చని చెట్ల యొక్క పచ్చదనమును, ఉదయ భానుని ఎర్రదనాన్ని గ్రహించుతూ అందు విరిసిన తామర రేకుల అగ్రములు అశోక చక్రమై అమరగా, రెపరెపలాడే మన జాతీయ పతాకమా యంచు భాసిల్లిన యా నదీమతల్లికి జనులు మ్రొక్కులిడిరి.
సత్యాహింసలె చారు విలాసము
నిర్మల నీతియె నిత్యానందము
ఐకమత్యమే అద్భుత భావము
ఆచరించితే అందును సర్వము
పరాదీనతే పాపపు కూపము
స్వాధీనతయే సకల శుభములకు
మూలము గనుడని మోహన రాగము
మధుర మృదులతర మంజులగతిలో
ప్రపంచమంతట ప్రబల రీతిలో
నింపగ అదియే నిజమని చెప్పుచు
జగతి చాటగా జాతియజండా
తల ఊపెనదే

No comments:
Post a Comment