చిటపట చెమటలు (చిటపట చినుకులు పడుతూవుంటే పాట రాగము)
https://cherukurammohan.blogspot.com/2025/04/blog-post.html
చిటపట చెమటలు పడుతూ వుంటే
మట మట పటతల మాడుతు ఉంటే
గొంతు ఆరిపోయ్ గసపెడుతూంటే
ఓటు కుండలో నీటిని తాగిన
రీతిగా ఉంటుందోయి
వేసవి సూర్యుడు ఉడికిస్తూంటే
చెమ్మటకాయలు చిటపట మంటే
జోళ్లు లేకనే తారురోడ్డుపై
మండుటెండలో నడుస్తూ ఉంటే
చెప్పలేని ఆ అనుభవమన్నది
చెబితే తీరని దోయి
కిట కిటలాడేటి జనాలు బస్సున ఉంటే ll బస్సున వుంటే ll
స్నానమునే చేయనివాడు పక్కన ఉంటే ll పక్కన ఉంటే ll
కారే చెమటల కంపు పంచుతూ
ముక్కు పుటాలను ఛేదిస్తుంటే
చెప్పలేని ఆ తిప్పట ఎపుడూ
చెప్పనసాధ్యమ్మోయి
కమ్మ కమ్మగా కల వస్తూంటే
కలలో ఊర్వశి నర్తిస్తూంటే
ఫాను ఆగిపోయ్ ఉక్కపోయగా
కలచిన ఊహల రక్కసి వస్తే
చెదరి బెదరిన చెమటల మేను
దడదడ లాడు కదోయి