మన మహర్షులు చెప్పిన
సంస్కృతి వాక్యములు
https://cherukurammohan.blogspot.com/2023/04/blog-post.html
అతిధి అభ్యాగతులను
గౌరవించవలసిన రీతిని గూర్చి మన పూర్వులు ఏమిచేప్పినారో చూడండి.
మనది సనాతన ధర్మము. ఆది
అన్నది తెలియని అనాది ధర్మము. దార్శనికులు ఆకాశము (Eather) నుండి తాము గ్రహించినవి మరియు అట్టి విషయములను గుర్తు
ఉంచుకొని దానికి తమ విజ్ఞానమును జోడించి చెప్పినవి. మనకు ఏ 2000 సంవత్సరముల క్రితమో, 1500 సంవత్సరముల
క్రితమో నిర్దేశింపబడిన మత గ్రంధములలో చేర్చిన మాటలు మనకు శిరౌధార్యములు కావు. J.K. Sheindlin’s "The
People vs Muhammad"? అన్న ఆంగ్ల పుస్తకము చదివితే ఆ ప్రవక్త మతవిధానము అర్థమవుతుంది.
అదేవిధముగా 'Inconsistencies
and Contradictions in the Bible' compiled by Donald Morgan చదివితే ఆ మతగ్రంధము లోని విషయములు
మనకు అవగతమౌతాయి. ఏదిఏమయినా మన పూర్వులు లక్షల సంసంవత్సరముల పూర్వము చెప్పిన
మాటలు నేటికీ శిరౌధార్యములు. అందుకే వారు చెప్పిన ఈ నీతివాక్యములను క్రోడీకరించి
మనకు నీతి శాస్త్రము పేరుతో అందించినారు. నిజానికి మనము Quotations అన్న పేరుతో ఎవరెవరో పాశ్చాత్యులు చెప్పిన మాటలు తాటికాయలంత
అక్షరాలతో ఒక వాక్యముగానో రెండు మూడు వాక్యములుగానో ప్రచురించుతూ వుంటా. నిజానికి
అటువంటి సాహిత్యము మన నీతిశాస్త్రములలో కోకొల్లలు. అదికూడా ఎక్కువగా రెండు రెండు పాదములు కలిగిన శ్లోకరూపములోనే! అసలు శాస్త్రము
అంటేనే శాసించేది అని అర్థము. అది తెలుసుకొని మనము పాటించితే చాలు. ఆ అనర్ఘ
రత్నములను కమ్మలలో కడియాలలో పొదుగ నక్కర లేదు. యథాతథముగా గ్రహించితే చాలు. అవి ఎంత
చీకటిలోనైనా ప్రకాశించు శక్తి కల్గినవి. అటువంటి కొన్ని సార్థకముగా మీ ముందు ఉంచుచున్నాను.ఇప్పుడు అటువంటి అనేకానేక శ్లోకముల నుండి ఒకటి మీ ముందుంచుచున్నాను.
మన పూర్వుల గొప్పదనము తెలుసుకొనుటకైనా చదవండి. అప్పుడప్పుడు ఒక్కొక్కటిగా మీముందు
ఉంచుతాను.
ఇంటికి ఏతెంచిన వారిని
ఆంగ్లములో Guests అని మాత్రమె అంటాము. అదే మన సంస్కృతి లో మన సంస్కృతములో
వారిని రెండు విధములుగా వర్గీకరించినాము. 1. అతిథి 2. అభ్యాగతి
అతిథి అంటే ఆ వ్యక్తి యొక్క
రాకను గూర్చి మనకు తెలియకుండానే వచ్చేవాడు. అభ్యాగతి అంటే తన రాకను తెలిపి
వచ్చేవాడు. ఈ క్రింది శ్లోకము ఇరువురికీ వర్తించుతుంది.
వాచం దద్యాత్ మనో దద్యాత్
చక్షుర్ దద్యాత్ తథైవచl
ఉత్థాయచ ఆసనం దద్యాత్
ఏషాధర్మ సనాతనఃll
ఇంటి లోనికి అడుగు
పెట్టబోయే అతిథి అభ్యాగతికి ఆసనమునుంచి లేచి నిలబడి రండి రండి అని ఎంతో
ఆదరపూర్వకముగానూ, మనఃపూర్వకముగానూ, ఆహ్వానించుచూ, ఆప్యాయతతో కూడిన దృష్టి ఆ వ్యక్తిపైనుంచి, ఆహ్వానించవలసియుంటుంది. ఇది మన సనాతన ధర్మవాక్యము.
మరి ఈ పద్ధతిని త్రికరణ
శుద్ధితో పాటిస్తున్నామా! నాటికి నేటికి కల తేడా నేను వ్రాసిన ఈ క్రింది పద్యముల
ద్వారా ఒకసారి గమనించండి.
నాటి ఆప్యాయత
అతిధి ఇల్లు త్రొక్కి
అరుదెంచినంతనే
కూరుచుండగజేసి కుశలమడిగి
దాహమిచ్చి యతని తగిన
మర్యాదతో
గౌరవించె గృహస్తు గాంచ నాడు
నేటి దుస్థితి. నేటి మర్యాద
ఒకపరి తిలకించండి.
గెస్టులు వచ్చిన గెట్టిన్ను
ప్లీజంచు
గ్లాట్టుమీట్ యూ చెప్పి
కదలనీక
కాఫి చేతికియిచ్చి గాసిప్పు
మాట్లాడి
పంపుచుందురు నేడు ‘బాయి’
జెప్పి
అతిథి సేవల గాంచగా అగ్ని
చేరె
కాలమైపోయె మంచిదౌ కాలమంత
చట్టుబండగ అయిపోవ సాంప్రదాయ
మేమి మిగిలెను మనకింక
ఎంచిజూడ
స్వస్తి..
No comments:
Post a Comment