ఆయుర్వేదము –ఉపోద్ఘాతము
నేను వైద్యుడను
కాను. ఈ వ్యాసములో ఏ వ్యాధికి ఏమందులు వాడవలెను అన్న విషయమును గూర్చి వ్రాయబోవుట
లేదు. నా తపన అంతా ఇది ఒక మహత్తర వైద్యశాస్త్రము అన్న విషయమును నాకు దొరకిన ఆధారపూర్వకముగా దొరికిన అంశములను మీముందుంచే ప్రయత్నము చేయుచున్నాను.
ఉపన్యాసమునకు రచనకు
ఎంతో తేడా ఉంది. ఉపన్యాసములో తప్పులు దొరలినా గాలిలొ కలసి పోతాయి. రచన అజరామరముగా
నిలచిపోవచ్చు. శాస్త్ర, పురాణ, ఇతిహాసములవలె.
అట్లని నేను వ్రాసే ఈ నాలుగు మాటలూ చిరస్థాయిగా నిలుస్తాయి అని చెప్పుట లేదు. అది
ఆ రచన యొక్క స్థాయిని బట్టి ఉంటుంది. ఇక అసలు విషయముయోక్క ఉపోద్ఘాతమునకు
వద్దాము.
పునరుజ్జీవనం (Renaissance)మధ్య యుగాల
తరువాత యూరోపియన్ సాంస్కృతిక, కళాత్మక, రాజకీయ మరియు
ఆర్థిక “పునర్జన్మ” యొక్క తీవ్రమైన కాలం. సాధారణంగా 14 వ శతాబ్దం నుండి 17 వ
శతాబ్దం వరకు జరుగుతున్నట్లు వర్ణించబడింది. చీకటి నుండి కాంతి
వైపునకుపునరుజ్జీవనం ప్రారంభమైంది. దీనిని "చీకటి యుగము" అని కూడా
పిలుస్తారు, ఈ యుగం తరచుగా
యుద్ధం, అజ్ఞానం, కరువు మరియు
మహమ్మారి, ప్లేగ్ వ్యాధుల
కాలము అని కూడా అంటారు.
అసలు
ఆయుర్వేదానికీ ఈ పునరుజ్జీవన విషయానికీ గల సంబంధమేమి అని మీలో ఒక సంశయము ఈపాటికే
ఉత్పన్నమై ఉండవచ్చు. ఈ ప్రస్తాపన ఎందుకు తెచ్చినానంటే, ఈ
పునరుజ్జీవనం (Renaissance) వచ్చేవరకు
పాశ్చాత్యులలో చెప్పుకోదగ్గ చరిత్ర లేదు. మరి మనదో, అప్పటికే ఎన్నో
లక్షల సంవత్సరములనుండి నడచుచున్న చరిత్రగలిగిన దేశము. అంత చరిత్ర ఉంటె అంత
సంస్కృతి అంత విజ్ఞానము మనవద్ద ఉన్నట్లేకదా!
అంటే మనవద్ద
ఆయుర్వేదమే కాకుండా,
Human Anthropology -మానవ వికాస
శాస్త్రము
Geography - భూగోళ శాస్త్రము
Human Geography - మానవ భూగోళ
శాస్త్రము
Political Administration - రాజ్కనీతి
శాస్త్రము
Military Administration - సైన్య నియంత్రణ
శాస్త్రము
Defense Strategies - సైనిక వ్యూహా
శాస్త్రము
Architecture - వాస్తు శాస్త్రము
Communication Engineering - ప్రసార శాస్త్రము
International Relations - అంతర్జాతీయ
సంబంధములు, దౌత్య సంబంధములు
Trade Commerce and Industries – వర్తక వాణిజ్య
పరిశ్రమ విభాగము
Human Relations – మానవీయ సంబంధములు
Astronomy – ఖగోళ శాస్త్రము
Astrology – జ్యోతిష్
శాస్త్రము
Aeronautics – వైమానిక
శాస్త్రము
Forestry and Animal Husbandry – వన మరియు జంతు
శాస్త్రము
Family Ethics – కుటుంబ విధానము
Marriage – వివాహ విధానము
Human Customs and Beliefs– మానవీయ
సంప్రదాయాలు మరియు విలువలు
Town Planning and Village Administration – పట్టణ, గ్రామ వాస్తు
మరియు నియంత్రణ
Diplomatic Relationships – దౌత్య సంబంధములు
Naval Administration – నౌకాయాన
విధివిధానములు
Metallurgy – లోహశాస్త్రము
Sculpture Art and Architecture – శిల్ప మరియు
నిర్మాణ శాస్త్రము
Music and Drawing-సంగీతము
చిత్రలేఖనము వంటి 64 కళలు
Mathematics - గణిత శాస్త్రము
External Affairs – విదేశీ వ్యవహారములు
Civil Administration – పౌర శాస్త్రము
Moral Science – నీతి శాస్త్రము
Science of Warfare = యుద్ధతంత్ర
శాస్త్రము
Leadership qualities – నాయకత్వ
లక్షణములు
ఇన్ని శాఖలలో
మనదేశము నైపుణ్యము సాధించియున్డినది. మరి అటువంటి సనాతన దేశ సంస్కారమును, సంపత్తిని
ఎంతవరకు నిలుపుకోగలుగుచున్నాము. ఈ భావమును మనసున నింపుకొని ఈ వ్యాసము చదువ
మొదలుపెట్టండి.
రేపటినుండి అసలు
విషయము......
ఆయుర్వేదము
ముందు ఈ దేశము యొక్క గొప్పదనమును గూర్చి ప్రపంచ సాహిత్య పితగా కొనియాడబడిన అమెరికన్ దేశవాసియగు మార్క్ ట్వైన్ ఏమన్నాడో ఒకసారి గమనించండి అతని
మాటలలోనే:
It was Mark Twain who once said: “So far as I am able
to judge, nothing has been left undone, either by man or nature, to make India
the most extraordinary country that the sun visits on his rounds. Nothing seems
to have been forgotten, nothing overlooked.”
అంతటి భారత దేశము మనకొసంగిన అమృత భాండమే ఆయుర్వేదము. ‘ఆయుః’ అంటే
ఆయుస్సు ఆరోగ్యము ఆయుస్సులది అవినాభావ సంబంధము.
ఆయుస్సు యొక్క ఆయుస్సు ఎల్లప్పుడూ ఆరోగ్యముతోనే ముడిపడి ఉంటుంది.
‘విద్’ అన్నదాతు జన్యము వేదము. వేదము అంటే సులభమగు రీతిలో అర్థము
చెప్పుకోనవలసివస్తే ‘జ్ఞానము’ అని చెప్పుకొన వచ్చును. ఈ ఆయుర్వేదమును ఉపవేదము అనుటకూడా
కద్దు. దీనిని మనకు నాలుగవ వేదమగు అథర్వణ వేదము అందిస్తూవుంది.
అట్టి ఆయుర్వేదము శరీర రుగ్మతలకు మూలకారణములేమని చెప్పిందో చూడండి.
క్రోధశోకభయాయాస వృధాన్నభోజన తాపోన్నలాన్ లవణ క్షార ......
రక్తపిత్త ప్రకోపయేత్
కోపము, నిస్పృహ, దుఃఖము, పరిధి లేని భయము, అధికమైన అలసట,
శ్రుతిమించిన సోమరితనము, అధిక లవణ క్షార ఆహార పదార్థ వినియోగము అన్నవి ప్రాణఘాతుక
రోగాకారకములు. కానీ ఈ దుర్గుణములను దూరముంచుటకు ఆచరించవలసిన
ఆరోగ్య సూత్రములు అతి సులభములు.
నిత్య హిత మిత ఆహార సేవి , సమీక్షకారి, దాత, సమః, సత్యాపర,
క్షమావాన్,ఆప్తోపసేవీ భవేత్.
‘అనునిత్యమూ హితమూ మరియు మితమైన ఆహార సేవనము, చేతికందిన పనిని
చేయతగునా చేయనగునా అన్న ఆత్మసాక్షితో కూడిన విచికిత్స, దానగుణము కలిగియుండుట, తన పర అన్న భేదభావా రహితుడైయుండుట,
సత్యపాలకుడగుట, క్షమాహృదయుడైయుండుట, తనను ఆశ్రయించినవారికి అండదండగా నిలుచుట’ అన్న
ఈ నియమములను నిష్ఠతో పాటించిన వాడు ఆయురారోగ్యములనెడు ఐశ్వర్యమును కలకాలమూ
కలిగియుంటాడు.
గణితము మరియు సైన్సు(science అన్న మాట శాస్త్రము అన్న
పదమునకు సమానార్థకము కాదు.) లో, విరళ సిద్ధాంతము(nonlinear
system) లో input=నివిష్టము
output=ఉత్పాదితము నకు అనులోమానుపాతంలో ఉండదు. ఈ విరళ సిద్ధాంత సమస్యలు ఇంజనీర్లు, జీవశాస్త్రవేత్తలు,
భౌతిక శాస్త్రవేత్తలు, గణిత శాస్త్రవేత్తలు
మరియు అనేక ఇతర శాస్త్రవేత్తలకు ఆసక్తికరమైన విషయములు, ఎందుకంటే
విరళ సమీకరణములు (Nonlinear Equations), కాలక్రమేణా అస్థిర వర్గము(
variables) లోని మార్పులను వివరిస్తూ,
అస్తవ్యస్తంగా, అనూహ్యంగా లేదా ప్రతికూలంగా
కనిపిస్తాయి, అతి సులభమైనమైన సరళ వ్యవస్థల(Linear System)తో విభేదిస్తాయి.
పైన తెలియజేసిన విషయమును సాధారణ పాఠకునికి అర్థమయ్యే రీతిలో
చెప్పవలసి వస్తే ఒక శాఖాహారి తన కంటి ఎదుట అసంకల్పితముగా ఒక జంతువధ చూస్తే, అతను
మైకముతో పడిపోవచ్చు, భయంకరమైన తలనొప్పి రావచ్చు, కడుపులో దేవినట్లయి వాంతులు వచ్చే
ప్రమాదము కలుగవచ్చు, మాట పెగలక పోవచ్చు, అన్నము సహించక పోవచ్చు. ఇన్నివిధములుగా
ఒకే విషయము ఒక వ్యక్తిపై ప్రభావము చూపగలదు. అందుచేత ఆరోగ్యము కోరుకొనే వ్యక్తికి చిత్త
శాంతి, మానసిక సంతులనము ఎంతో అవసరము.
ఒకసారి మనకందరకూ తెలిసిన ఒక ప్రాకృతిక పరిశీలనను పునశ్చరణ
చేసుకొందాము. అమావాస్య పున్నమి వేళలలో చంద్రునియొక్క ఆకర్షణకు లోబడి సముద్రము అలలు
ఉవ్వెత్తుగా ఎగసి పడుతుంటాయి. సముద్రజలము అల్లకల్లోలముగా అగుపించుతుంది. తగిన
ధ్యాస పెట్టకపోవుటవల్ల మనకు తెలియని విషయము ఏమిటంటే మానవ శరీరములో కూడా అధికాంశము
నీటిచే నిండియున్నది. మరి అటువంటప్పుడు చంద్రుని ప్రభావము శరీరముపై లేకుండా ఎట్లు
వుంటుంది? అందుకే ఆయుర్వేదములో, రోగ చికిత్స చేయుటయందు గ్రహచారమునకు ఎంతో
ప్రాధాన్యత ఉన్నది. ఈ విషయమును తేలికగా కొట్టివేసే నేటి అపరిపక్వ వైద్యులు కూడా Scientists
అని నమ్మే న్యూటన్ మరియు గలీలియోలిరువురూ జోతిష్యమును నమ్మి అడిగిన ఎంతోమందికి
జాతకాలు, ప్రతిఫలాపేక్షతో చెప్పేవారు. గ్రహచార విధానము వైద్యశాస్త్రమునకు తగినదే
కానీ చీమలపుట్ట పగిలినట్లున్న నేటి జ్యోతిష్కుల వద్దకు భవిష్యత్తును గూర్చి
తెలుకొనుటకు పోవుట అర్థవంతమగు విషయము కాదు. అట్లని జ్యోతిషము శాస్త్రము కాదు అని
నేననుటలేదు.
ఆయుర్వేదము ఒక ఋషీశ్వరుని అంతర్దృష్టి, అనుభవము,
ఆత్మసాక్షి కలిగిన పరిశీలన పరిశోధన కలిగిన వైద్యశాస్త్రము. అది కేవలము, ఆలోపతి వైద్యమువలె ఆత్యయిక
విషయ నియంత్రణ అనగా emergency case-control studies వంటిది కాదు. అంటే
ఆయుర్వేదము, పిండికి పిడుక్కు ఒకే మంత్రము వలె కాదు. అది వ్యాధి ఒకటే అయినా రోగి
రోగికీ మందు మారుతుంది. ఆయుర్వేదములో చికిత్స ఈ క్రింది విధములుగా విభజించబడినది.
1.క్ష్వేళా విసర్జన (Detoxification)-పంచకర్మ
2. పథ్యము (Diet)
3.యోగక్రియ(Yoga)
4. మూలికా వైద్యము(Herbal Medications)
5. ధ్యాన ప్రార్థనలు(Meditation and Prayer of any God)
6. ఆయుర్వేద శస్త్ర
చికిత్స
(Ayurvedic Surgery)
ఆయుర్వేదము అందున శస్త్ర చికిత్సను గూర్చి వేల సంవత్సరముల క్రితమే ప్రపంచమునకు మొట్టమొదటి సారిగా తెలిపిన దేశము ఈ భారత దేశము.
శస్త్ర చికిత్సకు ఆద్యుడు శుశ్రుతుడు.
క్లిష్టమైన కపాల శస్త్ర చికిత్స లో నైపుణ్యతకు
తగిన రంపములనుపయోగించి చికిత్సను విజయవంతము చేసేవారు. ఇదికాక శరీరములో పేరుకొన్న
రాళ్ళుతీయుట, నాసికా నిర్మాణ చికిత్స, ప్రసూతి
లేక శిశూదయము, గర్భ విచ్ఛిక్తి, గర్భాశయ నిర్మూలనము, శల్య చికిత్స, శరీరములోని వ్రణ
నిర్మూలనము(Tumor Surgery) మొదలగునవే కాక ఇంకా అనేకానేక శాస్త్ర చికిత్సల గూర్చి
తన శుశ్రుత సంహితలో శుశ్రుతుడు ఎంతో విపులముగా విశధముగా వ్రాసినాడు. శాస్త్ర
చికిత్సకు సంబంధించిన 127 శాస్త్ర చికిత్సా పరికరములను తన గ్రంధములో చిత్రముల
రూపములో చూపించినాడు. ఆ రోజులలో రోగికి శస్త్ర చికిత్స చేయుటకు గాను అపస్మారక
స్థితి కలిగించుట (Anaesthesia) సమ్మోహన క్రియ (Hypnotysing) మొదలగు విషయములలో అధికముగా
నైపుణ్యము కలిగియుండినారు. ఈ రోజుకు కూడా ఆయుర్వేదములోని క్షారసూత్ర ప్రక్రియ యే
మొలల(Piles) శాశ్వత నిర్మూలనకు ఉపకరణము. భగంధ్రము (Fistula)నకు కూడా ఆయుర్వేద
శస్త్ర చికిత్స శాశ్వత పరిష్కారము. అపూతిక (Antiseptic) చికిత్సలో కూడా నాడు ఎంతో
ముందంజ మన పూర్వులు ముందంజ వేసియుండినారు. స్పోటకమునకు (Small Pox)టీకాలు వేయుటకు ఉపయోగించే నేటి
Lancet (శస్త్రము) నాటి శస్త్రమునే పోలియుంటుంది. అసలు ఎడ్వర్డ్ జెన్నర్
ఆవిష్కరణగా చెప్పుకొనే ఈ విధానము, ఆయన శుశ్రుత సంహిత నుండి సంగ్రహించినదే! అసలు Dr.
T.Z. Holwell, నాటి వంగ ప్రాంతమున 10 సంవత్సరములు ఈ టీకాల విషయములో, విశ్రుతముగా
పరిశోధనలు ఆయుర్వేదములో జరిపి, తాను పొందిన అనుభవసారమును London Royal College of Physicians 1747లో ప్రకటించుట కూడా జరిగినది. అంటే
ఈ టీకాల విధానము వేళా సంవత్సరముల పూర్వమే భారత దేశమున యుండినదని తెలియజేసినాడు.
ఆయుర్వేదము-2
ఆయుర్వేద
వైద్యుడగుటకు ఔషధ చికిత్స, శస్త్ర చికిత్స రెండూ నేర్చుకొని తీరవలసిందే!
విద్యార్థి ఎక్కువ కాలము గురువు వద్ద ఉండవలసి వచ్చేది. పలు విధములగు రొగములను,
రోగులను పరీక్ష, గురువు సారత్యములో చేస్తూ నేర్చుకొంటాడు శిష్యుడు. శరీర
శాస్త్రమునకు తప్పక శవముల ఆవశ్యకత నాడుకూడా ఉండేది. ఇంకా ముఖ్యమగు విషయమేమిటంటే
సూక్ష్మదర్శనిలు(Mycroscopes) కనిపెట్టబడని వేల సంవత్సరముల క్రితమే చరకుడు,
శుశ్రుతుడు శరీరములోని ప్రతి అంగము కణముల (Cells) సహాయముతో ఏవిధముగా పని చేస్తాయి
అన్నది నిశితముగా తెలియజేసినారు. వ్యాధి మూలకములగు 20 విధముల సూక్ష్మ జీవులను
గూర్చి తెలిపినారు, ముఖ్యముగా హృద్రోగమును గూర్చి.
ఆంగ్ల శబ్ద కోశములో HEART అన్న మాటకు
అర్థమయితే ఇచ్చినారు కానీ దాని పుట్టుకను గూర్చి నేను పరిశీలించినంత మేరకు
కానరాలేదు. నా ఉద్దేశ్యములో 'హృత్' శబ్దము నుండి HEART పుట్టివుంటుంది. మనలనుపాలించిన వారు కదా మన భాషను తమ
భాషకు మాతగా ఒప్పుకొనుటకు ఆభిజాత్యము అడ్డము వచ్చి యుండవచ్చు.
సంస్కృతములో మాత్రము నిరుక్తమున ఎంత
హృద్యముగా 'హృదయము' అన్న మాటకు వ్యుత్పత్తి చెప్పినారో అది తెలిపిన వారి
మేధస్సును వర్ణింప నాతరము కాదు. వారు హిమవన్నగము వంటివారయితే నావంటి వారందు
పిపీలిక సమానులు (పిపీలికము=చీమ). ఈ శ్లోకమును గమనించండి:
తదేతత్ త్ర్వక్షరంహృదయమితి, హృత్ ఏకం మహాక్షరం ద ఇత్యేకాక్షరం
యమిత్యేకం యివం హరతేర్ దదాతేరాయతేర్ హృదయ శబ్ద
నిరుక్తః
'హృ' అంటే హరతి = గ్రహించునది
'ద' అంటే దదాతి = తిరిగి ఇచ్చునది
'య' అంటే అయతి= ప్రవహింప జేయునది
మొత్తము గుండెయొక్క కార్యక్రమమంతా మూడు
అక్షరములు కల ఒక పదములో వచ్చివేసినది. దీనిని 'సింధు' అనటము కూడా కద్దు. నదులు సంద్రమునకలిసి తిరిగి
వర్షముతో నదులుగామారి సంద్రమున కలుస్తున్నాయో రక్తము కూడా గుండెతో అదే సంబంధమును
నిరంతరమూ కలిగియున్నది కదా!
హృదయము యొక్క అర్థమును గూర్చి
తెలుసుకొన్నాము. ఇపుడు ఆ హృదయమును గూర్చి వేదములోని మంత్రపుష్పమునందు ఏమి
తెలిపినారో చూద్దాము.
మంత్రపుష్పమును విధిగా పూజల్లోనూ, వ్రతములలోనూ,
దేవాలయములలోనూ పూజావసాన సమయమును చెబుతూ వుంటారు. అందువల్ల ఆ
మంత్రమును మన హృదయమునకు సంబంధించిన మేరకు మీ ముందుంచుతూ నాకు చేతనయినంత వరకు వివరించుతాను.
పద్మ కోశ ప్రతీకాశగ్౦ హృదయంచా ప్యదో ముఖం ||
అధో నిష్ట్యా విత స్త్యాన్తే నాభ్యాముపరి
తిష్టతి|
జ్వాలమాలాకులంభాతి విశ్వస్యాయతనం మహత్ ||
సంతతగ్ం శిలాభిస్తు లంబత్యాకోశ సన్నిభం|
తస్యాన్తే సుషిరగ్ం సూక్ష్మంత స్మిన్సర్వం
ప్రతిష్టితం ||
తస్యమధ్యే నుహానగ్ని ర్విశ్వార్చిర్విశ్వతో
ముఖః|
సోగ్రభుగ్విభ జన్తిష్ట న్నాహార మజరః కవిహ్ ||
తిర్యగూర్ధ్వ మధ శ్శాయీర శ్మయస్తస్య సంతతా|
సంతాపయతిస్వం దేహమాపాద తలమస్తకం ||
తస్యమధ్యేవ హ్నిశిఖా అణీ యోర్ధ్వా వ్యవస్దితః|
నీలతో యద మధ్య స్ధాద్విద్యుల్లెఖేవ భాస్వరా ||
నీ వార శూక వత్తన్వీ పీతభాస్వత్యణూపమా|
తస్య శిఖాయామధ్యే పరమాత్మా వ్యవస్దితః ||
సబ్రహ్మస్సశివస్సహరి స్స్యేంద్ర స్సోక్షరః
పరమస్వరాట్ ||
మంత్రార్థమును తెలుపుటకు మునుపు మంత్ర
పుష్పము అన్న పేరును గూర్చి తెలుసుకొందాము. పుష్పములు స్నిగ్ధత సౌకుమార్యము
కలిగినవి. వానిలో శ్రేష్ఠతమమయినది తామర. అందుకే ఎర్ర తామర లక్ష్మీ నివాసమయితే
తెల్లతామర వాణీ విలాసము. మన శరీరములో కూడా ఒక ఎర్రతామర మొగ్గ వుంది. మంత్రపుష్పము
దాని గూర్చియే తెలుపుతుంది కాబట్టి అది మంత్రపుష్పము అయినదని నా ఊహ.
ఇపుడు ఈ మంత్రార్థమును నా శక్తి మేరకు
తెలియజేసే ప్రయత్నము చేస్తాను. నావేవయినా తప్పులు వుంటే విజ్ఞులు సవరించగలరు.
హృదయము తలక్రిందులుగా వున్న తామర మొగ్గవలె భాసిల్లుచున్నది. నిష్ఠి అంటే తెలుగులో
ముచ్చెన గుంత అంటారు. ఈ గుంత అటు కంఠానికీ ఇటు ఎదకు మధ్యన వుంటుంది. దానినుండి
క్రిందికి వితశ్శాంతిఅంటే జానెడు దూరము, మరియు నాభ్యం ఉపరి అంటే బొడ్డునుండి
పైకి జానెడు దూరములో ఈ మొగ్గ వున్నది. మరి కొలత ఏవిధముగా చేయాలి అన్నది తరువాతి
సందేహము. కుడి ప్రక్కకా ఎడమ ప్రక్కకా లేక నిటారుగానా అన్న సందేహము వస్తుంది. నిటారుగా
రెండు చేతులను ఉపయోగించి అటు నాభినుండి ఇటు నిష్ఠి నుండి లంబముగా అంటే నిటారుగా
ఉంచితే రెండూ కలుస్తాయి. అందువల్ల అక్కడ అది లేదు అని తెలుస్తుంది. ఇక కుడి ఎడమ.
గుండె 99 శాతము మానవులకు ఎడమవైపునే వుంటుంది కానీ 1 శాతము కుడివైపు కలిగినవారు
కూడా వుంటారు. దీనిని Dextrocardia అంటారు ఆంగ్లములో. ఇది పారంపర్యముగా వచ్చే అవకాశము ఎక్కువగా వుంటుంది.
ఆంగ్లములో దీనిని congenital అంటారు.
ఆయుర్వేదము-3
మరి పారంపర్యముగా వస్తూవుంది అన్నా కూడా దానికీ
ఒక ఆది అన్నది ఉంటుందికదా! కాబట్టి మనము ‘కుడిఎడమయినా పొరబాటు లేదు’ అనుకోవలసి
వస్తుంది. కాబట్టి మన రెండు చేతుల జానలను అటుగానీ ఇటు గానీ బొటన వ్రేళ్ళను ఆయా
కేంద్రములనుడి కదిలించక చిటికెన వ్రేళ్ళను ఎడమకు (కుడి కూడా తీసుకొనవచ్చును అని
చెప్పుకొన్నాము) కదిలించుతూ పోతే ఎక్కడ తాకబోతాయో అది హృదయస్థానము. కత్తులు
కటార్లు ఈటెలు బాకులు వాడకుండా హృదయస్థానమును లక్షల సంవత్సరముల క్రితమే
నిర్ణయించిన మన పూర్వీకుల ప్రతిభ, ప్రశస్తిని ఏమని ఎంతని పొగడ గలము.
జ్వాల+ మాల+ ఆకులము అంటే నిప్పురవల మాల ను బోలుతూ చెదరుతూ అంటే చుట్టుప్రక్కల
వ్యాపించుతూ వుంది. విశ్వస్య ఆయతనం
మహత్ అంటే ఈ విశ్వము యొక్క పుట్టుకకు మూలము అదియే! ఈ విషయమునే NASA(USA) కూడా
ధృవపరచడము జరిగింది. ఇంకా వారు భగవంతుడు ఇక్కడ ఉంటాడా అని పరిశోధనలు చేస్తున్నారట.
ఒక్క విషయము ఆలోచించుదాము. మనిషిలో వేడి లుప్తమయితే మృతుడే! మరి వేడి ఉన్నంతవరకు
మనిషి బ్రతి ఉన్నాడు. మరి ఆవేడికి కూడా మూలము ఉండవలెను కదా! ఆ మూలమే దేవుడు. ఆ
మూలము ఎక్కడుంది ఆ మూలములో ఆయన ఎక్కడున్నాడు అన్నది చూద్దాము. సంతతగ్ం శిలాభిస్తు
లంబతి ఆకోశ సన్నిభం అంటే ఆ హృదయము వద్ద ఎల్లపుడు శిలాభిః (‘ర’’ల’యోరభేదః) అంటే
శిరలు (శిలాభిః) లంబముగా ఆ పద్మ కోశమునకు ఆనుకొని వ్రేలాడుతున్నాయి. ఆ కోశమునకు
అంతమందు సుషిరగ్ం సూక్ష్మం అంటే
మిక్కిలి చిన్నదియైన ఒక రంధ్రము వుంది. తస్మిన్, అందులో
సర్వం ప్రతిష్ఠితం అంతా అందులోనే ప్రతిష్ఠింపబడి వుంది. అక్కడ అంటే ఆ రంధ్రములో
మహత్తరమగు అగ్ని వుంది. దానివలననే ఈ ప్రపంచమంతా వెలుగుతూ వుంది.
ఇక్కడ ఒక్క మాట
చెప్పుకొనవలసి ఉంటుంది. మరి ప్రకృతిలోని మానవేతర స్థావర జంగమములకు లోపల ఈ వెలుగు
లేదా! అంటే వానికి మానవ భాషలో తెలిపినా అర్థము చేసుకోనలేవు. అందుకే వేదము మానవులకు
చెప్పబడింది. మళ్ళీ విషయమునకు వస్తే అది విశ్వార్చిర్ విశ్వతోముఖః అంటే దానివలననే
ఈ విశ్వము అంతా వెలుగుచున్నది ఎందుకంటే విశ్వతోముఖః అది ప్రపంచమంతా వ్యాపించి యున్నది. విశ్వము వెలుగుతూ వుంటే మరి
సూర్య చంద్రాగ్నులు అవసరము లేదు కదా! అంటే సూర్యుడు అగ్నిగోళం, చంద్రుడు,
తనపైబడు సూర్య కిరణ పరావర్తనముచే మాత్రమే వెలుగుచున్నాడు. ఇక
అగ్నిది ప్రకృతితో కాకుండా మానవునికి సంబంధించిన వరకు అది పరిమిత ప్రయోజకత్వమునే
ప్రసాదించుతుంది. కాబట్టి ఆ మూడు లేకపోతే ప్రాణికోటి లేదు అని తలువ వచ్చును. కావున
అవి వుండి తీరవలసిందే! మరి ఈ వెలుగు మాటేమిటి. మనము ప్రకృతిలో గమనించితే పచ్చటి
చెట్లలో ఒక కాంతిని చూస్తాము. అది వాడిపోయిన చెట్లలో అగుపించదు. వయసులో వున్న
యువతీయువకులలో వుండే కళ ముదుసలివారిలో చూడలేము. అంటే ఏ వెలుగయితే మనలో ఉన్నదని
చెప్పుకొన్నామో అది మెల్లమెల్లగా అధోముఖము పడుతూ ఉందన్నమాట. అసలు రంగులతో
నిమిత్తము లేకుండా దాదాపు సమానమగు వయసులో ఉన్నవారి మధ్యన కూడా వర్చస్సులో కాంతి
భేదములను చూడవచ్చు. లోపలి వెలుగునుబట్టే బయట నిగారింపు కనబడుతూవుందన్నమాట. నేటికి
కూడా తపోసాధకులగు గురువుల ముఖములు ఎంతో వెలుగుతో, ప్రసన్నతతో,
ఇంకా చూడవలెననిపించే రీతిగా వుంటాయి. దానికి వారి సమగ్ర సాధనయే
కారణము.
తస్య మధ్యే వహ్ని శిఖా అణీయోర్ధ్వా
వ్యవస్థితః అంటే ఏ వెలుగును గురించియయితే ఇంతవరకూ మాట్లాడుకొన్నామో దాని మధ్యన ఒక
అగ్ని శిఖ ఊర్ధ్వ ముఖముతో భాసిల్లుచూ వున్నది. అందులో అణువును బోలి ఊర్ధమునకు చూసే
ఒక అంతశ్శిఖను కలిగియున్నది. నీలతోయదము అంటే వర్షము కురియుటకు సిద్దముగానున్న నీలిమేఘము.
దాని మధ్యలో మెరిసే మెరుపువలె ప్రస్ఫుటమగుచూ ఇక ఛేదించలేని అణు రూపమై ప్రభావించుతూ
వున్నది. అదే మంత్రములో ఈ విధముగా చెప్పబడినది.
నీ వార శూక వత్తన్వీ పీతభాస్వత్యణుపమా
తస్యః శిఖాయామధ్యే పరమాత్మా వ్యసస్దితః ||
సబ్రహ్మస్సశివస్సహరి స్స్యేంద్ర స్సోక్షరః
పరమస్వరాట్
ఈ మెరుపులో, నీవార
ధాన్యము యొక్క ముల్లు, (నేను చూడలేదు కానీ వడ్లగింజ కున్న
ముల్లుతో పోల్చుకొందాము..) అంతటి చిన్న ముల్లు లాంటి వెలుగులో పరమ పరమాణు రూపములో
ఊర్ధ్వముఖముగా ప్రజ్వరిల్లే జ్యోతి మధ్యలో పరమాత్మ నివసిస్తూవున్నాడు. ఆయనే బ్రహ్మ,
విష్ణు, మహేశ్వర, ఇంద్రాదులంతానేకాదు
వారిని కలిగిన పరమస్వరాట్ అయిన సకలచరాచర సృష్టికి మూలకారకుడు కూడా వున్నాడు.
ఇక్కడ Science పరముగా
ఒక మాట చెప్పుకోనవలసినది వున్నది. మన గుండెలో sinoatrial node అనే ఒక స్థానం ఉంది, దానినుండి ఒక విద్యుత్తరంగము లాంటిది వెలువడి గుండెను
పని చేయిస్తూ వుంది. దీనికి కొంత దూరంలో atrioventricular node ఉంటుంది, ఈ రెండూ కలిస్తేనే
గుండె పని చేస్తుంది. ఈ sinoatrial node నుండి విడుదలయ్యే
విద్యుత్తు ఏవిధముగా పుడుతుంది అన్నది మన Scientists కు ఇంకా తెలిసిరాలేదు, దీనినే pacemaker అని చెబుతున్నారు మన Scientists. గుండెను పని
చేయించేది ఇదే. మన వేదములోని మంత్రపుష్పము దీని లోని ఆ అత్యంత పరమాణు రూపమునే
పరమాత్మ అంటూ వుంది.
రేపు కలుద్దాము......
ఆయుర్వేదము-4
ఆయుర్వేద శాస్త్రము ఎంత నిశితమైనది అంటే
వమనము తినే తిండికి ఏ కంచము ఏ ఆకులు శ్రేయస్కరము అన్నది కూడా వదిలిపెట్టకుండా తెలిపినారు.
ఆకులలో అరటి, మోదుగ, బాదాము, ఆకులు శ్రేష్ఠము మరియు ఆరోగ్య ప్రదము. కంచములలో ఇత్తడి,
కంచు, రాగి మరియు వెండి శ్రేష్ఠము. ముఖ్యముగా వెండి అత్యంత శ్రేష్ఠము. వెండి 5
నిముసములలో రోగకారక సూక్ష్మ క్రిములను నాశనము చేస్తుంది. దేహానికి మేలు చేసేవాని జోలికి
పోదు. క్షణాలలో శరీరములోని రోగ నిరోధక వ్యవస్థను ధృడపరుచుతుంది.
COLD కు మూలము తగిన చికిత్స కొరకు 1949 నుండి
1999 వరకు ఇంగ్లాండులో అలుపు ఆయాసము లేకుండా పరిశోధనలు చేసి ‘మాకు అంతు చిక్కలేదు’
అని తీర్మానించినారు. ఇందుకు తగిన ఔషధము ఆయుర్వేదములోనే అగుపించుతుందని
తీర్మానించినారు. అల్లము, మిరియాలు, వెల్లుల్లి, ఉల్లి, తేనెల వాడకము స్వాస్థ్యతను
చేకూరుస్తుందని నిర్ధారించినారు.
చివరిగా, చదివిన
వారికి వచ్చే చిన్నదయినా అతి పెద్ద సందేహమును నాకు తెలిసిన రీతిలో తీర్చ ప్రయత్నించుతాను.
ఆ వెలుగు మనకు కనబడుట లేదే? కనబడదా? ఎందుకు
కనబడదు? అన్నది ఆ ప్రశ్న. కృషి వుంటే మనుషులు ఋషులౌతారు అన్న వేటూరి వారి మాట మీకు
తెలిసినదే కదా! ఆ వెలుగును చూడగలిగిన వారే ఋషులయినారు. మరి మనమో, లోపల తళుక్కుమన్నపుడల్లా సంసారమో, పిల్లలో, అందమయిన అమ్మయిలనో/అబ్బాయిలనో సినిమాలనో, షికార్లనో
చూసుకొంటూ ఇంకా కాలాన్ని వ్యర్థపుచ్చుతూ ఉన్నాము. సందర్భోచితమని తలచి
పెద్దలు చెప్పిన మాట ఈ దిగువన మీకు అందించుచున్నాను.
కావ్యశాస్త్రవినోదేన,కాలో గచ్ఛతి ధీమతాంl
వ్యసనేన
తు మూర్ఖాణాం,నిద్రయా కలహేన వాll
ధీమంతులైనవారికి కావ్యశాస్త్రపురాణాది వినోదముతో మనోవికాసముతో, కాలము గడుస్తుంది. మూర్ఖులకు వ్యసనంతో గాని,నిద్రతోకాని, కలహంతోకాని
కాలం గడుస్తుంది. కావున
ఇకనైన మేలుకొని, మెళుకువలో
కళ్ళు మూసుకొని అంతర్ముఖులమై అనుదినమూ ధ్యానించితే పరమాత్ముని మనలోనే
సందర్శించగలము. దానికి అంతః శుద్ధి, బాహ్యశుద్ధి, త్రికరణ శుద్ధి తోడయితే అసలు మనమే పరమాత్మ స్వరూపులమని
తెలుసుకొనగలుగుతాము.
మిగిలినది మరొకసారి......
ఆయుర్వేదము-5 (చివరిభాగము)
ఇపుడు
ఆయుర్వేదము ఇంకా మనకేమేమి ఇచ్చిందో ఒక పర్యాయము చూద్దాము.
ఈ
దిగువన కనబరచిన అంశములను గూర్చి సవిస్తారముగా అందించినది ఆయుర్వేదము.
శరీర
ధర్మ శాస్త్రము (physiology )
వ్యాధి
లక్షణ శాస్త్రము (symptomatology)
శస్త్ర
చికిత్స (surgery)
ఔషధ
చికిత్స (drug therapy)
పథ్యము
లేక ఆహార నియమములు (diet)
హృద్రోగమును
గూర్చి ఇంచుమించు నేటి వైద్య పుస్తకములలో ఉండే విషయములను ఎటువంటి పరికరములు
లేకున్నా తమ అతీంద్రియ శక్తితో తెలియ జేసిన ఘనత మన భిషగ్వర శ్రేష్ఠులగు ధన్వంతరి,
దివోదాసుడు, చరకుడు, శుశ్రుతుడు, వాగ్భటుడు (అష్టాంగ హృదయం, అష్టాంగా సంగ్రహ కర్త,
చరకుల వారి శిష్యుడు, 135 సంవత్సరములు జీవించి, బ్రహ్మచారిగా జీవితము గడిపి తన
జీవిత కాలమును వైద్యమునకే ధారపోసిన మహనీయుడు.) మొదలగు నిస్వార్థమగు మహానుభావుల సేవ
నేటి పాశ్చాత్య ప్రభావ గ్రహణగతులమైన మన ఊహకు అందనిది.
హృద్రోగ
లక్షణములను ఆయుర్వేదము ఎంత చక్కగా వివరించిందో గమనించండి.
“అథాథో హద్రోగప్రతీశేదం వ్యాక్యస్వామ్యః యథోవాచా భగవన్ ధన్వంతరిమ్:
“అయామ్మ్యాథే మారుతజే హ్రదయం
తుడ్యతే,
నిర్మాతియతే ధీర్యతే చ స్పోట్యతే
పాతిచ త్రిష్ణౌషధాః అచోషామ్ స్యుహు పైతికేచ,
ధూమాయం చ మూర్ఛా చ స్వేదహకో. ”
(ఈ అధ్యాయంలో భగవన్ ధన్వంతరి (విష్ణుమూర్తి అవతారమైన, ఆయుర్వేద దేవత) వ్యక్తిగతంగా గుండె జబ్బుల లక్షణాలను మరియు గుండెపోటుతో
రాబోయే మరణాన్ని వ్యక్తిగతంగా వివరిస్తాడు. “రోగి, కొన్ని
సమయాల్లో, హృదయములో సూది పోట్లవలె నొప్పి , అధిక హృదయ కంపనము , మండుచున్నట్లు నొప్పి, కొన్ని సమయాల్లో నొప్పి ఛాతీని గొడ్డలితో రెండు భాగాలుగా విభజించినట్లు
ఉంటుంది! రోగికి అసాధారణ దాహము, ఉండవచ్చు, శరీరమంతా మండుచున్నట్లు ఉండుట, శ్వాసావరోధము,
విపరీతమైన అలసట, నాసికా రంధ్రములు ఊపిరి
పీల్చుటకు చాలవు అన్న తపన, విపరీతమైన చెమట, పాలిపోయిన ముఖము, కొయ్యబారిన శరీరము, చివరకు అపస్మారక
స్థితి కూడా సంభవించవచ్చు. ”)
అసలు
ఒక ఆయుర్వేద వైద్యుడు, వృత్తిని చేపట్టునపుడు చేసే ప్రమాణము, అల్లోపతి డాక్టరు
చేసే హిప్పోక్రటిస్ ప్రమాణమునకంటే ఇంకా నిర్దుష్టముగా ఉంటుంది.
అసలు
గ్రీకులు అలెగ్జాండరు కాలములో ఎంతోమంది భారతీయ పండితులను, శాస్త్ర గ్రంధములను
భాసరత దేశమునుండి తీసుకో పోయినట్లు ప్రసిద్ధ గ్రీకు చరిత్రకారుడైన పోకాక్ మహాశయుడు
సోపపత్తికముగా నిరూపించినాడు.
చరక,
శుశ్రుత సంహితలు కాకుండా ఆయుర్వేదములో అష్టాంగ హృదయము,, అష్టాంగా సంగ్రహము, మాధవ
నిధానము వంటి అనేక గ్రంధములు ఆయుర్వేద శాస్త్రమును ఆచంద్ర తారార్కముగా నిలిపి
ఉంచేవి. బహు భాషలు బహుళ సంస్కృతులు కలిగిన ఈ దేశమును సంస్కృతము ఒకటిగా కట్టి యుంచి
యుండినది. మెకాలే కుతంత్రముతో సంస్కృతమునకు నామ రూపములను నామావశిష్ఠము చేసి మన
శాస్త్రములకు, విజ్ఞానమునకు దూరము చేసినాడు. నేను చెప్పవచ్చింది ఏమిటంటే ఇన్ని
భాషలు, సంస్కృతులు, నైసర్గిక భేదములు ఉండుటచే ఆయుర్వేదము కూడా ప్రాంతీయపరముగా
అభివృద్ధి అయి ఉండినది. ప్రతిశాస్త్రమూ దైవత్వముతో ముడిపడి ఉంటుంది. ఆ వాస్తవాన్ని
నేడు మనము గుర్తించవలసిన ఆవశ్యకత ఎంతో ఉన్నది.
యూరోపు,
ఉత్తర అమెరికా, ఆగ్నేయ ఆశియా జపాన్ మున్నగు దేశములలో ప్రత్యేక పాఠశాలలు మరియు
కళాశాలను ఏర్పరచి మన ఆయుర్వేదమును బోధింప
జేయుచున్నారు. మనలో చాలా మందికి ఆయుర్వేదమంటేనే చిన్న చూపు. నాకు 10 సంవత్సరములు
వచ్చేవరకు కూడా ఆయుర్వేద ఔషధ వైద్యము బ్రాహ్మలు చేసేవారు. రోగి రోగము నయమయిన
తరువాత ఇచ్చినస్ది పుచ్చుకోనుతయే తప్ప ఇంత ఇమ్మని ఏరోజూ నిబంధన ఏర్పరుచలేదు. కాలము
మారినది అల్లోపతి మందేలేని ‘రొంప’ జలుబు’ పడిశము’నకు (మూడూ ఒకటే) స్పెషలిస్టు డాక్టరు
వద్దకు పోతే ముందు 500 రూపాయల ఫీసు గుంజుతూ వున్నాడు. శస్త్ర చికిత్సలు కంటి
శుక్లములు మొదలగునవి మంగలి వారు (మంగళమయమగు కార్యములకు ముందుండేవారు) చేసేవారు. ఇక
వ్యాధిగ్రస్తుడగు వ్యక్తి చర్మమును వలువ వలసి వస్తే మాదిగ వారు చేసేవారు. అందరూ
వారి వారి వృత్తులకు అనుకూలముగా వ్యవహరించేవారు. ఎవరూ ఎవరినీ చిన్న చూపు చూసేవారు
కారు. ఈ తారతమ్యాలు ఎక్కువగా బ్రిటీషువారు సృష్టించినవి. విదేశాలకు శాస్త్రములపై
ఉన్న శ్రద్ధ చూస్తూవుంటే రాబోయే కాలములో ఆయుర్వేదము అద్వితీయ స్థానమును పొందుతుంది
అని నా మనోప్రబోధన. అప్పుడు ఈ అత్యంత ఆధునిక ధనవ్యయ వైద్యము తోక ముడుచుకోనక తప్పదు.
ఆయుర్వేదము అమెరికాలో ప్రబలుతూనే మనము అప్పుడు దానిని ఆశ్రయించుతాము. అల్లోపతి
తాత్కాలిక, ఆత్యయిక, పరిస్థితులకు మాత్రమే పనికి వస్తుంది.
ఆయుర్వేదము
దీర్ఘ మరియు మొండి రోగములకు చక్కని మందుల
నిచ్చుటయేగాక మన జేబుకు అనుకూలముగా వుంటుంది.
ఒక
సంస్కృత చాటువు ఈ విధముగా చెబుతూ వుంది.
అమంత్రమక్షరం
నాస్తి నాస్తి మూలమనౌషధంl
అయోగ్యః
పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభఃll
అంటే
వైద్యమునకు పనికిరాని మూలములు అనగా వేర్లు లేక కుదుళ్ళు, బెరడు, ఆకులు ఏవీ లేవు
కాకపోతే ఆ విషయమును గూర్చి మనకు క్షున్నముగా తెలిసి ఉండవలెను. అంతే కాకుండా
మంత్రము కాని అక్షరము లేదు, అయోగ్యుడగు వ్యక్తి లేదు కానీ ఆయా విషయములను సక్రమముగా
ఉపయోగించుకొనే వ్యక్తి దొరకుతయే దుర్లభము.
వైద్యజ్ఞ
చరకుడు ఆయుర్వేదమునకు అతి చక్కని నిర్వచనమునిచ్చినాడు.
జీవితము
యొక్క బాగోగులు, సుఖదుఃఖాలు, పరిపూర్ణ అపరిపూర్ణ సుఖమయ జీవితము, జీవిత ప్రమాణములను
తెలియజేసే విధానము సుఖమయ జీవన నిదానమైన ఆయుర్వేదము.
సహకారము:
Kutumbiah
P. Ancient Indian Medicine.
Hegde BM:
Angina an Indian Disease.
David
Frawley. Ayurveda and the Mind.
స్వస్తి.
Hrudayam gurinchi Meeru cheppina vishleshana ..... the secretary of heart spark ..... oh my god ...... y would I never thought of it ani anipistundhi ......adagaka ichhina mudde Anna song madhiri ..... Meeru teliyajese vishayalu entha vignanna Dayakam .... me ajramara sookthi is like ocean of treasure ...... let me steal or own ad much as all with your permission guruvugaru
ReplyDeleteThank you very much Sudharshan. It gives me immense happiness when I find people evencing interest to read the articles and feel happy by expressing their feelings in the form of comment.This is what the best I can contribute to the society.
DeleteI thank you once again for your respect to our tradition and culture.
God bless you all.