బాధాకర
విషయము.
మనది
ధర్మమే కానీ మతము కాదు అన్నది మనకు తెలిసిన విషయమే! ప్రపంచములో ఆదిపత్యమునకై
పోరాడుచున్న పెద్ద మతములు తమ మాట గ్రంధములను అనుసరించవలెనన్నది ఆయా మతముల నిబంధన.
మన
ధర్మమే మనదారి. మన దారిలో మనము పోతున్నాము. ఒకానొక కాలములో అది రాజ మార్గము. రథ్యల(Roads) కు
ఇరువైపులా ఆహ్లాదము గొలిపే చెట్లు ఉండేవి. సువాసనలు వెదజల్లే పూలమొక్కలు ఉండేవి.
ఆకలిగొన్నవారికి ఆహారమునందించే ఫలసాలములు ఉండేవి. విమతస్థులుు ఆ చెట్లను నరికినారు. మొక్కల పెరికినారు. ఫలసాలముల పాదులలో విషము
కలిపినారు. అయినా మనకేమీ పట్టదుు. మనము ఉదారవాదులము, మానవతా
వాదులము అన్న బిరుదములను మనకు మనమే ఇచ్చుకొని మన సముదాయమునే మనము మార్చుకొనే
ప్రయత్నమూ చేస్తాము. ఇది తను కూర్చున్న కొమ్మను తానే నరికే కాళిదాసు మనకాదర్శ ప్రాయుడు. మహాపండితుడు, సకల శాస్త్రవేత్త, మహాకవి అయిన కాళీదాసు పేరు తప్ప
మనకేమీ తెలియదు. తెలుసుకొనుటకు ఉత్సాహమూలేదు, సంస్కృతమూరాదు.
నేర్చుకోవాలన్న తపన లేదు. సంస్కృతము
వరకెందుకు మనకు సరిగా తెలుగే రాదు. మాతృ భాషయే సరిగా రాదన్న బిడియము లేదు.
సాధికారికముగా
English New
Year’s Day అన్నది మన పండుగ కాదు, ఆమాటకొస్తే అది పండుగే కాదు,
అందులో అసలు పండుగ చేసుకొనే విధానమే లేదు అని నెత్తిన నోరుపెట్టి కొట్టుకొన్నా
చేస్తే తప్పేమి అనే వాళ్ళను మనము ఎంతోమందిని చూస్తున్నాము. ఇటువంటి ఆలోచనా విధానమే మతస్థులు మన సాంప్రదాయములతో ఆడుకొనే అవకాశమును కల్పించుచున్నాము.
తమిళనాడులోని
ఒక క్రైస్తవ సంఘము చేసిన నిర్వాకము ఇందుతో జతపరచిన చిత్రములో చూడండి. సనాతన ధర్మ
అనుయాయులగు తలిదండ్రుల సంతానమగు వారెవరికయినా అది చూస్తే అసవేశము కలుగక మానదు.
కానీ ‘ ఆవేశము అనర్థదాయకము.’ ‘ఆలోచన సమర్థనీయము.’ మా జీవితాలు ఈ ధర్మముతోనే
ముగుస్తుంది. మరి నేటి యువతీయువకులు వారిసంతానమును గూర్చి ఆలోచించితే ఆవేదన
పెల్లుబుకుతుంది.
ఇక్కడ
ఇంకొక్క విషయమును చెబుతాను. Constanzo Besci అను 18 వ శతాబ్దములో తమిళనాడులో ఏర్పడిన ఒక మత సంస్థ ‘పెరియనాయగి’ అన్న మన
గౌరీమాత పేరును తమ ‘మేరీ మాత’కు తగిలించుకొన్నారు. కాలాంతరములో ఈ పేరు మన
అమ్మవారిది అని మరచిపోయి అది మేరీ మాతడే అన్న ఒక దౌర్భాగ్య స్థితికి చేరుకొంటాము. అసలు
వారి ‘మేరీమాత’ క్రైస్తవ పరమగు సిద్ధాంతము ప్రకారము ‘Holy
Trinity’ లో కూడా లేదు. అసలు ఉన్నా లేకున్నా మనకు సంబంధములేదు. దీనిని బట్టి
వారికి ఎంత సాప్రదాయ దారిద్ర్యము వుందో అర్థము చేసుకొనేది. లౌకికమయిన మతాన్తరీకరణల
గూర్చి ఆలోచిన్చుతున్నారే గానీ పారమార్థికముగా ఎంత వెనకాలున్నారో గమనించండి. ఇది
ఇట్లుంటే ఐరోపా ఖండములోని ఫ్రాన్సు, స్పెయిను, జర్మని, ఇంగ్లాండు, ఇటలీ మొదలగు దేశాలు
అన్నీ కలిసి ఐరోపా ఖండమే ఇస్లాం ఖండముగా మారిపోవనుందట. 'Everyone
will be Muslim because of our stupidity': Catholic leader says Europe will
become an Islamic
State because of the migrant crisis. కారణము ఒక్కటే వలస వచ్చిన ముస్లిములు 5,6 మంది పిల్లలను ఉత్పత్తి
చేస్తూ వుంటే క్రిస్తియన్లు 2 లేక మహా అంటే ముగ్గురిని ఉత్పత్తి చేస్తున్నారు.
అసలు ఈ మాట ఒక ఇమాం కూడా చెప్పి ఈ విషయమును బలపరచినట్లు whatsap లో వినివుండినాను.
ఇది
మనకు వర్తించదా! తమ మాత్రు భూమిలో తమ ఉనికికే ప్రమాదము రాబోతూవుంటే క్రిస్టియనులు మనదేశాములోని
అమాయకులపి ఏరా వేస్తున్నారు. ఇప్పటికయినా మన ఉదార లౌకిక వాదులు కన్ను
తెరుస్తారోలేదో! ఈ మాట చెబుతూ వుంటే నాకు భాగవతమున ప్రహ్లాద చరిత్రములోని లోని ఈ
పద్యము గుర్తుకొస్తూ వుంది.
అంధేందూదయముల్ మహాబధిరశంఖారావముల్ మూకస
ద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసకవధూకాంక్షల్ కృతఘ్నావళీ
బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడస
ద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్తవ్యర్థసంసారముల్.
లోకంలో గుడ్డివాడికి వెన్నెల నిరుపయోగం; చెవిటివాడికి శంఖ ధ్వని వినబడదు; మూగవాడికి గ్రంథపఠనం సాధ్యపడదు; నపుంసకుడికి కాంత మీద కోరికలు ఫలించదు; కృతఘ్నుడికి బంధుత్వం కుదరదు; బూడిదలో పోసిన హోమద్రవ్యాలు నిరుపయోగ మైనవి; పిసినిగొట్టు వాడికి సంపదపనికి వచ్చేది కాదు;పందికి పన్నీరు వంటి సువాసనలు తెలియనే తెలియవు; అలాగే విష్ణు భక్తి లేని వారి జీవితాలు నిస్సారము లైనవి,
వ్యర్థము లైనవి. అని భావిస్తాను. ఇక్కడ విష్ణుభక్తికి బదులు దేశ
భక్తి, మన ధర్మముపై భక్తిని అన్వయించవలసి వుంటుంది.
స్వస్తి.